Tuesday, 19 June 2018

యక్ష ప్రశ్నలు -15యక్ష ప్రశ్నలు -15
What is the human side of Kshatriyas?
Fear is the human side of Kshatriyas.

Monday, 18 June 2018

యక్ష ప్రశ్నలు -14యక్ష ప్రశ్నలు -14

Q- What is he Dharma for Kshatriyas?
A- Carrying out fire sacrifices is the Dharma of Kshatriyas.

Sunday, 17 June 2018

యక్ష ప్రశ్నలు - 13యక్ష ప్రశ్నలు -13

Q- What is godliness to Kshathriyas?
A- Weapons are the Godliness to Kshatriyas (Fighters and defenders)

హిందూ ధర్మం - 270 (కర్మసిద్ధాంతం- 10)సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుంటూ గత భాగంలో పఞ్చ జ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పంచ ప్రాణాలు, అంతఃకరణం గురించి చెప్పుకుందాము.
పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను పంచప్రాణాలు అంటారు. ఇవి ప్రాణమయ కోశంలో భాగం. ఈ 5 వాయువులు, వీటికి 5 ఉపవాయువులు ఉన్నాయి. 

పంచ ప్రాణాలు - 
ప్రాణ వాయువు - ఊపిరి (ఉచ్ఛ్వాస, నిశ్వాస) ప్రక్రియలకు సంబంధించినది. మనం నిత్యం లోనికి తీసుకునే గాలి. మన ఆలోచనలు, భావావేశాలు, మనస్సు దీనితో గాఢంగా ముడిపడి ఉంటాయి.
అపానం - బొడ్డు నుంచి అరికాళ్ళ వరకు ప్రభావితం చేసే వాయువు. ఇది విసర్జన ప్రక్రియలను, కామోద్రేకాలను నియంత్రిస్తుంది. 
వ్యానం - శరీరమంతా వ్యాపిస్తూ, అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది. రక్త ప్రసరణ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. సమస్త శరిరాన్ని, ముఖ్యంగా నడులను ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలకు పని చేయుటకు అవసరమైన శక్తినిస్తుంది.
ఉదానం - తిరస్కరించడం, ఎగదన్నటం దీని పని. కన్నీళ్ళకు కారణమవుతుంది. ఇది కంఠంలో ఉంటూ, నోట్లో ఆహారాన్ని మిరింగటం అనే ప్రక్రియలో కీలకంగా వ్యావహరిస్తుంది. ఇది హృదయం నుంచి శిరస్సుకు, మెదడకు ప్రసరణ చేస్తుంది. మరణ సమయంలో ఉదాన వాయువు సహాయంతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడువడుతుంది.
సమానం - అరుగుదలకు (జీర్ణం చేసుకునేందుకు) కారకమవుతుంది. ఉదరంలో ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల్లో వాయుప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది. ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది.

ఉపవాయువులు -
1. నాగ - తేపులు (త్రేనుపులు), ఎక్కిళ్ళు, వాంతులను కలిగిస్తుంది. ప్రాణ, అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది. ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళే వాయువులను నియంత్రిస్తుంది.
2. కూర్మ - కంటి భాగంలో ఉంటూ, కంటి రెప్పలు తెరిచి, మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది.
3. కృకర - శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది. ఆకలి దప్పికలను కలిగిస్తుంది.\
4. ధనంజయ - కండరాలు, ముఖ్యంగా హృదయ కవాటాల వ్యాకోచ సంకోచాలు నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి. మరణ సమయంలో శరీరాన్ని క్షీణింపజేసి, పంచభూతాల్లో కలిపేస్తుంది.
5. దేవదత్త - ఆవలింతలు కలిగిస్తుంది.

