Sunday, 31 July 2016

సద్గురు శివానంద మూర్తి సూక్తి


One should live for Dharma. Leading a Dharmic life is a reward in itself. No Aryan would ever seek a reward for upholding Dharma. It is only through Dharma that one can workout one′s life and become eligible for spirituality. If you skip this vital step, you will trip. After all, if there was no Dharma, what is there to live for?


Satguru Sivananda Murty Garu 

హిందూ ధర్మం - 219 (జ్యోతిష్యం - 1)

జ్యోతిష్యం - ఇది  6 వ వేదాంగం. వేదానికి ఇది కన్ను వంటిది. జ్యోతిష్యం అనగా కాంతికి సంబంధించిన శాస్త్రం. ఖగోళ శాస్త్రం (Astronomy), ఫలిత జ్యోతిష్యం (Astrology), విద్యుత్-అయస్కాంత శాస్త్రం (Electro-Magnetism) మొదలైన ఎన్నో శాస్త్రాలు ఇందులో అంతర్భాగాలు. జ్యోతిష్యం అనగానే గ్రహాలు, దశలు, అంతర్దశలతో, వ్యక్తుల భవిష్యత్తును చెప్పే జ్యోతిష్యం అనుకుంటారు చాలామంది. అది ఫలిత జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతానికి సంబంధించిన శాస్త్రం. వ్యక్తి జన్మించిన సమయాన్ని ఆధారంగా చేసుకుని, అతడు పూర్వ జన్మలో ఏ కర్మ చేయడం వలన ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తున్నాడో, తిరిగి ఎలాంటి దుష్కర్మలు చేయకుండా ఉండటం వలన, పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకోవడం వలన ఉన్నతిని పొందగలడో, ఆ జ్యోతిష్యం చెప్తుంది. వ్యక్తి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకునే వేసే రాశిచక్రంలోని గ్రహాలు అతడు చేసిన కర్మలకు సంకేతాలు. అవి అంతరిక్షంలో ఉన్న గ్రహాలు కావు. గత జన్మలో అతడు ఇతరులను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసి ఉంటే, ఈ జన్మలో చంద్రదోషం ఏర్పడి, పిచ్చివాడిగా మారిపోతాడు. కాస్త తక్కువ స్థాయిలో ఇతరులను మానసికంగా హింసించినవారు, భయపెట్టినవారు, ఈ జన్మలో మానసిక సమస్యలతో, క్షోభతో బాధపడతారు. ఇలా జన్మకుండలిలో ఒక్కో గ్రహం, అది ఉన్న స్థానాన్ని అనుసరించి, అతడి కర్మను తెలియజేస్తుంది. అందుకే దాని గురించి చెప్తూ 'కర్మఫల విపాక కాల విధానం' అని సంస్కృతంలో వివరించారు.

అది కాక గణిత జ్యోతిష్యం అని ఉంది. ఇది అంతరిక్షంలో ఉన్న గ్రహాల గురించి, వివిధ రకాలైన కాంతుల (rays) గురించి, ఉదాహరణకు - ఎక్స్‌రే (X rays), గామ కిరణాలు (gamma), అంతరిక్షం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత్ తరంగాలు, వివిధ కిరణాలు, గ్రహణాలు, భ్రమణాలు, నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్ర మండలాలు (Galaxies), విశ్వ ఆవిర్భావం (cosmology)మొదలైన అనేక విషయాల గురించి వివరిస్తుంది. ఫలిత జ్యోతిష్యానికి దీనికి పరస్పర సంబంధం ఉన్నా, ఫలితజ్యోతిష్యమే ఇందులోని అంతర్భాగం.

ఈశ్వరుడిచ్చిన వేదానికి అనుగుణంగా ధర్మాన్ని నిర్వర్తించాలి. అందుకు దేశకాలాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. ధర్మం దేశకాలాలను అనుసరించి మారుతుంది. నిత్య కర్మలు ప్రతి రోజూ, నైమిత్తిక కర్మలను శాస్త్రం నిర్దేశించిన తిధులలోనే చేయాలి. ఉదాహరణకు అగ్నిహోత్రం నిత్యకర్మ. ఉదయ సంధ్యలో, సాయంసంధ్యలో నిర్వహించాలి. అది కూడా సరైన సమయంలో ఆహుతిస్తేనే ఫలితం ఉంటుంది. దానికి కాలగణన అవసరం. పంటలు వేయాలన్నా, ఎప్పుడు వేస్తే చక్కని వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా వస్తాయో తెలిసి ఉండాలి. అందుకోసం కూడా కాలవిజ్ఞానం అవసరం. అతిరాత్రం, గోమేధం మొదలైన యాగాలు చేయాలంటే ఋతువులు, గ్రహాల కదలికలను తెలుసుకొని ఉండాలి. అంతరిక్షానికి సంబంధించిన విజ్ఞానం అవసరం. అలాగే కాలంలో జరిగిన సంఘటనలను నమోదు చేయాలన్నా, దానికి కూడా కాలగణన ఉండి తీరాలి. ఇలాంటి అవసరాల కోసం అభివృద్ధి చేసిందే వేదాంగ జ్యోతిష్యం. అయితే మన ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి శాస్త్రము ఇతర శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఏ ఒక్కటీ ఇతర వాటి నుంచి దూరంగా, సంబంధం లేకుండా ఉండదు. ఒక శాస్త్రంలో చెప్పబడిన అంశానికి వివరణ, లేదా ఇంకొంత సమాచారం వెరొక శాస్త్రంలో ఉంటుంది. అలాగే జ్యోతిష్యానికి, కల్పం, శుల్బ సుత్రాలు, వ్యవసాయం మొదలైన అనేక శాస్త్రాలతో పరస్పరం సంబంధం కలిగి ఉండి, ఒక శాస్త్రం అభివృద్ధి చెందితే, అది మిగితావాటి అభివృద్ధికి తోడ్పడుతుంది.

ఇక్కడ ఇది కేవలం అంతరిక్షానికి సంబంధించిన గణన గురించే చెప్పదు. నిత్య జీవితంలో కాలాన్ని లెక్కించడం గురించి చెప్తుంది. అయితే కాలం ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ప్రతిమూల ఒకే సమయంలో ఒకే విధమైన సమయం ఉండదు, ఋతువు ఉండవు. రేఖాంశం (longitude) మరియు అక్షాంశాల (latitude) మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశకాలాలకు (Time and space) సంబంధించిన శాస్త్రాలు కూడా ఈ శాస్త్రంలో అంతర్భాగాలే.

