Sunday, 31 August 2014

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది.

గణపతి దేవతలకు ఆదిదేవుడు. గణాలకు మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదేవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద.

అటువంటి గణపతిని పరమభక్తితో గణపతిని పూజించడం వలన నాకు అది ప్రాప్తిస్తుంది, ఈ ఫలాన పని జరుగుతుందన్న ఫలాపేక్ష లేకుండా, నిత్యం ఆరాధించడం వలన త్వరితంగా జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన 'ఏకసంధాగ్రహణ' శక్తి లభిస్తుంది.  గణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెప్తారు. కనుక ఇంజనీరింగ్, అకౌంట్స్, గణితం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇది విశేష ఫలితం లభిస్తుంది. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు వినాయకుడు.

గణపతి సర్వజనులను వశం చేసుకోగలిగిన వశీకరణ విద్యను ప్రసాదిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావల్సినది ప్రజల అభిమానం, అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోవడం. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది.

గణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది సృజనాత్మకత (క్రియేటివిటి). గణపతి నిత్యం భక్తితో కలిచేవారికి సృజనాత్మకత సహజంగానే సిద్ధిస్తుంది.      

గణపతి ఆనందస్వరూపుడు. వినాయకుడి గురించి చెప్పుకోవడమే ఆనందం. గణపతిని ఉపాసించేవారు నిత్యం ఆనందంతో జీవిస్తారు. గణపతి క్షిప్రప్రసాది. భారీ పూజలు చేయవలసిన పని లేదు, చిన్న పూజలకే చాలా సులభంగా కోరికలను తీరుస్తాడు.

జ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు. గణపతి యోగశాస్త్రంలో కాపలాదారుడు. వక్రమార్గంలో శక్తులను సాధించకుండా గణపతి మూలాధారంలో కాపాలకాస్తాడు. వాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు. గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తు దోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు వినాయకుడు.

గణపతి లీలావైభవం ఎంతని చెప్పుకోగలం.

ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఏకదంతుడు, వక్రతుండుడైన గణపతిని మన మనసును ప్రభావితం చేయుగాకా. మనలని మంచి మార్గంలో నడిపించిగాకా.

ఓం గం గణపతయే నమః 

Saturday, 30 August 2014

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము. గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు, జీవులు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం, Group, Category అని అర్దం. ఈ సమస్త సృష్టిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణమ, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక గణం. మళ్ళి ప్రతి గణాన్ని ఇంకా విభజించవచ్చు. ఉదాహరణకు చెట్లను తీసుకుంటే పుష్పించే చెట్లు ఒక గణం, పెద్ద పెద్ద వృక్షాలు ఒక గణం, పండ్లు అందించే మొక్కలు ఇంకో గణం, లతలు, తీగలు, కందలు, కూరగాయలు వేర్వేరు గణాలు. మళ్ళీ వీటిలో ఇంకా గణాలు ఉన్నాయి. ఎర్రని పూలు పూసే మొక్కలు ఒక గణం, తెల్లనివి ఇంకో గణం, పసుపుపచ్చనివి వెరొక్ గణం. మనుష్యుల్లో కూడా మంచివాళ్ళు ఒక గణం, చెడు వాళ్ళు ఇంకో గణం, తెలివైనవారు ఒక గణం. ఇలా ఎన్నో విధాలుగా విభజించబడిన ఈ సృష్టి మొత్తం, వివిధ గణాల మధ్య సయోధ్య కారణంగా సక్రమంగా సాగుతోంది. ఒక పదిమంది కలిస్తేనే, అందులో ఎన్నో అపోహలు, అపనమ్మకాలు, విమర్శలు, గొడవలు వస్తాయి. ఇంత పెద్ద సృష్టి, ఎన్నో నక్షత్రాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, అనేక కోటి బ్రహ్మాండాలలో ఇన్నిన్ని సమూహలను ఏక తాటిపైకి తీసుకురావడం ఎంతో కష్టతరం. అసలు వీటి మధ్య కనుక బేధాభిప్రాయం ఏర్పడితే, ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఇలా గందరగోళం ఏర్పడకుండా, చిన్న అణువు (Atom), కణం (cell) నుంచి బ్రహాండాల వరకు సమస్త గణాలకు నాయకులు ఉన్నారు. అలా ప్రతి గణానికి, పరబ్రహ్మ నాయకత్వం వహించి, వాటిని నిర్ణీత మార్గంలో నడిపిస్తున్నారు. ప్రతి గణానికి ఉన్న నాయకునికి గణపతి అని పేరు. తంత్రశాస్త్రం ప్రకారం సృష్టిలో అనేకమంది గణపతులు ఉన్నారు.

గణపతి ఆరాధన యొక్క తత్వం కూడా ఇక్కడే దాగి ఉంది. గ్రహాలు అనుకూలించకుంటే వాటిని శాంతపరచాలి. ప్రకృతి సహకరించకుంటే, ప్రకృతికి సంబంధించిన దేవతను మెప్పించాలి. దేవతలు ఆగ్రహంతో ఉంటే, వారిని పూజించాలి. మన జీవితంలో నిత్యం ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిన్నిటిని దాటాలంటే ఎంత మందిని మచ్చిక చేసుకోవాలి? అంత మందిని ఒప్పించేలోపు జీవితం కాస్త ముగిసిపోతుంది. అందుకే పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ప్రతి గణానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన గణపతి. గణం గణం కలిస్తే, మహాగణం. దానికి నాయకుడు మహాగణపతి. అంటే గణపతులకు గణపతి మహాగణపతి.

ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే, దానికి ఎంతో మంది సహాయసహాకారాలు కావాలి. సాయం మానవుల నుంచే కాదు, అణువుల దగ్గరి నుంచి దేవతల వరకు, అందరు మనకు సానుకూలంగా మారాలి, సహాకారం అందించాలి. ఇంత వైవిధ్యమైన సృష్టిలో, ఇంతమంది సహాయాన్ని అర్ధించడం చాలా కష్టం. అందరిని సంప్రదించడం కష్టం, అయినా అంతమందిని ఏక తాటిపకి తీసుకురావడం, ఏకాభిప్రాయం ఏర్పరచడం ఇంకా కష్టం.  సృష్టిలో ఇన్ని గణాలు ఉన్నా, అన్నిటికి ఒకడే నాయకుడై ఉన్నాడు. ఆయనే వినాయకుడు. వినాయకుడంటే విశిష్టవంతమైన నాయకుడని, నాయకుడే లేనివాడని అర్ధాలున్నాయి. మొత్తం సృష్టి ఆయన చేతిలో ఉన్నది కనుక, ఆయన చెప్పినట్టే వింటుంది. అందుకే ఏదైన పని ప్రారంభించే ముందు మహాగణపతిని స్మరిస్తే, సమస్త జగత్తు ఒక్కసారిగా ‘అలర్ట్’ (Alert) అవుతుంది, అన్నీ పనులు పక్కనబెట్టెసి, విశ్వనాయకుడైన వినాయకుడి మాట వింటుంది. దాంతో ప్రారంభించే పనిలో ఏ ఆటంకాలు రావు. అందుకే గణపతికి ప్రధమ పూజ. ఇక గణపతి విశ్వగణాలకు నాయకుడు కనుక గణపతిని స్మరిస్తే, సమస్త బ్రహ్మాండాలను స్మరించినట్టే, గణపతిని తెలుసుకోవడమంటే సమస్త బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే. అందుకే ప్రతి కార్యానికి ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని వినాయకుడిని స్మరిస్తాం. స్మరించాలి. అప్పుడే నిర్విఘ్నంగా సకలకార్య సిద్ధి చేకూరుతుంది.

ఇదే వ్యాసాన్ని అంతర్జాల మాస పత్రికైన అచ్చంగా తెలుగులో కూడా మనం ప్రచురించాం.
http://acchamgatelugu.com/?p=7096

Friday, 29 August 2014

గణపతిగా రూపాన్ని స్వీకరించారు

నిరాకారుడైన పరబ్రహ్మం భక్తుల సౌలభ్యం కోసం గణపతిగా రూపాన్ని స్వీకరించారు. జగత్తు మొత్తం వ్యాపించిన చైతన్య స్వరూపమే గణపతి. గణపతి ఏనుగు ముఖం అని చెప్పకున్నప్పటికి, ఈ సాకార రూపాన్ని ఆరాధించడం చేత, క్రమంగా నిరాకరమైన (ఎటువంటి రూపం లేని) పరమాత్మ తత్వాన్ని అర్ధం చేసుకునే శక్తి లభిస్తుంది.

'అజం నిర్వికల్పం నిరాకారమేకం' అంటూ శంకరాచార్యులు గణపతిని స్తుతించారు. గణపతి అజుడు, అంటే ఎప్పుడు పుట్టనివాడు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పటికి ఉండేవాడు. పుట్టుక ఉన్నదానికి, మరణం కూడా ఉంటుంది, ఆది ఉన్నదానికి, అంతం ఉంటుంది. గణపతి ఆద్యంతరహితుడు కనుక అజుడు అన్నారు.

నిర్వికల్పుడు వినాయకుడు. అంటే గణపతి ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఎవరు చెప్పలేరు, పసితనం, యవ్వన, ముసలితనం వంటి మార్పులకు లోనవ్వనివాడు. శరీరమే లేనివాడు కనుక శరీర అవస్థలకు అతీతమైనవాడు.

నిరాకారుడు అంటే ఎటువంటి ఆకారంలేనివాడు. ఈ సృష్టిలో ఉన్న అన్ని ఆయన స్వరూపాలే కనుక, ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక ఆకారం లేదు. అందువల్ల పరమాత్మను నిరకారుడన్నారు. గజముఖుడిగా కొలిచే గణపతి మన అందరిని ఈ నిరాకార, నిర్వికల్ప తత్వాలకు చేరవేస్తాడు. అంతటా వ్యాపించి పరబ్రహ్మ తత్వం, సచ్చిదానంద స్వరూపమే గణేశుడు.

ఓం గం గణపతయే నమః 

Thursday, 28 August 2014

శమంతకోపాఖ్యానం - 4

జాంబవంతుడు వచ్చి కృష్ణపరమాత్మతో మల్లయుద్దం చేశాడు. యుద్దంలో కిందపడవేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా పడట్లేదు. ఎన్ని సార్లు ముట్టుకున్న జాంబవంతుడికి కృష్ణపరమాత్మను ముట్టుకోవాలనిపిస్తోంది. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలి అనిపిస్తొంది. 21 రోజుల పాటూ నిర్విరామంగా యుద్దం చేసినా కృష్ణుడు అలసిపోలేదు. వచ్చింది రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు జాంబవంతుడు. ఆయనకు నమస్కరించి, శమంతకమణి ఇచ్చి, తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు. కృష్ణపరమాత్మ జాంబవతిని వెంటపెట్టుకొని మణితో ద్వారకకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని సత్రాజిత్తుకు వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు, కృష్ణుడు ఎంతో మంచివాడని, కృష్ణుడి మీద వేసిన నీలాపనిందలకు క్షమాపణగా ఆయన కూతురు సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. శమంతకమణిని ఇచ్చాడు కానీ కృష్ణుడు తీసుకోలేదు. ఉన్నది ఒక్క కూతురే కనుక ఎలాగో తరువాత తమకే దక్కుతుందని, ఎంతో ఇష్టపడి సూర్యుడి దగ్గరనుండి తెచ్చుకున్నారు కనుక తన  దగ్గరే ఉంచుకోమని సత్రాజిత్తుకు చెప్పాడు.    

ఇక్కడితో కధ ముగియలేదు. పెద్ద మలుపు తిరిగింది. ఎప్పటినుంచో సత్యభామను వివాహం చేసుకుంటామని అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అనే ముగ్గురు సత్రాజిత్తును అడుగుతున్నారు. ఇంతకాలంగా వివాహ విషయాన్ని దాటవేతూ వచ్చిన సత్రాజిత్తు ఇప్పుడు మణి తెచ్చి ఇచ్చాడని కృష్ణపరమాత్మకు ఇచ్చి వివాహం చేయడం సహించలేకపోయారు. ఆ ముగ్గురిలో అక్రూరుడు, కృతవర్మకు కృష్ణుని యందు అపారమైన భక్తి. శతధన్వుడికి భక్తి కాస్త తక్కువ. సత్రాజిత్తు మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి సమయం కోసమని ఎదురుచూస్తున్నారు.


