Saturday, 22 September 2012


part-34
ఓం గణేశాయ నమః

వినాయకుడి ఆరాధనతొనే లక్ష్మీ దేవి నిలిచి ఉంటుంది.లక్ష్మీ దేవికి చంచల అని పేరు."ఓం చంచలాయై నమః".అంటే ఒకే చోట ఎక్కువసేపు ఉండనిది.లక్ష్మీ దేవి ఎప్పుడు స్థిరంగా ఉండదు.మరి గణపతో?గణపతి ఒకసారి సాధారణంగా ఎక్కడైనా కూర్చుంటే కదలడు.ఆయన స్థిరంగా కూర్చుంటాడు.

లక్ష్మీ దేవిని,గణపతిని కలిపి ఆరాధించాలి.కలిపి ఆరాధించేవారి ఇంటి నుంది లక్ష్మి దేవి తాను వెళ్ళిపోతాను అంటే వినాయకుడు కాసేపు కూర్చొవమ్మా అంటూ ఆమేను ఆ ప్రదేశంలో స్థిరంగా ఉంచుతాడట.అందువల్ల కేవలం లక్ష్మి దేవినే కాదు,ఆమేతో పాటు వినాయకుడిని ఆరాధించాలి.

వ్యాపార కేంద్రాల్లోను,ఇంట్లోను లక్ష్మి దేవి ఫొటో ప్రక్కన వినాయకుడి ఫొటొ ఉంచి రోజు ముందు స్వామిని పూజించాక లక్ష్మిదేవిని పూజించండి.ధనం నిలుస్తుంది.

ఓం గణేశాయ నమః

to be continued.....
     

Friday, 21 September 2012


part-33

ఓం గం గణపతయే నమః

వినాయకుడి పూజలో మనం అతి ముఖమైనది మనం మనసును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము,ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు.మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కుర్చున్నామన్నదే ముఖ్యం.

కూర్చుని ఏమి చేయాలి?స్వామికి సంబంధించిన ఒక శ్లోకం,మంత్రం(ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు ఉంటాయి కదా)కాని లేదా అష్టొత్తరం కాని చదవండి.ఏది రానివారు"ఒం" అని జపైంచండి.కేవలం చదవడమే కాదు,చదువుతున్నప్పుడు మనసు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి.వేరే ఏ పని చేయకండి.మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవెద్యం పెట్టి స్వీకరించండి.చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు.

ఇలా మీరు చేసి చూడండి.ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది.మేము మీకు "సవాల్" చేస్తున్నాం.మీరు కనుక రోజు క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు.మీరు నమ్మనంతగా మారతారు.చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు.విద్యార్థులు చదువు మీద ఎప్పుడు లేనంతగా శ్రద్ధ పెడతారు.ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది.ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకోని శక్తి గణపతి ప్రసాదిస్తాడు.

వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం.ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు.అందుకే పూజలో స్వామిని ఉద్ద్యేశించి "స్థిరొ భవ,వరదొ భవ,సుప్రసన్నొ భవ,స్థిరాసనం కురు" అని చదువుతారు.అందుకే గజాననుని ముందు రోజు కూర్చునె ప్రయత్నం చేయండి.అద్భుతమైన విద్యాబుద్ధులను,జ్ఞానాన్ని పొందండి.మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించమన్నది ముఖ్యం కాదు.స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.

అందరూ రోజు కాసేపు గణపటికి కేటాయించండి.మీలో కలిగే మార్పులను గమనించండి.జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.దీని అర్దం విద్యార్ధులు చదవడం మానివేసి,మిగితావారు తమ రోజు వారి కర్యక్రమాలు గణపతి ముందు కూర్చొమని మాత్రం కాదు.మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి,జ్ఞానపకశక్తి పెరగడానికి,ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి.ఆసనం(చాప వంటివి)వేసుకోవడం మరవకండి.న్యూస్ పేపర్లు,కగితాలు లాంటివి ఆసనంగా వేసుకోకూడదు.

పిలిస్తే పలికే దైవం గణనాధుడు.ఆచరించండి,అందరికి తెలియపరచండి.మేము ఆచరించాకే నమ్మకంతో మీకూ తెలియపరుస్తున్నాం.

ఓం గం గణపతయే నమః

to be continued......
             
           

Thursday, 20 September 2012


part-32

~ గణేశుడు,గణపతి అంటే ఎవరు?

~ "గణశబ్ధ సమూహన్య వాచకః పరికీర్తితః","గణానాం పతిః గణపతిః".సర్వదేవతలకు,దానవులకు,మానవులకు అధ్యక్షుడు ఎవరో,అన్ని గణాలకు ఈశ్వరుడెవరో అతనే గణేశ్వరుడని,గణపతి అని అర్దం.అందరికి అంటే సర్వేశ్వరుడైన పరమశివుడికి కూడా గణపతి ఈశ్వరుడు.

~"గణానాం జీవజాతానాం యః యీశః స్వామి సః గణేశః".సర్వగణాలకు,జీవరాశికి ఈశ్వరుడు గణేశుడు.

~"యే ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సాంఖ్యాంతే|
  తేషామీశః స్వామీ గణేశః||"
  ఈ మొత్తం ప్రకృతిలొని చరాచరాత్మక(కదిలేవి,కదలని వాటితో ఏర్పడిన)సృష్టి మొత్తం(ఉన్నది ఉన్నట్లుగా)ఎవరిచే లెక్కించబడుతుందో(గణింపబడుతుందో),ఎవరిచే పాలింపబడుతొందో ఆయనే గణపతి.అంటే మనం ఉన్నాము లేదా ఒక వస్తువు ఉంది అంటే దానికి ఒక నాయకుడు(ఈశ్వరుడు)ఉన్నాడు.ఆయనే గణపతి.

~ "గణ్యంతే బుధ్యంతే తే గణాః".మనకు కనిపించే ఈ దృశ్యరూప ప్రకృతి అంతా గణమని,దానికి అధిష్టాత,అధినాయకుడు పరబ్రహ్మ అని,ఆ పరబ్రహ్మమే గణపతి అని శాస్త్రము.

~ "జ్యేష్టరాజం బ్రహ్మణాం" అని అంటే బ్రహ్మకంటే పెద్దవాడని.

~ "త్వమేవ ప్రతక్ష్యం తత్వమసి".ఈ సమస్త విశ్వంలో ఉన్న పరా,అపరా విద్యలు,సమస్తమైన జ్ఞానసంపద నువ్వే(గణపతి)అని ఉపనిషత్తు వినాయకుడిని స్తుతిస్తొంది."త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి"-నీకు మించిన పరబ్రహ్మ,పరమేశ్వరుడు ఎవరు లేరని,"సర్వం జగదిదం తత్వో జాయతే"-ఈ మొత్తం జగత్తంతా నీ నుండే పుట్టిందని గణపతి అథర్వశీర్షంలో వినాయకుడిని స్తుతిస్తారు.

~ ఒక్క వినాయకుడి గురించి మనం మాట్లాడుకుంటే సమస్త విశ్వంగురుంచి మాట్లాడుకున్నట్టు.ఒక్క వినాయకుడిని ధ్యానిస్తే సమస్త దేవతలను,యక్షులను,కిన్నెరులను,కింపురుషులను,గంధర్వులను,అండపిండబ్రహ్మాండాన్ని,అనంతమైన విశ్వాన్ని ధ్యానించినట్టే.గణపతి గురించి తెలుసుకోవడమంటే ఈ సృష్టి గురించి తెలుసుకొవడమే.

~ అటువంటి గణపతిని వర్ణించడం,ఆయన గురించి వివరించడం కష్టమని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

~ ఇంతగొప్ప గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క నైవెద్యంగా సమర్పిస్తే స్వామికి మహానందం.మనం రోజు చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యానికి మంచిదని,మన ఆరోగ్యం కోసం ఆయన బెల్లం ముక్క సమర్పించమన్నాడు.

to be continued...........
                                   


Wednesday, 19 September 2012


ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం|
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం||
ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం|
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం||
దంతాక్షమాలా పరశుం పూర్ణమోదకధారిణం|
మోదకహస్త శుండాగ్రం ఏకదంతం వినాయకం||

Tuesday, 18 September 2012


part-31

~ వినాయకచవితి వినాయకుడి పుట్టినరోజా?

~ చాలా మంది అనుకున్నట్టు వినాయక చవితి వినాయకుడి పుట్టిన రోజు కాదు.వినాయకుడు అనాది.ఆయనే పరబ్రహ్మం.శివపార్వతుల వివాహసమయంలో గణపతి ఆరాధన చేశారు అంటే అప్పటికే గణపతి ఉన్నాడని అర్దం అవుతోంది.బ్రహ్మ సృష్టిని ప్రారంభించేముందు వినాయక ఆరాధన చేశాడు.అప్పుడు వినాయకునకు రూపం లేదు.ఓంకారమే వినాయకుడి రూపం.ఓంకారం ప్రణవం.ఓంకారాన్ని(గణపతిని) ధ్యానించాకే బ్రహ్మ దేవునకు సృష్టి ఆరంభంలో ఎదూరైన విఘ్నాలు తొలగిపొయయట.అందుకే "జ్యేష్టరాజం బ్రహ్మణాం" అని వేదం చెప్తుంది వినాయకుడి గురించి.ఆయను వేదం "బ్రహ్మణ్స్పతి"గా వర్నించింది.ఆయనే వాక్ స్వరూపం అన్నది వేదం.

~ సృష్టి ఆరభంలో మొట్టమొదటగా ఉద్భవించింది ఓంకారమే.ప్రతి మనిషి పుట్టిన వెంటనే ఏడ్చే ఏడుపును బాగా జాగ్రత్తగా గమనిస్తే ఓంకారమే వినపడుతుందట.అంటే మనం మొదటగా పలికింది మన గణపతినే మరి.

~ దేవ,మానవులకు మంచి నడవడిక ఉండాలంటే ఒక నాయకుడవసరం అని గమనించి,ఏలాంటి రూపంలేని స్వామి,ఒక రూపాన్ని పొందింది భాద్రపద శుద్ధ చవితి నాడు.అందువల్ల ఇది వినాయకుడు అవతరించిన రోజు కాని పుట్టిన రోజు కాదు.

