Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Wednesday, 31 January 2018
Tuesday, 30 January 2018
Monday, 29 January 2018
శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (8 వ భాగము)
సతతము మా భద్రగిరి - స్వామి రామదాసుడైన
ఇతర మతములనియేటి - వెతల వేటికే మనసా ||
మతములు అంటే ఆలోచనలు. వెతలు అంటే కష్టాలు. మోక్షం పొందడానికి, లేదా తరించడానికి ఎంతో ఆలోచించి, కష్టపడటమెందుకు? ఆ సాధన చేయాలి, ఈ సాధన చేయాలి, అన్ని గంటలు ధ్యానం చేయాలి, ఇన్ని గంటలు జపం చేయాలని ఇతర కష్టమైన మార్గాలను పట్టుకోవడమెందుకే మనసా. ఎల్లప్పుడూ మా భాద్రాచల శ్రీ రామునికి దాసుడవై ఉండిపో. అది ఒక్కటి చాలు. అంటే స్వామిని నీ ప్రభువుగా భావించు. దాసుడు, ప్రభువు చెప్పిన మట తప్ప అన్యమైనది వినడు, ప్రభువు చెప్పిన దారిలో తప్ప వేరే మార్గంలో నడవడు. అతనికి అతని ప్రభువు చెప్పిందే వేదం. అలానే నీవు ఆ భద్రాచల శ్రీ రామచంద్రునికి దాసుడవైపో. ఇది ఎంతో సులభమైన మార్గము. కోపం, ఆవేశం, ఈర్ష్యా, అసూయ, ద్వేషము, పరనింద, దోషాలు ఎంచడం వంటి దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి. వాటికి దాస్యం చేయడం మానుకో. తిరగబడు. మన భద్రాచల రాముడు సామాన్యుడు కాడు. సకల గుణాభిరాముడు. ఈయన వైకుంఠ రాముడు. ఎక్కడైనా రాముడు ధనుర్బానాలతో ఉంటాడు. కానీ భద్రాచలంలోని రాముడు శంఖుచక్రాలను కూడా ధరించి ఉన్నాడు. ఈయన సాక్షాత్తు వైకుంఠం నుంచి భద్రగిరికి దిగివచ్చిన వైకుంఠ రాముడు. ఈయన్ను పట్టుకుంటే, నేరుగా వైకుంఠానికే తీసుకెళతాడే.
మానవుడు ఎలా జీవించాలో మన రాముడు చూపించాడు. ఆయనకు దాస్యం చేయడమంటే, ఆయనలోని గుణాలను మనలో పెంపొందించుకోవడం, ఆయన నడిచిన మార్గంలో నడవడం, ధర్మాన్ని రక్షించడం. అలా నిత్యం రాముని మార్గంలో నడువు. వేరే ఆలోచనలు పెట్టుకోకు. నేను చాలా సులభమైన మార్గం చెబుతున్నాను.
ఇవన్నీ చేస్తూ ఆ శ్రీ రాముని దివ్యనామాన్ని స్మరిస్తూ ఉండు. కఠినమైన తపస్సులను కోరవలసిన పనిలేదు. అన్నీ తీరి, మరణానంతరం ఆ రామునిలో ఐక్యమవుతామంటూ ఈ ఒక్క కీర్తనలోనే శ్రీ రామదాసుగారు ఎంతో తత్త్వాన్ని నింపి అందించారు.
ఇదంతా రాయడానికి ప్రేరణ కలిగించిన ఆ రామునికి, నా గురువుకు నమస్కరిస్తూ, సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
Sunday, 28 January 2018
శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (7 వ భాగము)
అతిథి వచ్చి యాకలన్న - అన్నమింత నిడిన చాలు
క్రతువు సేయవలెననే - కాంక్ష యేటికే
పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి, పూజలు చేయాలి, లేకపోతే అన్నదానం చేయాలనే కోరికలు ఎందుకు? నీ ఇంటికి వచ్చి ఆకలిగా ఉందన్నవాడికి కొద్దిగా అన్నం పెట్టు చాలు అంటున్నారు రామదాసుగారు. అంటే పూజలను, క్రతువులను ఆయన నిరసించట్లేదు, వాటిని తక్కువ కూడా చేయడంలేదు. సమస్త క్రతువులు, ఉపాసనలు మనకు నేర్పేదిమిటి? సర్వజీవుల్లో భగవంతుడిని చూడటం, సర్వజీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం, వారి బాధను మన బాధగా భావించడం. అదేలేనప్పుడు, ఎన్ని ఉపాసనలు చేస్తే ఏం లాభం? నీవు చేసే ప్రతి పని, నీలో దివ్యప్రేమను పెంచాలి. అలా చేయడంలో మొదటి అడుగు, పక్కవాడి బాధను నీ బాధగా భావించి, తోచిన సాయమందించడం.