ఆ సమయానికి పాండవులను లక్క ఇంట్లో పెట్టి, ఇంటిని తగలబెట్టి చంపేశారని కృష్ణుడికి వార్త అందింది. తమ్ముడి కొడుకులు చనిపొయారని బాధపడుతున్నట్టు నటిస్తున్న దృతరాష్ట్రుడిని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. ఈ ముగ్గురికి సమయం దొరికింది. సమావేశం జరిపి సత్రాజిత్తును చంపాలి అని పధకం వేశారు. అక్రూరుడు,కృతవర్మకు భక్తితత్పరులు కనుక శతధన్వుడికి ఈ పని అప్పగించారు. శతధన్వుడు నిద్రపోతున్న సత్రాజిత్తును చంపాడు. చంపి ఆ మణిని మెడలో వేసుకొని వచ్చాడు. మణి అపవిత్రమయ్యింది. వాడు అక్రూరుడి వద్దకు వచ్చి ఈ మణి తన దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండదని, అందువల్ల అక్రూరుడి వద్ద దాచమని చెప్పి, బలవంతంగా ఇచ్చి తన ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు.

సత్యభామ రధమెక్కి కృష్ణుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. కృష్ణుడు శతధన్వుడిని చంపుతానని రధం ఎక్కి ద్వారకకు వెళ్ళి, బలరాముడికి విషయం చెప్పి, రా! అన్నయ్యా ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు. ఇద్దరు కలిసి రధం మీద బయలుదేరారు. బలరామకృష్ణులు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న శతధన్వుడు, జాంబవంతుడినే ఓడించిన కృష్ణుడు తనను చంపుతాడని ఆందోళన చెంది  గుర్రమెక్కి పారిపోయాడు.

శతధన్వుడు వంద ఆమడల దూరం పరిగెత్తగల గుర్రం ఎక్కాడు. బలరామకృష్ణులు నాలుగు గుర్రాలతో నడిచే రధం మీద వెంబడిస్తున్నారు. కొంచం దూరం వెళ్ళాక శతధన్వుడి గుర్రం కిందపడి మరణించింది (శమంతమణి ప్రభావం). వాడు పరిగెత్తడం చూసి రధంలో వెంబడిస్తున్న కృష్ణుడు అన్నయ్యా, వాడి గుర్రం చనిపొయింది. అలా నేల మీద పరిగెడుతున్న వాడిని రధంలో వెంబడించడం తగదు. ఒంటరిగా పరిగెడుతున్న వాడిని ఇద్దరు వెంబడించడం ధర్మం కాదు. అందువల్ల నువ్వు రధంలోనే ఉండు నేను వాడిని చంపి మణి తీసుకువస్తానన్నాడు.

కృష్ణుడు వాడిని వెంబడించగా, వాడు పొదల్లొ దాక్కొవడం, యుద్దం చేయడం, వాడిని చంపడం జరిగింది. వాడు చనిపోయాక వాడి బట్టలంతా వెతికినా శమంతకమణి దొరకలేదు (ఇంతకముందే వాడు అక్రూరుడికిచ్చాడు). జరిగినదంతా చెప్పి శమంతకమణి దొరకలేదన్న విషయాన్ని చెప్పగా, బలరాముడు 'చిన్నప్పటినుంచి నిన్ను చూస్తునేవున్నా. నువ్వు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత వెన్న తినలేదు, నేను వయసులో పెద్దవాడిని, మణి నాకు ఇవ్వవలసి వస్తుందని, మణి దొరకలేదని అబద్దాలు చెప్తున్నావు. మణిని శతధన్వుడు రధంలో దొంగిలించడం చూసి సత్యభామ నీకు చెప్పింది. మరి మణి వాడి దగ్గర లేకపొతే ఎక్కడ ఉంటుంది? నువ్వూ వద్దు, ద్వారక వద్దు. నేను విదేహరాజ్యానికి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయాడు.

తిరిగి ద్వారకకు వెళ్ళిన కృష్ణుడిని చూసి 'చుశారా! అన్నయ్యని కూడా మోసం చేశాడి కృష్ణుడు' అంటూ ప్రజలు అన్నారు.

జాంబవతి 'ఈయన మా నాన్న మీద గెలిచి నన్నూ, మణిని తీసుకున్నాడు. ఈ మణి మా నాన్న ఇచ్చాడన్న గౌరవం కూడా లేకుండా, మా నాన్నకు పేరు వస్తుందని సత్రాజిత్తుకిచ్చాడు. సత్రాజిత్తుకిచ్చి ఆయన దగ్గర నుండి తిరిగి మణిని తీసుకొని సత్రాజిత్తుకు పేరు తేవాలని చూస్తున్నాడు' అని జాంబవతి అనుమానం వ్యక్తం చేసింది.

ముందు మా నాన్న మణి అడిగితే ఇవ్వలేదు. తరువాత ఇచ్చినా అహంకారం అడ్డువచ్చి తీసుకోలేదు. శతధన్వుడు చంపుతాడని తెలిసి, ఆయన మా నాన్ను చంపడం కోసమే కృష్ణుడు ఊరు విడిచి వెళ్ళాడు. ఆ శతధన్వుడిని చంపి ఆ మణి తన దగ్గరే దాచిపెట్టుకొని, లేదని చెప్తూ నటిస్తున్నాడని సత్యభామ అన్నది. తనలో సగమైన భార్యలు కూడా అనుమానించడం మొదలు పెట్టారు. ఇంతకంటే పెద్ద నీలాపనిందలు ఇంకేమంటాయి?

ఇన్ని నీలాపనిందలు ఎదురుకున్న కృష్ణుడు అంతఃపురంలో కూర్చుని ఎంత బయట పడదామన్నా, ఇంకా ఇంకా అపనిందలు వస్తూనే ఉన్నాయి, ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు.

అక్రూరుడికి కృష్ణునియందు అపారమైన భక్తి ఉన్నా, ఆ మణిని కృష్ణునకు ఇవ్వడానికి సిగ్గుపడి, ఆ మణిని తీసుకొని కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళగానే ఆయన మనసు మారింది. నేను మణి ఇవ్వకపోవడం వల్లనే కృష్ణుడి మీద ఇన్ని అపనిందలు పడ్డాయి అని భాదపడ్డాడు. దానిని పవిత్ర కార్యాలకు వాడడం మొదలు పెట్టాడు. దాని నుండి వచ్చిన బంగారంతో కాశీలో రోజు అన్నదానం చేశాడు. ఆ మణిని పవిత్రంగా ఉంచడంవల్ల దాని ప్రభావంతో కాశీలో కరువుకాటకాలు రాలేదు. వ్యాధులు అసలే లేవు.

దీనంగా ఆలోచిస్తున్న కృష్ణుని వద్దకు నారదమహర్షి వచ్చారు. కృష్ణా! నీకు ఇన్ని అపనిందలు రావడానికి కారణం భాద్రపద శుక్లచవితినాడు (అంటే వినాయక చవితి)  నువ్వు ప్రసేనుడితో కలిసి వీటకు వెళ్ళినప్పుడు చూసిన చవితి చంద్రుడు. ఆ రోజు చంద్రున్ని చూసిన వారికి నీలాపనందలు వస్తాయని వినాయకుడి శాపం. అందువల్ల ఈసారి నువ్వు వినాయకచవితి రోజున వరసిద్ధివినాయకచవితి వ్రతం ఆచరించు. 21రకాల పత్రిని, అలాగే పచ్చని దొసపండు (కీరదోసకాయ) ను సమర్పించు. వినాయకుడు తప్పక అనుగ్రహిస్తాడు అని పలికాడు నారదమహర్షి.

నారదమహర్షి చెప్పినట్టుగానే కృష్ణుడు వ్రతం ఆచరించాడు. వ్రతం ముగియగానే గణపతి ప్రత్యక్షమయ్యి, మామయ్య!(పార్వతిదేవి విష్ణుమూర్తికి చెల్లెలు. గణపతికి విష్ణుమూర్తి మామయ్య) నా వ్రతం ఆచరించావు కనుక ఈ రోజుతో నీ మీద పడ్డ నీలాపనిందలు తొలగిపోతాయి అన్నాడు. వరం ఇవ్వగానే  కాశీకి  'అక్రూర, జరిగింది ఏదో జరిగిపొయింది. ఇక్కడ కరువు వచ్చింది. వర్షాలు లేవు. అందువల్ల నువ్వు తక్షణమే ఆ మణిని తీసుకోని ద్వారకకు రావాలి' అని కబురు పంపాడు.

సాక్షాత్ కృష్ణుడే రమ్మన్నాడు కదా అని అక్రూరుడు ద్వారకు వచ్చి కృష్ణుడికిస్తే, దానికి బదులుగా కృష్ణుడు 'నాకేందుకీ మణి. నేను ప్రజల బాగు కోసమే అడిగాను. నీ దగ్గరే పెట్టుకోని, దీని నుండి వచ్చిన బంగారంతో అన్నదానం చేస్తూ, ఆ మణిని పవిత్రకార్యాలకు వాడు' అని పలికాడు.

అప్పటినుండి ద్వారకలో కరువులేదు. ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఆ సమయంలో వినాయకుడు కృష్ణుడితో 'ఇప్పుడు ఆనందంగా ఉందా. నీ మీద పడ్డ పనిందలన్ని తొలగిపోయయి కదా' అని అంటే కృష్ణుడు 'భగవంతుండినైన నేనే చంద్రుని చూసినందుకు నీ శాపం కారణంగా ఇన్ని అపనిందలు పడ్డాను. ఇక సామాన్య మానవులు మరెన్ని కష్టాలు పడతారో. దీనికి ఏదైనా పరిష్కారం చూపవా' అన్నాడు. అందుకు బదులుగా వినాయకుడు, వినాయక చవితి రోజున నువ్వు పడ్డ కష్టాలతో కూడిన ఈ కధను చదివి లేదా విని అక్షింతలు వేసుకుంటారో వారి 'పొరపాటున' చంద్రున్ని చూసినా వారికి ఏ నీలాపనిందలు రాకుండా వరం ఇస్తున్నా. అలాగే పూజ చేయకూడని వారు (జాతాశౌచం, బందువుల మరణం లాంటి కారణాల వల్ల) ఈ కధ చదివిన లేదా విన్న వారు, కధా చదివే సమయంలో చేతిలో పట్టుకున్న అక్షతలను తలమీద వెసుకున్నా ఫలితం లభిస్తుంది' అని పలికాడు.

గణపతి ఎంత శక్తివంతుడో,ఆయన శాపానికి ఎంత శక్తి ఉంటుందో ఈ కధ ద్వారా మనకు అర్దం అవ్తుంది. అలాగే మన కోసమని కృష్ణపరమాత్మ ఇన్ని కష్టాలు పడి, వినాయకుడి ద్వారానే ఒక పరిష్కారం చూపి మనల్ని ఉద్ధరించాడు.

ఈ కధనే వినాయకచవితి నాడు చదవాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం శ్లోకమైన చదివి అక్షతలు వేసుకోవాలి.

సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః

ఓం శాంతిః శాంతిః శాంతిః

పాలవెల్లి

ఓం గం గణపతయే నమః

వినాయక చవితి పూజలో పాలవెల్లి కడతాం ఎందుకు?

