Wednesday, 31 December 2014

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం

ఓం నమో నారాయణాయ

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.

కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.

ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.

"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.

వైకుంఠ ఏకాదశి ఉపవాస విశేషాలు

ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు.

మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.

జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.

మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురుగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి. ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు,దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్ప్లులు కూడా వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

దశమి నాడు ఉదయమే లెచి శిరస్నానం చేసి, ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి,భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి.ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు,ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి.విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి,  ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి,  పారణ(భోజనం)చేయాలి.ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.

ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.

ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం.
ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం.మనశ్శంతిని,తద్వార పరమగతిని పొందుదాం.             

ఓం నమో లక్ష్మీనారాయణాయ

Tuesday, 30 December 2014

జనవరి 1 న్యూఇయర్ కుట్ర

జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల గురించి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతాయి. కొందరు జరుపుకోవద్దంటారు, కొందరు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేడుకను మనం మాత్రం జరుపుకుంటే తప్పేంటీ అంటారు. అసలు ఈ న్యూఇయర్ వేడుకలు ఒక 25 ఏళ్ళ కిందట భారత్‌లో లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వీటి వెనుకనున్న శక్తులేవి? వీటిని ఇంతలా promote చేయడం వల్ల ఆ శక్తులకు వచ్చే లాభం ఏమిటి? ఈ సందేహాలాన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇది చదవండి. (సమయం తక్కువగా ఉన్నందున సంక్షిప్తంగా వివరిస్తున్నా )

భారత్‌లో న్యూఇయర్ వేడుకలను promote చేయడం వెనుక అమెరికా హస్తం ప్రధానంగా ఉంది. అమెరికా, చైనా, ఇతర దేశాల దృష్టిలో భారత్ 120 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద మార్కెట్. తమ దేశాంలో అమ్ముడుపోనివి వస్తువులను, మందులను, ఇతర ఆహారపదార్ధాలను అమ్మడానికి వాటికి భారత్ కనిపిస్తుంది. ఆయాదేశాల్లో ప్రభుత్వంచే నిషేధించబడిన వస్తువులను కూడా, ఆ ప్రభుత్వాలు భారత్‌లో అమ్మెందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాయి. ఉదాహరణకు అధిక విషరసాయనాలు కలిగిన ఎరువులు అమెరికాలో నిషేధం అనుకోండి. ఆ ఎరువుల కంపెనీను మూసేస్తే, ఎందరికో నష్టం వాటిల్లుతుందని ఆ ప్రభుత్వం ఎరువులు ఎగుమతి చేస్తామని భారత్‌తో ఒప్పందం చేసుకుంటుంది. మన మేలు కోసం కాదు, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం. పైగా విషపు రసాయనాలు కలిగిన ఎరువులు, మందులు భారత్‌కు ఎగుమతి చేస్తే, అవి వాడిన భారతీయులు రోగాల బారిన పడతారు. ఆ రోగాలకు కూడా వాళ్ళే మందులు ఎగుమతి చేసి, డబ్బు సంపాదిస్తారు. అదీగాకా, పౌరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అభివృద్ధికి నిధులు వెచ్చించగలుగుతుంది. అదే పౌరులు అనారోగ్యంగా, బలహీనంగా ఉంటే ప్రభుత్వం నిధులను మందుల కోసం, వైధ్యం కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధికి ఉపయోగించవలసిన నిధులు పక్కదారి మళ్ళుతాయి. ఆర్ధికలోటు కూడా ఏర్పడవచ్చు, ప్రభుత్వం అంతర్జాతీయసంస్థల నుంచి అప్పు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఒక దేశం అప్పు చేసిందంటే, అదేమి గోప్ప విషయం కాదు, ఆ దేశం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతున్నదని చెప్పటానికి అదె నిదర్శనం. ఇదంతా అమలు చేయడానికి అమెరికా సహా అనేక దేశాలు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాయి. ఎక్కడా కూడా ఆయా దేశాలు ఇందులో ఉన్నట్టు అనుమానాలు రాకుండా మిషనరీలు, కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, సంఘసంస్కరణే తమ లక్ష్యం అని ప్రచారం చేసుకుంటున్న కొన్ని సంస్థలు, మీడియా, సినీదర్శకుల ద్వారా సినిమాలు .............. ఇంకా అనేక మాధ్యమాల ద్వారా, వాటికి నిధులను సమకూరుస్తూ, చాపా కింద నీరులా తమ ప్రణాలికలను అమలు చేస్తున్నాయి. ఇదంతా ఒట్టి కల్పితం అని మీరు అనవచ్చు. ఇది నిజమని చెప్పడానికి చిన్న ఉదాహరణ చూపిస్తాను. భారతీయుల మేధాశక్తి అపారమైంది. భారాత్‌కు స్వతంత్రం వచ్చాకా, అది గొప్పగా అభివృద్ది చెందుతుందని అమెరికా సహా, కొన్ని దేశాలు భయపడి కొన్ని కుతంత్రాలు చేశాయి. వాటిలో ఒకటి తమిళనాట ద్రావిడ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం. డిఎంకె రాజకీయ పార్టీ వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు చేసుకోవడం. 1962 లొ భారాత్-పాకిస్థాన్ యుద్ధం జరిగే వారకు, డిఎంకెను పావుగా వాడుకుంటూ భారత్‌లో అంతర్గత కలహాలు సృష్టించి జాతీయనాయకులను బెదిరించింది అమెరికా. అదే సమయంలో భారత్ నుంచి వేరు పడిన పాకిస్థాన్‌కు ఆయుధాలు ఎగుమతి చేసి, దానికి బలం అందించింది. చైనా కూడా అంతే. భారత్-చైనా యుద్ధ వచ్చినప్పుడు కూడా అమెరిక్ భారత్‌కు సాయం చేయడానికి బహిరంగంగానే నిరాకరించింది. అప్పుడే అమెరికా బుద్ధి బయటపడింది.

అదే తరహాలో న్యూఇయర్ వేడుకలను ఇంత పెద్దగా promote చేయడం వెనుక కూడా ఒక పన్నాగం ఉంది. న్యూఇయర్ పేరుతో క్లబ్బులు, పబ్బులకు, మద్యానికి, మాదకద్రవ్యాలను యువతకు అలవాటు చేయడం వారి ప్రణాళికలో ప్రధానమైన అంశం. ఇలా చేస్తే ఆయా దేశాలకు 120 కోట్ల జానాభా గల పెద్ద మార్కెట్ వస్తుంది. తమ దేశంలో తయారయ్యే మాదకద్రవ్యాలు, మద్యం ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న భారతీయ విద్యావిధానం ఆంగ్లేయుడైన మెకాలే రూపొందించింది. అది భారతీయులను మానసికంగా, నైతికంగా బానిసలు చేయడమే లక్ష్యం. అన్యదేశాల్లో మద్యం, మాదకద్రవ్యాల వ్యసనం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరోధించడం కూడా కష్టమే. కానీ భారతీయకుటుంబ వ్యవస్థ కారణంగా, ఇతర దేశాల్లో వలె మన దేశంలో యువుతకు దురలవాట్లు తక్కువ. ఈ దేశపు యువత మానసికంగా స్కూలోనే బలహీనపడ్డారు. శారీరికంగా కూడా వారిని బలహీనపరిచే ప్రణాళిక భాగమే న్యూఇయర్ వేడుకల పేరుతో జరిగే పార్టీలు. నగరాల్లో ఉండేవారిని, ముఖ్యంగా ఒంటరిగా హాస్టల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక పధకం రచించారు. ముందు పార్టీలకు అలవాటు చేయడం, మద్యం అలవాటు చేయడం, తర్వాత మాదకద్రవ్యాలు అలవాటు చేయడం ........... ఇలా ఒక్కొక్కటి చేస్తారు. ఆఖరున కుటుంబవ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి, యువతను నైతికంగా, మానసికంగా ఒంటరిగా చేయడం ఇందులో భాగం. ఒంటరి అయినవారికి సాయం అందిస్తాము, ఒంటరితనం దూరం చేస్తామంటూ మతమార్పిడి చేయడం ఆఖరి ఘట్టం. ఇది పైకి చెప్పినంత బహిరంగంగా జరగదు, చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇదంతా తెలియక చాలా మంది మనం ఎన్నో సంస్కృతులను అంగీకరిస్తున్నప్పుడు, ఈ న్యూఇయర్ వేడుకలను మాత్రం చేసుకుంటే తప్పేంటి అంటూ జరుపుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. భారత్ ఆర్ధికంగా, నైతికంగా, ధార్మికంగా, మానసికంగా, భౌతికంగా పతనమవ్వాలంటే కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అయితే చాలని భారతదేశాన్ని అర్దం చేసుకున్న స్వదేశీ ఆర్ధికవేత్తలకు స్పష్టంగా తెలుసు.

అలాగే పండుగలు జరుపుకోవడం వేరు, న్యూఇయర్ జరుపుకోవడం వేరు. పండుగల సమయంలో ఆకులు, పూలు, ప్రమిదలు, ఇతర సామాన్లు అమ్మేది సాధారణ లేక పేద ప్రజలు మాత్రమే. ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సీడీలు, పధకాలకంటే, వారిని హిందూ సమాజం పండుగల ద్వారనే పోషిస్తోంది. ఒకసారి గమనించండి. మనం పండుగ జరుపుకున్న ప్రతిసారి ఆయా పేద కుటుంబాలకు ఆదాయం వచ్చి కడుపు నిండుతుంది, వారూ పండుగ చేసుకుంటారు. కానీ న్యూ ఇయర్ వేరు. దీంతో పేదవారికి వచ్చేదేమి ఉండకపోగా, తాము అలాంటి పార్టీలకు దూరం అవుతున్నామనే బాధ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బలంగా తీసుకుని, కొన్ని మిషనరీలు వారికి డబ్బు ఆశచూపి మతం మారిస్తున్నాయి.