~ వినాయకుడంటే  ఈయనకు వినా వేరే నాయకుడు లేడని అర్దం.ఎవరిని అనుసరించడం వల్ల మంచి నాయకుడవుతారొ,విఘ్నాలు తొలగుతాయొ అతనే ప్రియపతి,గుణపతి,గణపతి.

~ ఒక స్త్రీ గర్భం ధరించింది,అది నిలిచింది అంటే గణపతి అనుగ్రహం ఉంది అని అర్దం.ఓం గర్భాధారాయ నమః.మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు మన అమ్మకు బంధం ఏర్పరిచి,మనకు తల్లి గర్భంలోనే బయట ప్రపంచానికి సంబందించి జ్ఞానం ప్రసాదించింది గణపతే అని "ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః" అనే నామ చెప్తోంది.అలాగే జలములకు అధిపతి అయి,తల్లి గర్భంలో పెరుగుతున్న పిండాన్ని కాపాడేవాడు గజముఖుడు.ఇవ్వాళ మన బ్రతికిబట్టకడుతున్నామంటే అది ఆయనె దయే మరి.అందుకే వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం(మనం వయసుతో సంబంధం లేకుండా మన అమ్మకు ఎప్పుడు పిల్లలమే).పిల్లలకు ఆయనే అంటే మహా ఇష్టం.ఇక్కడ పిల్లలు అంటే కేవలం హిందువలని మాత్రమె కాదు.అందరూ ఆయనే పిల్లలె,ఆయనచే కాపాడబడుతున్న వారె.వారు పూజించినా,పూజించకున్న ఆయన కర్తవ్యం సక్రమంగా నిర్వర్తిస్తాడు వినాయకుడు.చెప్పుకోవాలంటే చాలా ఉంది వినాయకుడి గురించి.

~ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.      

to be continued...........

Monday, 17 September 2012

Meaning behind lighting a lamp in house :-

Why do we light a lamp/diya/deepam in our house daily?

In almost every Indian home a lamp is lit daily before the altar of the Lord. In some houses it is lit at drawn, in some, twice a day – at dawn and dusk and in a few it is maintained continuously (akhanda deepa). All auspicious functions and moments like daily worship, rituals and festivals and even many social occasions like inaugurations commence with the lighting of the lamp, which is often maintained right through the occasion.

• Why do we light a lamp?

Light symbolizes knowledge and darkness, ignorance. The Lord is the “Knowledge Principle” (chaitanya) who is the source, the enlivener and the illuminator of all knowledge. Hence light is worshipped as the Lord Himself.

Knowledge removes ignorance just as light removes darkness. Also knowledge is a lasting inner wealth by which all outer achievements can be accomplished. Hence we light the lamp to bow down to knowledge as the greatest of all forms of wealth. Knowledge backs all our actions whether good or bad. We therefore keep a lamp lit during all auspicious occasions as a witness to our thoughts and actions.
Why not light a bulb or tube light? That too would remove darkness. But the traditional oil lamp has a further spiritual significance. The oil or ghee in the lamp symbolizes our vaasanas or negative tendencies and the wicked, the ego. When lit by spiritual knowledge, the vaasanas get slowly exhausted and the ego too finally perishes. The flame of a lamp always burns upwards. Similarly we should acquire such knowledge as to take us towards higher ideals.
A single lamp can light hundreds more just as a man of knowledge can give it to many more. The brilliance of the light does not diminish despite its repeated use to light many more lamps. So too knowledge does not lessen when shared with or imparted to others. On the contrary it increases in clarity and conviction on giving. It benefits both the receiver and the giver.

Whilst lighting the, lamp we thus pray :
Deepajyotihi parabrahma  
Deepa sarva tamopababa
Deepena sadhyate sarvam
Sandhyaa deepo namostute

The meaning is:

I prostrate to the dawn/dusk lamp; whose light is the Knowledge Principle (the Supreme Lord), which removes the darkness of ignorance and by which all can be achieved in life.

Wednesday, 12 September 2012


part-25
~ చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయన్నది వినాయకుడు ఇచ్చిన శాపం.చంద్రుడు సముద్రంలొకి వెళ్ళిపొవడంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువు అయ్యారు.ఔషధమూలికలు చంద్రకాంతిలొనే ఔషధులను తయారుచేసుకుంటాయని మన పురాణలవచనం.సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి కదా.ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

~ ఋషులు,దేవతలు,మునులు అందరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు.బ్రహ్మ దేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు.బ్రహ్మదేవుడు గణపతికి మించిన దేవుడు లేడు,ఆయనే పరిష్కారం చుపుతాడు అన్నాడు.అందరు కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు.చంద్రునికిచ్చిన శాపవాక్కును వెనక్కు తీసుకోమన్నారు.చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తా అన్నాడు.అందరు కలిసి వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి,చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు.చంద్రుడు చేసిన తప్పును ఒప్పుకొని,క్షమించమని వేడుకున్నాడు.

~ సూర్యుడి వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా?ఇప్పటికైన బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు.తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తలమీద పెట్టుకొని నాట్యం చేశాడు.అప్పుడు వచ్చింది "నాట్య గణపతి"అవతారం.ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేశాడు.ఒక్క వినాయక చవితిరోజున చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శాపాన్ని కుదించాడు మహా గణపతి.

~ చూడండి ఎంత తేడా ఉందో అసలు కధకు,మనం చదువుతున్న కధకు.లోకానికి చూపునిచ్చే వినాయకుడు చంద్రుని కంటి చూపుతో పడిపోతాడా?మనం కూడా మనం చేసిన తప్పులను స్వామి ముందు ఒప్పుకోని,ఇంకెప్పుడు చేయమని చెప్పుకుంటే మనల్ని కూడా అల నెత్తిన పెట్టుకుంటాడా గజముఖుడు.అహంకారాన్ని వదిలెసి బ్రతకడం మోదలుపెడితే చాలు,ఆయన ఆనందపడతాడు.అదే ఈ కధ సారాంశం.

~ శమంతకోపాఖ్యానం కూడా ఇలాగే మార్చబడింది.దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం.

to be continued.........        

part-24

~ వినాయకచవితికి మనం చదువుతున్న కధలు పూరాణోక్తమా?కల్పితమా?

~ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు వినాయకచవితి గురించి ప్రవచనం చేశారు.అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది.

~ వరసిద్ధివినాయకవ్రతకల్పాన్ని(వినాయకచవితి వ్రతాన్ని)నారద మహర్షి వారు చెప్పడం జరిగింది.వ్రతం అంటే ప్రతి సంవత్సరం చేసేది అని అర్దం.కల్పం అంటే ఏలా చెప్పారో అలాగే చేయాలి.కాబట్టి ఈ వినాయకవ్రతాన్ని కూడా ఋషి "చెప్పినట్టుగానే" చేయాలి.ఈ వ్రతాన్ని "నక్త వ్రతం" అంటారు.అంటే సాయంకాలం చేయాల్సిన వ్రతం.పగలంతా ఉపవాసం ఉండి అసురసంధ్యవేళ(సాయంకాలం) పూజ చేయాలి.వ్రతంలో రెండు భాగాలు ఉంటాయి.ఒకటి పూజ,రెండు కధ.పూజ ఎంత ప్రధానమో కధకూడా అంతే ప్రధానం.పూజ చేయలేకపొయిన(బంధువుల మరణాలు మొదలైనవి)వారు కధ అక్షతలు తల మీద వేసుకున్నా ఫలితం వస్తుంది.ఈ వరసిద్ధి వినాయక వ్రతం అందరికి ఉంటుంది,అందరూ చేసుకోవాలి.

~ కానీ ఈరోజు మనం చదివే వినాయకచవితి వ్రతకధల్లో చాలా తప్పులు ఉన్నాయని చాగంటి కొటేశ్వర రావుగారు, వారి ప్రవచనంలో చెప్పడం జరిగింది.వినాయకచవితిరోజున వినాయకుడు కడుపునిండా తిని కైలాసానికి వెళ్ళాడని,శివపార్వతుల పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించడం,పొట్ట అడ్డురావడం,చంద్రుని దృష్టి తగిలి వినాయకుడు మూర్చిల్లడం వంటివి ఏ పురాణంలో లేవని చెప్పారు.అవి కేవలం అభూతకల్పనలు.

~ అసలు కధ  ఇదే.దీన్నే వినాయకచవితి వ్రతంలో చదవాలి.వినాయకచవితి రోజున వినాయకుడు భక్తులు "భక్తికి మెచ్చి" వారు పెట్టిన నైవేద్యాలను ఆరగించి చంద్రలోకం ద్వారా వెళ్తున్నాడు.చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు.అది బాహ్యసౌందర్యం.(ఆయనకు 27 మంది భార్యలు(నక్షత్రాలు).వారందరు అక్కచెళ్ళెలు.దక్షప్రజాపతి కూమార్తెలు.కానీ ఆయన అందరితో సమానంగా మెలగక కేవలం  రొహిణితో ఉండడానికి ఇష్టపడేవాడు.అది తెలిసిన దక్షుడు కోపంతో చంద్రుడ్ని కళావిహీనం అయిపొ అని శపించాడు)అందువల్ల ఆంతరంగికంగా సౌందర్యవంతుడు కాడు.వినాయకుడు బయటకు పెద్ద బొజ్జతో మరగుజ్జవానిలా,చిన్నపిల్లవాడిలా,ఏనుగు ముఖంతో ఉన్నా ఆయన మానసికంగా మహా సౌందర్యవంతుడు.