ఎక్కడైనా ఒక ప్రదేశానికి ఒక సినీహీరోనో లేక ఒక రాజకీయనాయకుడొ వస్తుంటే, వాళ్ళని చూడటానికి జనం బారులు తీరుతారు.  మరి  వినాయకచవితికి సాక్షాత అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమద్యాంతరహితుడైన ఆ పరంబ్రహ్మాన్ని గణపతి స్వరూపంగా చిన్న మట్టి విగ్రహంలోని ఆవాహన చేస్తున్నాం. పరమాత్ముడు మనం పూజించే విగ్రహంలోని వస్తున్నాడంటే, ఆయన్ను సేవించడానికి దేవయక్షకిన్నెరకింపురుషాదులు, గ్రహాలు ఆ పూజాప్రదేశానికి చేరుకుని ఆ పరమాత్ముడిని సేవిస్తాయి. దీనికి సంకేతంగా మనం పాలవెల్లి కడతాం. పాలవెల్లి కట్టే పండులు అంతరిక్షానికి, అక్కడ ఉండే జ్యోతిర్మండలానికి, నక్షత్ర, తారా సమూహానికి, గ్రహాలకు సంకేతం. మనం మాత్రమే కాదు, మన కట్టే పాలవెల్లి ద్వారా ఆయా శక్తులు స్వామిని సేవిస్తాయి.  

ఓం గం గణపతయే నమః    

Wednesday, 27 August 2014

శమంతకోపాఖ్యానం - 3

కొందరు మాత్రం వస్తామనడంతో, వారిని తీసుకొని అడవిలో వెతకడానికి వెళ్ళాడు శ్రీ కృష్ణుడు. వారు వస్తున్నారు కాని వారికి శ్రీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. గుర్రపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు, ఎముకలు, రక్తపు మరకలు ఉన్నాయి. "చుశారా! నేను చంపానన్నారు. ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. వారిని సింహమే చంపింది. అందువల్ల ఎముకలే ఉన్నాయి కాని శరీరాలు లేవు. అది చంపి వారిని తినేసింది" అని కృష్ణుడాన్నాడు. అయితే వచ్చిన వారిలో కొందరు 'ఈయనే చంపి మణి తీసుకున్నాక, సింహం ఈ దారిన వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది. మళ్ళీ ఒక కట్టుకధ అల్లుతున్నాడు. మహా మోసగాడు చుశారా' అన్నారు. ఇంకొక నీలాపనింద.    

కాస్త ముందుకు వెళ్ళి చుస్తే అక్కడ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. సింహం శవం ఉంది. ఎలుగుబంటి సింహాన్ని చంపి మణి ఎత్తుకుపొయింది. ఈ పాదముద్రలు పట్టుకొని వెళదాం అన్నాడు కృష్ణుడు. సింహం ఎలుగుబంటిని చంపుతుంది కాని ఎక్కడైన ఎలుగుబంటి సింహాన్ని చంపుతుందా? ఇది ఇంకొక కట్టుకధ అన్నారు ఆయనతో వచ్చిన వారు. మళ్ళీ అబద్దాలు ఆడుతున్నాడని నీలాపనిందలు వేశారు.

ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఆయన 24 వ త్రేతాయుగంనాటి వాడు. కృష్ణుడు 28 వ ద్వాపరయుగం నాటి వాడు. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణసమయానికే జాంబవంతుడు కడువృద్ధుడు. అంటే ఆయన వయసు చాలా ఎక్కువ. త్రేతాయుగంలో రామున్ని చూసిన జంబవంతుడు ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. 'పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం' అని రాముడిని వర్ణిస్తాం. మగవారే మొహించేంతటి సుందరుడు శ్రీ రామ చంద్రుడు. అటువంటి రాముడిని గట్టిగా కౌగిలించుకొవాలి అని కోరిక పుట్టింది జాంబవంతుడికి. రామున్ని అడుగగా, ఈ అవతారంలో కుదరదు, రాబోయే కృష్ణావతారంలో అవకాశం ఇస్తానన్నాడు. ఆ జాంబవంతుడికే ఒక పిల్లవాడు పుట్టాడు. పేరు సుకుమారుడు. వాడి ఆహారం కోసమని అడవిలో తిరుగుతున్న జాంబవంతునకు శమంతకమణి నోట కరుచుకున్న సింహం కనిపించింది. ఆ మణి చూడడానికి బాగుందని సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూమారుడి ఉయ్యాలకు కట్టాడు. కళ్ళు మిరమిట్లుకొరిపే ఆ మణి ఒక పసిపిల్లవాడికి ఆట వస్తువంటే వారు ఎంత బలవంతులో అర్దం చేసుకోండి.    

అంతా కలిసి ఆ ఎలుగుబంటి అడుగుజాడలను పట్టుకొని వెళ్ళగా, ఒక గుహలోకి వెళ్ళినట్టు ఆ అడుగుజాడల గుర్తులు ఉన్నాయి. కృష్ణుడు లోపలికి వెళ్ళి వెతుకుదాం అన్నప్పటికి వారు రాలేదు. రాకపోగా వచ్చినవారు కృష్ణుడు లోపలికి తీసుకువెళ్ళి చంపుతాడని, అందుకోసమే ఈ అడవిలో ఈ గుహ వద్దకు తీసుకువచ్చాడని అన్నారు. కృష్ణుడు 'ఒంటరి లోపలికి వెళతాను, బయట వేచి ఉండండి' అన్నా, తాము వేచి ఉండేది లేదని, ద్వారకకు తిరిగి వెళ్ళిపొయారు.

పడ్డ అపనింద తొలగించుకోవాలని కృష్ణపరమాత్మ చీకటిగా ఉన్న ఆ గుహలోనికి వెళ్ళాడు. కొంచం దూరం వెళ్ళాక అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఒక పిల్లవాడిన ఉయ్యాలలో వేసి ఊపుతోంది. ఆ స్త్రీ జాంబవతి. జాంబవంతుని కూమార్తే. ఊయలలో ఉన్నది జాంబవంతుని కూమారుడు సుకుమారుడు. తమ్ముడిని ఊయలలో పడుకోబెట్టి ఊయల ఊపుతోంది. ఆ ఊయలకు శమంతక మణి కట్టి ఉండడం కృష్ణుడు చూశాడు. కృష్ణుడిని చూడగానే జాంబవతి మొహించింది. ఆయనే తనకు భర్త అని భావించింది. కృష్ణుడు ఆ మణి వంకే చూడడం గమనించి ఆ మణి కృష్ణుడిదే అని, తన తండ్రి తీసుకువచ్చి ఉంటాడని, కృష్ణుడు మణి  కోసమే వచ్చాడని గ్రహించింది. ఎవరైన క్రొత్తవారు వచ్చారని తెలిస్తే జాంబవంతుడికి కోపం వస్తుందని, కృష్ణుడిని చంపుతాడని భయపడుతుండగా, ఆ మణి కోసం కృష్ణుడు దగ్గరగా వస్తున్నాడు. ఆవిడ కృష్ణుడికి ఆ మణి ఇక్కడకు ఎలా వచ్చిందో అర్దమయ్యేలా, పిల్లవాడికి జోల పాడుతున్నట్టుగా, జాంబవంతునకు కృష్ణుడు వచ్చాడన్న సంగతి తెలియకుండా ఉండేందుకని ఒక పాట రూపంలో ఊయల ఊపుతూ జరిగినదంతా చెప్పింది.    

సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః

సింహం ప్రసేనుడిని చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! నువ్వు ఏడవకు. ఈ మణి నీదే అని అర్దం.

ఇంతా చెప్పిన కృష్ణుడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటయ్యా, ఎంత చెప్పిన వినకుండా దగ్గరకు వచ్చేస్తున్నావు. మా నాన్న చూస్తే నిన్ను చంపేస్తాడు. అది నేను తట్టుకోలేను. వెనక్కి వెళ్ళు అని జాంబవతి పలికింది. రక్షించాలనుకుంది, ఇంతలో జాంబవంతుడు వచ్చాడు.    

To be Continued ...........

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

గణేశ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది ఆయుర్వేదం. అంటే కేవలం నెయ్యితోనే ఆహారపదార్ధాలు తయారుచేయాలి. ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్ధాలు పెరిగిపోతే, అది ఆమం (విషం /Toxin) గా మారి రోగాలకు కారణమవుతుంది. ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వలన, నెయ్యి మలద్వారానికి వెళ్ళే పేగుల గోడలకు ఒక పొరగా/పూతగా ఏర్పడి, మల విసర్జన సాఫిగా జరగడానికి కారణమవుతుంది. పుష్టికరమైన శుచికరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను, అక్కర్లేని చెత్తను బయటకు పంపించడం అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నవారి మనసు చురజక్గా పని చేస్తుంది. అటువనటి మనసే మంచి ఆలోచనలు చేయగలదు. మంచి ఆలోచనలే, సత్ సంకల్పాలై, సత్కర్మలకు దారి తీస్తాయి. సత్కర్మలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. శుద్ధిపొందిన చిత్తము ఆత్మాజ్ఞానానికి పాత్రతను పొందుతుంది. అటువంటి వారి తపస్సే ఫలిస్తుంది. కనుక ఆహారం తీసుకోవడం అంత ప్రధానామో, శరీరంలో ఉన్న చెత్తను వివిధ రకాలుగా తొలగించుకోవడం కూడా అంతే ప్రధానం. అందుకే గణేశ చతుర్థీ రోజున ప్రత్యేకించి నెయ్యితో చేసిన పదార్ధాలనే భుజించమన్నారు. ఒక్క వినాయక చవితికే కాదు, నిత్యం కూడా నెయ్యి కలిపిన ఆహారాన్నే స్వీకరించాలి. నెయ్యి లేని తిండి నీతిమాలిన తిండి అన్నారు మన శతకకర్తలు.

గణపతి ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు. గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

అందుకే మన వినాయక చవితి రోజు స్వామికి నేతితో చేసిన వంటకాలు, కుడుములు సమర్పిస్తాం. గణపతి 21 సంఖ్య ఇష్టం కనుక వీలైతే 21 సంఖ్యలో కుడుములు / ఉండ్రాళ్ళు సమర్పించండి.

ఓం గం గణపతయే నమః 

శమంతకోపాఖ్యానం పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వీడియో



శమంతకోపాఖ్యానం మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. అసలు కధ. సంపూర్తిగా చూడగలరు.

Tuesday, 26 August 2014

శమంతకోపాఖ్యానం - 2

విషయం తెలుసుకున్న కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు. ఆ మణి ఎక్కడ ఉంటే వ్యాధులు, కరువుకాటకాలు, రోగాలు రావు. మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు. మీ వద్ద ఉంటే మీకు మాత్రమే ప్రయోజనం. అది నాకు ఇస్తే నేను ఉగ్రసేన మహా రాజుగారికి ఇస్తాను. రాజు దగ్గర ఉంటే రాజ్యం అంతా బాగుంటుంది అన్నాడు. ప్రజల మేలు కోసమని అడిగాడు. సత్రాజిత్తు తిరస్కరించగా, కృష్ణుడు వెళ్ళిపొయాడు.

కృష్ణుడు ఇంతకముందు చాలా మంది రాక్షసులను చంపాడు, ఇప్పుడీ మణి కోసం తనను కూడా చంపుతాడని అనుమానించాడు సత్రాజిత్తు. నిజానికి కృష్ణుడు కంస సంహారం చేశాక ద్వారక నగరాన్ని కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజుకు ఇచ్చాడు కాని తాను పరిపాలించలేదు. ద్వారకను సముద్రం మధ్యలో నిర్మించుకున్నా తనకంటే పెద్దవాడు బలరాముడని, బలరాముడికి పట్టం కట్టాడు. ఇక కృష్ణుడి దగ్గర కౌస్తుభ మణి ఉంది. అది శమంతకమణికంటే కోటి రెట్లు విలువైనది. కౌస్తుభం ఉండగా శమంతకమణి అవసరమేంటి. ఇవి ఆలోచించకుండా కృష్ణపరమాత్మ గురించి ఇలాంటి నీచపు అలోచనలు చేశాడు సత్రాజిత్తు.  

