శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు పిచ్చిరాతలు రాయడమేమిటి? ఈ హిందువా! మేలుకో! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.
శంకర జయంతి శుభాకాంక్షలు.
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ||
జయ జయ శంకర హర హర శంకర
ప్రజాపితా జ్ఞానం లో కూడా మనలను మనం శరీరం కాము ఆత్మ అనుకోమని చెబుతుంది. ప్రతీ 5 వేల సంవత్సరాలకూ ఒక సారి కల్పం అంటే 4 యుగాల సమాహారం పునరావృతం అవుతుందని ప్రజాపితా బ్రహ్మకుమారీ జ్ఞానం చెబుతుంది. ఆ రకంగా కల్పాంతంలో స్వయం పరమపిత పరమాత్మ ఈ భూమిపై అవతరించి కలియుగ అంతం సత్యయుగ(కృతయుగ) ఆరంభంచేస్తారని చెబుతుంది. దానినే సంగమయుగం అంటారని సంగమం అంటే ఆత్మ పరమాత్మల కలయిక అని చెబుతారు. ప్రస్తుతం ఆ సంగమయుగం జరుగుతున్నది మీరేమంటారో మరి(ప్రశ్న) యుగపురుషుడు ఉద్భవించాడు కలియుగ అంతం సత్యయుగ ఆరంభం జరుగుతున్నది. కానీ గుప్తంగా జరుగుతున్నది. త్వరలో ప్రత్యక్షంకానుంది. మార్పు తప్పదు కదా, అవునా అంతేనా....
ReplyDeleteవామరాజు రమణ గారు చెప్పిన విషయాలు చిత్రంగా ఉన్నాయి. మీ రేమంటారో అన్నారు కాబట్టి నా అభిప్రాయం చెబుతున్నాను. 5వేల సం॥ కాలానికి ఒక కల్పం అనటం సరికాదు. అది ఆర్షవాంగ్మయంలో ప్రామాణికమైన కాలావధి కానే కాదు. కలియుగం యొక్క కాలప్రమాణమే 4,32,000 సం॥ అని ప్రమాణం ఉండగా, చతుర్యుగాలు కలపి దానికి పదిరెట్లుగా అనగా 43,20,000 సం॥ కాలప్రమాణాన్ని మహాయుగంగానూ, అటువంటి 71మహాయుగాల ప్రమాణ కాలాన్ని ఒక మన్వంతరంగాను, 14 మన్వంతరాల కాలాన్ని ఒక కల్పంగానూ మనకి ఒక లెక్క ఉన్నది. యుగసంధుల వంటి వాటితో కలసి కల్పం యొక్క కాలప్రమాణం 432,00,00,000 సం॥. మీ కొత్తమతంలో 5000 సం॥ ఒక కల్పాన్ని కానిచ్చేస్తున్నారు! ఇంకా యేవేవో వ్రాసారు. అవునా అంతేనా అంటున్నారు. కాదు కాదు అనవలసి వస్తున్నది!
Delete