31, మే 2013, శుక్రవారం

ధార్మిక గ్రంధాల్లో సరస్వతీ నది ప్రస్తావన

~ ధార్మిక గ్రంధాల్లో సరస్వతీ నది ప్రస్తావన :

సరస్వతి నది హిమాలయాల్లో ఉద్భవించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో 4000 సంవత్సరాల క్రితం వరకు ప్రవహించింది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. సరస్వతి నది గురించి ఋగ్‌వేదంలోనూ, రామాయణ, మహాభారతాల్లోనూ, బ్రహ్మవైవర్త పురాణం మొదలైన పురాణాల్లోనూ, బ్రాహ్మణాల్లోనూ ప్రస్తావన ఉంది. ఋగ్‌వేదంలో సరస్వతీ నది గురించి 60 కంటే ఎక్క్వమార్లు చెప్పబడింది.

'అంబితమె నదితం దైవితమె సరస్వతి'-అంబితమె(ఉత్తమమైన తల్లి), నదితమె(నదులన్నిటిలో గొప్ప నది), దైవితమె(దైవాలోకెల్లా గొప్ప దైవం) అంటూ ఋగ్‌వేదం(2.41.16)లో సరస్వతి నది గురించి ప్రస్తావన ఉంది.

అనేక సరస్సులు(చెరువులతో)కలిగినది కనుకు సరస్వతీ అనే పేరు వచ్చిందట. అంటే తన ప్రవాహంలో అనేక చెరువులకు నీరు అందిచేది సరస్వతీ నది. గంగా, యమున, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి అనే సప్త(7) పుణ్యనదులలో ఏడవది సరస్వతీ నది అని, ఎప్పుడు వరదలతో ప్రవహించేదని ఋగ్‌వేదంలో 7.36.6 కనిపిస్తుంది.

పాలు వంటి స్వచ్చమైన నీటి ప్రవాహంతో ప్రవహించేదని, పశుసంతతి వృద్ధికి దోహదపడిందని ఋగ్‌వేదం 7.95.2 ఉన్నది.

కారికేయుడు(కూమార స్వామి) సరస్వతీ నది ఒడ్డునే దేవసేనాధిపతి అయ్యాడు.

పరశురాముడు దుర్మార్గపు క్షత్రియ రాజులను వధించిన తరువాత సరస్వతి నదిలోనే స్నానం చేశాడు.

చంద్ర వంశపు రాజైన పురురవుడు తన భార్య ఊర్వశిని సరస్వతీ నది దగ్గరే కలుసుకున్నాడట.

బలరాముడు సరస్వతీ నది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాహాభారతం చెప్తోంది.

30, మే 2013, గురువారం

సరస్వతి నదికి పుష్కరాలు

భారతదేశం వేద భూమి, దేవ భూమి. మన దేశంలో ప్రతి నది, చెరువు, కొండ, గుట్ట, పుట్ట అని పవిత్రమే. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో జన్మించడం కష్టమని, జన్మించినా మనిషిగా జన్మించడం మరింత కష్టమని ధార్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది.

గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేసిన్మిన్ సన్నిధిం కురు || అంటూ పూజా సమయంలో కలశంలోకి పుణ్య నదులను అవాహన చేస్తాం.

భారతీయ సంప్రదాయంలో సరస్వతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది.  అటువంటి సరస్వతి నదికి గురు గ్రహం/ బృహస్పతి మిధును రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. మే 31వ తేది, 2013, వైశాఖ బహుళ సప్తమి, ఉదయం 6 గంటల 49 నిమిషాలకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల తర్వాత 11 జూన్‌తో ముగుస్తాయి.  ఈ 12 రోజుల కాలం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో నదిలో దైవశక్తులు ఉంటాయి.ఎందరో దేవతలు, ఋషులు ఈ సమయంలో నదిలో స్నానమాచరిస్తారని ప్రతీతి.

22, మే 2013, బుధవారం

సనాతన హిందూ సంప్రదాయం - జీవవైవిధ్యం

జీవవైవిధ్యం - సనాతన హిందూ సంప్రదాయం .

