Monday 31 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (10)



అతడు సమస్త జగత్తునకు చెందినవాడు


సాదాసీదా జనులందరికీ అందుబాటులో ఉంటాడు. గణపయ్య పసుపుతోనో, మట్టితోనో, గోమయంతోనో అతని విగ్రహాన్ని చేసి పూజించవచ్చు. మట్టి ప్రతిమ రూపంలో, శిలా రూపంలో సాధారణంగా సాక్షాత్కరిస్తాడు. 

మిగతా దేవతలకు బోలెడంత తతంగం ఉంది. ప్రాణ ప్రతిష్ట హడావిడి యుంది. కానీ గణపయ్యకై అంత శ్రమ పడనవసరం లేదు.

మిగతా దేవతలను పూజించాలంటే ఫలానా కాలంలో, స్నానం చేసి పూజా సామాగ్రితో బయలు దేరాలి. వెళ్ళినా తిన్నగా మూర్తి దగ్గరకు వెళ్ళలేం. దూరంగా ఉండే దర్శనం చేసుకోవాలి. ఇవేమీ అక్కరలేదు మన స్వామికి. దేశంతో కాని, కాలంతో కాని నిమిత్తం లేకుండా చెయ్యెత్తి మ్రొక్కితే చాలు, పలుకుతాడు. విగ్రహం కనిపిస్తే చాలు, అప్రయత్నంగా చేతులెత్తి మొక్కుతాం• చేతులతో చెవులను తాకిస్తాం. గుంజిళ్ళు తీస్తాం. పని ముగించుకుని కదిలి పోతాం. చిత్తానికి శాంతి సమకూరుతుంది.  

అతని ఆలయం ఒక గదిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సమీపించవచ్చు. దేవాలయ ప్రవేశం అంటూ చట్టాలవసరం లేదు కూడా మిగతా. దేవతల మందిరాలకు ప్రహరీ గోడలని, అంతరాళ మంటప్మని, ముఖమంటపమని, గర్భగుడియని ఏవేవో భేదాలుంటాయి. ఇవేమీ లేవు మన స్వామికి. 

Sunday 30 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (9)



వేయి సంవత్సరాలనుండి ఆ పాటలు ఈ నాటికీ వినబడుతున్నాయంటే ఆమె చూపిన ప్రేమ, దయలే కారణం. సత్యాన్ని సూటిగా, నాటుకొనే రీతిలో చెప్పి పాడింది. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన కంబడు, పుగళేంది, ఎళాంగో రచనలు చదువని వారుండవచ్చు గాని అవ్వైయార్ వ్రాసిన పాట రానివారుండరు. 

ఆ మాటలలో శక్తి ఎట్లా వచ్చింది? మాటలలోనే కాదు, దేహంలోన్ ఆమెకు బలం ఉంది. గ్రామగ్రామాన పిల్లల్ని ప్రోగు చేసి పాటలచే వారిని ఉత్తేజితుల్ని చేసిన దొడ్డ తల్లి. ఎన్నివేలమందిని, లక్షలమందిని కలుసుకుందో! ఈ శక్తి అంతా ఎక్కణ్ణుంచి వచ్చిందనుకొంటున్నారు? అంతా వినాయకుని నుండే సుమా! 

ఆ పిల్ల దేవుణ్ణి కొలిచి పిన్నతనంలోనే ముసలిదైపోయింది. ఎందుకారూపం వచ్చింది? ఆమె పడుచుగా ఉన్నా, నడి వయస్సులో ఉన్నా ఎవర్నో ఒకర్ని వివాహమాడవలసి వస్తుంది కదా! సాధారణ కుటుంబ జీవనం ఆమె భక్తికి ఆటంకమై పోయేది. అందువల్ల ముసలితనాన్ని ఏరికోరి వరించింది.

మన గణపతి సుబ్రహ్మణ్యునకు వివాహం చేయించి అవ్వైయార్ ముసలి దానిని చేసి పెళ్ళి లేకుండా చేశారు. ఎవరేది అడిగితే దానినే ఇస్తాడు. ఆయన పిల్లలకు ఇష్టమైన దైవం కూడా. అందువల్ల ఆమె రచనల వల్ల పిల్లలు బాగు పదాలని ఆమెకు ముసలి దానాన్ని ప్రసాదించాడు. పెళ్ళైతే ఒక కుటుంబానికే పరిమితమై ఉండేది. ఇప్పుడేమో తమిళనాడుకు, అంతేకాకుండా తరతరాలకు తల్లియై విలసిల్లింది.


