Sunday, 31 March 2013

క్షిప్ర గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

క్షిప్ర గణపతి

32 గణపతులలో 10వాడు క్షిప్ర గణపతి. కోరిన కోరికలను అత్యంత వేగంగా తీర్చేవాడు ఈయన. రక్తవర్ణ దేహంతో 4 చేతులు కలిగి ఉంటాడు. దంతము, పాశములను కుడి చేతులలో, కోరిన వరములిచ్చే కల్పవృక్షము, అంకుశములను ఎడమ చేతులలో ధరించి దర్శనమిస్తాడు క్షిప్ర గణపతి. వంకర తిరిగిన తొండం(వక్ర తోండం)తో రత్నకుంభమును పట్టుకుని ఉంటాడు.

మృగశిర నక్షత్రానికి సంబంధించిన వాడు కనుక మృగశిర నక్షత్రం వాళ్ళు ఈయన్ను ఆరాధిస్తే జీవితం సుఖవంతమవుతుంది.

ఈయన నిత్యం ధ్యానించడం వలన జ్ఞానం కలుగుతుంది. జీవితంలో సకల కోరికలు తీరుతాయి.

ఈయన ప్రధాన దేవాలయం అహోబిలంలో ఉంది. తమిళనాడులో ఉన్న పిళ్ళయార్పత్తి కర్పగ వినాయక దేవాలయం, ఆంధ్రప్రదేశ్ శ్రీ శైలంలో ఉన్న భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి దేవాలయం, కర్ణాటక శ్రీ రంగపట్టణంలో ఉన్న జ్యోతిర్మహేశ్వర దేవాలయాల్లో ఈయన ప్రత్యేకంగా పూజలందుకుంటున్నాడు.

క్షిప్ర గణపతి ప్రార్ధన శ్లోకం :

దంతం ప్రకల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

।। ॐ गं गणपतये नमः ।।
Om gam ganapataye namaha

Kshipra Ganapati is the 10th of Lord Ganesha’s 32 forms. Among all the forms Kshipra Ganapathi is believed to satisfy the devotees immediately. The lord appears in red hue complexion with four hands. On his main right hands holds a broken tusk and on the main left hand holds sprig of Kalpavriksha (wish-fulfilling tree) and on the other both hand holds noose and elephant goad. The trunk of Kshipra Ganapati is curved towards the right upturned holding ratnakumbha (pot containing precious jewels).

Makayiram (Mrigashirsha) Nakshatra is related to Kshipra Ganapati. Worshipping Kshipra Ganapati form of Lord Ganesh is believed to give knowledge. Meditating every day the lord will help devotees by granting long-life and fulfills their wishes.

Kshipra Ganapati one of the 32 Forms of Lord Ganesh or Ganesha


Some of the well known Kshipra Ganapati Temples in India are

1) Pillayarpatti Karpaga Vinayagar Temple in Karaikudi, Tamil Nadu
2) Jyothirmaheshwara Temple in Srirangapattinam, Karnataka
3) Bhramaramba Mallikarjuna Temple in Srisailam, Andra Pradesh
4) Ashtavinayak Temple in Pune, Maharastra (This is west facing temple)
5) Manasa Sarovar in Omkar Hills, Bangalore, Karnataka
6) Kanyakumari Temple in Kanyakumari, Tamil Nadu
7) Manthakara Mahaganapathi Temple in Kalpathy
8) Temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures

Kshipra Ganapati Mantra 

Dantakalpalata Pasharatna Kumbhanksho Jvalam!!
Bandhooka Kamaniyabham Dhyaayeth Kshipraganadhipam!!
   
।। ॐ गं गणपतये नमः ।।
Om gam ganapataye namaha

Saturday, 30 March 2013

విఘ్న గణపతి

||ఓం గం గణపతయే నమః ||
।। ॐ गं गणपतये नमः ।।

విఘ్న గణపతి 32 గణపతులలో 9వ వాడు. ఈయన పేరేలోనె ఉంది ఈయన విఘ్నములను తొలగించేవాడని. 8 భుజములతో, శంఖు, చక్రాలను, చెఱుక గడ, పాశం, దర్భలు, అంకుశం, దంతం ధరించి ఉంటాడు. వక్రతొండంతో(వంకర తిరిగిన తొండంతో) పూలగుత్తిని పట్టుకుని దర్శనమిస్తాడు. శరీరం నిండా మంచి ఆభరణములు ధరించి రక్త వర్ణంతో కనిపిస్తాడు.

విఘ్న గణపతి రోహిణి నక్షత్రానికి సంబంధించిన వాడు.రోహిణి నక్షత్ర జాతకులు ఈయనను ఆరాధిచడం వల్ల జీవితంలో సుఖమయమవుతుంది.