'భౌతిక దృష్టి'తో శివ కుటుంబాన్ని చూస్తే శివుడి మెడలో పాములు, వాహనం నంది(ఎద్దు), అమ్మవారి వా
హనం సింహం. ఎద్దు, సింహం పరస్పరం విరుద్ధమైనవి. వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు, ఆయన వాహనం ఎలుక. పరస్పరం విరుద్ధమైనవి. సుబ్రహ్మణ్యుడు సర్పం(పాము), ఆయన వాహనం నెమలి, పాముకు నెమలికి పడదు. శివుడేమో కొండల్లోనూ, గుట్టల్లోనూ ఉంటాడు అంటే ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక. ఇక కాకి, కుక్క(కాలభైరవుడు) రుద్రగణాలకు సంబంధించిన వారు. పరస్పరం విరుద్ధమైన/ వైరం కలిగిన ఇన్ని రకాల జీవులు ఒక చోట ఉండడం జీవ వైవిధ్యం అయితే, అన్నిటితో  కలిసి జీవించడం అనేది శివ పరివారం ఇచ్చిన సందేశం.

విష్ణువు శేషుడి మీద శయనించి ఉంటాడు. ఆయన వాహనం గరుత్మంతుడు(గరుడ పక్షి). పాముకు, గద్దకు మహావైరం. ఇక దశావతారాలలో మత్శ్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు. ఇక్కడా జీవ వైవిధ్యం. లక్ష్మీ దేవీని 'ఓం ప్రకృతై నమః' అని కొలుస్తాము, అమ్మవారు ప్రకృతి స్వరూపం. శ్రీ లక్ష్మీనారయణులు ఇచ్చిన సందేశంలో అన్ని జీవులతో కలిసి జీవించడమే.

ఇక మనం నదులను, పాములను, పుట్టలను, సముద్రాలను, పక్షులు, పశువులను, చెట్లను.......... ఒక్కటేమిటి అన్నిటిని పూజిస్తాం. పూజించడం కాదు అన్నిటిలో దైవం ఉందన్నది యధార్ధం. అందుకే పూజిస్తాం. సృష్టిలో ప్రతిదానిలోనూ దైవాన్ని చూసి వాటిని మనకంటే ఒక మెట్టు ఎక్కువగా భావించి ఆరాధించడం మన పూర్వీకులు మనకు నేర్పారు. ప్రతిచోటా తోటి జీవాలను ఆరాధించడం, రక్షించడం కనపడుతుంది.

'వసుదైక కుటుంబం'- ఈ భూమి అంతా ఒకే కుటుంబం అనిప్రపంచంలో తొలి జీవవైవిధ్య రక్షణకు సంబంధిచిన సందేశం ఇచ్చిందే మన హిందూ సంస్కృతే. కానీ మనమే మర్చిపోయాం. ఎవరో వచ్చి జీవ వైవిధ్యాన్ని రక్షించండి అంటే కూడా మనకు గుర్తురానంతగా మర్చిపోయాం. నిజానికి మనం మర్చిపోయామా? లేక మారిపోయామా? అన్నదే సమాధానం లేని ప్రశ్న.    

21, మే 2013, మంగళవారం

మే 22, ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం.

ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశి ఉందంటున్నాయి మన పురాణాలు. ఈ చరాచర ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి, చిన్న చీమ దగ్గరునుండి పెద్ద ఏనుగు వరకు, చిన్న మొక్క దగ్గరినుండి పెద్ద వృక్షం వరకు, క్షీరదాలు, జలచరాలు, వన్యమృగాలు, పాములు, కప్పలు, మొక్కలు, చెట్లు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, వన్యమృగాలు, మానవులు......... ఇలా అందరూ ఏదొ ఒక విధంగా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇదంతా జీవవైవిధ్యం.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ విధంగా మనానవులు మిగితా ప్రాణుల మీద ఆధారపడ్డారు. కానీ ఈరోజూ మానవుడి గుడ్డి చేష్టల వలన జీవవైవిధ్యం అంతరించిపోతోంది. మానవ మనుగడకే ముప్పు ముంచుకోస్తోంది. ఇప్పటికైన మనిషి మారాలి, తన పంధాను మార్చుకోవాలి, ఈ ప్రకృతికి తాను అధికారిని కాదు, ప్రకృతిలో ఒక భాగం అని గుర్తించాలి. అన్ని ప్రాణులను తనతో సమానంగా గుర్తించాలి. అదే గుర్తుచేస్తోంది ప్రపంచం జీవవైవిధ్య దినోత్సవం.