 నిరంతరం వినాయక స్మరణ, పిల్లలకు హితబోధ - ఈ రెండే ఆమె ప్రవృత్తిలో కన్పిస్తాయి. 

ఆమె తమిళనాడంతా తిరిగితే, నేనేమో దేశమంతా తిరిగాను. ఎక్కడ చూసినా తమిళనాడులో ఉన్న వినాయక భక్తి ఎక్కడా కనబడలేదు. వినాయక భక్తి తీవ్రత ఇక్కడ మెండుగా ఉంది. 


పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు తనకు కట్టబెట్టాలని గణపతి భావించడు. ఒక చిన్న సన్నిధి చాలు. పూరిపాక వేసినా, లేదా చిన్న ఆచ్ఛాదన కల్పించినా అదే పదివేలుగా భావిస్తాడు. అదీ లేదనుకోండి, ఏ చెట్టు నీడనో ఉంటాడు. భక్తులనాదరించి ఎక్కడ చూసినా సంతోషకరమూర్తిగా సాక్షాత్కరిస్తాడు.


దీనికంతటికీ అవ్వైయార్ కారణం. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుని గుడి వెలియవలసిందే. తమిళనాడు ప్రత్యేకతలను గురించి చాలామంది పరిశోధకులు ఏవేవో వ్రాస్తారు. నా దృష్టిలో దీనినే ప్రత్యేకతగా భావిస్తున్నా.

విభిన్న దేశాల్లో పూజింపబడే గణేశుని వివిధ రూపాలు...

 విభిన్న దేశాలలో గణేశునిపై విడుదల చేసిన తపాళా బిళ్ళలు...
భారత దేశంలోని ఐరిష్ రాయబారి కార్యాలయం ప్రవేశ ద్వారం ముందు ఆ దేశ అధికారులు స్థాపించిన మహాగణపతి విగ్రహం.

ఐశ్వర్యానికి, అదృష్టానికి అధిదేవుడైన గణేశుడు, రాయబార కార్యాలయానికి వీసా కోసం వచ్చే వందలాదిమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారికి ఆశీర్వాదాలు అందించాలి అని ఐర్లాండ్ మంత్రి ఈ సందర్భంగా అన్నారు. గణేశుని ప్రతిమను స్థాపించడమే ఈ కార్యాలయాన్ని పవిత్రం చేయటమే కాక, భారతదేశం- ఐర్లాండ్ మధ్య సాంస్కృతికి వారధికి శ్రీకారం చుడుతుందని చెప్పారు.

ఈ ప్రతిమను స్థాపించడంలో కీలక పాత్ర వహించిన ఐర్లాండ్ రాయబారి ఒకసారి భారతదేశంలో మహాబలిపురం సందర్శించినప్పుడు, గణేశమూర్తిని చూసి ఆయన అందానికి వశుడయ్యారట. అందుకే అక్కడి కార్యాలయంలో స్థాపించారట. హిందూదేవతలు కొలువు తీరిన తొలి రాయబార కార్యాలయం కూడా ఇదే అవచ్చు.
మయన్‌మార్ గణేశుడు
శ్రీలంకలో పూజించబడే గణేశుని రూపం.
క్షేమ గణపతి... కైనటిక్ మెటర్ సైకిల్ ప్రకటన

ఈయన క్షేమ గణపతి. కెనటిక్ మోటర్స్ వాళ్ళు రూపొందించారు. చిత్రం గమనిస్తే, బైక్ వెళ్ళిన మార్గంలో ఆ టైర్ల రాపిడి కారణంగా ఏర్పడిన గణపతి ఆకరం అది. గణపతి ఆశీర్వాదం ఉంటే అతి కఠినమైన రోడ్డు మీద కూడా క్షేమంగా ప్రయాణం చేయవచ్చని 4 సెప్టెంబరు 2002 లో వారు ఇచ్చిన ప్రకటన ఇది. ఇది నిజమే కదా.

