Showing posts with label పండుగలు. Show all posts
Showing posts with label పండుగలు. Show all posts

Friday, 16 December 2016

మార్కళి పిళ్ళైయార్



ధనుర్మాసం దేవతలకు తెల్లవారుఝాము కాలము. దైవశక్తిని ప్రచోదనం చేయటానికి ఈ నెల మొత్తం ఎంతో అనువైనది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసమంతా ఆండాళ్ అమ్మవారు రచించిన పాశురాలు చదువుతూ, ధనుర్మాస వ్రతం చేస్తారు. శైవులు అరుణాచలంలో రచించబడిన తిరువెంపావై చదువుతూ, సదాశివుడిని అర్చిస్తారు. అలాగే ద్రావిడ ప్రాంతాల్లో, ముఖ్యంగా శ్రీ లంకలో, అక్కడి సంప్రదాయంలో, శైవాగమం ప్రకారం గణపతిని విశేషంగా పూజిస్తారు. అందులో ఈ ధనుర్మాసం మొత్తం వినాయక స్వామిని అరించే సంప్రదాయం ఉంది.

దాని గురించి నందినాథ సంప్రదాయం కైలాస పరంపరకు చెందిన గురుదేవులు సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి ఈ విధంగా చెప్పారు- మార్కళి పిళ్ళైయార్ అనేది గణపతిని ఈ మాసమంతా ఆరాధించే పండుగ. వేల ఏళ్ళుగా చలికాలంలో వినాయకుడిని ఉద్దేశించి ఈ పండుగ/ పూజ జరుగుతోంది. తమిళ మాసమైన మార్కళి - డిసెంబరు మధ్య నుంచి జనవరి మధ్య వరకు- మనం పిళ్ళైయార్ (గణపతి) ని ఎంతో భక్తితో, ప్రత్యేక పూజలు, జపాలు, భజనలతో పూజిస్తాము. సంవత్సరంలో ఇది అత్యంత ఆధ్యాత్మికత ఉట్టిపడే సమయం. ఈ సమయంలో ప్రయత్న పూర్వకంగా, మూఖ్యంగా తెల్లవారుఝాము 4 గంటల నుంచి 6 వరకు గణపతిని ధ్యానిస్తాము. సంప్రదాయంలో, అన్ని పూజలు, ఆధ్యాత్మిక సాధనలు మార్కళి మాసంలో మొదలవుతాయి, ఇంటిని ప్రతి రోజు శుభ్రం చేస్తారు.

ఓం శ్రీ గణేశాయ నమః 

Thursday, 15 December 2016

ధనుర్మాసం విశిష్టత

16 డిసెంబరు 2016, శుక్రవారం నుంచి  ధనుర్మాసం ప్రారంభం


ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని �బాలభోగం� అని పిలుస్తారు.

భోగితో ముగుస్తుంది:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) �మార్గళి వ్రతం� పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

ఎంతో పునీత మాసం:
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. �ధను� అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

బ్రహ్మముహూర్తంలో పారాయణం:
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్‌ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో �తిరు� అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం,త ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ, తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్య ంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

శ్రీకృష్ణుడికి తులసిమాల:
ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి, ఆశీస్సులు అందుకోవాలి.

శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సుల భంగా వశపరచుకోవచ్చనీ, నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన ,శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం.

ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది . ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.

కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:
రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

కాత్యాయనీ వ్రతం:
పూజా విధానం:
రోజులానే ముందు పూజ చేసుకోవాలి... ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం,గోదా అష్టోత్తరం చదువుకోవాలి..రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది... ముందుగా ప్రార్ధన చదవాలి...ఆ తరువాత వరుసగా తనయ చదవాలి...తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి...తనయ చదువుతూ తొమ్మిది,పది తనయలు రెండు సార్లు చదవాలి..చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్ధన చదవాలి..ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి..ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.. పాశురములు చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి..అల మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి...అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను,చివరపాశురంలో ఒక లైను చదవాలి..
చివరగా గోదా హారతి చదవాలి..మంత్ర పుష్పం కూడా చదవాలి..మళ్ళి ఏ రోజు పాశురం ఆ రొజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి...నైవేద్యం సమర్పంచాలి(రోజు పొంగలి,తద్ధోజనం,పరవన్నం ఉండి తీరాలి....కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు...కాని ఒక్క విషయం గుర్థుకు పెట్టుకోవాలి..పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి..

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=6&ContentId=200981 

Monday, 12 December 2016

13 డిసెంబరు 2016, మంగళవారం, మార్గశిర పూర్ణిమ, దత్తపూర్ణిమ.



శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.

దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.

ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.

సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.

మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!

Source: http://archive.andhrabhoomi.net/content/dattatreya-jayanthi

Sunday, 30 October 2016

స్వామి శివానంద దీపావళి సందేశం



O Ram! The light of lights, the self-luminous inner light of the Self is ever shining steadily in the chamber of your heart. Sit quietly. Close your eyes. Withdraw the senses. Fix the mind on this supreme light and enjoy the real Deepavali, by attaining illumination of the soul.

