Showing posts with label హిందూ విజ్ఞానం. Show all posts
Showing posts with label హిందూ విజ్ఞానం. Show all posts

Sunday, 20 August 2017

హిందూ ధర్మం- 250 (14 లోకాలు- Scientific analysis)




7-D A Plane of All Possible Worlds With the different Start Conditions; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అవ్వడం ఈ పరిమాణం నుంచి వీక్షించవచ్చు.

5 మరియు 6 పరిమాణాల్లో ఒక సమయంలో ప్రారంభమైన లోకాల ఉనికి, వాటి స్థానాన్ని పోల్చుకునే అవకాశం ఉండగా, ఈ 7-D కి చేరగానే, ఒక సమతంలో ఉన్న విభిన్నమైన లోకాలు, వేర్వేరు సమయాల్లో ప్రారంభమై, అనేక విధాలుగా పరిణామం చెందడం ఈ Dimension లో ఉన్న వారు చూసేందుకు సాధ్యపడుతుంది.  నిజానికి ఇన్ని లోకాలను, వాటిలో జరిగే విభిన్నమైన మార్పులను చూడగల సామర్ధ్యం బ్రహ్మదేవునకు ఉంది. కాబట్టి ఇక్కడే బ్రహ్మలోకం ఉండవచ్చు.  మిగితా Dimensions లాగానే ఇక్కడి నుంచి కూడా తన క్రింద ఉన్న అన్నిDimensions ని చూసే అవకాశం ఇక్కడ ఉన్నవారికి ఉంటుంది.

8-D A Plane of All Possible Worlds, Each With Different Start Conditions, Each Branching Out Infinitely; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అయ్యి, వివిధ ఆకృతులలో  నిరవధికంగా పెరగడం.

అంటే పాలకడలిలో శేషతల్పంపై శ్రీ మన్నారాయణుడు ఉండే Dimension ఇది. సముద్రంలో ఏర్పడే కెరటాల మీదనున్న నురగలో నిరంతర ఎన్నో బుడగలు ఉద్భవించి, లయిస్తుంటాయి. అలానే దైవసృష్టిలో అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవించి, లయిస్తూ ఉంటాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన నుంచి అనేకమంది బ్రహ్మలు ఉద్భవించి, లయిస్తూ ఉంటారు, ప్రతి బ్రహ్మ- ఒక బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మాండంలో లోకాలు ఉంటాయి. ఇవన్నీ నిత్యం గమనిస్తూ ఉంటాడు శ్రీ మన్నారాయణుడు. ఇక్కడి నుంచి చూసినప్పుడు, ఎన్నో బ్రహ్మాండాలు ఉద్భవించి, అనంతంగా వ్యాపిస్తూనే ఉంటాయి. దాన్ని ఊహించడం కూడా అసాధ్యం.

మళ్ళీ మనం ఆదినారాయణుడని అంటాము. ఆదినారాయణుడంటే పరతత్త్వము, ఆది నుంచి ఉన్నవాడు. ఆయన నిరాకారుడని చెప్తారు.


9-D All Possible Worlds, Starting With All Possible Start Conditions and Laws of Physics; విభిన్నమైన బ్రహ్మాండాలు అన్నీ అన్ని సమతలాలలో వివిధ సమయాలలో, వివిధ సాధ్యమైన ఆకృతులలో ప్రారంభం అయ్యి నిరవధికంగా పెరగడం, ఇక్కడి భౌతిక సూత్రాలు వేరుగా ఉంటాయి. దానికి ఈ 3-D ప్రపంచంలో అంటే మనుష్యలోకంలో ఉన్న భౌతిక సూత్రాలకు సంబంధం లేదు.

అంటే ఒకనాడు మహాశివలింగం ఇక్కడే, ఈ పరిమాణంలోనే ఆవిర్భవించి ఉండవచ్చు. అదే ఈ లోకంగా మారిందని లింగపురాణం మొదలైనవి చెబుతున్నాయి. ఈ పరిమాణంలో ఉండి, తన క్రిందనున్న ఇతర పరిమాణాల్లో ఉన్న లోకాలు, బ్రహ్మాండాల చరిత్రను చూడవచ్చు, పోల్చవచ్చు, నమోదు చేయవచ్చు. అంటే వేదవ్యాస మహర్షి ఈ పరిమాణానికి చేరుకుని అక్కడి నుంచి పురాణ రచన చేశారు. పురాణాల్లో చెప్పబడిన లోకాలు అసలు ఉంటాయా? అవి సాధ్యమా? మేము నమ్మాలా? అంటారు కదా, ఈ 9-Dimension కి వెళితే, అప్పుడు అర్దమవుతుంది.

మన పురాణాల్లో చెప్పబడిన అనేక అంశాలు, ఈ 3-D ప్రపంచంలోనే జరిగినవి కావు, అవి అనేక ఇతర Dimensions లో వేర్వేరు సమయాల్లో జరిగాయి. ఆ Dimensions లో ఉన్న ధర్మాలు వేరు. అక్కడి జీవుల జీవనశైలి భిన్నమైనది. వారిది మనలాంటి రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. వారు ఎంతో పరిణతి చెందిన జీవులు. పురాణాల మీద విమర్శ చేసే ముందు మనకు క్వాంటం ఫిజిక్స్ అర్దమైతే బాగుంటుందేమో?! ఈ విషయం బోధపడితే, మనం ఋషులను ఏనాడు నిందించము, కనీసం ప్రశ్నించము కూడా.


10-D Infinite Possibilities – లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా పెరిగి పెద్దవ్వడం.
ఇక్కడ అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇక్కడకు చేరిన జీవుడు, భగవంతుని అద్భుత సృష్టిని చూసి ఆశ్చర్యపోవటం తప్ప, దాన్ని విశ్లేషించలేడు. లెక్కలేనన్ని విశ్వాలు, లెక్కలేకుండా ఉద్భవించి, వ్యాప్తి చెంది, లయించడం, అది కూడా ఒక క్రమంలో కాదు, గందరగోళంగా జరగటం చూడవచ్చు. ఇది జీవులకు మాత్రమే గందరగోళం కానీ, పరబ్రహ్మానికి కాదు.  

11D M-థియరీ ప్రకారం ఒక నిర్దుష్ట ప్రణాళిక ద్వారా లయం కూడా అవ్వడం. వాటి పూర్తి అవగాహన ఉండడం. ఇది పరబ్రహ్మం స్థాయి. జీవుడు ఇక్కడికే చేరుకుని, పరబ్రహ్మంలో లయమవుతాడు. ఇక్కడ ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందంటే, ఇక్కడ ఉన్న పరబ్రహ్మ మిగితా  లో ఉన్న లోకాలను, తనలోకి లాక్కునే ప్రయత్నం చేస్తాడు. వేర్వేరు వేగాలతో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించి, లయించే అనేక సృష్టిలు, తెలిసో తెలియకో, దానిలోకే వెళ్ళిపోతున్నాయి. అందుకే సనాతన ధర్మంలో "ఎవరు ఏమి చేసినా, చేయకున్నా, అందరు ఒకనాడు ఆయనవద్దకు చేరుకునేవారే........ అన్నిటి యొక్క గమ్యం ఆ బ్రహ్మమే..... ప్రతి కర్మ భగవంతునిదే...... ప్రతి క్షణం భగవంతునికి చెందినదే...... మంచి వారు, చెడ్డవారు... అందరూ ఆయనలోనే కలిసిపోతారు..... రాక్షసులు, దేవతలు, ఆయన దిశగానె పయనిస్తున్నారు........" అని బోధిస్తుంది.

To be continued ..........
(వివరణ ఇంకా పూర్తి కాలేదు)

Wednesday, 7 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 3



మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం |
తన్మే నిర్ణుదా మృత్తికా తయా హతెనా పాపేన గచ్ఛామి పరమాంగతిం ||

ఓ మృత్తికా! నాకు పుష్టినివ్వు. సర్వంలో నీలోని దాగి ఉంది, అన్ని సంపదలకు మూలం నీవు. నాకు మార్గదర్శనం చేసి, నా పాపాలను తొలగించు. నువ్వలా నా పాపాలను నశింపజేయగానే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలను, నీ దయతో పరమగతి అయిన మోక్షాన్ని సైతం పొందగలను.

ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారు పూరీ జగన్నాధస్వామి రధోత్సవం చూడాటానికి వెళ్ళగా, అప్పుడు వారికి అక్కడ పప్పన్నం ప్రసాదం పెట్టారట. అది ఎంతో రుచిగా ఉండడంతో, ఇది ఎలా వండారు, దీని ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే, అక్కడ మట్టిపాత్రలలో వండి నివేదన చేస్తారని తెలుసుకున్నారు. అక్కడున్న శంకరాచార్య పీఠాధిపతితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మట్టిపాత్రలలో ప్రసాదం వండడానికి గల కారణం ఏమిటి? అని అడగ్గా, మట్టి పవిత్రమైనది, భగవంతునికి నివేదన చేసేది పవిత్రంగానే ఉండాలి, అందుకే మట్టి పాత్రలలో వండుతామని స్వామి వారు సమాధానమిచ్చారు. అయితే దీన్ని పరీక్ష చేయించాలనుకున్న రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని భువనేశ్వర్ లో ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. (CISR) కు తీసుకెళ్ళి పరిశోధించమంటే, దానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని, అయినా తమ వద్ద అన్ని పరికరాలు లేవని, అందుకని ఆ ప్రసాదాన్ని దిల్లీ వెళ్ళి పరీక్ష చేయించమని చెప్పారు. అది అప్పటికి వండి కొన్ని గంటలు గడించి, దిల్లీ వెళ్ళాలంటే సుమారు 36 గంటలు పడుతుంది. అప్పటికి ఇది పాడవుతుంది కదా అని రాజీవ్ గారు అనగా, అది పూరీ ప్రసాదమని, మట్టి పాత్రలో వండబడుతుంది కనుక పాడవ్వదు అని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆయన దాన్ని దిల్లీ తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే పప్పులో 18 రకాల సూక్ష్మపోషకాలుంటాయి (Micro Nutrients), అవే దానిలో ఉన్న బలం, ఆ 18 లో ఒక్కటి కూడా ఈ ప్రసాదంలో తగ్గలేదట. పూర్తిగా 100% ఉన్నాయట. వంటనే ఆయన ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని పరీక్ష చేయిస్తే, అందులో కేవలం 13 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగితా 87 % పోషకాలు లోపించాయని (నశించాయని) తేలింది. ఆ విషయం చెప్పి రాజీవ్ దీక్షిత్ గారంటారు పూరీలో పూజారులు సైన్సు చదవలేదు, అందుకని వాళ్ళు శాస్త్రీయంగా చెప్పలేకపోయారు, అయినా మట్టి పవిత్రమైనదని చెప్పారు. నేను సైన్సు చదివి కూడా పరీక్ష చేయిస్తే గాని తెలుసుకోలేకపోయాను. అందుకే మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మట్టి పాత్రలలో వంట వండడమే సంప్రదాయంగా వస్తోంది. అల్యూమీనియం ముడిపదార్ధం మన భూమిలో పుష్కలంగా ఉన్నా, మన పూర్వీకులు ఏనాడు దాన్ని ఉపయోగించలేదు. అదేకక మట్టి పాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మట్టికి ఆ శక్తి ఉంది.

ఇంకా వారంటారు వైజ్ఞానికంగా మన శరీరం అంతటా ఉండేది మట్టియే. ఈ శరీరానికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఆ పోషకాలనే మొక్క గ్రహించి పప్పుధాన్యాల్లో నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ 18 పోషకాలు పప్పులో ఉంటాయి. మళ్ళీ ఇవే 18 పోషకాలు గోమూత్రంలో కూడా ఉంటాయి.

అందుకే ఇప్పటికీ లలితా సహస్రనామ పారయణ చేసేవారు అమ్మవారికి, ఆ నామావళిలో చెప్పబడిన నివేదనలు సిద్ధం చేయడానికి ఇప్పటికీ మట్టిపాత్రలనే వాడతారు, ఆవు పిడకలను వంటచెరుకుగా వాడుతూ కుంపటి మీద వండుతారు. పవిత్రత కోసమని. అదే శ్రద్ధకు నిదర్శనమని లలితాసహస్రనామ బాష్యం ప్రవచనం చెప్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అన్నారు.