పైగా ఏ రూపంలోనైనా ఇమిడిపోగలవాడు మన గణపతి ఒక్కడే.
హిందూ వార పత్రికలోని ఒక ప్రకటనలో ముద్రించిన గణక యంత్రం Computer) గణేష్, ఎలుక (Mouse) చిత్రం....
జావా గణేష్

నెపాల్ గణేష్


మెక్సికోలో పూజింపబడే గణపతి
జపాన్ లో పూజించబడే గణేశ మూర్తి

వియత్నామ్ గణేష్

ధాయ్‌ల్యాండ్ గణేశుడు

ఐవరీ కోస్టా 2013లో విడుదల చేసిన శ్రీ గణేశుని నాణెము


















Saturday 29 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (8)



తమిళనాడు గొప్పదనం

తమిళనాడుకి అపారమైన సేవ చేసింది అవ్వైయార్. ఈ నాటికీ సదాచారం, భక్తి ఈ ప్రాంతంలో ఉన్నాయంటే అది అంతా ఆమె పెట్టిన భిక్షయే.

సదాచారం, భక్తి అనేవి చిన్ననాటినుండీ అలవడాలి. అవి భావి జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తాయి. ఎందరో కవులున్నా వారందరూ పెద్దలను దృష్టిలో పెట్టుకొని కావ్యాలు వ్రాసారు. వారి కవితాశక్తికి ఏమాత్రం తీసిపోకుండా, యోగశాస్త్ర నిపుణురాలైన జ్ఞానియై యుండి చిన్నపిల్లల బాగుకోసం కవితలల్లింది. ఆమె పాటలు పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దాయి. 

ఒక అవ్వ తన మనుమలనెట్లా తీర్చి దిద్దుతుందో అవ్వైయార్ కూడా జగత్కుంటుంబాన్ని అట్లా సాకింది.

అపారమైన ప్రేమవల్ల వ్రాయడంచే తరాలు గడిచినా చెక్కు చెదరకుండా, మానవుల మనస్సులలో ఆమె రాసిన 'ఆతి చూడి' ప్రాథమిక బాలశిక్షయైంది. 

ముందు పూజ చేసేది వినాయకునికే. మొదటి చదువవలసిందీ ఆ పుస్తకాన్నే. 


Friday 28 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (7)



మరొక భేదం ఉంది. ఇతడు పిల్లవాడు, ఆపైన బ్రహ్మచారి. ఏనుగుగా కనబడి, వల్లిని బెదిరించి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామితో వివాహమయ్యేటట్లు చేసాడు కూడా. వివాహం కానివారు, వినాయకుణ్ణి సేవించడమూ ఉంది ఏమిటి దీనర్థం? అతడు వివాహం చేసుకోకపోయినా, చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇతరులకు వివాహం చేసే లక్షణముంది. ఇది దయను సూచిస్తోంది. అంటే మనలను ఉద్ధరిస్తున్నాడు. అతడు కదలకుండా మెదలకుండా ఉండి భక్తులను ఎత్తుపై కూర్చొండబెడుతున్నాడు. అంటే ఉద్ధరిస్తున్నాడు. లోగడ చెప్పిన అవ్వైయార్ తను కూర్చుండి తన తుండంతో ఆమెను కైలాసానికి చేర్చాడు కదా!

ఇట్లా భావించిన కొద్దీ క్రొత్త క్రొత్త ఊహలు మన మదిలో మెదులుతాయి. గణపతి మనం ఊహించని దానికంటె అపారమైన దయను వర్షిస్తాడు. 

పిల్లల్ని దేవుణ్ణి ఒక విధంగా చూస్తాం. పిల్ల ల్లో దేవుడున్నాడని అంటారు. పిల్లలు నలుమూలలా తిరుగుతారు. కానీ ఈ పిల్లవాడు తిరగకుండానే ముందు చెప్పిన అవ్వను ఉద్ధరించాడు. అవ్వైయార్ కదలలేని ముసలి వయస్సులో తమిళనాడంతా తిరిగి ధర్మప్రచారం చేసింది.

Thursday 27 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (6)



గజముఖుడని, గజరాజనే నామాలు ఏనుగు ముఖం కలవాడగుటచేత వచ్చాయి. 