He who Himself sees all but whom no one beholds, who illumines the intellect, the sun, the moon and the stars and the whole universe but whom they cannot illumine, He indeed is Brahman, He is the inner Self. Celebrate the real Deepavali by living in Brahman, and enjoy the eternal bliss of the soul.

- Swami Sivananda

Saturday, 29 October 2016

స్వామి కృష్ణానంద దీపావళి సందేశం



Bhagavati Mahalakshmi, the Goddess of prosperity, does not merely mean the Goddess of wealth in a material sense. Lakshmi does not mean only gold and silver. Lakshmi means prosperity in general, positive growth in the right direction, a rise into the higher stages of evolution. This is the advent of Lakshmi. Progress and prosperity are Lakshmi. In the Vishnu Purana we are told if Narayana is like the sun, Lakshmi is like the radiance of the sun. They are inseparable. Wherever Narayana is, there is Lakshmi. Wherever is divinity, there is prosperity. So on this day of Dipavali we worship the Supreme God who is the source of all conceivable virtues, goodness and prosperity, which is symbolised in illumination, lighting and worship in the form of Arati and a joyous attitude and feeling in every respect. So, in short, this is a day of rejoicing over the victory of Sattva over the lower Gunas, the victory of God Himself over the binding fetters of the soul.

- Swami Krishnananda

Friday, 28 October 2016

స్వామి చిదానంద సరస్వతి గారి దీపావళీ సందేశం



The significant act during Diwali is the lighting of lamps to brighten every nook and corner. Within the interior of thy own being, do likewise.Wisdom is the Light to dispel this Darkness of spiritual Ignorance. The Presence of God pervades this universe. O Man: Know this and live in virtue and holiness. For thou art ever in the Presence of the Most High. HE alone is the reality indwelling all names and forms and all beings are verily His moving tabernacles. This is Wisdom. Light up thy life with this wisdom and dispel the darkness of worldliness and materialism from your life.

- Swami Chidananda saraswati

Tuesday, 31 May 2016

హనుమజ్జయంతి - స్వామి శివానంద ప్రవచనం




హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి గురించి వినాలి, లేదా చదవాలి. ఎవరికి హనుమంతుడి అనుగ్రహం కలగాలని స్వామి హనుమ భావిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ పని చేస్తారట. జీవన్ముక్తులు స్వామి శివానందగారు హనుమంతుడి గురించి చెప్పిన ఈ విషయాలను చదివి, స్వామి అనుగ్రహాన్ని పాత్రులుకండి.
ఓం శ్రీ హనుమతే నమః

----------------------------

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

ఎక్కడ రాముని కీర్తిస్తున్నా, అక్కడ అంజలి ముద్రతో తన దోసిలిని నుదుటిపై ఉంచి, నీళ్ళు నిండిన కళ్ళతో కనిపించే, రాక్షాసాంతకుడైన మారుతికి నమస్కారాలు.

శ్రీ హనుమంతులవారిని భారతదేశమంతా, రామ సహితంగా, లేక మాములుగానైన పూజిస్తారు. శ్రీ రాముడున్న ప్రతి ఆలయంలో హనుమంతుడుంటాడు. ఆంజనేయస్వామి శివుడి అవతారం. వాయుదేవుడికి, అంజనాదేవికి జన్మించారు. పవనసుతుడు, మరుతసుతుడు, పవనకుమారుడు, భజరంగబలి, మహావీరుడు అంటూ ఆయనకు అనేక నామాలున్నాయి.

శ్రీ రామనామం మూర్తీభవించిన స్వరూపం హనుమంతుడు. ఆయన ఆదర్శవంతమైన నిస్వార్ధ సేవకుడు, నిజమైన కర్మయోగి, నిష్కామంగా, వేగంగా కార్యాలు నిర్వర్తించాడు. ఆయన గొప్ప భక్తుడు, గొప్ప బ్రహ్మచారి. శ్రీ రాముడి నుంచి ఏమీ ఆశించకుండా, శుద్ధమైన ప్రేమతో, భక్తితో సేవించాడు. ఆయన జీవించిందే రాముడిని సేవించడం కోసం. ఆయన వినయవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి. దైవలక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతరలకు అసాధ్యమైనవన్నీ ఆయన చేసి చూపించాడు - రామనామం మహిమతో సముద్రాన్ని దాటాడు, లంకాదహనం చేశాడు, సంజీవిని మూలికను తెచ్చి, లక్ష్మణుని ప్రాణాన్ని నిలబెట్టాడు. పాతాళలోకంలో అహిరావణుడి చెరనుంచి రామ, లక్ష్మణులను తీసుకువచ్చాడు.

ఆయనకు భక్తి, జ్ఞానం, నిస్వాధ సేవాతత్పరత, బ్రహంచర్య బలం, నిష్కామం ఉన్నాయి. ఆయన తన బుద్ధి, వీరత్వం గురించి ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు.