~ కవులందరూ చంద్రుడు గొప్పవాడని,చల్లనివాడని,అందమైన ముఖమున్నవారిని చంద్రునిముఖంతో పొల్చడం వంటివి చేయడం చేత చంద్రునకు "అహంకారం" పెరిగింది.తానే అందగాడినని,వినాయకుడిరూపం విచిత్రంగా ఉందని,ఆయన్ను చూసి పకపకా నవ్వాడు.వినాయకుడి కడుపు నైవేద్యంవల్ల నిండలేదు.ఆయనే అందరికి తిండి పెడుతున్నాడు.ఆయన కడుపు ఎవరు నింపగలుగుతారు?భక్తుల భక్తికి గణపతి కడుపు నిండిపొయింది.వారు చూపిన భక్తికి మెచ్చి,ఆ ఆనందాన్ని జీర్ణించుకోలేక ఇబ్బందిపడుతున్నాడు.అటువంటి వినాయకుడికి కోపం వచ్చింది.ఆ కోపం ఆయన్ను చూసి నవ్వినందుకు రాలేదు.ఇంతకముందు శాపంకారణంగా చంద్రుడు కళావిహీనుడై,శివున్ని శరణు వేడడం వల్ల,శివుడు ఆయన్ను తలమీద పెట్టుకున్నాడు.అయినా చంద్రునిలో మార్పు రాలేదు.అది వినాయకునికి బాధ కలిగించింది.అందువల్ల చంద్రునకు శాపం ఇచ్చాడా గణపతి.

~ ఈ విషయం ప్రపంచానికంతా తెల్సిపొయింది.ప్రజలు రాత్రి అవ్వగానే బయతకు వెళ్ళాల్సివస్తే ఉత్తరీయాలు,చీరకొంగులు అడ్డుపెట్టుకొని వెళ్ళడం,చంద్రున్ని తిట్టడం మొదలు పెట్టారు.అందరూ చీదరించికోవడంచేత ఆయనకున్న అహంకారం అణిగి సిగ్గువేసింది.సిగ్గుతో బయటకు రాలేక సముద్రంలొకి వెళ్ళి దాక్కున్నాడు........

to be continued.........            

Tuesday, 11 September 2012


part-23

~ వినాయకచవితికి పూజించిన విగ్రహాలను నిమ్మజ్జనం చేయాలా?

~ వినాయకచవితి ఉత్సవాలకు పూజించే ప్రతిమలను మట్టితో చేస్తారు(మట్టితొనే ఎందుకు చేయాలో 1,2 భాగాల్లొ ఉంది).ఈ విగ్రహానికి యంత్రపూర్వక స్తాపన ఉండదు.కేవలం కొన్ని రోజులకోసమే ఈ బొమ్మను పూజించడం జరుగుతుంది.ఉత్సవాల అనంతరం ప్రతిమను నిమజ్జనం చేయకపొతే రోజూ ఎవరు పూజచేస్తారు?తాత్కాలింగా వేసిన పందిరి ఎన్ని రోజులు ఉంటుంది?మట్టిబొమ్మ కదా,కొద్ది రోజులకే పగుళ్ళు వస్తాయి.విరిగిన విగ్రహాలను ఎలా పూజిస్తాం?అందుకే నిమ్మజ్జనం చేయమన్నారు.

~ వినాయక నవరాత్రులలో ఈ విగ్రహంలొకి అంతరిక్షం నుండి వచ్చే గణపతి తరంగాలు,దివ్య శక్తులు ఉద్వాసన చెప్పినా ఆ విగ్రహాన్ని పూర్తిగా విడిచి వెళ్ళవు.మన చేతిలొ కర్పూరం పట్టుకొని ఇతరులకు ఇస్తే చేయి కర్పూరం వాసనే వస్తుంది కదా.ఇది అంతే.ఆ శక్తివంతమైన విగ్రహాన్ని మన బావిలొ నిమ్మజం చేస్తె ఆ శక్తి మన బావిలో ఉన్న నీటికి వస్తుంది.ఎవరు ఈ సమాజ శ్రేయస్సు కోసమని నిత్యం తపిస్తారో,ఎవరు నిస్వార్ధంగా ఈ ప్రపంచానికి మేలు చేయాలని చూస్తారో వారే భారతీయులు,హిందువులని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

~ అందువల్ల మనం ఆ విగ్రహాలను చేరువులోనొ,నదిలొనో నిమజ్జనం చేస్తాం.ఒక విగ్రహానికి ఉన్న శక్తికంటే అనేకానేక విగ్రహాలకు ఉన్న శక్తి ఎక్కువ.అది ఆ చేరువులొనో,నదిలొనో వ్యాపిస్తుంది.ఆ నీరు శక్తివంతమవుతుంది.ఆ నీరు పంటలకు వాడడం వల్ల మనం తినే ఆహారానికి ఆ శక్తి వస్తుంది.ఆ నీటిని త్రాగడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.అంతేనా?కాదు.

~ ఆ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షం పడుతుంది.ఆ మేఘాలు  చాలా దూరప్రాంతానికి చేరి అక్కడా వర్షిస్తాయి.అక్కడి ప్రజలు,జంతువులు,పర్యావరణం హాయిగా ఉంటుంది.అందుకే ఏంతొ ఘనంగా పూజించిన విగ్రహాలను చెరువుల్లొనో,నదుల్లొనో నిమజ్జనం చేయడం.ఎంత నిస్వార్ధ జీవనం మనది.

~ చెరువునుండి తీసిన మట్టితో చేసిన విగ్రహం తిరిగి చేరువులొనే కలపడం అంటే ఈ జీవితం శాశ్వతం కాదు,ఎక్కడి నుంది వచ్చామో అక్కడికే వెళ్ళిపొతాం అని అర్దం.మధ్యలో పూజ అంటే అల అందరికి అన్ని అందిస్తూ పూజింపబడు అని అర్దం.మనం పరమాత్మ నుండి వచ్చమని,మన ఆత్మ పరమాత్మ స్వరూపమని భగవద్గీత సారాంశం.

~ చూశారా ఎంత గొప్పదో హిందూ సంస్కృతి,భారతీయ జీవనం.మరి ఇవ్వాళ మనం చేస్తున్నదేమిటి?రసాయన విగ్రహాలను పూజిస్తున్నారు.ఆ రసాయనిక రంగులు ఆరోగ్యానికి మంచివి కావు.తరువాత నిమజ్జం చేస్తాం.అది పర్యావరణానికి మంచిది కాదు.ఈ సంవత్సరం హైద్రాబాదులో అక్టోబరు 1-19 వరకు జీవవైవిధ్య సదస్సు ఉంది.చాలా దేశాలనుండి ఎంతో గొప్ప వ్యక్తులు వస్తున్నారు.వారు వారి దేశాలకు వెళ్ళి హిందుసంస్కృతిలో ఉన్న పర్యావరణ పరిరక్షణ,సంప్రదాయలు వంటి అంశాలను గొప్పగా చెప్పుకొవాలి కానీ ఇదిగో ఆ హిందువుల పండుగ పర్యవరణానికి కీడు చేస్తొందని చెప్పుకుంటే మనకు ఎంత సిగ్గు చేటు.ఆలోచించండి.
         
to be continued.......      

Monday, 10 September 2012


part-22
~ సాముహికగణేశ ఉత్సవాలు సనాతనమా?ఆధునికమా?
~ చాలా మందిని వేదించే ప్రశ్న ఇది.నిజానికి సాముహిక గణేశ ఉత్సవాలు సనాతనమూ కాదూ,ఆధునికమూ కాదూ."కలౌకపి వినాయకౌ","కలౌ చండి వినాయకౌ","కలౌ వేంకటనాయకః"అని శాస్త్రాల్లొ కనిపిస్తుంది.అంటే కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతలు,అధికంగా పూజింపబడేవారు వినాయకుడు,చండి(అమ్మవారు),హనుమంతుడు,వేంకటేశ్వరస్వామి.వీరిలో వినాయకుడి పేరు రెండుసార్లు చెప్పింది శాస్త్రం.అంటే వినాయకుడు ముఖ్యుడు అని అర్దం.

~ కలియుగంలో మానవులు మందబుద్ధులుగా,తెలివిలేని వారుగా ఉంటారని మన పురాణాల్లొ కనిపిస్తోంది.లేని కులాల పేరుతో,మతాల పేరుతొ నిరంతరం గొడవపడుతుంటారు.వేదవిద్యకు దూరం అవుతారు.విద్యాప్రదాతైన వినాయకుడు కులమతాలకు అతీతంగా అందరి నోట వేదమంత్రాలను చదివించడానికి ప్రతి వీధికి వస్తానని,ఎక్కడ పడితే అక్కడ కూర్చోని అందరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తానని,అందుకే ప్రతి సంవత్సరం వస్తానని అన్నాడు.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వీధి వీధికొ వినాయకుడు వచ్చి,కులమతాలకు అతీతంగా వేదవిద్యను అందరి నోట పలికిస్తాడని చెప్పారు.

~ మరాఠాల ఇలవేల్పు వినాయకుడు.స్వాతంత్ర్య పోరాటంలో కులాల వారిగా విడిపొయిన హిందువుల మధ్య సఖ్యతను పెంచడానికి బాలగంగాధర్ తిలక్ గారి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది.అంతకు ముందే రావచ్చు కదా అంటే కలియుగం మొదలైన 5000 సంవత్సరాల తరువాత నీటి కరువు వస్తుందని చెప్పబడింది.మనం ఇప్పుడు 5113 సంవత్సరంలో ఉన్నాం.సరిగ్గా 119 సంవత్సరాలకు పూర్వం ఈ సాముహిక ఉత్సవాల ప్రారంభం జరిగింది.కలియుగంలో నామజపం వల్లనే మొక్షం లభిస్తుందని,అందువల్ల అందరికి ముక్తిని ప్రసాదించడానికి గణపతి వీదుల్లొకి వస్తున్నాడు.అంతేకాదు అందరు కలిసి భజన,నామజపం,సంగీతకచేరి లాంటివి చెయ్యడం వల్ల వర్షాలు సమృద్దిగా కురుస్తాయి.ఇదేంటి?మేము నమ్మము అంటారా?అయితే ఇది చదవండి.