ఇవన్నీ శరీరంలో సక్ర్మంగా ఉన్నప్పుడే, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా, సదాలోచనలతో ఆనందంగా ఉంటాడు. ఈ వాయువుల(ప్రాణాలు) ప్రసారంలో ఏర్పడే ఇబ్బందులు అనేక ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. నిజానికి ఈ విజ్ఞానం మన రక్తంలో ఉంది. అందుకు ఉదాహరణ తెలంగాణ యాసలో స్పష్టంగా కంపిస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే, పానం (ప్రాణం) బాలేదు అంటారు. అంటే ఆయా శరీర భాగాలకు శక్తి ప్రసారం చేసే ప్రాణంలో అకస్మాత్తుగా దోషం ఏర్పడి, ప్రసారణ ఆగిపోయిందని, లేదా తక్కువగా ప్రసరణ చేస్తోంది చెబుతున్నారు. ఎంత అద్భుతం ఇది. గమనిస్తే, మనం వాడే మాములు పదాల వెనుక సనాతన ధర్మానికి చెందిన సత్యాలు ఎన్నో ఉన్నాయి.

To be continued ........

Saturday, 16 June 2018

యక్ష ప్రశ్నలు -12యక్ష ప్రశ్నలు -12

Q- What is sinful action for the Brahmins?
A-  Finding fault with others is the sinful action to Brahmins. 

Friday, 15 June 2018

యక్ష ప్రశ్నలు -11
యక్ష ప్రశ్నలు -11

ప్రశ్న - బ్రాహ్మణుడు దేనివలన భ్రష్టుడవుతాడు?
సమాధానం - మృత్యు భయం వలన

Thursday, 14 June 2018

యక్ష ప్రశ్నలు -10యక్ష ప్రశ్నలు -10

ప్రశ్న - బ్రాహ్మణునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి?
సమాధానం - తపస్సు వలన సాధుభావము, శిష్టాచారాన్ని విడిచిపెట్టడం వలన అసాధుభావము సంభవిస్తుంది.

Wednesday, 13 June 2018

యక్ష ప్రశ్నలు -9
యక్ష ప్రశ్నలు -9

ప్రశ్న - బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందుతాడు?
సమాధానం - వేదాధ్యయనం చేయడం ద్వారా

Tuesday, 12 June 2018

యక్ష ప్రశ్నలు -8యక్ష ప్రశ్నలు -8

ప్రశ్న - మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?

సమాధానం - పెద్దలను సేవించుటవలన

Monday, 11 June 2018

యక్ష ప్రశ్నలు -7యక్ష ప్రశ్నలు -7

ప్రశ్న - మానవునికి సహయపడునది ఏది?
సమాధానం - ధైర్యం

Sunday, 10 June 2018

యక్ష ప్రశ్నలు -6యక్ష ప్రశ్నలు -6

ప్రశ్న - మానవుడు దేనివలన మహత్తును పొందును?
సమాధానం - తపస్సు

హిందూ ధర్మం - 269 (కర్మసిద్ధాంతం- 9)శ్రోత్రే త్వక్ చక్షుః రసనా ఘ్రాణం ఇతి పఞ్చ జ్ఞానేంద్రియాణి
శ్రోత్రే - చెవులు (వినడం)
త్వక్ - చర్మం (స్పర్శ)
చక్షుః - కళ్ళు (దృష్టి)
రసనా - నాలుక (రుచి)
ఘ్రాణం - ముక్కు (వాసన)

ఏ వ్యక్తికైనా వినికిడి, రుచి మొదలైన సమర్థతలు/ సామర్ధ్యాలు పరిమితంగానే ఉంటాయి. అది గుణంలోనైనా, పరిమాణంలోనైనా. ఒకనికి పరిమితమైన శక్తి ఉన్నదంటే, అప్పుడు అతడు అపరిమితమైన శక్తి యొక్క అంశ అని, అపరిమితమైన శక్తి ఒకటుందని అతడు భావించవచ్చు. 
కాబట్టి ప్రతి సామర్ధ్యానికి, దానికి సంబంధించిన సంపూర్ణ శక్తి ఉంది. శక్తిని శాసించువాడు ఉంటే తప్పించి దానికి స్వతంత్రమైన వృత్తి ఉండదు. ఉదాహరణకు, దృష్టి( చూచే) శక్తి అనేది జీవుడి ఆధీనంలో ఉంటుంది. అతడు చూడాలనుకుంటేనే చూడగలడు. అలాగే సంపూర్ణశక్తికి, మన గ్రంథాలు, వాటిని నిర్వహించే నిర్వాహకులను వివరించాయి. వారిని అధిష్ఠానదేవతలు అంటారు. ఈ అధిష్ఠానదేవతలందరిని కలిపి, వారి సంపూర్ణ శక్తిని శాసించే అధికారి వెరొకడు ఉన్నాడు. అతడిని పరమేశ్వరుడని, ఈశ్వరుడని అంటారు. ఇదంతా ఆదిశంకరులు తత్వబోధలో వివరించారు.