'నేను వినయం కలిగిన రామదూతను. నేను ఇక్కడకు వచ్చింది రాముడిని సేవించడానికి, ఆయన కార్యం నెరవేర్చడానికి. రాముని ఆదేశం మేరకే నేను ఇక్కడకు వచ్చాను. రామానుగ్రహం వలన నాకు ఏ భయంలేదు. నేను చావుకు భయపడను. ఒకవేళ రాముని సేవలో మరణం వస్తే, దాన్ని స్వాగతిస్తాను' అని స్వామి హనుమ రావణునితో అన్నారు.

ఇక్కడ గమనించండి, హనుమంతుడు ఎంత వినయసంపన్నుడో! రాముని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో! 'నేను వీరుడైన హనుమంతుడను. నేను ఏదైనా చేయగలను' అని ఆయన ఏనాడు అనలేదు.

'నేను నీకు చాలా ఋణపడి ఉన్నాను ఓ వీరుడా! నీవు అద్భుతమైన, మానవాతీత కృత్యాలు చేశావు. నీవు ప్రతిఫలం కూడా ఏదీ ఆశించలేదు. సూగ్రీవునకు, అతని రాజ్యం అతనికి వచ్చింది. అంగదునకు పట్టాభిషేకం జరిగింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఏదీ అడగలేదు. సీతాదేవి నీకు ఇచ్చిన అమూల్యమైన హారాన్ని విసిరేశావు. నీ పట్ల నా ఋణాన్ని, కృతజ్ఞతను ఎలా తీర్చుకోను? నేను నీకెప్పుడు ఎంతో ఋణపడి ఉంటాను. నీవు చిరంజీవిగా ఉండే వరాన్ని ఇస్తున్నాను. అందరూ నిన్ను నాతో సమానంగా పూజించి, గౌరవిస్తారు. నీ మూర్తి నా ఆలయద్వారం వద్ది ఉండి తొలి పూజ అందుకుంటుంది. ఎప్పుడాఇనా సరే, నా కధలు, మహిమలు గానం చేసే ముందు నీ కధలు, మహిమలు గానం చేయబడతాయి. నేను చేయలేని పనులు కూడా నువ్వు చేయగలవుతావు' అని శ్రీ రాముడు ఆంజనేయస్వామితో అన్నారు.

ఆ విధంగా రాముడు సీతాదేవి జాడ కనుక్కుని లంక నుంచి వచ్చిన హనుమంతుడిని పొగిడినా, ఆయన కొంచం కూడా గర్వించలేదు. రాముడి కాళ్ళ మీద సాష్టాంగ పడ్డాడు.

ఓ వీరుడా! సముద్రాన్ని ఎలా దాటావు అని రాముడు అడిగాడు.
నీ నామం యొక్క శక్తి, వైభవం వల్లనే స్వామి అని హనుమ వినయపూర్వకంగా సమాధానమిచ్చారు.

మళ్ళీ రాముడు 'నువ్వు లంకను ఎలా కాల్చగలిగావు' అని అడిగారు.
నీ అనుగ్రహం వలననే స్వామి అని హనుమ సమాధానమిచ్చారు.

నమ్రత/ వినయం హనుమంతుని యందు మూర్తీభవిస్తున్నాయి.

ఎంతో మంది తాము చేసిన సేవకు ప్రతిఫలంగా సంపదను ఆశిస్తారు. కొందరికి సంపద అవసరంలేదు, కీర్తి, పేరు కావాలి. కొందరికి ఇవి కూడా అవసరంలేదు, కానీ పొగడ్తలు కావాలి. ఇంకొందరికి ఇవి అక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన పనులను ప్రచారం చేసుకుంటారు. హనుమంతుడు వీటికి అతీతుడు. అందుకే ఆయన్ను ఆదర్శవనతమైన కర్మయోగి అని, భక్తికి పరాకాష్టగా గుర్తించబడ్డాడు. ఆయన జీవితమంతా ఎన్నో సందేశాల సమాహారం. ప్రతి ఒక్కరు ఆంజనేయస్వామి వారిని ఉత్తమమైన ఆదర్శంగా తీసుకుని, అనుసరించేందుకు పూర్తి ప్రయత్నం చేయాలి.

ఆయన జయంతి చైత్రశుక్ల పూర్ణిమ నాడు వస్తుంది. ఆ రోజు స్వామిని పూజించడం, ఉపవాసం ఉండడం, హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం, రోజంతా రామ నామాన్ని జపించడం వలన హనుమంతుడు ఎంతో సంతృప్తి చెంది, మీరు చేపట్టిన కార్యాలన్నిటిలో విజయం ప్రసాదిస్తాడు.

హనుమంతులవారికి జయము జయము! ఆయన ప్రభువు, శ్రీ రామచంద్రులకు జయము జయము!!

- స్వామి శివానంద సరస్వతీ
(డివైన్ లైఫ్ సొసైటీ, ఋషికేశ్)

*భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. 