తిరుకురుంగుడి దేవాలయం తిరునల్వేలి, తమిళనాడులో విఘ్న గణపతి ప్రత్యేకంగా పూజలందుకుంటున్నాడు.

విఘ్న గణపతి శ్లోకం :

పాశంకుశం ధరన్నాం ఫలాశీ చాక్షువాహనః
విఘ్నం నిహతు నః సర్వం రక్తవర్ణో వినాయకః 

విఘ్నగణపతిని ధ్యానిస్తూ 5 సార్లైనా పై శ్లోకాన్ని పఠిస్తే విఘ్నాలు కలుగవు.

||ఓం గం గణపతయే నమః ||
।। ॐ गं गणपतये नमः ।।

Friday, 29 March 2013

ఉఛ్ఛిష్ట గణపతి


।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

32 గణపతులలో ఉఛ్ఛిష్ట గణపతి 8వ వాడు. సర్వ విధములను కోరికలను తీర్చేవాడు, అందరికంటే అధికుడు ఉఛ్ఛిష్టగణపతి. 6 చేతులతో తన ఎడమతోడ పై శక్తిని కూర్చోపెట్టుకుని, నీలి వర్ణంతో ప్రకాశిస్తుంటాడు. కుడిచేతిలో జపమాల, దానిమ్మ పండు, వరికంకులను, ఎడమ చేతిలో వీణ, నీలి కలువ పువ్వు, ఇంకొక చేతితో శక్తిని పట్టుకుని ఉంటాడు. ఈయన తొండం వంకర తిరిగి ఉండదు.

కృతిక నక్షత్ర జాతకులు ఉఛ్ఛిష్ట గణపతిని విశేషంగా ఆరాధించాలి. ఈయన ఆరాధనతో సకల కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. జీవితంలో ఉన్నతి స్థానాలకు చేరుకుంటారు.

ఉఛ్ఛిష్ట గణపతికి సంబంధిచిన ప్రధాన ఆలయం రాక్ ఫోర్ట్ ఉచ్చి పిళ్ళయార్ దేవాలయం, తిర్రుచిరపల్లి, తమిళనాడులో ఉంది.

శ్లోకం :

లీలాబ్జం దాడిమం వీణా శాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్చిష్ట నామాయం గణేశః పాతు మేచకః

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

।। ॐ गं गणपतये नमः ।।
Om Gam Ganapataye Namaha

Ucchista Ganapati is the 8th of the 32 forms of Lord Ganesha. Ucchista Ganapathy means “the lord of blessed offering and the lord of superiority”. This form of Ganesha is depicted in sitting posture with six hands and on the left thigh seated with his Shakti (Devi or Goddess). On his main right hand holds the Japa beads mala (Rudraksha), second holds pomegranate fruit and the third/ upper holds the fresh sprig of paddy. His main left hand hold around his Shakti, second hand hold the Veena and third/upper hand holds blue lotus. The tusk is not curled and Ucchista Ganapathi appears in blue complexion.

Karthika Nakshatra is related to Ucchhishta Ganapathy. Worshipping this form of Lord Ganesh is believed to give the devotees predominance. Lord blesses the devotee success and promotions in work, and superiority in life.

Ucchista Ganapati Temples in India

Ucchhishta Ganapati can be worshipped in the famous Rockfort Ucchi Pillayar Temple in Thiruchirapalli, Tamilnadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka and Maha Ganapathi Temple in Thiruvananthapuram, Kerala has 32 forms of Ganapati sculptures.

Ucchhishta Ganapati Sloka

Neelabja Dadaimee Veena Shali Gujaksha Sutrakam
Dadahduchishta Namamya Ganeshah Paadu Mechakah!

।। ॐ गं गणपतये नमः ।।
Om Gam Ganapataye Namaha

Eco vinayaka
source: http://www.hindudevotionalblog.com/2011/12/ucchista-ganapati-form-of-ganesha.html

Thursday, 28 March 2013

సిద్ధి గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః


32 గణపతులలో 7వ వాడు సిద్ధి గణపతి. ఈయన పూర్ణత్వానికి సంకేతం. బంగారు వర్ణంలో వెలిగిపోతుంటాడు సిద్ధి గణపతి. కుడి చేతిలో మామిడి పండు, పరశువు, ఎడమ చేతిలో పూలగుత్తి, చెఱుకుగడలు ధరించి, తొండంతో నువ్వుల కుడుమును పట్టుకుని దర్శనమిస్తాడు సిద్ధి గణపతి.

భరణీ నక్షత్ర జాతకులు సిద్ధిని గణపతిని నిత్యం ఆరాధించాలి. ఈయనకు సంబంధించి ముంబాయిలో ఉన్న శ్రీ సిద్ధి గణపతి ఆలయం ప్రపంచ ప్రసిద్ధం.

సిద్ధి గణపతి ఆరాధనతో కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగల సక్తి సాధకులకు లభిస్తుంది. ఈయనను పూజిచడం వలన అష్టసిద్దులు కలుగుతాయి.