శ్రోత్రస్య దిగ్దేవతా | త్వచే వాయుః |
చక్షుషాః సూర్యః | రసనాయ వరుణః |
ఘ్రాణస్య అశ్వినౌ | ఇతి జ్ఞానేంద్రియదేవతాః |

శ్రోత్రస్య దిగ్దేవతా - చెవికి (వినికిడి శక్తికి) అధిష్ఠానదేవతలు దిగ్దేవతలు
త్వచే వాయుః - చర్మానికి వాయువు
చక్షుషాః సూర్యః - కన్నులకు (చూపుకు) సూర్యుడు 
రసనాయ వరుణః - నాలుకకు (రుచికి) వరుణుడు 
ఘ్రాణస్య అశ్వినౌ - ముక్కుకు (వాసనకు) అశ్విని దేవతలు

వాక్పాణిపాదపాయుపిపస్థాని పఞ్చకర్మేంద్రియాణి |
వాక్ - నోరు
పాణి - చేతులు
పాద - పాదాలు
పాయువు - విసర్జన అవయవాలు
పిపిస్థ - జననాంగాలు
అనేవి 5 కర్మేయంద్రియాలు.

ఈ 5 కర్మేంద్రియాలకు కూడా ఐదుగురు అధిష్ఠానదేవతలు ఉన్నారు.

వాచో దేవతా వహ్నిః - వాక్కునకు అగ్ని
హస్తయోరింద్రహః - చేతులకు ఇంద్రుడు
పాదయోర్విష్ణుః - పాదాలకు విష్ణువు
పాయోర్మృత్యుః - పాయువునకు మృత్యువు

ఉపస్థస్య ప్రజాపతిః - జననాంగాలకు ప్రజాపతి 

To be continued ......

Saturday, 9 June 2018

యక్ష ప్రశ్నలు -5యక్ష ప్రశ్నలు -5

ప్రశ్న - మానవుడు దేనివలన శ్రోత్రియుడు/  విద్యావంతుడు అగును ?
సమాధానం - వేదం

Friday, 8 June 2018

యక్ష ప్రశ్నలు - 4


యక్ష ప్రశ్నలు -4

ప్రశ్న - సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
సమాధానం - సత్యం

Thursday, 7 June 2018

యక్ష ప్రశ్నలు - 3యక్ష ప్రశ్నలు -3

ప్రశ్న - సూర్యుని అస్తమింపచేయునది ఏది?
సమాధానం - ధర్మం

Wednesday, 6 June 2018

యక్ష ప్రశ్నలు -2యక్ష ప్రశ్నలు -2

ప్రశ్న - సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
సమాధానం - దేవతలు

Tuesday, 5 June 2018

యక్ష ప్రశ్నలు -1


యక్ష ప్రశ్నలు -1

ప్రశ్న - సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
జవాబు - బ్రహ్మం

Monday, 4 June 2018

సనత్సుజాతుని సూక్తి
Who practices mere non-speaking is not a muni, nor he who lives in the woods. Who knows his self-nature, he is called a great muni.

- Sanatsujata

Sunday, 3 June 2018

భీష్మ పితామహుని సూక్తిFootprints of birds are not seen in the sky, not the footprints of aquatics on the water, even so the movement of jnanis can’t be known.

- Bhishma Pitamaha

హిందూ ధర్మం - 268 (కర్మసిద్ధాంతం - 8)జీవుడు కర్మలను మూడు శరీరాల ద్వారా చేస్తాడు. అవే
1. స్థూల శరీరం
2. సూక్ష్మ శరీరం
3. కారణ శరీరం
ఆత్మ వీటికి అతీతమైనది.

