Friday, 31 August 2012


part-11

~ బయట మట్టి విగ్రహాలను అమ్మేవారు,వాటిని అచ్చుగుద్ది ఇచ్చెస్తారు.వారు వాటిని విక్రయవస్తువులుగానే చూస్తారు.వాటిని అచ్చుగుద్ది ఇవ్వడానికి స్వామి మీద మనసు నిలబడనవసరం లేదు.మాట్లాడుతూ కూడా చెయ్యచు కదా."యద్భావం తద్భవతి".మరి మనసులొ గణపతిని ధ్యానించనప్పుడు ఙ్ఞానం ఏలా కలుగుతుంది.

~ మనం చేసిన విగ్రహాలను మనమే పూజించడం వల్ల మనకు అమొఘమైన ఙ్ఞానం లభిస్తుందట.ఏలా?

~ మనం,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను చేశాక దాన్ని వారు కేవలం బొమ్మగా చూడరు.ప్రతిమలొని ప్రతి భాగాన్ని చేస్తూ వారి ఎంతో ఆనందం పొందుతారు.ప్రతిమ పూర్తి అయ్యాక వారు అది నిజంగా వినాయకుడే అని భావన చేస్తారు.భావనమాత్రంగానే తమ ఆత్మశక్తి ద్వారా ఆ ప్రతిమకు ప్రాణం పోస్తారు.

~ ఎటువంటి మంత్రాలు,యంత్రాలు లేకుండా కేవలం భావన చేత ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట వారికి తెలియకుండానే చేసేస్తారు.దానిని మాటిమాటికి చూసుకొని తల్లి బిడ్డను చూసి మురిసిపొయిన విధంగా మురిసిపోతారు.ఆ ప్రతిమ చూస్తుందని,వింటుందని నమ్ముతారు.వారి భావనకు,కల్మషం లేని మనసుకు భగవంతుడు లొంగి నిజంగానే స్వామి దానిలొకి ఆవహింపబడతాడు.వారి నమ్మకానికి కట్టబడతాడు.

~ మనం అదే విగ్రహంలోకి సమంత్రకంగా దైవాన్ని ఆవాహన చేస్తాం.ప్రతిమ అంతరిక్షంలోని తరంగాలను ఆకర్షిస్తుంది.అప్పటికే పిల్లల భావన చేత దానికి అనంతమైన శక్తి వచ్చింది.దానికి పూజల ద్వారా మరింత శక్తి వస్తుంది.పూజానంతరం మనం ఏమి అంటాం?"యదాస్థానం ప్రవేశయామి",యాదస్థానం ఉద్వాసయామి" అంటాం.అంటే ఎక్కడినుండి వచ్చావొ అక్కడికే వెళ్ళవయ్యా అని.అంతరిక్షం నుండి వచ్చిన శక్తి అంతరిక్షంలొకె వెళ్ళిపొతుంది.మంత్రపూర్వకంగా వచ్చిన దైవశక్తి తిరిగి ఆ పరబ్రహ్మలొనే కలిసిపోతుంది.చెరువునుండి తీసిన మట్టి చెరువులొ కలుస్తోంది.అలాగే పిల్లలు తమకు తెలియకుండానే ఆయనకు తమ ఆత్మశక్తి ద్వారా ప్రాణశక్తిని ఇచ్చారు కదా.అది వారి మనసులొ పుట్టింది.కనుక ఆ విగ్రహం యొక్క శక్తి మీ పూజల ద్వారా మరింత శక్తివంతమై తిరిగి పిల్లల లేద మన మనసులొనే కలిసిపోతుంది.

~ ఆ శక్తిని గ్రహించే ఆనాటి భారతీయులు అనేకనేక ఆవిష్కారాలు చేశారు.చరకసంహిత,వేదగణితం,సౌరశక్తి ద్వారా నడిచే యుద్దవిమానలు కాని,రాడర్లకందని వేగంతో వాయుశక్తితో నడిచే యుద్దవిమానలు వంటివి కొన్ని ఉదాహరణలే.

~ ఇంత గొప్పగా,ఊహకందని విధంగా ఆలోచించారు మన మహర్షులు.మనకు బద్దకమొ లేక తెలియకనొ కానీ ఈ విషయాన్ని విస్మరించాం.ఏమి తెలియని ఆఙ్ఞానులుగా తయారయ్యి విదేశాల వారి పరిఙ్ఞానం మీద ఆధారపడి వారి ఆవిష్కరణలను కుప్పలుగా డబ్బు పోసి కొనుక్కునే దుఃస్థితికొచ్చాం.

  మన ఊహకందని పరిఙ్ఞానం మనలొనే దాగి ఉంది.అది మట్టి విగ్రహాల ద్వార మాత్రమే బయటపడుతుంది.      

~ ఆధునిక భారతదేశంలో ఈ విగ్రహాల తాయరి మీద జరిపిన  కొన్ని పరిశొధనలు ఏమి చెప్తున్నాయి?

to be continued........


part-10

~ వినాయక చవితికి పూజించే విగ్రహాలను మనమే చేసుకోవాలా?
~ నిజానికి భారతదేశంలో పూర్వాకాలంలొ అసలు పేదరికం లేదు.కాబట్టి ఎవరికి మట్టి విగ్రహాలు విక్రయించే అవకాశం లేదు.మట్టిని,విద్యను,ఆహారాన్ని పంచుకోవడమే తప్ప సోమ్ము చేసుకొవడం అనే సంస్కృతి ఆనాటి కాలంలొ లేదు.ఇది చరిత్ర చెప్తూన్న సత్యం.ఆంగ్లేయుడైన మొకాలె బ్రిటన్ పార్లమెంట్ లొ 2-2-1835 రోజున చేసిన ప్రకటన ద్వారా మనకు స్పష్టం అవుతోంది.

"నేను భారతదేశం అన్ని దిశలు మొత్తం పర్యటించినా నాకు ఒక్క బిక్షగాడు గాని,ఒక్క దొంగ కాని కనపడలేదు.ఎంతో సంపద,మహొన్నతమైన సామాజిక విలువలు,అపారమైన శక్తి కలిగిన ప్రజల్ను చుశాక నాకు అనిపిస్తోంది మనము ఈ దేశాన్ని ఆక్రమించడం జరగని పని అని.అలా ఆక్రమించాలి అంటే భారతదేశం యొక్క వెన్నుముక్క అయిన ఆ దేశపు సంప్రదాయాలను,ఆధ్యాత్మిక సంపదను విరగొట్టాలి.అందుకోసం మనం వారి యొక్క అధ్యాత్మిక,పూరతనమైన విద్యవిధానాన్ని,సంస్కృతిని మార్చాలి.ప్రతి భారతీయుడు తమ సంస్కృతికంటే పాశ్చాత్య సంస్కృతి గొప్పది,శాస్తియమైనది అని భావించాలి.అలా వారు వారి ఆత్మగౌరవాన్ని,భారతీయ సంస్కృతిని,విలువలను కోల్పోయీ మనము కోరుకుంటున్న బానిస దేశంగా మారుతారు.అందుకొసమ మనం ఆ దేశంలొ ఇంగ్లీషు విద్యను ప్రవెశపెట్టాలి".ఇది ఆయన చేసిన ప్రకటన.

~ మనమే,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను తయారుచేయడం చేత సృజనాత్మకత (క్రియెటివిటి)పెరుగుతంది.ఇది శాస్త్రీయ కారణం.

~ ఒక బొమ్మను చేయాలి అంటే మనసుతో దాన్ని బాగా గమనించి చేస్తాం కదా.మనము మన చేతిలొ ఏది పట్టుకుంటే మన చెయ్యి ఆ వాసనే వస్తుంది.కర్పూరం పట్టుకుంటే చెయ్యి కర్పూరం వాసన వస్తుంది.అలాగే మనసు కూడా.మన మనసులొ ఉన్న ఆలోచనలే మన మాటలు,చేతల ద్వారా ప్రకటనం అవుతాయి.మరి ఈ విగ్రహం చేస్తున్నప్పుడు మనం మనసు నిండా వినాయకుడిని నింపుకుంటాం.గణపతి ఎక్కడ ఉంటే అక్కడ ఙ్ఞానం  ఉంటుంది.అలా మానసిక ధ్యానం ద్వారా మనస్సుకు వినాయకుని స్పర్శ తగిలి అనంతమైన ఙ్ఞానం,ఆనందం కలుగుతుంది.మన ప్రతి మాటలొ అవి ప్రస్పుటమవుతాయి.

~ మరి మీకొ అనుమానం రావచ్చు.ఇప్పుడు బయట ఎంతో మంది విగ్రహాలను చేసి అమ్ముతున్నారు కదా.వారికి అంత ఙ్ఞానం ఎందుకు లేదు అని?
~ అలాగే విగ్రహాలను మనమే స్వయంగా చేసుకొవడం వెనుక ఉన్న అనేకానేక కారణాలు ఏంటి?
  వంటి ప్రశ్నలకు సమాధానం రాబొయే పొస్ట్ లొ చెప్పుకుందాం.            
 
to be continued.....

Thursday, 30 August 2012


september-4-sankatahara ganesha chaviti special:

సెప్టెంబర్ 4 మంగళవారం,బహుళ చవితి వచ్చింది.సాధారణంగా పౌర్ణమి తరువాత చంద్రోదయ సమయానికి చవితి తిధి ఉంటే సంకటహర చవితి అంటారు.ఇది మంగళవారం వస్తే అంగారక చతుర్థీ అని పిలుస్తారు.వినాయకుని పూజతొ ఏలాంటి కష్టాల నుంచి అయిన గట్టు ఎక్కవచ్చని,మంగళవారం వచ్చిన రోజున ఈ వ్రతం ఆచరిస్తే కుజగ్రహ దోషం తొలగుతుందని ప్రతీతి.సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇది మంగళవారం వస్తుంది.

సంకష్టహర చతుర్థి:
దీన్నే సంకట చతుర్థి,సంకట చవితి అని కూడా అంటారు.నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.

ప్రదోషకాలంలో(సూర్యాస్తమయ సమయంలో)చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలొకి తీసుకోవాలి.రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ,పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3,5,11 లేద 21 నెలలు ఆచరిస్తారు.ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి.ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని,సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు(గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి.ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు,2 వక్కలు,దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి.దానిని స్వామి ముందు ఉంచి ధూపం(అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు.పూజలో ఉన్న గణపతిని తీయకూడదు.శారీరికంగానూ,మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం.అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం,ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి."సూర్యాస్తమయం వరకు ఉడికించిన  పదార్ధంగాని,ఉప్పు తగిలిన(కలిసిన)/వేయబడిన  పదార్ధాలు తినకూడదు".పాలు,పళ్ళూ,పచ్చి కూరగాయలు తినవచ్చు.అనుకున్న సమయం(3,5,11 లేదా 21 'చవితి 'లు)పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.చంద్రదర్శనం లేద నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప,దీప,నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

courtesy-sri saila prabha

"వివిధ కారణాల" వల్ల ఈ వ్రతం ఆచరించలేని వాళ్ళు "సంకటనాశన గణేశ స్తొత్రం" 4 సార్లు చదివినా చాలు ఫలితం లభిస్తుంది.