ఇంకో విషయం గమనించండి, కరువు వచ్చింది, భూకంపం వచ్చింది, తుఫాను వచ్చింది, అందుకని పండుగలు జరుపుకోకండని చెప్పే సంస్థలు, న్యూఇయర్ మాత్రం జరుపుకోవద్దని చెప్పవు. ఎందుకు? ........... పండుగ జరుపుకోకపోతే ఆదాయం లేక నష్టపోయేది పేదలు, కానీ న్యూఇయర్ విషయంలో అలా కాదు. పండుగ జరుపుకోకపోవడం ఒక రకంగా పేదరికాన్ని పెంచుతుంది. పేదరికం పెరిగితే ప్రభుత్వం వారిని ఆదుకోవడం కోసం అభివృద్ధికి వెచ్చించవలసిన నిధులను, వీరి కోసం ఖర్చు చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుంది. ఫారిన్ బ్రాండ్లను మన దేశంలో అమ్మడం కూడా ఇందుకోసమే. అర్దం చేసుకోండి. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపరులను నాశనం చేసి, పేదరికాన్ని పెంచడం, ఈ మధ్యలో కొన్ని సంస్థల ద్వారా, వారి పేదరికానికి కారణం మధ్యతరగతి మరియు ధనికవర్గాల ప్రజలని రెచ్చగొట్టి అంతర్గతకలహాలను సృష్టించడం, దేశ సమగ్రతను, సమైఖ్యతను బలహీనపరచడం, ఆకారికి ఆఫ్ఘనిస్థాన్ మీద ఆదిపత్యం చేలించినట్లుగా భారత్ మీద కూడా ఆధిపత్యం పొంది, భారత్‌లో ఉన్న అపారమైన గనులను, సంపదను దోచుకోవడమే లక్ష్యం. మన పండుగలు చేసుకోవద్దని చేప్పే ఏ సంస్థా. న్యూఇయర్ వేడుకలను చేసుకోవద్దని చెప్పదు. ఎందుకంటే అది అన్యదేశాల ఆదాయానికి గండి కొడుతుంది, అప్పుడు వీరికి రావలసిన నిధులు ఆగిపోతాయి. అలాగే పర్యావరణహిత హోలీ చేసుకోండి, ఏకో ఫ్రెండ్లీ గణేశచవితి జరుపుకోండి, దీపావళికి టపాసులు మానండి అని చెప్పేవారు న్యూఇయర్ కి మాత్రం టపాసులు మానమని చెప్పరు. అసలు ఆ ఊసే ఎత్తరు. దీనికి తోడు ఈ న్యూఇయర్ జాడ్యాన్ని పిల్లలకు అంటించిన దాంట్లో పెద్దలు కూడా ఉన్నారు. ముగ్గులో రాసి, కేకులు తీసుకువచ్చి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి, తలిదండ్రులు ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అదే పిల్లలను కొత్తపుంతలు తొక్కిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న కుట్ర పెద్దలకు తెలియదు పాపం.  అందుకే చెప్పోచ్చేదంటంటే, న్యూఇయర్ మనది కాదు, కానీ జరుపుకోవలనుకుంటే ఆ డబ్బును పేదలకు అన్నదానం చేయడానికో, బట్టలు కొన్నివడానికో ఖర్చు చేయండి. పార్టీలకు, పబ్బులకు, మద్యానికి దూరంగా ఉండండి.

Monday, 29 December 2014

హిందూ ధర్మం - 122 (బ్రాహ్మణాలు)

బ్రాహ్మణాలు మంత్రాలకు, ఆయా కర్మలకు మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. అంతా సులువుగా అర్దమైనప్పుడు కొత్తగా వివరించే ప్రయత్నం చేయవు. కానీ ఎక్కడైన సరైన వివరణలు లేకపోతే, అక్కడ బ్రాహ్మణాలు రకరకాల పద్ధతులను ఉపయోగించి, మంత్రాలకు, కర్మలకు మధ్య గల బంధాన్ని వివరిస్తాయి. అందులో ఒక ముఖ్యమైన పద్ధతికి పేరు బంధూతం. అంటే రెండు, లేక అనేకమైన విషయాలను ఒక చోటికి చేర్చి, వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం.

ఉదాహరణకు సోమాన్ని యాగాన్ని తీసుకువచ్చే సమయంలో దాన్ని ఒక వస్త్రంలో కట్టి, వరుణుడి మంత్రాలను చదవాలని బ్రాహ్మణాలలో ఋషులు చెప్పారు. దానికి కారణం అలా సోమలతలను వస్త్రంలో కట్టినప్పుడు/బంధించినప్పుడు, ఆ బంధనానికి ఆధిపత్యం వరుణుడు వహిస్తాడు. ఆ సోమలతలపై అధికారం ఆ సమయంలో వరుణుడికి ఉంటుంది.

పండితుల అభిప్రాయం ప్రకారం బంధూతపద్ధతిని చాలా అరుదుగానూ, తార్కికంగానూ (logical) వాడుతారు. బంధూతపద్దతితో పాటు మంత్రాలు, కర్మల మధ్యనున్న సంబంధాన్ని ఏర్పరచడం కోసం వివరణలు, శబ్దవ్యుత్పత్తి, ఐతిహ్యాలను, కధలను వివరించారు.

B. అర్ధవాదం - ఇది వివరణాత్మకమైన భాగం. ఇంతకముందు భాగం విహితకర్మలు (చేయదగిన పనులు), నిషిద్ధకర్మలు (చేయకూడని పనులు) గురించి చెప్తే, ఈ భాగం విధులను (విహితకర్మలను) ప్రశంశిస్తూ, నిషిద్ధకర్మలను ఖండిస్తుంది. प्राशस्त्यनिन्दापरं वाक्यम् अर्थवाद:।

బ్రాహ్మణాలలో అర్దవాదం చాలా పెద్దది, ముఖ్యమైనది. అర్దవాదాన్ని విధిపుచ్చం అని కూడా ఉంటారు. పుచ్చం అంటే తోక. విధి తర్వాత వస్తుంది కనుక దీనికి ఈ పేరు. ఇది విధుల గురించి, వాటి నుంచి వచ్చే ఫలితాల గురించి, నిషిద్ధర్మలను ఆచరించడం వలన కలిగే అనర్ధాలను గురించి చెప్తూ, వాటికి కారణాలను కూడా వివిధ కధల రూపంలో వివరిస్తుంది. అర్ధవాదంలో చిన్న చిన్న ఇతిహాసాలు, పురాణాలు, కధలు, ఆఖ్యానాలు, సంభాషణలు చాలా చాలా కనిపిస్తాయి. ఇందులో చాలా భాగం గద్యరూపంలో చెప్పబడింది. ఈ అర్ధవాదం వైదిక కర్మలు చేయుటకు అవశ్యతకతను చెప్తూ, వాటి ఆచరణను బలపరుస్తుంది.

To be continued .......................

Sunday, 28 December 2014

హిందూ ధర్మం - 121 (బ్రాహ్మణాలు)

c. మంత్రాలు
యజ్ఞయాగాది క్రతువులలో, వైదిక కర్మలలో మంత్రం ప్రధానం. వైదికకర్మకు మంత్రం ఎంత ముఖ్యం, మంత్రం తగిన ఫలితం ఇవ్వడానికి చెప్పబడిన కర్మను అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఆ మంత్రాల గురించి, వాటిని ఎప్పుడు, ఎలా చదవాలో చెప్తుందీ భాగం.

एतद् वै यज्ञस्य रूपसमृद्धं यत् क्रियमाणं कर्म ऋग् अनुवदति।
మంత్రము, కర్మ రెండు ఒకేసారి, చెప్పబడినట్లుగానే జరగాలి. అప్పుడే ఫలితం వస్తుంది అని పై శ్లోకం అర్దం.

d.  నామధేయః - యజ్ఞయాగాది క్రతువుల యొక్క పేర్లను చెప్తుందీ భాగం. వివిధ రకాల యజ్ఞకర్మలను అనుసరించి 3 భాగాలుగా ఇది పునర్విభజించబడింది

1. కాలాన్ని అనుసరించి చేయబడు యజ్ఞకర్మలు
a. కొన్ని యాగాలు ఒకే రోజులో ముగుస్తాయి, వాటిని ఏకాహం అంటారు. ఆరు రోజులలో పూర్తయ్యేవాటిని షడాహాలు అని, పన్నెండు రోజులలో చేసేవాటిని ద్వాదశాహాలని అనాలి.
b. కొన్ని ప్రత్యేక తిధులలో చేస్తారు. ఉదాహరణకు దర్శపూర్ణమాసం ప్రతి పూర్ణిమ, అమావాస్యకు చేస్తారు.
c. కొన్ని యాగాలు 12 ఏళ్ళ పాటు చేస్తారు, వాటిని సత్రయాగం అంటారు

2. యాగంలో వేయబడు హవిస్సును అనుసరించి 3 రకాలా యాగాలు ఉంటాయి
a. హవిర్ యజ్ఞాలు - ఆవునెయ్యిని హవిస్సుగా వేసేవి - దర్శపూణ్నమాసాలు, అగ్నిహోత్రం మొదలైనవి
b. సోమ యజ్ఞాలు - సోమరసం (సోమలతలు ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణాలు కలిగిన రసం) తో చేసే యజ్ఞకర్మలు - అగ్నిష్టోమం, అతిరాత్రం, వాజపేయం
c. పాక యజ్ఞాలు - వండిన పదార్ధాలను హవిస్సుగా సమర్పిస్తూ చేసేవి - శ్రద్ధకర్మ, శ్రావణి, చైత్రి మొదలైనవి

3. అగ్నిహోత్రం, వైశ్వదేవం వంటివి రోజు చేయాలి, దర్శపూర్ణమాసలు, చైత్రి, శ్రావణి ప్రత్యేకమైన తిధులలో చేయబడేవి, కొన్ని యాగాలు ప్రత్యేకించి కోరికలు తీరడం కోసమే చేస్తారు - పుత్రకామేష్టి, అశ్వమేధం మొదలైనవి

To be continued ..................

Saturday, 27 December 2014

నిష్కామ కర్మ

నిష్కామ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు.

"పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబాలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబాలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబాలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబాలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.

Source: Brahmasri Chaganti Koteswara RAO

Wednesday, 24 December 2014

హిందూ ధర్మం - 120 (బ్రాహ్మణాలు)

ब्रह्मणं ब्रह्मसंघाते वेदभागे नपुंसकम्।

బ్రాహ్మణాలు అనగానే ఇవి ఒక కులానికి చెందినవి అనుకుంటారు. కానీ శాస్త్రం  చెప్తోంది, బ్రాహ్మణాలు అని చెప్పబడ్డవి ఒక వ్యక్తిగానీ, స్త్రీపురుష బేధానికి కాని, ఒక కులానికి గానీ చెందవు. ఇవి వేదభాగాలు మాత్రమేనని, అదే పై వాక్యం యొక్క అర్దం.

ఈ బ్రాహ్మణాలలో వాడిన పదాలు, భాష సామాన్యమైనవి కావు. వీటికి గొప్ప మహత్తు ఉంటుంది. అవి మంత్రరూపంగా లేకపోయినప్పటికి, సరిగ్గా చదివినప్పుడు అనుకూలఫలితాలను, నియమాలు పాటించకుండా చదివినప్పుడు వ్యతిరేక ఫలితాలని ఇవ్వగలవు.

బ్రాహ్మాణాలు ప్రధానంగా రెండిటి గురించి చెప్తాయి.
A. విధులు / ధర్మాలు
B. అర్ధవాదం

1. విధులు - నియమాలు, నిషేధాలు: ఇందులో అగ్నిహోత్రం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆచరించవలసిన చిన్న చిన్న యాగాలైన దర్శపూర్ణమాసాలు, చాతుర్మాస్యాల గురించి, పెద్దపెద్ద యాగాలైన సత్రయాగం మొదలైనవాటి గురించి వివరణ ఉంటుంది. అవే కాకా, ఆయా యజ్ఞాలు చేయడం వలన కలిగే ఫలితాలు, వాటిని పాటించే విధానం, వివిధ ధర్మాలు ఈ భాగంలో చెప్పబడ్డాయి. మళ్ళీ ఈ భాగం నాలుగు భాగాలుగా విభజింపబడింది.

a. విధి - కర్మల గురించి చెప్పేది
ఉదాహరణకు अग्निष्टोमेन यजेत स्वर्गकाम:।
స్వర్గ సుఖాలను కోరుకునేవారు అగ్నిష్టోమం నిర్వహించాలి

अश्वमेधेन यजेत पृथ्विकाम:।
భూమిని, రాజ్యాలను కోరుకునేవాడు అశ్వమేధ యాగం చేయాలి

आज्याहुतिं दद्यात।
ఆజ్యాన్ని (అవునెయ్యి) యజ్ఞంలో సమర్పించండి

b. నిషేదః: చేయకూడని పనుల గురించి చెప్తుందీ భాగం

ఒక ఉదాహరణ చెప్పుకుందాం
रात्रौ श्राद्धं न कुर्यात्।
రాత్రి సమయంలో శ్రాద్ధకర్మ చేయకూడదు అని అర్దం

To be continued ......................