To be continued .................

Saturday, 30 July 2016

Wednesday, 27 July 2016

భారతీ తీర్ధ స్వామి సూక్తి



The Shastras say that the merit of charity is reduced once you publicise the charity you have performed. Never publicise your charity. - Sri Sri Bharati Tirtha Mahaswamigal

Tuesday, 26 July 2016

వైరాగ్యం గురించి అభినవ విద్యాతీర్ధ స్వామి సూక్తి



People are often devoid of dispassion. The reason for this is the lack of discrimination. Dispassion may dawn due to some calamity but that dispassion is only temporary. Only that dispassion that results from discrimination is lasting. The importance of burning dispassion can never be over-emphasized. It would not be wrong to say that much of the trouble which people encounter in controlling the mind is due to want of Vairagyam.

HH Sri Abhinava Vidyatirtha Mahaswamigal

Monday, 25 July 2016

కంచి పరమాచార్య స్వామి సూక్తి


Great souls who had gained divine power had, with their Jnana Dhrishti, seen wonderful scenes which we cannot see and have described the Divine Murthis they had seen. They heard wonderful sounds which we cannot hear and had given them to us as Mantras.– Paramacharya

ఓం ఉగ్రాయ నమః


Sunday, 24 July 2016

సద్గురు శివానంద మూర్తి సూక్తి


God is reached not through dry desirelessness but through Dharmic satiation.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 218 (శుల్బసూత్రాలు - 3)

బౌద్ధాయన శుల్బ సూత్రాలు చత్రురస్రం, దీర్ఘచతురస్రం వంటి రేఖాగణిత ఆకారాల నిర్మాణం గురించే కాక వాటి వైశాల్యం మారకుండా ఒక ఆకారం నుంచి వేరొక ఆకారనికి మార్చే పద్ధతులను కూడా వివరిస్తున్నాయి. ఇందులో చత్రురస్రాన్ని ధీరచత్రురస్రంగా, సమద్విబాహు సమలంబ చత్రుభుజంగా, సమద్విబాహు త్రిభుజంగా, సమాంతర చతుర్భుజం, వృత్తంగా, వృతాన్ని చతురస్రంగా మార్చే ఎన్నో స్పష్టమైన సూత్రాలు ఉన్నాయి.

భౌద్ధాయన సూత్రం 2.10 - వృత్తాన్ని చతురస్రంగా మార్చాలనుకుంటే, దాని వ్యాసాన్ని 8 భాగాలుగా విభజించాలి. అందులో ఒక్కో భాగాన్ని 29 భాగాలుగా, మళ్ళీ దాన్ని 28 భాగాలుగా, తర్వాత 6 గా విభజించి, దాన్నుంచి 8 బ భాగాన్ని తగించాలి.
(2.10. To transform a circle into a square, the diameter is divided into eight parts; one [such] part after being divided into twenty-nine parts is reduced by twenty-eight of them and further by the sixth [of the part left] less the eighth [of the sixth part].)

భౌద్ధాయన సూత్రం - 2.11 - లేదంటే వ్యాసాన్ని 15 భాగాలుగా విభజించి, దాన్ని రెండుకు కుదించాలి. అప్పుడు అది చతురస్రం యొక్క ఒక వైపుకు సమానంగా ఉంటుంది.
2.11. Alternatively, divide [the diameter] into fifteen parts and reduce it by two of them; this gives the approximate side of the square [desired].

యజ్ఞవేది నిర్మాణం 2 వర్గాన్ని కనుక్కోవటానికి ఉపయోగపడింది. ఇటువంటి సూత్రాలు 3 ఉన్నాయి.

భౌద్ధాయన సూత్రం 2.12 - కొలతను మూడవ వంతు పెంచి, ఇందులో నాల్గవ వంతును పెంచి, దాని నుంచి 3/4 వ వంతును కుదించాలి. అప్పుడు చతురస్రం యొక్క వికర్ణం వస్తుంది.
2.12. The measure is to be increased by its third and this [third] again by its own fourth less the thirty-fourth part [of that fourth]; this is [the value of] the diagonal of a square [whose side is the measure].

అది 2 వర్గానికి (Square root of 2) దారితీస్తుంది.

ఇలా ఎన్నో సూత్రాలు శుల్బ సూత్రాల్లో ఉన్నాయి.

గ్రీకులు ఎంతో గొప్పగా చెప్పుకునే పైధాగోరస్ విద్యాభ్యాసం గంగా తీరంలో జరిగిందని, అతని ద్వారానే బౌద్ధాయన సూత్రం, గణితం పశ్చిమ దేశాలకు వెళ్ళాయని అనేకమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పైధాగోరస్, అప్పటి వరకు గ్రీకులో లేని కొత్త విషయాలను నమ్మేవాడట. వాటిలో ప్రధానమైనవి ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశించడం, ఉపనిషత్తుల్లో ఉండే విషయాలను ఆయన రచనల్లో ప్రస్తావించడం, బౌద్ధుల వలే చిక్కుడుకాయలు తినకపోవడం, మాంసాహారనికి దూరంగా ఉండమని చెప్పడం మొదలైనవి.

పైధాగోరస్ భారతీయ తాత్త్వికత చేత ప్రభావితమయ్యాడు. అతను చెప్పిన దాదాపు అన్ని సిద్ధాంతాలు, మతపరమైన, తాత్త్వికమైన, గణిత సిద్ధాంతాలన్నీ  క్రీ.పూ. 6 వ శత్బాదం నాటికే భారత్ లో చెప్పబడ్డాయి - ప్రొఫెస్సర్ ఆర్.జి. రాలిన్‌సన్

ప్రముఖ ఫ్రెంచి తత్త్వవేత్త, గొప్ప రచయిత, అసమానత, అన్యాయం మీద గొంతెత్తారు ఫ్రాంకొయిస్ ఎం.ఏ. వొల్టాయిర్ (1694-1774). అతనంటాడు మనం (ఐరోపా వాళ్ళం) దుష్టలక్షణాల్లో భారతీయులను ఎంతో దాటిపోయాము. జ్ఞానంలో వాళ్ళ ముందు అధములము. ఎక్కడికెళ్ళినా డబ్బు కోసమే వెతుకుతూ యూరోపియన్ దేశాలు ఒకదాన్ని మరొకటి పరస్పరం నాశనం చేసుకున్నాయి. ఒకప్పుడు గ్రీకు తాము నేర్చుకోవడానికి వెళ్ళిన భారతదేశానికి ఇప్పుడు మనం డబ్బు కోసం వెళుతున్నాము.