అందరూ తప్పక గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి.

Wednesday, 29 August 2012


part-9
~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?

~ గరిక మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది.

~ గరిక ఆయుర్వేదంలొ నత్తికి,శ్వాస,చర్మ సంబంధిత రోగాలకు వాడతారు.గరిక పచ్చడి కూడా కొన్ని ప్రాంతాల్లొ తినే ఆచారం ఉంది.

~కొన్ని వందల వ్రేళ్ళతొ,అతి తొందరగా పెరిగె గరిక గొప్పతనం చెప్పడం కష్టతరమని,దానిలొ దేవతలు ఉంటారని,దాని స్పర్శ పాపాలను హరిస్తుందని,దుస్స్వప్నాలను నాశనం చేస్తుందని ఈ శ్లొకం.

సహస్రపరమా దేవి శతమూల శతాంకుర
సర్వగుం హరతుమె పాపం దూర్వా దుస్స్వప్ననాశిని.

~ పీడకల వస్తే తరువాతి రోజు ఉదయం తలార స్నానం చేసి ఒక్క గరిక పొచను వినాయకునికి సమర్పించి పై శ్లొకం చెప్తూ గరికను తలమీద పెట్టుకుంటే పీడకల ఫలించకుండా ఉంటుంది.

~ ఈ గరికను వినాయకునికి సమర్పించడం చేత జాతకంలొ ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపొతాయి.

~ 5,14,23 తేదిల్లొ పుట్టిన వారి అధిపతి బుధుడు.అలాగే గణిత,అకౌంట్స్ రంగాల్లొ ఉద్యొగం చెస్తున్నవారికి బుధ గ్రహానుగ్రహం తప్పనిసరి.

~ విద్యార్థులు అందరూ రోజు గణపతిని గరికతొ పూజించడం చేత ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.

  గరిక పార్వతి దేవి రూపం.పార్వతి దేవి యొక్క సాకార రూపం ప్రకృతి.ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.పర్యవరణ హితంగా గణపతి ఉత్సవాలను జరుపుకుందాం.

వినాయక విగ్రహాలను మనమె తయారు చెసి,పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

to be continued.........                  

Tuesday, 28 August 2012


part-8
~ వినాయకునికి పత్రి పూజలొ అత్యంత ఇష్టమైనది గరిక.ఒక్క గరిక పొచతొ స్వామిని ప్రసన్నం చేసుకొవచ్చు.

~ దానికి సంబంధించి ఒక కధ ప్రాచుర్యంలొ ఉంది.యమధర్మరాజుకు అనలాసురుడు అనే ఒక కొడుకు ఉన్నాడు.అతను అగ్ని వలె మండే శరీరం కలవాడు.దేవతల మీద యుద్ధం ప్రకటించాడు.ఇంద్రుడు భయపడి వినాయకుని వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకున్నాడట.వినాయకుడు కొపంతొ  అనలాసురిడిని మింగేశాడు.వాడు స్వామి బొజ్జలొ వేడి పుట్టించి ఇబ్బంది పెట్టడంతొ దేవతలు వినాయకుడిని చల్లపరచడానికి రకరకాల పత్రాలు వేశారట.అయినా చల్లబడలేదు స్వామి.శివుని ఆఙ్ఞ మేరకు గరికతొ అర్చించడం వల్ల గణపతి చల్లబడ్డాడని,అప్పటి నుండి  తనను గరికతొ అర్చించాలని గణాధిపతి ఆదేశించాడని ఆ కధ సారాంశం.

~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?పరిశొధనలు ఏమి చెప్తున్నాయి? గరిక పూజ వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి?గరిక పూజ వల్ల గ్రహదోషాలు తొలగుతాయా?తరువాతి భాగల్లొ వివరణ తెలుసుకుందాం.

to be continued..........        

Monday, 27 August 2012part-7
continuation
~ అలా పత్రి కొసేటప్పుడు వాటికి పురుగు చీడలాంటివి ఉంటే వాటికి తగిన వైద్యం కూడా చేసేవారట.మీకు అనిపిస్తుంది ఇదంతా అవసరమా?ఏదొ నాలుగు ఆకులు కోసమని ఇంతా చేయాలా అని.అది ఒక మూడాచారం కాదు.దాని ద్వారా పిల్లలకు చిన్న వయసులొనే  నేర్పేవారు.ఈ సమాజంలొ ప్రత్యక్షంగానో,పరొక్షంగానో అందరం ఒకరి మీద ఒకరం ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఒకరికి ఒకరం సహాయపడాలి.అప్పనంగా ఒకరి కష్టాన్ని,సంపదను దొపిడి చేయకుడదని,అలాగే కేవలం ఒకరి దగ్గరినుండి తీసుకొవడమే కాకుండా ఇవ్వడం కూడా చేయాలని చెప్తూ ఇచ్చిపుచ్చుకోవడం,కలిసి జీవించడం అనే అలొచనలను చిన్న పిల్లలొ బలంగా పాతుకునేల చేయడం దీని వెనుక ఉన్న అర్దం.

~ పూజ సమయంలొ పత్రి పేరు పెద్దలు చెప్తూంటే,ఒక్కొ పత్రిని స్వామికి సమర్పించెవారు పిల్లలు.అలా సమర్పిస్తూ అది ఏఏ వైద్యానికి వాడతారొ కూడా స్వామికి పిల్లల్తొ చెప్పించేవారట పెద్దలు.మళ్ళీ ఇదెంటి అనుకుంటున్నారా?

~ మనం ఈ పని మొదలు పెట్టిన వినాయకుడి ఆ ఆరాధానతొనే.అలాగే పిల్లలకు నేర్చుకున్న ఆయుర్వేదం కూడా మొదట ఆయన ముందు ప్రదర్శించడం అవుతుంది.

~ ఇంకొ అర్దం.నేర్చుకున్న విద్యను స్వామి పాదాలకు సమర్పించడం.ఒక్కసారి సమర్పించాక అది మనది కాదు కద.మనది కాని దాని నుండి మనం ఫలితాలను ఎలా ఆశిస్తాం.అవును.భవిష్యత్తులొ ఒకవేళ వైద్యం చేయవలసి వస్తే,ఎటువంటి డబ్బు కానీ,ఇతర ప్రయొజనాలు కానీ ఎలా ఆశిస్తారు చెప్పండి,వారు ఇంతక మునుపే ఇది నీది స్వామి అని సమర్పించాక.అందుకే పవిత్ర భావనతొ ఆ కాలంలొ భారతీయ వైద్యులు చికిత్స చేసేవారు.అందుకే ఆ కాలంలొ వైద్యం అందక చనిపొయిన వారు లేరు.పైగా తమకు తెలిసిన విద్యను ఎటువంటి స్వార్ధం లేకుండా అందరికి నేర్పేవారు.

~ ఇంత ఆలొచన ఉంది పత్రి పూజ వెనుక.ఇంత గొప్ప సంస్కృతి సనాతన హిందూసంస్కృతి.ఇది ఈ తరం వాళ్ళకు తెలియపరచాల్సిన అవసరం మన అందరి మీద ఉంది.

~ఆయుర్వేదం పాతకాలం ఆలొచన.దాని గురంచి పిల్లలకు చెప్పడానికి ఏమి ఉంది అంటారేమొ?కాస్త ఇది తెలుసుకొండి.మనం ఎంతొ అభివృద్ధి సాధించిందని చెప్పుకుంటున్న అమెరికా,మన ఆయుర్వేద గ్రంధాలను కొందరికి డబ్బు ఇచ్చి సంస్కృతంలొ ఉన్న వాటి ఔషధా గుణాల గురించి తెలుసుకొని,భారతీయ ఋషులు ఏనాడొ చెప్పిన వాటి ప్రయొజనాలను తామె ప్రపంచానికి చాటి చెప్పమని చెప్తూ  30000 భారతీయ అయుర్వేద మూలికల మీద "పెటెంట్ హక్కులు" పొందిందెందుకు?కొత్తిమీర,పసుపు లాంటివి వంటల్లొ వాదితే ఆరొగ్యం అని వాడు మనకు చెప్పాలా?చైనా వేప చెట్టు మీద"పెటెంట్ హక్కులు" పొంది వేప మూలాలు తమవే అని వాదిస్తొంది ఎందుకు?వేప గురించి వాళ్ళకంటే మనకే బాగా తెలుసుకదా.

    ఆయుర్వేదం మన మహాద్భుత ఆవిష్కారం.మన ఆయుర్వేదాన్ని మనమే కాపాడుకొవాలి.పర్యావరణాన్ని కాపాడుదాం.పర్యవరణ హితమైన వినయక చవితి జరుపుకుందాం.                    
     
to be continued..........

Sunday, 26 August 2012


part-6
very rarely available information exclusively given by us

**** అందరు తప్పక చదవి,మన చరిత్ర,ఆ నాటి జీవన ప్రమాణాలను అందరికి తెలియపరచాల్సిన అతి ముఖ్యమైన ధర్మ సూక్ష్మం ఇది.

 
~ వినాయక చవితి పిల్లల పండుగన్నారు.నిజమే ఇది చదువుల పండుగ.బొధించేవాడు వినాయకుడు,ఆయనే గురువు.నేర్చుకునే వాళ్ళు పిల్లలు.ఏమి నేర్చుకుంటారు?

~ పిల్లలే పూజకు పత్రి కోయాలట.పెద్దలు దగ్గర ఉండి కోయించాలట.ఆ రోజుల్లో ఉన్నవన్ని పెద్ద కుటుంబాలే కనుక ఎంతొ మంది పిల్లలు ఉండేవారు.పండగ ముందుగానే పెద్దలు పిల్లలకు పత్రిలొ ఉన్న ఔషధీయా గుణాల గురించి,వాటి వాడకం గురించి చెప్పాలి.వారికి అంతా వివరించాక పత్రి వెతకడానికి పెద్దలు,పిల్లలు వెళ్ళాలి.పెద్దలు దగ్గర ఉండి ప్రతి ఔషధ మూలికలను చూపిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న కీటకాల గురించి అవగాహన కల్పించాలి.వానకాలం కదా మొక్కలు బాగా ఎదిగి గుబురుగా ఉంటుంది.వాటిలొ పాములు కూడా ఉంటాయి.వాటిని చూపించి అవి ఇలాంటి ప్రదేశాల్లొ ఉంటాయి,భవిష్యత్తులొ ప్రమాదసమయంలొ వైద్యానికి మూలికల కోసం మీరుగాని రావల్సి వస్తే పాములు ఏఏ ప్రదేశాల్లొ ఉంటాయొ గుర్తుపెట్టుకొండి,జాగ్రత్త వహించండి అని చెప్పేవారు.