Tuesday, 23 December 2014

హిందూ ధర్మం - 119 (బ్రాహ్మణాలు)

2. బ్రాహ్మణాలు:

భగవంతుడు ప్రసాదించిన వేదం మంత్రరూపంలో సూక్తములతో ఉంది. దాన్ని అలాగే అర్దం చేసుకోవడం అసాధ్యం. మరి వైదుక ధర్మాన్ని ఆచరించాలంటే ఎలా? యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేస్తారు? అందువల్ల సంహితలోని మంత్రాల అర్ధాలను తెలుసుకోవాలనుకున్న ఋషులు పరబ్రహ్మాన్ని ఉద్దేశ్యించి తపస్సు చేశారు. శౌచము, పవిత్రత, తపన, సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ, భగవంతుని యందు ప్రీతి, ధృతి మొదలైన అనేక లక్షణములు కలిగినవారికి వేదమంత్రాల అర్దం బోధపడుతుంది. ఋషులు చేసిన తపస్సుకు అనుగుణంగా, వారికి పరమాత్మ వేదమంత్రాలను అర్దం చేసుకునే సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. శుద్ధజ్ఞానాన్ని ప్రసాదించారు. శుద్ధజ్ఞానమంటే పరిపూర్ణమైన జ్ఞానం. ఉదాహరణకు ఒక మనిషిని చూసి, అతని మానసిక స్థితి, జన్మవివరాలు, అతను మరణించే సమయం, గత జన్మలో చేసుకున్న కర్మ, అతని శరీరంలో ఏర్పడిన, ఏర్పడబోతున్న రోగాలు, అతని కుటుంబం, ఇష్టాయిష్టాలు మొత్తం తెలుసుకోగలగడం. ఒక వస్తువును చూసి, దాన్ని ఎలా తాయారు చేశారు, ఏ లోహం వాడారు, ఎంత పాళ్ళలో వాడారు, అది ఎంతకాలం ఉంటుంది మొదలైన విషయాలు చెప్పగలుగుతారు. ఇదంతా భౌతిక స్థాయిలో చెప్పుకున్న ఉదాహరణ. కానీ శుద్ధజ్ఞానం భౌతిక స్థాయిని దాటుతుంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం. ఆ శక్తితో ఋషులు వేదాలకు రాసిన తొలి అర్ధాల /భాష్యాల సమాహారమే బ్రాహ్మణాలు. మానావాళికి వేదమును అందించినవాడు, ఆ వేదములకు అర్దం కూడా బోధపడేలా అనుగ్రహించిన పరమేశ్వరుడే లోకానికి ఆది గురువు అని పతంజలి మహర్షి తన యోగదర్శనంలో పేర్కొన్నారు.

వేదాలను చాలా శుద్ధమైన రూపంలో, ఎటువంటి ఇతర ప్రభావాలకు లోనుకాకుండా అర్దం చేసుకున్న ఋషులు మానావాళికి అందించిన ఈ బ్రాహ్మణాలే వేదాలకు తొలి అర్ధాలు. వేదాన్ని పూర్తిగా, సరిగ్గా అర్దం చేసుకోవాలంటే అది బ్రాహ్మణాలతోనే సాధ్యమవుతుంది. బ్రహ్మం గురించి, బ్రహ్మం యొక్క వైభవం గురించి చెప్పేవి కనుక బ్రాహ్మణాలు అన్నారు. వైదిక ధర్మంలో ఉండే ముఖ్యమైన ప్రక్రియ యజ్ఞం. యజ్ఞం లేనేది ధర్మం లేదు. యజ్ఞయాగాలకు, అగ్ని ఆరాధానకు ధర్మంలో అంత గొప్ప స్థానం ఉంది. మనిషికి ఊపిరి ఎంత అవసరమో, వైదిక ధర్మానికి యజ్ఞం అంత అవసరం.అటువంటి వివిధ యజ్ఞాల గురించి, అవి ఆచరించే విధానం కూడా బ్రాహ్మణాలలోనే తెలుపబడింది.

To be continued ................

Monday, 22 December 2014

హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత)

ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, ఒక ఫ్ర్వీక్వెన్సీ ఉన్నాయి. ఉదాహరణకు ఓంకారానికి ఒక ఫ్రీక్వెన్సీ (Frequency) ఉంది. ఓంకారం నుంచే సమస్త సృష్టి ఆవిర్భించింది, ముందు శబ్దం, ఆ తర్వాత వెలుతురు ఉద్భవించాయి. అందుకే మనం శబ్దం బ్రహ్మం అంటాం. ఓంకారం నుంచి పుట్టిన సృష్టిలో భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ కూడా ఓంకారం యొక్క ప్రీక్వెన్సీతో సరిపోతుంది. దీనితో వ్యక్తి ప్రీక్వెన్సీ సరిపోయినప్పుడు, అతడు సూక్ష్మమైన, భూమికి సంబంధించిన, అనంతమైన, పారలౌకికమైన అద్భుతమైన విషయాలు కనుగొనవచ్చు. ఓంకారం, మరియు భూమి యొక్క ప్రీక్వెన్సీ 7.83 Hz. ఈ అంశం మీద శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ, ఈ భూముని సృష్టి చేసినప్పుడు, దైవికమైన జ్ఞానంతో సర్వజీవరాశి కలిసి ఉండటం కోసం ఒక విధమైన ప్రీక్వెన్సీని ఏర్పరిచారని చెప్పారు (.Depending on your point of view, living beings either evolved in this natural electromagnetic environment or were created with Divine Intelligence to live in harmony with it. One thing is certain: Since life began, the Earth has been surrounding all living things with this natural frequency pulsation.) ఆధునికులు అంతరిక్షంలోకి Space craft ను పంపినప్పుడు కూడా, వాటిలో Schumann device అనే ఒక పరికరం తప్పక ఉంటుంది. ఇది మనిషి ఉత్పత్తి చేసే ఇబ్బందికర వాతవరణానికి, తరంగాలకు విరుగుడట. అవి కూడా 7.83 Hz ప్రీక్వెన్సీని Schumann waves తరంగాల ద్వారా  విడుదల చేస్తాయి. భూమి ప్రీక్వెన్సీతో Space-craft ప్ర్వీక్వెన్సీ సరిపోతేనే అది సరిగ్గా పని చేయగలదు. భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ ప్రణవం అనగా ఓంకారమే.

Schumann waves గురించి ఈ లింక్‌లో చూడవచ్చు
http://www.schumannresonator.com/
http://www.natures-energies.com/health/schumann-generators-and-orgone-energy-devices
http://www.lessemf.com/schumann.html

ఏ విధంగానైతే ఓంకారానికి ప్రత్యేక ఫ్రీక్వెన్సీలు ఉన్నాయో, అదే విధంగా ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, కొన్ని ఫ్ర్వీక్వెన్సీలు ఉన్నాయి. వాటిని చంధోబద్ధంగా చదివినప్పుడు, అవి మనిషికి ఉన్నతమైన అనుభూతులను (elevated levels of consciousness) కలిగిస్తాయి.అట్లాగే మంత్రానికి సృష్టిలో ఒక ప్రత్యేక శక్తి, ప్రయోజనం కూడా ఉన్నాయి. అది అర్దమవ్వడం చాలా కష్టమైన పని అని అనిపించవచ్చు. అయినప్పటికి ఆధునిక పరిజ్ఞానం కనుగొన్న కొన్ని యంత్రాలు, జరిగిన పరిశోధనలు భౌతికము, ఆధ్యాత్మికం మధ్య విడదీసే రేఖను పూర్తిగా చెరిపేశాయి. కనుక ఇటువంటీ విషయాల గురించి ఈ కాలంవారికి కాస్త కష్టమైనా, అర్దమయ్యేలా చెప్పచ్చు.  ఇక మళ్ళీ విషయంలోకి వస్తే చాలా మంత్రాలు symbolic గా ఉంటాయి. వాటిని చదువగానే అర్దమవ్వవు. కొన్ని దేవతలను ఉద్దేశ్యించి చేసే సూక్తములై ఉంటాయి. కొన్ని శుభకార్యాలకు, యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించి ఉంటాయి. కొన్ని సామాజిక ధర్మాన్ని ప్రభోదిస్తూ ఉంటాయి. కొన్ని రసాయన, గణిత శాస్త్రానికి సంబంధించినవి, కొన్ని భౌతిక, జీవ, జంతు, వైద్య శాస్త్రానికి సంబంధించినవిగా ఉంటాయి. దృశ్యాదృశ్య ప్రపంచంలో కనిపించే సమస్త విషయాల గురించి మంత్రాల్లో చెప్పబడి ఉంటుంది. వేదాలు ప్రధానంగా సృష్టి మీద, ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మిక విషయాల మీద, మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి గురించి, ధర్మాల గురించి ప్రస్తావన చేస్తాయి. అయితే ఋషులు రాసిన అర్ధాలు చాలావరకు లభ్యం కాకపోవడం వలన, చాలా మంత్రాలను దైవం యొక్క నామాలు భావిస్తూ అర్ధాలు రాసారు ఈ కాలం వారు. వేదమంత్రాల్లో ఉన్న అర్ధాలను వివరించడంలో ఆధునిక కాలంలో ఆర్యసమజ స్థాపకులు దయానంద సరస్వతీగారు చేసిన కృషి చాలా గొప్పది.

To be continued ............

బట్ట బయలైన క్రైస్తవమిషనరీల కుట్ర

దయచేసి అందరు ఇది చదవండి వాళ్ళ ధోరణి మచ్చుకి
బట్ట బయలైన క్రైస్తవుల కుట్ర.

భారత దేశాన్ని క్రైస్తవమయం చేయాలనే మిషనరీల పన్నాగం కోర్టు విచారణలో బయట పడింది. " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" అనే సంస్థ చాలాసంవత్సరాల నుండి మన దేశం లో పని చేస్తూ, సంవత్సరానికి 40 లక్షల మంది హిందువులను మతం మార్చాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. అందుకు 5000 వేల మంది కార్య కర్తలను నియమించి, విదేశాలనుండి వచ్చే అపరిమితమైన డబ్బుతో ఈ కార్యకర్తలను కొనుగోలు చేసి వీరి మనస్సులో క్రైస్తవమత విషాన్నినురిపోస్తుంది.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కోర్టులో శ్రీ సుధీర్ కుమార్ అగర్వాల్ బలవంతపు మతమార్పిడుల నేరం పై కేసు దాఖలు చేయగానే " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" ప్రముఖ సంచాలకుడు 'సుధీర్ జేవియర్' ను అరెస్ట్ చేసి విచారించినపుడు ఎంతో ఆశ్చర్య కరమైన సమాచారం లభించింది. 'స్వతంత్ర ధర్మపరివర్తన' చట్టం లోని 1968 అధికరణలో 3,4 సెక్షన్ల క్రింద సుధీర్ జేవియర్ పై విచారణ సాగుతుంది.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 'ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్' ప్రధాన కార్యాలయం మన సికింద్రాబాద్ లో ప్రాన్సిస్స్ట్రీట్ లో ఉంది. ఈ కార్యాలయానికి అనుగుణంగా 33 ప్రాంతీయ కార్యాలయాలు, 4 క్షేత్రీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 2007 డిసెంబర్ 20 వ తేదీన ఈ కార్యాలయమునుండి సుధీర్ జేవియర్ కు ఒక నివేదిక పంపబడింది, ఆ నివేదిక ఏమంటే 2007 లో ఈ సంస్థ కార్యకర్తలు 25,10,810 ల హిందువుల ఇళ్ళకు వెళ్లి, 47,46,842 మంది హిందువులను మతం మార్చుటకు అనేక రకాలుగా ప్రలోభ పెట్టి, 1,92,868 మందిని మతం మార్చారు.