అందుకే సారవంతమైన మట్టిని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పుష్టికరమైన ఆహారం అందుతుంది. ఇప్పుడు అఘమర్షణ సూక్తంలో చెప్పిన 'మృత్తికే దేహిమే పుష్టిం' అనే మాట ఎంత సత్యమో అర్దమయ్యిందా? ఈ పొషకాలే కాకుండా ఇంకా ఏమేమి పోషకాలున్నాయో పరిశీలిద్దాం.

To be continued ...........

Sunday, 20 November 2016

హిందూ ధర్మం - 229 (జ్యోతిష్యం - 11)



తిధుల గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వారాల గురించి తెలుసుకుందాం. వారం అంటే 7 రోజులు. కాలమానాన్ని వారాలుగా విభాగం చేసి గణించిన ఘనత మన ఋషులకే చెల్లింది. నేడు ప్రపంచమంతా కాలగణనలో వారమంటే 7 రోజులుగానే స్వీకరిస్తోంది. ఈ పద్ధతి మన సనాతన సంస్కృతిలో సృష్ట్యాది నుంచి ఉంది. తిధికి, వారానికి తేడా ఉంది. తిధి చంద్రుని గమనంతో సంబంధం కలిగి ఉంటే, వారం (రోజు / Day) సూర్య సంబంధమైనది. ఉదయాద్ ఉదయం వారః అని అంటుంది శాస్త్రం. అంటే ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం మధ్య కాలమే వారం. ఇక్కడ వారమంటే రోజు అని అర్దం. ఏడువారాల నగలంటే వారంలో 7 రోజులు ధరించే ఒక్కో రకమైన నగలనే అర్దంవస్తుంది కానీ 7 ను 7తో హెచ్చిస్తే (7x7) వచ్చే 49 రోజులకు సరిపడే నగలని కాదు. ఈ ఏడువారాలు అనేమాట కూడా ఆ వారం నుంచి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం సనాతంధర్మంలో జ్యోతిష్యం ఆధారంగా ఒక రోజు మారిందని లెక్కించాలంటే సూర్యోదయన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. సూర్యోదయం మార్పుకు సంకేతం. ఒక్క ప్రకృతిలోనే కాదు, ఈ భూమిపై జరిగే అన్ని క్రియల్లోనూ మార్పు సంభవిస్తుంది. సూర్యుడు హారిజోన్ దాటగానే శరీరంలో ప్రాణశక్తి పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఊపిరిలో మార్పు కనిపిస్తుంది. అప్పటివరకు నిలకడగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా సనన్ని గాలులు వీయడం ప్రారంభవుతుంది. ఆ గాలులు ఎంతో శక్తిని, ఆరోగ్యాన్నిస్తాయి అంటుంది ఆయుర్వేదం. అందుకే సూర్యోదయానికి ముందే లేవాలి. అదేకాక ఆ సమయం శరీరశుద్ధికి ఎంతగానో అనువైనది, ఎందుకంటే ఆయుర్వేదపరంగా రాత్రి ముగుస్తున్న సమయం (సుర్యోదయానికి పూర్వం) వాతానికి చెందిన సమయం. అందుకే అప్పటికే లేచి మలమూత్ర విసర్జన ముగించాలి, తద్వార శరీరం లోపల శుద్ధి చేసుకోవాలి, ఆ తర్వాత స్నానం చేసి బాహ్యశుద్ధి చేసుకోవాలి, ప్రాణాయామది క్రియలు చేసి, ప్రాణశుద్ధి, సంధ్యావందానికి సిద్ధమై, జపం చేసి మనస్శుద్ధి చేసుకోవాలి. పసిపిల్లలు, జంతువులు, పక్షులు సైతం ప్రకృతిలో కలిగే ఈ మార్పును ముందే గ్రహించగలుగుతాయి, తమను తాము ఆ మార్పుతో సమన్వయం చేసుకోవడం కోసమే తెల్లవారుఝామునే మేల్కోంటాయి. కానీ అన్ని తెలుసనుకున్న, ఇంగ్లీష్ విద్యలు బాగా అబ్బిన చదువుకున్న 'అవిద్యావంతులు' మాత్రమే ఆ సమయంలో గురకపెట్టి నిద్రపోతారు. పైగా తమ ఇంట్లో పసిపిల్లలు ఆ సమాయనికి మేల్కోంటే, వాళ్ళని కూడా నిద్రబుచ్చి, ఆ పిల్లలకున్న ప్రాకృతమైన జ్ఞానం కంటే తమకున్న అజ్ఞానమే గొప్పదాని వాడి మీద కూడా రుద్దుతారు. పక్షులు, జంతువులు కూడా ఈ సమయానికి మేల్కొని తమ శరీరాలు బయట ప్రపంచంలో ఉండే ప్రాణశక్తిని గ్రహించేందుకు సిద్ధం చేసుకుంటాయి. ఇది విశ్వంలో సహజంగా ప్రతి రోజు కలిగే మార్పు.

అదే అర్దరాత్రి 12 గంటలకు ఏ మార్పూ కలగదు. పైగా అది నిశాచర జీవులు తప్ప మిగితా అన్ని జీవాలు తప్పక నిద్రించాల్సిన సమయం అంటుంది మన శాస్త్రం. ఆ సమయంలో శరీరం ఉదయం కోల్పోయిన శక్తిని పొందుతుంది, అలసిన శరీర భాగాలు తిరిగి శక్తివంతమయ్యేలా ఓజస్సు ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో జీవక్రియలన్నీ చాలా నెమ్మదిస్తాయి. అసలు ఆ సమయంలో మెల్కొనకూడదు. అలాంటిది రాత్రి 12 కు రోజు మారుతుంది అంటారు పాశ్చాత్యులు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే, వాడిని ఆ సమయం వరకు నిద్రపోనివ్వరు, లేదా నిద్రపోయినా, ఫోన్ చేసి, వాడి నిద్ర చెడగొట్టి శుభాకాంక్షలు చెప్తారు. అవి శుభాకాంక్షలా? లేక ఆరోగ్యానికి అశుభాకాంక్షలా? ఎవరికైనా ఒకరి మీద ప్రేమ ఉంటే, వాడు నిద్రపోతున్నాడు, లేపకండి, గట్టిగా శబ్దాలు చేయకండి అంటారు. అంతేకానీ ఇదేంటో, మనం ఎక్కడి నుంచి చూసి తలకు ఎక్కించుకున్నామో కానీ, ప్రాణస్నేహితుడని హాయిగా నిద్రపోతున్నవాడిని సైతం పుట్టిన రోజని ఆకాశం ఊడిపడ్డట్టు నిద్రలేపుతారు. న్యూ ఇయర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది ప్రపంచ తాగుబోతుల దినోత్సవం ............. అధికారికంగా ప్రకటించకపోయినా. జీవక్రియలు నెమ్మదించే సమయమని ముందే చెప్పుకున్నాం కదా, అయినా అలాంటి సమయంలో వీళ్ళు కేకులు తిని, మందు కొట్టి వేడుకలు జరుపుకుంటారు. ఆరోగ్యం నోట మన్ను కొడతారు, పటాసులు కాల్చి మిగితా జీవాల నిద్ర చెడగొడతారు. అది ఏ మార్పూ కలగని సమయం. కానీ వారికి రోజు మారుతుంది !? మారిందా? మారిందనుకుంటున్నారా?

అంటే మనం గమనించాల్సింది మన ధర్మంలో రోజు మార్పంటే నూతన శక్తి, నూతన ఉత్తేజం. మన ధర్మంలో మార్పు అంటే ఎవరో మనుష్యులు నిర్ణయించేది కాదు, ఈశ్వరుడు నిర్ణయించినది, ప్రకృతిబద్ధమైనది. పాశ్చాత్యులు వారి రోజు మార్పును నిద్రలోనో, మత్తులోనో ఆహ్వానిస్తే, హిందువులు మాత్రం దానికి సిద్ధపడి ముందే స్వాగతం పలుకుతారు. అది సుప్రభాతం.

To be continued .............

Sunday, 6 December 2015

హిందూ ధర్మం - 186 (నిరుక్తము - 5)

7. వేదంలో దేవాపి అనగా మహాభారత ఇతిహాసంలో కనబడే ఋషి కాదు. ఏ వ్యక్తైతే విద్యావంతులను గౌరవించి, వారితో స్నేహం చేస్తాడో అతడు దేవాపి, అది ఉరుములకు గల ఒక పేరు కూడా.
8. వేదంలో శంతను మహాభారతంలో ఉన్న శంతన మహారాజు కాదు. యాస్కుడి ప్రకారం మానసిక ప్రశాంతత కలిగి ఉన్న వ్యక్తే శంతనుడు. నీటిని కూడా శంతను అంటారు ఎందుకంటే అది మానవాళికి శాంతిని, మేలును చేకురుస్తుంది.
9. వేదంలో అంగీసరుడనేది వ్యక్తి పేరు కాదు. ప్రజ్వలిస్తున్న అగ్నియే అంగీరసుడు. భగవంతుడే అంగీరసుడు, ఎందుకనగా భగవంతుడే అగ్ని. మనం ఊపిరి తీసుకునేలోపే ఈ భూమి అంతటికి వెలుగును పంచగలవాడు, కాల్చివేయగలవాడు కనుక వేదంలో అంగీరసుడనగా భగవంతుడనే అర్దం కూడా వస్తుంది. విద్యావంతుడిని అంగీరసుడంటారు. స్వామి దయానందులు రాస్తూ అంగీరః అనగా 'అంగతి  జానాతి యో విద్వాన్'. జ్ఞానం తెలిసినవాడు అంగీరసుడంటారు.
10. యజుర్వేదం 13వ కాండలో వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, విశ్వకర్మ ఇత్యాది నామాలు కనిపిస్తాయి. ఐతిహాసిక పద్ధతిలో వాటిని ఋషులుగా చెప్పగా, శతపధ బ్రాహ్మణం వాటిని ఈ విధంగా చెప్తుంది.
* ప్రాణోవై వశిష్ట ఋషిః - అన్ని వాయువులలోకి శ్రేష్టమైనది కనుక ప్రాణాన్ని వశిష్ట ఋషి అన్నారు.
* మనోవై భర్ద్వాజ ఋషిః - ఆహారం వలన బలం పొందుతుంది కనుక మనసుకు భరద్వాజ ఋషి అని పేరు.
* చక్షుర్వై జమదగ్ని ఋషిః - ప్రపంచాన్ని చూస్తుంది కళ్ళకు జమదగ్నిఋషి అని పేరు.
* శ్రోత్రంవై విశ్వామిత్ర ఋషిః - అన్ని దిశల నుంచి వచ్చే అన్ని విషయాలను వింటుంది కనుక చెవులను విశ్వామిత్ర ఋషి అన్నారు.
* వాగ్వై విశ్వకర్మ ఋషిః - విషయాలను వ్యక్తిపరిచి, విశదపరిచి, వాటికి వైభవాన్ని చేకుర్స్తున్న వాక్కు విశ్వకర్మ ఋషి.
బ్రాహ్మణాల్లో వశిష్ట, జమదగ్ని, విశ్వకర్మ పదాలను ప్రజాపతి, భగవంతుడు, రాజు, ఇంటిపెద్దకు అర్దంగా వివరించారు. విశ్వామిత్రుని వాక్కుగా చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి కుడి చెవిని గౌతముడని, ఎడమ చెవిని జమదగ్ని అని, కుడి ముక్కును వశిష్టుడని, ఎడమ నాసికను కశ్యపుడని, వాక్కును అత్రి అని అంటారు.