సిద్ధి గణపతి శ్లోకం :

పక్వ చూత మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమః శ్రీ సమృద్ధియత హేమపింగళ

ఓం గం గణపతయే నమః
।। ॐ गं गणपतये नमः ।।


।। ॐ गं गणपतये नमः ।।
Om Gam Ganapataye Namaha

Siddhi Ganapati or Siddha Ganapathi is the 7th of Lord Ganesha’s 32 forms and signifies “the Accomplished”. In Siddhi Ganapathi form the lord assume a relaxed pose who is believed to be perfect embodiment of master of intellect and accomplishment.

Lord Siddhi Ganapati appears with four hands in the golden yellow colour. On his right hands holds mango and battle axe, on his left hand holds bouquet of flowers and Sugarcane plant with leaves and roots. On his trunk curled to left hold sweet made of sesame seeds and jaggery.

Bharani Nakshatra is related to Siddhi Ganapati. Worshipping this form is believed to get power of achievement. Lord blesses the devotee with Ashta Siddhi's, success in any tasks.

Siddhi Ganapati Temples in India :

Siddhi Ganapathi can be worshipped in famous Shree Siddhi Vinayaka Temple in Mumbai, Maharashtra.  Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapathi sculptures. Pazhavangadi Ganapathi Temple in Thiruvananthapuram also has mural painting of 32 forms of Ganesha.

Siddhi Ganapati Mantra :

Pakva Chootaphala Pushpa
Manjari Cheshudanda Thilamodakaihi Sah
Udvahan Parashumastu Te Namah
Shri Samrudhiyutha Hemapingala

।। ॐ गं गणपतये नमः ।।
Om Gam Ganapataye Namaha

source:http://www.hindudevotionalblog.com/2011/11/siddhi-ganapati-form-of-lord-ganesh.html

Wednesday, 27 March 2013

ధ్విజ గణపతి

|| ఓం గం గణపతయే నమః ||

ధ్విజ గణపతి 32 గణపతులలో 6వ అవతారం.

పుట్టిన ప్రతి వ్యక్తికి 16 సంస్కారాలను శాస్త్రం విధించింది. అవి మనిషిని ఉన్నతుడిని చేస్తాయి. అందులో ముఖ్యమైనది ఉపనయనం(ఇది అందరు చేసుకొవలసినది, ఏ కులానికి నిషిద్ధం కాదు). ఉపనయనం సంస్కారం జరిగిన వారిని ధ్విజులు అంటారు, అంటే మళ్ళీ జన్మించినవారని అర్ధం.

ధ్విజ గణపతి బ్రహ్మదేవునితో సమానమైనవాడు. ఈయనుకు కూడా బ్రహ్మ దేవుడివలే 4 ముఖాలుంటాయి. ఎడమ చేతిలో దండం, తాళపత్ర గ్రంధాలు, కుడిచేతులో కమండలం, జపమాల ఉంటాయి. బ్రహ్మజ్ఞాన సూచకంగా నుడిటిపై మూడవనేత్రం ఉంటుంది. చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశిస్తుంటాడు ధ్విజ గణపతి.

అశ్విని నక్షత్రంలో జన్మించినవారు ఈ ధ్విజ గణపతిని ఆరాధించాలి. మహారాష్ట్రలోని పాలీ లో ఉన్న బల్లాలేశ్వర క్షేత్రంలో ధ్విజ గణపతి ప్రాధనంగా అర్చింపబడుతున్నాడు.

శ్లోకం :
యః పుస్తకాక్ష గుణదండకమడల శ్రీః
నిర్వర్త్యమాన కరభూషణమిందు వర్ణం
స్తంభేరమానన చతుర్భుజ శోభమానం
త్వాం సంస్మరేతి ద్విజగణాధిపతిం స ధన్యః

ధ్విజ గణపతిని ధ్యానిస్తే మేధసంపన్నులవుతారు, ఆర్థిక కష్టాలు తొలిగి, సంపద చేకూరుతుంది, ప్రపంచంలో తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.

|| ఓం గం గణపతయే నమః ||


|| Om Gam Ganapataye Namaha ||

Dwija Ganapati or Dvija Ganapathi is the 6th of Lord Ganesha's 32 forms. Regarded as the Twice Born, Dwija Ganapathi is depicted to be equivalent to Lord Brahma.

Dwija Ganapati is represented with four heads and four hand in moon-white like in color. Dvija Ganapathi holds Japa beads mala (rudraksha), a water vessel (kamandalam), a staff (Dandam) and an old leaves scripture pustaka (ancient books made from leaves).

Ashvini Nakshatra is related to Dwija Ganesh. Worshipping this form of God Ganesh is believed to help in reduce debt problems and make materialistic gains. Dvija Ganapati can be worshipped in to attain good name and fame in the world. And will increase the memory of the worshipper.