కోర్టులో విచారణ జరుగుతున్న సమయం లోనే ఇంకొక మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. 'వరల్డ్ ఫేయిర్ సమిత్' అనే ఈ సంస్థ మధ్యప్రదేశ్ లో ౭౦ గ్రామాల్లో మత మార్పిడులు ప్రారంభించింది. అనిల్ థామస్ దీనికి అధిపతి, 'పాంచజన్య' పత్రికా ప్రతినిధులు ఆ గ్రామస్థులను కలిసినపుడు ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మతం మారిన రైతుకు 5000 వేళ రూపాయలను చేల్లిస్తున్నాడు. కముద్ కేవట్ అనే రైతును మతం మారమని ప్రలోభ పెట్టాడు. నెలకు అయిదు వేళ రూపాయలే కాక అతని స్థలములో చర్చిని నిర్మించీ కముద్ ని ఫాదరీగా నియమిస్తామని అందుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపారు. కముద్ ఆ గ్రామం లోని 'ధర్మసేన' వారికి కబురందించారు. ధర్మసేన ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ అనిల్ థామస్ పై కేసు పెట్టాడు. పోలీసులు అనిల్ థామస్ ను అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ మధ్య ప్రదేశ్ 'ధర్మ జాగరణ' విభాగ్ సహా సంయోజకులు.

suryam mangalamapalli

Sunday, 21 December 2014

హిందూ ధర్మం - 117 (మంత్రసంహిత)

మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని ప్రత్యేక సమయాల్లో మంత్రాల్లో అర్ధాలు వెళ్ళడవుతాయి. ఈ మంత్రాలను డికోడింగ్ (Decoding) చేసిన వ్యక్తులనే మనం ఋషులు అంటున్నాం. ఇలా భగవంతుడు మంత్రరూపంలో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సమస్త విజ్ఞానమంతా మంత్రంలో బీజరూపంలో ఉంచి, మేదస్సును, మనోశక్తిని ఉపయోగించి విజ్ఞానాన్ని కనుగొనమన్నారు. రెండవది లోకంలో అనేక మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు పరమ నిస్వార్ధపరులు ఉంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు, ఎప్పుడు పదిమంది బాగుండాలని కోరుకుంటారు, అవసరమైతే లోకం కోసం తమ కోరికలను, సుఖాలను సైతం విడిచిపెడతారు. ఈ కోవలోకి వస్తారు ఋషులు. వారు కాక, కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ లోకం బాగుండాలని కాంక్షిస్తారు. వారు రెండవరకం. మూడవరకం వారు కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు, లోకం ఏమైపోయినా వీరికి అనవసరం. నాలుగవరకం వారు తమ మాత్రమే బాగుండాలి, లోకం నాశనమవ్వాలి, తాము మాత్రమే సుఖంగా ఉండాలి, వెరొకరు అలా ఉంటే చూడలేరు. ఒక గొప్ప విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, అది సరైన వ్యక్తులకే చెప్పాలి, దుర్మార్గులకు కానీ ఒక అద్భుతమైన జ్ఞానం వెళ్ళిందా, అది లోకకంటకం అవుతుంది. మంచివాళ్ళకి, నిశ్వార్ధపరులకు జ్ఞానం చేరితే, అది లోకకల్యాణ కారకమవుతుంది. అందుకే భగవంతుడు తాను చెప్పదల్చుకున్న విషయాలను వేదమంత్రాల ద్వారా చెప్పారు.

మంత్రమనగానే అది కేవలం ఒక అక్షరసమూహం అని భావించకూడదు. మంత్రానికి శబ్దానికి చాలా సూక్ష్మమైన, విశేషమైన సంబంధం ఉంటుంది. శబ్దం చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. రెండు వస్తువుల రాపిడివల్ల శబ్దం ఏర్పడుతుంది. అణువుల మధ్య రాపిడి వల్ల కూడా చాలా సూక్ష్మమైన శబ్దాలు ఏర్పడతాయి. లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.

To be continued ...........

Saturday, 20 December 2014

హిందూ ధర్మం - 116 (వేదం)

వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కానీ వేదంలో అటువంటి ప్రత్యేకమైన భావజాలం మచ్చుకు కూడా కనిపించదు. వేదం ఏం చెప్పినా సమస్త మానవాళిని, విశ్వాన్నిఉద్దేశ్యించి చెప్తుంది. 'మనుర్భవ - కృణ్వంతు విశ్వమార్యం' : ముందు మనుష్యులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరమైనదిగా చేయండి అంటుంది. అట్లాగే గుడ్డిగా నమ్మమని కూడా వేదం ప్రవచించదు, ఒక దేవుడిని నమ్మమని కూడా చెప్పదు. సత్యాన్ని శోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అంటుంది.

అటువంటి వేదాన్ని అర్దం చేసుకోవడంలో భాగంగా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
1. మంత్రసంహిత
2. బ్రాహ్మణం
3. ఆరణ్యకం
4. ఉపనిసత్తు

1. సంహిత:
సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. సంధి అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము నందున్న ఉన్న శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). మంత్రాలన్నీ కలిపితే సూక్తం అవుతుంది, సూక్తలన్నీ కలిపితే సంహిత అవుతుంది. నిజానికి భగవంతుని ద్వారా ఇవ్వబడిన భాగమే వేదసంహిత. దీనినే వేదమని అంటారు. దీని గురించి మరింత విపులంగా తరువాయి భాగంలో చెప్పుకుందాం.

To be continued ...........

Friday, 19 December 2014

హిందూ ధర్మం - 115 (వేదం)

వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ముందు సూర్యుడు కనిపిస్తున్నప్పుడు, సూర్యుడు ఉన్నాడని చూపడానికి ఏం సాక్ష్యం చూపిస్తారు? ఎలాగైతే సూర్యుడు ఉన్నాడనటానికి సూర్యుడే ప్రమాణమో, ఇంకో సాక్ష్యమవసరంలేదో, అలాగే వేదానికి కూడా మరొక ప్రమాణం అవసరంలేదు. వేదంలో ఫలానా విషయాలు చెప్పబడ్డాయి, మాకు వాటి మీద నమ్మకం లేదు అనుకుంటే, పరిశోధన చేయండి, ఫలితం వేదంలో ఎలా చెప్పబడిందో అదే కనిపిస్తుంది.

ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి కనుక సమమ్నాయము అని, ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య కనుక ఆమ్నాయము అని వేదానికి పేర్లు. వేదం అనే పదానికి ఆలోచన అనే అర్దముంది. మనిషిలో విచక్షణా జ్ఞానాన్ని, ఎదుగుదలను కలిగించేది ఆలోచనే. వేదం మానవునికి సత్, అసత్‌ల మధ్య ఉండే తేడాను వివరిస్తుంది.

వేదం అన్నమాటకు మరొక అర్దం 'ఉన్నది' అని, అంటే వేదం అస్తిత్వం గురించి చెప్తోంది. నేను, నేను అంటూ తరచు అంటుంటాం, ఆ నేను అనేది ఒక అస్తిత్వం. ఒక యంత్రాన్ని తయారు చేసి, దాన్ని శక్తి సాయంతో నడిపించవచ్చు, కానీ యంత్రానికి అస్తిత్వభావన ఇవ్వలేము. మన ఇంట్లో ఉన్న కంప్యూటర్‌నే తీసుకోండి. కంప్యూటర్ అద్భుతంగా పని చేస్తుంది కానీ నేనీ పని చేస్తున్నాను అనలేదు, దానికి నేను అనే భావన కలగదు, కలగలేదు, అది లెక్కలే చేస్తుందో, వాతవరణాన్ని అంచనా వేస్తుందో, అదంతా తర్వాతి మాట. దానికి అహం భావం లేదు. నేను అనేది అస్తిత్వం. ఆ అస్తిత్వం గురించి తొలుతగాను, విపులంగాను వేదం చెప్పింది. అందుకే భారతీయ ధర్మశాస్త్రం ఒక మాట అంటుంది. ఎవరు నాస్తికులు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరు వేదాన్ని విశ్వసించరో, వారే నాస్తికులు. ఇతర మతాల్లో దేవుడిని విశ్వసించనివారు నాస్తికులు అనబడతారు. ఇదే మనకి, వాళ్ళకీ ఉన్న ఒక పెద్ద తేడా. నేను వేదాన్ని నమ్మనండి, గీత, రామాయణం, పురాణాలే నమ్ముతాను అంటే ఋషులు ఒప్పుకోలేదు. నువ్వు వేదాన్ని నమ్ముతావా? నమ్మితే ఆస్తికుడివి, నమ్మకపోతే నాస్తికుడివి అంటుంది ధర్మం.

దేవుడు కళ్ళకి కనిపించడు, కానీ ఉన్నాడు. ఆయనను చూడలేదు కనుక ఉన్నాడని గట్టి విశ్వాసం చూసేవరకు కలగదు . కానీ ఆయనిచ్చిన వేదం ఉంది. కనిపించే స్థూలప్రపంచంలో ఉన్నవన్నీ వేదంలో చెప్పబడ్డట్టుగానే ఉన్నాయి, తర్కానికి (Logic) వేదం నిలుస్తుంది, అందులో చెప్పబడ్డ విషయాలు తార్కికంగా (Logical) ఉంటాయి. కళ్ళకు కనిపించేవన్నీ చెప్తున్నప్పుడు, దాన్ని నేను నమ్మను అనడం అస్తిత్వాన్ని నమ్మకపోవడమే అవుతుంది. అందుకే వేదాన్ని విశ్వసించనివారు, అంగీకరించనివారు నాస్తికులు అన్నారు శాస్త్రకారులు.

To be continued ..................

Thursday, 18 December 2014

హిందూ ధర్మం - 114 (వేదం)

విశ్వనియమాలను ఎవరు మాత్రం రచించగలరు, ఒక భగవంతుడు తప్ప. ఉదాహరణకు సూర్యుడి చుట్టు భూమి తిరగాలని ఎవరు నిర్ణయించలేరు, ఒక వేళ అలా చెప్పినా జరగదు. ఎందుకంటే అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అలాగే వేదం కూడా అనంతమైన జ్ఞానం, విశ్వనియమాల సమాహరం, దైవీజ్ఞానం. దాన్ని ఏ మానవుడు రచించలేదు, అందుకనే వేదానికి అపౌరుషేయము అని పేరు. అనగా మానవుల చేత రచింపబడనిది అని అర్దం.