~ మొక్కల దగ్గరకు వెళ్ళి కావల్సినవి తెంపుకొని రమ్మని చెప్పలేదు.ఆయుర్వేదం చెప్పింది మొక్కలు,చెట్ల నుండి ఏదైన తెంపవలసిన అవసరం వస్తే ముందుగా ఆ మొక్కలకు నీరు పోయండి.వాటిని పసుపుకుంకుమలు చల్లి పూజించండి.అమ్మా!నాకు ఆరొగ్యం చేకురడానికి నీ యొక్క శరీరభాగాలను వాడుతున్నా.నన్ను క్షమించమ్మా అని పలకాలట.వాటికి కూడా మనస్సు ఉందని ఇప్పుడు కాదు ఆ కాలంలొనే గుర్తించారు.అందుకే ఈ ప్రక్రియ.మీరు నమ్మకపోతే పండిత ఏల్చురి గారి ఆయుర్వేద కార్యక్రమం చూడండి.మీకే తెలుస్తుంది.

~ పసుపు చల్లడంలొ ఇంకొ రహస్యం ఉంది.పసుపు పాములకు పడదు.పసుపు ఉన్నచోటికి పాములు రావు.ఈ ఔషధమూలికల కోసమని ఎవరైన వచ్చి పాము కాటుకు గురికాకుండా ఉంటారని.

~ పిల్లలతొ ఈ ప్రక్రియా చేయిస్తూ చిగుళ్ళను కోయించేవారు.అన్ని చెట్లు ఒకేలా ఉంటాయ?జిల్లేడు లాంటివి పాలు కారుస్తాయి.ఇదిగొ ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి,వాటి నుండి వెలువడే రసాలు హాని చేసెవిగా ఉంటాయి జాగ్రత్త అని పెద్దలు చెప్తూ పిల్లల చేత పత్రి కొయించాలని మన మహా మునులు చెప్పారు.
ఇంకా వివరణ పూర్తికాలేదు.

to be continued.....................


part-5
~ పత్రి పూజ ఒక్క వినాయక చవితికి మాత్రమే చేయాలా?
~ వినాయక చవితి వర్షాకాలంలొ వస్తుంది.ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది.చెట్లు త్వరగా పెరుగుతాయి.అదే సమయంలొ రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి.
  ఈ 21 రకాల పత్రి యొక్క ముట్టుకొని వాసన పీల్చడం చేత రొగనిరొధక శక్తి పెరుగుతుంది.ఆ పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించి ఇంట్లొ ఉన్న క్రిములను హరిస్తుంది.అది భగవంతునికి సమర్పించడం అనే ప్రక్రియలొ వాటిని ముట్టుకొవడం,పూజాసమయంలొ వాటిని నుండి వెలువడే వాసనలు మనం పీల్చడం ద్వారా మనకు రోగనిరొధక శక్తి పెరుగుతుంది.
  వర్షాకాలంలొ బురద నీరు చెరువుల్లొకి చేరుతుంది.ఆ నీరు తాగడం చేత అనారొగ్యం కలిగే అవకాశం ఎక్కువ.అందుకే వినాయక ప్రతిమతొ పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే అది నీటిని శుద్ధి చేస్తుంది.ఎందుకంటే అవన్నీ ఔషధ మూలికలు కనుక.ఫలితంగా ప్రజల ఆరొగ్యం చెడిపొకుండా ఉంటుందని.
  ఈ కాలంలొ చెట్లు,మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి.పత్రి పూజ పేరున వాటి చిగుళ్ళు విరిచి స్వామికి సమర్పించమన్నారు.గులాబి మొక్క కటింగ్స్ వల్ల బాగా పెరుగుతుంది కదా.అలాగే ఈ మొక్కలు కూడా.వాటి చిగుళ్లను తెంపడం ద్వారా అవి నీటారుగా కాకుండా బాగా విస్తరిస్తాయి.చక్కటి ఆకారం సంతరించుకుంటాయి.బలంగా పెరుగుతాయి.ఈ పూజ పేరున వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకొవడం చేత అనారొగ్యం కలగగానే వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే ఇంతకుముందే మనం వాటి ఎదుగుదలకు సాయం చేశాం.అందువల్ల అవి విరివిగా లభిస్తాయి.అందరికి ఆరొగ్యం కలుగుతుంది.
  పత్రి పూజకు ఆకులను,చిగుళ్ళను,పువ్వులను సమర్పించమన్నారు కాని వ్రేళ్ళతొ పాటు మొక్కలను పీకి ఔషధ మూలికలను నాశనం చేయమని చెప్పలేదు.    

   ప్రకృతితొ మమేకమై జీవంచడమే భారతీయ సంస్కృతి.ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.
next coming part
పిల్లలకు ఈ పత్రి పూజ పేరున ఆయుర్వేదాన్ని,ప్రకృతి,జీవజాలంగురించి ,సామాజిక భాధ్యత నేర్పాలని మహర్షులు ఏమి చెప్పారు?పండగ ద్వారా వారు భావితరాలకు ఏమి నెర్పించారు?

to be continued      

Saturday, 25 August 2012

పత్రిపూజ అంటే? ఎందుకు చేస్తారు?

పత్రిపూజ అంటే? ఎందుకు చేస్తారు?

వినాయక చవితిన వివిధ రకముల ఆకులతొ పూజించడమే పత్రి పూజ.

 21 రకాల ఆకులతొ పూజించమని వ్రతకల్పంలొ ఉంది.

ఏవో 21 రకాల ఆకులతొ పూజిస్తే సరిపొతుందా?

వ్రత కల్పంలో చెప్పిన 21 రకాల ఔషధ మూలికలతొ మాత్రమే పూజించాలి.ఆయుర్వేదంలో చెప్పబడినవి. రోజూవారీ జీవితంలొ మనకు ఎంతగానో అవసరమైనవి.
 21 రకాల పత్రి ఇవే.
సంస్కృత నామాలు-తెలుగు పేర్లు-ఔషధం

1)మాచీపత్రం-మాచీ పత్రి-చర్మ రోగాలకు
2)బృహతి పత్రం-వాకుడాకు-ఆస్తమ,దగ్గు మొ||
3)బిల్వం పత్రం-మారేడు ఆకు-అతిసారము,నీటిని శుద్ధి చేస్తుంది.
4)ధూర్వాయుగ్మం-గరిక/గడ్డి పొచలు-చర్మ రొగాలు,ముక్కు నుండి రక్తం కారుట
5)దత్తురపత్రం-ఉమ్మెత్త-జుట్టు,కీళ్ళ నొప్పులు
6)బదరి పత్రం-రేగు ఆకు-అరుగుదల సమస్యలకు,గాయాలకు
7)అపామార్గపత్రం-ఉత్తరేణి-విషజంతువుల వల్ల కలిగిన అపయాలకు
8)తులసి పత్రం-తులసి దళములు-చర్మ,శ్వాస సంబంధిత రోగాలకు
9)చూత పత్రం-మామిడి ఆకు-మధుమేహం,నోరు గొంతు సమస్యలకు
10)కరవీరపత్రం-గన్నేరు-జుట్టు రాలుట,గాయాలకు
11)విష్ణుక్రాంతపత్రం-విష్ణుక్రాంత/హరిక్రాంత-మేధస్సుకు
12)దాడిమిపత్రం-దానిమ్మ-అతిసారం,త్రిదోషాలకు
13)దేవదారుపత్రం-దేవదారు-చర్మ రోగాలకు,గాయాలకు
14)మరువకపత్రం-మరువము-చర్మ,హృదయ రోగాలకు
15)సింధువారపత్రం-వావిలి ఆకు-వాత సంబంధిత మరియు విషం విరుగుటకు
16)జాజీపత్రం-జాజి ఆకు-చర్మ,నోరు,అరుగుదల సమస్యలకు
17)గండకీపత్రం-గండకి ఆకు/తీగ గన్నేరు ఆకు-పైల్స్,చర్మ,హృదయ రోగాలకు
18)శమీ పత్రం-జమ్మి ఆకు-శ్వాస సంబంధిత
19)అశ్వత్థ పత్రం-రావి ఆకు-రక్త కొల్పొకుండా ఉండుటకు
20)అర్జున పత్రం-మద్ది ఆకు-కీళ్ళు,త్రి దొషాలు,హృదయ సమస్యలు
21)అర్క పత్రం-జిల్లేడు ఆకు-చర్మ రోగాలకు,ట్యూమర్లకు

వీటిని ఏకవింశతి పత్రాలు అంటారు.

ఇంక అనేక ఉపయోగాలు ఉన్న కొన్ని మాత్రమే వ్రాయడం జరిగింది. జిల్లేడు 64 రకాల రోగాలకు ఔషధంగా చెప్పబడింది. మిగితా వాటికి కూడా ఎన్నో విశేషాలు ఉన్నా,  మీ సౌలభ్యం కోసమని కొన్ని మాత్రమే పేర్కొనడం జరుగుతొంది.

 పర్యావరణ మిత్రునకు పత్రి పూజ చేద్దాం. పర్యావరణ రక్షణకు పెద్ద పీట వేద్దాం.పర్యవరణానికి హాని చేయని విగ్రహాలను మాత్రమే పూజిద్దాం.

to be continued...............

Why We Use 21 Types of Patra-Patries in Ganesh Puja

Why We Use 21 Types of Patra-Patries in Ganesh Puja


ganesh-patrasGanesh Patris or Patri is the numerous types of sacred leaves that are offered to Ganesha during Ganesha Puja on Ganesh chaturthi. According to Mudgala and Ganesha purana, 21 different types of leaves must be offered. 21 is the favorite number of Sri Ganesh. 

The significance of 21 is our body is made up of 21 tatvas (principles). They are pancha butas (ether, air, fire/ energy, water and earth), pancha jnanendriyas (eyes, nose, toungue, ears and skin), pancha karmendriyas (hands, legs, mouth, rectum and anus), pancha tanmatras, and mind. All constitute to 21. And the lord of all these 21 tatvas is Ganapati or Ganesha. 

Also patram means soul/atman/atma. Offering Patri to Ganesh represents offering Oneself to Almighty and merge in him.

Hindu festivals have lot of scientific secrets. Same way, this ganesh chaturthi has scientific, spiritual, social and ecological significance. Ganesh festival is celebrated in August-September months in rainy season. Due to climatic conditions, people are much prone to infections and contagious diseased during this season. And patri puja has its importance here. The leaves which are offered to Ganesha have medicinal properties and each of them cure atleast 5 types of diseases. As per Ayurveda, The air, smell and touch of these patris itself will increase immunity and cure various diseases. Hence, offering these patris to God, keeping them along with Ganesha in house for 11 days will destroy all harmful bacteria and other infectious micro organisms in Home as well as the air flowing from these patris will increase immunity. At last these patris are immersed in water along with Ganesh idol. Immersion of these patris in lakes and rivers will purify the water. This can be known by direct experience too.