Dwija Ganapati Temples in India :

Ballaleshwar Temple in Pali, Maharashtra is one of the main Ganesha Temples where Dvija Ganapati can be worshipped. Ballaleshwar Vinayak Temple is one of the eight Astavinayaka temples in Maharashtra. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures.

Dvija Ganapati Mantra :

“Yah Pustakakshaguna Danda Kamandalu
Shrividyothaman, Karabhooshanaminduvarnam,
Stambera Maanana Chatushtaya Shobhamaanam
Tvam Yah Smaredwija Ganadhipate Sa Dhanyah!”

|| Om Gam Ganapataye Namaha ||

Saturday, 23 March 2013

కుండ నీటినే త్రాగుదాం

వేసవి ఇంకా పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్ళిరాగానే ఫ్రిజ్ లో నుండి అప్పుడే తీసిన చల్లచల్లని నీరు త్రాగి దాహం తీర్చుకున్నాం అనుకుంటారు కానీ నిజానికి ప్రిజ్ నీరు దాహాన్ని తీర్చవు, సరికదా దాహాన్ని రెట్టింపు చేస్తాయి. పైగా అవి ఆరోగ్యానికి అసలే మంచివి కాదు, వేడి చేస్తాయి, జలుబు దగ్గుకు కారణమవుతాయి. కఫాన్ని పెంచుతాయి. ఆయుర్వేదం కూడా అతిశీతలీకరణ యంత్రాలలో(ప్రిజ్) ఉంచిన నీరు త్రాగకూడదని గట్టిగా చెప్పింది.

మట్టికుండలకు అతి సూక్ష్మమైన రంధ్రాలుంటాయి. వాటి ద్వార నిత్యం గాలి చొరబడడంతో పాటు కొంత నీరు ఆవిరివతుంది. అందువల్ల కుండనీరు చాలా చల్లగా ఉంటాయి. మట్టి కుండ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దాహం తీర్చడంతో పాటు జలుబు, దగ్గు రాకుండా చూస్తాయి. చలికాలంలో త్రాగినా కూడా జలుబు చేయదు.మరీ చల్లగానూ, మరీ వేడిగానూ కాకుండా ఎంత అవరసరమో, అంత చల్లగా మాత్రమే ఉంటాయి. అందుకే ఎల్లప్పుడు ఆరోగ్యం కోసం కుండ నీరే త్రాగండి.

కుండలు చేయడం ఒక కళ. అది కుమ్మరికే సొంతం. అది అంతరించిపోకూడదు. కళను ప్రోత్సహించడం కోసమైనా కుండలు కొనండి.

ప్రభూత్వాలు కుమ్మరివాళ్ళ గురించి పట్టించుకోవంటూ విమర్శలు చేయడం వల్ల వారికి ఓరిగేదేమి లేదు. అందుకే మన వంతూగా కుండలు కొని ఒక కుమ్మరి కుటుంబంలో వెలుగులు నింపుదాం. మనకున్న సామాజిక బాధ్యతను నిర్వర్తిద్దాం.

కుండ నీటినే త్రాగుదాం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.

జై హింద్

Fridge water damage health.
Buy earthern pots. They are natural.
They are good for health.
Pottery is an art. Encourage it. Help Potters by purchasing a earthern pot.

Jai Hind

Friday, 22 March 2013

ఎర్త్ అవర్

పెరుగుతున్న భూతాపం(Global Warming) ఈ భూమి మనుగడకు ఒక ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2100 కి ఈ భూమి మీద జీవం పూర్తిగా నాశనమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు.

విద్యుత్ వాడకంలో Carbon-di-oxide విడుదలవుతుంది. ఇది Global Warming పెరగడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, విద్యుత్ ని పొదుపు చేయాలన్న సందేశం ప్రజలకు చేరదానికి 2007 లో "ఎర్త్ అవర్"(Earth hour) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 152 దేశాల ప్రజలు స్వచ్చందంగా ఈ ఎర్త్ అవర్ లో పాల్గొంటున్నారు. 

మన చేయాల్సిందల్లా ఒక గంట పాటు మన ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను వాడకాన్ని ఆపేసి,ప్లగ్స్ నుంచి తొలగించాలి.

ఎర్త్ అవర్ చేయాల్సిన సమయం : మార్చి 23, శనివారం రాత్రి 8.30 నుంచి 8.30 వరకు.

Unplug all Electronic items for One hour from 8.30PM To 9.30 PM on March 23 For the Sake of Earth.

Uniting the planet to project the planet.

రండి! మన భూమిని, మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం.