సృష్టి ఆదిలో వేదాన్ని ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్న ఋషులు స్వరయుక్తంగా తొలిసారిగా దర్శించారు. భగవంతుడు వాళ్ళకి ఈ అపారమైన వేదరాశిని స్వరయుక్తంగా వినిపించాడు. వినబడినది కనుక వేదానికి 'శృతి' అనిపేరు. వేదాలను దర్శించిన ఋషులను మంత్రద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే చూసేవాడు. ఋషులు భగవత్ప్రసాదమైన, పరమేశ్వర వాణి అయిన వేదాలను చూశారు కనుక వారు మంత్రద్రష్టలే కానీ మంత్రకర్తలు కారు, వారు ఏ మంత్రాన్ని రాయలేదు. ఈశ్వరుడిచ్చిన మంత్రాలనే లోకానికి అందించారు. అందుకే ఋషులను ఆంగ్లంలో seers (one who see) అంటారు. మనకున్న ఋషులందరూ మంత్రద్రష్టలే. మరొక విషయం సృష్టి ఆది అన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న సృష్టిగా భావన చేయాలి. సముద్రపు అలలపై వచ్చే నురుగులో కొన్ని వందల నీటి బుడగలు పుట్టి, నశించిపోయిన రీతిలోనే భగవంతుని అనంతమైన సృష్టిలో ప్రతి క్షణం కొన్ని వందల విశ్వాలు ఉద్భవిస్తుంటాయి, ఆయనలో లీనమవుంటాయని సనాతన ధర్మం చెప్తుంది. వాటికి ఆద్యంతాలు ఎవరు చెప్పలేదు. దీనిని ఆధునిక సైన్సు కూడా అంగీకరిస్తుంది. మనకు ఈ యొక్క విశ్వమే కనిపిస్తున్నా, దానికి ఆవల కొన్నిలక్షల పాలపుంతలు, విశ్వాలు ఉన్నాయని, కొత్త విశ్వాలు ఉద్భవిస్తుంటాయని, కొన్ని నశించిపోతుంటాయని, ఇది ప్రకృతి యొక్క లక్షణమని అంగీకరిస్తుంది. దీనినే వేల సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పారు.

భగవంతుడి యొక్క ఉఛ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం. అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది. గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని, నేర్చుకునేది కాదు. ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్దాలు మారిపోతాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు మాహా విపత్తులకు దారి తీస్తుంది. అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. ఆ సంప్రదాయం చేత వేదానికి అనుశ్రవం అని పేరు.    

To be continued .................

Wednesday, 17 December 2014

హిందూ ధర్మం - 113 (వేదం)

వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది. 

అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.

చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.             

To be continued ...............

Tuesday, 16 December 2014

హిందూ ధర్మం - 112

మానవజాతి వికాసానికి, ఆలోచనకు స్వేచ్ఛనిచ్చి అభివృద్ధికి బాటలు వేసింది సనాతన ధర్మం. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అంటుంది ఋగ్ వేదం. అంటే మంచి ఆలోచనలు, భావనలు, సంకల్పాలు అన్ని దిశల నుంచి మాపై ప్రసరించుగాకా అని అర్దం. నిత్యం నూతనమైన విషయాలు తెలుసుకోవాలని వేదం చెప్తోంది. మానవపతనం ఎప్పుడు మొదలవుతుంది లేక మానవ వికాసం ఎప్పుడు కుంటుపడుతుందని ప్రశ్నిస్తే, దానికి ఒకటే జవాబు దొరుకుతుంది. ఎప్పుడు మనిషి ఆలోచనలకు అడ్డంకి కలుగుతుందో, ఆ క్షణమే మానవ వికాసం కుంటుపడుతుంది. గత చరిత్ర గమనిస్తే ప్రపంచమంతా అదే జరిగింది, కానీ దానికి భారత్ భిన్నం. ఈ దేశంలో రాజులు నూతన ఆవిష్కరణలు చేసినవారికి బహుమానాలు ఇచ్చారు, సత్కారాలు, సన్మానాలు చేశారు, బిరుదిలిచ్చి గౌరవించారు. మానవజాతి పురోగమనం కోసం పండితులతో నిత్యం శాస్త్ర చర్చలు నిర్వహించారు. ఒకే విషయంపై వందల మంది పరిశోధనలు చేశారు. ఫలితంగా సైన్సు పురాతన భారతదేశంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. క్రీస్తు పుట్టకముందే ప్రపంచం మొత్తం నుంచి వేలమంది విద్యార్ధులు వచ్చి భారతదేశంలో విద్యను అభ్యసించారు. నలందా, తక్షశిలా ఇందుకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు.

ఉదాహరణకు జ్యోతిష్యం తీసుకుంటే జ్యోతిష్యం మీద భృగుమహర్షి అద్భుతమైన గ్రంధం రాశారు భృగు సంహిత అన్న పేరుతో, భృగు మహర్షి అందించారని పరాశర మహర్షి ఆగిపోలేదు, వారు మరింత పరిశోధించి వారొక జ్యోతిష్య గ్రంధం రాశారు. ఇది ఎప్పుడో 5000 ఏళ్ళ క్రితం జరిగినది. ఆ తర్వాత అనేకమంది ఇంకా ఇంకా కొత్త విషయాలతో మళ్ళీ గ్రంధాలు రాశారు. ఎక్కడ పాతవి ఖండించబడలేదు, పురాతన గ్రంధాలను, వాటి రచయితలను మెచ్చుకుంటూనే నూతన విషయాలు ప్రస్తావించారు. అలా చూసుకుంటే మిహురుడు బృహజ్జాతకం అనే అపూర్వమైన గ్రంధం అందించారు. మిహురుడు విక్రమాదిత్యుని ఆస్థానంలో పండితుడు, విక్రమాదిత్యుడికి కొడుకు పుట్టినప్పుడు, ఆ పిల్లవాడు 13 వ ఏట పంది కారణంగా మరణిస్తాడని మిహ్రుడు చెప్తాడు, అదే జరిగింది. అయినా విక్రమాదిత్యుడు కోపించకుండా, శాస్త్రం అభివృద్ధి చెందాలని మిహురిడికి కావలసిన సదుపాయాలు కల్పించి, జ్యోతిష్యం మీద మరింత పరిశోధన చేయమంటాడు. అలా వరాహమిహురుడు అద్భుతమైన గ్రంధం లోకానికి ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా అనేకులు పరిశోధన చేసి, మరిన్ని విషయాలు చెప్పారు. ఆధునిక కాలంలో గత 500-600 ఏళ్ళ క్రితం శ్రీ మాధవ విద్యారణ్య భారతీ స్వామివారి కూడా జ్యోతిష్యం గురించి చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఒకరు ఇస్తే సరిపోదా, ఇంతమంది ఇవ్వాలా అంటే జ్ఞానం అపారమైనది, దానికి అంతు లేదు. ఇది ఇంతవరకే అని చెప్పే అవకాశం చాలా తక్కువ. ఇది భారతీయులకు అర్దమైంది. అందుకే ప్రతి విషయంపై లోతైన పరిశోధన చేశారు. అందుకే శాస్త్రాలు విస్తరించాయి. దానికి మూలం వేదంలో ఉంది.

To be continued ....................

Monday, 15 December 2014

హిందూ ధర్మం - 111

ఆలోచనలకు, ప్రశ్నలకు, సిద్దాంతాలకు స్వేచ్చనిచ్చే లక్షణమే సనాతనధర్మాన్ని ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. ఇతరమతాలన్నీ తమ పవిత్రగ్రంధంలో చెప్పినదే నిజమని, అందుకు భిన్నంగా ఏది చెప్పినా, అది అబద్దమని, దైవదూషణ క్రిందకు వస్తుందని, అటువంటి కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదన చేసినవారు పాపులని, నరకానికి పోతారని, వారిని దుష్టశక్తులు ఆవరించాయని, అటువంటి మతవ్యతిరేక సిద్ధాంతాలు ప్రతిపాదించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని బోధించాయి. గత 300 సంవత్సరాల క్రితం వరకు పాశ్చాత్య ప్రపంచం అదే చేసింది. భారతీయ మతగ్రంధాలు తప్పించి, మిగితా మతాలన్నీ భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పాయి. క్రైస్తవము, చర్చి కూడా అదే బోధించింది. అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, నస్త్రాలకు చలనం లేదని, అవి స్థిరంగా ఉంటాయని, భూమి గోళాకారంగా కాకుండా బల్లపరుపుగా ఉంటుందని, ఈ భూమిని భగవంతుడు బలమైన పునాదుల మీద స్థిరంగా నిలిపాడని, సూర్యోదయం, సూర్యాస్తమయం అయ్యాక సూర్యుడు తనకు నిర్ధారించబడిన ప్రదేశానికి వెళ్ళిపోతాడని చెప్పసాగారు. ఇది మొత్తం ప్రపంచం, ఈనాటి అధునిక యూరోప్ కూడా అంగీకరిస్తుంది. సోక్రటీస్ అయితే మరింత ముందుకువెళ్ళి భూమి చుట్టు సూర్యుడేంటి, మొత్తం విశ్వమే తిరుగుతోందని ప్రతిపాదన  చేశారు. స్థూలంగా భూకేంద్రక సిద్ధాంతాన్ని(Geo-centric theory) ప్రతిపాదన చేశారు.

దాదాపు అందరూ అదే చదివారు ఒక 200 ఏళ్ళ క్రితం వరకు ఆ దేశాల్లో. నికోలస్ కాపర్నికస్, గెలిలియో మొదలైనవారు సంప్రదాయబోధనలకు భిన్నంగా సూర్యుడు చుట్టు భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని (Helio-centric theory) ప్రతిపాదించారు. ఇది మతగ్రంధ బోధనకు వ్యతిరేకంగా ఉందని చర్చివ్యవస్థ వీరిని చాలా ఇబ్బందులు పెట్టింది. కాపర్నికస్ తన సిద్ధాంత ప్రతిపాదన చేసిన తర్వాత  కొద్దికాలానికే చనిపొయాడు. గెలిలియోను మాత్రం చాలా ఇబ్బందులు పెట్టారు, ఆయన సిద్ధంతామ బూటకం అని ఒప్పుకోమన్నారు, అతని రచనలపై నిషేధం విధించారు, అతను దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు చర్చి ఆదేశాల మేరకు గృహనిర్బంధం చేసారు. గెలిలియో మరణం వరకు గృహనిర్బంధంలోనే ఉన్నాడు. ఇది జరిగి ఒక 300 ఏళ్ళు గడిచాకా, 1992 లో అతని పట్ల చేసిన అపరాధానికి చర్చి బాధ వ్యక్తం చేసింది. కానీ అప్పటికి అనేకమార్లు భూకేంద్రసిద్ధంతాం తప్పని సాక్ష్యాలతో సహా ప్రపంచానికి తెలిపోయింది, పుస్తకాల్లో పిల్లలు చదువుకోవడం కూడా జరిగింది. మనం ఒకసారి సైన్సు అభివృద్ధి గురించి పాశ్చాత్య దేశాల చరిత్రలో చూసినప్పుడు ఇలాంటి అనేకానేక సంఘటనలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక చిన్న ఉదాహరణ మత్రామే. అందుకే ఆయాదేశాల్లో మతాలు మానవజాతి అభివృద్ధికి అడ్డకింగా మారాయి. కానీ దీనికి పూర్తి భిన్నం వేదం, వేదం నుంచి వచ్చిన సనాతనధర్మం.

(నమ్మకపోతే ఆ శాస్త్రవేత్తల పట్ల ప్రదర్శించిన తీరును ఈ వెబ్‌సైట్‌లో కానీ, లేదా మీరే గూగుల్ చేసి చూడవచ్చు.
http://freethinker.co.uk/2010/05/25/a-little-late-catholics-make-it-up-to-copernicus-and-bury-him-a-hero/ )

To be continued .................