ఈ విధమైన ఆలోచనల వల్ల మనసు అపవిత్రమైంది. ఆ సమయంలో మెడలో శమంతకమణి ఉంది. తన దగ్గర ఉంటే కృష్ణుడు చంపుతాడని భయపడి, తమ్ముడు ప్రసేనుడిని పిలిచి ఆ మణిని ఇచ్చాడు. అది తీసుకునే సమయానికి ప్రసేనుడు బాహ్యాంతర (శారీరిక,మానసిక) శౌచం ఉంది. దాన్ని ప్రసేనుడు తీసుకుని మెడలో వేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణుడు, ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళారు. ప్రసేనుడి గుర్రం దారి తప్పింది. ప్రసేనుడికి ఆ సమయంలోనే మూత్రవిసర్జన చేయవలసిన అవసరం ఏర్పడింది. మెడలో ఉన్న మణి తీసి ప్రక్కన పెడితే, ఎవరైనా తీసుకుపొతారని దాన్ని మెడలోనే వేసుకొని మూత్రవిసర్జన చేశాడు. అదే దోషం. అందునా అక్కడ నీరు ఉండదు కనుక కాళ్ళు, చేతులు కడుక్కొని, ఆచమనం చేయడానికి కుదరలేదు. మెడలో మణి అపవిత్రం అయ్యింది. ఇది ఇంకా పెద్ద దోషం. అపవిత్రమయితే ప్రాణాలు తీస్తుంది. గుర్రం ఎక్కి వెళుతున్నాడు. దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. మృత్యువు సింహం రూపంలో వచ్చింది. గుర్రాన్ని, ప్రసేనున్ని చంపి, మాంసం తినింది. అక్కడ ఎముకలతో పాటు ఈ శమంతక మణి దేదీప్యమానంగా వెలిగిపొతోంది. అది తినే వస్తువు కాకపొయిన చూడడానికి బాగుంది కదా అని నోటికి కరుచుకొని వెళ్ళింది.

సింహం హత్యచేసింది. అది గుర్రాన్ని, ప్రసేనుడిని చంపింది, మాంసం తిన్నది, కనుక అపవిత్రం అయ్యింది, శౌచం పోయింది. అది ఏ ప్రాణి అయినాసరే నియమం మారదు. మణి మళ్ళీ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. సింహానికి మృత్యువు ఎలుగుబంటి రూపంలో వచ్చింది. వచ్చి ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుపోయింది ఎలుగుబంటి.  

అక్కడ కృష్ణుడు ప్రసేనుడి కొరకు అన్వేషిస్తున్నాడు. అది భాద్రపద మాసం. వర్ష ఋతువు కారణంగా త్వరగా చీకటి పడుతుంది. ప్రసేనుడికి ఏదైనా ప్రమాదం జరిగితే తానే మణి కోసం చంపాను అనుకుంటారని కృష్ణుడు ఆందోళన పడ్డాడు. ప్రసేనుడి కోసం వెతికినా జాడ తెలియలేదు. "ప్రసేనా! ఎక్కడ ఉన్నావు" అని తల పైకి ఎత్తి గట్టిగా అరిచాడు. ఆ రోజు వినాయక చవితి. చంద్రబింబం శుద్ధ చవితినాడు 30డీగ్రీలు కిందకి వచ్చి ఉంటుంది. తల కొంచం పైకి ఎత్తగానే చంద్ర దర్శనం అయ్యింది. చంద్రున్ని చూసిన కృష్ణుడు, రాత్రి అయిపొయిందని తలచాడు (కాని అది చవితి చంద్రుడన్న విషయం గుర్తుకురాలేదు), ఇప్పుడు వెతకడం కష్టమని తలచి, సైన్యాన్ని తీసుకొని తిరిగు బాట పట్టాడు.

చవితి చంద్రుని దర్శనం నీలాపనిందలు తెచ్చిపెడుతుంది కదా. రాత్రికి రాత్రి ద్వారకలో కృష్ణుడే ప్రసేనుడిని చంపాడని పుకారు వచ్చింది. మొదటి నీలాపనింద. ద్వారకలో ఉంటున్న ప్రజలంతా ఇదే నమ్మారు. అప్పటివరకు కృష్ణుని చేత రక్షింపబడినవారు, ఆయన్ను పొగిడిన వాళ్ళంతా ఇప్పుడు "నిజమే, చిన్నతనంలో కృష్ణుడు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత మందిని చంపలేదు. ఇప్పుడు శమంతకమణి కోసమని ప్రసేనుడిని కూడా కృష్ణుడే చంపి, ఏమి ఎరగనట్టు అసత్యాలు పలుకుతున్నాడు" అని అనడం మొదలుపెట్టారు. మళ్ళీ నీలాపనిందలు. తన మీద వచ్చిన అపనిందలను తొలగించుకోదలచిన కృష్ణపరమాత్మ ప్రజలతో 'నాతో పాటు మీరు కూడా అడవికి వస్తే వెళ్ళి వెతుకుదాము' అన్నాడు. 'ఇంతకముందు నువ్వు చాలా మందిని చంపావు. ఇప్పుడు మమ్మల్ని చంపుతావు. నీ మీద మాకు నమ్మకంలేదు, నీవెంట వచ్చెది లేదు' అన్నారు ప్రజలు.

To be continued ...............    

Monday, 25 August 2014

శమంతకోపాఖ్యానం - 1

వినాయకచవితి వ్రతకధలో ముఖ్యమైంది శమంతకోపాఖ్యానం.

ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా పుస్తకాలలో ప్రచురిస్తున్న కధలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఫలితంగా ఆ కధ విన్నా, అసలు ఫలితం రాదు. ఇప్పుడు మనం విష్ణు, స్కాందపురాణాలలో చెప్పబడిన అసలు కధ చెప్పుకుందాం.

వినాయకచవితి నాడు చంద్రదర్శనం చేసినవారు నీలాపనిందల పాలవుతారని గణపతి శాపం అలానే ఉంది. అది ద్వాపర యుగం. సత్రాజిత్తు, ప్రసేనుడు అన్నదమ్ములు, ద్వారకలో ఉంటారు. సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. విష్ణుపురాణం ప్రకారం సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు. సత్రాజిత్తు సముద్రం వద్దకు వెళ్ళి సూర్యుడితో కాసేపు మాట్లాడుదామని పిలిస్తే సూర్యుడు వచ్చాడు. సూర్యుడంటే మాములువాడు కాదు. పెద్ద వెలుగు, దాంతో పాటు మెడలో శమంతకమణి. అందువల్ల సత్రాజిత్తుకు సూర్యుడి రూపం కనిపించలేదు. నాకు నీ రూపం కనిపించడంలేదు అని సత్రాజిత్తు అనడంతో సూర్యుడు ఆ శమంతకమణిని తీసి సముద్రపు ఒడ్డున పెట్టి, తన తేజస్సును తగ్గించికొని, ఆయనతో కాసేపు కబుర్లు చెప్పాడు. దేవతలను పిలిస్తే వరం ఇవ్వకుండా వెళ్ళరు. వెళ్ళకూడదు. అది వారికి ఉన్న నియమం. వినాయకచవితినాడు పూజించే వరసిద్ధివినాయకుడు కూడా వరాలు ఇచ్చే వెళతాడు.

అందువల్ల సూర్యుడు నీకు ఏమి వరం కావాలో అడుగు, ఇస్తానన్నాడు. శమంతకమణి సూర్యబింబంలా మెరసిపోతోంది. ఆ మణి కావాలన్నాడు సత్రాజిత్తు. సరే ఇస్తున్నా అన్నాడు సూర్యుడు. అది మెడలో వేసుకుంటే దాని కాంతివలన అందరు నిన్ను సూర్యుడిగా భావిస్తారు. కానీ ఆ మణిని పవిత్రంగా మాత్రమే ధరించాలి అన్నాడు (మణి, మంత్రము, ఔషధము స్వార్ధానికి వాడుకోకూడదు. మణి ఎవరికైన పనికొస్తుందంటే ఇవ్వాలి. మంత్రము ఎదుటివారు బాగుపడడం కోసం ఉపదేశించవచ్చు. ఔషధం డబ్బు ఇవ్వలేదని అని అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వకుండా ఉండకూడదన్నది శాస్త్రం).  

ఈ మణి రోజుకు 8 బారువుల బంగారం పెడుతుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు రావు, కరువు ఉండదు, ప్రమాదాలకు తావు ఉండదు అంటూ సూర్యుడు  మణి గురించి వివరించాడు. ఈ మణిని ధరించాలి అంటే శారీరిక శౌచము (శుభ్రత), మానసిక శౌచము (కుళ్ళు, అహంకారము అసూయ, ద్వేషము, పరనింద వంటివి లేకుండా ఉండడం అవసరం. అలాగే నిజాయతి ఉండాలి) ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉదహరణకు ఒకవేళ శరీర అవసరాల దృష్ట్యా మూత్రవిసర్జన చేయాల్సి వస్తే, ముందు ఈ మణిని మెడలోనుండి తీసి పక్కన పెట్టి, విసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేసి,  ఆ తరువాతే ధరించాలి. "ఒకవేళ మానసికంగా కానీ,శారీరికంగా కానీ శౌచనికి భంగం ఏర్పడితే, ఆ సమయంలో ఇది ధరించి ఉంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఈ మణి ప్రాణాలను తీస్తుంది". అందువల్ల జాగ్రత్త మిత్రమా! అంటూ ఆ మణిని సత్రాజిత్తుకు వరంగా ఇచ్చాడు సూర్యుడు.  

సత్రాజిత్తు ఆ మణి మీద వ్యమోహంతో తీసుకొని మెడలో వేసుకున్నాడు. అది ధరించగానే ఆయన మనసులో కృష్ణుడు ఈ మణిని అడుగుతాడేమో, దొంగిలిస్తాడేమో అనే చెడు భావన కలిగింది. ఆయన ద్వారకకు చేరగా, ఆ మణిని ధరించి వస్తున్న సత్రాజిత్తును చుసిన ప్రజలు సూర్యుడే వస్తున్నాడని తలచి, అలాంటివారు కృష్ణదర్శనం కొసమే వస్తారని, ఈ విషయాన్ని కృష్ణునకు చెప్పారు.

To be continued .........

Sunday, 24 August 2014

గణపతి చంద్రుడిని శపించుట

వినాయకచవితి రోజు చంద్రుని శాపవృత్తాంతం గురించి చదివే ఉంటాం. అందులో గణపతి బొజ్జ పూర్తిగా నిండిపోవడంతో, శివపార్వతులకు నమస్కరించలేకపోవడం, అది చూసి చంద్రుడు నవ్వడం, దాంతో గణపతి బొజ్జ పగిలి మరణించడం జరిగిందని, తర్వాత పార్వతీదేవీ శపించిందని కధ సాగుతుంది. నిజానికి ఈ కధ ప్రామాణికమైనది కాదు, దీనికి పురాణ ప్రాశస్త్యం లేదు. అసలు కధ వేరే ఉంది. అది చదవండి.

గణపతి చంద్రుడిని శపించుట

గణపతికి లంబోదరుడని పేరు. లంబోదరం అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని అర్దం. సమస్త బ్రహ్మాండాలను తన బొజ్జలో దాచుకున్నాడు కనుక గణపతి లంబోదరుడయ్యాడు. ఒకానొక వినాయకచవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్దబోజ్జ పూర్తిగా నిండడంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. వినాయకుడి కడుపు నైవేధ్యాల వలన నిండిందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందరి ఆకలిని తీర్చే పరబ్రహ్మం యొక్క కడుపు ఎవరుమాత్రం నింపగలరు. భక్తులు తనకు భక్తితో చేసిన పూజ వలన కలిగిన ఆనందం జీర్ణం కాక, ఇబ్బంది పడ్డాడు వినాయకుడు.

చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు. అది బాహ్యసౌందర్యం. 27 నక్షత్రాలు చంద్రుని భార్యలు. వారందరు అక్కచెళ్ళెలు, దక్షప్రజాపతి కూమార్తెలు. కానీ ఆయన అందరికి సమానమైన ప్రేమ పంచక, ఒక్క రోహిణితో ఉండడానికి మాత్రమే ఇష్టపడేవాడు.దాంతో బాధపడిన మిగితావారు తన తండ్రి అయిన దక్షునకు విషయం చెప్పగా, దక్షుడు కోపంతో కళావీహినుడిగా మారిపో అని శపించాడు. తనను శాపం బారి నుంచి రక్షించగలవారు పరమశివుడు ఒక్కడేనని ఎన్నోవృధా ప్రయాసల తర్వాత గ్రహించిన చంద్రుడు, తనకు శాపవిమోచనం కలిగించగలడని గ్రహించి ఆయన్ను శరణువేడగా, దయతలచి తన తలపై ధరించాడు శివుడు.