11. ఊర్వశి అనేది కూడా వ్యక్తి నామం కాదు. ఊరు వశే యస్యాః - ఉరుములే ఊర్వశి, అన్నిటిని నియంత్రించేది, అధికంగా భుజించేది. పిడుగును ఊర్వశి అన్నారు ఎందుకంటే పిడుగుపాటు అనేక వస్తువులను నశింపజేస్తుంది.
12. మహాభరతంలో కనిపించే చంద్రవంశానికి చెందిన పురూరవుడు వేదంలో కనిపించే పురూరవుడు ఒకరు కాదు. నిరుక్తం ఆధారంగా 5-46, వేదంలో పురూరవుడనేది బాగా గర్జించే, ఉరుమే మేఘం పేరు.
13. అప్సరసలు దేవవేశ్యలు కారు. ఉపనిషత్తుల్లో అప్సరసలు ప్రాణాలకు సంకేతం. (యోగి సాధనలో ఉన్నప్పుడు ఒక్కో ప్రాణం విజృంభించి తపోభంగం చేస్తూ ఉంటుంది. ఒక్కో ప్రాణాన్ని గురుపర్యవేక్షణలో జయించి, అదుపులో పెట్టుకుని సాధుకుడు ముందు వెళ్ళి, పరబ్రహ్మాన్ని చేరుతాడు.) శిల్పసంగీతంలో పింగాణి పాత్రలు, గిన్నెలు. జ్యోతిష్యంలో దిక్కులు, దిశలు. జీవాణు విజ్ఞాన (Bacteriology) శాస్త్రంలో రోగకారక క్రిములు. రసవిజ్ఞాన (Alchemy) శాస్త్రంలో విద్యుత్ ప్రవాహం. (చూడండి, ఒక్క అప్సరస అనే పదమే ఒక్కో శాస్త్రంలో ఒక్కో అర్దాన్ని సూచిస్తుంది. ఎక్కడ ఏ అర్దం అవసరమో అక్కడ అదే ఉపయోగించాలి. అది అర్దం చేసుకోకుండా వేదానికి వక్రభాష్యం రాయడం వల్లనే వేదంలో గోవధ, యుద్ధాలు, జంతుబలులు, ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలు కుట్రదారులకు కనిపించాయి. అయినా వారి ముఖ్య ఉద్దేశం హిందువులని తప్పుదోవ పట్టించడమే కనుక వారికి ఇవన్నీ తెలుసుకోవలసిన పనిలేదు. ఒక సామన్య అర్దాన్ని అన్ని చోట్లా అన్వయం చేసి, నానా రాద్ధాంతం చేశారు.)

To be continued ...................

Friday, 7 August 2015

బొడ్డు తాయత్తు

తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు.దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే.  ఈ బొడ్డుతాడు ను పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపాత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.

ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది. అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమనప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం" ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం".

సేకరణ: Via కొండూరు వాసుదేవరావు గారు, గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు 

Sunday, 28 June 2015

హిందూ ధర్మం - 164 (సృష్టి- నాసదీయసూక్తం)

వేదాల్లో ఇప్పటివరకు విజ్ఞానం గురించి, స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తంలో సృష్ట్యారంభం గురించి చెప్పబడ్డ నాసదీయసూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతనవైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది. ఎప్పటి నుంచో జరుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధాల్లో సృష్ట్యాది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్ట్యాదిగానే అర్దం చేసుకోవాలి.

---------------------------------

ఈ విశ్వం ఎందుకు ఉంది? అంటే, ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమిటి? ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వనిర్మాణానికి వాడబడ్డ ఘటకద్రవ్యాలు ఏమిటి? ఈ విశ్వం ప్రాదుర్భావానికి కారణభూతులు ఎవ్వరు? మహావిస్పోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహావిస్పోటనం ఎందుకు జరిగింది? ఈ విస్పోటనంతోటే స్థలం, కాలం పుట్టేయని అన్నాం కదా. విస్పోటనానికి 'ముందు' స్థలమే లేకపోతే ఆ పేలిన పదార్ధం (బ్రహ్మ పదార్ధం?) ఎక్కడ ఉండేది? మహావిస్పోటనంలోనే కాలం పుట్టినప్పుడు 'విస్పోటనానికి ముందు' అనే సమాసానికి అర్ధం ఉందా?

పోనీ, పైన అడిగిన ప్రశ్నలకి వేదాంత ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం – మాటవరసకి. మన ప్రశ్నలని భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే అడుగుదాం. పదార్ధం పరమాణు రేణువులతో తయారయింది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ (అంటే స్థిరత్వం) ఉండి, కొన్నింటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడుగున్నాడో, ఎంత బరువున్నాడో కొలిచినంత మాత్రాన ఆ మనిషి తత్త్వం అర్ధం అవుతుందా? అలాగే మనం చేసినదల్లా విశ్వంలోని అంశాలని కొన్నింటిని – దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు, మొదలైన భౌతిక రాశులని - కొలిచాం. అంతే కాని ఈ విశ్వం యొక్క తత్త్వాన్ని అర్ధం చేసుకోలేదు. అంటే ఇప్పుడు మన దగ్గరున్న కేవలం సమాచారం (Information) మాత్రమే. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ రకం ప్రశ్నలకి ఆధునిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది – ఇప్పటివరకు.

అంటే ఏమిటన్నమాట? కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతాలలో దొరకొచ్చనే ఆశ ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి వెతుకుదాం.

ప్రశ్నలను మొదట లేవనెత్తినవారు సనాతనధర్మానికి చెందిన ఋషులే.ఋగ్వేదంలో (10.129) నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది. ఎందుకంటే వర్ణించటం అనేది మనసుతో, భాషతో చేసే పని. మనసుకు చాలా వేగవనతమైనది, శక్తివంతమైనదే అయినా, దానికి కొన్ని పరిమితులున్నాయి. అది అన్నిటిని చెప్పగలదు కానీ సర్వాతీతమైన భగవంతుని గురించి చెప్పలేదు. మనసుకు ఆ స్థాయిని వర్ణించగలశక్తి లేదు. భగవంతుని అనుభూతి చెందడం తప్పించి, దాన్ని భావంలో చెప్పలేము. అటువంటిది సృష్టికి పూర్వం ఏముందంటే ఏం చెప్పగలం? సృష్టికి పూర్వం ఉన్నది కేవలం భగవత్తత్వం మాత్రమే. పరబ్రహ్మం తప్ప వేరొకటిలేదు. అయినా కరుణతో ఆ పరమసత్యం యొక్క చిన్న బింధువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. సమాధిస్థితిలో మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మ సత్యాన్ని భాష విధించిన శృంఖలాలకి బద్ధులై చెప్పారు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని భాషలో బంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయి ఉంటుంది. మిగిలినదానిని ఇంగ్లీషులోకో, తెలుగులోకో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరో వన్నె తరిగిపోతుంది. అయినా సరే నాసదీయ సూక్తంలోని ఏడు శ్లోకాలలోని భావాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
---------------------------------------------------



नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् ।
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥1॥

సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?

न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या अह्न आसीत्प्रकेतः ।
आनीदवातं स्वधया तदेकं तस्माद्धान्यन्न परः किं चनास ॥2॥

మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.

तम आसीत् तमसा गूळमग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदम्
तुच्येनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाजायतैकम् || 3 ||

అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)

कामस्तदग्रॆ समवर्तताधि मनसॊ रॆत: प्रथमं यदासीत् ।
सतॊबन्धुमसति निरविन्दन्हृदि प्रतीष्या कवयॊ मनीषा ॥4॥

దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.

तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासी दुपरिस्विदासी ।
रेतोधाआसन् महिमान आसन् स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ॥5॥

మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.

को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥

కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).

इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥

ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుసా అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)

ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ రచనకు సహయాపడిన రచనలు -
వేమూరి వేంకటేశ్వరరావు గారి విశ్వస్వరూపం అనే వ్యాససంపుటం
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct11/viswaswarupam.html
స్వామి కృష్ణానంద సరస్వతీ గారు నాసదీయసూక్తానికి రాసిన భాష్యం
http://ajitvadakayil.blogspot.in/2014/07/nasadiya-sukta-rig-veda-5000-bc.html
http://hinduismdecoded.blogspot.in/2014/10/nasadiya-sukta-of-rig-veda-creation-of.html

To be continued .................

Sunday, 7 June 2015

హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం)



యజుర్వేదం 22-26 మంత్రాలు మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరణ ఇస్తాయి. అక్కడ యజ్ఞప్రక్రియ గురించి చెప్తూ, మేఘాలు ఏర్పడే విధానం, వర్షాలు కురవడానికి సూర్యుడికి ఉన్న సంబంధం వివరించారు. యజుర్వేదం 24-20 మంత్రంలో 6 ఋతువుల గురించి ఉంది.

యజుర్వేదం 17-2 లో సంఖ్యా, గణితశాస్త్రాల ప్రస్తావన ఉంది. ఒకటి, పది, పది పదులు వంద, వంద పదులు వెయ్యి, వంద వేలు లక్ష అంటూ పదిలక్షలు, కోటి, పదికోట్లు, నూరుకోట్లు, వెయ్యి కోట్లు, దానికి పదిరెట్లు మహాపద్మం, దానికి పదిరెట్లు శంఖం, దానికి పదిరెట్లు సముద్రం, దానికి పదిరెట్లు మధ్య, దానికి పదిరెట్లు ప్రర్ధం అంటూ పెద్ద పెద్ద సంఖ్యలను ఆ మంత్రం వివరిస్తోంది.
------------------------------------------------

రసాయన శాస్త్రం

గురుదత్త్ విద్యార్ధి గారు వేదంలో మిత్రా, వరుణ పదాలకు అర్దం చెప్తూ మిత్ర అంటే ప్రాణవాయువని (Oxygen), వరుణ అంటే హైడ్రోజన్ అని, రెండిటి సారమే జలమని వివరించారు.

విద్యుత్ గురించి

అధర్వణవేదం 6-111-4, 6-130-1 లో అప్సరసలకు తేజస్సు, విద్యుత్, శక్తి అనే అర్దాలున్నాయి. 6-118-1 లో దానికే సూర్యకిరణాలనే అర్దం ఉంది.

యజుర్వేదం 24-15-19 లో విద్యుత్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సౌరవిద్యుత్తు, తోకచుక్కలు, కొన్ని రకాల వృక్షాల నుండి విద్యుత్తును వెలికితీసే విధానం గురించి చెప్పబడింది. అదే ఈ శ్లోకం

 రౌద్రీ భాస్వంతు సంయోగాజ్జాయతే మారికాభిదా|
 విషశక్తిస్తయా సూర్యకిరణాశని సంభవం||

అసలు విద్యుత్ అనేది ఒకటుందని సమాజానికి తెలియదని, పూర్వీకులు చీకటిలో మగ్గారని కొందరు అంటున్నారు. కానీ వేదం సౌర విద్యుత్ గురించి చెప్పడమే కాక, వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి కూడా చెప్పింది. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు కూడా వృక్షాల్లో విద్యుత్ఛక్తి ఉందని, తులసి, రావి మొక్కలో అధికశాతంలో ఈ శక్తి నిక్షిప్తమైందని చెప్తున్నాయి.

దేవీచంద్ గారి అధర్వణవేద భాష్యంలో విద్యుత్‌కు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. సైనిక కార్యకలాపాల్లో విద్యుత్ వాడకం గురించి, విద్యుత్ఛక్తితో నడిచే అతిశీతలీకరణ యంత్రాల గురించి, వాటిలో నిల్వ ఉంచే ఔషధాల గురించి, విద్యుత్‌తో నడిచే వాహనాల గురించి, యంత్రాల గురించి ఇళ్ళను కూడా విద్యుత్ఛక్తితో వెలిగించడం గురించి అధర్వణవేదంలో ఉన్న విషయాలను వారు ప్రమాణ పూర్వకంగా విశదీకరించడం చూస్తే, ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పరు. వేదద్వేషులైతే నాలుక్కరుచుకుంటారు.
---------------------------------------

భౌతిక శాస్త్రం

హెచ్.సి. వర్మ గారు కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం రచించారు. అందులో స్పీడ్ ఆఫ్ లైట్ అనే అధ్యాయంలో జి.వి.రాఘవరావు గారి పుస్తకం నుంచి ఋగ్వేద మంత్రాన్ని ప్రస్తావిస్తూ, అధునిక శస్త్రవిజ్ఞానం కనుగొన్న అనేక విషయాలు వేదల్లో నిక్షిప్తమై ఉన్నాయని, తెలియతని వాటిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తారానిర్విశ్వదర్శతో జ్యోతిస్కరిదసి సూర్య విశ్వంబసిరోచనం|
తాతాచస్మర్యత యోజనం సహస్రం ద్వే ద్వే శతే ద్వేచ యోజనే||
ఏకేన నిమిషర్దేనా క్రమనా నమోస్తుతే - ఋగ్వేదం 1-50-4

దీనికి సాయనాచార్యుడు 15 వ శత్బాదంలో బాష్యం రాశారు. అందులో ఆయన సూర్యకాంతి అర్దనిమిషంలో 2202 యోజనాలు ప్రయాణం చేస్తుందని వివరించారు. యోజనం అనే మాట వైదిక వాజ్ఞ్మయంలో తరచూ కనిపిస్తుంది. 1 యోజనం అంటే 4 కోసులు, అనగా బ్రిటీష్ వారి లెక్కలో 8000 గజాలు, ఒక గజం అనగా 0.9144 మీటర్లు.