Sunday, 14 December 2014

హిందూ ధర్మం - 110 (వేదం)

హిందువులకు ధర్మం విషయంలో ఏదైనా సంశయం వచ్చినా, ఒక పని ఎలా చేయాలనే సందేహం కలిగినా, దేని నుంచి సందేహం నివృత్తి చెసుకోవాలనే అనుమానం వస్తుంది. పురాణాలు, శాస్త్రాలు మొదలైనవి అనేకం ఉన్నా, అన్నిటికి మూలం వేదం. అనేక చోట్ల పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు శాస్త్రంలో ఉండవచ్చు, అటువంటి సమయంలో వేదం దేన్ని అంగీకరిస్తుందో, దాన్నే హిందువులు ప్రామాణికంగా తీసుకోవాలి. వేద విరుద్ధమైనది ఆచరణయోగ్యం కాదు. వేదమే సనాతన ధర్మానికి ప్రామాణికం. సమస్త సృష్టికి మూలం వేదం. వేదమంటే ఒక గ్రంధం కాదు.

వేదం సమస్త జ్ఞానబాంఢాగారం. వేదంలో లేనేదేది సృష్టిలో లేదు, ఉండదు కూడా. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు కూడా వేదాన్ని అనుసరించే సృష్టి చేస్తాడు, వేదం నుంచే సమస్త కర్మలు, యజ్ఞాయాగాది క్రతువులు, వ్యవసాయం మొదలుకుని చెప్పులు కుట్టడం, వస్త్రాలు నెయ్యడం, కుండలు చేయడం వరకు, ప్రకృతి, సాంకేతిక పరిజ్ఞానం, ఖగోళ, అంతరిక్ష, భౌతిక, రసాయన, జీవ, ధాతు, ఆయుర్వేద, మంత్ర, తంత్ర, యంత్ర, గణిత, నిర్మాణ, వైద్య శాస్త్రాలు, ఇంకా అనేకం ఉద్భవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికి మూలం వేదం, అందుకే శాస్త్రం 'వేదోఖిలం జగన్మూలం' అని చెప్పింది. ఈ వేదంలో చెప్పబడనటువంటిదేదీ లోకంలో కనిపించదు, అది ఆధునిక పరిజ్ఞానమైనా సరే. ఈ రోజు కనుగొనబడనివి, ఇంకా 1000 ఏళ్ళ తర్వాత కూడా కనుగొనడం కష్టంగా భావించే అనేకానేక విషయాలు వేదంలో ప్రస్తావించబడ్డాయి. వేదం ప్రధానంగా రెండిటి గురించి చెప్తుంది. ఒకటి ప్రకృతి/ పదార్ధం (Matter) అయితే రెండవది ఆత్మతత్వం(Spirit), ఇది అగోచరమైనది. పదార్ధజ్ఞానంలో అణువుల (Atom) నుంచి విశ్వాంతరాళం వరకు అనేకానేక విషయాలు చెప్పబడ్డా అవి వేదంలో బీజ రూపంలో ఉంటాయి. బీజ రూపంలో అంటే చదివి తెలుసుకునేందుకు వీలుగా, ప్రత్యక్షంగా కాదు. చదివి, ఆలోచించి, అర్దం చేసుకుని, పరిశోధించి కనుగొనె విధంగా అన్నమాట.

ఇలా బీజరూపంలో విశ్వానికి సంబంధించిన విషయాలు చెప్పి మనిషి ఆలోచించడానికి, ఎదగడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఇస్తుంది వేదం. అన్నీ భగవంతుండే వ్యక్తపరిస్తే ఇక మానవుడికి మేధస్సు ఇవ్వడం ఎందుకు, మెదడు అనేది అవసరమే ఉండదు. అందుకే మానవ ఆలోచనకు వేదం పూర్తి స్వేఛ్ఛనిస్తుంది. మనిషి ఆలోచినాలి, నిత్యం కొత్తవి కనుగొనాలంటుంది వేదం. ఇదే ఇతర మతాలను సనాతనధర్మం నుంచి వేరు చేస్తుంది.      

To be continued .............

Rajiv Malhotra - Secularism and Dharma

Rajiv Malhotra asnwers to question on 'Secularism and Dharma'
-------------------------------
Transcript of the Video (link provided below in the end)

Question asked: Is it unreasonable to define India as 'Hindu Rashtra' in modern times?

Rajiv Malhotra answers:
So, in this book being different, I would like you to read a chapter on 'Secularism and Dharma'. I will give you a synopsis. Secularism is a Western concept, to solve a western problem. Those of you who have a sense of Medicine, know that you need to solve the disease, but you cannot put that solution where there is a different disease. The problem in Western Religion was the 'Exclusivity Claim', which means 'Only I am Right, others are Wrong', which is built into the western religion. Not only, the 'Religious claim' of the Church, that it is the ONLY bona-fide religion and others are not Valid, but also Science if it questions, has to be killed or persecuted, because even Science cannot have it own independent inquiry.

So, This was the state of European culture, European intellectual life for a long time. And a reformation to limit the powers of the church, because the church was asserting the Official powers (It had the Fatwa Power), the Bishops could announce Police authority, arrest people, kill people and they did that in Millions for a long period of time. So, Secularism was to curtail the excessive State Authority and State Power that the Church had, not only over the people who dissented and belong to some other religion, but also people who were Scientists.

In India, the Dharma never had a posture against scientific inquiry. The Raja never had authority to impose his dharma over others. Manu was very clear that Raja must practise his dharma, and he must allow others to practise their dharma. In fact, not only its theoretically the case, but in practise like, when the early Syrian Christians came, the Raja even gave them Land, so as when the Zoroastrians from Persia came to India, they were also given land to live and practice their religion. And Hinduism is not necessarily a one religion like in a western sense, it got a lot of claims within it, there are people who believe in different philosophies, there are people who are Atheists, which is also ok, you can be a Nastik.
So, there is a built-in 'Pluralism' within the Dharma has made it different than the built-in 'Exclusivity' in the Abrahamic religions. And I explained (in book being different) why exclusivity is built-in abrahamic religions, because of the historical prophets being exclusive, and One prophet has to be Right and others have to be Wrong. I gave it a term 'History Centricism'.

Now, If the Dharma has a built-in pluralism (Sapeksha Dharma) which means inclusive of all the dharmas. Sufis can have their dharma, Muslims can have their dharmas, as long as you also Respect others to have their dharma. I explained this in the first chapter of my book 'being different' that We can have difference with 'Mutual respect'.
Mutual respect means I respect you for being different but, I want you to respect me also. Its NOT a one way, that I respect you and you can disrespect me. No, we BOTH have to respect each other. This is a very deep principle in Dharma.

So, rather than Secularism, which was a solution to a problem that Europeans had, which was NOT a problem we had. Because, we never persecuted scientists and beheaded them like they did with Galileo, Copernicus and these kind of people. We never said that if your scientific conclusion is different then you are disobedient and its a blasphemy. We never had any blasphemy law kind of things. So, free thinking was there always.

So, rather than Secularism as a Solution to our situation, there is a idea of 'Pluralism', built into the Dharma itself. Lot of Indians believe that Secularism is a Gold standard because they have been brainwashed. They don't even think what it is, where it came from, what does it do. They are just taught that way and they have learnt it from childhood and parroted saying ain't we Seculars, this and that.

So, this is to understand that Secularism is a Western idea to be able to create a space with different religions can be tolerated and science can be tolerated, We have a different idea that is 'Sapeksha Dharma' which also gives you pluralism in our own way.

As far as would India be a Hindu society, I use the term Dharmic Society. India is a Dharmic society and I do not use the word Hindu, because Dharma also includes Buddhists, Jains, Sikhs, it includes anyone which complies with the basic principles like Mutual respect.
So, the people who themselves want to be called as Hindus are fine, or something else are also fine. But, if you use Dharma, then Yes, Indian civilization is a Dharmic Civilization. This is my position.

Question - So, you would mean to say that the alternative name to be ask for India to be named as a Dharmic Nation.

Rajiv replies- Yes, as it would be very strange for someone to say 'I do not want to be Dharmic' unless he is a Corrupt person. Imagine, the person in the Government saying, I am Non-Dharmic. This would suggest that he is a corrupt guy. So, I think it would be very difficult for someone to reject Dharma, no matter who they are, because basic ethics, basic responsibility, basic life-style of respecting yourself, your family, your community, animals, nature, society, the world, the environment are all part of Dharma. Dharma is not just religion between me and God, it is all encompassing human ethics and responsibility.
-------------------------------------

Saturday, 13 December 2014

హిందూ ధర్మం - 109 (వేదం)

ఓం

ఇంతకముందు హిందూ ధర్మం అనే శీర్షిక మీద దాదాపు రోజుకొక పోస్ట్ అందించాను కానీ ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన పనులవల్ల, సమాయాభవం వలన మధ్యలోనే ఆపేశాను. తర్వాత తిరిగి కొనసాగిద్దామని ఎంత ఆశించినా, కొన్ని అనివార్య కారణల వల్ల కుదరలేదు. అయితే భగవదాశీర్వాదంతో ఇప్పుడు తిరిగి కొనసాగిద్దామని భావిస్తున్నా.రోజు క్రమం తప్పకుండా ఒక పోస్ట్ అందించగలనని చెప్పలేను కానీ సాధ్యమైనతవరకు రోజు అందించే ప్రయత్నం మాత్రం చేయగలను. ఇంతకముందు అందించిన పోస్ట్‌లు బ్లాగులో ధర్మం అనే లేబుల్ క్రింద ఉన్నాయి. అప్పుడు చూడనివారు ఆసక్తి ఉంటే చూడగలరు.

హిందూ ధర్మం - 109

ఈ సనాతన/ భారతీయ/ హిందూ ధర్మానికి పునాది వేదం/ శ్రుతి, స్మృతులు గోడలు, ఇతిహాస పురాణలు ముట్టుగోడలు అంటారు స్వామి శివానంద సరస్వతీ. సనాతన ధర్మానికి మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం.

వేదం అనే పదం విద్ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవలసినది అని అర్దం. వేదం విశ్వమానవాళికి భగవంతుడు ప్రసాదించిన అద్భుత జ్ఞానభాంఢాగారం. వేదం కేవలం బ్రాహ్మణులకు, అందులో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దీనినే యజుర్వేదంలో భగవంతుడే స్పష్టం చేశాడు.

యధేమాం వాచం కల్యాణిమావదాని జనేభ్యః |
బ్రహ్మరాజనాభ్య శూద్రాయచర్యాచ స్వాయ చరణాయచ ||
(యజుర్వేదం 26-2)

ఎట్లు నేను మనుష్యులందరికి కొరకు, ఈ సంసారసుఖమును, ముక్తిసుఖమును ఇచ్చినట్టు, ఈ వాణిని (వేదాన్ని) ఉపదేశించుచున్నానో, అట్లే మీరు కూడా చేయవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రుల కొరకు, వారి బృత్యుల కొరకు, స్త్రీల కొరకు, అతిశూద్రుల కొరకు, సమస్త మానవాళికి వేదమును ప్రకాశపరిచితిని. అనగా మానవలందరూ వేదములను చదివి, చదివించి, విని, వినిపించి, విజ్ఞానమును వృద్ధి పరచుకుని, దుఃఖముల నుండి దూరమై, ఆనందమును పొందుగాకా అని సృష్టి ఆరంభంలో పరమాత్మ ఆదేశించారు. అందువల్ల వేదసారాన్ని అందరూ తెలుసుకోవాలి. భావాన్ని, వేదవాక్కుల అర్ధాలను, విజ్ఞానాన్నితెలుసుకోవడంలో అడ్డంకులు ఎవరికి లేవు. కాకపోతే, శ్రద్ధ కలిగి తెలుసుకోవాలి. కానీ చదవాలంటే మాత్రం గురువు వద్ద శ్రద్ధగా 12 ఏళ్ళు అభ్యాసం చేసిన తర్వాతే స్వరయుక్తంగా నిర్ణీత సమయంలో దేశకాలాలను అనుసరించి చదవాలి.