~ 1982లో అక్టోబరులో మద్రాసులో విపరీతమైన నీటికొరత ఏర్పడింది.దాంతో ప్రభుత్వం,ప్రముఖ వయోలిన్ విద్వాంసుడైన శ్రీ కునకోడి వైద్యనాధన్ గారిని సంగీతం ద్వారా వర్షం కొరకు ప్రార్ధించమని అడిగింది.ఆయన మద్రాసు నగరానికి మంచినీరు సర్ఫరాచేసే రెడ్ హిల్స్లో మోకాలు లోతు నీటిలో నిలబడి వర్షాన్ని ప్రేరేపించే కొన్ని ప్రముఖరాగాలను ఎన్నుకొని,ఆలపించటం జరిగింది.కొన్నిరోజులు మేఘాలు కనిపించినా వర్షం కురవలేదు.9వ రోజు కొద్దిగా వర్షం పడింది.15 రోజుల తరువాత మంచి వర్షాలు కురిశాయి.తరువాత ఆయన దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది.వేదాల్లొ ఇలాంటి అనేకానేక మేఘమధనాల గురంచి వివరించారు.

~ మరి కొంతమంది మతప్రచారం కోసం వినాయకుడిని వీధుల్లొకి లాగారని అంటున్నారు.అది వారి మూర్ఖత్వమే అవుతుంది.దైవసంకల్పం లేనిదే ఏలా సాధ్యమవుతుంది?స్వామి వివేకానందుడితో ఒక విదేశియుడు అన్నాడు,మీరు చెప్పిన మాటలు విని మీ హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని,అందులోకి మారాలని నేను ఏన్నొ ఉత్తరాలను రాశాను.నాకు ఒక ఉత్తరానికి కూడా జవాబు రాలేదు.అదే ఇతర మతాలవారయితే ఒక్క ఉత్తరం రాయాగానే ఇంటికి అనేకానేక పుస్తకాలను పంపుతారు.మతాన్ని విస్తరించుకుంటారు.మీరు ఎందుకు అలా చెయ్యరని అడిగాడట.దానికి బదులుగా స్వామి అన్నారు మీరు చెప్తున్న ఆ మాతాలు ప్రచారం మీద ఆధారపడ్డాయి.ప్రచారం ఆగిపొయిన మరుక్షణమే అవి ఉనికిని కోల్పోతాయి.కానీ మా ధర్మం ఆచరణ మీద ఆధారపడింది.కొన్ని కోట్లమంది హిందువులు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నారు.మా ధర్మం ఏ ప్రచారం లేకుండానే ఆచరణవల్ల మాత్రమే ఇన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతొంది అన్నారట.

~ మనం ప్రతిష్టించే విగ్రహాలను వికృతంగా తయారు చేయడం,ప్లాస్టెర్ ఆఫ్ పారిస్,రసాయన రంగుల విగ్రహాలను పూజించడం,పర్యావరణాన్ని కలుషితం చేయడం లాంటివి గణపతిని అవమానపరచడమే అవుతుంది.అందుకే పర్యావరణ హితకరమైన విగ్రహాలనే పూజిద్దాం.

~ నిమజ్జనం వెనుక ఉన్న అర్దం ఏమిటి?
to be continued.........

Sunday, 9 September 2012


part-21
~ వచ్చిన వారికి భోజనం పెడతాము,భగవంతునకు నైవెద్యం పెడతాం కదా.

  నైవేద్యంగా సమర్పించకుండా ఏ పదార్థమైన తింటే పాపాన్ని తిన్నటే అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పారు.పరమాత్మకు సాత్వికమైనవే సమర్పించాలి.కల్లు,మందు మొదలైనవి భగవంతుడికి సమర్పించలెం కదా.కనుక స్వామికి నెవేదన చేయలేని వాటిని సేవించకూడదని అర్దం.భగంతునికి ఒక నైవెద్యం ఇష్టం,మరొకటి ఇష్టం లేదు అని కాదు.మనకు ఏవి ఆరొగ్యాన్ని ఇస్తాయొ వాటినే పరమాత్మ నైవెద్యంగా అడిగాడు.మన ఆరోగ్యం కోసమని నియమాలు పెట్టాడు.అదే "నైవెద్యం సమర్పయామి".    

~ భోజనం చేశాక తాంబులం ఇస్తారు.తాంబులానికి పాన్ కు చాలా తేడా ఉంది.తాంబూలం వేసుకోవడం చేత లాలాజలం(సలైవ)అధికంగా ఉత్పత్తై జీర్ణశక్తిని పెంచుతుంది.నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.పంటి సమస్యలు రాకుండా ఉంచగలుగుతుంది(కాని పాన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.క్యాన్సర్ వస్తుంది పాన్ తినే వాళ్ళకు).ఆరోగ్యకారాణాల రీత్యా వచ్చినవారికి తాంబులం ఇచ్చేవారు.అదే "తాంబూలం సమర్పయామి".

~ తరువాతి ఉపచారం ప్రదక్షిణం.వచ్చిన వారి చుట్టూ తిరాగలా అని మీరు అడగచ్చు.వచ్చిన వారి చుట్టూ తిరగమని కాదు,వారి ఆలొచనల చుట్టూ తిరగమని.ముందు చెప్పుకున్నాం కదా.వచ్చినవాడు చాలా గొప్పవాడని.మరి అంత స్థాయికి ఎలా ఎదిగాడొ,ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడొ అడుగుతాం.మనం కూడా వాడిని అనుసరించాలని భావిస్తాం.వాడి అభిప్రాయాలను తెలుసుకుంటాం.అలాగే దేవాలయంలో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే భగవత్తత్వాన్ని అర్దం చెసుకొని,ఆయన్ను అనుసరించడం.(అలాగే దాని వెనుక సైన్స్ కూడా ఉంది.సైన్సు తరువాత చెప్పుకుందాం).మరి ఇంట్లో పూజలో అయితే మన చుట్టూ మనమే తిరుగుతాం.మనం ఆత్మస్వరూపం.మనం ఆత్మ అని గ్రహించి ఈ శరీరాన్ని ఆత్మ చుట్టూ తిప్పగలిగితే పాపాలను తొలిగించుకొని మొక్షాం పొందుతాం.అదే "ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి".

~ కనీసం ఈ 16 ఉపచారలైన చేయాలని శాస్త్రం చెప్తొంది.నిజానికి ఉపచారాలు 64.వాటి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలూ ఉన్నాయి.దేవుడిని మానసికంగా సేవించి,పరమాత్మ దగ్గరవ్వడమే వీటి పరమార్దం.అలాగే ఇంటికి అతిధులు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా గౌరవించాలో చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించడానికి,మన సంస్కృతిని,సంప్రదాయన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి మన మహర్షులు వీటిని పూజలో భాగంగా చేశారు.ఇవి కేవలం మర్యాదకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకొవడానికి కూడా దోహదపడతాయి.            

to be continued...........

Saturday, 8 September 2012


part-20
~ ఈ కాలంలో మన ఇంటికి ఎవరైనా అతిధులు వస్తున్నారంటే మనం రూంఫ్రెష్నర్లు కొడుతున్నాం.అవి చేతి మీద పడ్డా,తినే వస్తువుల్లో పడ్డా ఆరోగ్యానికి మంచిది కాదు.మన పూర్వీకులు ధూపం వేసేవారు.ధూపానికి చాలా విశిష్టత ఉంది.ఆయుర్వేదం ప్రకారం ధూపం వేయడం వల్ల గాల్లో ఉన్న క్రిములు నశిస్తాయి.అలాగే మనకు రోగనిరొధక శక్తి పెరుగుతుంది.
 
  ఈ మధ్య జాన్స్ హోప్ కిన్స్ మరియు హెబ్రివ్ విశ్వవిద్యాలయాలవారు ధూపం మరియు అగరుబత్తి వెలిగించడం మీద పరిశోధన చేశారు.రోజు ధూపం వాసన పీల్చడం వల్ల మానసికారోగ్యం చేకూరుతుందని,మెదడు ఉత్సహంగా పనిచేస్తుందని,కుంగుబాటు(డిప్రెషన్)కు గురయ్యే అవకాశాలు చాలా తగ్గిపొతాయని తమ పరిశోధనలో తెలిందని వివరించారు. ఈ వివరాలను ఈ పరిశోధనకు సంబంధించిన బృందానికి నాయకుడైన రాఫెల్ అమెరికా వారి పత్రికకు చెప్పడం,అది అమెరికా పత్రికల్లో రావడం జరిగింది.

  అగరుబత్తిలో ఆవుపేడ వాడతారు.ఆవుపేడను కాల్చడం చేత ఆ ప్రాంతంలో సూక్ష్మక్రిములు నాశనమవడంతో పాటు ఆక్సిజెన్(ప్రాణవాయువు)విడుదలవుతుంది.
 
  ధూపం ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమివేస్తుంది.అందుకే మన అన్ని కార్యక్రమాల్లో ధూపానికి అంత ప్రాధాన్యం.మన ఇంటికి వచ్చిన అతిధికి ఆరోగ్యం చేకూరాలని,అతన్ని ఆవహించి ఉన్న నెగిటివ్ శక్తులు దూరంగా పోవాలని ఇంటికి అథిదులు వచ్చినప్పుడు ధూపం వేసేవారు.మన ఆరోగ్యం కోసం నిత్యం పూజల్లో వాడేలా చేశారు. అదే "ధూపమాగ్రపయామి".

~ అతిధులు ఇబ్బందిపడుతున్నారేమొ అని ఇంకో లైట్ వేయాలా అని అడుగుతాం కదా.మనం కరెంట్ లైట్ వేస్తే వారెమో దీపం వెలిగించేవారు.మనం వెంటనే అంటాం అప్పుడు కరెంట్ లేదు కనుక దీపం వెలిగించారని.అది మన అపొహ.యజుర్వేదంలొ(24-15-19)కరెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సౌరవిద్యుత్తు,తోకచుక్కలు,కొన్ని రకాల వృక్షాల నుండి విద్యుత్తును వెలికితీసే విధానం గురించి చెప్పబడింది.