సమయాన్ని లెక్కించడం గురించి శ్రీ మద్భాగవతం చెప్తోంది. ఒక 15 నిమిషాలు = 1 కాష్ఠ, 15 కాష్ఠలు ఒక లఘు, 30 లఘులు = 1 ముహూర్తం, 30 ముహూర్తాలు = 1 దివారాత్రము (పగలురాత్రి/రోజు). ఆధునిక బాషలో చెప్పుకుంటే 24 గంటలు. ఒక నిమిషం అంటే 16/75 సెకన్లు (తెలుగు నిమిషాలు కాదు, సంస్కృతపదాల గురించి మాట్లాడుకుంటున్నాం, గమనించండి).

 అర్ధనిమిషానికి 2202 యోజనాలను SI units లో మారిస్తే, 3.08*108 మీటర్ ప్రతి సెకనుకు వస్తుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం సూర్యకాంతి భూమిని చేరుటకు చెప్పిన వేగంతో సరిపోతోంది.
-----------------------------------

దేవమిత్రస్వామి తన Searching for Vedic India అనే పుస్తకంలో వెళ్ళడించిన విషయాలు చూద్దాం.

అధర్వణవేదంలో ఒక మంత్రం ఇలా అంటున్నది. 'ఓ శిష్యుడా! రాజనీతిశాస్త్ర విద్యార్ధి, సముద్రాలపై నౌకల్లో ప్రయాణించు, విమానాల ద్వారా ఆకాశంలో విహరించు, సృష్టికర్త అయిన భగవంతుని వేదాల ద్వారా తెలుసుకో, యోగం ద్వారా శ్వాసను నియంత్రించు, జ్యోతిష్యం (ఖగోళ శాస్త్రం) ద్వారా పగులు, రాత్రి యొక్క ధర్మాలను తెలుసుకో, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను తెలుసుకో.

ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, భూగోళశాస్త్రం ద్వారా సూర్యుడు కింద ఉన్న ఈ భూమిపై ఉండే అన్ని దేశాలకు వెళ్ళు. రాజనీతి శాస్త్రం, వృత్తి నైపుణ్య శాస్త్రాల ద్వారా మంచి జ్ఞానం పొందు, వైద్యశాస్త్రం ద్వారా వైద్య మూలికల గురించి అవగాహన కలిగించుకో, జలముల గురించిన శాస్త్రం (హైడ్రోస్టాటిక్స్) ద్వారా నీటి యొక్క వివిధ ఉపయోగాలను తెలుస్కో, మిరుమిట్లు గొలిపే కాంతి గురించి విద్యుత్ శాస్త్రం ద్వారా తెలుసుకో. నా ఆదేశాలను మనఃపూర్వకంగా ఆచరించు - యజుర్వేదం 6.21 (ఇది సాక్షాత్తు భగవంతుని ఉపదేశం).

అట్లాగే అధర్వణవేదం 20.41.1-3 మంత్రాలు అణుశక్తి గురించి చెప్తున్నాయి.
---------------------------------------

To be continued ...............

ఈ రచనకు సహకరించిన వెబ్‌సైట్లు :
ఆర్యసమాజం దయానంద సరస్వతీ విరచిత ఋగ్వేద భాష్యభూమిక
http://www.speakingtree.in/spiritual-blogs/seekers/science-of-spirituality/the-speed-of-light-rigvedic-hymn
https://cpdarshi.wordpress.com/2011/10/01/color-and-speed-of-light-as-per-vedas/
https://groups.google.com/forum/#!topic/samskrita/d8OA7E-7WOU

Friday, 5 June 2015

పర్యావరణం - ఋషుల సందేశం

ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణ విషయంలో అందరిని జాగృత పరచడానికి, అవగాహన కలిగించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటికి అనేకమంది దీంతో మాకు సంబంధమేమిటి? అనేక సమస్యలుండగా ఇదే పట్టించుకోవాలా? అంటున్నారు. ఇటువంటి తరుణంలో అసలు పర్యావరణ పరిరక్షణ గురించి వేదాలు, ఋషులు, గురువులు, సాధువులు ఏం చెప్పారో చూద్దాం.

అసలు ప్రకృతిని చూడగానే మనసు పులకిస్తుంది, తెలియని ఆనందం కలుగుతుంది, పెద్దపెద్ద రోగాల బారిన పడినవారు కూడా ప్రకృతి మధ్య ఉంటే, త్వరగా కోలుకుంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. పువ్వులను, సీతాకోకచిలుకలను, జలపాతాలను చూడగానే ఏదో తెలియని అనుభూతి కలగడం అందరికే తెలిసింది. దానికి కారణం ఏంటో తెలుసా?

శ్రీ రవీంద్రనాధ్ ఠాగూర్ గారు వారి పుస్తకాల్లో ఇలా వెల్లడించారు. 'సమాధి స్థితిలో ఉన్న ఋషులు తొలిసారి ఈ రహస్యం గుట్టు విప్పారు. తైత్తరీయ ఉపనిషత్తులో దాన్ని పొందుపరిచారు. ప్రకృతి భగవంతుని ఆనందం యొక్క వ్యక్తీకరణ. భగవంతుడు సచ్చిదానందుడు. ఆయన తన ఆనందస్థితికి ఒక రూపం ఇవ్వాలని సంకల్పించినప్పుడు అది ప్రకృతిగా రూపాంతరం చెందింది. అందుకే ప్రకృతిలోకి వెళ్ళితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది'.

ఋషులు కూడా ఇదే విషయాన్ని స్మృతులలో పొందుపరిచారు. విద్యాభ్యాసం నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా, ప్రకృతి రమణీయత మధ్య జరగాలని మనుస్మృతి చెప్తోంది. చుట్టు గోడలు కట్టి రూముల్లో పిల్లలకు భోధన చేయడం వృధా అని, అది వారి ఎదుగుదలను నిరోధిస్తుందని, వారి లాభం చేయకపోగా, నష్టం చేకూరుస్తుందని చెప్పారు. ప్రకృతి మధ్య సాగే విద్యాభ్యాసం, పిల్లల్లో ఉన్న అంతఃశ్శక్తిని జాగృతం చేస్తుందని చెప్పారు. ఈ కారణంగా రవీంద్రనాధ్ ఠాగూర్ గారి శాంతినికేతనం, పరమహంస యోగానందగారి 'యోగదా సత్సంగ్ సోసైటీ ఆఫ్ ఇండియా' ఋషులు చెప్పిన పద్ధతుల్లోనే ప్రకృతి మధ్యే విద్యాబోధన చేస్తున్నాయి. దీని బట్టి ప్రకృతి యొక్క శక్తిని అర్దం చేసుకోవచ్చు.

ప్రకృతి మాత్రమే మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తపరచగలదు. సత్యాకామ జాబాలికి గౌతమ మహర్షి చేసిన ఉపదేశం కూడా ఇదే పద్ధతిలో సాగింది.

ప్రకృతిమాత మధ్యలో మనిషి భగవంతుని యొక్క చైతన్యాన్ని తనకు తెలియకుండానే పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు కనుకనే అతడు ఆనందాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శ్రీ అరబిందో గారు ఇలా చెప్పారు. 'మనలో ఉన్న చైతన్యమే పువ్వులో కూడా ఉంది. సూక్ష్మమైన ఈ విషయాన్ని మన ఆత్మ గ్రహించినందువల్లనే, మన హృదయం ఆనందంతో నిండిపోతోంది'.

మనిషి తన భౌతికమైన పరిధుల నుంచి బయటకు వచ్చి, అన్నింటా వ్యాపించి ఉన్న ఆనంతమైన తత్వాన్ని తెలుసుకొనుటకు ప్రకృతే సహాయం చేస్తోందని శ్రీ అరబిందో గారు యోగా గురించి రాసిన లేఖల్లో వివరించారు. అందుకే ఋషులు కూడా తపస్సు చేయుటకు అడవులకు వెళ్ళమని సలహా ఇస్తారు. ప్రకృతికి మనిషిని అంతర్ముఖం చేసి, సూక్ష్మమైన రహస్యాలను వెళ్ళడించగల శక్తి ఉంది. ప్రకృతి జడపధార్దం కాదు, అందులో చైతన్యం ఉంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామం 'ఓం ప్రకృత్యై నమః'. జీవరాశికి కావలసిన ఆహారాన్నే కాదు, మానవుడి పరమగమ్యమైన శాశ్వత ముక్తికి కూడా ప్రకృతి దోహదపడుతోంది. అందుకే ఇప్పటికి గురువులు చెప్పే మాట ఏమిటంటే ఎక్కడైన పచ్చదనం పరిడవిల్లిన చోటుకు వెళ్ళి, రోజూ ఒంటరిగా కాసేపు మౌనంగా గడపమని లేక మంత్రంజపం చేస్తే క్రమంగా ప్రశాంతత లభిస్తుందని.

పర్యావరణం ఎంత స్వఛ్ఛంగా, పవిత్రంగా ఉంటే మానవుడు అంత స్వఛ్ఛంగా పవిత్రంగా ఉంటాడు.  ప్రకృతి నాశనమైతే మానవుడు నాశనమవుతాడు, పరతత్వానికి దూరమవుతాడు, ప్రకృతిని నాశనం చేసేవారు భగవంతుని ఆగ్రహానికి కారణమవుతారు. ముక్తి కూడా దూరమవుతారు. అనేకమంది యోగులు, సిద్ధపురుషులు తమ జీవతంలో ఇచ్చిన సందేశాల్లో ప్రకృతిని రక్షించడం ముఖ్యమైనది. పతంజలి యోగశాస్త్రం కూడా అహింసకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. అహింసను పాటించకుండా, ప్రకృతిని రక్షింకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు.

ప్రకృతిని రక్షించుకోవడం మన బాధ్యత. పర్యావరణ దినోత్సవం ప్రపంచానికి పర్యావరణ హితమార్గాన్ని ఎంచుకోమని గుర్తు చేస్తుంటే, భారతీయులకు మాత్రం తమ పూర్వీకులు నడిచిన ధర్మమార్గాన్ని గుర్తు చేస్తోంది.    


సమిష్టి ప్రయత్నాలు మాత్రమే పర్యావరణాన్ని రక్షించగలవు. రండి, పర్యావరణాన్ని రక్షించుకుందాం.

Sunday, 31 May 2015

హిందూ ధర్మం - 160 (వేదంలో విజ్ఞానశాస్త్రం)



వేదాల్లో టెలిగ్రాఫీ (తంతి) గురించి :

అశ్వినీ శక్తుల (రెండు వ్యతిరేక దిశల మధ్య ఉండే) సాయంతో, సైన్యం సమర్ధవంతంగా పని చేయడం కోసం  విద్యుత్ యొక్క మంచి కండక్టర్‌లైన తంతి పరికరాలను అమర్చి వాడుకోండి. కానీ జాగ్రత్తగా ఉపయోగించండి - ఋగ్వేదం 1.119.10

యజుర్వేదం 18-8, 12 మంత్రాల్లో వివిధ రకాల జంతువుల గురించి ఉంది. ఇది జంతుశాస్త్రానికి బీజం వేసింది.

అధర్వణ వేదం 10 వ కాండంలో శరీర నిర్మాణ శాస్త్రం గురించి ప్రాధమిక వర్ణన ఉంది.

రెండు మడమల మీద మానవదేహం నిలబడేలా యుక్తితో కూర్చిందెవరు? మాంసంతో మందంగా కప్పిందెవరు? చీలమండలను తయారుచేసిందెవరు?  అందమైన వేళ్ళను రూపొందించి, కీళ్ళ ద్వారా కలిపిన తత్వం ఏమిటి? మానవునికి జ్ఞానేంద్రియాలను ప్రసాదించిందెవరు? కాళ్ళకు అరికాళ్ళను అమర్చింది, నడుముకు బలాన్ని ఇచ్చిందెవరు? - అధర్వణవేదం 10-2-1 అంటూ ఈ మంత్రం భగవంతుని వైభవాన్ని ఒక వైపు కీర్తిస్తున్నా, మరొక వైపు దేహనిర్మాణం గురించి ప్రాధమిక అవగాహన కల్పిస్తోంది.