కేవలం వ్యక్తి ఒక్క బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించడం, మోహించడం జ్ఞానుల లక్షణం కాదు. కవులందరూ చంద్రుడు గొప్పవాడని,చల్లనివాడని,అందమైన ముఖమున్నవారిని చంద్రబింబంతో పొల్చడం వంటివి చేయడం చేత చంద్రునకు "అహంకారం" పెరిగింది. తానే అందగాడినని భావించడం మొదలుపెట్టాడు. ఒక విషయం గమనించాలి. శారీరిక అందం ఆశాశ్వతమైనది. అది ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. రోజులు గడిచే కొద్ది, యవ్వనం తరిగిపోతుంది. ఎన్నో లేపనాలు పూసి కాపాడుకున్న శరీరం ముసలివయసురాగానే ముడతలు పడిపోతుంది. ఆఖరికి నిప్పులో కాలిపోతుంది. అటువంటి శరీరాల పట్ల మొహం పెంచుకున్నాడు కనుక చంద్రుడు ఆంతరింగికంగా సౌందర్యవంతుడు కాడని అర్దం చేసుకోవాలి.


వినాయకుడు బయటకు పెద్ద బొజ్జతో పొట్టిగా, చిన్నపిల్లవాడిలా, ఏనుగు ముఖంతో ఉన్నా ఆయన మానసికంగా మహా సౌందర్యవంతుడు. ఆత్మ సౌందర్యం శాశ్వతమైనది. అసలు వినాయకుడు మరగుజ్జు వాడని చెప్పుకున్నా, బ్రహ్మవైవర్తపురాణం గణపతి రూపాన్ని గురించి చెప్తూ, శ్రీ కృష్ణుడు ఎంతో మోహనాకారుడో, గణపతి కూడా అంతే సమ్మోహనాకారుడని, అది గ్రహించలేని తులసి, గణపతిని వీష్ణువుగా భావించి, పెళ్ళాడమని వెంటపడింది. అది గణపతి సౌందర్యం అంటే. అటువంటి గణపతిని చూసి చంద్రుడు నవ్వడంతో గణపతికి కోపం వచ్చింది. కోపం వచ్చింది తనను చూసి చంద్రుడు నవ్వినందుకు కాదు, ఇంతకముందు చంద్రుడికి దక్షుడి శాపం ఇస్తే, శివుడు వలన ఉపశమనం పొందాడు. అయినా చంద్రుడికి ఇంకా బుద్ధి రాలేదు. కనీసం పశ్చాత్తాపమైనా లేదు. సృష్టిలో రకరకాల వ్యక్తిత్వాలను, వ్యక్తులను సృష్టించాడు భగవంతుడు. అది అర్దమైనవాడు ఎవరిని విమర్శించడు, వెక్కిరించాడు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని గేలి చేసినా, అపహాస్యం చేసినా, అది భగవంతుని విమర్శించినట్టు అవుతుంది. వైవిధ్యం సృష్టి లక్షణం. దాన్ని అలాగే అంగీకరించాలి. చంద్రుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచి, కోపం తెచ్చుకుని చంద్రుడిని చూసిన వారు నిలాపనిందలు పొందుతారంటూ శపించాడు.  
 
చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని ఛీ కొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డుపెట్టుకుని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువు అయ్యారు. ఔషధమూలికలు చంద్రకాంతిలోనే ఔషధులను తయారుచేసుకుంటాయని పురాణలవచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఋషులు, దేవతలు, మునులు........ అందరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ దేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చుపుతాడని బ్రహ్మదేవుడనగా, అందరు కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. ఒకసారి శపించిన తరువాత వెనక్కి తీసుకోవడం కుదరదు కనుక, చంద్రునికిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాధుడు. అందరు వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి, చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. చంద్రుడు చేసిన తప్పును ఒప్పుకొని, క్షమించమని వేడుకున్నాడు. పశ్చాతాపపడ్డాడు. 'సర్వవిఘ్నపాలాయ గణేశాయ పరాత్మనే| బ్రహ్మశాయ స్వభక్తేభ్యో బ్రహ్మభూయ ప్రదాయతే|' అంటూ స్థుతించాడు.

సూర్యుడి వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి, నన్నే అంటావా ? ఇప్పటికైన బుద్ధి వచ్చిందా?  అని స్వామి అనలేదు.తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తలమీద పెట్టుకొని, చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది "నాట్య గణపతి"అవతారం. చంద్రుడిని తలపై ధరించాడు కనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. ఓం ఫాలచంద్రాయ నమః

శాపం నుంచి బయట పడినందుకు నిజానికి చంద్రుడు నాట్యం చేయాలి. కానీ నాట్యం చేసినవాడు వినాయకుడు. భారీశరీరం కలవాడు. మనం చేసిన తప్పును తెలుసుకుని, పూర్తి పశ్చాత్తాపంతో పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకంటే ఎక్కువగా పరవశించిపోయేది ఆయనే అని చెప్తుంది ఈ ఘట్టం. ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ, ఏ రోజునైతే నీవు నన్నుచూసి పరిహసించావో, ఆ రోజున (వినాయక చవితి రోజునే) ఎవరు నిన్ను చూస్తారో, వారికి చేయని తప్పుకు నీలాపనిందలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి.


దీంతో చంద్రుడు తృప్తి పొందాడు కానీ గణపతి మాత్రం తృప్తి పొందలేదు. అయ్యో! ఆ ఒక్కరోజు కూడా వీడిని జనం చూడనందుకు బాధపడతాడేమో అని గణపతి భావించి, కృష్ణచతుర్థి (సంకష్టహర చవితి) యందు నా కొరుకు ఉపవాసం ఉన్నవారు, నీవు ఉదయించే వేళ నన్ను పూజించి, నిన్ను ధూపదీపనైవేధ్యాలతో అర్చించి, నీకు ఎవరు అర్ఘ్యం ఇస్తారో, వారే నా అనుగ్రహానికి పాత్రులు కాగలరు అంటూ గణపతి చంద్రుడికి మరొక వరం ప్రసాదించాడు. అయినా గణపతికి ఇంకేదో గొప్పది ఇవ్వాలనిపించింది.

విదియ తిధి యందు సాయంకాలము నేను నిన్ను స్వీకరించాను. నిన్ను నా ఫాలభాగాన ధరించాను కనుక శుక్ల విదియనాడు మానవులు నీకు నమస్కారం చేస్తారు. ఏ మానవుడైతే శుక్లవిదియ నాడు చంద్రుడిని చూసి నమస్కరిస్తారో, అతడికి ఆ మాసం మొత్తం ఉండే దోషాలు దరిచేరవు అంటూ పలికాడు గణపతి. అంతటి కరుణామూర్తి మన గణపతి.

ఇది అసలు కధ. మనం సంపూర్తిగా మారి ఒక్క అడుగు పరమాత్మ వైపునకు వేస్తే, భగవంతుడు మనవైపుకు మరిన్ని అడుగులు వేస్తాడని చెప్తుందీ వృత్తాంతం.  వినాయకచవితి పూజలో ఈ కధనే చదివి అక్షతలు తలపై ధరించాలి.

ఓం గం గణపతయే నమః 

నియమాలు పాటించండి

ఓం గం గణపతయే నమః

కలౌ కపి వినాయకౌ, కలౌ చండి వినాయకౌ - కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతా మూర్తులలో గణపతి మొదటివాడు.  అటువంటు గణపతిని విశేషంగా పూజించే ఈ గణేశ నవరాత్రులలో పాల్గొనే భక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి, కొన్ని నియమాలు పాటించండి.

ఎంత పెద్ద విగ్రహం నిలబెట్టామన్నది కాదు, ఎంత భక్తితో చేశామన్నది ముఖ్యం. ఈ రోజున చాలామంది తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, తమ దర్పాన్ని ప్రదర్శించడం కోసం, ఇతరులకు పోటిగానూ, అందరు చేస్తున్నారు కనుక మనం కూడా చేయాలి, ఇలా చేయడం ఒక ఫ్యాషన్ అనే భావనతో గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. ఇలా చేసేవారు ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించినా అది వ్యర్ధమే అని గ్రహించాలి. విగ్రహం సైజు ప్రధానం కాదు, ఎంతో భక్తితో చేశామన్నది ప్రధానం. చందా ఇచ్చినంతే తీసుకోండి. అధికంగా ఇమ్మని బలవంతం చేయకండి.


మనముందున్న విగ్రహంలో గణపతి ఉన్నాడు అన్నది నిజం. అసలు అక్కడ గణపతి ఉన్నాడన్న భావన లేకపోవడం వలననే కొంతమంది వినాయక మండపం దగ్గర మందుతాగుతారు, పిచ్చి పిచ్చి సినిమాపాటలు పెడతారు, వచ్చేపోయే వాళ్ళని ఏడిపిస్తుంటారు. మనం పూజిస్తున్నది విగ్రహాన్ని కాదు, విగ్రహంలో ఉన్న గణనాధుడిని అన్న భావన మనకు కలగాలి. వినాయకుడి మండపంలో పిచ్చిపిచ్చి సినిమాపాటలు వద్దు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లూ వద్దు. అర్దరాత్రులవరకు లౌడ్ స్పీకర్లు పెట్టకండి. విపరీతమైన పసిపిల్లలకు, ముసలివారికి, అనారోగ్యవంతులు ఇబ్బంది పడతారు.

భావన ప్రధానం. ఫలానిచ్చేది కేవలం కర్మ కాదు, దాని వెనుకనున్న భావన. ఏ భావనతో చేశామన్నదాన్ని అనుసరించే భగవంతుడు ఫలితానిస్తాడు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గోనేవారు మద్యపానానికి, ధూమపానానికి (సిగిరెట్టు, బీడీ) మొదలైనవాటికి దూరంగా ఉండండి. అసభ్యపదజాలం వాడకండి, అవేశపడకండి, ఎవరిని దూషించకండి.

వినాయకచవితికి ఒక రోజు ముందు నుంచి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేరోజు వరకు మాంసాహారం వదిలిపెట్టండి. సాధ్యమైనంతవరకు ఉల్లిపాయలు, వెల్లిపాయలు (వెల్లుల్లి), మసాల వంటకాలకు, చిరుతిళ్ళు, ఫాస్ట్‌ఫుడ్లకు దూరంగా ఉండండి.

శారీరికంగానూ, మానసికంగానూ బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ ఉత్సవాలలో ప్రతి రోజు ఉదయమే నిద్రలేవండి. గణపతి నవరాత్రులలో మీకు వీలైనన్నిసార్లు గణపతి నామాన్ని స్మరించండి.

'ఓం గం గణపతయే నమః' అనేది గణపతి మహామంత్రం. దీనిని వీలైనన్నిమార్లు జపించండి.

ఎంతపెద్ద విగ్రహం ప్రతిష్టించాం, ఎన్ని నైవేధ్యాలు సమర్పినామన్నది కాదు, ఎంత వరకు గణపతికి శారీరికంగా, మానసికంగా సేవ చేశామన్నది ముఖ్యమని గ్రహించండి.

మనం పూజించే విగ్రహంలో గణపతిని చూడగలిగితే మళ్ళీ వచ్చే గణపతి చవితికి మన జీవితంలో బోలేడు మార్పు కనిపిస్తుంది. అలా కాక, అసలు అది ఒక బొమ్మగానే, పేరు కోసం, స్టైల్ కోసం, ఫ్యాషన్ కోసం పూజించేవారికి, అశాస్త్రీయమైన రూపాలను తయారుచేసి పూజించేవారికి జీవితంలో ఎన్నో గణపతి చవితిలు వస్తాయి, పోతాయి. కానీ గణపతి అనుగ్రహం కలుగుతుందన్నది మాత్రం అనుమానమే. నమ్మినవారికి నమ్మినంత.