1. స్థూల శరీరం అంటే కంటికి కనిపించే ఈ భౌతిక దేహం. ఇది పృధ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల వలన ఏర్పడిన పాంచభౌతిక దేహం. ఇది కాలానికి లోబడి ఉంటుంది. ఒకనాడు మరణం పాలవుతుంది. అగ్నికి ఆహుతువ్వడమో, లేదా మట్టిలో కలిసిపోవడం జరిగి, పంచభూతాల్లో లయమవుతుంది. ఈ స్థూల శరీరం నిలబడటానికి ఆహరం అవసరం. ఇది అనేక రకాల వ్యాధులకు లోనవుతుంది. జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరిచి, అతడి పడాల్సిన వేదనను అతనికిచ్చే వాహకం ఈ స్థూల శరీరం.

గత జన్మల్లో జీవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచీకరణం జరిగి, అతడి కర్మఫలానికి తగిన విధంగా స్థూల శరీరం ఏర్పడుతుంది.

ఆదిశంకరులు తత్త్వబోధలో దీని గురించి ఈ విధంగా చెప్పారు. పంచభూతాల కారణంగా పాపపుణ్య కర్మఫలాల కారణంగా పంచీకరణం చెంది రూపుదిద్దుకుంటుంది స్థూలశరీరం. ఇది సుఖదుఃఖాలకు నివాసస్థానం. షడ్ (6) వికారాలకు లోబడి ఉంటుంది. అవే
అస్తి - తల్లి గర్భంలో అండరూపంలో ఉండటం.
జాయతే - పుట్టడం
వర్ధతే - పెరగుట
విపరిణమతే - మార్పు చెందుట
అపక్షీయతే - కృశించుట
వినశ్యతి - నశించుట

అంటే తల్లి గర్భంలో ఏర్పడటం (అస్తి), రూపం పొంది పుట్టడం (జాయతే), పెరిగి పెద్దవ్వడం (వర్ధతే), క్రమంగా రూపాంతరం చెందడం (శరీరంలో మార్పులు చెందడం), ఒక వయస్సు వచ్చాక ఎలా ఎదిగామో, అలా ఒక్కో ఇంద్రియం శక్తి క్షీనించడం, అనగా ముసలితనం రావడం (అపక్షీయతే), మరణించడం (వినశ్యతి). వికారం అంటే మార్పు. ఈ 6 మార్పులు లేదా వికారాలు అనేవి భౌతిక దేహం యొక్క లక్షణాలు.

2. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగశరీరం అని కూడా అంటారు.దీన్నే అంతఃకరణం అని కూడా అంటారు. ఇది కంటికి కనిపించకపోయినా, చేయాలసిన కర్మలను చేస్తుంది.

శంకరులు ఇలా అంటారు - ఇది పంచభూతాలతో పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడిన రూపం. సత్కర్మజన్యం అనగా ఇది సత్కర్మ వలన ఉద్భవిస్తుంది. సుఖదుఃఖాది భోగాలకు సాధనం. ఇందులో మొత్తం 17 తత్త్వాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ్యేంద్రియాలు, పంచ (5) ప్రాణాలు, మనస్సు మరియు బుద్ధి. 

ఇవి సూక్ష్మంగా ఉన్నందువలన వీటిని ఇంద్రియాలు అంటారు. స్థూల దేహంలో ఉన్నవాటి ప్రతిరూపాలను గోలకాలు అంటారు. ఉదాహరణకు చెవితమ్మె స్థూలమైతే, వినికిడి శక్తి దాని సూక్ష్మరూపం). సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది, కాబట్టి ప్రతి జీవుడు ప్రత్యేకమైనవాడు. ఈ అన్నింటితో ఉండేది సూక్ష్మ శరీరం.

సూక్ష్మశరీరం అనేది పంచభూతాల పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడింది. కనుక వాటిని పంచ తన్మాత్రలు అంటారు.

ఈ సూక్ష్మశరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'సాధనం' (Instrument). స్థూలశరీరం అనేది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'ఆయతనం' (Locus) అంటే అందులో ఉండి, సూక్ష్మశరీరం ద్వారా అనుభవిస్తామన్నమాట. రకరకాల అనుభూతులు ఉంటాయి కనుక, వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల ఉపకరణాలు (సాధనాలు) కావాలి.

ఇంకా ఉంది.....

Saturday, 2 June 2018

స్వామి శివానంద సూక్తిBuild your character; you can shape your life. Character is power; it is influence; it makes friends. It draws patronage and support. It creates friends and funds. It opens a sure and easy way to wealth, honour, success and happiness.

- Swami Sivananda