ఆధ్యాత్మికత, జ్యోతిష్యం మొదలైనవన్నీ గంగాతీరం నుంచి వచ్చాయని నేను గట్టిగా ఒప్పుకుంటాను. ముఖ్యంగా గుర్తించవలసిదేమిటంటే 2500 ఏళ్ళ క్రితం పైధాగోరస్ రేఖాగణితం నేర్చుకోవడానికి సమొస్ నుంచి గంగా తీరానికి వెళ్ళాడు .... అప్పటికే బ్రాహ్మణుల విజ్ఞానశాస్త్రం యూరోప్ లో స్థాపించబడి ఉండకపోతే, అతడు అటువంటి అసాధారణమైన యాత్ర చేపట్టి ఉండేవాడు కాదు.

ఈ విషయాలను ది ఇన్వేషన్ థట్ నెవర్ వాస్ అనే గ్రంధంలో మైకిల్ డానినో, సుజాత నాహర్ పొందుపరిచారు. 2500 ఏళ్ళ క్రితమే ఐరోపాలో భారతీయ జ్ఞాన సంపద విద్యాలయల ద్వారా బోధించబడేదని అతని ఉద్దేశం.

To be continued ......................


Saturday, 23 July 2016

పిల్లల పెంపకం గురించి స్వామి శివానంద



In Southern India, when children cry out in houses parents frighten them by saying: “Look here, Balu! Irendukannan (the two-eyed man) has come. Keep quiet, or I will hand you over to this man.” “Puchandi (or ghost) has come,” and suggestions of this sort are very destructive. The child becomes timid. The minds of children are elastic, tender and pliable. Samskaras are indelibly impressed at this age. Changing or obliterating the Samskaras becomes impossible when they grow. When the child grows into a man, he manifests timidity.

- Swami Sivananda 

‎కబాలి‬ - కపాలి - కపాలేశ్వర స్వామి

‎కబాలి‬ అనేది తమిళపదం. కపాలి అనే పదం నుంచి వచ్చింది. తమిళ భాషలో ప లేదు కనుక బ అని ఉపయోగించారు. కపాలి అంటే శివుడు. చెన్నైలోని మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడి కోసం ఉమా దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి మైలాపూర్ అని పేరు వచ్చింది. ఈ స్థలపురాణం ఇదే దేవాలయంలో స్థల వృక్షమైన పున్నాగ చెట్టు కింద చిన్న కోవెలలో చెక్కబడి ఉంది. మయిల్ అంటే నమలి అని తమిళంలో అర్దం. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇది పురాతన దేవాలయం, 7 వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారట. ఇక్కడ శివుడిని కపాలీశ్వరుడని, అమ్మవారిని కర్పగాంబళ్ అని పిలుస్తారు. ఇక్కడ నర్తనవినాయకుడు కొలువై ఉన్నాడు. నాయనార్లలో ముఖ్యులైన 7 వ శతాబ్దానికి చెందిన అప్పర్, జ్ఞానసంబంధర్‌లు ఈ ఆలయంలో వెలిసిన శివుడిని ఉద్దేశ్యించి కీర్తించారు. అలాగే ఇక్కడ శివుడిని బ్రహ్మదేవుడు పూజించాడని, ఆయనే లింగప్రతిష్ట చేశాడని, ఈ క్షేత్రానికి శుక్రపురి, వేదపురి అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.





సుందరమైన ఈ ఆలయం సందురతీరంలో ఉంది. సా.శ.1566 లో మైలాపూర్ పోర్చుగీస్ వారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత మళ్ళీ, ఇప్పుడున్న ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మిషనరీలు వివాదాస్పదం చేశాయి. ఈ ఆలయం మీద కొన్ని కుట్రలు చేసి, రాజకీయ మద్ధతుతో, అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసి, తమిళనాడులో ద్రవిడ క్రైస్తవాన్ని ప్రోత్సహించి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు, తాను రాసిన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు (Breaking India) అనే పుస్తకంలో వివరించారు.

రజనీకాంత్ ఆధ్యాత్మికమార్గంలో ఉన్న వ్యక్తి, సంస్కారవంతుడు, భక్తుడు కూడా. తెలుగునేల మీద చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనం వలన ఎంతోమందికి అరుణాచలం గురించి తెలిసింది. ఇప్పుడు తెలుగు ప్రాంతం నుంచి అరుణాచలం వెళుతున్న వారిలో సగం మంది చాగంటి వారి ప్రవచనం వినడం వల్లనే వెళ్తున్నారని అక్కడి ప్రజలు చెప్పారు. అలాగే తమిళ నాట రజనీకాంత్ వల్లనే చాలామంది అరుణాచలం మొదలైన శైవ క్షేత్రాలకు వెళుతున్నారట. మంచి పేరున్న నటుడైన రజనీకాంత్ తన సినిమా పేర్లకు అరుణాచలం, లింగ, బాబా మొదలైన పేర్లను కావాలనే ఎంచుకుని, ఆయా క్షేత్రాల, గురువుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారని ఈ మధ్యే అక్కడున్నవారి ద్వారా తెలిసింది. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ కబాలి పేరుతో కపాలీశ్వర స్వామి గురించి తమిళ ప్రజలకు చాటి చెప్తున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిపించడం చాలా గొప్ప కదా.

గమనిక - నేనేమీ రజనీకాంత్ ఫ్యాన్‌ను కాదు. ఆ మాటకు వస్తే నేను సినిమాలు చూసి చాలా సంవత్సరాలయ్యింది. టివి చూసేది కూడా చాలా తక్కువ. ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పుకోవచ్చు, నాలుగు మంచిమాటలు పంచుకోవచ్చని చేస్తున్న ప్రయత్నమే ఇది.

హర హర మహాదేవ
జై కపాలీశ్వరా

Thursday, 21 July 2016

స్వామి చిదానంద తీర్ధ సూక్తి


ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఈ మధ్య బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పంజా విసిరిన తర్వాత, ఆ దుశ్చర్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో కొందరు ఇస్లాం ప్రవచనకారుడు జాకీర్ నాయిక్ వలన ప్రభావితమయ్యారని, ఉగ్రసాహిత్యాన్ని చెప్తున్న అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం అతనిపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ముస్లింలంతా తీవ్రవాదులుగా మారాలని చెప్పిన జాకీర్ నాయిక్ అన్యమతాలను తన ప్రవచనాల్లో వక్రీకరించి మతమార్పిడులకు బీజం వేస్తున్నాడు. ఇదంతా పత్రికల్లో చదివాము, వార్తల్లో చూశాము. అయితే ఈ సందర్భంలో మీడియా జాకిర్ నాయిక్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని సంబోధించింది. అసలు ఆధ్యాత్మికవేత్త అని ఎవరిని అనాలి?