నేను సర్వజీవుల్లో వైశ్వానరునిగా ఉండి, నాలుగు విధములుగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నానని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. సర్వజీవుల్లో ఉండే ఆకలి భగవంతుడే. అంతేకాదు, ఆకలిని వైశ్వానరాగ్ని అని కూడా అన్నారు.
యా దేవీ సర్వభూతేషు క్షుదా రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
అని దేవీ భాగవతం కూడా చెబుతోది. సర్వజీవుల్లో ఆకలి రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్ధము. అంటే ఆకలితో నీకు ఎవడైనా కనిపిస్తే, అది నీ భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఆకలి రూపంలో వానిలో భగవానుడు వ్యక్తమవుతున్నాడు. వానికి ఏ కొంచం ఆహారం పెట్టినా, అది నేరుగా భగవానునికే చెందుతోంది. అది కూడా అగ్నికి సమర్పించడమే. అంటే యజ్ఞం చేయడంతో సమానం కదా. ఇది ఎంతో సులభమైన మార్గము. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నీవు వండుకునే దాంట్లోనే ఇంకొకరి కొంచం పంచి పెట్టు. అది చాలే మనసా! అది చేయకుండా పెద్ద పెద్ద పనులు చేస్తానంటావేమిటే?
కబీర్ గారు ముస్లిం అనే కారణంగా వారిని దేవాలయంలోకి అనుమతించలేదట. అయితే వారు ఆలయం వెలుపలే కూర్చుని, వంట చేసుకున్నారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క, వారు కాల్చుకున్న రొట్టె ముక్కను ఎత్తుకుపోయింది. అది చూడగానే కబీర్ గారు, నారాయణ ఆగు. ఒట్టి రొట్టే తింటే బాగుండదు, ఇదిగో ఈ నెయ్యి కూడా రాసుకుని తిను అని దాని వెంటపడ్డారట. అది చూసి, వారిని గుడిలోకి అనుమతించని మిగితావారు తలదించుకున్నారు. నిజమైన భక్తి అలా ఉంటుంది. మౌనంగా, తాను చేసేది చేస్తాడు భక్తుడు. అందరి ఆకలిని తీర్చలేకపోవచ్చు, కానీ నీకున్నదాంట్లో కొందరిదైనా తీర్చు, చాలు. అది కూడా రామునికి ఇస్తున్నాననే భావనతో. అదే రామదాసుగారి ద్వారా రాముడు పలికించాడు.
ఇంకా ఉంది....
హిందూ ధర్మం - 258 (Forbidden Archaeology - 4)
ఎంతో పురాతనమైన రాతి పొరల్లో ఆధునికంగా కనిపించే అస్థిపంజరాల గురించి డార్విన్ శాస్త్రవేత్తలు వింటే, వాళ్ళు ఇలా అంటారు: "ఇందులో రహస్యమేమీ లేదు. కొన్ని వేల ఏళ్ళ క్రితం ఎవరో ఆ ఉపరితలం మీద మరణించి ఉంటారు మరియు అతని మిత్రులు అతడిని, బాగా లోతైన గొయ్యి తీసి పాతిపెట్టి ఉంటారు. దాన్నే మీరు చూసి, ఎంతో పురాతన రాతి పొరల్లో దొరికిన అస్థిపంజరం అంటున్నారు."
వీటిని సాంకేతికముగా intrusive burial అంటారు. అది జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈ అంశంలో, Ragazzoni, నిపుణుడైన భూగర్భశాస్త్రవేత్త, intrusive burial గురించి బాగా తెలిసి ఉన్నాడు. ఒకవేళ నిజంగా అలాగే పాతిపెట్టి ఉంటే, దానిపైన ఉన్న పొరలు కూడా కదలిపోయేవి. కానీ తవ్వకాల సమయంలో అతను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. మిగితా పై పొరలు, ఏ మాత్రం కదలకుండా, చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. అంటే ఆ రాతి పొరలు ఎంత పురాతనమైనవో, ఆ అస్థిపంజరాలు కూడా అంతే పాతవి. అంటే ఈ సంఘటనలో 50 లక్షల సంవత్సరాలన్నమాట.
