వైదిక పదాలకు ప్రామాణికమైన నిఘంటువు (Dictionary) రాసింది యాస్కాచార్యులు (యాస్కుడు). ఆయన కాలంలో ఒక్క యజ్ఞంలో కూడా జంతుబలి లేదు. యాస్కుడు జంతువధ గురించి వివరించే 33 ధాతువులను ఆ నిఘంటువులో ప్రస్తావించగా, అందులో ఒక్క ధాతువు కూడా యజ్ఞంలో జంతుబలి గురించి ప్రస్తావించలేదు. వేదానువాదానికి వేదాంగమైన నిరుక్తమే ప్రమాణం కానీ విదేశీయులు తమకు తోచినట్టు రాసిన భాష్యాలు కాదు.
మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.
అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.
మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.
అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.
యజ్ఞంలో 'అజ'ను ఆహుతిగా వేయాలని చెప్పబడింది. అజ అంటే మగమేక అని అర్దం చెప్పారు. కానీ యజ్ఞంలో విషయంలో ఆ అర్దం తప్పు. యజ్ఞంలో అజ అంటే మొలకెత్తడానికి పనికిరాని పాత విత్తనాలు అని అర్దం. అందువల యజ్ఞంలో మగ మేకను బలివ్వకూడదు, పాతవిత్తనాలను ఆహుతివ్వాలి - మహాభారతం శాంతిపర్వం 337 వ అధ్యాయం.
పాపకార్యాలు చేసేవారు మాంసం తినాలన్న తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసం జంతువులను భూతయజ్ఞం (భూతయజ్ఞం అంటే జంతువులకు ఆహారం అందించడం. సనాతనధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు ఆచరించాల్సిన పంచ మహాయజ్ఞాల్లో ఒకటి.), పితృ యజ్ఞం నెపంతో బలి ఇస్తారు - శ్రీ మద్భాగవతం 11 వ స్కందం, 5 వ అధ్యాయం.
ఇక్కడ మాంసాహారులను దూషించలేదు. మాంసం తినడం ధర్మంలో కొన్ని వర్ణాలకు తప్పుకాదు. కానీ ఆధ్యాత్మిక జీవనం గడపాలి, ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని తపించే సాధకులు, వారు ఏ వర్ణంలో పుట్టినా, ఆధ్యాత్మిక జీవన ఆరంభంలోనే మాంసాహారాన్ని విడిచిపెట్టాలని గ్రంధాలన్ని స్పష్టంగా చెప్తున్నాయి. కేవలం మాంసాహారాన్ని విడిచిపెట్టడం కాక, మితసాత్త్వికాహార నియమం విధించాయి. శాఖాహారంలో కూడా సాత్త్వికాహారాన్నే స్వీకరించాలని, అప్పుడు మాత్రమే మనస్సు శుద్ధి అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆహారశుద్ధ్వే సత్త్వశుద్ధిః అని ఉపనిషత్తు చెప్పింది. అయితే ఇక్కడ పాపకార్యాలు చేసేవారని అన్నది తమ రుచి కోసం మాంసం తినాలని నిశ్చయించుకుని, దానికి యజ్ఞాన్ని, దైవాన్ని నెపంగా పెట్టి, దేవుడికి బలి ఇచ్చాం కనుక తింటున్నాం చెప్పేవారిని. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ధర్మం దేశకాలాలను అనుసరించి మారుతుంది. బ్రాహ్మణుడు ఎప్పుడూ మాంసాహారం తినకూడదు. అదే సైనికుడి (క్షత్రియుడి) విషయంలోకి వస్తే, అతడు పని చేసే ప్రదేశంలో అన్ని రకాల ఆహారం దొరకకపోవచ్చు. దొరికినవి బలమైనవి కాకపోవచ్చు. అప్పుడు అతడికి ఇలాంటి ఆహార నియమాలు ఉండవు. తన శరీరాన్ని తాను బలంగా, పుష్టిగా ఉంచుకున్నప్పుడే క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాడు. కనుక స్వధర్మ రక్షణ కోసం అతడు భుజించవచ్చు.
యజ్ఞాల్లో జంతుబలి ఇచ్చేవారు మూర్ఖులు. వాళ్ళకి వేదహృదయం అర్దం కాలేదు - పంచతంత్రంలో 3 వ తంత్రం, 2 వ కధ)
ఇలా సంస్కృత వాజ్ఞమయంలో అనేక చోట్ల వేదంలో హింసలేదని చెప్పబడడమే కాదు, ఎక్కడైనా ధర్మాన్ని అడ్డంగా పెట్టుకుని హింస చేస్తే, అది అధర్మమని ఖండించబడింది.
సేకరణ - వెజిటెరినిజం అండ్ ది వేదాస్ - అరుణభ్ తల్వార్
To be continued ..............
No comments:
Post a Comment