9 ద్వారములతో (9 రంధ్రాలు - 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము), దేవతలు నివసించు 8 వృత్తములతో (5 జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; మనసు, బుద్ధి, అహంకారము), బంగారు కాంతితో వెలిగిపోతున్న దివ్యతత్త్వముతో (ఆత్మతో), దాన్ని ఆవరించి ఉన్న దివతేజస్సుతో (భగవంతుని యొక్క కాంతి) అబేధ్యమైన నగరం వలే ఈ శరీరం నిర్మించబడింది - అధర్వణవేదం 10-2-31. ఇందులో కేవలం శరీరం నిర్మాణం గురించే కాక, ఆధ్యాత్మిక తత్వం గురించి కూడా వివరించబడింది. (స్వేచ్చానువాదం చేశాను కనుక తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరు).

రోగకారక క్రిములు గురించి ప్రస్తావన

అధర్వణవేదం 4-37, 19-36-6 లో అప్సరసలు, గంధర్వులు అనే పదాలు కనిపిస్తాయి. అక్కడ వాటి అర్దం వ్యాధికారక క్రిములని, అవి త్వరగా చాలా దూరం వ్యాపించే శక్తి కలవనీ చెప్పబడింది. వాటి ఆకారాలు, రూపాలు, వాటి సంవృద్ధికారక విషయాలు, వాటిని నిరోధించుటకు, వాటి వ్యాప్తిని కట్టడి చేయుటకు తీసుకోవలసిన ఆయుర్వేద నివారాణోపాయల గురించి విపులంగా ఉంది. ఇది సూక్ష్మజీవశాస్త్రానికి బీజం వేసింది.

ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీగారు వైదిక సంస్కృతికి చేసిన సేవ ఎనలేనిది. వారు వేదాలకు రాసిన అర్ధాలు అత్యధ్బుతం, సశాస్త్రీయం. దయానంద సరస్వతికి మించిన హేతువాది నాస్తికులలో కూడా ఉండరు. ఇప్పటి ఆధునిక పరిశోధనలు కనుగొంటున్న అనేక విషయాలను వారు ఆకాలంలోనే ప్రస్తావించారు. గత 2000 ఏళ్ళలో వేదాలకు అటువంటు అర్ధాలు వెలువడలేదంటే అతిశయోక్తి కాదు. వారి వేదభాష్యం సనతానధర్మానికి కొత్త ఊపిరిలూదింది. ఇప్పటికీ అనేకమంది వాటిలో తప్పులు వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, విఫలం అవుతూనే ఉన్నారు. వారు వేదాల్లో వైమానికి, నౌకా నిర్మాణ శాస్త్రాలున్నాయని మంత్రసహితంగా 1876 లో తమ వేదభాష్య పరిచయంలో వివరించారు.  వాటిని ఐఐఎస్సి వారు పరిశీలించి, దయానందులు విమాన నిర్మాణం గురించి, దాని పనితీరు గురించి చెప్పినవన్నీ ఆచరణయోగ్యాలనీ, సాధ్యమని వెళ్ళడించారు. నిజానికి వారు విమానాల గురించి ప్రస్తావించే సమయానికి ఆధునిక కాలంలో ఇంకా విమానలు కనుగొనలేదు. దయానందుని మరణం తర్వాత 20 ఏళ్ళు గడిచాకా గానీ మానవ సహిత విమానం ఎగరలేదు. వారు విమానాల పనితీరుని గురించి ఈ మంత్రాలకు అర్ధాల్లో వివరించారు. ఋగ్వేదం 1.116.3, 1.116.4, 10.62.1, 1.116.5, 1.116.6, 1.34.2, 1.34.7, 1.48.8 మొదలైనవి.

అట్లాగే దురవాణి (రేడియో) గురించి తమ ఋగ్వేదభాష్య భూమికలో వివరించారు దయానంద సరస్వతీగారు. నిజానికి అప్పటికి ఇంకా రేడియో అనే పరికరం ఒకటి ఉందని కానీ, చాలా దూరం వరకు మనిషి మాటలను ఆకాశమాధ్యమం ద్వారా ప్రసారం చేయచ్చని కానీ పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. అప్పటికింకా రేడియో కనుగొనబడలేదు. వేదాల్లో అన్ని ఉన్నాయిష అని వ్యంగ్యంగా మాట్లాడేవారు, వేదాల్లో ఒట్టి మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారికి ఈ విషయాలు చెప్పినా అర్దం కావడంలేదు. వారి లక్ష్యం విజ్ఞానాన్ని మెచ్చుకోవడం కాదు, వేదాన్ని ద్వేషించడం. అంతకుమించి ఏమీ లేదు. అసలు నిజానికి రేడియో కనుగొన్నది జగదీష్ చంద్రబోస్ గారే కానీ మార్కోని కాదు. కానీ కొన్ని కుటిల కారణల చేత మార్కోనికి పేరు వచ్చింది.

To be continued .....................

ఈ రచనకు సహాయపడినవి : http://agniveer.blogspot.in/2010/01/science-in-vedas.html
పూజ్యశ్రీ దయానంద సరస్వతీ (ఆర్యసమాజం) వారి వేద భాష్యం

Sunday, 24 May 2015

హిందూ ధర్మం - 159 (వేదంలో ఖగోళశాస్త్ర విషయాలు)

వేదాల్లో ప్రస్తావించబడ్డ ఖగోళశాస్త్ర విషయాలు. ఆధునిక విజ్ఞానశాస్త్రజ్ఞులు కూడా కనుగొన్నవి. ఈ ఖగోళ విషయాలు కనుగొనడానికి, అంగీకరించడానికి పాశ్చాత్య ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.



భూభ్రమణానికి చెందిన విషయాలు

భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికి అది ముందుకు కదులుతుంది. దాంతో పాటు దానిపైన ఉన్నవి కూడా కదులుతాయి. భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుంది - ఋగ్వేదం 10.22.14

ఏ విధంగానైతే ఒక శిక్షకుడు తను కొత్తగా శిక్షణ ఇచ్చే గుర్రాలను తన చుట్టు తిప్పుకుంటాడో, అట్లాగే సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను తన అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - ఋగ్ వేదం 10.149.1  

గురుత్వాకర్షణ శక్తికి చెందిన విషయాలు

ఓ ఇంద్రుడా! అయస్కాంతశక్తి, ఆకర్షణ శక్తి - ప్రకాశం, కదిలకలు వంటి గుణాలు కలిగిన నీ దివ్య కిరణాల చేత ఈ సమస్త విశ్వాన్ని నిర్ణీత పద్ధతిలో నడిపిస్తున్నావు. ఈ విశ్వమొత్తం గురుత్వాకర్షణ శక్తి చేతనే నడుస్తోంది - ఋగ్ వేదం 8.12.28

సూర్యుడు తన కక్ష్యలో తాను తిరుగుతున్నా, భూమి మొదలైన ఇతరత్రా గ్రహాలు, అన్యపదార్ధాలను కూడా ఒకదానికొకటి ఢీకొనకుండా ఆకర్షణ శక్తి ద్వారా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - యజుర్వేదం 33.43 

సూర్యుడు తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడు అందరికంటే బరువైనవాడు, పెద్దవాడు అవ్వడం వలన తన యొక్క ఆకర్షణ శక్తి చేత భూమి మొదలైన గ్రహాలు ఆయన చుట్టు తిరుగుతాయి - ఋగ్వేదం 1.164.13 (మనమున్న విశ్వంలో సూర్యుడే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం. గ్రహాలు, శకలాలు అనేకం ఉన్నా, అన్నిటికంటే పెద్దది సూర్యగోళమే. సూర్యుడే ఈ విశ్వానికి ఆధారభూతమై ఉన్నాడని ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా తెలుసుకున్నమాట అందరికి విధితమే. ఈ విషయాన్ని ఋగ్వేదం కొన్ని కోట్ల ఏళ్ళ క్రితమే స్పష్టం చేసింది.)

సూర్యుడే భూమిని, ఇతర గ్రహాలను పట్టి ఉంచాడు - అధర్వణవేదం 4.11.1  (సూర్యుడిలో గురుత్వాకర్షణశక్తి లేకపోతే, ఈ విశ్వం సజావుగా నడవదు. అంతా గందరగోళంగా తయారవుతుంది.)

చంద్రుని కాంతి గురించి - చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యుడి మీద ఆధారపడ్డవాడన్న విషయం కూడా వేదం ప్రస్తావించింది.

భ్రమణం కలిగిన చంద్రుడు ఎప్పుడు సూర్యుడి నుంచి వెలుగును (కాంతి కిరణాలను) గ్రహిస్తాడు - ఋగ్వేదం 1.84.15

చంద్రుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాతింబవళ్ళు ఆ వివాహానికి హాజరయ్యాయి. సూర్యుడు తన కూమర్తే అయిన సూర్యకిరణాన్ని ఇచ్చి వివాహం చేశాడు - ఋగ్వేదం 1.85.9 (భార్యభర్తలు విడదీయరానివారు. ఒకరు లేకుండా ఇంకొకరిని ఊహించడం అసాధ్యం. అట్లాగే సూర్యకాంతి లేని చంద్రుడిని ఊహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యకాంతి మీద ఆధారపడ్డవాడు. అందుకే వేదం ఈ ఉపమానం వేసింది.)

గ్రహణం గురించి - ఈ మధ్య ఒక కొత్త ప్రచారం ఊపందుకుంది. హిందువులకు గ్రహణం గురించి తెలియదు, చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య అడ్డురావడం వలన సూర్యగ్రహణం, భూమి నీడ చంద్రుడిపై పడడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ వీళ్ళేదో పాములు వచ్చి మింగేస్తాయని చెప్తారు అంటున్నారు. అటువంటి వారికి ఇది కనువిప్పు కావాలి. రాహుకేతువులు అనగా ఛాయలు (నీడలు) మాత్రమే. రాహుకేతువులను సర్పాలుగా పురాణంలో చెప్పగా, వేదం గ్రహణం గురించి అసలు ప్రక్రియ వెల్లడించింది. పురాణంలో ఉన్న విషయాలన్నిటిని యధాతధంగా స్వీకరించకూడదు. వాటిలో అనేక రహస్యాలు, ఉపాసనా పద్ధతులు నిక్షిప్తమై ఉంటాయి. వేదం అనాది. అందులో గ్రహణం గురించి ఏమూందో చూడండి.

ఓ సూర్యుడా! నీవు ఎవరికి కాంతిని బహుమతిగా ఇస్తున్నావో, అతడే (చంద్రుడే) నీ కాంతికి అడ్డుతగలడంతో (భూమికి సూర్యుడికి మధ్య అడ్డురావడంతో) కముకున్న చీకటివలన భూమి (భూమిపై ఉన్న జీవరాశి అని అర్దం చేసుకోవాలి) భీతిల్లుతోంది - ఋగ్వేదం 5.40.5 

ఈ విషయాలు చదివి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమీ తెలియకుండా హైందవసంస్కృతిని విమర్శించకండి.

To be continued ..........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: http://agniveer.blogspot.in/2010/01/science-in-vedas.html

Thursday, 30 April 2015

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం....
‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం... ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు! ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘్ధన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు... వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది... అనంతం... అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతి యుగం’’,‘‘రాతి యుగం’’,‘‘లోహ యు గం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞా నం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు... బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!

పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ- నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి....

ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పనె్నండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం... ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను....

హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??

చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!

‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!

ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు... వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం...!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు!్ధన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర.... ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!

- హెబ్బార్ నాగేశ్వరరావు 30/04/2015 (ఆంధ్రభూమి విశ్లేషణ)
http://www.andhrabhoomi.net/content/main-feature-58

Thursday, 5 March 2015

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు

## Must read this ##

6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు.