మే 22, ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం.    

2, మే 2013, గురువారం

వర గణపతి


।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

32 గణపతులలో వినాయకుడి 18వ రూపం అడిగిన వరములను ఇచ్చే వర గణపతి. ఈ రూపంలో గణపతి ఎర్రని శరీర ఛాయ కలిగి, తన శక్తి అయిన పుష్టిదేవిని తన ఎడమతోడపై కూర్చొబెట్టుకుని, నాలుగు చేతులతో దర్శనమిస్తాడు.

వరగణపతి మూడు నేత్రములు కలిగి, తలపై చంద్రుడిని ధరించి ఉంటాడు. వరగణపతి తన ఎడమ చేతితో శక్తిని పట్టుకుని, కుడి చేతితో మధువు కలిగిన కపాలం, మిగితా చేతులలో పాశం, అంకుశం ధరించి ఉంటాడు. శక్తి(పుష్టి దేవి) ఒక వేతితో ధ్వజం(జెండా), మరొక చేతితో కలువ పువ్వు పట్టుకుని ఉంటుంది.

వరగణపతి తొండం వంకర తిరిగి రత్నకుంభం పట్టుకుని ఉంటుంది.

కర్ణాటక రాష్ట్రంలో ని బెల్గౌం దగ్గరలో ఉన్న సవదత్తి,శ్రీ రేణుకా ఏల్లమ్మ దేవస్థానంలో ఉన్న వరగణపతి ఆలయం సుప్రసిద్ధం.

హస్త నక్షత్ర జాతకులు వరగణపతిని జీవితాంతం ఆరాధించాలి.

వరగణపతి ధ్యాన శ్లోకం :

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మే వర దేహి పరత్ర చ పరాంగతిం  

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||


Vara Ganapati is the 18th of Lord Ganesha’s 32 forms and means “ Boon Giver”. In Vara Ganapathi form the lord appears red hue complexion with his consort Shakti (Pushti Devi) seated on his left lap and with four hands. Also in this form,Lord Ganesh is third eyed and with crescent moon on his crown like Lord Shiva. The lord’s Shakti is depicted holding the flag and a lotus. Vara Ganapati’s  main left hand hold around his Shakti and main right hand holds a dish made from honey. Both the upper left and right hand holds noose and elephant goad (ankusa). Vara Ganapati trunk is curled towards the right holding Ratnakumbha (pot of jewels).

Atham (Hasta) Nakshatra is related to Vara Ganapati. Worshipping this form is believed that the lord can be easily appeased and he will fulfill the prayed wishes. Vara Ganapati can be worshipped in Shri Renuka Yellamma Devi Temple - Saundatti/Savadatti in Belgaum, Karnataka. But it is followed by a belief that pilgrimage will get completed there after visiting Nanganallur Anjaneya Temple in Chennai, Tamil Nadu.  Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.

Vara Ganapati Mantra

Sindhoorabhimabhananam Trinayam Haste Cha Pashankushou
Bibhranam Madhumat Kapalamanisham Sadhivindumouli Bhaje
Pushtyashilshyathatanum Dhvajagrakarayaa Padyollasadhastyaa
Tadhyonyahita Panimattamasumata Patrollasat Pushkaram

Source : http://www.hindudevotionalblog.com/2012/04/vara-ganapati-form-of-ganesha.html

1, మే 2013, బుధవారం

Save Energy, Save Earth

~ మనలో చాలామంది విద్యుత్ వాడుకున్నాక విద్యుత్ ఉపకరణాలు(Electronic Appliances) Swtich-off చేస్తాం కానీ Unplug చేయం. మీకు తెలుసా? Switch-off చేసినా ప్లగ్‌ను Socket నుంచి తీసివేయకపోతే అక్కడ విద్యుత్ వాడకం జరుగుతూనే ఉంటుంది. కరెంట్‌బిల్లులో దీని ప్రభావం కనపడుతుంది.

