Tuesday, 24 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 6

ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను  పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును. అతను అందరికి గురువు అవుతాడు, సకల మంత్రాలు తెలిసినవాడవుతాడు. ఈ మంత్రములతో హవనము, అర్చన చేయవలెను.

ఈ ఉపనిషద్ ను సంధ్య సమయమునందు పఠించిన బ్రాహ్మణుడు ఆ దినమంతయు చేసిన పాపముల నుండి విముక్తుడగును. అపరాహ్న వేళ పఠించినచొ, 6 జన్మల నుండి చేసిన పాపములు తొలగిపోవును.  ఇరు సంధ్యా సమయములందు పఠించిన జన్మ జన్మ ల సంచిత పాపములన్నీ నశించును. ఆరువేల కోట్ల గాయత్రీ జపము చేసిన ఫలితము దక్కును.

Swami Sivananda 
బ్రహ్మ హత్యా పాతకము, కల్లు సేవించిన పాపము, హిరణ్యమును ( బంగారము ) ను అపహరించిన పాపము, గురు పత్ని తో సంగమము చేసిన పాపము, భ్రష్టుని తో సంభాషించిన పాపములు కూడా రుద్రాక్ష ఉపనిషద్ ను చదివినచొ తొలగి పోవును.

అన్ని పుణ్య క్షేత్రములు దర్శించిన ఫలితము, అన్ని పుణ్య తీర్దములలో మునిగిన ఫలితము పొంది, అంతిమ కాలమున శివ సాయుజ్యము పొంది, మరు జన్మ అన్నది లేనివాడై మోక్షమును పొందును.

ఓం నమః శివాయ.

-స్వామి శివానంద
అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 56

Whoever studies this Rudraksha Jabala Upanishad, be he a boy or a youth, becomes great. He becomes the Guru of all and the teacher of all Mantras. Havan and Archana should be done with these Mantras (of the Upanishad).

That Brahmin who recites this Upanishad in the evening, destroys the sins committed during day time; who recites at noon, destroys the sins of six births; who recites in the morning and evening, destroys the sins of many births. He attains the same benefit of doing six thousand lacs of Gayatri Japa.

He becomes purified from all sins of killing a Brahmin, drinking toddy, stealing gold, approaching Guru’s wife, having intercourse with her, speaking with corrupted person, etc.

He gets the benefits of all pilgrimages and river-baths. He attains Siva-sayujya. He does not come back (to rebirth).

- Swami ‪‎Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Monday, 23 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 5

రుద్రాక్ష జాబాల ఉపనిషద్ 5

రుద్రాక్షలను ధరించు భక్తులు మత్తు పదార్ధాలను, మద్య మాంసములను, వెల్లుల్లి, ఉల్లి, కేరట్ వంటి నిషేధించిన పదార్ధములను తీసుకొనరాదు. గ్రహణ కాలములందును, విషు సంక్రమణము ( సూర్యుడు మీన రాశి నుంచి మేష రాశి కి మారు సమయము) నందు అమావాస్య మరియు పూర్ణిమలందును రుద్రాక్షలు ధరించు వారు అన్ని పాపముల నుండి విముక్తులగుదురు.

రుద్రాక్ష యొక్క ఆధారము బ్రహ్మ అనియు, నాభి విష్ణువు అని, రుద్రాక్ష యొక్క ముఖము రుద్రుడు అని, దానికి కల రంధ్రము సర్వ దేవతా స్వరూపము.

ఒకనాడు సనత్కుమారుడు కాలాగ్ని రుద్రుని " దేవా! రుద్రాక్షలను ధరించు వ్యక్తి పాటించవలసిన నియమములు తెలుపుమని ప్రార్ధించెను. నిధాగుడు, జడ భరతుడు, దత్తాత్రేయుడు, కాత్యాయనుడు, భరద్వాజుడు, కపిలుడు, వశిష్టుడు, పిప్పలాదుడు మొదలగు వారు అందరూ అక్కడికి వచ్చారు. రుద్రుడు వారందరూ కలిసి అక్కడకు వచ్చిన కారణమేమి అని అడిగినాడు. వారందరూ కూడా రుద్రాక్షలను ధరించు పద్ధతిని తెలుసుకోగోరి వచ్చినామని సమాధానం ఇచ్చినారు.

కాలాగ్ని రుద్రుడు ఇట్లు సమాధానము ఇచ్చెను. రుద్రుని అక్షుల ( కన్నుల) నుండి స్రవించిన బిందువులు రుద్రక్షలుగా ఆవిర్భవించినవి. వీటిని ఒక్కసారి స్పృశించినంతనే 200 గోవులను దానము ఇచ్చిన ఫలితము కలుగును. కర్ణముల యందు ధరించినచో, 1100 గోవులను దానము చేసిన ఫలితము కలుగును. అతను ఏకాదశ రుద్రులకు సమానమైన స్థానం పొందుతాడు. శిఖ యందు ధరించినచో, కోటి గోవుల దాన పుణ్య ఫలము కలుగును. పై చెప్పిన శరీర భాగాలన్నిటికంటే కర్ణముల యందు రుద్రాక్షలను ధరించిన ఫలితము ఇంతని చెప్పలేము.

అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 5

One who wears Rudrakshas, should not use intoxicants, meat, garlic, onions, carrots and all such prohibited things. By wearing Rudrakshas during eclipses, Vishusankranti (the end of Mina and beginning of Mesha Masa), new moon, full moon and other such auspicious days, one is freed of all sins.

The base of the Rudraksha bead is Brahma, its navel is Vishnu, its face is Rudra and its hole consists of all gods.

One day Sanatkumara asked Kalagnirudra: “O Lord! Tell me the rules for wearing Rudrakshas”. At that time Nidagha, Jadabharata, Dattatreya, Katyayana, Bharadvaja, Kapila, Vasishtha, Pippalada, etc., came to Kalagnirudra. Then Lord Kalagnirudra asked them why they all had come in a group. They all answered that they came to hear the method of wearing Rudrakshas.

Kalagnirudra said: Those that are born out of Rudra’s Akshis (eyes) are called Rudrakshas. When these beads are even once touched by hand, one attains the glory of giving in charity two thousand cows at a time. When they are worn in ears, he gets the effect of giving out eleven thousand cows in charity. He also attains the state of the eleven Rudras. When the beads are worn on the head, one has the benefit of giving a crore of cows in charity. Of all these places, I am unable to tell you the benefit when worn in the ears.

To be continued............
- Swami ‪‎Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Sunday, 22 February 2015

హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య)

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. 

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  

వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు. 

To be continued ............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: 
సంస్కృతి – సాంప్రదాయం – భక్తి http://goo.gl/tUI5YR

Saturday, 21 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 4

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు 4

రుద్రాక్షల యొక్క వివిధ ముఖములు వాని యొక్క ప్రభావము ఈ క్రింది విధముగా ఉండును.

 ముఖము           రూపము                   ప్రభావము
1. ఏకముఖి  -----శాశ్వత సత్యము -----మోక్షమును పొందుట .
2. ద్విముఖి -----అర్ధనారీశ్వర -----అర్ధనారీశ్వరుని కృప
3. త్రిముఖి ------ అగ్ని ----------- అగ్నిదేవుని కటాక్షము
4. చతుర్ముఖి ----బ్రహ్మ ---------  బ్రహ్మ దేవుని కటాక్షము
5. పంచముఖి  ---- బ్రహ్మ ------- నరహత్య పాతకము తొలగించును
6. షణ్ముఖి ------ కార్తికేయుడు/గణపతి -----చిత్తశుద్ది, జ్ఞాన సిద్ది కలిగించును
7. సప్తముఖి ------ సంపద , ఆరోగ్యము కలిగించును..
8. అష్టముఖి -----  అష్ట వసువులు/గంగ ----దేవతల ఆశీర్వచనం కలుగును, సత్య మార్గమును సాధించును
9. నవముఖి ---- నవగ్రహములు--నవ విధములైన శక్తులు సాధించును
10. దశముఖి ----- యముడు ----శాంతిని చేకూర్చును
11. ఏకాదశ ముఖి ---- ఏకాదశ రుద్రులు ---సర్వవిధములైన సంపదలు
12. ద్వాదశ ముఖి --- మహా విష్ణు, / ద్వాదశ రుద్రులు ---- మోక్ష సాధనము
13. త్రయోదశ ముఖి --- మన్మధుడు ----- అన్ని కామనలు తీర్చును.
14. చతుర్దశ ముఖి --- రుద్రుడు --- అన్ని వ్యాధులను రూపుమాపును.

(ఇంకా ఉంది )

అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 4

(The following is a list of different faces of Rudrakshas and their effects).
Faces
Form
Effect of wearing
1.
Supreme Truth
Attainment of Eternity
2.
Ardhanarisvara
Grace of Ardhanarisvara
3.
Tretagni
Grace of Agni
4.
Brahma
Grace of Brahma
5.
Pancha-Brahmas
Destruction of homicide sin
6.
Karttikeya or Ganesa
Attainment of Chitta-Suddhi and Jnana
7.
Saptamala
Attainment of good health and wealth
8.
Ashtamatras (Ashta Vasus) or Ganga
Grace of these Devatas and becoming truthful
9.
Nava-Saktis
Grace of Nava-Saktis or nine Powers
10.
Yama
Attainment of Peace.
11.
Ekadasa Rudras
Increase of all kinds of wealth
12.
Mahavishnu or 12 Adityas
Attainment of Moksha
13.
Cupid
Attainment of fulfilling desires and grace of Cupid
14.
Rudra
Destruction of all diseases

To be continued............
- Swami ‪‎Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Friday, 20 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 3

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు 3

శివ భక్తుడైన వాడు ఎల్లవేళలా అంటే, తింటున్న, తిరుగుతున్నా, పడుకున్నా, శిఖ చుట్టూ, చెవులకు, భుజములకు , ఉదరము చుట్టూ రుద్రాక్షలను తప్పక ధరించవలెను. భక్తుడు 300 రుద్రాక్షలు ధరించిన అది అధమము. 500 మధ్యమము, 1000 ఉత్తమమోత్తమము.