ముందు మనం గుర్తించవలసింది, మనకు కావల్సింది పరస్పర గౌరవం. మన ధర్మాన్ని ఏ మతం గౌరవిస్తుందో, మనం ఆ మతాన్ని గౌరవించాలి. గౌరవం పొందాలనుకునేవారు ఇతరులను గౌరవించాలి. సహనం అనేది పాతమాట. సహనం పేరుతో ఎదుటివాడి ఎన్ని దురాగతాలు చేసినా భరించాలనే స్థాయికి మనల్ని దిగజార్చారు.

ఆయా మతాలను గౌరవిస్తూనే వారి మనకూ బేధం తెలుసుకుందాం. అప్పుడు ఈ మాట ఎవరికి వాడవచ్చో అర్దమవుతుంది. అధ్యాత్మ / ఆధ్యాత్మ - అనగా తన యందే (On oneself) అని అర్దం. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడైన భగవంతుడిని తన (ఆత్మ) యందే దర్శించడం ఆధ్యాత్మ విద్య. ఆ విధమైన జీవినమే ఆధ్యాత్మికత. సర్వజీవులలో ఆత్మ ఉంటుందని, మనకు కలిగే బాధ, వాటికి కలిగే బాధ ఒకటేనని, అందువల్ల సర్వజీవులను తనవలే భావించినవాడు మాత్రమే ముక్తికి అర్హుడని సనాతనధర్మం చెప్తోంది. సనాతన ధర్మంలో ఆత్మ శుద్ధమైనది, పాపరహితమైనది, పవిత్రమైనది. జీవుడు తాను పాపరహితుడని, తనలో దైవం ఉన్నదని, తాను కూడా దైవాంశేనని తెలుసుకునే క్రమమే ఆధ్యాత్మికత. ఇక్కడ మధ్యవర్తుల పాత్ర ఏమాత్రం ఉండదు, చరిత్రలో జరిగిన ఒక చారిత్రిక సంఘటనను నమ్మాలసిన అవసరంలేదు. గురువు ఉన్నా, అతను మార్గదర్శియే కానీ, విచారించి తెలుసుకోవాల్సింది మాత్రం సాధకుడే.  ఆ సాధన కోసం వచ్చినవే భక్తి, జ్ఞాన, కర్మయోగాలు, ధ్యానం, ప్రాణాయామం మొదలైన పద్ధతులు. ఇందులో పునర్జన్మ - కర్మ సిద్ధాంతం ఎంతో ముఖ్యంగా కనిపిస్తుంది.

అబ్రహామిక్ మతాల్లోకి వెళ్తే, అక్కడ ఉండేది సోల్ (Soul). సోల్ #ఆత్మ కాదు. ఎందుకంటే సోల్ శుద్ధమైనది, పవిత్రమైనది, దైవాంశ అని ఆ మతగ్రంధాలు ఒప్పుకోవు. ఈ సోల్ మళ్ళీ అన్ని జీవులలో ఉండడు. అది కేవలం మానవులకే పరిమితం. 18 వ శత్బాదం ముందువరకైతే సోల్ అనేది కేవలం రాజులోనే ఉంటుందని, మాములు వ్యక్తులలో, అందునా తక్కువ స్థాయి వారిలో ఉండదని నమ్మేవారు. స్త్రీలలో అసలే ఉండదని కూడా వారి నమ్మకం. అది కేవలం పురుషులకే పరిమితమైనది. సనాతనధర్మం యొక్క స్పర్శ తర్వాత ఆయా దేశాల్లో ఈ వాదం క్రమంగా తగ్గి, ఇప్పుడు కేవలం మనుష్యులకు మాత్రమే సోల్ ఉంటుందని చెప్తున్నారు. సర్వజీవులను తన వలే భావించిన వాడికి సాల్వేషన్ (Salvation) (సాల్వేషన్ మోక్షం ఒకటి కాదు) అని ఇందులో చెప్పబడలేదు. ఈ మతాల్లో సాల్వేషన్ కావాలంటే ఖచ్ఛితంగా కాలంలో ఒకానొక సమయంలో జరిగిన చారిత్రిక సంఘటనను (historical event) నమ్మాలి, ప్రవక్త ద్వారానే వస్తుందని విశ్వసించాలి. వ్యక్తి అంతర్ముఖమై తన సోల్ ను సాక్షాత్కారించుకునే అవకాశం లేదు. కేవలం గాడ్ ని నమ్మడం వల్లనే సాల్వేషన్. భక్తి, జ్ఞాన, కర్మయోగం, ధ్యానం వంటి పద్ధతులు లేవు. అసలు అంతర్ముఖమవ్వడం అనేదే లేదు. సోల్ దైవాంశ అని నమ్మడం ఇస్లాంలో పెద్ద దైవనింద. గాడ్ కి ఏ ఇతర వస్తువుతోనైనా సంబంధం పెడితే, శాశ్వత నరకంలో పడతారు. వారికి సాల్వేషన్‌కు అవకాశం ప్రవక్త జన్మించడం వలననే ఏర్పడింది.

మనలాగా తమ యందు మనోబుద్ధులను, ఇంద్రియాలను నిగ్రహించుకుని, చిత్తాన్ని శుద్ధి చేసుకుని, సాధనతో ముక్తిని పొందే మార్గాలు అవి చెప్పవు. కనుక వాటిని బోధించేవారిని ఆధ్యాత్మికవేత్త అనకూడదు. అత్మస్పర్శ ఉండి, పునర్జన్మ, కర్మ మొదలైన సనాతనధర్మానికి చెందిన సిద్ధాంతాల గురించి చెప్పేవారిని మాత్రమే ఆధ్యాత్మికవేత్తలనడం సరైన పద్ధతి. అదేకాక ఇలా ఆయా మతాల ప్రవచనకారులను ఆధ్యాత్మికవేత్తలనడం ఆ మతగ్రంధాలను అవమానించడమే అవుతుంది. వాళ్ళతో మనల్ని సమానం చేసి, మనల్ని అవమానించినట్లు కూడా అవుతుంది. కాబట్టి వారి వారి గ్రంధాలను అనుసరించి ఏమనాలో అదే అంటే బాగుంటుంది.