Thursday, 19 May 2016

వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

మే 20, శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

హిరణ్యకశిపుడుని చంపటానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి శ్రీ మన్నారయణుడు నరసింహస్వామి రూపంలో వైశాక శుద్ధ చతుర్దశి నాడు అవతరించారు. సాధారణంగా నృసింహం అంటే సగం నరుడు, సగం సింహం అనే అర్దం చెప్తారు. కానీ తత్త్వంలోకి వెళితే జీవుల దేహాత్మ భావనను (ఈ శరీరమే నేను) అనే భావనను తొలగించే తత్త్వమే నృసింహ తత్త్వం. నరసింహస్వామి నమ్మకానికి, తక్షణమైన రక్షణకు ప్రతీక. అందరూ నృసింహ స్వామిని ఉగ్రస్వరూపం అంటారు కానీ ఆయన అందరికి ఉగ్రుడు కాదు. తాను ఈ దేహమే అనుకున్న భక్తుడికి ఆ భావన పోగట్టడంలో ఆయన ఉగ్రస్వరూపాన్ని చూపుతాడు.

హిరణ్యకశిపుడేమీ ధర్మం, శాస్త్రం తెలియని వాడు కాదు. వేదాంతం ఔపోసన పట్టాడు. అయినా బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, మరణం ఉండరాదని వరం అడుగుతాడు. అది కుదరదని, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని బ్రహ్మ చెప్పగా, తనకు మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ మరణం ఉండరాదని, పగలు, రాత్రి, ఇంట్లో, బయట మరణం సంభవించకూడదని, ఆయుధాలు తనను ఏమీ చేయరాదని, ఆకాశంలో కానీ, భూమిపై కానీ మరణించకూడదని, ఇలా అనేక విషయాలను వరం అడుగుతాడు. సరేనంటాడు బ్రహ్మ. తనకు ఇక మరణం లేదని, విర్రవీగి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తాడు. తానే దేవుడినని, తననే పూజించమని ఆజ్ఞ ఇస్తాడు.

వేదాంతాన్ని కంఠస్థం చేయడం కాదు కావల్సింది, దాన్ని జీర్ణించుకుని, దానికి అనుగుణంగా జీవించాలి. మనిషి ఎంత గొప్పవాడైనా, సృష్టిని గురించి ఎన్ని రహస్యాలను తెలుసుకున్నా, ఈ సృష్టిని, తనను సృష్టించినవాడు ఒకడున్నాడని, వాడు మనకంటే గొప్పవాడని, సర్వజ్ఞాని అని, సర్వాంతర్యామి అని స్థిరమైన భావన ఉన్నవాడే వివేకవంతుడు. హిరణ్యకశిపునికి ఆ వివేకం లోపించింది. తానే దేహం అనుకున్నప్పుడు, దాన్ని నిలుపుకోవటానికే ప్రయత్నిస్తారు కానీ సత్యం తెలుసుకోరు. అలాంటివాడిని సంహరించటానికి వచ్చినవాడే నృసింహుడు.

సగం మనిషి, సగం సింహం రూపంలో, తన గోర్లనే ఆయుధంగా చేసుకుని, పగలు, రాత్రికి సంధికాలమైన సంధ్యాసమయంలో, ఇంట్లోనూ కాక, బయట కాక, ఇంటి గడప మీద, నేల మీద కాక, ఆకాశంలో కాక, తన తొడల మీద పెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించాడు నారసింహుడు. అసాధ్యమనుకున్నది కూడా విష్ణువు తల్చుకుంటే సుసాధ్యమవుతుందని చెప్తుందీ కధ.

లక్ష్మీనరసింహస్వామికి ప్రీతికరంగా కొందరు భక్తులు నృసింహ జయంతి రోజున ఉపవాసం చేస్తారు. స్వామికి వడపప్పు, పానకం నివేదన చేయడం శ్రేయస్కరం. అసలేమీ చేయలేకపోయినా, కేవలం ఒక్క నమస్కారం హృదయపూర్వకంగా చేసుకున్నా, స్వామి అనుగ్రహం లభిస్తుంది. నరసింహ స్వామి స్తోత్రాలు పఠించడం, అవి రాకపోతే ఓం నృసింహాయ నమః/ ఓం నారసింహాయ నమః అని జపించడం ఉత్తమం. అది కూడా చదవడం రాకపోతే కనీసం 'జయ నరసింహ, జయ జయ నరసింహ' అని నామం చెప్పుకున్నా అంతే ఫలితం వస్తుంది. స్తోత్రం చదివామా? మంత్రం చేశామా? నివేదన చేశామా? అన్నది ఈశ్వరుడు చూడడు. నిర్మలమైన మనసుతో ఆయన్ను హృదయంలో ధ్యానించామా లేదా అన్నదే చూస్తాడు. ఈ పూజలన్నీ మన చిత్తశుద్ధి కొరకే కనుక వీలున్నవాళ్ళు అలా చేయవచ్చు.

నృసింహ స్వామిని సాయం సంధ్యావేళ ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి.

జయ సింహ జయ నరసింహ
జయ జయ ప్రహ్లాద వరదా లక్ష్మీ నృసింహ 

Wednesday, 11 November 2015

దీపావళి గురించి భగవాన్ రమణ మహర్షి



నరక సదృశమైన శరీరమే 'నేను' అనుకునే అభిమానమే నరకుడు. ఆ అభిమానమును నిర్మూలించి, తాను తాను(ఆత్మ)గా ప్రకాశించడమే దీపావళి.