To be continued .................

Friday, 12 December 2014

జగన్మాత

పిల్లలు తండ్రి కంటే తల్లితో చనువుగా ఉంటారు. సున్నితత్వం, ఆప్యాయత మరియు ప్రేమ మూర్తీభవించిన అవతారం అమ్మ. ఆమె పిల్లల వెంటబడి వారి కోరికలను తీరుస్తుంది. ఏదైనా అవసరమైతే బిడ్డ తండ్రిని కాకుండా తల్లినే ఆశ్రయిస్తాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా, సాధకుడు తండ్రి అయిన శివుడి కంటే అమ్మ కాళీనే ఆశ్రయిస్తాడు. శివుడు బాహ్యప్రపంచానికి సంబంధంలేకుండా, అన్ని బంధాలకు అతీతంగా కళ్ళు మూసుకుని సమాధిలో ఉంటాడు. నిజానికి ఈ లోకం యొక్క అవసరాలను చూసేది జగన్మాతనే. భక్తుని యొక్క ఆచరణ, నిష్ఠ, తపన, శ్రద్ధ గమనించిన అమ్మ, సాధకుడి శాశ్వత విముక్తి కోసం తండ్రి శివుడు వద్దకు పంపిస్తుంది.

శివశక్తులు విడదీయరానివారు. అందుకే శివపార్వతులను అర్ధనారీశ్వరులుగా చూప్సితారు. కుడిభాగంలో శివుడు, ఎడమభాగంలో పార్వతీదేవి ఉంటారు.

శివజ్ఞ్ఞానమే మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. జననమరణాల నుంచి స్వాతంత్రాన్ని ఇస్తుంది. అదే మనకు జీవిత పరమార్ధాన్ని చూపిస్తుంది. అది ఊహకు అతీతమైనది. అదే పరమశివుడి మూడవనేత్రం కూడా. ఈ మూడవనేత్రం కోరికలను, భ్రమలను, బంధాలను నాశనం చేస్తుంది.

శక్తిని వివిధరూపాలుగా ఆరాధిస్తారు. విద్యకు అధిదేవత సరస్వతీ, సంపదలకు అధిదేవత లక్ష్మీ, ఆనందాన్నిచ్చే రూపం పార్వతీ. ఆవిడే ఉమాదేవి.

మార్కండేయపురాణంలో 700 శ్లోకాలతో చండీ సప్తశతి ఉంది. దీనిని దేవి మహత్యం అని కూడా అంటారు. ఇది హిందువులకు చాలా ముఖ్యమైనది, భగవద్గీతకు సమానమైనది. ఈ సప్తశతి అన్యార్ధరూపంలో మనకు మోక్షానికి ప్రధాన అడ్డంకులైన కామ, క్రోధం, దురాశ, అజ్ఞానాలను వివరిస్తుంది. అమ్మను పరిపూర్ణమైన భక్తితో పూజిస్తే మనం వీటిని అమ్మ దయతో అధిగమించవచ్చు.

ఈ పుస్తకం మాత యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి - తామసిక, రాజసిక మరియు సాత్విక అంశలను గురించి ఒక అందమైన వివరణ ఇస్తుంది.  

దేవతలు అసురుల ద్వారా హింసింపబడ్డ సమయంలో వారు అమ్మను ప్రార్ధించారు. అమ్మ పైమూడు రూపాల్లో అవతరించి, అసురులను నాశనం చేసి దేవతలను కాపాడింది. ఎప్పుడెప్పుడు ప్రజలు, దేవతలు ఆపదలో ఉంటారో అప్పుడప్పుడు నేను అవతరించి మిమ్మల్ని రక్షిస్తాను అని ఖచ్చితమైన మరియు అమోఘమైన వాగ్ధానాన్ని మన అమ్మ జగన్మాత చేసింది.

అటువంటి కాళీ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండుగాకా.

- స్వామి శివానంద

(మిత్రుల కోరిక మేరకు ఆంగ్లంలో ఉన్నది అనువదించడం జరిగింది. గమనించగలరు. అసలు మూలం ఆంగ్లంలో ఉంది.)

The Divine Mother

Children are more familiar with the mother than with the father. Mother is an embodiment of affection, tenderness and love. She looks after the wants of the children. Whenever a child wants anything it approaches the mother rather than the father. In spiritual matters also the aspirant has more concern with Mother Kali than Father Siva. Siva is indifferent to the external world. He is unattached. He is lost in Samadhi with His eyes closed. It is Sakti or the Divine Mother alone who really looks after the affairs of the world. She will introduce to Her Lord for the attainment of final emancipation when She is pleased with the earnestness of the devotee.

Siva and Sakti are inseparable. This is shown in Ardhanarisvara—Siva and Parvati (with one body, half-male and half-female). Lord Siva has Parvati as the left half of His body.

Siva-Jnana leads us on to the realisation of Self and bestows on us eternal bliss and frees us from births and deaths. It shows us the light of life. It is the eye of intuition. It is the third eye of Siva. This third eye destroys all illusions and passions.

Sakti is thought of in various forms. Sarasvati is the Goddess of learning. Lakshmi is the Goddess of wealth. Parvati or Uma is the bliss-bestowing Goddess.

The Markandeya Purana contains seven hundred verses which are known as the Sapta-sati or the Chandi or the Devi-Mahatmya. It is one of the most famous religious texts of the Hindus. It ranks almost equal with the Gita. It describes in an allegorical form, that in the path of salvation the chief obstacles are our own desire, anger, greed and ignorance and we can overcome them through the grace of Divine Mother if we sincerely worship Her.

The book gives a beautiful description of the three aspects of the Mother as Mahakali, Mahalakshmi and Maha Sarasvati—the Tamasic, the Rajasic and the Sattvic aspects of the Divine Mother.

The Devas were oppressed by the Asuras. The gods invoked the blessings of Divine Mother. She appeared as the above three forms and destroyed the Asuras and protected the gods. The Divine Mother has given men as well as gods, Her definite and infallible promise that whenever they would remember Her in danger or difficulties She would save them.

- Swami Sivananda in his book Lord Siva and His Worship
Om namah Sivaya

Thursday, 11 December 2014

జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం - రెండు ఉదాహరణలు

జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం... దానికి ఒక రెండు ఉదాహరణలు చెపుతా... ఒకటి, టిప్పు సుల్తాన్ ఒక సారి మన జ్యోతిష్య శాస్త్రాలు తప్పు అని నిరూపించడానికి ఆయన దగ్గర్‌కు వచ్చిన ఒక జ్యోతిష్యూని కి ఒక పరీక్ష పెట్టాడు.. ఒక చేతిలో పంజరం లో ఉన్న చిలుక ను రెండో చేతిలో కట్టి పట్టుకుని.. "ఇప్పుడు నేను ఈ చిలకను నేను ఛంపుతానా లేక వదిలేస్తానా?" అని అడిగాడు. టిప్పు ఉధేశ్యం ఏంటంటే... జ్యోతిష్యూని చెప్పిన దానికి వ్యతిరేకం గా చేసి జ్యోతిష్యం తప్పు అని నిరూపించాలి.. ఆ విషయం జ్యోతిష్యూనికి అర్థం అయింది వెంటనే ఒక కాగితం తీసుకుని దానిలో రాసి మడత పెట్టి చెప్పాడు.."రాజా నేను దాని భవిష్యత్తు రాశాను మీరు కానీయండి" అని. టిప్పు ఆ చిలుకను పంజరం తెరిచి ఛంపబోయాడు.. కానీ ఆది.. టిప్పూ చేతిని గట్టిగా కరిచి ఎగిరి పోయింది. వెంటనే రాజు ఆ కాగితం తెరిచి చూసాడు...ఎం జరిగిందో అదే స్పష్టం గా రాయబడింది.
అప్పుడు ‪#‎జ్యోతిష్యుడు‬ చెప్పాడు.."నువ్వు కూడా ఈ చిలక లాగానే నిస్సహయ స్థితిలో ఆంగ్లేయుల చేతిలో చనిపోతావు " అని.

రెండో ఉదాహరణ : మిహిరుడు.. కానీ ఆయన వరహా మిహిరుడు అనే పేరుతో ప్రసిద్ధి............
ఆ పేరు రావడానికి కారణం కూడా ఆయన జ్యోతిష్యంలో నిపుణత ఆది నిరూపించిన సందర్భం.
విక్రమదిత్యుని కొలువులో ఉండేవాడు ఈయన... రాజు గారికి కొడుకు పుట్టిన సందర్భం లో కొడుకు భవిష్యత్తు ను రాయమని ‪#‎జ్యోతిశ్శాస్త్ర‬ పండితుల్ని కోరాడు... అందరు... ఆ బాలుడు కి ఉజ్వల భవిష్యత్తు అని రాశారు... కానీ మిహిరుడు మాత్రం... ఆ బాలుని 13 వ ఏట వరాహాం(పంది) వలన మరణం సంభవిస్తుంది అని చెప్పాడు...రాజా గారికి కోపం వచ్చింది...మిహిరుడిని తీవ్రంగా ధూషించాడు...ఆలా ఏళ్లు గడిచాయి... రాజు గారికి ఏదో ఒక మూల మిహిరుని శాస్త్రం మీద నమ్మకం ఉంది అందుకే ఆ బాలుడి ని పంది అనేది తెలియని వాతావరణం లో పెంచాడు......13 ఏడు వచ్చింది పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని.. మందిరంలో బాలుడు నిద్ర పోయాడు...తెల్లవారక చూస్తే బాలుడు విగత జీవుడై ఉన్నాడు...అతని గుండెల్లో పంది విగ్రహం గుచ్చుకుని ఉంది.........కారణం ఎంటంటే..ఆ మంచానికి నాలు వైపులా పైన వరహా విగ్రహాలు ఉన్నాయి..ఒకటి విరిగి పడి ప్రాణం తీసింది...పంది విగ్రహాలు ఎందుకున్నాయి అంటే... విక్రమాధిత్యుని రాజ్య చిహ్నం "వరాహాం".
ఆ సంఘటన జరిగాక.. రాజు పుత్రశోకం దిగమింగి, మిహిరుడిని పిలిచి సన్మానం చేసి, జ్యోతిష్య శాస్త్రాన్ని అభివృద్ది చెయ్యమని కోరాడు.
అందుకే మిహిరుని పేరు అప్పటి నుండి వరహా మిహూరుడి గా మారింది.

Source - Sekhar Reddy

Wednesday, 10 December 2014

ఇంటర్‌వ్యూలో సహయం చేసిన వినాయకుడు

ఇంటర్‌వ్యూలో సహయం చేసి నా జీవితంలో అభివృద్ధికి బాటలు వేసిన వినాయకుడు.