ఏనుగునకు చాలా బలం. అంత మాత్రంచే ఒక్క జంతువునూ బాధ పెట్టదు. బర్మా కేరళ ప్రాంతాలలో పెద్ద పెద్ద దుంగల్ని మోస్తుంది. అట్లాగే వినాయకుడు బలవంతుడే. ఇతడూ హాని చేయడు, మంచినే చేస్తాడు. అది బాగా తెలివైన జంతువు, దాని స్మరణ శక్తి కూడా గొప్పదే. అట్లాగే వినాయకుడుకి కూడా.

ఏనుగు ఏ పని చేసినా అందంతో తొణికిసలాడుతూ ఉంది. దాని నడకే అందంగా ఉంటుంది. అది తినే పద్ధతి, చెవుల నాడించడం, తుండాన్ని మధ్య మధ్యలో ఎత్తడం, - ఇట్లా ఏది చూసినా ముచ్చటగా ఉంటుంది. శాంతమైన ముఖం. చిన్న ఏనుగులు చూడ ముచ్చటగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే జంతువు ఏనుగు.


అట్లాగే చిన్న పిల్లవాణ్ణి తరచూ చూస్తూ ఉంటాం. ఎన్నిసార్లు చూసినా తృప్తి ఉండదు కదా! అట్లాగే ఏనుగుల లక్షణాలు, పిల్లవాని లక్షణాలు కలబోసిన మూర్తి మన స్వామి. పిల్లవాని అమాయక ప్రవృత్తి, మంచి మనస్సు, ఏనుగుకున్న బలం, బుద్ధి, అందం అన్నీ కలబోసిన మూర్తి మన స్వామి. 

కంఠం దిగువున నరరూపం. పైన జంతు రూపం. అట్టివాడు దేవతలందరికంటే ముందుగా పూజలందుకుంటున్నాడు.

ఈ నర జంతు రూపంలోనూ, విరుద్ధ రూపాలలోనూ అందం దాగియుంది. మంచి చెడులు కలబోసిన మూర్తి. విరుద్ధ గుణాలు సంగమించిన మూర్తి. ఒక చేత్తో మోదకం, మరొక చేతిలో విరిగిన దంతం. ఒక చేతిలో పూర్ణ స్వరూపమైన మోదకం ఒక చేతిలో అపూర్ణమైన దంతం. ఉండ్రాళ్ళని మోదకాలని అంటారు. అంటే సంతోషాన్ని కలిగించింది.

Wednesday 26 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (5)



ఒక ముసలి స్త్రీ - ఒక పిల్లవాడు

ఒక ముసలి స్త్రీ ఉండేది. సాధారణంగా ముసలివాళ్ళు కాళ్ళు చాపుకొని ఒక మూల కూర్చొని ఉంటారు కదా! కాని ఈమె అట్లా కాదు. తమిళనాడు అంతా ఊరూరా తిరిగేది. వీథి వీథి తిరిగేది. ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఊరంతా కలియతిరిగింది. ఆమె కథను చివర చెప్పుకొందాం.

ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆరోగ్యకరంగా చూడముచ్చటగా ఉండేవాడు పిల్లలు ఆడుతూ పాడుతూ ఒకచోట కూర్చోకుండా అల్లరి చేస్తూ ఉంటారు కదా! కాని ఈ పిల్లవాడు వాళ్ళకు విరుద్ధంగా ఒక మూల కూర్చొని ఉండేవాడు. కూర్చున్నచోటునుండి అణుమాత్రం కదిలేవాడు కాదు.

వింత ముసలి స్త్రీ, వింత పిల్లవాడు. ముసలి స్త్రీ పిల్లవాళ్ళలా, పిల్లవాడు ముసలివాళ్ళలా ఉండడం వింతయే కదా.


విసుగూ విరామం లేకుండా ముసలి స్త్రీ తిరగడానికి బలాన్ని ఈ పిల్లవాడిచ్చాడు. ఎవడా పిల్లవాడు?

అతడే మన గణపయ్య. అట్లా కదలని వానిని కల్లు పిళ్ళైయార్ అని తమిళంలో అంటారు. అంటే కదలని వినాయకుడన్నమాట.