ఆమలక ఏకాదశి


Photo: ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ

ॐ మార్చి 23, శనివారం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. దీనికే ఆమలక ఏకాదసి, ధాత్రీ ఏకాదశి ఎని పేర్లు. ఆమలకం అంటే ఉసిరి అని అర్ధం. దీన్నే ధాత్రీ అబి కూడా అంటారు. ఉసిరిచెట్టు విష్ణుస్వరూపం. ఆమలక ఏకాదశి నాడు ఉసిరిక చెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలం లభిస్తుంది. 

ॐ ఈ ఏకాదశి నాడు చేసిన ఏ చిన్న దానమైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా శ్రీ విష్ణూ సహస్రనామ స్తోత్రాన్ని పారయణ చేయడం ఉత్తమం. శ్రీ విష్ణూ సహస్రనామం స్తోత్రం చదవడం రానివారు, "శ్రీ రామ రామ రామ" అనే నామాన్ని భక్తితో వీలైనని సార్లు జపించండి.

ॐ శ్రీ మహావిష్ణు లేక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ

Eco vinayaka
ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ

ॐ మార్చి 23, శనివారం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. దీనికే ఆమలక ఏకాదశి,  ధాత్రీ ఏకాదశి ఎని పేర్లు. ఆమలకం అంటే ఉసిరి అని అర్ధం. దీన్నే ధాత్రీ అబి కూడా అంటారు. ఉసిరిచెట్టు విష్ణుస్వరూపం. ఆమలక ఏకాదశి నాడు ఉసిరిక చెట్టు కిందఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలం లభిస్తుంది.

ॐ ఈ ఏకాదశి నాడు చేసిన ఏ చిన్న దానమైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా శ్రీ విష్ణూ సహస్రనామ స్తోత్రాన్ని పారయణ చేయడం ఉత్తమం. శ్రీ విష్ణూ సహస్రనామం స్తోత్రం చదవడం రానివారు, "శ్రీ రామ రామ రామ" అనే నామాన్ని భక్తితో వీలైనని సార్లు జపించండి.

ॐ శ్రీ మహావిష్ణు లేక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ

Eco vinayaka

Monday, 18 March 2013

శక్తి గణపతి

|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

5. శక్తి గణపతి
ॐ సింధూరవర్ణంతో విలసిల్లే ఈ శక్తిగణపతి తన వామకటి(ఎడమతోడ)పై సకల జీవులకు శక్తిని ప్రసాదించే దేవిని(శక్తిని) కూర్చోబెట్టుకుని నాలుగు చేతులతో దర్శనమిస్తాడు.

ॐ దిగువ కుడిచేతిలో దంతం ధరించి, తనను నమ్ముకున్నవారికి అండగా తాను నిత్యం ఉంటానని గుర్తుచేయడానికి సూచికగా అభయముద్రతో ఉంటాడు. దిగువ ఎడమ చేయి ఆకుపచ్చని వర్ణంతో వెలిగిపోతున్న శక్తిని పట్టుకుని, మిగితా చేతులలో అంకుశం, పాశం ధరించి ఉంటాడు శక్తి గణపతి.

ॐ ఆకాశ తత్వానికి ప్రతీక శక్తి గణపతి. ఈయనను తిరుపరంకుండ్రం దేవాలయం, మదురైలో ప్రత్యేకంగా దర్శించవచ్చు.

ॐ శ్లోకం:
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టక తీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీడే

ॐ శక్తి గణపతి ఆరాధనతో ఇంద్రియాలను నిగ్రహించే శక్తి కలుగుతుంది. చేసే పని యెడల శ్రద్ధ పెరుగి, ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యం సిద్ధిస్తుంది. శక్తి గణపతి ఆరాధనతో ఇంటికున్న సకల దోషాలు తొలగిపోయి, గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.

|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

卐 Shakti Ganapathi is 5th of Lord Ganesha’s 32 forms. In Shakti Ganapati form, Lord Ganesh appears in tantric seated position with 4 hands and embracing Shakti Devi seated on his left knee, who gives power to all. His lower right hand posture Abhya Mudra bestow's blessing, both the left and right upper hands hold noose and goad and his left lower hand holds around Shakti Devi. The colour of Shakthi Ganapati is in reddish brown colour (sunset sky) and the Shakti Devi is associated in Green colour.

卐 Shakti Ganapathi is the last form representing the primordial element - Space (Akash). Worshipping this form of Lord Ganesh is believed to help the devotee to take control of the five senses, so to concentrate and achieve objectives without any trouble. Shakti Ganesha is also the protector of the householder, vanquishing evil and brings peace to the house.

卐  Sakti Ganapati represents Space i.e.,Akasha tatva. 

卐 Shakti Ganapathi Temples in India 

卐 Shakti Ganapati can be worshipped in Thiruparankundram Temple in Madurai, Tamil Nadu which is visited by many pilgrims. Also Ganapathi temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.