నా పేరు కమలా గార్నెయు, కెనాడలో ఉంటున్నా. నా డిగ్రీ చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకి సంబంధించి నేను ఒక ముఖ్యమైన ఇంటర్‌వ్యూను ఎదురుకోవలసి వచ్చింది. తేదీ దగ్గరకు వచ్చేసరికి ఆలయానికి వెళ్ళి, కాసేపు కూర్చుని గణపతిని ప్రార్ధించాను. రెండు వారాలాపాటు రోజు నిన్ను చూడటమే ధ్యేయంగా నీ గుడికి వస్తానని, ఆ తర్వాత కూడా ప్రయత్నిస్తానని, నా దారిలో ఉన్న అడ్డంకులు తొలగించి, నాకు విజయం ప్రసాదించమని, ఇంటర్‌వ్యూలో విజయం పొంది ప్రోగ్రాంకు ఎంపికవ్వాలని గణపతిని కోరాను. మరునాటి నుంచి రోజు ఉదయమే లేచి పూజ కోసం గణపతి ఆలయాన్ని సందర్శించాను. ఇంతలో #ఇంటర్‌వ్యూ తేదీ దగ్గర పడింది. ఇంటర్వ్యూ తేదీ రోజు నేను, నా కుటుంబం కలిసి తయారు చేసుకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలుసి ద్ధం చేసుకున్నాను. కాసేపటికి నేను బ్రష్ చేస్తున్న సమయంలో 3 కష్టమైన, అడిగే అవకాశంలేని ప్రశ్నలు నా మనసుకు స్పురించాయి. వాటికి సమాధానం చెప్పడం దాదాపు అసాధ్యం. వాటికి నేను సమాధానలు సిద్ధం చేసుకుని, ఇంటర్‌వ్యూకి వెళ్ళాను. ఆశ్చర్యంగా నేను నేర్చుకున్న ఆ 3 ప్రశ్నలే నన్ను ఇంటర్వ్యూలో అడగడం, నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు ముందే ప్రశ్నలు, సమాధానాలు చెప్పి నాకు ఇంటర్వ్యూలో విజయం ప్రసాదించిన గణపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన నాకు ఆ ప్రశ్నలు చెప్పడం వల్లనే
ఇంటర్‌షిప్ ప్రోగ్రాంకి ఎంపికయ్యాను. ఆ రాత్రి నేను గణపతి ఆలయానికి వెళ్ళి, ఆయనకు ప్రత్యేక ధయ్నవాదాలు చెప్పుకున్నాను. అటు తర్వాత నన్ను ఆ ప్రోగ్రాంలోకి తీసుకున్నారు. (ఈ వ్యక్తి జన్మతః హిందువు కాదు, కానీ ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు).

సేకరణ : హిందూయిజం టుడే
http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=1366

Saturday, 6 December 2014

దూరప్రయాణాలు - పూర్ణిమ, అమావాస్య, గ్రహణం

పూర్ణిమ, అమావాస్య రోజుల్లో, గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. చంద్రుడు మనః కారకుడు, పూర్ణిమ, అమావాస్య తిధుల్లో మనసు చంచలంగా, గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. గమనిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ ఈ తిధుల్లోనూ, మంగళవారం నాడు అధికంగా జరుగుతాయి. మనకు సూర్యోదయం ప్రధానం. వారం మొదలయ్యేది రాత్రి 12.00 గంటలకు కాదు, సూర్యోదయంతో, అలాగే ముగుసేది కూడా రాత్రి 12.00 కాదు, మరునాడు సూర్యోదయానికి ముగుస్తుంది. మనకు అర్ధరాత్రితో సంబంధంలేదు. సూర్యోదయంతోనే రోజును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని గమనించి చూడండి, అధికశాతం పూర్ణిమ, అమావాస్య, గ్రహణం, మంగళవారం ఘడియాల్లోనే జరిగాయి. రాత్రి సమయం, తెల్లవారుఝామున అధికంగా జరుగుతున్నాయి. నేను గత 3 ఏళ్ళ నుంచి గమనిస్తూనే ఉన్నాను. కనుక ఇటువంటి తిధుల్లో దూరప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే

ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదామ్‌ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ||
--------------------------------------------------------------------------------

జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః | అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||
భావం: నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!

అనే ఈ శ్లోకాన్ని జపించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ శ్లోకం నిత్యం ప్రయాణ సమయంలో జపించినా ప్రమాదాలు జరుగకుండా శ్రీ రాములావారు, హనుమంతులవారు రక్షగా ఉంటారు.

Tuesday, 2 December 2014

గీతా జయంతి

ఓం శ్రీ పరమాత్మనే నమః
గీతా జయంతి

ఈ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. 5151 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి రోజున గీతను అందించారు.  
భగవద్గీత - ప్రపంచమంతా గౌరవించే గ్రంధం.గీత అంటే మాట,వాక్కు .భగవంతుని వాక్కులే భగవద్గీత. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత.అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగాను, అర్జునుడిని దూడగాను మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లోకానికి పాలను (ఉపనిషత్ సారమైన గీతను) అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం.

కృష్ణుడంటాడు 'ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం .......' అని, అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్ధములకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు.

గీత చదివితే అర్దమవుతుంది పరమాత్మకు మనపై ఎంత ప్రేమ ఉందో. దురలవాట్లకు లోనైనా, నీచుడైనా, పతనమార్గంలో పయనిస్తున్నా, నన్ను నమ్మినవాడిని అసహ్యించుకోకండి. నన్ను నమ్మాడు కనుక ఉద్ధరించే బాధ్యత నాదే. నన్ను నమ్మినవారు ఎప్పటికి నాశనమవ్వరు. నేనే వారిని ఉద్ధరిస్తాను అంటూ అందరి పట్ల పరమత్మ తన ప్రేమను వ్యక్తం చేస్తారు.

భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు భగవానుడు. నిజమే ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.

గీత ఎవరు చదవాలి అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఒక్కటే. మనం లోకంలో చూస్తే ఎవరైన చనిపోతే భగవద్గీత పెడతారు.'ఆత్మశాంతి' కోసం పెట్టామంటారు. చేయాల్సినవన్ని చేసేశాక, జరగవలసినవన్ని జరిగిపోయాక, ఎంతో పుణ్యం చేస్తే కాని దొరకని మానవ జన్మ, మానవ శారీరం పోయాక అప్పుడు వింటే ఏం లాభం? అయినా అప్పుడు వినడానికేమంటుంది? శవం వినలేదుగా. బ్రతికున్నప్పుడే చదవాలి భగవద్గీత. తత్వం బోధపడాలి. అప్పుడే జన్మ చరితార్ధం అవుతుంది. మీకో విషయం తెలుసా? మన జీవితం మనమే రాసుకుంటాము. 12 నుండి 40 సంవత్సరముల మధ్య మనం ఏ ఏ కర్మలు (పనులు) చేస్తామో,అవి ఆ తరువాతి జీవితాన్ని నడిపిస్తాయి. ఈ 28 సంవత్సరముల కాలంలో మనిషికి ఎటువంటి కర్మలైన (అవి మంచివో, చెడ్డవో) చేసే అధికారముంది. ఆ తరువాత ఈ కర్మలను బట్టే మన జీవితం నడుస్తుంది. ఈ విషయాన్ని జ్యోతిష్యం ఒప్పుకుంది. చిన్నవయసులోనే భగవద్గీత చదివితే మనం జీవితం సుఖమయమవుతుంది, శాంతి లభిస్తుంది. మనం ఏమి చేయాలో, ఏలా చేయాలో అర్ధమవుతుంది. భగవద్గీతను యువత ఖచ్చితంగా చదవాలి.

ఇక అందరు అంటారు భగవద్గీత ఒక "మతగ్రంధం" అని. మనం ఇతర మతగ్రంధాలను చదివితే, అందులో ఇతర మతస్థులను ద్వేషించమని, చంపమని, వారు జంతువులకంటే హీనమని చాలా చాలా కనిపిస్తాయి. కాని గీతలో ఇటువంటి వాక్యాలు ఒక్కటి కూడా కనిపించవు. అందరిని ప్రేమించమని, అందరు ఒక్కటేనని, అంతా పరమాత్మ మయమేనని గీత అంటుంది. గీతను మతగ్రంధంగా చూస్తే ప్రపంచంలో అన్ని మతాలవారిని ప్రేమించమని చెప్పిన "ఏకైక" మతగ్రంధం భగవద్గీత. కాని భగవద్గీత మతగ్రంధం కాదు. అది సద్చిదానందుడు, నిరాకరుడు, నిర్గుణుడు, నిత్యుడు, పరంధాముడైన పరమాత్మ వచనం. 

భగవద్గీత మహాభారత ఇతిహాసంలో ఉన్నా, గీతను ఉపనిషత్తుగా చెప్పారు మహర్షులు. ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. ఇతిహాసం మాములుగా చదివిన అర్దమవుతుంది. కానీ ఉపనిషత్తు అర్దమవ్వాలంటే గురువు కావాలి. గురువుగారికి దగ్గరగా ఆసనం వేసుకుని కుర్చుంటే, తాను అనుభవంలోకి తెచ్చుకున్న తత్వాన్ని గురువు పరమప్రేమతో శిష్యుడికి అర్దమయ్యేలా చెప్తారు. అలా చెప్పిన ఆ తత్వం శిష్యుడిని ఉద్ధరిస్తుంది, భగవంతునికి దగ్గర చేస్తుంది. అలా గురువుకు దగ్గరగా కూర్చుని అర్దం చేసుకోవలసినదే ఉపనిషత్తు. గీత కూడా ఉపనిషత్తే. అందుకే గీత చదువాలనుకున్నవారు తగిన గురువును కానీ, గురువులు రాసిన గీతా బాష్యాన్ని కానీ చదవడం వలన సులువుగా అర్దమవుతుంది. గీతను చదువాలనుకునే వారి కోసం ఎందరో గురువులు గీతకు బాష్యం రాసారు. తెలుగు నాట కాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామివారి గీతామకరందం సుప్రసిద్ధం. అది అనేకానేక ఇతర భాషల్లోకి అనువదించబడింది. అలాగే స్వామి శివానందగారు కూడా గీతకు బాష్యాన్ని రాసిన ప్రముఖులలో ఒకరు, అలాగే గోరఖ్‌పూర్ గీతాప్రెస్ వారి గ్రంధం కూడా బాగుంటుంది. ఇంకా అనేకమంది గీతకు భాష్యం రాసారు. గీతను చదువాలనుకునేవారు అటువంటి గ్రంధాలను తీసుకుంటే ఎంతో సహాయకరంగా ఉంటుంది. అలాగే ఇస్కాన్, త్రైత సిద్ధాంత భగవద్గీత వంటివి చదువకపోవడమే చాలా మంచిది.

నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్న ఎవరిని ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం. ఒక ఆశాపుంజం.
అంతేనా? భగవద్గీత ఈరోజు ఒక management science. ప్రపంచంలో ఉన్న universities లో ఇతరులని ఎలా manage చేయాలో నేర్పుతారు. కాని గీత మనల్ని మనం ఏలా manage చేసుకోవాలి నేర్పుతుంది. ఎందుకంటే మనల్ని మనం నియత్రించుకోకపోతే, ఇక లోకాన్ని ఎలా నియంత్రిస్తాము? అందుకే ఈరోజు గీతను పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒక management science గా బోధిస్తున్నారు.

భగవద్గీత సన్యాసుల కోసమంటారు కొందరు. భగవద్గీత చదివినవారు సన్యాసులైతే ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు. ఎందుకంటే భగవద్గీత గాంధీ, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులను ఈ దేశానికి అందించింది. ఈ ప్రపంచానికి E=mc²  సూత్రాన్ని చెప్పిన Albert Einstein, 
తాను ఆ సూత్రం చెప్పడానికి ప్రేరణ ఇచ్చింది భగవద్గీత 
అని చెప్పిన మాటలు మనం మరచిపోకూడదు.Alexander గురువైన Aristotle కూడా Alexander భారతదేశం నుండి
 తిరిగివస్తున్న సమయంలో భగవద్గీత తీసుకురమ్మని చెప్తాడు. 

భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుందని.

భగవద్గీతను రోజు చదవండి.
ఓం శాంతిః శాంతిః శాంతిః