భగవాన్ రమణ మహర్షి

అందరికి దీపావళి శుభాకాంక్షలు

దీపావళీ విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_22.html

నరక చతుర్దశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_21.html

ధన త్రయోదశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/11/blog-post_1.html

Monday, 26 October 2015

శరత్ పూర్ణిమ - విశిష్టత

ఈ రోజు (25-10-2015, సోమవారం) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్నుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.

ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు 

Tuesday, 1 September 2015

అంగారక చతుర్థి కధ

ఓం గం గణపతయే నమః

సప్త మోక్ష పురాలలో ఒకటైన అవంతికాపురి (ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది) లో నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు, సమస్త శాస్త్రకోవిదుడు, వేదస్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు. గంగా తీరానికి వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.

ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా, గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన దృష్టిలో పడింది. ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి, అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి చేసింది.

ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి రేతస్సు (వీర్యము) పతనమై భూమిపైన పడింది. (స్వేదం (చెమట) పడిందని అని కొందరు అంటారు. ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.) ఒక కారణజన్ముడు జన్మించాలి కనుక,భూమాత దానిని స్వీకరించింది. తద్వారా ఒక ఆజానుబాహుడు, ఎర్రని దేహకాంతి కలవాడు, విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు.

తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు. తగిన సమయం వచ్చినప్పుడు, తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాలుని పెంచసాగింది. 7 సంవత్సరముల వయసులో ఆ బాలకుడిని తీసుకుని, భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి "మహర్షీ! నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున, ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు. చౌలము, ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి, అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని అప్పగించింది.

సాక్షాత్ భూదేవి తనకు అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు. ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి, గణపతి మహామంత్రమును ఉపదేశించాడు. "నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది, నీ జన్మ ధన్యం చేసుకో!" అని చెప్పాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు. ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థీ (చవితి) దినాన చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో, ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో, ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో, ఎవరి అనుగ్రహం వలన యోగులు, సిద్ధులు సిద్ధిని పొందారో, ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో, అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు దర్శనమిచ్చాడు. సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక, గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వదలచాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.

"గణనాధా! నీ దర్శనమాత్రాన నా జన్మ చరితార్ధమైంది. నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు. నేనూ దేవతాగణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు. చాలు!" అన్నాడు ఆ బాలుడు.

"నీవు నిరపేక్షతో నన్ను ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా. నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను. నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు. అనగా ప్రజలకు "మంగళాలను" (శుభాలను) కలిగించే వాడవు. నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే, ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా అనుగ్రహిస్తున్నాను. భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.

అనంతరం దశభుజ గణపతిని, కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును ప్రార్ధించాడు. చింతితమైన (కోరిన) అభీష్టాలను (కోరికలను) మణివలె ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అంటారు .నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.          

ఇదండీ అంగాకర చతుర్థీ కధ.         

చిత్రంలో ఉన్నది శ్రీ చింతామణి గణపతి స్వామి. భక్తులపాలిట చింతామణియై సర్వాభీష్టాలు తీరుస్తున్నాడు.

ఓం చింతామణి గణపతయే నమః

Originally Published: 1st Jan 2013
Will be Republished on every angaraka chaturthi

Saturday, 29 August 2015

వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక, ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోకపరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్చగా అడుగుతారు. నాన్న వస్తువు కొన్నివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా, అమ్మ అడగగానే కొనిస్తుంది. అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు, ఆయన భార్య, తన భర్తకు చెడ్డపేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే, తానూ చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్నీ పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటవెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ అని పేరు.

వరలక్ష్మీ వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్థంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మీపూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు పూజలో పాల్గోనాలి. కధలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అర్ధం. ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు.

చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తిచేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి, సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో, నేర్పుతో మెలుగుతూ, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలాని శ్రీ మహాలక్ష్మీ భావించి, కలలో కనిపించింది. కధలో ఆమె పాత్రను గమనిస్తే, మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్నా, భక్తి, సదాచారం, ధర్మనిష్ఠ లేకపోతే, అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యుల మాట. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోకూడాదు. ధర్మం ఎప్పుడూ పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగ్యం చేస్తుంటే, కార్యాలయానికి వేళకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయతీగా శ్రద్ధతో, లోపరహితంగా చేయడం కూడా ధర్మపరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయక్కర్లేదు. నిర్ణీత పనివేళలో సరిగ్గా పని చేస్తే చాలు. అది కూడా ధర్మచారణయే అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు, అక్కడ చేయవలసిన పనే మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే, విద్య మీద దృష్టి ఉంచడం, ఋషుల సందేశలను తెలుసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, కోపతాపాలకు దూరంగా ఉండడం వారి స్వధర్మం. ఇవేమి చేయకుండా, కేవలం లక్ష్మీపూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము  అనుకునేవాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కధ ద్వారా గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వల్లనే.

అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రతవిధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగుపొరుగు వారందరికి తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్ధం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకునే ఆచారం లేనివారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్ళకు ఆహ్వానించి, వారొతో కలిసి వ్రతం ఆచరిస్తే, లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు, ఇరిగుపొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే, వారు ఏ కులం వారైనా సరే, వారిని మీ ఇంటికి పిలిచి, వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకధలో చారుమతి కూడా చేసింది.

అమ్మవారు కలలో కనిపిస్తే, దాన్ని కొట్టిపారేయలేదు చారుమతి. స్వప్నంలో చెప్పినట్టుగా ఆచరించింది. దీనిబట్టి అర్దం చేసుకోవలసిందేమిటంటే ఆమెకు శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధావిశ్వాసములు ఉంటాయో, వరు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారనేది ఈ వృత్తాంతంలోని గూఢార్ధం.

లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు స్వార్ధం త్యజించాలన్నది వరలక్ష్మీ కధ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు. పదిమందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడం నేర్పింది.

అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి. నిత్యం 'లోకాసమస్తాః సుఖినోభవంతుః' (సమస్త లోకాలు బాగుండలి) అని ప్రార్ధించాలి.

ఓం నమో లక్ష్మీనారాయణాయ        

Originally published: 07-August-2014
1st Edit; 29-August-2015

Friday, 28 August 2015

వరలక్ష్మీదేవి వ్రత కథ

27-08-2015, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీవ్రతం సందర్భంగా వరలక్ష్మీ వ్రత కధ తెలుసుకుందాం.

వరలక్ష్మీదేవి వ్రత కథ:

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’.
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’.

పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. 



పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.

‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.

చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా

అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు. 

తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి.వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.

Sunday, 2 August 2015

అచ్చమైన మన తెలంగాణ వేడుక

బోనాల పండుగ
దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల.

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.



పిల్లల సంరక్షణలో అమ్మవారు
జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాలు జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-

ఘటోత్సవం:
అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట.
ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు.

సాక సమర్పణ:
సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.

ఫలహారపు బండ్లు:
బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.

పోతురాజుల వీరంగం:
బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.

రంగం వేడుకలు:
రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.

గావు పట్టడం:
వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.

సాగనంపు:
గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.
By వనిత విజయకుమర్ ద్యాప

నమస్తే తెలంగాణ - ఆదివారం సంచిక - బతుకమ్మ

Source: http://goo.gl/tvk3CY

Friday, 31 July 2015

గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!



గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరంలాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.

మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే, ఆయన తాండవ నృత్యం చేసారు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయనను చూచినవారందరూ అర్ధం చేసుకున్నారు. జనాలు వచ్చి, ఆయన వారితో సంభాషిస్తాడేమో అని ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేకపోవడం వలన వచ్చినవారందరూ కొంతకాలం ఎదురు చూసి వెళ్ళిపోయారు.

ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోలేదు. “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు.

అందుకని వారు తయారవటం ప్రారంభించారు- దిన దినం, ప్రతిరోజూ అలా నెలలు, సంవత్సరాలు తరబడి వారు సంసిద్ధమవుతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకో కూడదనుకున్నాడు. 84 సంవత్సరాల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో –ఆదియోగి ఈ ఏడుగురిని చూసారు. వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్నిఅందుకోవటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.

ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. ఆయన వారిని ఇక పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వారు ఆయన దృష్టిని ఆకట్టుకున్నారు. తరువాతి 28 రోజులు ఆయన వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి దక్షిణ దిశవైపుకి తిరిగి, 'యోగ శాస్త్ర' ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.

మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది. మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది.

గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అసలు మీరు గురువుని కోరరు. మీ మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు – అప్పుడు మీకు గురువు లభిస్తారు. మీరు ఉత్తమమైన గురువుని ఎంచుకుంటూ, వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మీలో తీవ్రమైన తపన పెంచుకోండి మీకు గురువు సంభవిస్తాడు, గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అది కేవలం మీకు సంభవించగలదు. అదేదో మీరు కలిసేది కాదు. అదేదో మీరు కరాచలనం చేసేది కాదు. మీరు వంగి నమస్కరించ గలిగేది కాదు. మీరు దగ్గరకు వెళ్లి ఇది కావాలి అది కావాలి అని యాచించ గలిగేది కాదు. మీరు గురువు అనుకునే ఆ స్థితి, ఆ శక్తి మీకు ప్రాప్తిస్తుంది. అది మిమ్ముల్ని ముంచివేస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని నాశనం చేసి, మీరు ఏ బంధనాలు లేకుండా, సృష్టికర్త మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండేలా చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు జగ్గీ వాసుదేవ్

సేకరణ: http://blog.ishafoundation.org/te/2014/07/08/guru-pournami-aadi-guruvu-udayinchina-roju/

Thursday, 30 July 2015

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

31 జూలై 2015, శుక్రవారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......



అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకి నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తారు.  