ఓం గం గణపతయే నమః  

Friday, 22 August 2014

వినాయకచవితి ఖగోళశాస్త్రం

ఖగోళాన్ని విద్యుత్-అయస్కాంతత్వ (Electro-magnetism) కోణం నుంచి గమనిస్తే, మొత్తం విశ్వమంతా విద్యుత్-అయస్కాంత తరంగాల (Electro-magnetic waves) మీదనే నడుస్తోంది. సమస్త జీవరాశి నిత్యం అంతరిక్షం నుంచి, భూమి పొరల నుంచి విద్యుత్-అయస్కాంత తరంగాలను గ్రహిస్తోంది, బయటకు విడుదల చేస్తోంది. మానవదేహంలో కూడా విద్యుత్ శక్తి ఉంది. మనిషి యొక్క ప్రతి కలదలిక చేత అది బయటకు వెలువడుతోంది. ఇదంతా పురాతన భారతీయ శాస్త్రాల దగ్గరి నుంచి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అంగీకరించిన విషయమే. భారతీయ సంస్కృతిలో పండుగ అంటే అది కేవలం ఏదో తతంగం కాదు. ఈ ఖగోళమే ఒక విద్యుత్-అయస్కాంత క్షేత్రం. ఖగోళంలో కలిగే మార్పులు, భూమికి చంద్ర, సూర్యునికి మధ్య ఏర్పడే దూరం వలన అంతరిక్షం నుంచి వెలువడే అతి-సూక్ష్మ విద్యుత్ అయస్కాంత తరంగాలలో కలిగే మార్పులు మనిషిపై, అతని జీవనక్రియలపై, కణాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని, గ్రహాల కదలికలను ఆధారంగా చేసుకుని, మానవ జీవితంలో వ్యక్తి ఏ విధమైన మార్పును చేసుకుంటే, విశ్వంలో కలిగిన మార్పులకు అనుగుణంగా మారి, వాటి నుంచి అధిక ప్రయోజనం పొంది, ఆరోగ్యంగా జీవించగలడో గ్రహించి, దానికి అనుకూలంగా భారతీయ ఋషులు పండుగలను, ఇతర నైమిత్తిక తిధులను ఏర్పటు చేశారు. ఆయా రోజులలో తినవల్సిన పదార్ధాలను, చేయవలసిన విధులను స్పష్టం చేశారు. లోతుగా చెప్పుకుంటే ఇదొక అధ్బుతమైన విషయం.

వినాయక చవితి కూడా అంతే. అంతరిక్షంలో జ్యోతిర్మండలం ఉంటుంది. అది నక్షత్ర, గ్రహల రాశుల నుంచి వెలువడే వివిధ తరంగాలు, కిరణాల (rays) కారణంగా ఏర్పడుతుంది. మానవనేత్రానికి కనిపిచేది కాదు. ఆ జ్యోతిర్మండలంలో అనేకానేక మండలాలు ఉంటాయి. వాటిలో గణేశమండలం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత కిరణాలను మానవ దేహం అత్యధికంగా గ్రహించగల సమయమే వినాయక చవితి. ఈ వినాయక చవితి అంతరిక్షం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత తరంగాలను, కాస్మిక్ కిరణాలను (Cosmic rays) మానవదేహం నేరుగా గ్రహించలేదు. కానీ ఆ శక్తి ప్రకృతికి, అందులో భాగమైన మట్టికి ఉంది. మట్టి పంచభూతాలలో ఒకటి, ప్రాణశక్తి కలిగినది, సమస్త జీవనానికి ఆధారభూతమైనది. మీరు ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తేనే మొలకెత్తుతుంది. అంతేకానీ ప్లాస్టర్-ఆఫ్-పారిస్ లో, లేక ఇతర పదార్ధాలలో వేస్తే మొలకెత్తదు సరికదా, విత్తులోని జీవం నాశనమవుతుంది. అందుకే వినాయక చవితికి మట్టి విగ్రహాన్నే పూజించాలి.

ఈ మట్టి విగ్రహం ఏం చేస్తుంది? ఒక యాంటీనాలా (Anteena) పని చేస్తుంది. ఇందాక చెప్పుకున్న జ్యోతిర్మండలం నుంచి వెలువడే అయస్కాంత తరంగాలను, కాస్మిక్ కిరణాలను మట్టిప్రతిమ గ్రహించి, ఇంట్లోని వ్యక్తులకు, పరిసరాలకు ప్రసారం చేస్తుంది. ఒక రేడియో, తరంగాలను గ్రహించి, పాటలను ప్రసారం చేసినట్లు. బల్బు తీగల ద్వారా విద్యుత్‌ను గ్రహించి, కాంతిని ప్రసరించినట్టు. ఆ రోజు పాటించే నియమాలన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన తరంగాలను అధికంగా, సక్రమంగా గ్రహించడం కోసమే. అన్నిటికంటే ముందు నియమాల పాత్రతను ఇస్తాయి. అందువల్ల వినాయకిచవితి నాడు సంపూర్ణంగా గణపతి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు, ఆరోగ్యవంతమన జీవనం గడపాలనుకునేవారు శాస్త్రం చెప్పినట్టు గణపతి పూజ చేయడం ఉత్తమం. అందులో భాగంగా మట్టి గణపతినే పూజించడం, మద్యాహ్న సమయంలో వ్రతం చేయడం, ప్రాతఃకాలంలో తెల్ల నువ్వులతో తలస్నానం చేయడం, నూనె తగలకుండా, నేతితో చేసిన పదార్ధాలనే గణపతికి నివేదించడం, పత్రితో పూజించడం, బ్రహ్మచర్యం పాటించడం, తరువాత మట్టి గణపతిని స్థానిక జలవనరులో నిమజ్జనం చేయడం ప్రధానమైనవి.

కనుక మట్టిగణపతులనే పూజించండి, గణపతి అనుగ్రహానికి పాత్రులుకండి.

Thursday, 21 August 2014

భారతం వ్రాసిన గణపతి

ఓం గం గణపతయే నమః

మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుండగా వ్రాయడానికి ఒక లేఖకుడు (వ్రాసేవాడు) కావాలని భావించిన వ్యాసుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు. మహాభారత గ్రంధాన్ని వ్రాయగల సమర్ధుడు సిద్ధిబుద్ధి ప్రదాతయైన గణపతి ఒక్కడేనని, గణపతిని శరణువేడమని చెప్పారు బ్రహ్మ. వ్యాసుడు గణపతిని గురించి తపస్సు చేసి, గణపతిని ప్రసన్నం చేసుకుని విషయం చెప్పారు. మామూలుగా రాస్తే అందులో గొప్పతనం ఏముంటుంది? అందుకే గణపతి 'నేను వేగంగా భారతం వ్రాసే సమయంలో నా ఘంటం(కలం) ఎక్కడా ఆగకూడదు. నేను ఎక్కడ ఆగకుండా రాస్తాను, నీవు ఆగకుండా చెప్పాలి, మధ్యలో ఎక్కడైనా నీవు చెప్పడం ఆపేస్తే, ఇక నేను వ్రాయను, నువ్వు తడబడకుండా చెప్పాలి' అంటూ నియమం విధించాడు. సరేనన్న వ్యాసుడు, ' నేను చెప్పిన వాక్యాన్ని నీవు సంపూర్తిగా అర్దం చేసుకున్న తరువాతనే వ్రాయాలి' అంటూ మరొక నియమం విధించాడు.


ఇద్దరూ కలిసి బధ్రీనాథ్ ప్రాంతంలో కూర్చున్నారు. మహాభారతం ఇతిహాసం, పంచమ వేదం. శ్రీ మద్భగవద్గీత కూడా మహాభారతంలోనే ఉంటుంది. భారతంలో లేనిదేది లోకంలో ఉండదు. అటువంటి భారతాన్ని మామూలు ఘంటంతో వ్రాయడం గణపతికి నచ్చలేదు. గొప్పపనులు జరగాలంటే త్యాగాలు చేయాలని లోకానికి సందేశం ఇవ్వాలనుకున్నాడు వినాయకుడు. ఏనుగుకు అందాన్ని పెంచేవి దంతాలు. అందం పోతేపోయింది, లోకానికి గొప్పసందేశం ఒకటి అందుతుందని, నిరామయుడైన గణపతి తన దంతాన్ని విరిచి, ఘంటంగా ఉపయోగించాడు. ఆ విధంగా గణపతి ఏకదంతుడు అయ్యాడని ఒక కధ. దించిన తల ఎత్తకుండా, ఘంటం ఆపకుండా, ప్రతి పదాన్ని అర్ధం చేసుకుంటూ, ప్రతి అక్షరాన్ని మనం చేసుకుంటూ మహాభారతాన్ని పూర్తి చేసిన గణపతి, మనకు కూడా అంత బుద్ధిని ప్రసాదించాలని, సూక్షగ్రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.  

ఏకదంతం నమామ్యహం
ఓం గం గణపతయే నమః           

Wednesday, 20 August 2014

పత్రి పూజ గుర్తు చేస్తోంది

ఆయుర్వేదం ఒక ఉపవేదం. వేదం ప్రణవం నుంచి పుట్టింది. గణపతి ప్రణవస్వరూపుడు. అందుకే వినాయకుడికి అయుర్వేదమంటే ఇష్టం. ఆ కారణం చేతనే వినాయకచవితి రోజున మనం గణపతికి పత్రి పూజ చేస్తాం.

భూమి శివస్వరూపం, ప్రకృతి పార్వతీ స్వరూపం, భూమధ్య కేంద్రం గణపతి, భూమ్యాకర్షణ శక్తి కార్తికేయుడు/కూమారస్వామి. శివుడు పురుషుడైతే, పార్వతీ దేవి ప్రకృతి. ప్రకృతిపురుషుల బిడ్డగా అవతరించిన గణపతి ఈ రెండు తత్వాలకు అతీతమైనవాడని అంటోంది గణపతి అథర్వశీర్షం. అటువంటి సర్వాతీతమైన పరబ్రహ్మాన్ని శివ స్వరూపమైన మృత్తికతో గణపతిగా మలిచి, పార్వతీ స్వరూపమైన ప్రకృతిలో భాగమైన పత్రితో అర్చించిస్తున్నాం.

పత్రం అంటే ఆకు మాత్రమే కాదు, ఆత్మ కూడా. మనం పరమాత్మకు ఆత్మనివేదనం చేయాలి అంటే మనల్ని మనం ఆ పరమాత్మునకు సమర్పించుకోవాలి. ఆత్మనివేదనం నవవిధం భక్తులలో 9 వది. అత్యంత ఉత్కృష్టమైనది. అందుకు ప్రతీకగా పత్రిని సమర్పిస్తాం.

ఆయుర్వేదం గురించి చెప్పుకున్నాం కనుక ఒక్క మాట చెప్పుకుందాం. ప్రపంచంలోనే ఎటువంటు సైడ్-ఏఫెక్ట్స్ లేని ఔషధవిధానం ఆయుర్వేదం. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వలన మనిషిలో కలిగే వికృత మార్పే రోగం. ప్రకృతితో కలిసి సహజీవనం చేసే మనిషికి ప్రకృతిలో కలిగిన మార్పుల కారణంగా సంక్రమించే వ్యాధులను ప్రకృతి ద్వారా సహజమైన పద్ధతులలో నివారించడం, నయం చేసుకోవడం మన ఆయుర్వేదం యొక్క గొప్పతనం.  ఆయుర్వేదశాస్త్రాన్ని భరద్వాజ మహర్షి స్వర్గం నుంచి భూలోకానికి తీసుకువచ్చారట. భగవంతుని సృష్టిలో వ్యర్ధమన్న మాట లేదు. ఆయన చేసిన సృష్టిలో ప్రతీదీ ఉపయోగకరమైనదే, తన పాత్ర పోషించేదే. అట్లాగే ప్రకృతి ప్రసాదించిన అనేక వృక్షాల్లోనీ ఔషధ గుణాలను తెలుసుకున్న గొప్పతనం మహర్షులకే చెందుతుంది.