Here are the medicinal properties of Patris offered to Ganesha.
1. Machi : used for curing skin diseases (leprosy, leucoderma), nervous diseases, and abdominal related
2. Brihati: Used for asthma, cough, constipation. Also used for women in post natal period
3. Bilva : Used for Dysentery. It also purifies water. Bilva leaf is very popular in the worship of Lord Shiva
4. Durva Grass: used for Skin diseases, arresting bleeding, anemia. Durva leaf is used in the worship of Lord Ganesha
5. Dattura: Used for joint pains, abdominal, skin diseases, hair fall. Also used in poisonous bites
6. Badari:     Used for digestive disorders, wounds and injuries, blood impurities. Also used for maintaining the voice.
7. Apa Marga: Used for digestive disorders and also used for poisonous bites.
8. Tulsi: Used for respiratory diseases, skin diseases, purifies air, water and surroundings. The leaves are used in the worship of Lord Vishnu who is very much fond of Thulasi
9. Choota (Mango leaves):Used in Diabetics, for cracked heals, diseases of throat.
10. Karaveera: Used for leprosy, wounds and injuries, hair fall, lice
11. Vishnu Kranta: Used for Nervous related, memory power
12. Daadimi (Pomegranate): Used for Dysentery, Vata/Pitta/Kapha dosha
13. Devadaru: Used for skin diseases, wounds/injuries
14. Maruvaka: Used for Joint pains, skin diseases, heart diseases
15. Sidhuvara: Used for Vaata related problems and also used in anti poisonous drugs.
16. Jaaji: Used for skin diseases, Mouth related problems and also inindigestion
17. Shami: It is used for respiratory problems. This tree is also worshipped as a remedy and we find people taking pradakshina around this tree on the day of Vijaya Dasami.
18. Aswatham: Its bark is used in preparation of many medicines. It is also used for arresting bleeding. The significance and importance of this tree is so much that it is considered as Trimurthi (Trinity) swaroopa (Trinal Lords, Brahma, Vishnu and Shiva). We find people performing Naga Devatha Pratishta under this tree.
19. Arjuna:Used for Joint pains, Vata/Pitta/Kapha related, heart diseases, wounds and septic conditions.
20. Arka/Jilledu: It is used in poisonous bites, wounds and injuries, curing skin diseases, leprosy, tumors, joint pains, etc… It is said that it has 64 varieties of medicinal usage. It is called as a healing herb. We find usage of this leaf on the day of Ratha Sapthami. It is associated with the worship of Sun God, Lord Hanuman and also Lord Ganesha.
21. Gandaki Patram:     Used for Heart related, Piles, Skin diseases etc.
It must be noted here that Tulsi is only used during Vinayaka Chaturthi. Most of the Patris that are used in Ganesh puja have medicinal properties and today many people are growing these plants at home.

Each deity in Hinduism has its own favorite flowers and leaves and they are used by Hindus during worship and while performing pujas on festivals. All festivals and rituals in Hindu religion begin with Ganesh Pooja. Red colored flowers are the favorite of Lord Ganesha.
Here is a list of flowers and leaves that are offered while praying to Lord Ganesha:
Red Flowers: Any usual red color flower used in Hindu rituals.
Durva Grass is an important offering to Ganesh. Especially inSouth India, you will find vendors selling garlands of Durva outside Ganesh Temples. It is known as arugam pul in Tamil, Dhub, Durva and Haritali in Hindi (North India). Bermuda or Bahama Grass is the English name.
Another important flower offered is theMilkweed flower. It is known as Arka in Hindi and Eruku or Erukkum Poo in South India. Jilledi is the name used in Eastern India.
Pomegranate leaves and flowers are also offered in many places.
Another important flower and leaf offered is the Sanku Pushpam or Conch flower.
Leaves and flowers of Screw Pine are also offered. It is known as Ketaki or Kedgi in Hindi and Kaita inSouth India.
There are also other local flowers and leaves that are used like the Naga leaves.
Tulsi leaves and flowers are not generally used in Ganesh Puja. But it is used during Vinayaka Chaturthi or Ganesh Puja.

Friday, 24 August 2012

p
part-3
~ పార్ట్-1,2 చదివిన మాకు నమ్మకం లేదు భారతీయులు ఏన్నొ వందల సంవత్సారాలకు ముందే పర్యావరణ రక్షణుకు నడుం బిగించారని.మీరు అదంతా కల్పించి రాశారేమొ?
~ మేము కల్పించి రాయలేదు.మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే వాస్తు శాస్త్రం మీకు చక్కటి సమాధానం ఇస్తు
ంది.

~ మేము బాగా చదువుకున్నాం.వాస్తు మీద నమ్మకం లేదు.సరే మరి వాస్తు పర్యావరణహితమైన జీవనానికి ఏమి చెప్పింది?
~ కాస్త జాగ్రత్తగా ఆలొచిస్తూ చదవండి.వాస్తు ప్రకారం పడమర,దక్షిణం ఎత్తుగా ఉండాలి.తూర్పు,ఉత్తరం పల్లంగా ఉండాలి.ఇంట్లొని నీరంతా ఈశాన్యా దిశగా పారాలి.ఈశాన్యం పరిశుభ్రంగా,పవిత్రంగా ఉండాలి.అక్కడ బావి ఉండాలి.అక్కడ వెలుతురు బాగా ఉండాలి.ఈశాన్యంలొ తులసి మొక్కలు ఉండాలి.అవునా.
అంటే మనకు ఏమి చెప్తొంది వాస్తు.ఈశాన్యంలొ తులసి మొక్కలు పెంచాలి అంటే అక్కడ మట్టి ఉండాలి.అక్కడే బావి కూడా ఉంటుంది.పవిత్రం కనుక చెత్తచెదారం ఉండదు.
ఇంట్లొ మనం వాడుకున్న నీరు మొత్తం అక్కడికె చేరుతుంది పైన చెప్పిన వాస్తు ప్రకారం ఇల్లు కడితే.అక్కడ తులసి మొక్కల పెంపకం పేరున బండలు పరచకుండ చేశారు.పక్కన బావి ఎర్పాటు చేశారు.
అక్కడికి పారిన నీరంతా అక్కడున్న మట్టిలొ ఇంకిపొతుంది.శుభ్రత కారణంగా అక్కడ ఇంకే నీరు భూమిని కలుషితం చెయ్యదు.పక్కన బావి ఉంది కనుక ఆ బావిలొ ఊట బాగా వచ్చి బావి ఎండిపొదు.వర్షాకాలంలొ పడే వాననీటిని జాగ్రత్తగా ఇంకుడు గుంతల్లొకి పంపిస్తే భూగర్భజలాలు పెరుగుతాయి.రోజు వాడె నీరు కూడా ఇటుగానే పారుతుంది కనుక వాడుకున్న నీటి యొక్క ప్రతి చుక్కను తిరిగి భూమిలొకి పంపించడమే అవుతుంది.
ఎండిపొయిన బావులను ప్రక్కన ఇంకుడు గుంతలు ఏర్పాటు,ఎండిన బావుల్లకు జల కళ వచ్చేలా ప్రయొగాత్మకంగా అమలు చేసింది సేవ్ సంస్థ.
ఇది వాననీటి పొదుపు కాదా?వనరుల సంరక్షణ కాదా?
~ ఈ వాస్తు సూత్రాన్నే దేవాలయాల్లొ కూడా అమలు చేసి,కొనేర్లు తవ్వించి స్థానికులకు నీటి కరువు రాకుండ చేసిన మహొన్నతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి,హిందూ ధర్మం.

ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.పర్యావరణాను రక్షిస్తూ వినాయక చవితి జరుపుకుందాం. 
part-2
~ మట్టి విగ్రహాలను పూజించడంలొ ఇంకొక విశేషార్ధం కూడా ఉంది.మనం ఏమి చేస్తున్నాం.మట్టిని చెరువులొంచి తీసి,ప్రతిమగా మార్చి,వరసిద్ధి వినాయకుడిని ఆవాహన చేసి ,పవిత్రతను చేకూరూస్తూ,పూజించి తిరిగి దానిని ఏ చెరువులో నుండి తీసామొ అక్కడికె చేరుస్
తున్నాం.మనం పవిత్రంగా భావించే వాటిని పవిత్రంగానే విసర్జిస్తాం.కాబట్టి ఆ విగ్రహాలను పవిత్రమైన జలాల్లొ వదలాలి.అంటే మనం మట్టి తీస్తున్న చెరువు కలుషితం కాకుండ చూడాలి అనే కదా.హిందూ ధర్మం చెప్పింది చెరువులు,నదుల దగ్గర,చెట్ల నీడన మలమూత్ర విసర్జన చేయరాదని.ఈ కారణంగా ఆ చెరువులొ ఎటువంటి కలుషిత పదార్ధలు కలపరు.మరి నిమజ్జనం అయ్యాక కలిపితేనొ?దానికి ఒక పరిష్కారం చూపారు మన ఋషులు.ప్రతి సంవత్సరం ఆ మట్టినే వాడతారు.ఒకవేళ ఎదైన విషపదార్ధాలు ఆ నీటిలొ కలిపారా ఆ మట్టి కూడా కలుషితం అవుతుంది.కలుషితమైన ఆ మట్టిని మళ్ళీ ఏలా పూజిస్తారు?కలుషితమైన దానిలొనికి భగవంతుడిని ఎలా ఆవహన చేస్తాం?ఎక్కడ నుండి తీసిన మట్టి అక్కడే కలపాలి కదా.కాబట్టి ఈ వంకతొ చెరువులను కాలుష్యం బారినుండి తప్పించారు.ఇంకొక రహస్యం ఏ చెరువులొ అయితే వినాయక విగ్రహాన్ని విసర్జించామొ,అది ఒక పవిత్రమైన ప్రదేశంగా మారిపొతుంది.దాని పవిత్రతకు భంగం కలిగిస్తే పాపం వస్తుంది.ఇంత పెద్ద సామాజిక బాధ్యతను దాచారు ఒక్క మట్టి విగ్రహం అనే శాసనం వెనుక.మీరే ఒక్కసారి ఆలొచించండి,ఇది ఎంత గొప్ప విషయమొ.

~ నీటి నుండి ఉత్పత్తైన కరెంటు ఒక రాగి తీగల ద్వారా మాత్రమే సర్ఫరా చేస్తారు.అది దేని ద్వారా పాస్ అవుతుంది ఆ వస్తువునే వాడతారు.అంతేగాని కొత్తగా ఉంటుంది,భిన్నంగా ఉంటుందని ఏ రబ్బరొ,ప్లాస్టికొ వాడతారా?వాడరు.ఎందుకంటే వాటి ద్వారా కరెంటు పాస్ అవ్వదు కనుక.అలాగే మన చుట్టూ ఆ వినాయక చవితి సమయంలొ ఉండే పాజిటివ్ ఏనర్జి,విద్యుత్ అయస్కాంత తరంగాలను ఆ మట్టి మాత్రమే గ్రహించగలదని తెలుసుకొని మన మహర్షులు ఆ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమలను పెట్టి ఆ విశ్వచైతన్య శక్తిని మనం ప్రతిమ అనే మీడియం ద్వారా పొందాలని మట్టి విగ్రహాలను మాత్రమే ఆరాధించమన్నారు.