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణినికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు. నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని మహాత్మాతమను ఏయే రోజుల్లో ఏ విధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ గురించి మరిన్ని విశేషాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి ' గురుపూర్ణిమ ' అనే లెబుల్ క్రింద చూడగలరు.

Originally published -11-July-2014
1st Edit: 30-July-2015

Sunday, 26 July 2015

27-7-2015, సోమవారం, తొలి ఏకాదశి

ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని  మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు.

అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు.

దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి. అందువల్ల శరీరంలో ఉన్న జీవక్రియలు మందగిస్తాయి, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అదే మన అందరిలో ఉన్న విష్ణువు యొక్క నిద్ర, ఆఖిల జగత్తును ఏలే విష్ణువు యొక్క యోగ నిద్ర.        

ఇదే కాదు, దక్షిణాయనం ఉపాసనా కాలం. ఈ 6 నెలలు భగవదుపాసన చేయాలి. ఎవరైతే ఈ సమయంలో శాస్త్రనియమాలను పాటిస్తూ, ఉపాసన చేస్తారో వారిని యెడల అపారమైన అనుగ్రహాన్ని వర్షించడం కోసం విష్ణుమూర్తి బాహ్యనేత్రాలను మూసి, అంతఃనేత్రాల ద్వారా చూస్తుంటాడు. ధర్మాన్ని అనుషిటించేవారికి సకల శుభాలు చేకూరుస్తాడు.

దక్షిణాయనం గురించి ఈ లింక్ లో చూడండి.
http://ecoganesha.blogspot.in/2013/07/blog-post_17.html

ఈ ఏకాదశి నుంచి అనేక పండుగుల, పర్వటి రోజులు ఉంటాయి. ఇది అన్నిటికంటే ముందు వస్తుంది కనుక తొలి ఏకాదశి అని పేరు. ఈ తొలి ఏకాదశి రోజున అందరు తప్పకుండా పేలాల పిండిని విష్ణువుకు సమర్పించి నైవేధ్యంగా తినాలి. ఈరోజున చేసే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం, శ్రీ విష్ణుసహస్రనామ పారయణం, ఏకాదశి వ్రతం విశిష్టఫలాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి.

నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే, సహస్రపాదాక్షి శిరోరుబాహవే,
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి యుగధారిణే నమః

అంతటా వ్యాపించినవాడు, అంతము లేనివాడు, అనంతుడు, అనేక రూపాలలో దర్శనమిచ్చేవాడు, అనంతమైన బాహువులు, కన్నులు, పాదాలు కలిగిన విరాట్ పురుషుడు, లెక్కలేనన్ని పేర్లతో పిలువబడేవాడు, శాశ్వతమైనవాడు, సహస్రకోటి బ్రహ్మాండాలను ధరించి, రక్షించి, పోషిస్తున్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను.

ఈ రోజున తప్పక దగ్గరలో ఉన్న శ్రీ మహా విష్ణువు ఆలాయన్ని, శ్రీ మహా విష్ణు అవతారం కొలువై ఉన్న ఆలయాన్ని సందర్శించండి.

ఓం నమో నారాయణాయ        

Originally Posted: Deva Sayana Ekadasi 2013
1st Edit: 07-July-2014
2nd Edit: 26-July-2015

Wednesday, 27 May 2015

దశపాపహర దశిమి

28 మే 2015 గురువారం, జ్యేష్ఠ శుద్ధ దశమి - దశపాపహర దశిమి

దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌’ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా ‘కాశీ’లో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

గంగావతరణ జ్యేష్ఠ శుక్ల దశమీ బుధవారం హస్తా నక్షత్రంలో అయినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది అంటున్నారు. వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణం జరిగిందని గ్రంథాంతరాల్లో ఉంది. గంగావతరణకు ఇది మరొక తిధి. ఈ రోజు గంగావతరణ అయినా కాకపోయినా ఈ పండుగ గంగానదిని ఉద్దేశించి చేయబడింది కావడం నిజం.

ఈ వ్రత విధానం (దశపాపహర దశమి) స్కంధ పురాణంలో ఉంది. గంగాదేవి కృపను సంపాదించటమే ఈ పండుగ ప్రధానోద్దేశం. దీన్ని గంగాత్మకమని అంటారు. గంగానీరు ఎంతో పవిత్రం, ఎన్నినాళ్ళు న్నా చెడిపోదు. అసలు గంగానది తీరాలు అనేకం తీర్థ స్థలాలు. కాశీ, హరిద్వార్‌, ప్రయాగ మొదలైన నదీ తీరాల్లో ఈ పండుగ బాగా చేస్తారు. అక్కడ గంగా దేవి ఆలయాలున్నాయి. గంగ పూజ కూడా అక్కడ చేస్తారు.