రాజీవ్ మల్హోత్రా గారి రచనల ప్రేరణతో

రామానుజుల సూక్తి


Tuesday, 19 July 2016

గురువు - ముక్తి- భగవాన్ రమణుల ఉపదేశం


వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు

వ్యాసుడు అందించిన ఈ సంస్కృతిని, జ్ఞానాన్ని కాపాడుకోవడం, ఆచరించడం తక్షణ కర్తవ్యం. అదే వ్యాసునికి ఇచ్చే దక్షిణ కూడా. ఏ గురువు ఏది చెప్పినా, అదంతా ఒకనాడు వ్యాసుడు అందించిన వాఙ్గ్మయం నుంచే. గురువులకే గురువైన వేదవ్యాసులవారిని మనం ఎన్నటికీ మరువకూడదు. వారు వెలిగించిన జ్ఞానజ్యోతిని, అఖండంగా వెలుగుతూ ఉండేలా చూస్తూ, అంధకారంలో ఉన్న ప్రపంచానికి పంచే బాధ్యత కూడా మనదే. మనందరిపై మహర్షి అనుగ్రహం ఉండాలని వారిని వేడుకుంటూ, భగవద్భంధువలందరికీ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ శుభాకాంక్షలు.


Saturday, 16 July 2016

స్వామి శివానంద సూక్తి



A wrong thought binds. A right thought liberates. Therefore, think rightly and attain freedom. Unfold the occult powers hidden within you by understanding and realizing the powers of the mind. Close your eyes. Slowly concentrate.

- Swami Sivananda

Tuesday, 12 July 2016

స్వామి రంగనాధానంద సూక్తి



Are you growing spiritually? Can you love others? Can you feel oneself with others? Have you peace within yourself? And do you radiate it around you? That is called spiritual growth which is stimulated by meditating inwardly and by work done in a spirit of service outwardly.

- Swami Ranganathananda

Sunday, 10 July 2016

సద్గురు శివానంద మూర్తి సూక్తి


Every birth is a happy event if we are abiding in Dharma. Dharma is everything. It is our teacher. It is not easy to understand it. At one time, to tolerate is Dharma. At another part of time, to kill is Dharma.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 217 (శుల్బసూత్రాలు - 2)



నిర్దేశిత కొలతలు, అకారాల్లో యజ్ఞగుండాల నిర్మాణాన్ని ప్రస్తావిస్తూనే రేఖాగణిత సూత్రాలు కొన్నిటిని ప్రకటితంగా, కొన్నిటిని ప్రకటితంగా అందులో పొందుపరిచారు.
The following geometrical theorems are explicitly or implicitly mentioned or clearly implied in the construction of the altars of the prescribed shapes and forms.

1. దీర్ఘచతురస్రం యొక్క కర్ణములు దీర్గ్ఘచతురస్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తాయి, ఒకెలా ఉండేట్లు, రెండు నిలువుగా, రెండు ఎదురెదురుగా (బౌద్ధాయన సూత్రం 3 - 168, 169, 178)
The diagonals of a rectangle divide the rectangle in four parts, two and two (vertical and opposite) which are identical. (Ban (3 - 168, 169, 178)

2. సమాంతర చత్రుభుజం యొక్క కర్ణాలు లంబకోణం వద్ద ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి.
Diagonals of a rhombus bisect each other at right angles.

3. సమద్విబాహు త్రిభుజం శీర్షం నుంచి బేస్ మధ్య భాగం వరకు రేఖను గీసి, దాన్ని రెండుగా విభజించవచ్చు. బౌద్ధాయన సూత్రం 3 – 256)
An Isosceles triangle is divided into two identical halves by the line joining up the vertex to the middle point of base (Bau, 3-256).

4. ధీర్ఘచతురస్రం మధ్య పాయింట్ల నుంచి గీసిన రేఖలతో ఏర్పడిన చతుర్భుజం, ధీర్గచతురస్రంలో సగం వైశాల్యం కలిగిన సమాంతర చత్రుభుజం అవుతుంది.
A Quadrilateral formed by the lines joining the middle points of a rectangle is a rhombus whose area is half of that of the rectangle.

5.  ఒకే బేస్, మరియు సమాంతరాల్లో ఉన్న సమద్విబాహు చతుర్భుజం మరియు ధీర్ఘచతురస్రం ఒకే వైశాల్యం కలిగి ఉంటాయి.
A Parallelogram and a rectangle on the same base and within the same parallels have the same area.

------------------------

సా.శ.2000 పూర్వం కంటే ముందుదైన బౌద్ధాయన సూత్రాన్నే నేడు పైధాగరస్ సూత్రం అంటున్నారు. ఇది ప్రపంచం అంగీకరించిన సత్యం.
Baudhayana Theorem (earlier to 2000 B.C.E)(called as Pythagoras theorem).


ధీర్ఘచతురస్రం యొక్క వికర్ణం వలన ఏర్పడే రెండు వైశాల్యాలకు పొడవు, వెడల్పు వేర్వేరుగా ఏర్పడతాయి. ఈ సూత్రాన్ని పైధాగరస్ కు అంటగట్టారు చాలామంది. బౌద్ధాయన సూత్రం దీనికి వ్యతిరేకమైనవి కూడా చెప్తుంది.
The diagonal of a rectangle produces both areas which the length and breadth produce separately. This theorem is usually attributed to Pythagoras. The Baudhayana work even states its converse.

-------------------------

పై విలువ - వ్యాసానికి చుట్టుకొలత నిష్పత్తి  -
(Value of pi - ratio of circumference to diameter)

శుల్బసూత్రాల్లో పై విలువకు 8 అంచనాలను చెప్పారు. బౌద్ధాయన సూత్రం 1.61 ప్రకారం పై విలువ 3.088. మానవ శుల్బసూత్రాలు 1.27 ప్రకారం 4/ (1 1/8) ్ 2 = 3.16049
-------------------------------
2 వర్గము -
(Sqaure root of 2) -
బౌద్ధాయన సూత్రాల ప్రకారం 2 వర్గము = 1+ 1/3 + 1/(3*4) -1/(3*4*34)

To be continued .....................

శ్రీ అరోబిందో కపాలి శాస్త్రి సంస్థ వారు ప్రచురించిన Mathematics నుంచి సేకరణ.