రుద్రాక్షలను తల యందు ధరించునపుడు, ఇష్ట మంత్రమును, మెడ చుట్టూ ధరించునపుడు తత్పురుష మంత్రమును, కంఠము నందు ధరించునపుడు అఘోర మంత్రమును స్మరణ చేయుచుండవలెను. ఛాతి యందు ధరించునపుడు కూడాను, అఘోర మంత్రమును స్మరించవలెను. భుజముల యందు ధరించునపుడు అఘోర బీజ మంత్రమును స్మరించ వలెను.

మరల భూశండుడు కాలాగ్ని రుద్రుని రుద్రాక్షల యొక్క వివిధ రూపములు, ప్రభావముల గురించి చెప్పవలసినదిగా ప్రార్ధించెను. రుద్రాక్షలకు కల పలు ముఖముల గురించి, వాటిని ఉపయోగించి, దోషములను పోగొట్టుకొనుట గురించి ప్రశ్నించెను.

కాలాగ్ని రుద్రుడు ఇట్లు చెప్పసాగెను.: ఏకముఖము కల రుద్రాక్ష అఖండ సత్యమునకు ప్రతీక. ఇంద్రియములను జయించిన మానవుడు, ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించుట వలన శాశ్వతమైన సత్యమునందు తనను తాను లయము చేసుకోనును.

(ఇంకా ఉంది )

అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 3

A Siva-Bhakta should wear Rudrakshas round his crown, ear-ring, chain, round the ear, armlet, at all times, and specially round the stomach, irrespective of the fact whether he is sleeping, drinking, etc.

If the devotee wears three hundred beads, it is the worst, if he wears five hundred it will be medium, but one thousand will be the best of all.

The devotee, when wearing Rudrakshas on the head, should repeat his Ishta Mantra, and when wearing them round the neck, should repeat the Tat-Purusha Mantra and when wearing round the throat, should repeat the Aghora Mantra. The same Mantra (Aghora) should be recited when wearing round the chest also.

He should wear them round the arms with the Aghora Bija Mantra.

Then again Bhusunda asked Lord Kalagnirudra: What are the different forms and effects of Rudraksha beads? Please tell me about the secret of these blessed ones including their various faces, which is the means of getting rid of all evil.

Lord Kalagnirudra said: The bead with one face is of the form of the Supreme Truth. A disciplined one (controlling his senses) mingles himself with the one Eternal Truth, after wearing these Rudrakshas.

To be continued............
- Swami ‪‎Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Thursday, 19 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 2

శైవ ఉపనిషత్తులు
రుద్రాక్ష జాబాల ఉపనిషత్ 2

రుద్రాక్షలలో అమలకము (ఉసిరికాయ ) అంత పరిమాణము కల రుద్రాక్షలు శ్రేష్ఠమైనవిగా చెప్తారు. బదరి ఫలం (రేగు పండు) పరిమాణం కలవి మధ్యమమైనవి గాను, శనగ గింజ పరిమాణము కలవి పూజనీయం కావు అని చెప్తారు.
Satguru sivaya subramunia swamy

గుణకర్మలను అనుసరుంచి లోకంలో నాలుగు వర్ణాల ప్రజలు ఉంటారు. అట్లాగే రుద్రాక్షల్లో కూడా నాలుగు వర్ణాలు ఉంటాయి.  శ్వేత వర్ణ రుద్రాక్షలు బ్రాహ్మణులు, ఎరుపు వర్ణము క్షత్రియులు, పసుపు రంగు వైశ్యులు, నల్లని రుద్రాక్షలు శూద్రులుగా విభాగం చేశారు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని ఏమీ లేదు, అన్ని సమానమైనవేనైనా, ఆయ గుణాలున్న వ్యక్తులు వారికి తగ్గ రుద్రాక్షలు ధరించడం ఉత్తమం. ఈ పధ్ధతి లోనే చాతుర్వర్ణాల వారు రుద్రాక్షలు ధరించాలి అని చెప్తారు.

రుద్రాక్షలను ఎంచుకునేటప్పుడు అవి చూడడానికి చక్కగా, పెద్దగా, బరువుగా, బలంగా, పవిత్రంగా మరియు గతుకులు గతుకులుగా ఉండాలి. కీటకములు పాడు చేసిన, గతుకులుగా లేకపోయినా, పగిలినా, పుచ్చులు పడినా వాటిని విసర్జించాలి.

సహజం గా రంధ్రం పడిన రుద్రాక్షలు ఉత్తమమైనవి. మానవుని ప్రయత్నం వలన రంధ్రం చేయబడ్డ రుద్రాక్షలు అంత మంచివి కావు. రుద్రాక్షలను తెల్లని దారం తో మాలగా గుచ్చవలెను.శైవారాధకులు శరీరం అంతటనూ రుద్రాక్షలు ధరించవలెను. శిఖ పైన ఒక రుద్రాక్ష, తల చుట్టూ 300, మెడచుట్టూ 36, భుజం (జబ్బ) చుట్టూ 16 చొప్పున, హృదయం చుట్టూ 12, మరియు నడుము చుట్టూ 500 ధరించవలెను. 108 రుద్రాక్షలు కల మాలను యజ్ఞోపవీతం గా ధరించవలెను. కంఠం చుట్టూ 2,3,5 లేదా 7 రుద్రాక్ష మాలలను ధరించవలెను.

(ఇంకా ఉంది )

అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 2

Among Rudrakshas, one as big as Amalaka (myrobalan), is considered to be the best. One as big as the Badari fruit (Indian berry) is considered to be of the middle sort. But that as big as Chana (Bengal gram) is considered to be the worst of all. This is my idea about the size of Rudraksha beads.

The four kinds of people, Brahmins, Kshatriyas, Vaisyas and Sudras are born as merely a worthless burden on the earth. The real Brahmin is the white Rudraksha. The red is a Kshatriya. The yellow is a Vaisya. And the black is a Sudra.

Therefore, a Brahmin should wear white Rudrakshas, a Kshatriya the red, a Vaisya the yellow and a Sudra the black.

One should use those Rudraksha-beads which are nice, handsome, strong, big, auspicious and thorny. One should avoid those eaten by worms, broken, without thorns, and having sores.

The self-holed Rudraksha is of the best variety. But that which is holed by man’s attempt, is considered to be worse. Those best Rudrakshas should be strung in white thread. A worshipper of Siva should wear Rudraksha all over the body. He should wear one bead on the crest, three hundred round the head, thirty-six round the neck, sixteen round each arm, twelve round the chest and five hundred round the waist. He should wear a Yajnopavita consisting of one hundred and eight beads of Rudrakshas. He should wear two, three, five or seven Malas of Rudraksha round the neck.

To be continued............
- Swami ‪‎Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Wednesday, 18 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు -1

రుద్రాక్ష జాబాల ఉపనిషద్ (1)
హరి  ఓం!   రుద్రాక్ష జాబాలి ఉపనిషద్ ద్వారా, మహారుద్రునికి చెందిన రుద్రాక్షలను గురించి తెలుసుకుందాం.

భూశండుడు కాలాగ్ని రుద్రుని ఇలా అడిగాడు..రుద్రాక్ష ల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? వాటిని ధరించడం వలన ఒనగూరే ప్రయోజనం ఏమిటి? అని..

కాలాగ్ని రుద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. త్రిపురాసురులను సంహరించే నిమిత్తం ఒకసారి నేను నా కన్నులను మూసుకున్నాను. అట్లు మూసిన నా కన్నుల నుండి అశ్రువులు స్రవించి భూమిపై పడినవి.  ఆ బిందువులు రుద్రాక్షలుగా మారినవి. రుద్రుని అక్షుల (కన్నుల ) నుండి వెలువడినవి కావున రుద్రాక్షలు అని పిలువబడినవి.

కేవలం "రుద్రాక్ష" అను నామం స్మరించినంతనే, మానవునకు, 10 గోవులు దానము చేసిన ఫలితము కలుగును. రుద్రాక్షలను వీక్షించినను, స్ప్రుశించినను దానికి రెట్టింపు ఫలము దొరకును. ఈ రుద్రాక్షల వలన కలుగు ప్రయొజనములను ఇంతకన్నా చెప్పుటకు నేను ఆశక్తుడను.

నేను నా కన్నులను ఒక వెయ్యి ఖగోళ సంవత్సరములు మూసికొని ఉన్నాను. నా కన్నుల నుండి నీటి బిందువులు రాలి పడినవి. అవి నా భక్తులను దీవించుటకై అచంచల స్థితి పొంది, రుద్రాక్షలు అయినవి.
ఈ రుద్రాక్షలు తమను  ధరించిన భక్తులు, రాత్రి అనక, పగలు అనక చేసిన పాపములను పోగొట్టును.
రుద్రాక్షలను వీక్షించిన మాత్రముననే, వాటి ఫలము లక్షలుగా పొందగలము. ఇక వాటిని ధరించుట మూలముగా ఆ ఫలము కోట్లు, శత కోట్లుగా పొందగలము.

దీనిని ధరించుట వలన, మరియు రుద్రాక్షలతో జపము చేసినందువలన వచ్చు ఫలము మరింతగా కోట్లు, కోట్లుగా ఉండును.

( ఇంకా ఉంది)

అనువాదం - శ్రీమతి Padma Mvs

Original
Rudraksha Jabala Upanishad - 1

Haft Om! I praise the Effulgent State of Absolute Peace, belonging to Sri Maharudra, which is to be known through the Rudraksha Jabala Upanishad.

Bhusunda questioned Lord Kalagnirudra: What is the beginning of Rudraksha beads? What is the benefit of wearing them on the body?

Lord Kalagnirudra answered him thus: I closed my eyes for the sake of destroying the Tripura Asuras. From my eyes thus closed, drops of water fell on the earth. These drops of tears turned into Rudrakshas.

By the mere utterance of the name of ‘Rudraksha’, one acquires the benefit of giving ten cows in charity. By seeing and touching it, one attains double that benefit. I am unable to praise it any more.

I closed my eyes one thousand celestial years. Then from my eyelids, drops of water dropped down and attained the state of immobility for blessing the devoted persons.

This Rudraksha destroys the devotees’ sins that are committed both night and day, by wearing it.

By mere vision of the Rudraksha, the benefit will be say, a lac. But by wearing them, it will be a crore. Why, it will be equal to hundred crores.

But it will be a thousand lacs of crores and hundred lacs of crores times powerful when one does Japa with Rudraksha and wears it at all times.