20 వ శతాబ్దం మొదటి భాగంలో, బెలిజియన్ భూగర్భశాస్త్రజ్ఞుడు A. Rutot, తన దేశంలో కొన్ని ఆసక్తికర పరిశోధనలు చేశాడు. 3 కోట్ల వయస్సు కలిగిన రాతిపొరల్లో ఆయన కొన్ని రాతి పనిముట్లు మరియు ఆయుధాలు కనుగొన్నాడు. కాలిఫోర్నియా బంగారు గనుల విషయంలో నేను చెప్పాను కదా. కొన్నిసార్లు పురాతన వస్తువులను వీక్షించే అవకాశం ఇవ్వరని. కానీ ఇక్కడ మేము పురాతన అవశేషాలు చూడగలిగాము. ఒకసారి నేను కొన్ని పత్రికల ఇంటర్వ్యూల కోసం బ్రుస్సెల్స్లో ఉన్నప్పుడు, Royal Museum of Natural Sciences కు తీసుకెళ్ళమని నా మిత్రునకు చెప్పాను. ఎందుకంటే అక్కడ Rutot’s collection ఉంటుందేమోనని. అక్కడి మ్యూజియం అధికారులతో మాట్లాడినప్పుడు, ముందు వారికి తెలియదని సమాధానం చెప్పినా, ఆ వస్తువుల గురించి తెలిసిన ఒక పురావస్తుశాస్త్రజ్ఞుని పట్టుకోగలిగాము. కానీ అక్కడి వస్తువులను జనాలకు ప్రదర్శించరు. అతను మమ్మల్ని ఆ మ్యూజియంలోని స్టొర్ రూంకు తీసుకెళ్ళగా, అక్కడే బెల్జియంలో దొరికిన 3 కోట్ల ఏళ్ళ పూర్వం నాటి పనిముట్లు మరియు ఆయుధాలను ఫోటో తీసుకున్నాను. ఇప్పటివరకు professional scientists గురించి చెప్పుకున్నాము. కానీ భూమి పొరల్లో ఉన్న పురాతన మానవ అవశేషాల మీద పరిశోధన చేసిన ఇతర వ్యక్తులకు ఏదైనా ఋజువు దొరికితే, అవి సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురించబడవు కానీ సాధారణ సాహిత్యంలో కనిపిస్తాయి.
Morrisonville అనే పట్టణంలో 1892 లో, Morrisonville Times పత్రికలో ప్రచురించబడిన అలాంటి ఆసక్తికర విషయం ఒకటి చెప్తాను. బొగ్గుపొయ్యిలో వేయడానికి ఒకావిడ పెద్ద బొగ్గు ముక్కను రెండుగా విరచగా, అందులో ఆవిడకు పది ఇంచుల పొడువైన అందమైన బంగారు గొలుసు కనిపించింది. ఆ గొలుసు బొగ్గులో గట్టిగా నిక్షిప్తమై ఉందనడానికి గుర్తుగా బొగ్గు యొక్క రెండు ముక్కలు ఇంకా అతుక్కునే ఉన్నాయి. ఆ వార్తపత్రిక నివేదిక ఆధారంగా ఆ బొగ్గు ఏ గని నుంచి వచ్చిందో తెలుసుకోగలిగాము. Geological Survey of the State of Illinois, ప్రకారం, ఆ గని నుంచి వచ్చిన బొగ్గు వయసు 30 కోట్ల సంవత్సరాలు. అంటే అదే రాష్ట్రంలో దొరికిన మానవ అస్థిపంజరం వయస్సుతో సమానం అన్నమాట.
సైంటిఫిక్ సమాచారం వద్దకు వెళదాము. 1862 లో, The Geologist (volume 5, p 470) అనే చెప్పిందేమనగా Macoupin County, Illinois ఉపరితలానికి 90 అడుగుల లోతులో ఒక మానవ అస్థిపంజరం దొరికింది. ఆ నివేదిక ప్రకారం, ఆ అస్థిపంజరం మీద రెండు అడుగుల డట్టమైన, విరగని/చెదరని బలపపుఱాయి ఉంది. Illinois, రాష్ట్రపు ప్రభుత్వ భూగర్భ శాస్త్రజ్ఞుని ప్రకారం నేను తెలుసుకున్నదేమిటంటే, ఆ అస్థిపంజరం కూడా, ఆ బంగారపు గొలుసులాగానే 30 కోట్ల ఏళ్ళ నాటిది. అది కూడా అదే రాష్ట్రంలో దొరికింది.
ఇంకా ఉంది....