ఈ రోజున గంగా స్నానం చేసి పూజ చేసి గంగా స్తోత్రం పఠిస్తే దశ విధ పాపాలు తొలుగుతాయి అని వ్రతగ్రంధం.
ఈ గంగాత్మక దశమికి మరోపేరు దశపాపహార దశమి అని; దశ హర దశమి అని కూడా అంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం
శ్లోః లింగం దశాశ్వ మేధేశం
దృష్ట్యా దశహరాతి ధే
దశ జన్మార్జితైః పాపైః
త్యజ్యతే నాత్రసంశయః
దశహర తిధినాడు దశాశ్వ మేధ ఘట్టంలోని లింగము చూచినట్లయి తే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహంగా నశిస్తుందని తాత్పర్యం.

స్నాన సంకల్పంలో కూడా ఈనాడు ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర స ముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం దహ హర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే’’ జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాలైన పాపాలు పోగొట్టే స్నానమని దీని భావం. పూజ కూడ పది పూవ్వులతో, పది రకాల పళ్ళతో నైవేద్యంగా చేస్తారు అని చెబుతారు.
గంగా దేవి పూజా మంత్రం
నమో భగవతె్యై దశపాపహరాయై
గంగాయై నారాయణై్య
రేవతె్యై దక్ష్రాయై శివాయై
అమృతాయై విశ్వరూపిణై్య
నందినై్య తేనమోనమః
ఓం నమశ్శివాయై నారాయణై్య
దశహరాయై గంగాయై నమోనమః
షోడశపచార విధిచే గంగాపూజ చేస్తూ అందులో ఈ మూల మంత్రాన్ని అహోరాత్రులు అయిదు వేలసార్లు జపించి వ్రతం పూర్తి చేయాలి.
-ఇ. హరిహర్‌నందన్‌, హైదరాబాద్‌
Source : http://www.suryaa.com/features/article-3-30583

ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే విశేష పుణ్యఫలం. అది కుదరని పక్షంలో ఇంట్లో ఆయినా, మానసికంగా గంగానదిని, దశాశ్వమేధా ఘాట్‌ను భావన చేసి, గంగానదిని నీటిలో ఆవాహన చేసి స్నానం శిరఃస్నానం (తలస్నానం) చేయాలి. సూర్యోదయానికి స్నానం ముగించాలి. అటు తర్వాత గంగామాతను పూజించాలి. స్నానం చేసే సమయంలో, పూజ సమయంలో ఈ శ్లోకం పఠించాలి.

ఓం నమ శ్శివాయై నారాయణ్యై
దశహరాయై గంగాయై నమోనమః 

Tuesday, 12 May 2015

హనుమాన్ జయంతి

ఓం శ్రీ హనుమతే నమః

వైశాఖ కృష్ణపక్ష/బహుళ దశమి(ఈ ఏడాది మే 13, బుధవారం) హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమకు జరుపుతారు. అట్లాగే చైత్రపూర్ణిమ రోజున ప్రారంభమైన హనుమాన్ మండల దీక్ష వైశాఖ బహుళ దశమితో ముగుస్తుంది.

కలియుగంలో సులువగా ప్రసన్నమయ్యే దేవాత రూపాలలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాదేవికి, కేసరికి పరమశివుడి అంశగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు. ఈనాటికి హిమాలయపర్వతాల్లో కైలాసమానససరోవరం దగ్గర రామనామ జపం చేస్తూ సశరీరంతో ఉన్నారు.

హనుమంతుడి స్మరణచేత బుద్ధి, బలం, యశస్సు(కీర్తి), దైర్యం, నిర్భయత్వం(భయం లేకపోవడం), వాక్‌పటుత్వం కలుగుతాయి. సమస్తరోగాలు తొలగిపోతాయి. జడత్వం నాశనమవుతుంది. జ్ఞానం కలుగుతుంది. భూతప్రేత పిశాచాలు హనుమన్ స్మరణతోనే పారిపోతాయి. హనుమాన్ ఉపాసనతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసానమామి.    

హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
ఓం శ్రీ హనుమతే నమః        
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Thursday, 23 April 2015

ఏప్రియల్ 24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

వైశాఖ శుద్ధ షష్టి నాడు క్రీస్తు శకం 1071 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో జన్మించిన గొప్ప తత్వవేత్త భగవద్రామానుజులు. ఆదిశేషుని అంశతో భువిపై జన్మించారు రామానుజులు.  రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకరు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించి లోకానికి చాటారు. 16 ఏళ్ళ వయసుకే సమస్త శాస్త్రాలను కంఠస్థం చేసారు.

విశిష్టాద్వైత మతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్నిస్థాపించారు. జీవాత్మ పరమాత్మ నుంచి వేరు కానప్పటికి ఇద్దరికి కొంత వ్యత్యాసం ఉన్నది అంటూ చెప్తుంది విశిష్టాద్వైతం. కర్మసిద్ధాంతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యం రాశారు. అట్లాగే అనేకానేక ఇతర గ్రంధాలను రచించారు.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

1. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

2. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

3. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

4. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తిరుమల ఆలయంలో పూజా విధానం కొరుక చక్కని వ్యవస్థను ఏర్పరించింది, తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే.

ఓం శ్రీమతే శ్రీ రామానుజాయ  

ఏప్రియల్  24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

Originally posted: 03 May 2014
1st Edit: 23 April 2015