ప్రపంచదేశాలు మన దేశం మీద బయో-పైరసి అనే సరికొత్త యుద్ధం చేస్తున్నాయి. మన ఋషులచే రచించబడిన ఆయుర్వేద గ్రంధాలను దొంగిలించి వాటిలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆయా దేశాలు మన దేశంలో దొరికే ఆయుర్వేద మూలికల మీద మేధోహక్కులు, పేటెంట్ హక్కులు పొందుతున్నాయి. ఆయుర్వేద మూలికలలో మెగ్నీషియం శాతం అధికంగా ఉందని నివేదిక ఇచ్చిన అమెరికా, వాళ్ళ దేశంలో లభ్యంకాని, కేవలం భారత్‌లో మాత్రమే పెరిగే 30,000 భారతీయ ఆయుర్వేద మూలికల మీద అక్రమంగా పేటెంట్ హక్కులు పొందింది. 2007-08 మధ్య ఒకప్పుడు చైనా అధ్యక్షుడు భారత్‌కు వచ్చినప్పుడు, మన ప్రధానికి చైనా అధ్యక్షునికి వేప చెట్టును పరిచయం చేశారు. ఒక వేప చెట్టు 10 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుందని, వేపలోని ప్రతి భాగం ఔషధమేనని చెప్పారు. ఆ తర్వాత చైనా వెళ్ళి, దాదాపు 10 లక్షల వేప మొక్కలను చైనా వారు భారత్ నుంచి తీసుకుని అక్కడ నాటుకున్నారు. అక్కడితో ఆగకుండా వేప మూలాలు తమవేనని అబద్దాలు చెప్పి, వేప, కలబంద మీద హక్కులు పొందారు. అంతేందుకు మనం నిత్యం ఇంట్లో వాడే పసుపు మీద, మనం పవిత్రంగా భావించే దేశావాళీ ఆవు పేడ, మూత్రం మీద కూడా పేటెంట్‌లు పొందిందంటే మనం మన దేశ పట్ల ఎంత జాగ్రతతో వ్యవహరిస్తున్నామో అర్దమవుతుంది. మనకు సంబంధించిన అన్నిటిని విదేశాలు దోచుకుపోతుంటే మనం మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం. అవేమి పిచ్చి మొక్కలు కాదు, ఇంగ్లీష్ మందులకు తగ్గని వ్యాధులు కూడా ఆయుర్వేదపద్ధతులలో సమూలంగా తగ్గిపోతాయి. కనీసం ఇప్పటికైనా మనం(భారతీయులం) తిరిగి మన సంస్కృతి వైపు పయనించాలి. ప్రకృతిలో ఉన్న శక్తిని గ్రహించాలి. మనది అనుకున్న ప్రతిదానిని మన కాపాడుకోవాలి. మన ఆయుర్వేదం, మన ఆత్మగౌరవం.        

ఎబోలా, స్వైన్ ప్లూ మొదలైన వికృత రోగాలను మన దరిదాపులకు రాకుండా చేయగల శక్తి ఆయుర్వేద మూలికలకు ఉంది. వినాయకచవితికి కల్పంలో చెప్పబడిన పత్రిని కనుక సంపాదించి, 9 రోజులు పూజించినటైతే, ఎబోలా కాదు కదా, దాని జేజెమ్మ కూడా భారత్ జోలికి రాదు.

Tuesday, 19 August 2014

21 రకాల పత్రి - ఔషధ మూలికలు

గణపతి నవరాత్రులలో మనం పూజించే పత్రికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.

పత్రి పూజ యొక్క విశిష్టత గురించి ఈ లింక్ చూడగలరు
http://ecoganesha.blogspot.in/2013/09/blog-post_7739.html

21 రకాల పత్రి - ఔషధ మూలికలు

1) మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.

ఇది సమర్పించి గణపతిని 'ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి' అని అర్చించాలి.


2) బృహతీ పత్రం. భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గను, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.

అటువంటి బృహతీపత్రాన్ని 'ఓం గణాధిపాయ నమః - బృహతీ పత్రం పూజయామి' అంటూ గణపతికి సమర్పించాలి. 



3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి(షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి  గలవారు రోజు రెండూ ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. తాజా మారేడు ఆకుల రసన్ తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్ల కలక నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనె, మారేడు కాయలతో చేసిన ఔషధీయ రసాయనం చెవిటి రోగాన్ని పోగొడుతుంది. మారేడూ వ్రేళ్ళతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు. పచ్చి మారేడు కాయలు విరోచనాలను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. మారేడు వ్రేళ్ళు, ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం.

అటువంటి బిల్వపత్రాన్ని 'ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పుజాయామి' అంటూ గణపతికి అర్పించి పూజించాలి.


4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.

ఓం గజననాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి.


5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయింది, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటూ మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దేని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దెని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.

ఇలా ఎన్నో, ఇంకెన్నో ఔషధ గుణములు కలిగిన దత్తూర(ఉమ్మెత్త) పత్రాన్ని 'ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి' అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి.

ఓం గం గణపతయే నమః

6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి. అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.

'ఓం లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి' అంటూ గణపతికి బదరీ పత్రం సమర్పించాలి.

7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. రాజా ఉత్తరేణి ఆకుల రసం గాయాల నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. ఉత్తరేణి ఆకులతో తయారుచేసిన ఔషధ నూనె చెవుడుకు మందుగా పనిచేస్తుంది. మూత్రసంబంధిత వ్యాధులకు పనిచేస్తుంది ఉత్తరేణి.

పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.

'ఓం గుహాగ్రజాయ నమః - అపామర్గ పత్రం పూజయామి'

8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుంది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.

తులసి గురించి పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి
http://ecoganesha.blogspot.in/2013/11/blog-post_14.html

కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 'ఓం గజకర్ణాయ నమః - తులసి పత్రం పూజయామి' అంటూ గణపతికి తులసి పత్రాన్ని సమర్పించాలి.

9) చూత పత్రం : మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది.

లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడీచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్(ప్రాణవాయువు)ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.

ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి.

10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది. గన్నేరు ఆకులు తెఉంచి పాలు కారిన తరువాత, పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వరతీవ్రత తగ్గిపోతుంది. కానీ గన్నేరు పాలు ప్రమాదకరం కనుక కాస్త జాగ్రత్త వహించాలి.

'ఓం వికటాయ నమః - కరవీర పత్రం పూజయామి' అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి.

11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.

ఓం భిన్నదంతాయ నామః - విష్ణుక్రాంత పత్రం పూజయామి

12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పు
వ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

ఓం వటవే నమః - దాడిమీ పత్రం పూజయామి

13) దేవదారు : ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత  నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి 

14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

ఓం ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం పూజయామి

15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన  నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.

ఓం హేరంభాయ నమః - సింధువార పత్రం పూజయామి

16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.

ఓం శూర్పకర్ణాయ నమః - జాజి పత్రం సమర్పయామి


17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.

ఓం స్కంధాగ్రజాయ నమః - గండకీ పత్రం సమర్పయామి



18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

ఓం ఇభవక్త్రాయ నమః - శమీ పత్రం సమర్పయామి


19) ఆశ్వత్థపత్రం: రావి వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.

ఓం వినాయకాయ నమః - అశ్వత్థ పత్రం సమర్పయామి


20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.

ఓం సురసేవితాయ నమః - అర్జున పత్రం సమర్పయామి

21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది.

ఓం కపిలాయ నమః - అర్క పత్రం సమర్పయామి

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః - ఏకవింశతి పత్రాణి సమర్పయామి

Monday, 18 August 2014

పత్రి పూజ వెనకున్న సైంటిఫిక్ కారణం ఏమిటి?

ఓం గం గణపతయే నమః

పత్రి పూజ వెనకున్నశాస్త్రీయ కారణం ఏమిటి?

వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. చెట్లు త్వరగా పెరుగుతాయి. అదే సమయంలో రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి. మన గణపతికి సమర్పించే ఏకవింశతి పత్రాలను (21 రకాల పత్రిని) ముట్టుకోవడం వేత, వాసన పీల్చడం చేత ఈ కాలంలో వచ్చే అనేకానేక వ్యాధులు నివారించబడుతాయి. ఎందుకంటే ఈ 21 రకాల పత్రికి ఎన్నో అధ్భుతమైన ఔషధ గుణాలున్నాయి. మన స్వామికి సమర్పించిన పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించడం వలన, ఇంట్లో ఉన్న క్రిములను నశిస్తాయి.

9 రోజులపాటు వరసిద్ధి వినాయకుడికి పత్రిపూజ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి విగ్రహం వద్ద కూర్చుని భజనలు, నృత్యగీతాలతో గడుపుతాం కనుక, 9 రోజుల పాటు ఈ పత్రి నుంచి వచ్చే ఔషధ గుణాలు సమ్మిళ్ళితమైన వాయువు మన శరీరంలో రోగనిరోధక శక్తిని వృద్ధి చేసి, ఇంతకముందు చేరి ఉన్న రోగకారక క్రిములను నశింపజేసి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.

వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చి బురద నీరు చెరువుల్లో చేరుతుంది. ఆ నీటిలో క్రిములుంటాయి. ఆ నీరు తాగడం చేత అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ. అందుకే వినాయక ప్రతిమతో పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే, పత్రిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా నీటి శుద్ధి జరుగుతుంది. నీటిలో అసహజమైన రసాయనాలు కలిపి శుద్ధి చేసేకంటే, సహజమైన పద్దతిలో, ప్రకృతి ప్రసాదించిన ఓషధుల చేత నీటిని శుద్ధి చేయడం శ్రేయస్కరమని భావించారు మన పూర్వీకులు. అట్లాగే మనకు అవసరమైన నీటిని, భూమిని, గాలిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగలో ఉన్న రహస్యం. ఈ విధంగా ఒక ప్రాంతం, రాష్ట్రం, దేశమంతా చేయడం వలన అందరూ ఆరోగ్యంతో సంతొషంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన ప్రజలున్న దేశం మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది. దానికి దోహదం చేస్తున్నది వినాయకచవితి. అందుకే వినాయకచవితి ఆయుర్వేద ఆరోగ్య పండుగ అంటారు ఆయుర్వేద వైద్యులు  ఏల్చూరి రాజారంజిత్ గారు.

ఏదైనా ఒక పండుగ, లేదా పూజ చేస్తున్నామంటే, అది మనకు మాత్రమే కాదు, మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు చేయాలన్న తపన కలిగిన పరమ నిస్వార్ధపరులు మన ఋషులు.  ప్రతి పనిలోనూ విశ్వమానవ కల్యాణం గురించి కాంక్షించిన మహాపురుషులైన ఋషుల వారసత్వం మనదని సగర్వంగా చెప్పుకుందాం. ధర్మాన్ని, దేశాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం. భావితరాలకు అందిద్దాం.

ఓం గం గణపతయే నమః       

Sunday, 17 August 2014

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

గోపయ్య నల్లనా.. ఎందువలనా?
"అమ్మా.."
"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.
"నాకు కోపమొచ్చింది"
"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"
"ఏమో! వచ్చింది. అంతే!"
"సరే, వచ్చింది లే!"
"ఉహూ, ఎందుకూ? అని అడుగు"
"హ్మ్"
"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"
"అడిగాను లే , చెప్పు"
"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."
"పోన్లే, అన్నేగా!"
"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."
"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."
"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"
"అయితే!"
"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."
"నీ అంతవాడివి నువ్వే కన్నా!"
"అంటే?"
"గొప్పవాడివనీ.."
"గొప్ప కాదు నల్లవాడినట."
"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!"
"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.
"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"
"అంటే!"
"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు."
"ఏమో! అర్ధం కాలేదు."
"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"
"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."
"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"
"నేనే! నేనే!"
"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."
"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."
"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "
"అవునా!"
"హ్మ్.. "
"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."
"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."
"చీకటి అంటే ఏమిటీ?"
"చీకటి అంటే, ఏమీ కనిపించదు."
"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"
"అవును."
"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.
ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ.
తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.