To be continued............
- Swami Sivananda‬ in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Tuesday, 17 February 2015

17 ఫిబ్రవరి 3102 BC హిందూ చరిత్రలో ఒక మైలు రాయి

17 ఫిబ్రవరి హిందూ చరిత్రలో ఒక మైలు రాయి. అందరు గుర్తుపెట్టుకోవలసిన రోజు. ఎందుకు?

ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ లో డేట్ లు చెప్పుకోవలసి వస్తే

17 ఫిబ్రవరి 3102BC మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోలో శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.

17 ఫిబ్రవరి 3102 BC తో ద్వాపరయుగం మిగుసి ఆరోజు అర్ధరాత్రి అంటే 18-2-3102 నాడు కలియుగం ప్రారంభమైంది.

17-2-3102 BC నాడు అర్ధరాత్రి ప్రపంచమంతా మహాఅంధకారంలో హాయిగా న్నిద్రిస్తున్న సమయంలో ఒక మహాజలప్రళయాం సంభవించింది. దీని గురిచి చాలా మతగ్రంధాలు తెలుపుతునాయి. ఈ జలప్రళయం నుండి భారతదేశం మాత్రమే సురక్షితంగా ఉంది.

మహాభారతం ఆధునిక కాలంలో తొలి ప్రపంచయుద్ధం. అందులో అణుబాంబులను వాడారు. అందులో మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి.  3138 BC లో మహాభారత యుద్ధం జరిగింది. అది జరిగి సరిగ్గా 36 ఏళ్ళకు అంటే శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.17 ఫిబ్రవరి 3102 BC లో పరిపూర్ణావతారమైన శ్రీ కృష్ణ పరమాత్మ మహనిర్యాణం చెందారు. వాటి అధారాలు సంస్కృత మహాభారతంలో ఉన్నాయి.

ఫిబ్రవరి 17 3102 BC అని చెప్పడానికి ఆధారం మహాభారతంలో ఇవ్వబడిన గ్రహగతులు. గ్రహగతులను ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడున్న గతులను వెనక్కు లెక్కవేసుంటూ పోతే ఈ తేదీ వస్తుంది. నవగ్రహాలన్నీ మేషరాశి మొదటికి చేరుకున్న రోజే కలియుగం ఆరంభమైంది. అంటే 18-2-3102 BC అర్ధరాత్రి 00:00 గంటలకు. అది చైత్రమాసంలో జరిగిందని గుర్తుగా మనం ఉగాది జరుపుకుంటున్నాం. అసలు మనకు ఈ ఇంగ్లీష్ తేదీలతో సంబంధం లేదు. కానీ ఎవరైనా మనల్ని మన చరిత్ర గురించి అడిగినప్పుడు మనం  వాళ్ళకు ఒక తేదీని చెప్పాలి కనుక 17 ఫిబ్రవరి 3102 ను గుర్తుంచుకోండి.

కలియుగంలో దైవాన్ని నమ్మవద్దన వాదనలు ఎక్కువగా ఉంటాయి. అసలు దేవుడే లేడంతారు. కేవలం భౌతిక సుఖాల కోసం పరితపించడం ఎక్కువగా ఉంటుంది. అసత్యం, అజ్ఞానం, హింస, అవినీతి, రాజ్యామేలుతాయి. ఎవరైన భక్తి కలిగి పరమాత్ముడిని ఆరాధిస్తుంటే, వాళ్ళను వెక్కిరించేవాళ్ళు, అసలు దేవుడు లేడని, ఉన్నా మాకు నమ్మకం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువవుతారు. వారాంతా ఈ కలిపురుషుడు ప్రభావంతో ఇలాంటీ వెక్కిలి చేష్టలు చేస్తుంటారు. ప్రజల్లో స్వార్ధం పెరిగిపోతుంది. విశృంఖల కామం ఈ కలియుగ లక్షణం.        

ఇదే రోజు జరిగిన మరొక సంఘటన, 17-2-3102 BC నాడు కృష్ణ నిర్యాణం జరగగానే ఒక మహా జలప్రళయం సంభవించింది. పెద్ద ఉప్పెన(tsunami) వచ్చి ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అప్పుడు మన మహర్షులు కర్మ భూమి, వేదభూమి, యోగభూమి అయిన మన భారతభూమి, భారతీయులు క్షేమంగా ఉండాలని పరమాత్ముడిని వేడుకున్నారు. ఒక్క భారతదేశం తప్ప మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చిన మహాజలప్రళయంలో చాలా భాగం ధ్వంసమైంది. ఈ ప్రళయం గురించి ఇతర మతగ్రంధాలు కూడా తెలుపుతున్నాయి.

అందుకే ప్రపంచంలో ఈరోజు మన చెప్తున్న అనేక నాగరికతలు కూడా 5000 ఏళ్ళకు దరిదాపులలోనే మొదలయ్యాయి. కాని మన మహర్షుల తపశ్శక్తితో నిరంతరం ఈ దేశాన్ని రక్షిస్తూ ఉండటం వలన భారతీయ సనాతన హిందూ నాగరికత గత 197.2 కోట్ల సంవత్సరాల నుండి ఏ ప్రళయమూ లేకుండా కొనసాగుతోందని సంస్కృత భాగవతం వివరిస్తోంది. అందుకే ఈ ప్రపంచానికి నేను హిందువును అని సగర్వంగా చాటి చెప్పండి.

వీటన్నిటికి ప్రామాణికం సంస్కృత భాషలో ఉన్న మహాభారతం, భాగవతం, మరియు ఇతర పురాణాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది చారిత్రాత్మికం అంగీకరించారు.ఇందులో నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.

Originally published: 17-Feb-2013
Republished 1st time : 17-Feb-2015

శివరాత్రి కధ - 4 (విజ్ఞానం)

శివరాత్రి కధ- 4 (విజ్ఞానం)

త్రిమూర్తులకు భేధం లేదని చెప్పి మహాశివుడు అదృశ్యమవుతాడు. అప్పుడు ఆ శివలింగం అనంతమైన ఆ శూన్యంలో, జలంలో అండంగా మారుతుంది. ఆ అండం నుంచి సృష్టి జరగాలనీ చేయాలని బ్రహ్మ తపస్సు చేస్తాడు. ఈలోగా ఆ అండంలోనికి విష్ణువు ప్రవేశిస్తాడు. విష్ణువంటే ప్రాణశక్తి కనుక విష్ణువు ప్రవేశంతో సృష్టి మొదలవుతుంది. కర్దమ, దక్ష, మరీచి మొదలైన ప్రజాపతులను బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ తరువాత జను, పక్షి, క్రిమి, కిటక, రాక్షస, దేవ, మానవ మొదలైన సంతతి పెరిగిందని పురాణం చెప్తున్నది.

పురాణం ఒట్టి కధ కాదు, అందులో చాలా విజ్ఞానం, నీతి, జీవన విధానం, ధర్మం ఇమిడి ఉంటాయి. ఈ శివరాత్రి కధలో అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

శూన్యం తప్ప ఏమి లేదు అని పురాణం అంటుంది. అవును, ఈ విశ్వం శూన్యం నుంచి వచ్చి, తిరిగి శూన్యంలోనే లయమవుతుందని ఆధునిక సైసు ఒప్పుకుంది. ఒక శూన్యమంతా నీటితో నిండి ఉంది అన్నది పురాణం. అంతరిక్షంలో ఈ భూమిని ముంచెత్తగల స్థాయిలో నీరు ఉన్నదని, అది ఈ భూమికి చాలా దూరంగా ఉందని ఈ నాటి అంతరిక్ష శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు, అంగీకరిస్తున్నారు.

మనకు కనిపించే ఈ విశ్వమే కాదు, వందల కోట్ల విశ్వాలు భగవంతుని సృష్టిలో ఉన్నాయని భారతీయ గ్రంధాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంటే ఒక బ్రహ్మాండం. మనకు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటికి అనేక బ్రహ్మలు ఉన్నారని పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పైకి రావడం అంటే, అనంతమైన భగవత్ సృష్టిలో ఒక బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం జరగడమని అర్దం. ఇటువంటి అనేక బ్రహ్మాండాలు, ప్రతి క్షణం ఉద్భవిస్తుంటాయి, నశిస్తుంటాయి. సముద్రపుఅలలపై వచ్చే నీటి బుడగలవలే అనేక బ్రహ్మాండాలు ప్రతిక్షణం విష్ణువులో ఐక్యం అవుతాయని, కొత్తవి వస్తుంటాయని మన వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈ నాటి శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ గెలాక్సికి అవతల, భూమిని పోలిన అనేక గ్రహాలు ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు. బ్రహ్మ తన ఉనికిని గురించి తాను బయట శోధించి విఫలం కావడం, తరువాత తపస్సు ఒక సందేశం. విశ్వమంతా వెతికినా, మానవుడి ఉనికి యొక్క రహస్యం బాహ్యప్రపంచంలో దొరకదు, తన ఉనికిని గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖత చెందాలి, అంటే లోపలికి చూడాలి, తనలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే తన ఉనికి గురించి సమస్తము తెలుస్తుంది. ఒక రకంగా అష్టాంగయోగంగా అర్ధం చేసుకోవచ్చు.

ఇక శివుడు లింగరూపంలో రావడం అన్నది పెద్ద వైజ్ఞానికి సత్యం. దీన్ని ఆధునిక కాస్మాలజిస్ట్‌లు ఒప్పుకున్నారు.

ఈశా ఫౌండేషన్ స్థాఫుకులు జగ్గీవాసుదేవ్ గారు శివలింగం గురించి ఈ విధంగా చెప్పారు. 'శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది. Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid  ఆకారంలోనే ఉంది. నిరాకారమైన (unmanifest) శక్తి (energy) ఒక సాకార (manifest) రూపాన్ని సంతరించుకునే క్రమంలో, రూపాంతరం చెందే క్రమంలో, అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది అని పురాణం, ఆధునిక సైన్సు చెప్తున్నాయి'. ఈ బ్రహ్మాండమే లింగము, శివలింగం బ్రహ్మాండానికి సంకేతం అంటాయి శివ, లింగ పురాణాలు. ఎప్పుడైన పిల్లలు శివలింగం అంటే ఏంటీ అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నిర్భయంగా, గర్వంగా చెప్పండి.