 రౌద్రీ భాస్వంతు సంయోగాజ్జాయతే మారికాభిదా|
 విషశక్తిస్తయా సూర్యకిరణాశని సంభవం||
   
 ఇదిగో పైన చెప్పబడ్డ శ్లొకంకూడా అలాంటిదే.అంతేకాదు మనం దీపంలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడతాం కదా.ఆవునేయి కాల్చడం చేత ఆ వాసన లేదా గాలి ఎంత దూరం వ్యాపిస్తుందో,అంతదూరంవరకు సూక్ష్మక్రిములు నాశనమవుతాయని రష్యన్ల పరిశోధనలో తెలింది.దీపం కాలిన తరువాత దాని నుండి కార్బన్ అణువు విడుదల అవుతుంది.అది ఆ ప్రాంతంలో ఉన్న తేమను పీల్చేసి సూక్ష్మక్రిములు పుట్టకుండా చూస్తుంది.దీపపు కిరణాలు ఆ గదిలో ఉన్న అయస్కాంత తరంగాలు(మెగ్నటిక్ వెవ్స్) ద్వారా మన శరీరంలొకి ప్రవేశించి నాడులను శుభ్రపరిచి,మరింత లొపలికి ప్రవేశించి రక్తశుద్ధి చేస్తుందని కొంతమంది విదేశిశాస్త్రవేత్తల పరిశోధన వివరాలు.ఈ విధంగా చెప్పుకుంటూపోతే దీపం మీద ఎన్నొ గ్రంధాలు రాయచ్చు.అందుకే మన ధర్మశాస్త్రాలు దీపారధన రోజుకు రెండుసార్లు తప్పక చేయాలని మన ఆరొగ్యం కోసమని శాసనం చేశాయి(మరిన్ని విశేషాలు తరువాత చెప్పుకుందాం).  

 అందువల్ల వచ్చిన అతిధికి ఆరోగ్యం చేకూరాలని,సూక్ష్మ క్రిములు నాశనమవ్వాలని,గాలి శుద్ధి జరగాలని దీపం వెలిగించి పెట్టేవారు.అదే "దీపం దర్శయామి".  

మిగిలన ఉపచారాలు మళ్ళీ చెప్పుకుందాం.
   
to be continued...............
                     

Friday, 7 September 2012


part-19

~ ఇంటికివచ్చిన అతిధి ఎంతో శ్రమపడి వచ్చాడు.అలసిపోయి ఉంటాడు,శరీరమంతా చెమటపట్టి సూక్ష్మక్రిములు చేరిఉంటాయి. కనుక అతను స్నానానికి ఏర్పాట్లు చేస్తాం కదా.అదే "స్నానం సమర్పయామి".

~ స్నానం చేయగానే త్రాగడానికి నీరు ఇచ్చేవారు.స్నానం చేయగానే నీరు తాగితే బి.పి.అదుపులొ ఉంటుంది.స్నాన సమయంలో స్నానపుగదిలో ఉన్న క్రిములు మన శ్వాస ద్వారా నొట్లోకి చేరుతాయి.కనుక నోరు శుభ్రపరుచుకోవడానికి నీరు ఇచ్చి తరువాత త్రాగడానికి నీరు ఇచ్చేవారు.అదే "స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి".

~ వచ్చినవాడు,వాడి బట్టలు కట్టుకోవడం కాదు మనం ఇచ్చినవి కట్టుకొవాలని మన పూర్వీకులు భావించారు.అందుకే వచ్చిన వాడికి చేనేత నూలు వస్త్రాలు సమర్పించేవారు(చేనేతవే ఎందుకు సమర్పించాలో 14,15 భాగాల్లొ చెప్పుకున్నాం కదా).అదే "వస్త్రం సమర్పయామి".

~ తదుపరి యజ్ఞోపవీతం ఇచ్చేవారు(వేదకాలంలో కులాలు లేవు.స్త్రీ పురుషులందరూ కూడా యజ్ఞోపవీతం ధరించేవారు,గాయత్రి జపం చేసేవారు).ఇంకో అర్దం వచ్చిన వారితో కలిసి కూర్చొని యజ్ఞం చేయడం.గత 5000 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు యజ్ఞం చేసేవారని చరిత్రకారుల పరిశోధనలో తేలింది.అలాగే యజ్ఞం మీద జరిగిన అన్ని పరిశోధనల్లొ అద్భుతమైన విషయాలు తెలిశాయి.అందువల్ల జెర్మని,ఫ్రాన్స్ లాంటి దేశాల్లో నిత్యం యజ్ఞం చేసి దాని బూడిదను అక్కడ పంటపోలాల్లొ ఎరువుగా వాడే కొంతమంది విదేశీయులు సైతం ఉన్నారు."ఈ ప్రపంచాన్ని కాలుష్యం,భూతాపం(గ్లొబల్ వార్మింగ్),భయంకర రోగాలనుండి కాపాడగల శక్తి ఒక్క యజ్ఞానికి మాత్రమే ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతొ మంది గొప్ప శాస్త్రవేత్తలు ఘంటాపదంగా చెప్తున్నారు". అనేకానేక ఆధారాలతో సహా నిరూపించి చూపించారు.విశ్వకల్యాణం కోసమని యజ్ఞం రోజుకు రెండు సార్లు యజ్ఞం చేసేవారు.వచ్చిన వారిని కూడా భాగస్వాములుగా చేశారు.అదే "యజ్ఞొపవీతం సమర్పయామి".

~ వచ్చిన వారికి మంచి వాసన రావాలని,వారికి చల్లగా ఉండాలని గంధం పెట్టుకోమని ఇచ్చేవారు.అదే "గంధం సమర్పయామి".

~ ఈ కాలంలో మనం ఎవరైనా  ఇంటికి వస్తే ఏమి ఇవ్వాల్సివస్తుందో అని భయపడుతున్నాం.కాని వేదకాలంలో వచ్చిన వాడికి(ఎవరైనా సరే) వజ్రవైడుర్యాలు,మరకతమణులు,నవరత్నఖచిత ఆభరణాలు బుట్టలు బుట్టలుగా ఇచ్చేవారు.వాడికి ఆనందాన్ని కలగచేసేవారు.ఇది ఆ కాలంలో మన దేశ సంపదను మనకు తెలియపరుస్తొంది.అదే "ఆభరణం సమర్పయామి".

~ మనకు ఇవాళ అంత సంపద ఉందా?భగవంతుడు ఆభరణమే అడగలేదు.ఆభరణాలకు బదులు అక్షతలు ఇవ్వండి చాలు అన్నాడు.అందుకే 'ఆభరణార్దం అక్షతాన్ సమర్పయామి".

 ~ మనం దేవుడికని సమర్పించేపూలల్లో చాలా పూలకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన గుణాలు,సూక్ష్మక్రిములను నాశనం చేయగల శక్తితోపాటు వ్యాధినిరోదక శక్తిని పెంపొందించే శక్తికూడా ఉంది.పూలు తలలొ పెట్టుకుంటే తలలో ఉన్న వేడిని తీసివేస్తాయి.వాటి వాసన కూడా గాలిలొ ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.అందుకే వచ్చిన వారికి పూలు ఇస్తాం.అదే "పుష్పం సమర్పయామి".

~ మిగితా ఉపచారాలు మళ్ళీ చెప్పుకుందాం.

to be continued........

Thursday, 6 September 2012
part-18
~ షోడశోపచార పూజ అంటే ఏమిటి?

~ షొడశోపచారాపూజ అంటే 16 ఉపచారాలతో పరమాత్మను పూజించడం.ఉప అంటే దగ్గరగా,ఆచారం అంటే చెయ్యడం.పరమాత్మును మనకు మానసికంగా దగ్గరచేసెదే ఈ పూజ.ఈ 16ఉపచారాలను మన రోజువారి జీవితానికి అన్వయం చేసుకుందాం.

~ మన ఇంటికి మన చిన్ననాటి ఫ్రెండ్,మనం ఆహ్వనించకుండానే తనకు తానే స్వయంగా వస్తున్నాడని అనుకుందాం(వినాయకుడు మనం పిలువకుండానే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున వస్తున్నాడు కదా).ఆ ఫ్రెండ్ చాలా గొప్పవాడు,పెద్ద పదవిలో ఉన్నాడు.మరి అంత గొప్ప వాడు వస్తుంటే ఒక్కడే వస్తాడా?ఆయనకు ముందు ఎంతో మంది మన ఇంటికి వస్తారు కదా(అతను పెద్ద నాయకుడైతే పోలీసులు,కార్యకర్తలు,ఆయన వల్ల పదివిలో ఉన్నవారందరూ కూడా ఆయన్ను చూడ్డానికి వస్తారు కదా(మనం కలశంలొకి త్రిమూర్తులను,మాతృగణాలను ఆవహన చేస్తాం).అదే "కలశస్తాపన".  

~ ఇంతమంది వచ్చాక మనం వాడి కోసమని ఎదురుచూస్తూ ఉంటాం కదా.వాడు అలా ఉంటాడు,ఇలా ఉంటాడు అని ఆలొచిస్తూంటాం.మొత్తం మనసంతా అతని అలొచనలే ఉంటాయి కదా.అదే "ధ్యానం".

~ వాడు రాగానే రా!లోపలికి రా! అంటూ ఆనందంగా వాడిని ఇంట్లోకి తీసుకువస్తాం.అదే "ఆవాహన".

~ మన ఇంట్లో మంచి కుర్చీలేకపొయినా ప్రక్క ఇంటినుండి అడుక్కొనైనాసరే వాడికి మంచి కుర్చీ వేయాలి అనుకుంటామా?వాడు అలా మంచి కుర్చీలొనే కుర్చుంటా అని అనకపొయినా మనం  ఊరకుంటామా?అదే వరసిద్దివినాయకునికి "నవరత్నఖచిత సీంహాసనం" లేదా "ఆసనం".

~ మన హిందువులు వచ్చిన అతిధులకు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకునేవారు.వచ్చిన వారిలో దైవాన్ని చూసేవారు.బయటనుండి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుంటే మెదడుకు విశ్రాంతి.కాళ్ళలొ ఉండే నాడులు మెదడుకు నిరంతరం సంకేతాలను పంపిస్తుంటాయి.అందుకే పాదాలను చల్లటి నీటితో కడుక్కుంటే మెదడు హాయిగా ఉంటుంది.అలాగే బయటకు వెళ్ళిరావడంవల్ల కాళ్ళకు అంటుకొనిఉన్న క్రిములు ఇంట్లొకి రావు.అందుకే కాళ్ళు కడగటం.అదే "పాదయొః పాద్యం సమర్పయామి".