Saturday, 9 July 2016

Sunday, 3 July 2016

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



When Dharma is absent, the company of two persons has always resulted in selfishness and violence. When Dharma prevails, they enrich each other.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 216 (శుల్బ సూత్రాలు)

ఒక పరిశోధనశాలలో ఒక ప్రయోగం చేసినప్పుడు రసాయనాలతో పాటు దానికి వాడే పాత్రలు కూడా ముఖ్యమే. అలాగే యజ్ఞంలో కూడా. యజ్ఞం సమస్త బ్రహ్మాండానికి సంకేతం అని చెప్పుకున్నాం. యజ్ఞంలో ఆహుతులిచ్చినప్పుడు అందులో రసాయన ప్రతిచర్యలు జరిగి, వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఆహుతు ఘనరూపాన్ని కోల్పోయి అణురూపంలో అంతరిక్షాన్ని చేరుతోంది. అటువంటి యజ్ఞం నిర్వహించాలంటే యజ్ఞగుండం కొలతలు ఎంత నిర్దిష్టం (perfect)గా ఉండాలి. అందుకోసం వచ్చినవే సుల్బ సూత్రాలు. ఇవి గణితశాస్త్రానికి సంబంధించినవి, ఇందులో రేఖాగణితము/జ్యామితి (Geometry), వర్గాలు (Square roots) ప్రధానంగా కనిపిస్తాయి. యాగశాల కూడా ఎలా పడితే అలా కట్టారు. యజ్ఞంలో ఉపయోగించే ఛందస్సును అనుసరించి, ఋతువును, యజమాని (యాగం చేసే వ్యక్తి) ఎత్తును, భుజాల కొలతను, యజ్ఞంలో అర్పించి ఆహుతుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న తర్వాత యజ్ఞకుండం యొక్క నిర్మాణం జరుగుతుంది. అందులో కూడా కొలతలు, ఎన్ని ఇటుకలు వాడాలి, అవి ఎంత పరిణామంలో ఉండాలి, కుండం నిర్మాణం వంకరగా కాక సరళ రేఖ మీద ఉందా అనేవి, ఇవన్నీ సరిగ్గా ఉన్నా, అది ఉండాల్సినంత పరిణామంలో ఖచ్ఛితంగా ఉందో లేదో చూస్తారు. యజ్ఞగుండం నిర్మాణానికి ప్రణాళిక పూర్తి చేసుకున్న తర్వాత, యాగశాల నిర్మాణనికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అప్పుడు కూడా ఇంతకముందు చెప్పుకున్నట్టుగానే ఆయా అంశాలను పరిగణలోకి తీసుకునే యాగశాల నిర్మాణం చేస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. చాలా సందర్భాల్లో యాగశాల నిర్మాణంలో వేదపండితుడు చేతిలెక్కల మీదే ఆధారపడతారు. ఉదాహరణకు ఒక బారు పొడువని, 6 మూరల వెడల్పని, అలా.... అయితే ఈ అంశం మీద ఆసక్తి ఉన్న ఎందరో భారతీయులు, విదేశీయులు పరిశోధన చేసిన తర్వాత ఋజువైన విషయం ఏమిటంటే, వీరు నోటిలెక్కల మీద యాగశాల నిర్మాణాన్ని జరిపించినా, అవి దోషరహితం (Perfect) గా, రేఖాగణితం మొదలైన గణిత శాస్త్రంలోని అనేక విభాగలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక రచిస్తే, ఎంత పూర్ణం (perfect)గా ఉందో, అంతే పూర్ణం (perfect) గా అక్కడ కూడా ఉందట. ఇలా ఎందరో పండితులున్నారు. వారికి చిన్నప్పుడు గురుకులంలో నేర్పిచిన లెక్కలనే ఆధారంగా చేసుకుని ప్రణాళికలు ఇస్తారు. కానీ అందులో మామూలు మెదడు అందుకోలేని ఎంతో విజ్ఞానం దాగి ఉంది.

అయితే ఇవి కేవలం యజ్ఞం వరకే పరిమితం కాక, నిత్య జీవితంలో, నిర్మాణశాస్త్రంలో ఉపయోగపడే అంశాలు కూడా కలిగి ఉన్నాయి. ఇప్పటికీ శుభకార్యాల్లో చదివే అనేక మంత్రాల్లో ఇవి వినిపిస్తుంటాయి. మానవుడు నివాసం మొదలు అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పుడే, అతడు సుఖసంతోషాలతో ఉండగలడు. వీటిలో నిర్మాణశాస్త్రం కీలకం. దాన్ని ఎల్లవేళలా గుర్తించుకోవాలని, మర్చిపోకుండా పదే పదే గుర్తు చేయడం కోసం వీటిని శుభకార్యాల్లో పఠించేలా ఋషులు నిర్ణాయించారు.

చిత్రంలో చూపబడిన హోమగుండం చూడండి. అది మొత్తం రెండుగా విభజింపబడింది. ఒకటి ప్రాచీనశాల, రెండవది మహావేది. ప్రాచీనశాల నిత్యకర్మలకు, మహావేది ప్రత్యేకమైన క్రతువులకు ఉద్దేశించబడ్డవి. ఇందులో ఎన్నో ఆకారాలున్నాయి. బౌద్ధాయనుడు 21 ఆకారాలను చెప్పాడు. వైదిక క్రతువుల వివరాలు, వాటి రూపకల్పనలు, దానికి అవసరమైన ప్రత్యేకమైన ఆకారం కలిగిన ఇటుకల గురించి బ్రాహ్మణాల్లో చెప్పగా, ఇంకా వివరంగా శుల్బసూత్రాల్లో వివరించారు. ఉదాహరణకు గార్హపత్యం, ఆవహనీయం, దక్షిణాగ్ని అని అగ్నిహోత్రాలు 3 రకాలు. ఆ 3 ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాయి. ఈ 3 అగ్నిహోత్రాల్లో ఒకటి చతురస్రం (Square), వృత్తం (Circle), అర్ధవృత్తం (Semicircle) ఆకారంలో ఉండాలని, కానీ మూడింటికి సమానమైన వైశాల్యం (area) ఉండాలని శతపధ బ్రాహ్మణం స్పష్టం చేసింది. నిర్ధిష్టమైన వైశాల్యం కలిగిన ఒక ఆకృతిని నిర్మించాలంటే, కనీసం 2 సంఖ్య వర్గాన్ని (Square root of 2) సుమారుగానైనా కనుక్కునే పద్ధతి ఉండాలి. చత్రురస్రానికి సమానమైన వైశాల్యం కలిగిన వృత్తాకారాన్ని నిర్మించాలన్నా పై (Pi - π ) విలువ, వృత్తం వ్యాసానికి (Diameter)  చుట్టుకొలత (circumference) నిష్పత్తి (ratio) సుమారుగానైనా తెలిసి ఉండాలి.  

