Saturday, 21 May 2016

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన - అన్నమయ్య కీర్తన



ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ||

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు |

తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు |

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు |

సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ||

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు |

శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ||

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 

2 comments:

  1. ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. ధన్యవాదాలు. గీతలో కూడా ఏ యధామాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహం అనే శ్లోకం ఉంది కదా....

    ReplyDelete
    Replies
    1. అవునండి, ఏ రూపంలో కొలిచినా, ఆయన అనుగ్రహిస్తానన్నాడు.శివార్పణమండి

      Delete