卐 Shakti Ganapati Mantra 

“Alingya Deveem Haritandgyashtim
Parasparakshlishta Katipradesham!
Sandhyarunam Pashasni Vahantham
Bhayapaham Shakti Ganeshameede.”
http://www.hindudevotionalblog.com/2011/11/shakti-ganapathi-32-forms-of-ganesha.html

Sunday, 17 March 2013

వీర గణపతి

|| 卐 ||  ఓం గం గణపతయే నమః || 卐 ||

4. వీర గణపతి

卐 భీకరరూపడైన ఈ గణపతికి 16 చేతులుంటాయి. ధనుస్సు, బాణం, చక్రం, త్రుశూలం, బేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశాలను  ధరించి, రక్తవర్ణ కాంతులతో జాజ్వల్యమానంగా వెలిగిపోతుంటాడు వీర గణపతి.

卐 పంచమహాబూతాలలో అగ్నితత్వానికి ప్రతీక వీర గణపతి. తమిళ్నాడు రాష్ట్రంలో మదురైలో ఉన్న మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవస్థానంలో వీర గణపతిని ప్రత్యేకంగా దర్శించవచ్చు.

బేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ పాశహస్తాన్
శులాంచ కుంత పరశుధ్వజ ముద్వహస్తం
వీరం గణేశం మరుణం సతతం స్మరామి


卐 వీర గణపతిని కనీసం 5 సార్లు ప్రతినిత్యం స్తుతిస్తే ధైర్యసంపదలు కలుగుతాయి.

|| 卐 ||  ఓం గం గణపతయే నమః || 卐 ||


|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

4. Veera Ganapati

卐 Veera Ganapati is 4th of Lord Ganesha’s 32 forms. In this form the Lord Ganesh is depicted as a Valiant Warrior in a commanding position. Veera Ganapathi is depicted with 16 arms with numerous weapons, symbol of mind - goblin (vethal), bow, arrow, chakra (wheel), sword, trident, victory flag, club, serpent, noose, ankusha, mace, hammer, shield, spear, and battle axe.

卐 The primordial element the Veera Ganapati represents is Fire (Agni- Tejo). Worshipping this form is believed to help in overcoming fears and gives courage to face difficult situations and also removes evil and ignorance.

卐 Veera Ganapathi Temples in India :

卐 Veera Ganapati can be worshipped in Arulmigu Meenakshi Sundareswarar Temple in Madurai, Tamil Nadu which is visited by many pilgrims. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures. Sree Maha Ganapathi Temple in Thiruvananthapuram also has paintings of 32 forms of Ganesha.

卐 Veera Ganapati Mantra

Vetala Shakti Shara Karumuka Chakra Kanga
Khadanga, Mudgara Gadaakusha Nagapasham
Shoolam Cha Kunta Parashu, Dhvajakudhvahantam
Veeram Ganeshamarunam, Satatam Smarami

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

Om Gam Ganapataye Namaha
http://www.hindudevotionalblog.com/2011/10/veera-ganapati-warrior-form-of-ganesha.html

Saturday, 16 March 2013

భక్తి గణపతి


|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ |

3. భక్తి గణపతి

ॐ శరత్ ఋతువులోని చంద్రుని వలే దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంటాడు భక్తి గణపతి. నాలుగు చేతులు కలిగి ఉంటాడు. కుడివైపు చేతులలో మామిడి, అరటి పండ్లు, ఎడమ వైపు చేతులలో కొబ్బరికాయ, క్షీరాన్నపాత్ర ధరించి దర్శనమిస్తాడు.

ॐ జలతత్వానికి అధిష్టాత భక్తి గణపతి. తమిళనాడులోని తిరునెల్వయిల్ అరాతురై, తీర్థ పురేశ్వర దేవస్థానంలో భక్తిగణపతిని ప్రత్యేకంగా దర్శించవచ్చు.

శ్లోకం:
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్చశాంక సదృశం భజే భక్తగణాధిపం

ॐ భక్తి గణపతి ధ్యానం వలన భక్తిప్రపత్తులతో అరలారుతారు.    

|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

Eco vinayaka

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

3. Bhakti Ganapati

卐  Shining like the full moon during harvest season and garlanded with flowers, Bhakti Ganapati, dear to devotees, is indeed pleasant to look upon. He holds a banana, a mango, coconut and a bowl of sweet payasa pudding.

卐  He represents primordial element is Water. Temple of Bhakti Ganapati is located in Theertha Pureeswarar (Arathurai Nathar) Temple - Tirunelvayil Arathurai.

卐 Slokam :
nArikELAmra kadaLI pAyasa dhAriNam
SaraccaSAnka sadruSam bhajE bhaktagaNAdhipam  

卐 Worshipping Bhakti Ganapati bestows devotion forever.