పర్యావరణరక్షణే హిందూ సంస్కృతి.మన సంస్కృతి మనకు ఆత్మగౌరవం.మన సంస్కృతిని మనమే కాపాడుకొవాలి.మనమే ప్రపంచానికి సంస్కృతి గొప్పతనం చాటి చెప్పాలి.పర్యావరణప్రియమైన గణేశ ఉత్సవాలను మాత్రమే జరుపుకుందాం.
part-1
~ వినాయక చవితి పూజకు మట్టి ప్రతిమనే పెట్టాలా?
~ అవును వినాయక చవితి పూజకు మన చుట్టు ప్రక్కల ఉండె చెరువుల నుండి తీసిన బంక మట్టితొనే ప్రతిమను చేసి పూజించాలి.వినాయక చవితి వ్రతకల్పమే ప్రామాణికం. 

~ అప్పట్లొ రంగులు లేవు కాబట్టి,ప్లాస్టర్ 
ఆఫ్ పారిస్ లేదు కనుక అలా చెప్పి ఉండచ్చు కదా?
~ ఆ కాలంలొ రంగులు లేవు,సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజి) అందుబాటులొ లేదు అనుకుంటే పొరపాటే అవుతుంది.వేదంలొ ఉన్న అంత సాంకేతికత ఇప్పుడు ఇంక కనుగొన్నలేదు కదా.రామయణంలొ మేఘనాధునికి ఉన్న అణ్వాస్త్రాల కర్మాగారం,అదే నూక్లియర్ లాబొరెటరి,రాముడు వాడిన సోలార్ మిస్సైల్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి.భాగవతం(సంస్కృతం)లొ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల గురించి వాళ్ళు ఏమి చెప్పారొ ఇప్పటి డాక్టర్లు కూడా అదే చెప్పారు కదా.మోకాలె విద్యావిధానంలొ చదువుకున్నాం కనుక మనము మన మహర్షులను ఏమి తెలియని వారిగా జమ కట్టేస్తున్నాం.

~ మరి మట్టి ప్రతిమలను ఎందుకు పూజించాలి?
~ వినాయక చవితి వర్షఋతువులొ చివరలొ వస్తుంది.వర్షాలు సమృద్దిగా కురిసే కాలం ఇది.మన పూర్వీకులకు ఎంతొ మేధ శక్తి ఉంది.ఈ ప్రపంచంలొ తొలిసారి వాన నీటిని ఒడిసిపట్టి ఆ నాటిని భవిష్యత్తు అవసరాలకు వాడాలి అని శాసనం చేసింది వాళ్ళే మరి.వారు చెప్పింది ఇదే.ఎండాకాలంలొ చెరువుల్లొ నీరు తగ్గుతుంది.వర్షాకాలం రాకముందే ఆ చెరువుల్లొ ఉన్న బురుదను బయటకు తీయాలి.అలా చేయడం వల్ల వాననీటిని అధికంగా నిలువ చేసుకునే సామర్ధ్యం ఉంటుంది.వర్షాకాలంలొ వర్షాలు కురుసి చెరువు నిండుతుంది.నిండిన చెరువులొ తిరిగి బంకమట్టిగా మారిన ఆ బురుదను వేయడం ద్వారా అది చెరువు అడుగు భాగానికి చేరి ఆ నీటిని ఇంకకుండ చూస్తుంది.ఇది మట్టి వినాయక ప్రతిమను పూజించడం వెనుక ఉన్న సశాస్త్రియ కారణం.ఇంకా చాలా శాస్త్రీయ కారణాలు,ఎన్నొ ఆలొచనలు ఉన్నాయి.వాటిని తరువాత చెప్పుకుందాం.నీటిని ఒడిసిపడుతూ వాననీటిరక్షణ ఉద్యమానికి,అలాగే చెరువులను కాపాడుతూ చెరువుల రక్షణకు,అందరు కలిసి ఆ మట్టిని తీయడం,దాన్ని అందరు కలిసి ఒకే చెరువులొ రోజున కలపడం ద్వారా ప్రజల మధ్య ఐక్యతను,బంధాన్ని పెంపొందిస్తూ,పిల్లలకు సామాజిక భాధ్యతను అలవాటు చేసింది ఆ నాటి హిందూ సమాజం.

అందుకే పర్యావరణహితమైన వినాయక చవితినే జరుపుకుందాం.పర్యావరణాన్ని కాపడుకుందాం.మట్టి ప్రతిమలను మాత్రమే పూజిద్దాం.

పత్రిపూజ ఎందుకు?వినాయక చవితి ద్వారా పిల్లలకు మనం ఏమేమి నేర్పించాలి?అని మన పూర్వీకులు,మన డి ఎన్ ఏ లొ ఇంక సజీవంగా ఉన్న మన మహర్షులు మనకు చెప్పారొ ముందు ముందు చెప్పుకుందాం. 

శ్రీ కృష్ణపరమాత్మ మనకు ఇచ్చిన సందేశం ఏంటి?

లోకాలన్నిటికి ఆహరం పెట్టే పరంధాముడు గొపబాలకులతొ కలిసి చల్దిముద్దలు తిన్నాడు.స్నేహానికి పరమాత్ముడు కూడా అతీతుడు కాడని నిరూపించాడు.అలాగే అనంతమైన సుఖాలున్న కృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడిని మరవక ఆయనకు
 ధనం ఇస్తే తనతొ సమానమవుతాడని తెలిసీ ఆయనకు అనంతమైన భొగభాగ్యాలు ఇచ్చి స్నేహానికి,స్నేహితునికి గొప్ప అర్దాన్ని చెప్పిన మహానుభావుడు. 

కృష్ణుడు ఎకొ-ఫ్రేండ్లి.
అవును పర్యావరణ హితమైన జీవనాన్ని జీవించి చూపించాడు.మొక్కలు,పోదలు,చెట్లు,జంతువుల,పక్షుల మధ్య తిరుగుతూ వాటికి హాని తలపెట్టకుండా తన పిల్లనగ్రొవి వాయిస్తూ వాటికి ఆహ్లాదాన్ని పంచాడు.నిజమే శాస్త్రియ సంగీతం వినిపించడం చేత ఆవులు,గేదలు ఎక్కువగా పాలు ఇస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.అలాగే చెట్లకు మంచి సంగీతం వినిపించడం చేత అవి ఎక్కువగా దిగుబడి ఇస్తాయని కూడా ఋజువు అయ్యింది.
కాళియమర్దనం కూడా పర్యావరణ హితం కోసమే జరిగింది.కాళియుడు తన విషప్రభావం చేత యమున నీటిని కలుషితం చేసి వాటిని తాగిన వారికి రోగాలు వచ్చేలా ఆ నీటిని పాడు చేసాడు.కృష్ణుడు ఆ కాళియుడిని మర్దించి,వాడి అహం అణిచాడు చిన్ని కృష్ణుడు.అంటే జలకాలుష్యాన్ని అరికట్టాడు కదా.
ఎన్నొ పరిశ్రమలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యవరణకాలుష్యాన్ని చేస్తున్న కూడా మిన్నకుండిపోతున్న ప్రభుత్వాలకు కృష్ణుడు ఆదర్శం అవ్వాలి.పర్యావరణాన్ని కాపాడాలి.

ప్రతి సంవత్సరం నందవ్రజంలొని యాదవులంతా వర్షాలు బాగా కురవాలని ఇంద్రుని కోసం యగ్ఞం చేసేవారు.ఇంద్రుడికి అహంకారం బాగా పెరిగిపొయింది.ఇది గమనించిన కృష్ణుడు అక్కడున్న వల్ల నాన్నతొ ఇలా అంటాడు పోతన భాగవతంలొ.నాన్నగారు గొవర్ధనగిరి మీద మన పశువులు గడ్డి మేస్తున్నయి.అక్కడ ఉన్న చెట్ల కారణంగా మనకు వర్షాలు కురుస్తున్నాయి.మరి ఆ గోవర్ధనగిరి పర్వతానికి పూజలు చేయకుండా ఎక్కడొ ఉన్న ఇంద్రునకు పూజలు చేయడం ఎందుకు? అన్నాడు.చిన్న పిల్లాడు కదా అని ఆయన మాటలను పెడచెవిన పెట్టలేదు.అలాగే చేద్దాం అన్నారు.కాని ఎల చేయాలి అని అడిగినప్పుడు కృష్ణుడు మనం సకల నైవేద్యాలు ఆ పర్వతం మీద వేద్దాం.ఆ పర్వతం తింటుంది అని చెప్పాడు.వారు అలాగే చేసారు.అందరు కలిసి ఆ గిరి చూట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కృష్ణుడే ఆ గొవర్ధనగిరి పురుషుడిగా ఆ నైవెద్యాలను భూజిస్తూ దాని చూట్టూ తను మాములు పిల్లవాడిగా ప్రదక్షిణ చేసాడు.ఇంద్రునకు ఈ విషయం తెలిసి ఆ పిల్లవాడు ఎవ్వడు?ఆ గోకులంవారికి బుద్ధి చెప్పాలని వర్షం 7 రోజుల పాటు ఆగకుండా కురిపించాడు.కృష్ణుడు తనను నమ్మి తన మాటను ఆచరించినందుకు వారిని కాపాడడానికి గోవర్ధనదిరిని తన చిటికినవేలు పై ఎత్తి 7 రోజుల పాటు అలా వారిని కాపాడి ఇంద్రుని అహం అణిచాడు.గోవిందుడని పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఇంత కధ ఎందుకు అంటే ఇందులొని అర్దం తెలుసుకొవడానికి.ఇక్కడ ఇంద్రుడు అంటే మదం ఎక్కిన పాలకుడు.వారు యగ్ఞం చేయడం వల్ల తను వర్షాలు కురుపిస్తున్నాను అన్న సంగతి మర్చిపొయాడు.మన ఓట్లుతొ గెలిచి దేశాన్ని అవినీతికి పాల్పడుతూ ప్రశ్నించినవారిని ఇబ్బందులు పెడుతున్న మన రాజకీయనాయకులకు కూడా అదే అహంకారం.తమను ఎవ్వడూ ఎమి చెయ్యలేడని.వారు ఇంద్రునకు యగ్ఞం ఆపి గోవర్ధన గిరి కి పూజ చేయడం అంటే వేరే ఇతర ప్రత్యమ్నాలను వెత్తుక్కొని వారికి అధికారం ఇవ్వడం అని.7 రోజుల రాళ్ళ వాన అంటే ఒక ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు పాలకపక్షం పేట్టే ఇబ్బందులు.వాటిని భరించి తమను నమ్మినవారి రక్షించడం ఆ ఉద్యమకారుల కర్తవ్యం,అలా నమ్మినవారిని,వెంటనడిచేవారిని కాపడుతూ వారికి తమ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లకుండా తమ డిమాండ్లను నెరవేర్చుకొవడం అని అర్దం.ఇది ఏ ఒక్క రాజకీయపార్టిని ఉద్దేశించి రాసింది కాదు.మన గ్రంధాల్లొ ఉన్న సామాజిక భాద్యతకు చిన్న నిదర్శనం మాత్రమే.
అలాగే పర్వతానికి పూజ అంటే?పర్వతం మీద చెట్లు ఉంటాయి.పర్వతంలొ ఘనులు ఉంటాయి.పర్వాతాలలొనే నదులు పుడతాయి.ఎన్నొ జీవరాశి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటుంది.అటువంటి పర్వతాన్ని పూజించడం అంటే దాని గౌరవించడం.పూజించిన దాని నుండి వచ్చిన ప్రతి వస్తువును నైవెద్యంగా భావించి జాగ్రత్తగా వాడుకొవడమని అర్దం.అందుకే ఈ దేశంలొ కొండలకు,గుట్టలకు,పుట్టలకు,నదులకు పూజలు చేస్తారు.ఇది ఒకరకంగా పర్యవరణహితకరమైన జీవనమే కదా. 