~ ప్రయాణసమయంలో మనం బయట వస్తువులను(బస్సు హ్యండిల్ లాంటివి) ముట్టుకొవలసి వస్తుంది.అవి శుభ్రంగా ఉండవు కదా.వచ్చి రాగనే వాడికి "షేక్ హ్యాండ్" ఇస్తే ఆ క్రిములు మన చేతికి అంటుకొని మనకు రోగాలు వచ్చె అవకాశం ఉంది కనుక మనం నమస్కరిస్తాం(నమస్కారానికి అర్దం నువ్వు నేను ఒక్కటే అని).ఇంకా నమస్కారానికి అనేకానేక అర్దాలు ఉన్నా అవి ఇప్పుడు అప్రస్తుతం.మన పూర్వీకులు వచ్చిన వాడి చేతులను శుభ్రపర్చుకోడానికి నీరు ఇచ్చెవారు.అదే "హస్తయొః అర్ఘ్యం సమర్పయామి".    
 
~ ఇలా శుభ్రపరిచాకే వారికి త్రాగడానికి"నీరు" ఇచ్చేవారు.అదే ఈ కాలంలో వచ్చిరాగానే మురికి చేతులతొ ఉన్నవాడికి కూల్ డ్రింక్లు ఇస్తే,అసలే బయట నుండి వచ్చాడు కదా,కాసేపటికి దాహం వేస్తుంది,అవి అసలే ఆరొగ్యానికి మంచి కావు.మురికి చేతులు.లేని రోగాలు వచ్చి చస్తాడు.అందుకే మన పూర్వీకులు ముందు నోరు శుభ్రపరుచుకోడానికి(బయటనుండి రావడం వల్ల నొట్లో క్రిములు చేరి ఉంటాయి కదా)నీరు ఇచ్చి,తరువాత త్రాగడానికి మంచి నీరు ఇచ్చేవారు.అదే  "ఆచమనం".    


to be continued.......                        

Wednesday, 5 September 2012


part-17
~ వినాయకచవితి పూజలో పాలవెల్లి ఎందుకు కడతారు?

~ ఆరోగ్యకారణాలను దృష్టిలో పెట్టుకొని మన ఋషులు ఈ కాలంలో దొరికే రకరకాల పండ్లను దీనికి కట్టమన్నారు.ఏ ఋతువులో వచ్చె పండ్లను ఆ ఋతువులొ తింటే ఆరొగ్యం చేకూరుతుందని,మనం బద్దకస్తులం కనుక ఆయా పండ్లను తెచ్చుకోమని,కనీసం తన పూజ ద్వారా అయినా ఈ పండ్లను తింటారని,అందువల్ల పాలవెల్లికి వివిధరకాల పండ్లను కట్టమని వినాయకుడు ఋషులద్వారా చెప్పాడు.

~ తాత్వికంగా చూసినప్పుడు పాలవెల్లి అంతరిక్షానికి సంకేతం.దానికి కట్టే పండ్లు గ్రహాలు,నక్షత్రాలకు సంకేతం.స్వామి అనంతకోటి బ్రహ్మాండనాయకుడు.ఆయన మన ఇంటికి వస్తే ఒక్కడే రాడు కదా.అంత గొప్ప స్వామి వస్తుంటే ఆయన్ను సేవించడానికి దేవతలు,యక్ష,కింపురుష,గంధర్వులు         ,గ్రహాలు మన ఇంటికి వస్తాయి.గ్రహాలు,నక్షత్రాలు ఆయా పండ్లలోకి చేరి స్వామిని కొలుస్తాయి.పూజానంతరం మనం ఆ పండ్లను నైవెద్యంగా తీసుకుంటాం కదా.అలా మనకు గ్రహదోషాలు ఉంటే శాంతిస్తాయి.

~ గ్రహాలు,నక్షత్రాలు జ్యొతిష్యానికి సంబంధించినవి కదా.జ్యొతిషం మూఢనమ్మకమని నాస్తీకులు వదిస్తున్నారు కదా?

~ నిజానికి జ్యొతిషం అర్దం అవ్వాలంటే సంస్కృత భాష మనకు తెలియాలి.హేతువాదులుగా చెప్పుకునేవారు మొదట వేసే ప్రశ్న- మనకు అనంతమైన నక్షత్రాలు కనిపిస్తుంటే హిందువులు 27 ఉన్నాయి అంటారేమి అని.నిజమే మనకు ఉన్నవి 27 నక్షత్రాలే.కాని మనకు ఆకాశంలో కనిపించేవి తారలు.తారలు వేరు నక్షత్రాలు వేరు.తారలు అంటే స్టార్స్.నక్షత్రాలు అంటే తార సమూహం.ఋగ్వేదంలొ చెప్పబడింది దైవప్రఙ్ఞలె(వెలుగు లేక శక్తులు)నక్షత్రాలని.6 తారల సమూహం కృతికా నక్షత్రం.అలాగే జింక తలాకారంలో ఉండే తార సమూహం మృగశిర.ఇలా అన్నమాట.ఈ తారల సమూహం నక్షత్రం అయితే నక్షత్రాల సమూహం రాశి.

~ గ్రహం అంటే ప్లానెట్ అని మాత్రమే అర్దం ఇంగ్లీషులో.గ్రహం అంటే తాత్కాలికమైనది,పరిమిత జీవిత కాలం కలిగినది,మన మీద తన ప్రభావం చూపించేది అని అర్దాలు ఉన్నాయి సంస్కృతంలో.ఇంకా అనేకం ఉన్నాయి కాని అవి అప్రస్తుతం.సూర్యుడు తార.ఎవరు కాదు అనలేదు కదా.మన మీద ప్రభావం చూపిస్తాదు కదా,అందునా ఆయనకు పరిమిత కాలం ఉంది కదా(శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఈ విషయాన్ని మన వేదంతో పాటు).అందుకే ఆయన్ను గ్రహం అన్నాము.చంద్రుడు అంతే.ఇక రాహు కేతువులను చాయగ్రహాలన్నారు.ఆ కిరణాలు గ్రహణసమయంలొ మన మీద ప్రభావం చూపిస్తాయని 1982-83లో డా.త్రాంటొన్ గారి పరిశొధనలో తేలింది కదా.అలాగే సూర్యుడు పాలపుంత మధ్యలో ఉన్నాడని,చుట్టు భూమి తిరుగుతొందని వేదాల్లొ అనెక చోట్ల మనకు కనపడుతొంది.

~ నిన్న కాకమొన్న వచ్చిన పరిమితమైన పదాల ఇంగ్లీషు భాషలో దేవ భాష సంస్కృత పదాల అర్దాలను వెతకడం మన మూర్ఖత్వం అవుతుంది.మన ధర్మంలో దేవునికి,పరమాత్మకు చాలా తేడా ఉంది.అన్నిటికి "గాడ్" అనె పదం ఏమాత్రం సరిపోదు.ఇప్పుడు మనం చెప్పుకున్న స్టార్,ప్లానెట్ కూడా అంతే.

~ అందుకే ఆంగ్లేయుడైన మెకాలె హిందువులను క్రైస్తవులుగా మార్చే కుట్ర ఫలించక ఈస్టిండియా కంపెనితో అంటాడు."ఒక జాతిని సర్వనాశనం చెయాలంటే,ముందు చేయవల్సినపని,దాని భాషను దెబ్బతీయడమే".అలాగే కలకత్తా నుండి ఇంగ్లాండులో ఉన్న అతని తండ్రికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు."ఈ ఇంగ్లీషు విద్యాప్రభావంచేత రాగల 20సంవత్సరాలలొ బెంగాల్లో హిందువెవడు మానసికంగా హిందువుగా మిగలడు,మని పని మరింత సులువవుతుంది".

~ సంస్కృతం మృతభాష కాదు.మన మాతృభాష.మన మూలం సంస్కృతంలొనే ఉంది.సంస్కృతాన్ని కాపాడుదాం.మన సంస్కృతిని కాపాడుకుందాం.


to be continued.........                      

Tuesday, 4 September 2012

వస్త్రధారణ - జాగ్రత్తలు

16
మిమ్మల్ని భయపెట్టడానికి మేము వస్త్రధారణ వెన్నుక ఉన్న సైన్స్ గురించి తెలియపరచలేదు.అందరూ నిజాలు తెలుసుకోవాలి అన్న తపనతో మీకు అందివ్వడం జరిగింది.

కేవలం వస్త్రధారణే కాదు కాలుష్యం, సెల్ ఫొన్లు, ఆహరం వంటివి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. మరి నష్టనివారణకు చేయాల్సినవి ఏమిటి? ముందు జీన్స్, బిగుతుగా(టైట్) గా ఉన్న బట్టలను ధరించడం ఆపాలి. జంక్ ఫుడ్స్ తినకూడదు. సెల్ ప్యాంట్ జేబులో పెట్టుకోకూడదు. లాప్‌టాప్ వంటివి శరీరం మీద పెట్టుకొని పనిచేయకూడదు. ధరించే బట్టలు కాటన్ వస్త్రాలైతే మంచిది. అవి కూడా లేతరంగులు అయితే ఇంకా మంచిది. అందరూ పంచెలు, చీరలు కట్టుకొవాలని చెప్పడంలేదు. కాని ధరించే వస్త్రాల విషయంలో జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నా. కనీసం పండగలు, పూజల సమయంలో ఈ సంప్రదాయ వస్త్రాలను కట్టుకొండి, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను గ్రహించండి. సంప్రదాయాన్ని భావితరాలకు అందించండి. ధూమపానం, మధ్యపానం వంటివి అలవాట్ల వల్ల జనువుల్లో లోపాలు ఏర్పడతాయి, వీర్యం, అండం క్షీణిస్తాయి. వాటి ఉత్పత్తి, వాటిలో ఉండే జీవకణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకే అవి అలవాటు ఉన్నవారు మానేయండి. శ్రీ విష్ణూసహస్రనామాలు, లలితా సహస్రనామాలు నియమంగా చదివితే, వాటికి మించిన పరమఔషధం లేదు. ఏది ఏమైనా ముందు దళసరి మరియు బిగుతైన బట్టలు ధరించకుండా ఉండాలి.