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

Friday, 15 March 2013

తరుణ గణపతి


|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

2. తరుణ గణపతి

ॐ అరుణవర్ణంతో 8 చేతులు కలిగి ఉంటాడు తరుణ గణపతి. వెలగపండు, వరికంకులు, దంతం, అకుశాలను కుడి చేతులలోనూ, కుడుము, నేరేడు పండు, చెఱుకుగడ, పాశాలను ఎడమ చేతులలోనూ ధరించి ఉంటాడు. వాయు తత్వానికి అధిష్టాత.తరుణగణపతిని మధ్యప్రదేశ్ లో ఉజ్జైని మహాకాలేశ్వర దేవాలయంలో దర్శించవచ్చు.

ॐ తరుణ గణపతి ధ్యాన శ్లోకం ॐ

పాశాంకుశపూప కపిత్థ జంబూఫలం
తిలాం చేక్షు మపిసన హస్తైః 
దత్తే సదాయ స్తరుణారుణాభః 
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశః 

ॐ తరుణగణపతిని నిత్యం ధ్యానించడం వలన కార్యోన్ముఖులు కాగలరు.

|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

Eco vinayaka

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

卐 Eight-armed, Taruna Ganapati, "the Youthful," holds a noose and goad, modaka, wood apple, rose apple, His broken tusk, a sprig of paddy and a sugar cane stalk. His brilliant red color reflects the blossoming of youth.

卐  He represnts vayu tatva. Taruna Ganapati's temples is located at Sri Mahakaleshwara Temple, Ujjain, Madhya pradesh, India.

卐 Sloka of taruNa gaNapati

pASAmkuSapUpa kapittha jambUphalam
tilAm cEkshu mapisana hastaihi
dattE sadAya staruNAruNAbhaha
pAyAtsayushmAn taruNO gaNESaha

卐 Meditating on Taruna Ganapati increases Concentration on work.

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

Thursday, 14 March 2013

బాలగణపతి

|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ || 

ॐ పురాణాలు, నాట్యశాస్త్రాలు, తాంత్రిక గ్రంధాల్లో గణపతికి 32 రూపాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

1) బాలగణపతి

బాలగణపతి రక్తవర్ణుడైన ఉంటాడు. ఈయనకు నాలుగు చేతులుంటాయి. వాటిలో అరటి, మామిడి పండ్లు, పనసపండు, చెఱుకుగడలను ధరిస్తాడు. తొండంతో మోదకం ధరిస్తాడు. పృధ్వీతత్వానికి అధిష్టాత. చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయంలో బాలగణపతి కొలువై ఉన్నాడు.

ॐ బాలగణాధిపతిని ధ్యానిస్తూ ఈ క్రింది శ్లోకం పఠిస్తే బాలలు విజ్ఞావంతులవుతారు.

కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్థకం,
బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిపం


|| ॐ || ఓం గం గణపతయే నమః || ॐ ||

Eco vinayaka

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

卐 Puranas, NAtya ShAstras, TAntric scriptures mention 32 forms Lord Ganesha.

1) Bala Ganapati

卐 Bala Ganapati is "the Childlike" God of golden hue. In His hands He holds a banana, mango, sugar cane and jackfruit, all representing the earth's abundance and fertility. His trunk garners His favorite sweet, the modaka.

卐 Primordial Element is Earth (Prithvi). Bala Ganapati Temple is Located In Sri Thillai Nataraja Temple, Chidambaram.

卐 Praying to Bala Ganapati with the below sloka will bestow children with Intelligence.

karastha kadalucUta panasEkshu kapitthakam,
bAlasUryaprabham dEvam vandE bAlagaNadhipam

|| 卐 || Om gam Ganapataye namaha || 卐 ||

pic courtesy: http://www.jaishreeganesha.com/Form-1n2.htm

Sunday, 10 March 2013

శివారాధన

‎|| ॐ || ఓం నమః శివాయ || ॐ || 
"తన్మే మనః శివసంకల్పమస్తు" 

ॐ ఈరోజు చాలామంది హాస్టల్స్ లో ఉంటున్నారు. కొందరు ఇంటికి దూరంగా ఉంటున్నారు. మరి వారు శివారాధన ఏలా చేయాలి? దానికి సమాధానం పరమశివుడు శివపురాణంలో చెప్తారు. 

ॐ నిత్యం పూజించేది స్థూలలింగం. అది అందుబాటులో లేకపోతే స్థావర లింగాన్ని గానీ, జంగమ లింగాన్ని కానీ అర్చిచమన్నారు. స్థావరాలు అంటే చెట్లు, లతలు, తీగలు. మన నిత్యం ఏ చెట్టునైనా శివుడిని భావుస్తూ దానికి నీరు పోస్తే అది తన అర్చనగా స్వీకరిస్తానన్నాడు భోళా శంకరుడు.

ॐ జంగామాలంటే పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు. ఇవన్ని శివస్వరూపాలు. వీటికి ఆహారం వేస్తే అది తనను ఆరాధించినట్టుగా భావిస్తానన్నాడు శివుడు.