శ్రీ కృష్ణపరమాత్మ పదహారువేలమంది(16000)గొపికలతొ క్రీడించాడని అంటారు.ఆయన్ను మంచివాడు కాదు అన్న విధంగా చూపిస్తారు.అసలు సంగతి తెలియాలి అంటే ముందు కొన్ని తెలుసుకొవాలి.

రామావతారంలొ రాముడు మానవుడిగానే జీవించాడు.అది త్రేతాయుగం నాటి మాట.ద్వాపరయుగంల
ొ కృష్ణావతరం పరిపూర్ణావతారం.అంటే కృష్ణుడు పుట్టడమే నాలుగు భుజములతొ శంకుచక్ర గదాపద్మములతొ పుట్టి సాధారణ మానవుడిగా మారాడు.రాముడు ఏనాడు మాయలు చెయ్యలేదు.కాని కృష్ణుడిగా మాత్రం ఎన్నొ లీలలు చేసాడు.ఇది రెండు అవతారాలా మధ్య ఉన్న తేడా.

రాముడి వనవాస కాలంలొ ఆయన్ను చూసి మహర్షులు సైతం మొహించారట."పుంసాం మొహన రూపాయ" అని కదా.ఆ సుందరమైన రూపాన్ని చూసిన మహర్షులు ఒక్కసారి కౌగిలించుకోవలని ఉంది రామా అన్నారట.అందుకు రాముడు రాబొయే యుగంలొ ఆ అవకాశం ఇస్తానని చెప్పాడు.ద్వాపరయుగంలొ వారు అందరూ గొపికలుగా వేషాలు ధరించారు.కృష్ణుడ్ని పతిగా పొందాలని,ఆయన్ను చేరాలని "కాత్యాయని వ్రతం" ఆచరించి అమ్మవారిని వరం అడిగారు.ఇక్కడ కాత్యాయని అంటే అర్దం ఏంటొ తెలుసా?ఒక్కప్పుడు ఒక ఆయన మహర్షులందరిని మార్గమేది మార్గమేది అని అడిగేవారు.మార్గం దేనికి అంటే పరమపదసోపానానికి,శాశ్వతమైన చోటుకి,పరమేశ్వరునిలొ ఐక్యానికి.అలా తపించి తపించి ఆయన తాపసి అయ్యారు.జ్ఞానం పొంది జ్ఞాని అయ్యారు.మౌనం వహించి ముని అయ్యారు.తర్వాత మహర్షి అయ్యారు.అప్పుడు ఆయన భక్తికి మెచ్చి జగన్మాత ఆయనకు కూతురుగా "కాత్యాయని"గా అవతరించింది.ఆయనకు సత్ మార్గాన్ని చుపించింది.అటువంటి కాత్యాయని దేవిని వరు ఏమి కొరుకున్నారు అంటే కృష్ణపరమాత్మను చేరాలి,ఆయనలొ రమించాలి,బ్రహ్మానందాన్ని పొందాలి అని.వరంపొంది ఎవరిని చేరితే ఇక మళ్ళీ జన్మ ఉండదొ అటువంటి స్వామిని వారు పొందారు.కృష్ణుడు ఆత్మస్వరూపుడు.వారికి కృష్ణపరమాత్మకు శారీరిక సంబంధం ఉన్నట్టు ఎక్కడైన ఉందా చెప్పండి.కృష్ణుడు దేవుడన్న సంగతి అందరికి తెలుసు,కాబట్టి దేవున్ని చేరారు తప్ప ఒక వ్యక్తిని కాదు.

ఇంకొక విషయం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు ఏవరిని మొహించాలేదు.అందరు వాసుదేవుడ్నే మోహించారు.కృష్ణుడు గొపికల సహవాసం ఎప్పుడైన కొరుకున్నాడ?కాదు.గొపికలే కృష్ణతత్వంలొ ఆనందించి ఆయన కొసం తపించారు.పరమాత్మ దగ్గరకు చేరారు.

కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి.మహాయోగి.ఆయనే పరమాత్మ.కృష్ణపరమాత్మ పరబ్రహ్మం.మనము ఆత్మస్వరూపం.అదే కదా భగవద్గీత సారాంశం.మనం శరీర పరంగా చూసినప్పుడు మనం స్త్రీ పురుష బేధం ఉంటుంది.కాని ఆత్మ స్త్రీ స్వరూపంగా ఇక్కడ భావించబడింది.నది సముద్రంలొ కల్సిన విధంగా ఆత్మ ఆ సత్చిదానంద ఘనపరమాత్మలొ కలవాలి.ఆ పరమాత్మ పురుష రూపంగా భావించబడింది మన భాగవతంలొ.అంటే ఈ లొకంలొ అన్నిటిని భరించే భర్త ఒక్క పరమేశ్వరుడే.మిగితా జీవరాశి అంతా ఆయనచే భరించబడుతొంది.అదే తత్వజ్ఞానం.కృష్ణ దర్శనంతొ గొపికలకు కూడా అదే తత్వజ్ఞానం బొధపడింది.అందుకే వారు అన్నిటిని సన్యసించి కృష్ణుడ్నే అంతటా చూసినవారై ఆయనే భర్తని తెలుసుకొని వేరె అన్నిటిని వదిలి ఆ ఆత్మస్వరూపాన్ని తమలొనే ఉందని గ్రహించి,వారిలొ ఉన్న ఆ పరమాత్మలో తమను తాము ఐక్యం చేసుకొని బ్రహ్మజ్ఞానన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందారు.అల వారు ఆ అత్మస్వరూపమైన ఆ తత్వంలొనే రమించారు.శాశ్వతమైన ఆనందాన్ని పొందారు అని ఉందే కాని ఎక్కడా వారు తాత్కాలికమైన సుఖాలను కృష్ణుడి ద్వారా పొందారని ఎక్కడైన ఉందా చెప్పండి?

మన శరీరం సప్తధాతువులతో,నవరంధ్రాలతొ ఉందా లేదా?అటువంటి ఈ శరీరాన్ని అశాశ్వతమని భావించి ఆ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడానికి ఎంతొ వ్యయ ప్రయాసలకు లొను అవ్వాలి.మొత్తం ఆ నవరంధ్రాలు,సప్తధాతువులు కలిపి మొత్తం పదహారు.సంస్కృతంలొ వేలను సహస్రం అంటారు.సహస్రం అంటే అనంతం అని అర్దం.ఈ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడమే అనంతమని ఆ పదహారు వాటిని అదుపులొకి తెచ్చుకొని అ పరమాత్మునిలొ ఆత్మను లయం చేయడం అని అర్దం.అటువంటి అనంతమైన,అతి కష్టమైన ఈ మార్గన్ని అనుసరించి ఆయన్ను చేరుకున్న వారు ఆ గొపికలు అని అర్దం.అంతే కాని కృష్ణ్ది మీద లేనిపొని అబాంఢాలు వేయ్యొద్దు.

అలాగే పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,పంచ భూతాలు,మనస్సు కలిపి పదహారు(16).అనంతమైన వాటి మాయాను జయించడం కష్టం.అటువంటి వాటిని జయించి ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మను ఎరుకలొకి తెచ్చుకొని వాటిని జయించినవారు ఆయన్ను తమలొనే దర్శించినవరికి ఆత్మానందాన్ని ఇచ్చాడు.ఇప్పుడు పైన చెప్పిన ఆ పదహారు మనలని మాయలొ ఉంచే ముఖ్యసాధనాలు.వాటి మాయ చేష్టలు అనేకం.మనం వాటిలొ బ్రతికి మాయకు వశులమవుతున్నాం.అటువంటి ఆ పదహారు కూడా ఆ పరమాత్ముడ్ని ఏమి చేయలేక ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాయి అని.

సహస్రశీరుష పురుషః సహస్ర్రక్షర్ సహస్ర పాత్ అని పురుష సూక్త వచనం.ఆయనకు వెయ్యి తలలు,కన్నులు,పాదాలు అని అర్దం.అంటే ఆయన అనంతుడు.ఇందాక చెప్పినట్టుగా సహస్రం అంటే అనంతం అని.అనేక విధాలుగా ఉన్న ఆ పరమాత్మ మాయను దాటి ఆయన్ను చేరారు అని అర్దం.

కృష్ణుడు ప్రతి గొపికకు కనిపించాడని భాగవతం చెప్పింది.అంటే పదహారువేల కృష్ణపరమాత్మలు ఉన్నారా?పదహారువేలు ఏంటి అంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి ఆ పరమేశ్వర తత్వం.ఆ ప్రాణశక్తిని తెలుసుకొని రమించినచారు గొపికలు.

చివిరిగా ఒకమాట.కృష్ణుడితొ ఏవరికి దేహసంబంధం లేదు.ఆయనతొ ఉన్నది ఆత్మ సంబంధం మాత్రమే.

కరారవిందెన పదారవిందం
ముఖారవిందెన వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలం ముకుందం మనసాస్మరామి

శ్రావణమాస కృష్ణపక్ష అష్టమినాడు దేవకిదేవి ఎనిమిదవ గర్భాన ఆ పరమాత్మ మధురలొ అవతరించాడు.అదే సమయంలొ రేపల్లెలొ యశొద కడుపున మహాశక్తి యొగమాయగా రూపం స్
వీకరించింది.వాసుదేవుడు మధురలొ జన్మించడం అంటే తాత్వికమైన అర్దం ఆయన మధురమైన ప్రదేశంలొనే కనిపిస్తాడని,దర్శనమిస్తాడని.ఎవరికి ఇచ్చాడు ఆ దర్శనం?నిర్మలమైన,సాత్వికమైన,మధురమైన మనస్సుతొ జీవిస్తున్న దేవికి వసుదేవులకు పుత్రసంతానంగా అవతరించి.అంటే అటువంటి మంచి మనస్సు కలిగినవారి హృదయంలొనే తన శక్తి ఉద్భవిస్తుందని.


ఆయన్ను వసుదేవుడు యమున నది దారి ఇవ్వగా అది దాటి రేపల్లెకు తీసుకువెళ్ళడు.నది ప్రవాహం ఆగదు.ఆగకుడదు.యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే.అటువంటి యమున అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లొబడి ఉంటుందని,ఆయన కోసం కాలం కూడా ఆగిపొతుందని అర్దం.