ఈ లింగం ఆద్యంతాలు లేకుండా పెరగడం అంటే, ఈ బ్రహ్మాండం నిత్యం వ్యాపిస్తూ ఉంటుందనడానికి సంకేతం. బ్రహ్మ, విష్ణువులు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణం చేసినా, లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోలేకపొవడం, ఈ బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని దాటి వెళ్ళాలంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరములు పడుతుందని, అది సాధ్యం కాని విషయమని, ఈ బ్రహ్మాండం ఎంత మేర వ్యాపించి ఉన్నదో చెప్పడం కష్టమని తెలియజేయడమే. దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదా?

లింగపురాణం అంతరిక్షం గురించి, దాని వయసు గురించి ఏ విషయాలైతే స్పష్టం చేసిందో, సరిగ్గా అవే విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఇవన్నీ మన ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత చెప్తున్న విషయాలు కాదు, మన పురాణాలు ఏవైతే చెప్పాయి వాటినే చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మనవన్నీ పుక్కిటి పురాణాలు అని వెక్కిరించిన పాశ్చ్యాతులే ఈ రోజు ఇవన్నీ సత్యాలని అంగీకరిస్తున్నారు, కొత్త కనుగొన్నామని చంకలు గుద్దుకుంటున్నారు. అంతే. కానీ మనం మాత్రం ఇవన్నీ పాతకాలపు మాటలని పక్కనపడేస్తున్నాం.

ఓం నమః శివాయ

Originally published : 27-Feb-2014 (Mahasiva ratri)
Republished 1st time: 17-Feb-2015 (MahaSiva ratri)
శివలింగం దేనికి సంకేతం? Published:  18-Nov-2012
http://ecoganesha.blogspot.in/2012/11/blog-post_18.html

Monday, 16 February 2015

శివరాత్రి కధ - 3

కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకారమమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తననీ, తన ఆదేశాలనీ పాటించితీరవలసిందే అన్నాడు. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది.

ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.

అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం.  వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.

అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.

శివుడు కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.

నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.

అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం

ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.

ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.

ఓం నమః శివాయ 

Sunday, 15 February 2015

శివరాత్రి కధ - 2

బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుపోతూనే ఉంది. అది వ్యక్తావ్యక్తస్వరూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.

ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.  

విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారాయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.

బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.

ఇంతలో పై నుంచి కేతకీ పుష్పం క్రిందకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చించి క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీని అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.  

To be continued............

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.


1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన

అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. కనుక శివరాత్రి రోజున పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. శివుడి మీద పాక్యెట్ పాలు పోయనవసరంలేదు, నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడు. కాసిన్ని పాలు శివుడికి సమర్పించి, మిగితావి జీవుల యందున్న శివునికి సమర్పించండి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. వెన్ను నిటారుగా ఉండడమంటే చాలామంది వెన్నుపూస మీద భారం వేసి కూర్చుంటారు, అలా చేస్తే నడుమునొప్పి వస్తుంది. మీ శరీర బరువు చాతి భాగంలో పడేలా కూర్చోవాలంటారు స్వామి వివేకానంద. ఇది మాత్రమే నిటారుగా కూర్చోవడం అనే విషయంగా పరిగణైంచబడుతుంది, శ్రద్ధను పెంచుతుంది. ఒక్కరోజులో నిటారుగా కూర్చోవడం కష్టమవ్వచు. అసలు ఇలాంటి  అలవటు నిత్య జీవితంలో చాలా మంది లేకపోవచ్చు. మరి ఏం చేయాలి? శివరాత్రికి కనీసం ఒక రెండు రోజుల ముందు నుంచి నేల మీద నిద్రించడం చేత వెన్ను రోజంతా సహకరిస్తుంది. నేల మీద అనగానే అచ్చంగా నేల మీద నిద్రించమని కాదు, చాప, లేక దుప్పటి, బొంత ...... పరుపు కాకుండా, ఏదో ఒకటి వేసుకుని శయనించడం వలన రోజంతా నిటారుగా కూర్చోవడానికి వెన్ను సహకరిస్తుంది.

3. మౌనవ్రతం

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. చాలామంది మౌనవ్రతమని చెప్పి, మాట్లాడకుండా రకరకాల సైగలు చేస్తారు, కొందరు మౌనంగా కూర్చుని టి.వి. చూస్తారు, ఇంకొందరు టైపు చేయడమే కదా, మాటలతో పనేంటీ అని చాటింగ్ చేస్తారు.ఇవేమీ మౌన వ్రతం అనిపించుకోవని అర్దం చేసుకోండి. మీరు మాట్లడటం ఆపేసినంత మాత్రం చేత, మనసుతో మట్లాడటం లేదా? సైగలతో మాట్లాడటం లేదా? వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.  

4.అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 

6.మంత్ర జపం

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలి. దేవాలయానికి వెళ్తే, అక్కడ రుద్రం చదువుతుంటారు. ఆ రుద్ర నమక-చమకాలు వింటూనో, ఇతర ప్రవచనాలు వింటూనో చేసే జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

Saturday, 14 February 2015

శివరాత్రి కధ - 1

శివరాత్రి యొక్క ప్రాశస్త్యం గురించి లింగ, శివ పురాణాల్లో చకట్టి కధ ఒకటి ఉంది. (సంక్షిప్తంగా)

ఒకానొక సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు. ఆది, అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో 'నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.

తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తన ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చునని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.

ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా ఒక 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మను మాయ కప్పేసింది. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు? అని అడుగుతాడు. శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.

విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతనూ అంటూ వాదించాడు బ్రహ్మ.

నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరింది.

To be continued............

Friday, 13 February 2015

మహాశివరాత్రి - ఉపవాసం

ఓం నమః శివాయ

17, ఫిబ్రవరి, 2015, మంగళవారం, మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి సంధర్భంగా శివరాత్రి ఉపవాసం గురించి ఒక కధ చెప్పుకుందాం.

శివుడు కరుణ చూపాలి, అనుగ్రహించాలి అనుకుంటే ఎన్నో విచిత్రాలు చేస్తాడు. పూర్వం ఏమి తెలియని ఒక బోయవాడు ఉండేవాడు. పక్షులు, జంతువులు వేటాడి బ్రతికేవాడు. ఒకసారి వేట కోసం జంతువులను వెతుకుతూ అడవికి వెళ్ళాడు కానీ ఒక్క జంతువు కనపడలేదు. జంతువులను చంపకపోతే అతనికి, అతని భార్యకు ఆహారం ఉండదు. అందువల్ల ఆ రోజు వేటాడిన తరువాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. చాలాసేపు వెతికిన తరువాత ఓపిక నశించి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కుదామని క్రింద ఉన్న రాయి మీద కాలు వేసి, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఒక శివలింగం, కానీ ఆ బోయవానికి అది శివలింగం అనే సంగతి తెలియదు. అతడు ఎక్కింది మారేడు చెట్టు. చాలాసేపు ఎదురు చుశాడు. అతనికి దాహం వేయడంతో తనతో పాటు తెచ్చుకున్న నీటిని త్రాగుదామనుకున్నాడు, కాని భార్య గుర్తుకురావడంతో నోటిలో పోసుకున్న నీటిని ఉమ్మేశాడు. అవి క్రింద ఉన్న రాయి (శివలింగం) మీద పడ్డాయి. అది ఆ శివలింగానికి జరిగిన అభిషేకంగా శివుడు భావించాడు. శబ్దం చేస్తే జంతువులు రావని నిశ్శబ్దంగా దాహంతోనూ, ఆకలితోను, మౌనంగా రాత్రంతా అలాగే కూర్చున్నాడు.


రాత్రవుతోంది కాని తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా అతని భార్య అతని కోసం వెతకడానికి బయలుదేరింది. ఆమె కూడా ఏమి తినలేదు. తన భర్త కోసం గాలిస్తూ ఆమె దగ్గరలో ఉన్న ఒక శివాలయం వద్దకు చేరుకుంది. ఆ రోజు శివరాత్రి. భక్తులు తన్మయత్వంతో భజనలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆమె ఆ భజనలు విని, వాటికి ఆకర్షితురాలయై, భజన తరువాత ఏమైనా పడతారేమో అని, ఆ భజనలు వింటూ అక్కడే కూర్చుంది. కానీ భజనలో మమేకమై ఆకలిని మరిచిపోయింది.

`ఈ బోయవాడికి బాగా ఆకలి వేయడం వలన అతనికి నిద్రరాలేదు. అతనికి కూర్చొవడం ఇబ్బందిగా ఉండడంతో, అప్పుడప్పుడు కదిలాడు. అతను కదిలిన ప్రతిసారి మారేడు చెట్టుకున్న మారేడు దళాలు రాలి, క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అలా ప్రతి జాములోను (అంటే ప్రతి మూడు గంటలకు) పడుతూనే ఉన్నాయి. అది శివుడు అతని వలన జరిగిన అర్చనగా భావించాడు. ఈ విధంగా అడవిలో బోయవాడు, గుడిలో అతని భార్య రాత్రంతా జాగరణ చేశారు.


ఉదయం సూర్యోదయం జరగగానే అతను తన భార్యను వెతుకుతూ గుడికి చేరుకుని, ఒకరినిఒకరు చూసుకుని సంతోషపడసాగారు. ఇంతలో ఆ గుడి పూజారి వచ్చి వీళ్ళకు ప్రసాదం పెట్టాడు. ఏమి దొరకక ఆకలితో ఉన్న వాళ్ళీద్దరు, ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడితో వాళ్ళ ఉపవాసవ్రతం పూర్తయ్యింది అని శివుడు భావించాడు. ఈ వ్రతం చేయడంతో వారిలో మార్పు వచ్చింది. వేటాడడం మానేసి మంచివృత్తిని ఎంచుకుని ధర్మంగా జీవించారు.

ఇద్దరు మరణించగానే వారి ఆత్మలను తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. అప్పుడే శివభటులు కూడా వచ్చి వారిని కైలాసానికి తీసుకువెళతామనగా, వీళ్ళు ఎన్నో పాపాలు చేశారు, అనేక జంతువులను చంపారు. వీరు నరకానికే వెళ్ళాలన్నారు యమభటులు. అప్పుడు శివభటులు "వీరు ఆ మహాశివరాత్రి నాడు చేసిన ప్రతి పనిని కూడా పరమశివుడు తన పూజగా భావించి, వీరికి అనంతమైన పుణ్యాన్నిప్రసాదించాడు. వీరు చెసిన వ్రతానికి వీరి పాపం మొత్తం భస్మమైపోయింది. అందువల్ల వీరికి కైలాసంలో ఉండే అవకాశం ఏర్పడింది" అని పలికి వారిని కైలాసానికి తీసుకుపోయారు. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు.