Saturday, 27 January 2018
శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (6 వ భాగము)
దొరకని పరుల ధనముల - దోచక యుండితే చాలు
గురుతుగాను గోపురము - గట్ట నేటికే మనసా ||
భక్త రామదాసు గారు ఇంకా ఇలా చెబుతున్నారు. నీది కానీ ధనాన్ని, పరుల సొమ్మును దోచుకోకుండా ఉంటే చాలు, నీకు ఎంతో డబ్బు ఉందని చెప్పడానికి గుర్తుగా పెద్ద ఆలయం కట్టడమెందుకు?
దేవాలయం నిర్మించడమంటే సామన్యమైన విషయం కాదు. ఆలయమంటే ఒక వ్యవస్థ. గుడి కట్టడమంటే శాశ్వతమైన వ్యవస్థను నిర్మించడం. అది ఎంతో పుణ్యం. అంతకంటే పుణ్య కర్మ పురాతన ఆలయానికి జీర్ణోద్ధరణ చేయడం. పాత గుడిని పునఃఅభివృద్ధి చేయడమంటే 100 నూతన ఆలయాలు నిర్మించడంతో సమానమని శాస్త్రం చెబుతుంది. కానీ అలాంటి పుణ్యకర్మను దోచుకున్న సొమ్ముతో నిర్మిస్తే ఏం లాభం? అవినీతికి పాల్పడిన వ్యక్తియే కాదు, అతడి అవినీతి సొమ్ముతో కొన్న దినుసులతో వండబడిన ఆహారం తిన్నవాడికి కూడా ముక్తి లభించదని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. దోచుకున్న సోమ్ముతో అన్నదానం చేస్తే, దానికి సాధువులు, సన్యాసులు హాజరవ్వకూడదని కూడా ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఆ సొమ్ముని యజ్ఞయాగాదుల్లో ఉపయోగించకూడదు. దాన్ని విరాళంగా, దానంగా తీసుకోకూడదు. ఇలా శాస్త్రం దోచుకున్న ధనాన్ని ఎన్నో రకాలుగా నిషేధించింది. అంతెందుకు, ఆ సొమ్మును భగవంతుడు సైతం అంగీకరించడు. దానికి ఉదాహరణ గాలి జనార్ధన్ రెడ్డి. ప్రకృతి సంపద అయిన ఉక్కు విషయలో అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్ములో కొంత భాగంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి కిరీటం చేయిస్తే, ఇంతవరకు స్వామి దాన్ని ధరించనేలేదు. ఇక ఆ కిరీటం ఇవ్వడమెందుకు? తాను ఇచ్చానని గొప్పలు చెప్పుకోవటానికే.
నిజంగా దైవం పట్ల భక్తి, విశ్వాసం ఉన్నవాడు, అడుక్కుతినే స్థితిలో ఉన్నా, పరుల నుంచి రూపాయి కూడా ఆశించడు. ఇతరుల వస్తువుల కోసం ఆశపడడు. పరుల ధనంలో పావలా కూడా తన ధనంలో కలవనీయడు. ఎందుకంటే ఈశ్వరాదేశంతో తనకు వచ్చినది రూపాయయైనా, అదే మహా ప్రసాదంగా భావిస్తాడు. గోపన్నగారు అదే అంటున్నారు. ఇతరుల నుంచి దోచిన ధనం పాపం. అది నిన్ను రాముడి నుంచి దూరం చేస్తుంది. నువ్వా రాముడిని ప్రేమిస్తే, ఆయన్ను చేరుకోవాలనుకుంటే గొప్పగా గుడి కట్టక్కర్లేదు. నీదికాని డబ్బును దోచుకోకుండా ఉంటే చాలు. అదే గొప్ప యోగము. పరుల సొమ్ముని ఆశించి, గుళ్ళూ గోపురలు కడతానంటావేమిటే మనసా!
ఇంకా ఉంది....
Friday, 26 January 2018
ఒక ఆటగా జీవితం- స్వామి సచ్చిదానంద బోధ
Life as a Game
Really healthy people take everything in life as a game. Whether they win or lose, it’s still a game. Often people forget that. In a way, I feel that losing is a better game. Why? When the other person wins, what do you see? A winning face. When you win and the other person loses, what do you see? A losing face. There is great joy in losing and seeing the other person win and have a happy face. Who will be the happiest person? The one who brings happiness to others. That means our minds should be well-balanced under all conditions. That is Yoga.
- Swami Satchidananda
Subscribe to:
Posts (Atom)