ఇదే కాక శతపధబ్రాహ్మణం, శుల్బసూత్రాలు మొదలైన గ్రంధాలు అప్పటి వరకూ ఉన్న ఎన్నో గణిత పద్ధతులను క్రోడికరించడమే కాకుండా, నూతనంగా అభివృద్ధి చేసిన పద్ధతులను, వాటి ద్వారా గీయదగిన రేఖాగణిత ఆకృతులను, వాటి సిద్ధాంతాలను కూడా క్రోడికరించాయి. మీరు గమనిస్తే మహావేది సమలంబ చతుర్భుజం (Trapezium) ఆకృతిలో ఉంది. 2 వర్గము (Square root of 2) లేదా సమద్విబాహు సమలంబ చతుర్భుజం (Isosceles Trapezium) కనుక్కోవడానికి పైధాగరస్ ట్రిపుల్స్ (Pythagorean Triples: 3^2+4^2=5^2)యొక్క కనీస జ్ఞానం ఉండాలి. దీన్నిబట్టి భారతీయులకు వేదకాలంలోనే పైధాగరస్ సూత్రం ఇంకా సులభపద్ధతిలో తెలిసి ఉంటుందని ఈ విషయంలో పరిశోధన చేసిన సెడెన్‌బర్గ్ (1978), రాజారాం మరియు ఫ్రాలే (1995) నిర్ధారించారు.

శ్రీ అరోబిందో కపాలి శాస్త్రి సంస్థ వారు ప్రచురించిన Mathematics నుంచి సేకరణ.

To be continued .........

Saturday, 2 July 2016

స్వామి శివానంద సూక్తి



A true monk or Sannyasin can do everything through his thought-vibrations. A Sannyasin or Yogi need not become the President of an Association or the leader of a social or political movement. It is a foolish and puerile idea. Indians have now imbibed the missionary spirit of the West and cry out that Sannyasins should come out and take part in social and political activities. It is a sad mistake. It is not necessary that a Sannyasin, a saint should appear on the platform to help the world, to preach and elevate the minds of people.

- Swami Sivananda

హిందూ ధర్మం - 215 (యజ్ఞం ప్రాముఖ్యత - 2)



యజ్ఞం వలన పర్యావరణ శుద్ధి జరగడం, వర్షం కురవడం లౌకికమైన ప్రయోజనాలైతే, యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మానవులకు వరాలివ్వడం, కోరికలు తీర్చడం కళ్ళకు కనిపించని, అనుభవంలో మాత్రమే తెలుసుకునే అలౌకిక ప్రయోజనం. యజ్ఞం యొక్క ప్రయోజనం ప్రకృతిని పరిపుష్టం చేయడం. భూలోకంలో అగ్నిముఖంగా చేసే యజ్ఞం అనేక భూమికల్లో అనేక విషయాలకు ప్రతీక. యజ్ఞం సమస్త బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. పరబ్రహ్మం నుంచి ఉద్భవించిన ఈ సృష్టియే ఒక యజ్ఞం అని ఋగ్వేదంలోని పురుష సూక్తం స్పష్టం చేస్తోంది.

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||

భావం - ఆ బ్రహ్మం నుంచి విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయనే సృష్టిగా, ప్రాణులుగా రూపుదాల్చాడు. అన్నిటికి ఆధారమైన ఆ పరతత్త్వం తెర అనుకుంటే, దాని మీద కదిలే బొమ్మలు ఈ విరాట్ పురుషుడు, ఆయన సృష్టి. ఆ బ్రహ్మాన్ని ఉద్దేశించి దేవతలు యజ్ఞం నిర్వహించదలచారు. అప్పుడు సృష్టి ఇంకా పూర్తి కాలేదు కనుక దేవతలు ఈ విరాట్ పుర్షుడినే ఆహుతి వస్తువుగా చేసుకుని యజ్ఞం ప్రారంభించారు (మనసులో ధ్యానించారు). అందులో వసంత ఋతువును ఆవునెయ్యిగా, గ్రీష్మ ఋతువు వంటచెరుకుగా, శరత్కాలం హవిస్సుగా అర్పించారు. పంచభూతాలు, పగలు, రాత్రి అనే 7 ఈ మహాయజ్ఞానికి సప్త పరిధులయ్యాయి. యజ్ఞ పరిధి అంటే యజ్ఞకుండం యొక్క సరిహద్దు రేఖ. దుష్టశక్తుల నుంచి యజ్ఞాన్ని రక్షించడం దీన్ని ఏర్పాటు చేస్తారు. దేవతలు యాగాన్ని ప్రారంభించి, విరాట్ పురుషుడిని యాగపశువుగా కట్టారు.... ఆ యజ్ఞం నుంచే దేవతలు, ఋషులు, సాధ్యులు, పశువులు, పక్షులు, మనుష్యులు, అందరూ ఉద్భవించారు.

ఇది ఋగ్వేదం చెప్తున్న మాట. ఈ యజ్ఞం ఒకనాడు జరిగి ఆగిపోయింది కాదు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాని ఫలాలను మానవులు అందుకుంటున్నారు. అందుకే ఋతువులు ఏర్పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, వాటి ద్వారా వచ్చిన ఆహారం మానవులకు శక్తినిస్తోంది. ఈ మహాయజ్ఞం ద్వారా జరిగిన మేలుకు కృతజ్ఞతగా ప్రతి మనిషి అగ్నిహోత్రంలో ప్రతి నిత్యం రెండు సంధ్యాకాలాల్లో రెండు ఆహుతులు వేయాలని ధర్మం చెప్తోంది. సృష్టి నుంచి మానవుడు ఫలాలు పొందే క్రమంలో ఈ సృష్టి కొంత కలుషితమవుతుంది, తన వనరులను, శక్తిని కొంతమేర కోల్పోతుంది. అందువల్ల ప్రకృతిని తిరిగి పోషించడం, పరిపుష్టం చేయడం మానవులు వ్యష్టి (Individual) గాను, సమిష్టి (Collective) గాను చేసే బాహ్య (సాగ్నికం) యజ్ఞం యొక్క లక్ష్యం. అప్రాచ్య అభివృద్ధి విధానాలనే (Western development models) సరైనవనుకున్న ఆధునిక మానవుడు ఈ సృష్టి అనే మహాయజ్ఞానికి తన వంతు సహాయం చేయక, ఆ యజ్ఞాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఋతువులు గాడి తప్పుతున్నాయి, భయంకర రోగాలు వ్యాపిస్తున్నాయి, స్వీకరించిన ఆహారం బలాన్నివ్వకపోగా, అనారోగ్యాన్ని కలిగిస్తోంది. అలా యజ్ఞాలను నాశనం చేసేవారిని రాక్షసులంటుంది ధర్మం. ఈ సృష్టి అనేది ధర్మంలో పవిత్రకార్యం. అధర్మాల్లో ఈ సృష్టికికి పవిత్రత ఆపాదించబడలేదు. సనాతన ధర్మావలంబకులందరూ యజ్ఞాన్ని గౌరవిస్తారు. అలాగే ప్రకృతిని కూడా గౌరవించి, దాన్ని కలుషితం చేయక, పవిత్రంగా, శుద్ధంగా ఉంచడం ఈ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి కనీస 'ధర్మం'. ఈ విశ్వమే ఒక మహాయజ్ఞం, దీనికి ఏ మాత్రం కీడు కలిగించకూడదు అనేది 'వైదిక పర్యావరణవాదం' (Vedic Environmentalism)లో ఈ ముఖ్యసూత్రం.