భారతీయుల ప్రతి పండుగలోనూ పర్యావరణము, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. హోలీకా దహనం కూడా అలాంటిదే. హోలికా దహనంలో వాడే కట్టెలు కూడా ఔషధగుణములున్న వాటినే ఎంచుకునేవారు. యావత్ భారతదేశంలో ఒకేరాత్రి హోలికా దహనం చేయటం వల్ల శీతాకాలపు చలి- వేసికాలపు వేడి కలిసే ఈ ఋతుపరివర్తన సమయంలో వ్యాపించే మలేరియా, చర్మవ్యాధులు వంటి అంటురోగాలకు కారకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి. సూర్యుడి వేడి ఇంకా పెరగకముందే వాయుమండలాన్ని వేడెక్కించడం, వాతావరణలోనికి ఔషధ గుణములున్న పొగను పంపించడం ద్వారా రోగకారక క్రిములు నాశనమవుతాయి. హోలీ దహనజ్వాలకు ప్రదక్షిణం చేయటం వలన 140 °F శరీరానికి తగిలడం, అక్కడున్న వారంత ఆ వాయువును పీల్చడం వలన శరీరంలో ఇంతకముందే ప్రవేశించి ఉన్న రోగకారక క్రిములు నాశనమవుతాయి.

కానీ మనం ఆధునికులం కదా. అందుకే మన పూర్వీకులకు భిన్నంగా హోలీకా దహనంలో రబ్బరు టైర్లు, ఇతర చెత్తాచెదారం వేసి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, మన ఆరోగ్యాలను చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. భూతాపాన్ని ఇంకా పెంచేస్తున్నాం.

రంగుల విషయానికి వద్దాం. మోదుగ పూలు తెచ్చి, రోట్లో దంచి కుండలోపోసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. దానీ వావివరసుల పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల నుండి తీసిన కషాయం ఈ మాసం వాతావరణంలో మన దేహం మీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు పెరుగుంతుందని, ఆరోగ్యం చేకూరుతుందని, శరీరంలో రక్తపోటు వంటి జబ్బుల వలన కలిగే ఉద్రేకాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదంతా మన పూర్వీకుల ఆలోచన.

కానీ మనమేం చేస్తున్నాం? చెట్ల వ్రేళ్ళు, ఆకుల నుండి తీసిన సహజ రంగులకు భిన్నంగా రసాయన రంగులు వాడుతున్నాం. వాటిలో బోరిక్ యాసిడ్, గాజు పొడితో తయారైన పొటాషియం డైక్రోమేట్, ఆంలం వాడతారు. జింక్ క్లోరైడ్ కలిసిన రంగులు కొంత విషప్రభావాన్ని కలిగుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మన శరీరానికి చర్మం  రక్షాకవచం లాంటిది. స్వల్పంగా హానీ కలిగించే రసాయనిక తత్వాలు తగిలినా రక్తంలో కలువనివ్వదు. కాని, శరీరంపై గాయం ఉండటం, గాయం అప్పుడే జరిగి ఉండడటం లేదా పూర్తిగా మానని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానిపై ఈ రసాయనిక రంగులు తగిలితే, ఆ గాయం రంగుల రసాయనిక ప్రభావం వలన రక్తంలో ప్రసరించే ప్రమాదం ఉంది. నీటితో కలిసి లోపల ప్రవేశించిన రంగులు మలమూత్రాదుల ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ, సీసం - తగరం వంటి పదార్ధాలు శరీరంలోనికి ప్రవేశిస్తే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. జింక్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిసిన రంగులు చర్మంపై పడితే బొబ్బలు లేచే ప్రమాదం ఉంటుంది. ఈ రంగులు ప్రమాదవశాత్తు నోటిలో పడి శరీరంలో ప్రవేశిస్తే శరీరంలోని సునితమైన భాగాలు దెబ్బతినటమే కాక చర్మం రంగు నీలంగా మారే ప్రమదం ఉంటుంది. గులాల్ తయారిలో పొటాషియం డైకోమేట్ ఉపయోగించారంటే వివిధ చర్మవ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.  

బజారులో దొరికే గులాల్ చాలావరకు రసాయనిక మిశ్రమాలే. అందుచేత వాటిని శరీరంపై ఉత్సాహం కొద్దీ రాసుకోవటంలో సంతోషం కంటే ప్రమాదమే అధికం. పిల్లల విషయంలొ మరీ  జాగ్రత్తగా ఉండాలి. కారణం- వారికి వెంటనే రంగులను దులుపుకోవాలని కానీ, కడిగేయాలని కాని తోచదు. అందుకే పిల్లలు హోలీ ఆడుతుంటే పెద్దలు దగ్గరే ఉండండి. కళ్ళలో రంగులు పడనీయకండి.

ఈ వసంతం తయారు చేసుకోవడంలో ఎంత సరదా ఉండేదో. తయారు చేస్తూనే ఒకరు మీద ఒకరు చల్లుకునేవారు, చాలా సరదాగా గడిపేవారు. పెద్దవాళ్ళని ఒకసారి కదిపితే, ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎంత సంతోషపడతారో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనానికి అన్నీ రెడీమేడ్ కావాలి, అవసరమైతే డబ్బు పడేస్తాం, కానీ అంత కష్టం ఎవరు పడతారు, మాకు అంత ఓపిక లేదంటారు, ఇలా అనే చాలా సరదాలను, మధురజ్ఞాపకాలను కోల్పోతున్నారు. పైగా మార్కెట్‌ను చైనా రంగులు ముంచెత్తుతున్నాయి. ఆ రంగులను కొని చైనా ఆర్ధికవ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ..................

కొత్త పోకడలు ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సరదాలను, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయి. భారతీయులు తిరిగి సంప్రదాయ బద్దంగా పండుగుల జరుపుకోవాలి. సంప్రదాయాలను కాపాడాలి.

సహజ రంగులనే వాడండి. పర్యావరణాన్ని కాపడండి. ఆరోగ్యవంతులుగా జీవించండి.

హోలీ శుభాకాంక్షలు

Tuesday, 4 November 2014

కార్తీక పౌర్ణమి - సముద్ర స్నానం

కార్తీకపూర్ణిమ, సముద్ర స్నానం.

శాస్త్రంలో సముద్రస్నానానికి ప్రత్యేకత ఉంది. ఆషాడ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలకు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయాలి.

కార్తీక మాసంలో చంద్రకిరణాల నుండి అమృతబిందువులు వర్షిస్తాయి, అవి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు, చంద్ర కిరణాలతో మధుమేహానికి ఔషధం తయారుచేసే పద్ధతి మనం దేశంలో ఉంది. ఈ చంద్రకిరణాలు, చంద్రుడి ప్రభావం నీటిపై అధికంగా ఉంటుంది, పూర్ణిమ రోజున మరింత విశేషంగా ఉంటుంది. చంద్ర కిరణ ప్రభావిత నీటిలో చేసే స్నానం అనేక రోగాలను నయం చేస్తుంది. అందుకోసమే కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి పూర్వమే సముద్రస్నానం చేయాలి.

ఇక ఆయుర్వేద పరంగా చెప్పుకుంటే, ఈ రోజు చేసే సముద్రస్నానం చలికారణంగా మన చర్మం మీద ఏర్పడిన పగుళ్ళను, గాయాలను నయం చేస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయి బద్దకాన్ని కలిగించే విద్యుత్ అయస్కాంత శక్తిని తొలగిస్తుంది. ఉదర, కాలేయ సంబంధిత రోగాల బారినపడకుండా రక్షిస్తుంది.  

కనుక సముద్ర స్నానం చేయాలనుకునేవారు తగిన ఏర్పాట్లు చేసుకోండి.     

Sunday, 4 May 2014

శంకరాచార్యులు - ఆధునిక పరిశోధనలు

శంకరాచార్యులను మనం కేవలం ఒక ధర్మ ప్రబోధకుడిగా మాత్రమే చూస్తున్నాం కానీ, నిజానికి ఆయన ఒక శాస్త్రకారుడు, మానవ సమాజానికి విజ్ఞానం అందించిన మహాపురుషుడు. శంకరులే కాదు, సనాతన హిందూ ధర్మాన్ని ప్రబోధించిన ప్రతి ఆచార్యుడూ ఒక శాస్త్రకారుడే, మానవ ఇతిహాసంలో వైజ్ఞానికంగా కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మహానుభావుడే.

శంకారాచార్యులవారు అద్వైతాన్ని ప్రభోదించారు. అద్వైతాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసినప్పుడు అద్వైతంలో అణుశాస్త్రం కనిపిస్తుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితమే శ్రీ శంకరభగవత్పాదులు Concept of Indivisible atoms ను అద్వైతంలో వివరించారు. ఈ సృష్టిలో ఉన్న తత్వం ఒక్కటే. జీవుడికి, ఈశ్వరుడికి అభేధం.
బ్రహ్మ సత్యం జగత్ మిధ్యా జీవో బ్రహ్మైవనాపరః  
బ్రహ్మం ఒక్కటే సత్యము, ఈ జగత్తు అంతా మాయ, జీవుడు(ఆత్మ) బ్రహ్మం తప్ప వేరొకటి కాదు అన్నారు శంకర భగవత్పాదాచార్యులు. ఆత్మ కూడా పరమాత్ముడు నుండి వేరుపడిన పదార్ధమే. ఆత్మ పరమాత్మ రూపమే. జీవుడే దేవుడు, కాని మాయ చేత మనిషి తన స్వరూపం తాను తెలుసుకోలేకపోతున్నాడంటూ ఈయన ప్రబోధించిన అద్వైతం Albert Einstein కు ప్రేరణ ఇచ్చింది. శంకరులవారి అద్వైతసిద్ధాంతం చదివి ప్రేరణ పొందిన Albert Einstein, Thoery of Relativity ని అందించారు.

శంకరాచార్యులవారి రచనలు భక్తినే కాకా విజ్ఞానాన్ని కూడా అందించాయి. పైకి భక్తి రచనల్లా కనిపించినా, వాటిలో శాస్త్ర రహస్యాలు అనేకం అందించారు. సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని సహస్రదళ కమలంలో కూర్చున్నట్టుగా వర్ణించారు. ఆధునిక సైంటిస్టుల పరిశోధనలో దైవ పధార్ధమే ఆ సహస్రదళ పద్మం అని ఈ మధ్యే జరిగిన పరిశోధన ఆధారంగా తెలుసుకుని విస్తుపోయారు. శ్రీ చక్ర మహామేరు సృష్టి ఆరంభం గురించి రహస్యాలను తెలుపుతుందని, శ్రీ చక్రానికి ఉన్న త్రికోణాలు లయం గురించి చెప్తాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శంకరాచార్యులే పార్టికల్ ఫిజిక్సుకు పితామహులని (father of particle physics) వర్ణిస్తున్నారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శంకరులు ప్రవచించిన అద్వైతం మామూలువారి కంటే Quantum physics ఫీల్డ్ లో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు బాగా అర్దమవుతుంది. నిజానికి విదేశాల్లో అద్వైతాన్ని వారే ప్రచారం చేస్తున్నారు.

శంకరులు ప్రభోదించిన అద్వైతం సృష్టిలో ఏకత్వాన్ని చాటుతోంది. 20వ శతాబ్దపు ఫిజిక్స్ శాస్త్రవేత్తలకు పరిశోధనల ఫలితంగా స్పష్టంగా అర్దమైంది. ఇది స్పష్టమైంది. పెద్ద సూర్యగోళం నుంచి చిన్న అణువు వరకు, జీవులలోను, అజీవాలలోనూ ఒకే శక్తి ఉన్నదని, ఒకటే అనేకంగా కనపడుతోందని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తూ, ఇదంతా శంకరులు అద్వైతంలో చెప్పినదేనని స్పష్టం చేయడం హిందువులకు గర్వకారణం. ఆధునిక పిజిక్స్ మీద జరిగిన ప్రతి పరిశోధన అద్వైత సిద్ధాంతాన్ని నిరూపణం చేస్తోంది.  కావాలంటే ఈ లింకుల్లో ఉన్న సైంటిస్టుల అభిప్రాయాలను చదవండి.
http://bhagavatulu.blogspot.in/2013/11/david-ohm-and-advaita-vedanta.html
http://bhagavatulu.blogspot.in/2013/09/entanglement-and-advaita.html

E=mc²  సూత్రం చెప్పిన తర్వాత Albert Einstein మాట్లాడుతూ, నేను చెప్పిన  E=mc² సూత్రం మానవసమాజాన్ని ముందుకు తీసుకువెళుతుందో లేదో స్పష్టంగా చెప్పలేను  కానీ, శ్రీ శంకరాచార్యులవారి మిథ్యా సిద్ధాంతం మాత్రం మనిషి మనిషిగా బ్రతికేందుకు తప్పక ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్తున్నా అన్నారు.