మన ఆరోగ్యం చేడిపొతుందనే, మనం ఆరోగ్యం కాపాడుకొవాలని, మనం ఆ వస్త్రాలు కట్టుకొవాలనే  భగవంతుడు తాను చేనేత నూలు వస్త్రాల్లో ఉంటానని చెప్పాడు. కాని ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? చేనేత కార్మికులను వేదం ఎంతో పొగిడితే, మన ఆదరణ కరువైయ్యి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకు ఎన్నో పండగలు,పూజలు వస్తాయి కదా. ఎన్నో దేవాలయాల్లో స్వామికి వస్త్రాలు సమర్పిస్తాం కదా. అవి చేనేత వస్త్రాలే ఎందుకు సమర్పించకూడదు? ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు కనీసం 5 మీటర్లకు సమానమైన చేనేత వస్త్రాలను కొంటే రాష్ట్రంలో చేనేత కార్మీకుల ఆత్మహత్యలు ఉండవు.

ఇప్పటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది వేదం ఎందుకు అంతా గట్టిగా ఈ వస్త్ర ధారణ గురించి చెప్పిందొ. మన హిందూ ధర్మంలో ప్రతి పండుగ, పూజ వెనుక ఎన్నో ఆరొగ్య రహస్యాలు ఉన్నాయి. మన ధర్మంలో భగవంతుడు తన కోసం ఒక్క పూజ కూడా చేయమనలేదు. అవి మన ఆరోగ్యం మరియు పర్యవరణ రక్షణ కోసమే. మీరు చేసే ప్రతి పూజ మీకోసమే.

సంప్రదాయ వస్త్రధారణ చేసిన వివేకానందుని విదేశీయుడు వెక్కిరిస్తే ఆయన అన్నారు
 "In your culture dress makes Gentleman,but in our culture CHARACTER makes gentleman".           

Monday, 3 September 2012

సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

part-15

Should be read by youth especially.


సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
ముందు శరీర నిర్మాణం గురించి ఓ విషయం తెలియాలి. మగవారి శరీరనిర్మాణంలో వృషణాలు (టెస్టిస్) ముఖ్యమైన భాగాలు. అవే సంతానోత్పత్తికి, ఓజస్సు శక్తికి కారణమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసి, తమలో దాచుకుంటాయి. వాటి ఉష్ణోగ్రత శరీరసాధారణ ఉష్ణోగ్రతకన్న 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే వీర్యకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్పత్తిపై ప్రభావం చూపి, వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత మరీ పెరిగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపొయే ప్రమాదం ఉంది. నపుంసకత్వం వస్తుంది. ఒకవేళ ఉత్పత్తి జరిగినా ఫర్టిలిటి అతి తక్కువగా ఉంటుంది.

బిగుతగా (టైట్ గా) ఉండే బట్టలు వేసుకోవడం చేత శరీర ఉష్ణొగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లోదుస్తులు (Inner wear) బిగుతుగా ఉంటుంది కనుక వృషణాల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఫలితంగా వీర్యకణాలసంఖ్య తగ్గిపోతుంది. మనం వేసుకునే జీన్స్ ప్యాంట్స్ బాగా దళసరిగా ఉంటాయి. గాలిని వాటిలోనుండి శరీరానికి తగలడం ఆసాధ్యం. వేసవిలో ఇది అనుభవమే. అందువల్ల వృషణాల ఉష్ణొగ్రత మరింత పెరుగుతుంది. ఫలితం మరింత వీర్యోత్పత్తి తగ్గిపోవడం, సంతానసామర్ద్యం దెబ్బతింటుంది.

అక్కడితో ఆగదు. ఈ కారణంగా జన్యువుల్లో (genes) లోపం ఏర్పడుతుంది. అది తరువాతి తరలవారిలో కూడా కోనసాగుతుంది. వారి వంశం మొత్తం ఆ లోపంతో బాధపడుతుంది. గత కొంతకాలంగా జరిగిన పరిశోధనలో తేలిందేంటంటే అంటే గత 20 సంవత్సరాలుగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందట.     

ఈ విషయం తెలిసిన మన మహర్షులు, వాటి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండటానికి పంచె మాత్రమే సరైనదని పరిశోధించి, దానినే మాత్రమే కట్టుకోమన్నారు. పంచె బిగుతుగా ఉండదు, వదులుగా ఉంటుంది. అందునా నూలు (కాటన్) పంచె వల్ల శరీర మరియు వృషణాల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుందని, అది తెల్లది ధరించడంవల్ల వేడిని తిప్పికొట్టి శరీరాన్ని కాపాడుతుందని, చల్లగా ఉంచుటానికి దోహదపడుతుందని కేవలం పంచె మాత్రమే కట్టుకోవాలని శాసనం చేశారు.

ఇక స్త్రీల విషయంలో కూడా ఇంతే. బిగుతగా ఉండేవి, దళసరివి (జీన్స్ లాంటివి) కట్టుకోవడం చేత అండ విడుదల సమయంలో సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు విపరీతంగా వేదిస్తాయి. లెగిన్స్ లాంటివి ధరించడంచేత తొడల్లో రక్తప్రసరణ సక్రమంగా సాగదని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాదు స్త్రీలకు సంబంధించి నెలసరి వంటి అనేకానేక సమస్యలకు మూలకారణం ఈ ఫ్యాషన్ దుస్తులేనట.. ఇంకా చెప్పలాంటే గర్భంధరిచే అవకాశాలు పూర్తిగా కోల్పోయినా ఆశ్చర్య పోనవసరంలేదు అని వైద్యులు అంటున్నారు..

ఇది కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలిసిన మహర్షులు చీర మాత్రమే కట్టుకోవాలని నియమం పెట్టారు. అందుకే ఆ కాలంలో సంతానసాఫల్య కేంద్రాలు లేవు. ఫ్యాషన్ పేరుతోనో, స్వేచ్చ అని చెప్తూనో, నాగరికం అని మనం ఈ విదేశిదుస్తులను ధరిస్తున్నాం. మన పిల్లలకు చిన్న వయసునుండే ఈ వస్త్రాలు వేసి వారికి తీరని ద్రోహం చేస్తున్నాం.

అలాగే వేదం ఒక్కసారి ఒక బట్ట కట్టుకుంటే దాన్ని ఉతకకుండా మళ్ళి కట్టుకోరాదని చెప్పింది.ఎందుకంటే మన శరీరం ద్వారా వచ్చిన చెమటలో సూక్ష్మక్రిములు మన ధరించిన వస్త్రాలకు అంటుకుంటాయి. స్నానం తరువాత విప్పిన బట్టలే మళ్ళీ ధరిస్తే రోగాలు వస్తాయని ఆయుర్వేదంతో పాటు నేటి ఆధునిక పరిశోధనులు తెలుపుతున్నాయి.

వేదం ఏమి చెప్పిన నిజమే చెప్తుంది. కఠినంగా అనిపించినా అనేకానేక కారణాలు ఉంటాయి వేద వచనం వెనుక.

To be continued .................

Sunday, 2 September 2012

భారతీయ వస్త్రధారణ

part-14

వినాయక చవితి పూజ అనే కాకుండా ప్రతి పూజలోను భారతీయ వస్త్రధారణ తప్పనిసరి.

 వేదం అంటే భగవంతుని ఉచ్శ్వాస నిశ్వాసలు. వేదాన్ని మించిన గొప్ప గ్రంధం కానీ, వేదంలొ చెప్పబడ్డ టెక్నాలజీ కానీ ఈ ప్రపంచంలో లేదు. అలాంటి వేదం పూజ సమయంలో ఏ వస్త్రాలు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అన్నవి కూడా బలంగా చెప్పింది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అయితే ముందు వేదం ఏమి చెప్పిందో తెలుసుకుందాం.

కట్టుకునే వస్త్రాలు చేనేత కార్మికులే నేసినవై ఉండాలి. ఎందుకో తెలుసా?వారి చేతి స్పర్శ చేత ఆ వస్త్రాలకు పవిత్రత వస్తుందని, ఆ బట్టలోని దారాల మధ్య ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఇంద్రాది దేవతలు ఆవహింపబడతారని చెప్తోంది వేదం. అవి నూలు (కాటన్)వై ఉండాలి. వాటికి అంచు (Border) తప్పనిసరిగా ఉండాలి. వస్త్రాలు తెల్లని రంగులో ఉండాలి.

పూజా సమయంలో ధరించే దుస్తులు ఉతికినవై ఉండాలి. లేదా క్రొత్తవై ఉండాలి. గోచి పొసి మాత్రమే కట్టుకోవాలి. గోచి అంటే చిన్న బట్టను కట్టుకోవడం అని అర్దం కాదు పంచె యొక్క అంచు రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చెలా, క్రింద పాదాలవరకు వచ్చేలా కట్టుకోవడం. పూజ సమయాల్లో ఆడవారికి కూడా ఇది వర్తిస్తుంది.

పెళ్ళైన మగవారు ఎడమ భూజం మీద ఉత్తరీయం వేసుకొవాలి. ఎంత గొప్ప క్రతువు చేస్తునా ఉత్తరీయం లేకపొతే ఫలితం రాదు. ఉత్తరీయం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు వేసుకోవాలి అంటే ఎడమ వైపు గుండె ఉంటుంది. భార్య భర్త ఎడమ చెయ్యి పట్టుకుంటుంది పెళ్ళి సమయంలో. భార్యే భర్త గుండెకు (ప్రాణానికి) రక్షణ అని, అందువల్ల ఆమెను ఎప్పుడు మరవద్దని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంలో మారెజ్ బ్యూరోలు లేవు. అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కాని మగవారికి ఈ ఉత్తరీయం ఉందో లేదో చూసి లేకపొతే కనుక పెళ్ళి సంబంధాలు మాట్లాడేవారట. ఇప్పుడా పరిస్థితి లేకపొయినా ఉత్తరీయం ధరించడం మాత్రం తప్పనిసరి.