మహాశివరాత్రి నాడు ఉపవాసం, శివనామంతో జాగరణ చేయడం, శివలింగాన్ని పూజించడం వలన అనంతమైన పుణ్యం, శివును ఆశీర్వాదం కలుగుతాయి. శివుడు ఆసుతోషుడు అంటే చిన్న చిన్న పూజలకే పొంగిపోయి వరాలిచ్చేవాడు. అటువంటి శివయ్య ఆశీర్వాదంతో జీవితాన్ని సంతోషదాయకం చేసుకోండి.


ఓం నమః శివాయ

Thursday, 12 February 2015

హిందూ ధర్మం - 146 (మయసభ, రోము రాయబారి, మహాభారతం)

భారత్ భౌతిక సంపదలోనే కాక, ఆధ్యాత్మిక సంపదలో కూడా ధనవంతురాలు, శక్తివంతురాలు. ద్వాపరయుగాంతం నాటికి భారత్‌కు గొప్ప క్షత్రియబలం ఉంది, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచమంతా భరతమాత కాళ్ళ ముందు మోకరిల్లింది. దక్షిణ అమెరికాలో పెరులో విలసిల్లిన మయాన్ నాగరికత మూలుపురుషుడు మయుడు / మయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. అమెరికాలోకి తెల్లదొరలు ప్రవేశించకముందు అక్కడున్న సంస్కృతి హిందూ సంస్కృతికి చాలా దగ్గరగా ఉండేది. ఒకప్పుడు అమెరికాలో హైందవం ఉందండానికి ఆధారం ఆ దేశంలో జరిగిన పురాతన గణపతి, సూర్య, దేవి విగ్రహాలు, శ్రీ చక్రాలు. (వివరాలకు ఈ లింక్ చూడండి http://ecoganesha.blogspot.in/2014_06_01_archive.html )  అట్లాగే మయుడు కూడా వౌదిక ధర్మాన్ని అనుసరించేవాడే. మయుడు శిల్పి, విశ్వకర్మ. సముద్రగర్భంలో కలిసిపోయినట్టుగా భావిస్తున్న అపూర్వమైన అట్లాంటిస్ నగరం ఈయందేనని, అట్లాంటిస్‌కు మయా నాగరికతకు సంబంధం ఉందని చెప్తున్నారు అక్కడి పరిశోధకులు.

ప్రపంచంలో ధర్మం లోపించినప్పుడు ధర్మప్రచారం చేసి, ప్రపంచాన్ని ఉద్ధరించేది భారతదేశమే, ఇక్కడే సమస్త విద్యలు పుట్టాయి, ఋషులు అనేకులు ఈ భూమిని ఎంతో గొప్పదిగా కీర్తించారు. ఆయా కారణాల చేత ప్రపంచం భరతఖండాన్ని ప్రపంచం గౌరవించింది. అదే గౌరవంతో ధర్మరాజుకు కానుకగా మయుడు తన దగ్గరున్న అపూర్వమైన విద్యతో, విజ్ఞానపటిమతో హస్తినాపురంలో మయసభను నిర్మించాడు. అదీగాక, అప్పుడు భారత్ ప్రపంచశక్తి (Super power), ధర్మరాజు సామ్రాట్టు (Emperor). మహాభారతం సభాపర్వం దీన్ని వివరిస్తుంది. భౌతిక శాస్త్రంలో (physics) కాంతి పర్వార్తనం (refraction), ప్రతిబింబించడం (reflection),  ద్వైధీభూతం (Di-fraction) కావడం, ఇంద్రధనస్సు (rainbow) లాగ విరిగి వికృతి పొందడం వంటి శాస్త్ర విషయాలను ఆధారంగా చేసుకుని, ఉన్న వస్తువులను లేనట్టుగాను, లేని వస్తువులను ఉన్నట్టుగాను కనిపించే అద్భుతరీతలో ఈ 'మయసభ' నిర్మాణం జరిగింది. ఇది ఇప్పటి పార్లమెంటు హాలు వంటిది అనుకోవచ్చు. ఈ మయసభ నిర్మాణం చూడటానికి వచ్చిన దుర్యోధనుడు, నీళ్ళున్న చోట లేవనుకుని భ్రాంతి చెంది జారిపడటం, అది చూసి ద్రౌపది నవ్వడం, ఆ తర్వాత జరిగిన కధ తెలిసిందే. ఎడారిలో నీరు లేకున్నా, ఉన్నట్లు కనిపించడం కాంతిరేఖలు వంగటం వల్లనే జరుగుతుందని ఈనాటి సైన్సు చెపుతోంది. ఇటువంటి వైజ్ఞానిక సత్యాలే మయసభ నిర్మాణానికి ఉపయోగించినట్టు స్పష్టం అవుతోంది.

రాజసూయ యాగంలో ధర్మరాజును సామ్రాట్టుగా చేసినప్పుడు, ఆయనకు బహుమానాలు ఇవ్వటానికి ప్రపంచ నలుమూలల నుంచి అనేకమంది రాజులు భారతదేశానికి వచ్చినట్టు వ్యాసమహర్షి సభాపర్వం 52 లో చెప్పారు. అందులో రోము సామ్రాజ్యం కూడా ఉంది. రోమన్ సామ్రాజ్యం నుంచి రాయబారి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుకు నగలు, బహుమానాలు ఇచ్చారు. భారత్ ఇంతగొప్ప శక్తి కాబట్టే, మహాభారత సంగ్రామంలో ప్రపంచం మొత్తం రెండుగా చీలి, కొందరు కౌరవుల తరుపున, మరికొందరు పాండవుల తరుపున యుద్ధంలో పాల్గొన్నారు.

To be continued ...................
ఈ రచనకు సహాయపడిన గ్రంధం : మనదేశం, మన సంస్కృతి - డా|| వేదవ్యాస, ఐ.ఏ.ఎస్.

Wednesday, 11 February 2015

హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ)

శ్రీ కృష్ణుడు చారిత్రిక వ్యక్తి మాత్రమే కాదు, చరిత్రాత్మకవ్యక్తి కూడా. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశం కొత్త రూపు సంతరించుకుంది. శ్రీ కృష్ణుడు జన్మించేసరికి భారతదేశం అనేక రాజ్యాలుగా, వేర్వేరు రాజుల చేత పరిపాలించబడుతూ ఉండేది. ఎవరిలోనూ ఐకమత్యం లేదు. అటువంటి సమయంలో శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని జరిపించాడు. ఆ యాగాన్ని సాకుగా చూపి, భరతఖండంలో ఉన్న రాజులందరిని ఒకే ఛత్రం క్రిందకు తీసుకువచ్చి, 18 రాష్ట్రాలతో, ఢిల్లీలో ధర్మరాజు ఆద్వర్యంలో కేంద్రప్రభుత్వాన్ని స్థాపించి, దేశాన్ని సంఘటితం చేశాడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కూడా అందించాడు. ఆ ప్రయత్నంలో తన బంధువులను, మిత్రులను, రాజులను కోల్పోయిన లేక్క చేయకుండా ప్రపంచ యుద్ధమైన మహాభారతాన్ని విజయవంతంగా నడిపించి, ధర్మాన్ని గెలిపించాడు. ఇదంతా వ్యాసుడి సంస్కృత మహాభారతంలో చెప్పబడింది. ఆధునిక కాలంలో 1947, తర్వాత స్వతంత్ర భారతంలో 562 రాజ్యాలను ఎంతో చాకచక్యంగా విలీనం చేసినట్లుగా, 5000 ఏళ్ళ క్రితమే శ్రీ కృష్ణుడు భారతదేశాన్ని సంఘటితం చేశాడు.

యుగపురుషుడు, మనదేశం - మన సంస్కృతి గ్రంధకర్త. డా|| వేదవ్యాస, ఐ.ఏ.ఎస్. గారి మాటల్లో చెప్పాలంటే 'మహాభారత యుద్ధం గెలిచిన తర్వాత కూడా పదవీ కాంక్ష లేకుండా, ప్రజారంజకుడు, సత్యధర్మపరాయణుడైన ధర్మరాజుని భారతదేశ సింహాసనం మీద అధిష్ఠింపజేసి, తాను ఏ పదవీ తీసుకోకుండా, ద్వారకకు పోయి, ఎంతో సామాన్యమైన జీవితం గడిపిన మహాపురుషుడు, దేశభక్తుడు త్యాగి, మహారాజనీతి దురంధరుడు శ్రీ కృష్ణుడు'.

ఆయన ఆ రోజు సంఘటితం చేసిన కారణంగానే భారతదేశం ఇప్పటికి కనీసం ఈ కొద్దిభాగమైన మిగిలింది. శ్రీ కృష్ణపరమాత్మ యోగి, తాత్వికుడు, యుగపురుషుడు. ప్రపంచభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఒక దేశంగా ఏకం కాకుంటే భారత్ జీవించలేదని ముందే గ్రహించారు. ఆయన సంకల్పం వల్లనే 800 వందల సంవత్సరాల పరాయిపాలన తర్వాత కూడా భారతీయులందరిలో ఐకమత్యం వర్ధిల్లింది. ఎన్నో భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఉన్నా, మా అందరిది ఒకే ధర్మం, ఒకే దేశమని చెప్పగలుగుతున్నామంటే అది కృష్ణుడి సంకల్ప శక్తి మాత్రమే. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత కురుక్షేత్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొన్నటి స్వాతంత్ర సంగ్రామంలో కూడా అనేకమంది సమరయోధులు భగవద్గీత చేత ప్రభావితం చెంది, దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విడిపించారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ జాతీయగీతంలో జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాత అంటారు. ఆయన ఎవరిని ఉద్ద్యేశించి ఆ గీతం రాసిన, అందులో చెప్పిన భారతభాగ్యవిధాత మాత్రం శ్రీ కృష్ణుడే. ఐక్యతలేకపొవడం, ధర్మప్రచారం లోపించడంవలన పశ్చిమాన ఈజిప్ట్ వరకు, తూర్పున భ్రూనై వరకు ఉన్న అఖండభారతం కాలక్రమంలో చిన్న చిన్న ముక్కలైపోయింది, ఆఖరికి కొన్ని రాజకీయ కారణల వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు కూడా ఏర్పడి ఇప్పుడున్న చిన్న ప్రాంతానికి భారత్ పరిమితమైంది. తన భూభాగంలో 90% పైగా కోల్పోయింది.