ॐ నిత్యం మొక్కలు, చెట్లకు నీరు పోద్దాం. పశుపక్ష్యాదులకు ఆహారం పెడదాం. శివప్రేమకు పాత్రులవుదాం.

"తన్మే మనః శివసంకల్పమస్తు"

ॐ ఇవే కాకుండా భావలింగం కూడా ఉంది. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ మానవజన్మ రాదు. వచ్చినా ఈ సనాతనధర్మంలో పుట్టాలంటే రావాలంటే మరింత అదృష్టవంతులై ఉండాలి. అలా జన్మించినవారూ ఆ ఈశ్వరుడు ఎక్కడొ లేడు, తమలోనే ఉన్నాడు, తమ ఆత్మ కూడా శివస్వరూపమే అనే సత్యాన్ని జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు వారిలో భావలింగంగా స్వామీ ప్రకటితమవుతాడు. కానీ ఇది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు కనుక స్తూలలింగాన్ని నిత్యం ఆరాధించడం వలన ఎప్పటికైనా మనకు ఆ భావలింగాన్ని అర్చించే అవకాశం కలుగుతుంది.

"తన్మే మనః శివసంకల్పమస్తు"

ॐ తత్వతః చూసినప్పుడు భూమి శివస్వరూపం. భూమి మీదున్న ప్రకృతి పార్వతీ స్వరూపం. భూమిని, ప్రకృతిని కలుషితం చేస్తూ, పరమేశ్వరుడిని ఎంత ఆరాధించినా అది వ్యర్ధమే అవుతుంది.

ॐ పర్యావరణ పరిరక్షణ పరమశివారాధన. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని రక్షిస్తూ పశుపతిని(శివుడిని) ఆరాధించండి. శివానుగ్రహం పొందండి.

|| ॐ || ఓం నమః శివాయ || ॐ ||
"తన్మే మనః శివసంకల్పమస్తు"

Monday, 4 March 2013

RAMA SETU'S CONSTRUCTION

 ॐ  "NALA " of Ramayana is the Son of SRI VISHWAKARMA. He is the world's first "Hydraulic  Engineer."During Tretayuga, they  helped LORD RAMA to create a Way to Lanka.

 ॐ  They decided to construct a long SETHU(Bridge) on the Indian Ocean for Lord Sri Rama and his Warriors(VANARAS) to reach Lanka and to defeat RAVANA in the Battle.

 ॐ  They made a Bridge comprising the Length of 48 Kilometers, Width 2.5 to 3 Km and a depth of 22Feets (Inside the sea) by using the Cranes, Drilling Machines and other materials, with the help of experts(in Vanara sena).  Use of machines is described in Valmiki Ramayana 6-22-59.

 ॐ  Let us see how that was designed and constructed by Our Ancient Engineers.

 ॐ  NASA released some photographs of Ram Setu in 2002. According to research,  these images show a chained arrangement of rocks which was sub-merged in water on the stretch between Rameswaram in Tamil Nadu of India(Bharat) and Talaimannar on Sri Lanka.

 ॐ  A study of the Shuttel RADAR topographic  machine data reveals that Ram setu is 48 Kms long with 7 openings allocated at equal intervals to drain out water.

 ॐ  The Bridge is slightly Curve/Arc  shape, so it can withstand high currents of water.

 ॐ  It has been construced in shallow waters which cannot be a natural formation.

 ॐ  Another fact which proves it to be a man-made structure is its width, which is 2.5 kms to 3 kms and it increases gradually ad it advances towars Sri Lanka.  This design is in accordance with the rules of Modern Architecture.

 ॐ  Trethayuga's age cycle is 12,96,000 years, then later Dwaparayuga of 8,64,000 years) and the Kaliyuga( 4,32,000 Years). 5113 years have elasped in kaliyug till now. Lord Sri Ram incarnated at the end of Tretayuga. And ruled for 11,000 years. If we calculate the time period, 11,000 years+ 864,000 years+ 432,000 years+ some more years ruled by Kusha(Son of Lord Rama), the count reaches nearly 9,00,000 years.  And it reveals that We Hindus know such high Engineering Techniques  at that time.

 ॐ  Mr.Rajeev Deekshit  gave a presentation of photographs which prove that  stones in Ram setu were attached by the Bolts which are made up of Non-Corrosive metal and also by lime stone and  clay in some portions.

 ॐ  This shows that RAMA SETHU is not a Natural Formation. It was man-made structure and is the proof of Scientific Heritage of Ancient India (Bharat). And it is proof that Sri Ramayana is not a myth but a historical event and it is our Ancient History.

 ॐ  Say it with pride: We are Hindus.
 ॐ  Save RamSetu- Save India’s pride.
 ॐ  Jai Hind

|| ॐ || JAI SRI RAM - JAI JAI SRI RAM || ॐ ||