స్వామి వివేకానందుడు భవిష్యవాణి  చెప్తూ, 21వ శతాబ్దంలో సమస్తప్రపంచానికి అద్వైతం మార్గదర్శకమవుతుంది. అద్వైతం వైభవం ప్రపంచమంతా వ్యాపిస్తుందంటూ చెప్పినమాట వాస్తవంలో కనిపిస్తూనే ఉంది.

జయ జయ శంకర! హర హర శంకర!!          

Wednesday, 17 July 2013

దక్షిణాయనం విశేషాలు

17 జూలై  నుంచి దక్షిణాయనం


ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో 2 రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు 23, రెండవది మార్చి 21. మిగితా రోజులలో 6 నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో 6 నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.


ఆధ్యాత్మికంగా చెప్పుకోలవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయ్యింది. సంవత్సరంలో ఉత్తారాయనానికి ఎంత విశిష్టత ఉందో, దక్షిణాయనానికి కూడా అంతే ఉంది. రెండు కాలపురుషుని అంతర్భాగాలే.

శాస్త్రీయంగా చూసినప్పుడు దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీదకు తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా ప్రజలలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడం కోసం ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరున మన పాటించే నియమాలు రోగనిరోదక శక్తిని పెంచి, ఆయుషును వృద్ది చేస్తాయి.

దక్షిణాయనంలో బ్రహ్మచర్యానికి ఆయుర్వేదం అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది. ఆయుర్వేదం వేరు, ధర్మశాస్త్రం వేరు కాదు. ఆయుర్వేదం కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. దక్షిణాయనంలో ధాతువులను రక్షించుకోవాలి, వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో ధాతువులను వృధా చేసుకోవడం వలన రోగాల బారిన పడతారని, దక్షిణాయనం ఆయుర్వేదం చెప్తోంది.

ఎలా చూసిన దక్షిణాయనంలో మనం చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

Wednesday, 27 February 2013

శ్రీ రామసేతువు

జై శ్రీ రామ

700 సంవత్సరాల ఇస్లాం దండయాత్రలు, 300 సంవత్సరాల (బ్రిటిష్)క్రైస్తవ ఆక్రమణ, దాడుల తరువాత కూడా ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది ఒక్క హిందూ ధర్మమే. మన సంస్కృతి ఎవరు వేలెత్తి చూపలేరు. గత 200 సంవత్సరాలలో కొనుగొన్నామని చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన తాళ్ళపత్ర గ్రందాల్లో రాయబడి ఉన్నాయి. మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, స్మృతులు, సంహితలు ఉన్నాయి.  రామాయణ, మహభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే 'ఇలాగే జరిగింది ' అని అర్దం. ఇవి ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాయి.

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, విలువలను నాశనం చేయాలని భావించారు. దానికి ఆద్యుడు మోకాలె. ఈయన భారతదేశం మొత్తం పర్యటించి బ్రిటిష్ పార్లమెంట్లో 2-2-1835 న ఒక ప్రసంగం చేశాడు.

Lord Macaulay’s address to the British Parliament in 2 February, 1835:

"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."


ఈ దేశాన్ని ఆక్రమించాలన్నా, భారతదేశాన్ని ఎప్పటికి బానిస దేశం గా మార్చాలన్నా ముందు ఈ దేశస్థులకు తమ ధర్మం, తమ విద్యావిధానం కంటే, ఇంగ్లీష్ మరియు విదేశీ విద్యావిధానం మంచిది, వారి సంస్కృతే గొప్పదనే భావన రావాలి, అందుకు భారతదేశాంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడమే ఆ ప్రసంగ సారాంశం. దాని అమలు పరిచి Geomentry వంటి 18 సబ్జెక్టులతో ఉన్న హిందూ విద్యావిధానాన్ని సర్వనాశనం చేశారు.

దానికి తోడు వారి బైబిలు ఈ సృష్టి వయసు 5000 సంవత్సరాలని చెప్పింది. దాని వాదనను బలపరచడం కోసం, తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం మన దేశ చరిత్రను తారుమారు చేసి కల్పితమైన చరిత్రను మనకు ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు(ఆధారాలు రాబోయే రోజుల్లో తెలియపరుస్తాం). ఇప్పుడు మనం పాఠశాలలో చదివినది, వారు వ్రాసిన చరిత్రే. దానితో పాటు అనేక చారిత్రిక ఆధారాలను నాశనం చేశారు. అప్పుడే వారు హిందువుల పురాణాలు కల్పితాలు, అవన్ని అబద్దాలంటూ, పుక్కిటి పురాణాలు హిందువులవి అంటూ ప్రచారం చేశారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అంతా మన పురాణాల్లో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. అవి తప్పని ప్రచారం జరిగితే కానీ తమూ వ్రాసిన చరిత్రను భారతీయులు నమ్మరన్నది వారి ఆలోచన.

వారి విద్యావిధానంలో చదువుకున్న మనం కూడా మన పురాణ, ఇతిహాసాలు కల్పితాలంటూ, మన సంస్కృతి వ్యర్ధమంటూ, పదేపదే మనల్ని మన నిందించుకుంటూ మోకాలే వారస పుత్రులం అయ్యాం.

విషయంలోకి వస్తే రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు. ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది ఈ 'శ్రీ రామ సేతువు '. దీని కూల్చడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.      

త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది.

రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు.

వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము".

సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు  Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది.

పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు.

వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి.

పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు.

ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ  దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈ వంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.

సేకరణ-

Ram Setu A Construction Engineering Wonder 

రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం,

రామసేతువు నిర్మాణం ఎలా చేశారు?  

వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71)  

సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51
తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః

నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.

హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58
పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ 
ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59

కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి).

"సూత్రాణ్యయే ప్రగృణంతి హ్యాయతం శతయోజనం" అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల  stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం  మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు.  కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు.  రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా  కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి.

ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది.    

ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది?

నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే.  

సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బంది కలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7 equal intervalsలో  రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి.

సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్.

త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు. తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు  గడిచాయి.  రామసేతువు  నిర్మాణం  త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం.

ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి.  Say it with pride : We are Hindus.

కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన  bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును  పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు.

పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి.

రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం.

భారత్-శ్రీలంకల మధ్య ఒక వంతెన ఉన్నదని నాసా ఫోటోలు విడుదల చేసినప్పటికి, అది సహజంగా ఏర్పడిన వంతెన అనే చాలాకాలం వాదించింది. దాని వయసు సూమారు 17,50,000 ఏళ్ళు అని  చెప్పింది. అక్కడ ఉన్న పగడాలు, యాంటి-బయాటిక్ లక్షణాలు కలిగి అంతరిక్షయానం చేసేవారికి ఉపయోగపడే  algae, ఇవన్ని చూశాక అమెరికా భారత్ మీద అసూయతో అనేకవాదనలు చేసింది. అది 17,50,000 సంవత్సరాల నాటిదని చెప్పడం చేత అది శ్రీ రామసేతువు కాదని హిందువలను నమ్మించవచ్చని భావించింది.

అసలు విషయం వేరే ఉన్నది. అదేంటంటే అమెరికా అన్ని మతాలను సమానంగా చూడదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలవాలంటే ముందు అక్కడున్న క్రైస్తవ మిషనరీల పెద్దల యొక్క అనుమతి ఉండాలి. వారు ఎవరికి మద్దతిస్తే వారే గేలుస్తారు. ఇదంతా చాలా రహస్యంగా జరిగే ప్రక్రియ. వారి మద్దతుతో అధ్యక్షుడయ్యకా ఎవరైనా 'ఆ మతం' యొక్క వ్యాప్తికి కృషి చేస్తారు. అందులో భాగంగానే భారత్ ను మరో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారు చేయాలనుకుంటోంది అమెరికా. ఇక్కడ హిందువులు, భౌద్ధులు, సిక్కులు మీద జరిపే మతమార్పిడులను ఎప్పటికప్పుడు రహస్యంగా నివేదికల ద్వారా తెప్పించికుంటుంది అమెరికా. ఒకవేళ ఎక్కడైనా తమ మతపచారాన్ని అడ్డుకుంటే భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తుంది.( ఇదంతా చాలా రహస్యంగా జరిగే నిరంతర ప్రక్రియ. ఇది ఏ కొద్దిమందికి మాత్రమే తెలుసు.) తమ మతప్రచారాన్ని యధేచ్చగా జరిపించుకుంటుంది. తమ మతప్రచారానికి ఒక చిన్న అడ్డంకి ఏర్పడినా, పెద్ద ఉత్పాతం సంభవించినట్టు తెగ హడావుడి చేస్తుంది. భారతీయ సంస్కృతిని, హిందు, జైన, భౌద్ధ సిక్కు మతాలాను సమూలంగా భారత్ నుంచి తుడుచిపెట్టి ఈ దేశ పరిపాలనను తమ స్వహస్తాల్లోకి తీసుకోవాలన్నది అమెరికా ప్రభుత్వం వెనుక ఉండి ఈ నాటకం నడిపిస్తున్న వారి ఆలోచన. అందులో భాగంగానే హిందువుల రామాయణం నిజమని చెప్పే ఆధారమైన రామసేతువును కూల్చేయాలన్నది వారి ఆలోచన. ఇప్పటికే బ్రిటిషర్లు మహభారత కాలనికి సంబంధించిన ఆధారాలను అనేకం నాశనం చేశారు.  రామాయణం ఎప్పుడో జరింగిందో తెలియక, అదంతా ఒక కధగా, ఒక నమ్మకంగా భావిస్తున్నాం. మనకు నిజాలు తెలిసేలోపు ఆధారాలను మాయం చేయాలన్నది అమెరికా ఆలోచన.

కానీ నిజం నిప్పులాంటిది. సత్యమేవ జయతే, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అని మనకు మన గ్రంధాలు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి. పరమాత్మ సత్యం. సత్యాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరు. ఒక జెర్మన్ బృదం రామసేతువు మీద 'కార్బన్ డేటింగ్' చేసి, దాని వయసు 9,00,000 సంవత్సరాలని తేల్చింది. ఇది మన హిందువులు రామావతారం గురించి చెప్పే సమయంతో సరిపోతోంది.

2004లో భారత్ మీద సూనామీ విరుచుకుపడినప్పుడు, ఆ భయంకర అలలు దక్షిన తమిళనాడు, కేరళ మీద పడకుండా ఆపింది రామసేతువు. రామసేతువే కనుక లేకపోయి ఉంటే కొంకణతీర ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరేది. ఇప్పుడు రామసేతువును కూల్చేసి, సేతు సముద్రం ప్రాజెక్టును చేపడితే, భవిష్యత్తులో మరొక సూనామీ వస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి.

రామసేతువు వలన, దాని దగ్గరి ప్రాంతంలో ఒక different వాతవరణం నెలకొని ఉంది. అక్కడున్నAlgae కు ఔషధ గుణాలున్నాయని 2012 జూలై ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించారు. అక్కడున్న Algea  మీద మరిన్ని పరిశోధనలు చేసి, ప్రజల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఒక మందును తయారు చేయవచ్చని వెల్లడించారు.

రామసేతువు వద్ద చాలా అరుదైన marine atmosphere కనిపిస్తుంది. అంతరించబోయే జాబితలో చేర్చబడిన 5 జాతులకు సంబంధించిన జీవరాశికి ఈ రామసేతువే ఆధారం. దీన్ని కూల్చేస్తే అక్కడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోతుంది . సేతు సందురం ప్రాజెక్టు వలన లక్షలమంది జాలర్లు జీవనం కోల్పోతారు.

ఈ రోజు ప్రపంచంలో అణువిద్యుత్ ప్లాంట్ల(nulcear plants)కు థోరియం(Thorium) ప్రత్యామ్నాయ ఇధనం(alternative fuel). భారత్ ప్రపంచంలో 25% థోరియం నిలువలు కలిగివుంది. అందులోనూ సగానికి పైగా  థోరియం నిలువలు తమిళనాడు సముద్ర తీరంలో రామసేతువు దగ్గరగా ఉన్నాయి. మన దగ్గరున్న థోరియం నిలువలతో భారత్, మరే ఇతర దేశం మీద ఆధారపడే పరిస్థితి లేదు . రామసేతువు, సముద్రపు కెరటాలను అదుపు చేయడంతో పాటు, వాటిని క్రమబద్దీకరించడం వలన అక్కడ Thorium, Titanium అధికంగా ఇసుకలో  ఉన్నాయి. సేతు సముద్రం ప్రాజెక్టు పేరుతో రామసేతువును కూల్చేయడం వలన అక్కడ ఉన్న mineral deposits కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. థోరియం ను అక్రమరవాణా చేయడం సులభవుతుంది. అంతేకాదూ, రామసేతువు కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కూడా ఇందుకే. గుట్టు చప్పుడు కాకుండా అక్కడున్న మన జాతి సంపదైన  Thoriumను విదేశాలకు తరలించి, అక్రమంగా డబ్బు సంపాదించాలన్నది వారి ఆలోచన. అందుకే ఎంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా, వారు రామసేతువును నాశనం చేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.        