To be continued .......................

Tuesday, 10 February 2015

హిందూ ధర్మం - 144 (భారతదేశం - ప్రబలశక్తి)

చాలామంది మహాభారతం కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన ఇతిహాసం అనుకుంటారు. కానీ నిజానికి మహాభారతం ప్రపంచ ఇతిహాసం. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఘటన అది. మహాభారత యుద్ధం అనేది ఒక ప్రపంచయుద్దం. అందులో ప్రపంచసేనలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. ఒకటి కౌరవుల పక్షం, రెండవది పాండవుల పక్షం. ఇలా ప్రపంచం రెండూగా చీలిపోవటానికి, అది భారతదేశం కోసం జరగటానికి కారణం ఒక్కటే.

ద్వాపరయుగాంతం నాటికి భారత్ ఒక ప్రపంచశక్తి. అవును .......... అప్పటికి భారత్ ప్రబల శక్తి. 100 ఏళ్ళ క్రితం అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని అదుపులో పెట్టుకుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచశక్తిగా ప్రపంచాన్ని శాసిస్తోంది. అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని పాలించగాలేనిది శాస్త్రం, విజ్ఞానం, సాంకేతికపరిజ్ఞానం, అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లైన భారతదేశం ప్రపంచంలో ప్రబలశక్తిగా లేదని వాదించడం ఎంతవరకు సమంజసం. భారతదేశం వేదభూమి, కర్మ భూమి, జ్ఞానభూమి, యోగభూమి, మోక్షభూమి, తపోభూమి.

1947 లో స్వాతంత్ర్యం వచ్చేవరకు భారత్ ఎప్పుడు ఒక దేశంగా లేదని, అది వివిధరాజుల క్రింద అనేకరాజ్యాలుగా పరిపాలించబడిందని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి, భారతదేశం భిన్నజాతులు, నాగరికతలు, సంస్కృతుల సంఘర్షణతో కూడినదని, అది ఒక దేశంగా ఉండరాదని, ఏ ముక్కకు ఆ ముక్క విడగొట్టి ప్రత్యేక దేశాలు చేయాలని వాదనలు తీసుకువస్తూ దేశవిద్రోహానికి పాల్పడుతున్నారు. కానీ భారత్ ఒక దేశంగా 5,000 ఏళ్ళ క్రితమే ఆవ్హిరభించింది. అంతకముందు కూడా భారత్ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంది. 'జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే' అంటూ ప్రతి రోజు పూజా ప్రారంభంలో సంకల్పం చెప్తారు. భారత్ ఈ సృష్టి ఆది నుంచే ఒక దేశంగా కొనసాగుతోంది. దేశసమైఖ్యత ఈ మట్టిలోనే ఉంది. అయినప్పటికి భరతఖండం ఒక దేశంగా మహాభారతం వరకు పూర్తిగా అవతరించలేదు. రామయణ సమయానికి భరతఖండం ఉన్నా, అది అనేకమంది రాజుల పరిపాలనలో కొనసాగింది. ద్వాపరయుగంలో కూడ ఇదే పరిస్థితి. కానీ మహోన్నతమైన చరిత్ర కలిగిన భరతవర్షం, భరతఖండం ఎప్పటికి ఒకే దేశంగా కొనసాగాలని శ్రీ కృష్ణ పరమాత్మ సంకల్పించారు. ఏం చేశారో తరువాయి భాగంలో తెలుసుకుందాం

To be continued ...................

Monday, 9 February 2015

హిందూ ధర్మం - 143

క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు. వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.

ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ గ్రహగతులను లెక్కించి చరిత్రలో మహాభారత కాలాన్ని లెక్కించారు. మహాభారత కాలాన్ని లెక్కించడంలో ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు, అత్యాధునిక కార్బన్ డేటింగ్ పద్ధతి మొదలైనవి ఒకదానితో ఒకటి సరిపోతున్నాయి.

ఇదిఅదే కాక, ఆదిశంకరుల విషయంలో దొరికిన శాసనం బ్రిటిషర్లు లెక్క కట్టిన ఆదిశంకరుల జీవించిన కాలమానానికి పూర్తి విరుద్ధం. ఆంగ్లేయులు కుత్సిత బుద్ధితో ఆదిశంకరుల కాలాన్ని 1000 సంవత్సరాలు ముందు లాగి క్రీ.శ. 5 కాలానికి తీసుకువచ్చారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు.

ఇన్ని ఆధారాలు చూపడానికి కారణం ఒక్కటే. భారతీయ ఇతిహాసలు ప్రపంచ చరిత్రలే కానీ కట్టుకధలు, కపోల కల్పనలు కాదు. మన పిల్లలు లేక మన స్నేహితులు మనల్ని మహాభారతం ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తే, వారికి ఒక తేదీ చెప్పాలి. అందుకోసమే ఇంగ్లీష్ సంవత్సరాలు చెప్పడం జరిగింది. అదీగాక ఇప్పుడు ప్రపంచమంతా గ్రిగేరియన్ క్యాలండర్‌నే ఫాలో అవుతున్నారు. ప్రపంచానికి హిందువులు తమ చరిత్ర గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు, ప్రపంచంలో అందరికి సులువుగా అర్దమయ్యేలా చెప్పాలి. అందుకోసమే మహాభారతం నవబరు 22, క్రీ.పూ.3138 న మొదలైందని ఆ రోజు ఉన్న ఆంగ్లతేదీని చెప్పుకుంటున్నాం. ఇన్ని శాసనాలు, ఆధారాలు కళ్ళ ముందు కనబడుతున్నా, ఇంకా మహాభారతం కేవలం ఒక కధ మాత్రమేనని, దాన్ని నమ్మడం మూఢనమ్మకమని చెప్పేవారిని ఏమనాలో హిందువులే నిర్ణయించుకోవాలి.

To be continued ................

Sunday, 8 February 2015

హిందూ ధర్మం - 142 (జనమేజయ శాసనాలు)

పరీక్షిత్ మహారాజు క్రీ.పూ.3041 లో మరణించగా, ఆయన కుమారుడు జనమేజయుడు సింహాసనాన్ని అధిష్టించాడు. జనమేజయ మహారాజు పరిపాలనలో 29 వ సంవత్సరంలో అంటే క్రీ.పూ.3013-3012 లో, అనగా కలియుగం మొదలై 89 ఏళ్ళు గడిచిన తర్వాత ప్లవంగ నామ సంవత్సరం, సోమవారం, చైత్ర అమావాస్య నాడు రెండు గ్రామాలను దానం చేశారు, రెండు దానశాసనాలు వేయించారు. ఇది ఐహోల్ దగ్గర ఉన్నది. మొదటి శాసనం  Indian Antiquary లో 333,334 పేజీలలో ప్రచురితమైంది. జయాభ్యుదయ యుధిష్ఠర శకం 89 అనగా, కలియుగం 89 వ సంవత్సరంలో (క్రీ.పూ.3012) లో శ్రీ సీతారామస్వామి పూజాదికాల కోసం భూమి దానం చేసినట్టుగా స్పష్టం అవుతోంది.Kishkinda inscription pictures
రెండవ శాసనం ఈ రోజు వరకు హిమాలయాల దగ్గర కేదార క్షేత్రంలో రక్షించబడుతూ వస్తోంది. అది రాగిరేకుల మీద వేయించబడ్డ శాసనం. కేదారనాధ స్వామి పూజాదికాల కోసం జనమేజయుడు కొంత భూమి దానం చేశాడనేది దాని సారాంశం.

kedharnath inscription picturesమూడవశాసనం దార్వడ్ జిల్లాలో ఐబల్లి అనే గ్రామంలో శివాలయం గోడలపై పులికేశి - 2 రాజు వేయించిన శాసనం.

నాల్గవ శాసనం గుజరాత్‌ను పరిపాలించిన సుధన్వ మహారాజుకు చెందిన తామ్రశాసనం. యుదిష్ఠర శకం 2663 లో ఆదిశంకరులకు గుర్తుగా రాగి రేకులపై శాసనం రాయించి ఇచ్చినట్టుగా ఇది తెలియజేస్తోంది. ఇది ఆదిశంకరుల కాలాన్ని కూడా ఋజువు చేయటానికి ఒక సాక్ష్యం. ఆదిశంకరులు యుధిష్టర శకం 2663 ప్రాంతంలో నివసించారు. యుదిష్ఠరశకం  క్రీ.పూ.3138 లో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది. అక్కడి నుంచి 2662 సంవత్సరాలు కూడితే, ఆదిశంకరులు క్రీ.పూ.476-77 నుంచి 509 వరకు జీవించారని ఋజువు అవుతోంది.

To be continued ....................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు:
http://mahabharathascience.blogspot.in/p/material-evidence-supporting-time-of.html
http://jayasreesaranathan.blogspot.in/2011/11/inscriptional-evidence-for-mahabharata.html

Saturday, 7 February 2015

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు)

ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగ్రి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.

ఇది కాకుండా దక్షిణభారతదేశంలో కర్ణాటక రాష్ట్రలో తుంగభధ్ర నదీ తీరంలోనూ, ఐహోల్, హళిబిద్ద మొదలైన ప్రాంతాల్లో దొరికాయి. వీటిలో ఐహోల్‌లో దొరికిన తామ్రశాసనం ప్రధానమైనది. అర్జునుడికి జన్మించినవాడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు, ఆయన కుమారుడు జనమేజయుడు. (కధను క్లుప్తంగా వివరిస్తా) ఒకసారి పరీక్షిత్ మహారాజు చేసిన ఒక తప్పు కారణంగా ఋషి శాపానికి గురై, తక్షకుడి చేతిలో మరణిస్తాడు. తన తండ్రిని చంపిన తక్షకుడి మీద, నాగజాతి మీద పగ తీర్చుకోవాలని జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో వేల కొద్ది సర్పాలు ఆహుతైపోతాయి. ఆ యాగాన్ని ఆపటానికి ఆస్తికమహర్షి వస్తారు, తన ప్రయత్నంలో సఫలం అవుతారు. మానవులకు సర్పాలకు మధ్య స్నేహభావాన్ని, బంధాన్ని పెంచుతారు, దానికి గుర్తుగా ఈ రోజుకి ప్రతీ ఏటా శ్రావణ మాసంలో నాగపంచమి జరుపుకుంటారు హిందువులు.