అతనికే గణేశుడని, గణపతియనే పేర్లున్నాయి. శివుని గణాలకు అధిపతి కనుక ఆ పదాలు వచ్చాయి. ఇతని కంటె మరొక అధిపతి లేదు, నాయకుడు లేడు కనుక ఇతడు గణపతి, గణేశుడు, వినాయకుడయ్యాడు. విగత నాయకుడు వినాయకుడు. సంస్కృతంలో 'వి' అనే ఉపసర్గకు రెండర్డాలున్నాయి. విశేషమని విగతమని అర్థాలు. విగత నాయకుడూ, విశేష నాయకుడూ అతడే అన్ని విఘ్నాలను పోగొడతాడు కనుక విఘ్న నాయకుడు. చేసే పనులలో విఘ్నాలుండకూడదని విఘ్నేశుని ముందుగా పూజిస్తాం. మొదట పూజ ఇతనికే.

Tuesday 25 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (4)



చంద్రుణ్ణి, సముద్రాన్ని, ఏనుగును ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. భక్తులకు ఆనందాన్ని కల్గించడం కోసం ఏనుగు తలతో సాక్షాత్కరించాడు. ఇది అందంలో దాగిన సత్యం. దీనిని ఆస్వాదించడంలో మనకు తృప్తి ఉండదని సూచిస్తుంది. ఆయన ఆనందం నుంచి ప్రభవించాడు. ఎప్పుడు? భండాసురుడు విఘ్న యంత్రాన్ని ప్రయోగించి అమ్మవారి సైన్యాన్ని అడ్డుకొనగా శంకరుడు అమ్మవారిని సంతోషంతో చూసాడు. అప్పుడు పుట్టిన వాడు స్వామి. ఇతడు విఘ్న యంత్రాన్ని ఛేదించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు. విశ్వ సృష్టికి కారణభూతుడయ్యాడు అని ఒక కథ,

ఏ దేవతను కొలిచినా ముందుగా వినాయకుని ఆశీర్వచనాలు, అనుగ్రహాన్ని కోరుకుంటాం కదా. ఇతడే ప్రథమ దేవుడని, ఇతని పూజించాలని అనేవారిని గాణపత్యులని అంటారు.

గణేశుని ఎదురుగా చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ ఉంటారు. దానికొక చమత్కారమైన కథ ఉంది. మన స్వామి, విష్ణువు యొక్క మేనల్లుడు. ఒకమాటు కైలాసానికి విష్ణువు వచ్చినప్పుడు అతని చేతిలో నున్న చక్రాన్ని మ్రింగి వేసాడట. ఎలా తిరిగి పొందాలని ఆలోచించాడు విష్ణువు. వినాయకుడు నవ్వించడం కోసం రెండు చెవులూ పట్టుకొని, గుంజిళ్ళు తీసాడట. ఇది చూసి పకపకా నవ్వాడు గణపతి. చక్రం నోట్లోంచి ఊడి పడింది.

ఇట్లా చేతులు చెవులు మూసుకొనడాన్ని తమిళంలో తూప్పుకరణం అంటారు. సంస్కృతంలో ధ్రువీకరణ పదానికి వికృతి. అంటే రెండు చేతులతో చెవులను కొనుట. 

విఘ్నాలు లేకుండా ఉండడానికి బట్టి వినాయకుని కొలిచి సకల శ్రేయస్సులను పొందుదాం.

Monday 24 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (3)


గణపతి ఎంత స్థూలకాయుడు అతని వాహనం, ఎలుక అంత చిన్నగా ఉంటుంది. మిగతా దేవతలకు ఏ ఏద్దో, సింహమో, గుఱ్ఱమో, పక్షియో వాహనంగా ఉంటుంది. వాహనాన్ని బట్టి దేవతల గొప్పదనం ఆధారపడుతుందా? దేవతను మోసే భాగ్యం వాహనానికే కనుక అంత స్థూలకాయుడూ ఎలుక వాహనంపై దానికి భారం అనిపించకుండా తేలికగా ఉంటాడు. భక్తుల హృదయాలలో తేలికగా అధివసించడా?