సేకరణ: http://pittakathalu.blogspot.in/2011/08/blog-post.html

గణపతి అంటే ఎవరు?

ఓం గం గణపతయే నమః

గణపతి తత్వం : గణపతి అంటే ఎవరు?

1) పంచ జ్ఞానేంద్రియములు (కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము)
2) పంచ కర్మేంద్రియాలు(కాళ్ళు, చేతులు, నోరు, పాయువు(మలద్వారము), పిపస్థ(మూత్రద్వారము)
3) పంచ భూతములు (ఆకాశం, వాయువు, అగ్ని, జలము, మట్టి/పృధ్వీ/భూమి)
4) పంచప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేవి పంచప్రాణాలు)
5) కామము(కోరిక)
6) కర్మ
7) అవిద్య
8) మనస్సు

ఈ 8 అంగాలతో దేహ నిర్మాణం జరిగింది. మన దేహాన్ని పురము అని కూడా అంటుంది శాస్త్రం. ఈ ఎనిమిది అంగాలతో కూడిన పురం కనుక, 'పుర్యష్టకం' అంటారు. ఈ పుర్యష్టకమే(శరీరమే) గణం. దీనికి అధిపతి గణపతి అంటున్నాయి శాస్త్రాలు. అంటే సర్వజీవుల యందు అంతర్లీనంగా ఉంటూ అందరిని నడిపించేవాడూ, జీవంపజేసేవాడు ఎవరో, అతడే గణపతి.


ఓం గం గణపతయే నమః  

Thursday, 14 August 2014

మట్టి గణపతి - చెరువుల సంరక్షణ

ఓం గం గణపతయే నమః

వినాయకచవితికి మట్టి ప్రతిమలనే పూజించడం వెనుక సామాజిక, శాస్త్రీయ కారణం కూడా ఉంది. వినాయక చవితి వర్షఋతువు చివరలో వస్తుంది. వర్షాలు సమృద్దిగా కురిసే కాలం ఇది. మన పూర్వీకులకు ఎంతో మేధా శక్తి ఉంది. ఈ ప్రపంచంలో తొలిసారిగా వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి ఆ నీటిని భవిష్యత్తు అవసరాలకు వాడాలనే ఆలోచన వాళ్ళకే కలిగింది.  అది ఆదిపూజ్యుడైన గణనాధుడి ఆరాధనతో ముడిపెట్టారు.

ఎండాకాలంలో చెరువుల్లో నీరు తగ్గుతుంది. వర్షాకాలం రాకముందే ఆ చెరువుల్లో ఉన్న బురుదను బయటకు తీయాలి. అలా చేయడం వల్ల వాననీటిని అధికంగా నిలువ చేసుకునే సామర్ధ్యం చెరువుకు ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు కురుసి చెరువు నిండుతుంది. నిండిన చెరువులో మట్టిని వేయడం వలన అది బురుదగా మారి, చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది. ఏ బంకమట్టినైతే వర్షాలు మొదలవకముందు పూడిక తీస్తారో, ఆ బంకమట్టితోనే వరసిద్ధి వినాయకుడి ప్రతిమను చేసి పూజించి, ఆఖరున ఆ మట్టి విగ్రహాన్ని అదే చెరువులో నిమజ్జనం చెస్తారు. మట్టి విగ్రహం తయారు చేయడం కోసం పూడిక తీయడం, నిమజ్జనంతో తిరిగి చెరువులో మట్టిని వేయడం జరిగిపోతుంది. ఇది మట్టి వినాయక ప్రతిమనే పూజించడం వెనుక ఉన్న సామాజిక కారణం.

ఒక ప్రక్క ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని, మరొకప్రక్క నీటిని ఒడిసిపడుతూ వాననీటిరక్షణ ప్రచారాన్ని, చెరువులను కాపాడుతూ చెరువుల రక్షణను, పర్యావరణ పరిరక్షణను, అందరు కలిసి ఆ మట్టిని తీయడం,దాన్ని అందరు కలిసి చెరువులో ఒకే రోజున కలపడం ద్వారా ప్రజల మధ్య ఐక్యతను,బంధాన్ని పెంపొందిస్తూ, అందరికి సామాజిక బాధ్యతను అలవాటు చేసింది మన హిందూ సమాజం, వైదిక సంస్కృతి. ఇది మన పురాతనమైన సనాతన సంస్కృతి.

కానీ ఈ రోజున జరుగుతున్నది ఇందుకు పూర్తి విరుద్ధం. మనం సంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోయాం. ఆధునికపోకడలతో మట్టి విగ్రహాలకు బదులు ప్రకృతికి హాని తలపెట్టే ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాలను పూజించి, చెరువుల్లో నిమజ్జనం చేసి, చెరువులను, భూగర్భ జలాలను పాడు చేస్తున్నాం. చెరువులు, నదులు, సముద్రాల్లో ఉందే జీవరాశుల మరణానికి కారణమై పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. నిమజ్జనం చేసిన విగ్రహం నీటిలో కరగీ కరగక, దుర్గంధమైన నీటిలో గణపతిని కలిపి పరమాత్మను అవమానిస్తున్నాం. చెరువుల నిండా బురద నిండి, అది తీసేవాడు లేక ఇబ్బందిపడుతుంటే, పండుగ పేరుతో రసాయనాలతో చెరువులను మరింతగా పూడుస్తూ, జలవనరులను నాశనం చేసుకుంటున్నాం.             

సంప్రదాయబద్దంగా పర్యావరణహితమైన వినాయక చవితినే జరుపుకుందాం.పర్యావరణాన్ని కాపడుకుందాం.మట్టి ప్రతిమలను మాత్రమే పూజిద్దాం. సంప్రదాయాన్ని రక్షించుకుందాం.   

ఓం గం గణపతయే నమః  

Wednesday, 13 August 2014

గణపతి - పంచీకరణం

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. అసలేంటీ పంచీకరణం అంటే?

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మన్నుతోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి.  దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్ని ఒక్కడినే చేరుతాయి.  వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలు, విగ్రహంతో పాటూ నీళ్ళలో కలపడం వలన ఆ నీళ్ళలో కాలుష్యం హరించబడుతుంది. రోగకారక క్రిములు నశిస్తాయి.

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వశుభప్రదం, మంగళప్రదం.

ఓం గం గణపతయే నమః

Umbrella Effect of Earthing

A ‘grounded’ human being is someone who is connected to and receives direct benefit from the infinite free electron source generated directly from our planet. We’re grounded when we hold the same electrical potential as the Earth’s surface. Electrons are absorbed or discharged via the skin, mainly through our feet in contact with the ground. This is an ancient and profound yet hugely common sense principle of well-being that’s currently resurging amidst enthusiastic stories of its success.

It’s well accepted that electrical systems of our homes or sophisticated electrical equipment must be grounded to function safely and effectively. But how much have we considered the human body as being fundamentally bio-electric in nature, also working more optimally with grounding, and suffering adverse effects from the lack of it?

The universe is all about energy! Simply put, energy is universal information in motion within and around everything. It’s very fast moving so we perceive only a very small percentage of it through our five senses; usually, we can notice only its effects (think radio signals, ultrasound, or even love).
Its electrical charge is that spark of life that animates us, and has been well regarded for thousands of years primarily by eastern and indigenous cultures – who’ve actua
lly studied its properties and called it by many names – Chi, Qi, Ki, Life Force energy, prana, mana, orgone, electrons, Shakti, kundalini, and more.

Our universe is alive due to interactions of energy. All our thoughts including perceptions, beliefs, wants and needs, all our emotions and feelings, our sensations and movements, and our anima or spirit are the outcomes of this essential substrate of energy.

Surrounding and permeating each living thing– from this living, breathing planet down to the smallest single cell organism – is a bio-electromagnetic field. This field is a function of the vitality present in that being. In another’s presence you may sense this as radiance or a glow. Or you feel a charge of electricity when approaching someone with whom you share a mutual attraction. We’ve all felt surprise due to shocks by static electricity; at those moments we’re a conductor for that excess charge. On a much grander scale, the more than 5,000 lightning strikes per minute globally constantly refresh the Earth’s almost unlimited supply of free electrons. To illuminate how immensely powerful this force is, a single lightning storm can contain more energy than ten atomic bombs.

All our body’s trillions of cells function electrically. Each cell is like a battery; it runs at a specific millivoltage and frequency. Generally speaking, disease is caused when cells have too little voltage and are running at too low a frequency. Ultimately our health depends on the electrical charge maintained within and around our cells and our organ systems.

The body seeks to maintain homeostasis– a state of balance. Unstable, highly reactive free radical molecules (caused by tobacco smoke, sugars, x-rays, pollution, etc) have unpaired or ‘stray’ electrons so they ‘steal’ electrons from healthier cells to regain stability. But this causes oxidative damage to those cells that then also turn into free radicals and thus a chain reaction of damage begins. Inflammation, disease and aging are attributed to this free radical damage. Antioxidants help reduce damage from free radical reactions because they donate electrons which neutralize the radical without forming another. The influx of electrons from grounding provides an externally sourced natural antioxidant effect, and gives the body another raw material to heal itself.

A simple voltmeter test offers direct evidence how grounding eliminates excess electrical charge (and thus helps inflammation), by bringing the body into electrical balance with the Earth. For energy-depleted persons, grounding helps by uploading vital electrons, reenergizing the body’s’ electrical state. Its energy continuously works towards our body homeostasis by either delivering or absorbing electrons. Grounding balances us and helps us feel whole again. Who wouldn’t want this infinitely huge vital life force on her or his side, available 24/7 towards greater health and a sense of well being?

Our ancestors lived much more closely to the earth on dirt floor dwellings, often slept on the ground perhaps under stars, and worked daily barefoot or shod with minimal foot coverings. There was an awareness and respect for influential cycles of nature and the ebb and flow of life. Seasonal rituals and ceremonies were hallmarks of celebrating Nature.

Remember the barefoot joy you felt running around outside as a child? Where did that joy go? Collectively we’re driven almost nonstop to be acquisition motivated by consumerist mentality, constantly pressured by high living costs and economic disparity, and are ill from effects of degraded air, water and genetically and chemically modified, irradiated, pesticide treated foods. Megacorporations trump rights of individuals while depleting precious natural resources. The needs of the many are preempted by and for the wants of a few. We’ve insulated ourselves from Nature. We live mostly indoors, and walk in synthetic footwear and high heels on asphalt and carpets. We are swimming (drowning?) in an ever-growing and pervasive invisible sea of harmful electromagnetic fields and frequencies (EMF). Face it – we’re stressed out!

Unlike all other species ever to have lived on this planet, it seems that overall our human race has lost our way, our essential connection to this paradise, and our ability to live sustainably. We often forget or ignore that it’s only by this grace and generosity of the Earth our original and true mother, that we may sustain this physical life at all. Our survival as a species is intimately linked to a healthy relationship with our environment.

So tell me – are you communing lovingly with Nature? Do you feel gratitude as She feeds you, quenches your thirst and washes you, clothes you, breathes life into you, soothes your soul with Her beauty, Her breath, Her songs? Do you feel a healthy respect and awe for Her enormous elemental powers of creation, sustenance, and destruction? Do you have a direct, up close and personal relationship with Her? How do you feel Her, touch Her, smell Her, taste Her? When last did you lay your body down on this Earth and exhale a sigh of relief?

Perhaps now in this eleventh hour, after so much worldly suffering, stress and angst, we will personally activate change by taking a step or two – barefoot steps – onto the living earth, to simply be present to the enormous power we stand upon. Such a basic action of a single human being reverberates throughout the entire cosmos. Imagine how we may create a larger shift when we get grounded by the millions.

Here’s the easiest way to ground yourself: Go barefoot on Earth – walk, lie down, stand, or sit in a chair with your feet on the ground for awhile each day. You could begin with just twenty minutes daily…longer and more often is even better. On damp earth or at water’s edge is best, as moisture enhances conductivity. Our tissues know how to ‘soak up’ and use these electrons so that, over time, our bodies may recharge and heal.

by Hema Simondes

Source: http://discoveryouraura.blogspot.in/2013/12/umbrella-effect-of-earthing.html