ఇది కేవలం కధ కాదు. దీనికి సంబంధించిన ఆధారాలే ఐహోల్ లో ఉన్నాయి. సర్పయాగం తర్వాత జనమేజయుడు తన తండ్రి పేరున అగ్రహారాలు దానం ఇస్తాడు. వాటి కోసం రాగిరేగులపై శాసనాలు రాయించాడు . ఆ రాగిరేగులు ఇప్పటికి ఐహోల్ లో ఉన్నాయి. వాటి ఫొటోలు కూడా అనేకులు తీసుకున్నారు. వీటిని కోట వేంకాటాచలం గారు, తన Age of Mahabharata war అనే పుస్తకంలో పొందుపరిచారు. వాటికి శాసనపూర్వక ఆధారాలు అందించారు. 'మహాభారత యుద్ధం క్రీ.పూ.3138 లేద 36 లో ఖచ్చితంగా జరిగిందనడానికి ప్రధానంగా 4 శాసనాలు లభించాయి' అని వారి రచనలో చెప్పారు. వాటి గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం.

To be continued .............

Friday, 6 February 2015

హిందూ ధర్మం - 140 (ద్వారక ఆధారాలు)

సముద్రగర్భంలో కనుగొన్న మహానగరం శ్రీకృష్ణపరమాత్ముడి ద్వారకానగరమే అని చెప్పటానికి కొన్ని నాణెలు కూడా లభించాయి. వాటిని కూడ పురావస్తు పరిశోధకులు పరిశీలించారు. జరాసంధుడి బారి నుంచి యాదవులను రక్షించటానికి సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన కృష్ణుడు, ద్వారకలో నివసించేవారికి గుర్తింపుచిహ్నలను ఇచ్చారు. ఈ రోజు ప్రజలకు Identity cards ఇస్తున్నట్టుగా. వాటి మీద 3 తలలు ఉన్న ఒక జంతువులు ఉండేదని మహాభారతం, హరివంశం మొదలైన అనేక గ్రంధాలు చెప్తున్నాయి. అచ్చం ఆ నాణెలను పోలిన వస్తువులే సాగరంగ్రభంలో దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మహాభారతానికి జ్యోతిష్యశాస్త్రం లెక్కకట్టిన తేదీలతో వాటి కాలం సరిపోతోంది.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పక్కా ప్రణాలికతో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.


ఈ నిర్మాణం కూడా సామాన్యమైన రీతిలో లేదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి..ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరంలో ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..

నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా ప్రజా సదుపాయాలు (public utilities), భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి.. నగర నిర్మాణానికి ముందే మాస్టర్ ప్లాన్‌తో అత్యాధునికంగా, సాంకేతికంగా, పర్యావరణహితంగా నిర్మించబడిన ఏకైక మహానగరం ద్వారక. వేల ఏళ్ళ భారతీయ చరిత్రకు సజీవసాక్ష్యం. హిందువులకు గర్వకారణం.

To be continued ..................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://goo.gl/Vw8qRD

Thursday, 5 February 2015

హిందూ ధర్మం - 139 (జలగర్భ ద్వారక పై పరిశోధనలు)

ద్వారక గురించి ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన కధనం చూడండి - ద్వారక వెలికితీతలో భాగంగా పరిశోధకులు 100 నుంచి 140 కిలోల బరువైన బండరాళ్లు చాలా గుర్తించారు. ఇవి ప్రముఖ వ్యక్తుల ఇంటి గోడలకు ఉపయోగించిన బండరాళ్లుగా గుర్తించారు. పడవలకు పెద్దపెద్ద నౌకలకు ఉపయోగించిన కలప శిధిలాలు కూడా లభించాయి. ద్వారకనే పూర్వకాలంలో మంచి నౌకా తీరంగా సైతం వుండేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇవే గాక వేలకొద్ది రాతి ఇటుకలు లభించాయి.

ఆ కాలంలో శత్రువులు దాడి చేసినపుడు తమను తాము రక్షించు కోవడానికి రాతి ఇటుకలను వాడేవారని డాక్టర్‌ ఎస్సార్‌రావు అంటున్నారు. ఈ నగరం గోమతి నది దాకా విస్తరించి ఉన్న పెద్ద నగరంగా ఉండేది. నీటిలో సైతం పూర్తిగా శిధిలం కాని కొన్ని రాతి గోడలు కలిగిన నిర్మాణాలు ఇళ్లూ బయటపడ్డాయి. ఇవేకాక వెండి కంచు ఇత్తడి పాత్రలు సైతం లభించాయి. సముద్ర జిల్లాల్లో ఇంకా క్రిందికి అంటే ఐదు మీటర్ల క్రింద జరిపిన తవ్వకాల్లో ఒక గొప్ప నిర్మాణాన్ని కనుగొన్నారు. దాదాపు అర ఎకరం స్థలంలో ఈ నిర్మాణం వుంది. లోపల ఎన్నో గదులు ఉన్నట్లు గుర్తుగా గోడలు కనుపించాయి. అందులో కంచు గంటలు విల్లుకు మధ్యన ఉపయోగించే వెండి పట్టాలు కనిపించాయి.

ద్వారరకు నాలుగు కిలోమీటర్ల పొడవైన నౌకాశ్రమం ఉండేది. నౌకాశ్రయం ఉన్న ట్లుగా భావిస్తున్న ప్రాంతంలో నలు వైపుల చిన్న చిన్న గృహ నిర్మాణాలు ఉన్నట్లు కనుగొన్నారు. నౌకలకు సంధించిన శ్రామికులు ఈ ఇళ్లలో నివసించేవారని ఊహిస్తు న్నారు. ఇంకా ఈ ద్వారక నగరం గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆశ్చర్యం గొలిపే వస్తువులు లభించినా భద్రతా కారణాల వల్ల వాటి వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. పదిమందిదాకా యువకులను ఎంపిక చేసి పురావస్తు పరిశోధనలో తర్ఫీదు ఇచ్చి సముద్రంలో రెండు గంటల పాటు నిరవధికంగా ఉండగలిగేటట్టుగా వీళ్లకి శిక్షణ ఇచ్చారు. సముద్ర జలాల్లో అవసరమైన ప్రాణవాయువును కొన్ని ప్రత్యేకమైన సిలిండర్లలొ నింపి వీరు తమతోపాటు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ద్వారక నగరంలోని శ్రీకృష్ణుడు నివసించిన భవనాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఒకానొక ప్రదేశంలో ఆధునిక మైన నిర్మాణాలతో ఒక కట్టడాన్ని కనుగొన్నారు. ఈ కట్టడం లోని శిధిలమైన రాతిగోడల మధ్య కిటికీలు ద్వార బంధాలు గడపలు కనుగొన్నారు. ఇందులోని కొన్ని శిధిల భాగాలను పైకి తెచ్చి వీటిపై కార్బన్‌ పరీక్షలు చేయడం ప్రారంభమైంది. దీనినే కార్బన్‌ డేటింగ్‌ టెక్నిక్‌ అంటారు. కిటికీలు చాలా పెద్ద విగా సముద్రపు గాలులు వీచేలాగా నిర్మాణాలు ఉన్నాయనీ ఇళ్లలోనే స్నానపు గదులను సైతం కనుగొన్నారని తెలియవస్తోంది. ఈ నగరం సౌరాష్ట్రకు ముఖ్య పట్టణంగా వుండేదనీ, మన పురాణాల్లో ప్రస్తావించబడిన శ్రీకృష్ణుడు ఈ ద్వారక వీధుల్లో సంచారించాడని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రతి శుక్రవారం పూజించే నారాయణదేవాలయాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. ఈ మూర్తిని మహాభారత కాలంలో సముద్ర నారాయణుడని అనేవారు.

శ్రీకృష్ణుడు ద్వారక నగరనిర్మాణం తర్వాత ఈ నగరంలో 36 సంవత్సరాలు నిర్మించాడు. మహాభారతయుద్ధ కాలంలో శ్రీకృష్ణు డూ అతని అంత:పురంలో రుక్మిణీ సత్యభామలతో సహా ఈ నగరం లోనే నివసించాడు. మా పరిశోధనలు సఫలమైతే శ్రీకృష్ణుడు తిరుగా డిన ద్వారకను ఆయన నివసించిన గృహాన్ని కనుగొనగలం అనే ఆశాభావాన్ని ఎస్సార్‌ రావు వ్యక్తం చేస్తున్నారు.

సేకరణ: (http://www.prabhanews.com/tradition/article-412447)

To be continued ..............

Wednesday, 4 February 2015

హిందూ ధర్మం - 138 (ద్వారక)

మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి, కుట్రపూరిత బ్రిటీష్ చరిత్రకు సవాల్ విసిరాయి. శ్రీ కృష్ణుడి ఉనికి అబద్దమంటూ వస్తున్న ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాయి.  భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీని ద్వారా డాక్టర్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. ఆ పరిశోధనల్లో భాగాంగా గుజరాత్ పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

192 కిలోమీటర్ల పొడవు …
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
వాటర్ ఫౌంటేయిన్లు ....
క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని వాస్తు/శిల్ప కళా నైపుణ్యం..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ…
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన హిందూ ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక

1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరాన్ని మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ థెర్మోలూమినెసెన్స్, కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. అవన్నీ ద్వారాకలో దొరికిన వస్తువులు ఖగోళశాస్త్రవేత్తలు లెక్కకట్టిన మహాభారత సమయానికి సరిగ్గా సరిపోతున్నాయి.  ఏవో రెండు, మూడు వస్తువులు దొరికితే ఫర్వాలేదు, ఏకంగా ఒక మహానగరమే సాగర గర్భంలో దొరికింది.