అందువలన ఈ భూమి మీద యజ్ఞకుండం పెట్టి మానవులు నిర్వహించే యజ్ఞం సమస్త సృష్టికి, దాని క్రమానికి సూచికగా నిలుస్తోంది. అలాగే భోజన సమయంలో ఎన్నో నియమాలను పాటించడం ధర్మంలో చెప్పబడింది. కూర్చుని భోజనం చేయడం, భోజనానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రపరుచుకోవడం, శుచిగా అన్నం వండడం, మౌనంగా భుజించడం, మొదట ఔపోసన పట్టి, నెయ్యి కలిపిన 5 మెతుకులను పంటికి తగలకుండా, ఓం ప్రాణయ స్వాహా, ఓం అపానయ స్వాహా, .......... అంటూ విడివిడిగా 5 సార్లు కడుపులో ఉన్న జఠరాగ్నికి (వైశ్వనరాగ్నికి) ఆహుతివ్వడం, భోజనం మధ్యలో లేవకపోవడం, ఇదంతా పిండాండంలో, వ్యక్తి దేహంలో జరిగే యజ్ఞం. బాహ్యంలో జరిగే యజ్ఞానికి ఇది ప్రతీక (Symbolic representation).

భోజనం దేహానికి బలాన్నిస్తే, యజ్ఞం దేవతలకు శక్తినిస్తుంది. భగవంతునిచే నిర్వహించబడుతున్న సృష్టి అనే యజ్ఞం దేవతలు మొదలు సర్వజీవులు తమ పాపపుణ్యాలను అనుభవించడానికి, ధర్మాన్ని ఆచరించి, మోక్షం పొందడానికి తగిన ఉపాధులను (శరీరాలను) ఇస్తోంది. ఇలా యజ్ఞం అనే ప్రక్రియ బ్రహ్మాండం, అండాండం, పిండాండాల్లో అంతటా వ్యాపించి, వేర్వేరు స్థాయుల్లో వివిధ రకాలుగా జరుగుతోంది. అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మమే ఈ యజ్ఞము, యజ్ఞ కర్త, భోక్త ............ అన్నీను. బ్రహ్మము యజ్ఞము అభిన్నము, అంటే రెండూ వేరు కాదు. అందుకే 'యజ్ఞోవై విష్ణుః' అని యజుర్వేదం కీర్తిస్తోంది.  

To be continued ..........

Friday, 1 July 2016

ఆత్మ స్వరూపుని ఆత్మ సేవ - శ్రీ రమణాశ్రమ లేఖలు ,8 వ ఉత్తరం



గత సెప్టెంబరు - అక్టోబరు సమయంలో భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండటం వలన తైలం రుద్ధి కాళ్ళోత్తేవారు సేవకులు. మిగితా చొరవ గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళొత్తడం ప్రారంభించి సమయాన్ని అతిక్రమించడం ఆరంభించారు.

సేవకులను కూడా 'రండీ, పోండీ,' అనే తప్ప 'రా,పో' అని పిలవడానే ఇష్టపడని భగవానులు ఇందుకు సహించగలరా? (భగవాన్ జంతువులు సహా ఎవరిని ఏకవచనంతో పిలవలేదు. అందరిని బహువచనంతోనే సంబోధించేవారు) ఖండించి, వద్దనడం వారి పనికాదు. అందువల్ల ఛలోక్తిగా "మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపీ కాళ్ళు వత్తుతాను. నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దూ?" అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరల్లోనైనా శ్రీవారి పాదాలు ముట్టుకుని నమస్కరిద్దామన్న కోరిక ఉంటే, దీంతో పుర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచం వారికి కావాలట! రవంత సూక్ష్మతకలవారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి.

ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జీ, పండు ముసలి, ప్రతాపరాయ దేసాయీ అనేవారు భగవానుని సమీపించి "స్వామీ! నాకు కూడా గురుపాద సేవలో భాగమివ్వాలి" అన్నారు. "ఓహో! సరిసరి. 'ఆత్మావై గురుః' అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. డెబ్బైయేళ్ళు దాటాయి. మీరా నాకు సేవ చేసేది. చాలు చాలు. ఇకనైన ఆత్మసేవ చేసుకోండి. పల్కకుండా ఊరికే ఉంటే అంతే చాలు' అన్నారు భగవాన్. సరిగా విచరిస్తే ఇంతకన్నా గొప్ప ఉపదేశం ఏముంది? పలకకుండా ఊరికే ఉంటే చాలట. అట్లా ఉండటం భగవానునికే సహజంగాని మనకు సాధ్యమా? ఎంత తపించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగిందేమి ఉన్నది?

సూరి నాగమ్మ - 28-11-1945
(శ్రీ రమణాశ్రమ లేఖలు, సూరి నాగమ్మ - 8 వ ఉత్తరం)

పల్కకుండా ఊరికే ఉండడమంటే ఆత్మ యందు దృష్టి నిలిపి, ప్రాపంచిక విషయాలను పట్టించుకోకపోవడం. ప్రాపంచిక విషయాల్లోకి మనసును పరుగెట్టనివ్వకుండా ఆత్మయందే దృష్టి నిలపమని రమణుల ఉపదేశం.