~ సెల్‌ఫోన్లు, కంపూటర్లు, టి.వి.లు.....అన్ని విద్యుత్ ఉపకరణాలు Turn-off చేయడమే కాదు, Socket నుంచి వాటి ప్లగ్‌ను తీసేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. భూమాతను కాపాడండి.

~ Save Energy, Save Earth ~


ఏ.సి.లు మాములు బల్బులకంటే 150 రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. అవసరం లేనప్పుడు ఏ.సి.ని చేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. 

మీరు ఏ గదిలో ఉంటారో అక్కడే లైట్లు వేసుకోండి. వేరే గదిలోకి వెళ్ళేముందు రూములో లైట్లు, ఫ్యాన్లు ఆపేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. 

Turn-off lights when you leave a room. Save Energy.


మీకు తెలుసా? విద్యుత్ ఉపకరణాలను(ఫ్యాన్లు మొదలైనవి) తరుచుగా శుభ్రపరచడం ద్వారా 30% వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించవచ్చు. శుభ్రమైన వాతావరణం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కార్బన్ విడుదల తగ్గించిన వాళ్ళం అవుతాం. భూమాతకు మేలు చేసినవాళ్ళం అవుతాం. మరి ఇంకేం? ఆచరించండి.

ఏకాక్షర గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
|| ఓం గం గణపతయే నమః ||

32 గణపతులలో 17 రూపం ఏకాక్షర గణపతి. ఈ రూపంలో వినాయకుడు పద్మాసనంలో మూషిక(ఎలుక)వాహనం మీద కూర్చుని ఉంటాడు. రక్తవర్ణపు శరీరంతో ఉంటాడు.

ఏకాక్షర గణపతి త్రినేత్రుడు, తలపై చంద్రుని ధరించి ఉంటాడు. దంతము, పాసము, అంకుశం ధరించి కోరిన వరాలు ఇస్తానంటు వరద ముద్ర ధరించి ఉంటాడు.

ఏకాక్షర గణపతిని ఆరాధించడం వలన ఇంద్రియ నిగ్రహంతో పాటు మనసును నిగ్రహించే శక్తి లభిస్తుంది.

ఉత్తర ఫల్ఘుణి నక్షత్రంవారు ఏకాక్షర గణపతిని నిత్యం ఆరాధిస్తే మంచి ఫలితాలుంటాయి.

కర్ణాటక హంపిలో ఏకాక్షర గణపతి పురాతన ఆలయం ఉంది.

ఏకాక్షర గణపతి శ్లోకం :

ప్రాతర్భజా మ్యభయదం ఖలు భక్త శోక
దావానలం గణవిభుం వరకుంజారాస్యం
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహ
ముత్సాహ వర్దన మహం సుతమీశ్వరస్య

।। ॐ गं गणपतये नमः ।।
|| ఓం గం గణపతయే నమః ||



Picture of Ekakshara Ganapati form of Lord Ganesh
।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||


Ekakshara Ganapati is the 17th of Lord Ganesha’s 32 forms and means “Single Syllable” from Bheejashara, the seed letter called “Gam”. Also this form symbolise the primordial sound “OM”.

In Ekakshara Ganapati form, Lord Ganesha sits in a yogic lotus posture (Padmasana) with four hands riding his Mushika Vahana (Rat). His appearance is in red hue complexion and covered with red silk. Also in this form he is third eyed and with crescent moon on his crown like Lord Shiva. Ekakshara Ganapathi’s left hand shows the Varda Mudra, granting of boons and on his main right hand holds pomegranate. Both his upper left and right hands hold elephant goad and noose.

Uthiram Nakshatra or Uttara Phalguni nakshatram is related to Ekakshara Ganapati. This is meditative form and worshipping this form is believed to help devotees gain control on the senses and mind. Ekakshara Ganapati can be worshipped in ancient temple of Hampi, Karnataka. Also temples in Chamarajanagar  and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.

Ekakshara Ganapati Mantra

Raktorakangangkasha Kusumayutah Tundialah Chandramoulih
Nethraih Yuktistribhih Vamanakaracharano Beejapundadhanah
Hastagra Kalusa Pashankasharada Varado Nagavaktrohi Bhoosho
Devaha Padamasano No Havatu Natsuro Bhootayae Vighnarajaha!!


।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||