To be continued ..................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://goo.gl/Vw8qRD

Tuesday, 3 February 2015

హిందూ ధర్మం - 137 (15 రోజుల్లో 2 గ్రహణాలు - యుద్ధానికి సూచన)

ఒక రోజుకు 24 గంటలుగా, ఆర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్దరాత్రి 12 గంటల వరకు గల 24 గంటల సమయం ఒక రోజు అవుతుందనే భావనతో గ్రిగెరియన్ క్యాలండర్ రూపొందించారు పాశ్చాత్యులు. కానీ ప్రతి రోజులో సరిగ్గా 24 గంటలు ఉండవు. ఒక్క విషువత్తు రోజుల్లో (Equinox) తప్ప, ఎప్పుడు రోజులో సరిగ్గా 24 గంటలు ఉండవు. 24 గంటలకంటే కాస్త ఎక్కువ, తక్కువ ఉంటాయి. కానీ భారతీయుల (హిందువుల) కాలగణన అసాధారణమైనది. ఏదో అర్దరాత్రి సమయం పట్టుకుని రోజుని లెక్కించేకంటే, ఎవరూ మార్చలేనివి, సహజమైనవి, నిర్ద్వందమైనవి అయిన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను, గ్రహగతులను ఆధారంగా చేసుకుని కాలగణన చేశారు. సృష్టిలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించి, సరియైన లెక్క కట్టారు. అలా వచ్చిందే పంచాంగం. ఈ భారతీయ కాలగణనను ఆధారంగా చేసుకుని వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, 13 రోజులలో రెండు గ్రహణాలు అరుదు కానీ సాధ్యమే.

ఈ గ్రహణాలే కాకుండా ఆ సమయంలో కనిపించిన తోక చుక్కలు, ఉల్కాపాతాల గురించి కూడా మహాభారతంలో చెప్పారు. ఆ సమయంలో మహాఘోర అనే పేరుగల తోక చుక్క కనిపించిందట. దాన్నే కర్ణుడు మహాపాత్ అన్నాడు. ఆ తోక చుక్కనే ఈరోజు Halley comet అంటున్నారు. వీటినన్నిటిని పరిశీలించిన వ్యాసుడు ఇలా అన్నారు.

చతుర్దశీం పంచదశీం భూతపూర్వాంచ షోడసీం
ఇమాంతూ నాభిజానామీ అమావాస్యాంతు త్రయోదశీం
..............................
ఉత్పాతమోఘ్ర రౌద్రశ చ రాత్రౌ వర్షంతి శోణితం

14, 15, 16 రోజుల్లో అమావాస్య రావడం చూశాను కానీ, 13 రోజున అమావాస్య రావడం, అదే సమయంలో 13 రోజుల వ్యవధిలో చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది ఘోరమైన ఉత్పాతాన్ని, భారీ జననష్టాన్ని సూచిస్తోంది అన్నారు వ్యాసమహర్షి. భీష్మ పితామహుడు కూడా పక్షంరోజుల్లో రెండు గ్రహణాలు రావడం గమనించి కలవరపడ్డారు. ఇది భారీజననష్టాన్ని, రక్తపాతాన్ని తీసుకువస్తుందని భయపడ్డారు.

అయితే ఇప్పటివరకు ఖగోళశాస్త్రానికి సంబంధించిన అంశాలు చూశాం, ఇప్పుడు మహాభారతానికి సాక్ష్యాలుగా నిలుస్తున్న శాసనాల గురించి తెలుసుకుందాం.

To be continued .......................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=1052

Monday, 2 February 2015

హిందూ ధర్మం - 136 (మహాభారతం - అరుదైన గ్రహణం)

మనకు ఎప్పుడైనా గ్రహణాలు సంభవించప్పుడు, ఇది చాలా అరుదుగా ఏర్పడే గ్రహణం, ఇలా 100 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, లేదా 150 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, దీన్ని తప్పక వీక్షించండి అని నాసా మొదలైన సంస్థలు, భారతదేశంలో ఉండే మరికొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేస్తాయి. ఈ గ్రహణం కూడా అలాంటిదే, చాలా అరుదుగా ఏర్పడేది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది.

1. జ్యేష్ఠా నక్షత్రంలో అమావాస్య రావడం 19 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
2.a. అదే సమయంలో జ్యేష్ఠాలో సూర్యగ్రహణం 340 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది.
2.b అదీగాక, శని రోహిణిలో ఉండటం 7000 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

ఈ అరుదైన కూటమి మహాభారత యుద్ధం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఏర్పడలేదు. ఈ గ్రహణం, మహాభారతంలో చెప్పిన గ్రహకూటములు కోసం వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, యుద్ధం సరిగ్గా 22 నవంబరు క్రీ.పూ. 3137 ప్రారంభమైందని తేలుతుంది. మనిషి లెక్కించటంలో తప్పులుండవచ్చు కానీ, గ్రహాలు, భూమి కదలికలు చాలా ఖచ్చితమైనవి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ప్రతి 7000 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పాడుతుంది అన్నారు కదా, మరి మహాభారతం క్రీ.పూ.3137 లోనే జరిగిందని ఎలా నిర్ధారణకు వచ్చారు? అంతకంటే ముందు కూడా కూటమి ఏర్పాడి ఉండచ్చు కదా? అని అనిపిస్తుంది. కానీ ఈ ఖగోళవింతకు ఇంకో అరుదైన వింత తోడయ్యింది. విచిత్రమేంటంటే ఈ రెండు గ్రహణాలు కేవలం 13 రోజుల వ్యవధిలో ఏర్పడ్డాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు 360 డిగ్రీలు తిరుగుతాడు. చంద్రుడి గమనంలో ప్రతి 12 డిగ్రీల మార్పును ఒక తిధిగా పరిగణిస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ......... ఈ ముగ్గిరిలో భ్రమణం కారణంగా, చంద్రుడిపై భూమి నీడ పడినప్పుడు కనిపించని ప్రాంతాన్ని బట్టి చంద్రుడి ఎదుగుదల, క్షీణించడం కనిపిస్తాయి.  సాధారణంగా అమావాస్య, పూర్ణిమకు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ఈ విశేష సంఘటన (వింత) జరిగడానికి కారణం చంద్రుడు తన కక్ష్యలో 180 డిగ్రీలు (అంటే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు లేదా అమావాస్య నుంచి పూర్ణిమ వరకు) తిరగటానికి సాధారణంగా 12 డిగ్రీల వేగంతో పరిభ్రమిస్తాడు. అప్పుడు అమావాస్య, పూర్ణిమలకు మధ్య 15 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈ ఖగోళ వింత ఏర్పడినప్పుడు చంద్రుడు తన సాధారణ వేగానికి భిన్నంగా 13-17 డిగ్రీల వేగంతో తిరిగడం వలన 13 రోజుల వ్యవధిలోనే ఇలా జరిగింది. దీన్ని ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల ద్వారా పరిశీలించి, భారతీయులు, విదేశీయులు ............ అనేకులు ధృవపరచటం జరిగింది. ఇలా జరగడానికి భారతీయ ఖగోళశాస్త్రంతో పాటు, ఆధునికశాస్త్రవేత్తలు కూడా కారణాలు వివరించారు. ఈ వింత మహాభారతం జరిగిందని ధృవపరచటానికి ఒక సాక్ష్యం. ఇటువంటివే అనేకం మహాభారతంలో ప్రస్తావించటం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుని Astronomical dating చేసినప్పుడు పైన చెప్పిన తేదీలలో మాహాభారతం జరిగిందని నిర్ధారించారు.

To be continued ................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు:
http://www.patheos.com/blogs/drishtikone/2009/08/krishna-and-mahabharat-historical-reality/
http://www.patheos.com/blogs/drishtikone/2010/09/astronomical-proof-mahabharata-war-and-shri-krishna-part-ii/

Sunday, 1 February 2015

హిందూ ధర్మం - 135 (మహాభారతం - గ్రహణాలు)

మహాభారత యుద్ధం నవంబరు 22, క్రీ.పూ.3137 న ప్రారభమైంది. ఈ విషయంలో ఖగోళశాస్త్రానికి సంబంధించిన ఋజువు కూడా మహాభారతంలో ఉంది. గ్రహకూటములు సామన్యమైనవి కావు అవి ప్రతి దశాబ్దం, శతాబ్దంలో ఏర్పడేవి అంతకంటే కావు. కొన్ని ఇప్పటి వరకు అసలు ఏర్పడనే లేదు. కొన్ని కేవలం వేలఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరిగే అపూర్వసంఘటనలు. ఖగోళవింతలు అత్యంత అరుదుగా జరుగుతాయి.

భూమి నీడ చంద్రుని మీద పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా ఒక్క పూర్ణిమ రోజున మాత్రమే ఏర్పడుతుంది. ఒక శతాబ్దం (100 సంవత్సరాలు)లో 150 గ్రహణాలకు పైగా ఏర్పడతాయి. వాటిలో కొన్ని సంపూర్ణ చంద్రగ్రహణాలు కాగా, కొన్ని పాక్షిక చంద్రగ్రహణాలు. సంపూర్ణచంద్రగ్రహణం అధికంగా 2 గంటలు, పాక్షిక చంద్రగ్రహణం 4 గంటలు కొనసాగే అవకాశం ఉంటుంది. క్రీ.పూ.3500 నుంచి క్రీ.పూ.700 మధ్య సుమారు 4350 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి.

అట్లాగే చంద్రుడి నీడ భూమిపై నుంచి వీక్షిస్తున్న ప్రాంతంలో పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒక శత్బాదంలో దాదాపు 240 సూర్యగ్రహణలు ఏర్పడుతాయి. క్రీ.పూ.3500 నుంచి క్రీ.పూ.700 వరకు సుమారు 6960 సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. సూర్యగ్రహణం అమావాస్య రోజునే ఏర్పడుతుంది. ఈ గ్రహణాల్లో కొన్ని పాక్షికం కాగా, కొన్ని సంపూర్ణ సూర్యగ్రహణాలు. సంపూర్ణసూర్యగ్రహణం అత్యధికంగా 8 నిమిషాలు, పాక్షికం 115 నిమిషాలకు వరకు జరుగుతుంది. అందువల్ల గ్రహణాలను ముఖ్యంగా నమోదు చేశారు వ్యాసమహర్షి. మహాభారతంలోని భీష్మ పర్వం మరియు ఉద్యోగపర్వంలో ఇటువంటి కొన్ని సంఘటనలు నమోదు చేశారు. వాటిలో ఒకటి శని రోహిణి నక్షత్రంలో, అంగారకుడు జ్యేష్ఠా నక్షత్రంలో ఉండగా, 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కృత్తికా నక్షత్రంలో చంద్రగ్రహణం, జ్యేష్ఠాలో సూర్యగ్రహణం.

To be continued .....................