 రామసేతువును కూల్చి నౌకలు వెళ్ళెందుకు వీలుగా ఒక మార్గం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే చాలసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఎద్దురుదెబ్బలే తగిలాయి.

 జనతా పార్టీ అధ్యక్షుడు, సుబ్రమణ్యస్వామి రాసిన ఒక రెపోర్టును Asian Age ప్రచురించింది. 23-1-2007 న Asian Age లో ప్రచురింపబడిన దాని ప్రకారం  Dredging Corporation of India(DCI) హోలాండ్ నుండి ఒక dredger ను import చేసుకుంది. అది రామసేతువు దగ్గర పని ప్రారంభించడానికి వెళ్ళి, సేతువుకు తగలగానే రెండు ముక్కలై, సముద్రంలో మునిగిపోయింది. Dredger ను సాగరగర్భం నుండి బయటకు తీయడానికి వెళ్ళిన DCI crane కూడా విరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనను గురించి ఆరా తీయడానికి వచ్చి, ఆ ప్రదేశానికి వెళ్ళిన రష్యన్ ఇంజనీరుకు ఒక కాలు విరిగింది. గుట్టు చప్పుడు కాకుండా పని కానిద్దాం అనుకున్నారు. ప్రజలను మోసం చేయచ్చు, కాని పరమాత్ముడుని మోసం చేయగలరా? హిమాలయ పర్వతాల్లో, కైలాస మానససరోవరం చుట్టుప్రక్కల ఈ రోజుకి శ్రీ ఆంజనేయ స్వామి వారు తపస్సు చేస్తున్నారు. తన రాముడి సేతువు వద్దక వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా?

 జై హనుమాన్

రామసేతువు 1480 వరకు వాడుకలో ఉండేది. దాని మీది నుండి ప్రజలు ఇరుదేశాల మధ్య వ్యాపారం కొనసాగించారు. కాని ఆ తరువాతి కాలంలో వచ్చిన ఒక భారీ తుఫాను వలన రామసేతువు 3 నుండి 7 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయింది.

రాముడిని పూజించే హిందువులున్న పవిత్ర భారతదేశ ప్రభుత్వం రామసేతువును పగులగొట్టాలని ప్రయత్నిస్తుంటే, రావణాసురుడిని ఆరాధించే శ్రీ లంక, అక్కడి ప్రభుత్వం మాత్రం సముద్రం కలిసిన సేతువు మీద ఒక మార్గం నిర్మించి, రామాయణ కాలం నాటి ఆనవాళ్ళను ప్రపంచానికి ప్రదర్శిస్తూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

Tuesday, 19 February 2013

జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?

|| ॐ || ఓం నమో నారాయణాయ || ॐ ||

ॐ My Dear youth, You 'must' read this post.
ॐ జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?

ॐ మనకు తెలుసు చంద్రుడు భూమి చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతాడు. మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే చంద్రుడి యొక్క ప్రతి 12 డిగ్రీలకు గమనాన్ని ఒక తిధిగా లెక్కించాలి. ఇలా 360 డిగ్రీల గమనానికి మొత్తం 30 తిధులు వస్తాయి.

ॐ అమావస్య తరువాత వచ్చే పాడ్యమితో మన హిందువులకు నెల(మాసం)మొదలువుతుంది.అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మొత్తం 15 రోజులు. 15 రోజులను ఒక పక్షం అంటారు. అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి తో ముగిసే మొదటి పక్షాన్ని శుద్ధ పక్షం/శుక్ల పక్షం అంటారు. పౌర్ణమి తరువత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలమైన రెండవ పక్షాన్ని బహుళ పక్షం/కృష్ణ పక్షం. 

ॐ శుద్ధ ఏకాదశి అంటే 120 నుంచి 132 డిగ్రీల మధ్య ఉన్న చంద్రగమనం.  300 నుంచి 312 డిగ్రీల చంద్రగమనం బహుళ ఏకాదశి.

ॐ జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని నిర్ణయించబడవే తిధులు. ఇదంతా సైన్సు. అందుకే మన సుప్రీం కోర్టు కూడా జ్యోతిష్యం సైన్సు అని తీర్పునిచ్చింది.

ॐ మన హిందువుల గొప్పతనం ఏమిటంటే ఏ టెలిస్కోపు వాడకుండా, తమ మేధస్సుతోనే ఇదంతా లెక్కగట్టి చెప్తారు.

ॐ హిందువని గర్వించండి. హిందువుగా జీవించండి.          

ॐ 21-2-2013, గురువారం మాఘశుద్ధ ఏకాదశి, దీనికి భీష్మ ఏకాదశి అని పేరు. ఈ రోజున తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి.విష్ణు నామాలను జపించండి.  

Saturday, 16 February 2013

హిందువులు-సైన్సు


ॐ రధాన్ని గుర్రాలు ముందుకు తీసుకువెళ్ళిన విధంగా సూర్యుని సప్తవర్ణ కిరణాలు ఈ సమస్త ప్రపంచానికి వెలుగునిస్తాయి - ఋగ్ వేదం 1/150/8

ॐ సప్తాశ్వ రధమారూఢం......అంటూ సూర్యాష్టకం లో వస్తుంది. అంటే సూర్యుడు 7 గుర్రాలున్న రధం మీద వస్తాడని కాదు. సూర్య కాంతిలో 7 రంగులు ఉంటాయని అర్దం.

ॐ సూర్యుడు తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడు. భూమి, ఇతర గ్రహాలను సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తికి లోనై సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి - ఋగ్ వేదం 1.164.13 

ॐ ఏ విధంగానైతే ఒక ట్రైనెర్ కొత్తగా సిక్షణ ఇవ్వబడె గుర్రాలను తన చుట్టు తిప్పుకున్నాట్టు, సూర్యుడు భూమి మొదలైన గ్రహాలను తన ఆకర్షణ శక్తి ద్వారా కట్టిఉంచి, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - ఋగ్ వేదం 10.149.1

ఈనాటి సైన్సు ప్రతిపాదించకముందే మన హిందువులు ఇలాంటి అనేక శాస్త్రీయ విషయాలను ప్రపంచానికి అందించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఈ రోజు టి.వి. పెడితే కొన్ని చానెల్స్, కొన్ని సంస్థలు మీ హిందువులవన్ని మూఢనమ్మకాలు. సూర్యుడు భూమి చుట్టు తిరుగుతున్నాడని మీ గ్రంధాలు చెప్తున్నాయంటూ మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. మన గ్రంధాలు సూర్యుడి చుట్టూనే భూమి తిరుగుతోందని చెప్తున్న వాళ్ళ కళ్ళకు ఇవేమి కనిపించవు. పనిపాట లేక, కాలం గడువక, కేవలం అస్తిత్వం కోసం చేసే అటువంటి అటువంటి విషప్రచారాలను నమ్మకండి.

Wednesday, 26 December 2012

ధ్యానం

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

పిరమిడ్ అద్భుత శక్తి-
ప్రపంచంలో ఏడు వింతలలో ఒకటైన పిరమిడ్ విశ్వశక్తి(cosmic energy)ని విస్తారముగా తీసుకోగిలిగిన కట్టడం.పిరమిడ్ నండు కూర్చుని ధ్యానం చేయడం ద్వారా 3రెట్ల అధికమైన విశ్వశక్తి(cosmic energy)ని తీసుకొనవచ్చు.పిరమిడ్ లో ధ్యానం చేసినవారు పూర్తి ఆరోగ్యం పొందగలుగుతారు.ప్రతి రోజు ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం పొంది ఆరోగ్యంగా,ఆనందంగా జీవించగలము.

ధ్యానం చేసే పద్ధతి-
హాయిగా సుఖాసనంలో కూర్చుని చేతులు రెండు కలిపి,వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని,కళ్ళు మూసుకుని సహజంగా జరిగే ఉచ్చ్వాస,నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి.ఏ మంత్రం జపించనవసరం లేదు.ఏ దైవస్వరూపాన్ని ఊహించనవసరం లేదు.మధ్యమధ్యలో వచ్చే ఆలోచనలను విడిచిపెట్టి మళ్ళీమళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనలు కలుగని స్థితికి చేరుకుంటాము.ఇదే ధ్యానం!ఈ ధ్యానం పిరమిడ్ క్రింద చేస్తే మూడింతల శక్తి అధికంగా పొందవచ్చు.ఈ ధ్యానం ఏ వయస్సువారైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా చేయవచ్చు.  

మన ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న కడ్తాల్ గ్రామంలో ఆసియలోనే అతిపెద్ద పిరమిడ్ నిర్మాణం జరిగింది.ఇక్కడ డిసెంబరు 21 నుండి 31 వరకు ప్రపంచ ధ్యాన మహా సభలు జరుగుతున్నాయి.వీలు ఉంటే సందర్శించండి.మీరు ప్రతి రోజు ధ్యానం చేయండి.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
http://pssmovement.org/English/index.php

Thursday, 20 December 2012

21-12-2012 యుగాంతం జరగదు.

21-12-2012 యుగాంతం జరగదు.
"కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే" అంటూ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది హిందువులు పూజకు ముందు సంకల్పంలో చెప్తారు.మన ధార్మికగ్రంధాల ప్రకారం కలియుగం 4,20,000 సంవత్సరాల కాలం.దానికి 4 పాదాలు.ఒక్కో పాదం 1,05,000 సంవత్సరాలు.ప్రస్తుతం కలియుగంలో 5114 సంవత్సరంలో ఉన్నాం మనం.ఇప్పుడు కలియుగ ప్రధమపాదం జరుగుతోంది.ప్రధమపాదం కూడా పూర్తవ్వనే లేదు.ఇక యుగాంతం ఎక్కడ?

ఇక జ్యోతిష్యం ప్రకారం గ్రహ గమనాలను చూసినా 21-12-2012 నాడుప్రళయానికి దారితీసే పరిస్థితులేమి లేవు.భయపడవలసిన అవసరమే లేదు.కాని మన రాష్ట్రానికి చెందిన ఒక సిద్ధాంతి మాత్రం 22-12-2012 నాడు గ్రహగమానాలను పరిశీలిస్తే ఆరోజు పశ్చిమదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఒక మాసపత్రికలో వ్రాశారు.అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

ఏది ఏం జరిగినా భారతదేశానికి,భారతీయులకు ఏమి జరగదు గాక జరుగదు.ఈ దేశం దేవనిర్మితం,సిద్ధపురుషుల తపశ్శక్తిచేత రక్షింపబడుతున్న పుణ్యభూమి.భగవంతునకు ఈ దేశం అంటే ప్రీతి కనుకనే ఇక్కడ అనేక మార్లు అవతరించాడు.

అటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైద్రాబాదులో ప్రపంచ ఆద్యాత్మిక సదస్సు ముగుస్తోంది.సదస్సు ముగుంపులో 21-12-2012 భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులు,1 million ప్రజలు విశ్వశాంతి కోసం ధ్యానం చేస్తున్నారు.ఈ ధ్యానంతో అనంతవిశ్వశక్తిని ప్రపంచానికి అందించి,మానవులలో ఉన్న చెడును,రాక్షలక్షణాలను అంతం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి మన వంతు సహకారం అందిద్దాం.ఒక గంట పాటు ధ్యానం చేద్దాం.విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం.

అలాగే రేపటి నుంచి విశ్వశాంతి కోసం మహబూబ్ నగర్ జిల్లా,ఆమన్ గల్లు మండలం,కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు 11 రోజుల పాటు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల నుండి ఇక్కడ పాల్గొనడానికి అనేకమంది విచ్చేస్తున్నారు.వీలుంటే మీరు సందర్శించండి.మనశ్శాంతిని పొందండి.