అలా వెళ్ళిన కృష్ణుడు అమాయకంగా,మంచిగా,ప్రశాంతంగా జీవనం సాగించే రేపల్లెకు చేరాడు.అంటే అటువంటి భక్తుల దగ్గరకు తానే చేరతాడు.యొగమాయ రేపల్లెలొ పుట్టిన వారి మంచితనానికి ముగ్ధురాలయ్యి వారి దగ్గర నుంచి కంసుడు ఉండే మధుర చేరింది.ఎంతటి మాయ అయిన భగవంతుడ్ని నమ్మిన వారిని ఎమి చెయ్యదని,తానే భగవదర్శనం కొరకు తప్పుకుంటుందని అర్దం.యా మా స మాయ అని సంస్కృతంలొ చెప్తారు.అంటే ఏది లేదొ అది ఉందనుకొవడం మాయ.కంసుడు దేవకి అష్టమగర్భం వల్ల మరణం సంభవిస్తుందని తెలుసుకొని,మరణాన్ని జయించాలి అనుకున్నాడు.మరణం రాకుండ ఆపగలను అనుకొవడం మాయ.అందుకే యొగమాయ మధుర చేరింది.ఎవరు అశాశ్వతమైన వాటిని ప్రేమిస్తారొ వారు మాయలొ పడ్డారని,మాయ వారిని ఆవరించడానికి వస్తుందని అర్దం.
 

కంసుడు ఆ చిన్నపిల్లను బండకు కొట్టడానికి ప్రయత్నించగానే ఆ పసిపిల్ల రివ్వున ఆకాశానికి ఎగిరి ఎనిమిది చేతులతొ యొగమాయ దర్శనమిచ్చి కంసుడ్ని చంపేవాడు పుట్టడం జరిగిపొయి
ందని చెప్పింది.కంసుడు చెరసాలలొ ఉన్న దేవకి వసుదేవులను విడిచిపెట్టాడు కాని మరణం నుండి తప్పించుకొవాలని ఇంకా మాయలొనే ఊగిసలాడుతూ ఆ పిల్లవాడిని చంపమని పూతన అనే రాక్షసిని పంపాడు.ఆమె అ పిల్లాడు ఎక్కడున్నడొ తెలియదు కనుక అందరు పిల్లలను తన విషం నిండిన పాలతొ చంపేయసాగింది.కృష్ణుడ్ని చూసి తనువు పులకరించింది ఆ రాక్షసికి.ఆమె ఆయనకు పాలు ఇవ్వడం మొదలు పెట్టగానె ఆ చిన్ని పాపడు ఆమె శరీరంలొ ఉన్న మొత్తం విషాన్ని ఒక్క గుక్కలొ పిల్చేసి ఆమె రక్తాన్ని కూడా పిల్చేయసాగాడు.ఆమె వదిలించుకున్న వదలక ఆమెను చంపి ముక్తిని ప్రసాదించాడు.


ఒక్కసారి మనం ఆ పరమాత్మకు ఏదైన సమర్పించినా లేక మనస్సుతొ ఆయన్ను చూసిన చాలు ఇక మొత్తం ఆయనే చూసుకుంటాడని,మనం విడిపించుకొవాలని చూసినా సరే ఆయన వదలక మనలొని చెడును మొత్తం పిల్చేసి ముక్తిని ఇస్తాడని తత్వతః దాగిన అర్దం.
అ పూతన శవాన్ని దహనం చెయ్యగానే మంచి సువాసనలతొ ఆ ప్రంతం నిండిపొయింది.ఒక్కసారి మనం ఆ భగవంతుని అనుగ్రహం పొంది ఆయన్ను మానసికంగా స్పృశించామా మన మనస్సు కూడా అలా సువాసనలా(మంచి అలొచనలు)తొ నిండిపొతుందని అర్దం.


కృష్ణుడి అల్లరిని భరించలేని యొశొద ఆయన్ను బందించాలి అని ఎన్ని మార్లు ప్రయత్నించినా రెండు అంగుళాలు తగ్గుతొందే కాని ఆ తాడు సరిపొలెదు.అంటే భగవంతుడ్ని బందించాలి అనుకొవడం,బందించగలను అనుకొవడం భ్రమ మాత్రమే అని అర్ధం.కష్టపడి ఆ విశ్వవ్యాపకుడిని బందించింది యొశొద.అంటే దేనికి లొంగని పరమాత్మ భక్తి మాత్రం లొంగుతాడని అర్దం.


కృష్ణుడు తన చిన్నతనంలొ సాందిపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు.జగద్గురువు తానే అయిన గురువు యొక్క విశిష్టతను లొకానికి తెలియపరచడానికి,అలాగే ఎంతటి వాడైన గురువును గౌరవించాలని,సేవ చేయాలని లొకానికి చెప్పడానికి తను ఒక గురువు వద్దకు వెళ్ళాడు.


కుచేలుడు కృష్ణుని బాల్యస్నేహితుడు.పరమ దరిద్రంలొ బ్రతుకుతున్నాడు.కృష్నుడు రాజభొగాలు అనుభవిస్తున్నాడు.కుచేలుడు కృష్నుడ్ని కలవడానికి వస్తే సకల రాచమర్యాదలతొ సత్కరించి,బంగారు చెంబుతొ కాళ్ళు కదిగి ఆ నీటిని తలపై చల్లుకొని,తన భార్య రుక్మిణి సాక్షత్తూ మహాలక్ష్మీ తలపై చల్లి స్నేహానికి అసలు సిసలైన అర్దం చెప్పి ఈ కాలానికి మంచి సందేశం ఇచ్చిన మహానుభావుడు.రెండు గుప్పిళ్ళు అటుకులు అడిగి మరీ తిని ఆ కుచేలునికి సకల సుఖాలు ఇచ్చి తనకు కొంచం ఏదైన సరే మంచి మనస్సుతొ,అచంచలమైన భక్తితొ,ఏమి తిరిగి ఆశించకుండా ఇస్తే అది తీసుకొని వారికి అవసరమైనవి ఇస్తానని లొకానికి చాటిచెప్పాడు.
  
కృష్ణకధల్లొ ఆధునీకులు తెలుసుకొవాల్సినవి ఏంటి?అందులొ ఉన్న సైన్స్ ఏంత?

దేవికి దేవి సప్తమగర్భంలొ పెరుగుతున్న పిండాన్ని వసుదేవుడు కంసుడికి భయపడి యమున ఆవలి వడ్డున ఉన్న నందవ్రజంలొ తన మరొభార్య రొహిణి దేవి గర్బంలొకి ప్రవేశపెట్టాడు.అంటే ఆ కాలంలొనే 
ఈ దేశప్రజలకు గర్భమార్పిడి విధానం తెలుసని అర్ధమవుతొంది.

ఇక గాంధారి దృతరాషృల పిల్లలు కౌరవులు ఎలా పుట్టారు?గాంధారి కడుపులొని పిండం ముక్కలయితే ఆ ముక్కలను చిన్న కుండల వంటి పాత్రలలొ వేసి అతి జాగ్రత్తగా వాటిని పెంచమని వ్యాసమహర్షి చెప్పారు.ఈ ప్రపంచంలొ తొలి టెస్ట్ ట్యూబ్ బేబిలు వారే కదా.కావలంటే వ్యాసులవారు రాసిన మహభారతం(సంస్కృతం) చూడండి.

ఆటంబాంబు లేద అణుబాంబులనే ఆనాడు అస్త్రశస్త్రాలు గా చెప్పారు.ఆ బాణాల ప్రయొగం చేత ఎలాంటి ప్రభావాలు కలుగుతాయొ మహాభారతంలొను,ధనుర్వేదంలొను చెప్పబడ్డాయి.కావలంటే ఒక్కసారి పరిశీలించండి.


మహభారత యుద్దంలొ ఒకానొక సందర్భంలొ వరి మాటలు ఇలా సంస్కృతంలొ ఉన్నవాటిని మీకొసం ఇల అందిస్తునాము."రాత్రి కావస్తొంది.మరి చీకటిలొ యుద్దం చేయదం కష్టం కదా.చింతించాల్సిన అవసరం లేదు.మన ఏనుగుల తలలకు సూర్యకాంతిని తలపించేటువంటి పెద్ద పెద్ద కాంతిని ప్రసరించే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి.వాటికి ఇంధనం వాడల్సిన అవసరం లేదు.మనం నిర్భయంగా యుద్దం చెయ్యొచ్చు"అని తాత్పర్యం.అంటే అప్పట్లొనే వైర్లెస్స్,రెమొట్లెస్స్ ఫొకస్ లైట్లు ఉన్నాయని తెలుస్తొంది.మీరు కావలంటే సంస్కృత మహభారతం చదవండి.కురుక్షేత్ర సంగ్రామంలొ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.

భవగవద్గీత కేవలం ఒక మత గ్రంధం మాత్రమే కాదు.అది ఒక మెనెజ్మెంట్ స్కిల్ల్స్ గురించి ఎంతొ విపులంగా తెలిపె గ్రంధం.అందుకే ఐ.ఎస్.బి లాంటి పెద్ద పెద్ద సంస్థలు గీతనే భొదిస్తున్నాయి.

భారత పురావస్తూ శాఖవారి తవ్వకాల్లొ గుజరాత్ లొ కృష్ణుడు ఏలిన ద్వారక బయటపడిండి.మహభారతం,శ్రీ కృష్ణావతారం నిజమని నేటి సమాజానికి తెలియపరిచింది.

గాంధర దేశమే నేడు ఖాందహార్ గా ఆఫ్ఘనిస్తాన్లొ ఉంది అన్నది పచ్చి నిజం.నాతి ఇంద్రప్రస్థ నేటి డిల్లి.

అభిమన్యుడు గర్భంలొ ఉండగానే చాలా విషయాలు తెలుసుకున్నాడు.ఇది విన్న పాశ్చాత్యులు ఒకప్పుడు నవ్వినా ఇప్పుడు అదే నిజమని పరిశొధించి చెప్తే నిజమె అని తెలుసుకొని గర్భిణీలకు ప్రత్యేక కొచింగ్ ఇస్తున్నారు.

అశ్వథామ నారయణాస్త్రం అనే ఒక నుక్లియర్ మిస్సైల్ ని ద్వారక లొ ఉన్న ఉత్తర గర్భంలొ ఉన్న అభిమన్యుడి మీద ప్రయొగిస్తే దాని దిశను మార్చి అరేబియ సముద్రంలొ దూరంగా పదెల చేశాడు.ఎందుకు అలా దాని దూరంగా మళ్ళించడం అంటే దాని రెడియెషన్ ఆ కడుపులొ ఉన్న పిండానికి హాని చేస్తుందని చెప్పాడట.

యుద్దం ఏలా చెయ్యలి,యుద్ద నాయకుడ్ని ఏ స్థానంలొ ఉంచాలి లాంటి ఏన్నొ రహస్యాలను మహభారతంలొ చెప్పారు.ఇప్పుడు వాటినే అమెరిక వారు పరిశీలిస్తున్నారన్న విషయం మనకు తెలియదు.