ప్రతి జంతువుకీ ఒక్కొక్క శరీరావయవంపై మక్కువ కలిగియుంటుంది. చమరీ మృగానికి తన తోకపై; నెమలికి తన పించం పై మక్కువ. మరి ఏనుగునకు దేనిపై మోజు? అది దంతాలను పరిశుభ్రంగా, తెల్లగా ఉంచుకొంటుంది. ఇక ఏనుగు తల ఉన్న గణపతి ఏం చేసాడు? అట్టి ప్రియమైన ఒక దంతాన్ని పెరికి ధర్మాన్ని ప్రవచించే భారతాన్ని రాయడానికి ఉపయోగించాడు. అందం, గర్వ సూచకమైన దంతాన్ని ధర్మన్యాయాలను ప్రవచించే భారతాన్ని లిఖించడానికి త్యాగం చేసినట్లే కదా! గజానునకు వ్రాయటానికి సాధనాలు కావాలా? దేనినైనా ఉపయోగించవచ్చును కదా! ప్రియమైన దంతాన్నే వాడడాన్ని గుర్తించండి. ఒక సందర్భంలో దంతంతోనే ఒక అసురుణ్ణి సంహరించాడు. అప్పుడది ఆయుధం. భారతం వ్రాసేటపుడది ఒక కలం. 

Sunday 23 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (2)



ఆధ్యాత్మిక సత్యాల ప్రతిరూపం


వినాయకునకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తుంది. 


వినాయకుడి ముందు ఎందుకు కొబ్బరి కాయలు కొడతాం? దీనికొక కథ యుంది. ఒకనాడు నీ తలని బలీయవలసిందిగా తండ్రియైన పరమేశ్వరునే అడిగాడట. దానికి బదులుగా మూడు కన్నులున్న కొబ్బరికాయను శంకరుడు సృష్టించాడట. శంకరునకూ మూడు కన్నులు కూడా! అతని తలకు బదులుగా ఇట్లా కొబ్బరికాయలను కొడతాం.


దానిని నేలమీద కొడితే ముక్క చెక్కలవుతుంది కదా! అయితే ఆ ముక్కల్ని ముఖ్యంగా ఎవరేరుకుంటారు? 1941లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. నాగపట్టణంలో చాతుర్మాస్య దీక్ష అప్పుడున్నాను. కొబ్బరికాయలను కొడుతూ ఉండడం, పిల్లలు మూగడాన్ని చూసా: జనులు కిటకిటలాడుతున్నారు. చోటు లేదు, పొండి పొండని పిల్లలు పెద్దలు తరుముతున్నారు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి కాయను కొట్టిన తరువాత ఈ ముక్కల్ని ఏరుకోవద్దని అనడానికి నీవెవరని గద్దించాడు. అతని ధోరణి చూసి అతనన్నది సబబే అనిపించింది. 


కాయ బ్రద్దలైతే దానిలోంచి అమృతం వంటి నీరు వస్తుంది. ఇట్లా బ్రద్దలు కొట్టడం మన అహంకారాన్ని బ్రద్దలు కొట్టినట్లనిపిస్తుంది. ఇక స్వామి తల, ఏనుగు తల, అతడు స్థూలకాయుడు కూడా. పుష్టిగా ఉంటాడు. పిల్లలు బాగా తిని బొద్దుగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటారు కదా! అతని చేతిలో మోదకం ఉంటుంది. కడుపునిండా తినండని, తన మాదిరిగా పుష్టిగా ఉండండని సూచిస్తోంది ఆ ఆకారం.

అనేక రూపాల్లో అపూరుపమైన గణపతి చిత్రాలు

 

భోజనం చేస్తున్న బొజ్జ గణపయ్య


గణేశుని కల్యాణం











కాశీలో డుంఢి గణపతి








కదళీ గణపతి - అరటిపళ్ళతో


ఉల్లిపాయలతో వినాయకుడు
వెదురు గణపతి


బిస్కెట్ల గణపతి

పువ్వులతో గణపయ్య



అరటికాయతో గణపతి


మిరపకాయలు మరియు వెల్లుల్లితో వినాయకుడు
బెండకాయల వినాయకుడు



ఉల్లిపాయ గణపతి
కూరగాయల గణపతి

పిళ్ళయార్‌పట్టిలో కర్పగ వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూషిక వాహనంపై కొలువి దీరిన గణపయ్య





జిడిపప్పు గణపతి

మధురైలో వినాయకుడు
బియ్యంతో గణపతి




ధాన్యాలతో గణపతి








అరుణాచలంలో గణపతి

పసుపుతో చేసిన వినాయకుడు



గోమయ గణపతి