చేనేత మగ్గం మీద నేయని వస్త్రమైనా, ఉతకనిదైనా, తెల్లనది కాకపొయినా, నూలుది కానిది, అంచు లేని వస్త్రాన్ని కట్టుకున్నా, అప్పుడు చేసే పూజ నగ్నపూజగా భావింపబడుతుందని, మహాపాపం వస్తుందని వేదం చెప్తోంది.  

ఇంకో విషయం తెలుసా? దేవాలయంలో దేవునికి మనం చేనేత నూలు వస్త్రాలే సమర్పించాలి.భగవంతునికి కూడా ఈ వస్త్రాలే ధరింపచేయాలి. పట్టు వస్త్రాలతో దేవలయాలకు వెళ్ళకూడదు. దేవునికి సమర్పించరాదు. పూజల్లొ కట్టుకోరాదు. అది నిషిద్దం. ఎందుకంటే పట్టు, పట్టుపురుగును చంపి తీస్తారు. లేదా పట్టు తీసే క్రమంలో అవి చనిపోతాయి. అది హింసే కదా. అందుకే శాస్త్రం నిషేధించింది. ఎంత డబ్బు ఉన్నా సరే పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించకూడదు.

వినాయక చవితి,వరలక్ష్మీ వ్రతం,సత్యనారయణస్వామి వ్రతం మొదలైన పూజల్లొ, పీట మీద పరిచే టవల్ లేదా బట్ట కూడా చేనేతది, నూలుది, తెల్లనిది, అంచు ఉన్నది, క్రొత్తది మాత్రమే అవ్వాలి. ముడుపులు కట్టేసమయలో కూడా ఇవే వాడాలి.

 మనలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కనీసం ఇప్పటి నుంచైనా ఆచరిద్దాం.    


To be continued.........

part-13
~ వినాయక చవితి:
~ "ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప" అని బ్రహ్మాండపురాణ వచనం.అంటే వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి,మధ్యాహ్నం గణపతిని పూజించాలి అని.

~ ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు అని.ఏదో ఒక సెలవు వస్తే హాయిగా నిద్రపొనివ్వరా అని మీకు కోపం రావచ్చు.అసలు ప్రతి రోజూ ఉదయమే ఎందుకు నిద్ర లేవాలి?సైన్సు ఎంటి?

~ ఆయుర్వేదం ఇలా చెప్తొంది.పగటి పూట శ్రమించిన మానవుడు రాత్రి నిద్రించడంవల్ల అతని అవయవాలన్ని విశ్రాంతి పొందుతాయి.దాంతొ పాటు రాత్రి సమయం చల్లగావుండటంవల్ల తాను పీల్చుకునే శ్వాసకూడా చల్లగా ప్రశాంతంగా జరుగుతుంటుంది.అలాంటి ప్రశాంత వాతావరణం సూర్యోదయంతో ఛేదించబడి భూమి వేడెక్కుతుంది.ఆ సమయానికి మనిషి నిద్రలేచి తన పనులకు ఉపక్రమిస్తే సరీరంలొ ఘర్షణ మొదలై అది కూడా వేడెక్కి శ్వాసతో లీనంకావడం వల్ల వ్యాధులు  నిరోధించే సహజశక్తి ఎల్లప్పుడు సంపూర్ణంగా ఉత్పన్నమవుతుంది.

~ అలాకాకుండా మనిషి సూర్యొదయం తర్వాత కూడా నిద్రించడంవల్ల అతని శ్వాసమాత్రం సూర్యప్రభావంతో వేడెక్కి అతని శరీరం చల్లగావుండి ఈ రెండు విరుద్దమై దాని ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధకశక్తి క్షీణిస్తూ అనారోగ్యానికి కారణమవుతుంది.ఈ రహయ్సం తెలుసుకొని వేగుచుక్క పోడవగానే అంటే తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచి తన నిత్యజీవనకార్యక్రమాలను ప్రారంభించగలగాలి.ఈ నియమం ఇంతవరకూ ఏ వ్యాధి లేని నిరొగులకేగాని ఇప్పటికే నానావ్యాధులతో బాధపడుతున్నవారికి కాదని తెలుసుకోవాలి.
                                        courtesy-అందరికి ఆయుర్వేదం
~ ప్రతి ఒక్కరి శరీరంలొ సూర్యోదయానికి గంటన్నరముందు ఒక అమృతబిందువు ఉత్పన్నమవుతుంది.ఒక సూదిమొన(టిప్ ఆఫ్ నీడెల్)మీద ఒక తెనే చుక్క వెస్తే అది ఎంత పరిణామం ఉంటుందొ అందులొ సగం  పరిణామం ఉంటుందీ అమృతబిందువు.అది మనం మెల్కొని ఉంటేనే మన శరీరం దాన్ని ఉపయోగించుకొని రోజంతా ఉల్లాసంగా ఉంచగలుగుతుందని కూడా తెలుస్తోంది.అందుకే మన మహర్షులు మన సుఖమయమైన జీవనం కోసమని అనేకానేక నియమాలు పెట్టారు.తెలిసితెలియక హిందూ ధర్మాన్ని,ఋషులను,భారతీయ సంస్కృతిని విమర్శించవద్దు.
                                       
~ ఈ ప్రకృతిలోని ప్రతి జీవి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేస్తొంది.మరి వాటికన్న ఎంతొ గొప్ప అని చెప్పుకునే మనం మాత్రం ప్రకృతి నియమాలను అనుసరించక హీనులుగా మిగిలిపోవాలా?ప్రతి జీవి పర్యవరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పొషిస్తున్నప్పుడు మనం మాత్రం పర్యవరణాన్ని నాశనం చెయ్యడమెందుకు?పర్యవరణ హితమైన జీవనన్ని సాగిద్దాం.అది ఈ వినాయక చవితినుండే ఆరంభిద్దాం.పర్యవరణహితకరమైన వినాయక చవితిని జరుపుకుందాం.

next coming part
~ సంప్రదాయ దుస్తులు ధరించే పూజ చేయాలా?పంచకట్టు వెనుక ఉన్న సశాస్త్రీయ కారణం ఏమిటి?వేదం ఏమి చెప్తోంది?
to be continued.............      

Saturday, 1 September 2012


part-12
~ విగ్రహాలతయారి మీద ముంబాయిలొ ఒకానొక హిందుధర్మ ప్రచార సంస్థ సర్వే నిర్వహించింది.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు మట్టి విగ్రహాలను తయారుచేస్తున్న వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంలో తయారిదారులు అత్యధికగంగా ఇలా చెప్పారు.

  "మేము ఎంతొ పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను,వాటి కంటే చిన్నగా ఉన్న మట్టి విగ్రహాలను చేశాము.మట్టి విగ్రహాలకు రంగులు వేస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందానికి లోనయ్యాము.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమను ఎక్కువ ధరకు అమ్మిన మాకు అంత ఆనందం కలగలేదు".

~ ఒక విత్తనం మట్టిలొనే పెరుగుతుంది కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్లొ పెరుగుతుందా?మట్టిలో జీవశక్తి,ప్రాణ శక్తి ఉంటుంది.తాత్వికంగా చెప్పల్సి వస్తే మట్టి లేదా భూమి,శివునికి సంకేతం.దానిలో ఉన్న ప్రాణశక్తి పార్వతి దేవి.నారయాణుడు నీటి యందు ఉంటాడు.ఆయన హృదయలో లక్ష్మీ ఉంటుంది.అంటె నీటిలొని ప్రాణశక్తి.మట్టిలో నీరు కలిపే కదా విగ్రహం చేస్తారు.అంటే మనం కేవలం వినాయకునికి మాత్రమే కాదు శివపార్వతులకు,లక్ష్మీనారయణులకు కూడా పూజ చేస్తున్నాం ఆ విగ్రహం ద్వారా.

  ఇది కేవలం మట్టి విగ్రహాల ద్వార మాత్రమే సాధ్యమవుతుంది.అందుకే మట్టి విగ్రహాలను మాత్రమె పూజిద్దాం.పెద్ద విగ్రహాలు కూడా మట్టివి దొరుకుతున్నాయి.

~ 11వ భాగం చదివాక మీకొ అనుమానం రావచ్చు.నిజంగా నమ్మకానికి,భావనకు అంత శక్తి ఉందా?పరమాత్మ నమ్మి పిలిస్తే వస్తాడ?

  రామకృష్ణ పరమహంస ఒక కధ చెప్పారు.పూర్వం ఒక పిల్లకు 3సంవత్సరాలకే వివాహం చెశాడు ఆమె తండ్రి.కొంత కాలానికి ఆమె భర్త మరణించాడు.ఈ విషయం ఆ పసిపిల్లకు తెలియదు.8సంవత్సరాలు వచ్చే సరికి ఆమె స్నేహితురాళ్ళను వారివారి భర్తలు వచ్చి తీసుకెళ్ళారు.ఈ పిల్ల కూడా తన భర్త వచ్చి తనను ఎప్పుడు తీసుకెల్తాడని ఆమె తండ్రిని రోజూ అడిగేది.ఆయనకు భాధ కలిగి నీ భర్త పేరు మధుసూధనుడు(కృష్ణుడు)అని చెప్పి,గట్టిగా పిలువు,వచ్చి తీసుకెల్తాడని చెప్పాడు.ఆమె ఆర్తితో గట్టిగా పిలిచింది.నిజంగా ఆ ఊరి గుళ్ళొ ఉన్న కృష్ణుడే వచ్చి ఆమెను తీసుకెళ్ళాడట.నమ్మకంతో పిల్చిన గజేంద్రుని కోసమని పరుగుపరుగున వచ్చాడా శ్రీ మహావిష్ణువు.

  మనం పదార్ధంలో పరమాత్మను వెతుకుతున్నాం.పరమాత్మ యదార్ధం.బయట వెతకడం ఆపండి.మీలోనే వెతకండి.కనిపిస్తాడు.

  మనొ బుద్ధ్యహంకార చిత్తాని నాహం
  న చ శ్రోత్ర   జిహ్వా న చ ఘ్రాణనేత్రం|
  న చ వ్యొమ భూమిర్ న్ తేజో న వాయుః
  చిదానంద రూపః శివొహం శివొహం||
   
to be continued.........