కొన్ని వందలమైళ్ళ దూరంలొ జరుగుతున్న మహాభారత యుద్దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వార సంజయుడు చూసాడు,ధృతరాష్టృడు విన్నాడు.ఆ కాలంలొనే ఉపగ్రహలు ఉన్నయాని,ఒక తెర మీద వీటిని వీక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు మహాభారతాన్ని చదివి మనకు చెప్పారు.

Embriology as Veda teaches

The personality of Godhead said: under the supervision of the Supreme Lord and according to the result of his work the living entity, the soul, is made to enter into the womb of a women through the particle of the men semen to assume a particular type of body.

Srimad Bhagavatam 3:31:1

The modern science says- It is the man who caused the future child to be male or female due to the variation of X-Y chromosome. The “the particle of the men semen to assume a particular type of body” tell about the variation of child whether to be male or female.

“kalalaḿ tv eka-rātreṇa pañca-rātreṇa budbudam
daśāhena tu karkandhūḥ peśy aṇḍaḿ vā tataḥ param”

Srimad Bhagavatam 3:31:2

On the first night, the sperm and ovum mix, and on the fifth night the mixture ferments into a bubble. On the tenth night it develops into a form like a plum, and after that, it gradually turns into a lump of flesh or an egg, as the case may be.

"māsena tu śiro dvābhyāḿ bāhv-ańghry-ādy-ańga-vigrahaḥ
nakha-lomāsthi-carmāṇi lińga-cchidrodbhavas tribhiḥ

Srimad Bhagavatam 3:31:3

In the course of a month, a head is formed, and at the end of two months the hands, feet and other limbs take shape. By the end of three months, the nails, fingers, toes, body hair, bones and skin appear, as do the organ of generation and the other apertures in the body, namely the eyes, nostrils, ears, mouth and anus.

"caturbhir dhātavaḥ sapta pañcabhiḥ kṣut-tṛḍ-udbhavaḥ
ṣaḍbhir jarāyuṇā vītaḥ kukṣau bhrāmyati dakṣiṇe

Srimad Bhagavatam 3:31:4

Within four months from the date of conception, the seven essential ingredients of the body, namely chyle, blood, flesh, fat, bone, marrow and semen, come into existence. At the end of five months, hunger and thirst make themselves felt, and at the end of six months, the fetus, enclosed by the amnion, begins to move on the right side of the abdomen
Srimad Bhagavatam contains the knowledge of how fetus developed and it is proved by the modern science. Not a single mistake can be found thorough out the nine month period, though it is written over thousands of years. Amazing isn’t it??

శాకంబరిదేవి కధ చాలా రహస్యమైనది.దేవి పురాణంలొని 28వ సర్గలొ ఉన్న ఈ కధ మహా మహిమాన్వితమైనది.ఈ కధను చాల నమ్మకంతొనే వినాలని,ఎవరికి పడితే వారికి చెప్పకూడదని,అవతలి వాళ్ళ శ్రద్దను గమనించి మాత్రమే చెప్పాలని నియమం. 
శాకంబరి అనగా శాకములను ధరించినది/కల
ిగినది అని.శాకములు అంటే కూరగాయలు.అలాగే శాకములకు ప్రాణశక్తిని ఇచ్చేది,శాకములకు మూలమైనది అని.బరి అనగా వేరు అని.శాకంబరి అనగా పచ్చదనానికి ప్రతీక.పచ్చటి ప్రకృతి ఆమె యొక్క సాకార రూపం.
ఈ కధ వేదవ్యాస మహర్షిచే చెప్పబడింది.వేదవ్యాస మహర్షి విష్నుస్వరూపం.చిరంజీవి.ఇప్పటికి బద్రి(ఒకనాటి బదరికాశ్రమం)లొ సశరీరంతొ ఉన్నారు,పుణ్యాత్ములకు చాలా అరుదుగా దర్శనమిస్తారు.
అపరశివావతారం శ్రీ ఆది శంకరచార్యలకు కాశిలొ దర్శనమిచ్చి,వాదించి,వారి జీవితకాలాన్ని 16 నుండి 32 సంవత్సరములకు పెంచిన మహ పురుషుడు.
శక్తిమహర్షి మనుమడు,పరాశర మహర్షి కూమారుడు.
ఘనరూపమైన వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి,వ్యాసంగా ఉన్న వేదాన్ని విభజించాడు కనుక వేదవ్యాసుడని పేరు తెచ్చుకొని,అనేకానేక ఉపనిషత్తులు వ్రాసి,18 మహా పురణాలు,ఉపపురణాలు రచించారు.మహభారత కావ్యాన్ని చెప్తూ వినయకుని చేత వ్రాయించిన మహానుభవుడు.సనాతన హిందూ ధర్మానికి మూలస్తంభాలు అయిన భగవద్గీత,బ్రహ్మ సూత్రాలు,కర్మ సిద్ధాంతం(ప్రస్తానత్రయం)న్ని మనకు అందించిన వారు.
కేవలం హిందూ ధర్మంలొనేగాక బౌద్ధము,సిక్కులకు కూడా పుజ్యనీయుడైన వ్యాసుడు ఒక బెస్త(చేపలు పట్టెవల్లు)స్త్రీకి జన్మించారు.
ఒకనాడు దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరు మర్చిపొవాలని,వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం అడిగాడు.సరే అన్నాడు బ్రహ్మ.ఇల చెయ్యడం మూల
ంగా దేవతలను ఓడించాలని వాడి ఆలొచన.
అతి తక్కువ కాలంలొనే అందరు వేదాలను మర్చిపొయారు."వేదొఖిలం మూలం జగత్"అని వాక్యం.అంటే వేదమే అన్నిటికి మూలమని.అందువల్ల నాలుగు వర్ణలా వారు వారి వారి పనులు మర్చిపొయారు.వ్యవసాయం చేయ్యట్లేదు,దేశ రక్షణ,వ్యాపరం,పూజాలు,మంత్రాలది కూడా అదే పరిస్థితి.దుర్గమాసుర సైన్యం విజృంబించింది.యగ్నయాగాదులు లేక దేవతలకు హవిస్సు లేదు,తత్ఫలితంగా వర్షాలు కురవడంలేదు.ప్రపంచమంత కరువు సంభవించింది.మృత్యుదేవత విలయతాండవం చేస్తొంది.పశుపక్షాదులు,వృక్ష సంపద నాశనం అవ్వడం పరిపాటే అయ్యింది.దేవతల శక్తి క్షీణించడం జరిగింది.
దుర్గమాసురుడు ఇంద్రపదవిని లాక్కుని,స్వర్గాన్ని ఆక్రమించాడు.ప్రజలబాధను తీర్చలేక క్షత్రియులు రాజ్యాన్ని వదిలేశారు.లొకమంతట హాహాకారలు మిన్నంటాయి.అది చూసిన ఋషులు చలించిపొయారు.ఋషులు,మునులు,తాపసులు,సిద్ధులు అందరు జీవకోటి ఆకలి తీర్చాలని ఉన్న తమకు ఏమి గుర్తురాక బాధపడ్డారు.
చివరకు ఋషులు అందరు "సుమేరు పర్వతం"గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను "అమ్మా!అమ్మా!" వేడుకున్నారు.వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది.నీలివర్ణంతొ అనేకమైన కళ్ళతో "శతాక్షి"అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది.ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులపాటు కన్నుల నీరు కారుస్తూ ఏడ్వసాగింది.ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మె శాకంబరిగా అవతరించింది.అమ్మ శరీరభాగాలుగా కూరలను,పండ్లను,గింజలను,గడ్డి మొదలైనవి ఉండగా,తన శరీరభాగలను(శాకములను) అన్ని జీవాలకు ఇచ్చింది.ఋషులు,మునులు,దేవతలు వేదాలను దుర్గమాసురుని దగ్గర్నుండి విడిపించమని వేడుకొన్నారు.ఆమె సరే అన్నది.

ఫ్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే
అనంతకొటి బ్రహ్మాండనాయికెతే నమోనమః 
సర్వవిఘ్నొపశాంతయె
అన్ని విఘ్నాలు శాంతిస్తాయి,ఉపసమనం పొందుతాయి అని అర్ధం.ఎవరిని ధ్యానించడం చేత అడ్డంకులు తొలగుతాయొ ఆయనే వినాయకుడు.దేవతలకు,గణాలకు,విఘ్నాలకు అధిపతి గణపతి.
అందులొని తత్వం ఏమిటి?తెల్లని వస్త్రములతొ,అంతటా వ్యాపించినవాడై,చంద్ర వర్ణ
ాంతొ,నాలుగు భుజములతొ,ప్రసన్నమైన ముఖం కలిగిన ఆ దివ్య మంగళ రూపాన్ని వినాయకుడిగా ధ్యానం చేసినంత మాత్రమే అన్ని విఘ్నాలు తొలగి కార్య సిద్ది కలుగుతుందని అర్ధం.ఏలాగ అంటారా?వినాయకుడి తల పెద్దగా ఉంటుంది కదా.పెద్ద తల బాగా అలొచించి పని చెయ్యమని,పెద్ద చాట చెవులు బాగా వినమని,చాట బియ్యంలొని రాళ్ళను ఏరినట్టు,అనవసరమైన విషయాలను వదిలెసి అవసరమైన వాటినె గ్రహించమని,చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టిని కలిగి ఉండమని,చిన్న నోరు తక్కువగా మాట్లాడమని,పెద్ద బొజ్జ చాలా తెలిసిన కడుపులొనే దాచుకొమ్మని,చిన్న ఏలుక మనస్సులాగా పరిగెడుతుందని,దాని అదుపులొ పెట్టుకుంటెనె చేసె పనిలొ విజయం వస్తుందని,పెద్ద శరీరం త్వరగ కదలేదు కద అలాగే మనం ఒక్కసారి ఒక పని మొదలుపెడితే అది పూర్తి అయ్యేవరకు దాన్ని వదలవద్దని ఆ మహాగణాధిపతి రూపం మనకు సందేశం ఇస్తొందని మహర్షుల వాక్యం.ఈ శ్లొకం లొ ఇంకొన్ని జొడించి చెప్పారు.అదేమిటి అంటే నీకు అంత తెలిసి ఉన్నా(విష్నుం),చతురంగ బలాలు(చతుర్భుజం)నీ వెంట ఉన్నా,చంద్రుని వలె చల్లగా,మనస్సును రంజిపజెసె మాటలు మాట్లాడుతూ(శశి వర్ణం),ప్రసనమైన ముఖము,మనస్సు కలిగిఉండి(ప్రసన్న వదనం),శాంతినే ఎల్లప్పుడు కోరూతూ(శుక్లాంబరధరం-తెల్లని రంగు కదా),నీ మనస్సును అదుపులొ ఉంచుకూంటూ(ధ్యానయెత్-ధ్యానం మనస్సును అదుపులొ ఉంచుతుంది కదా),పైన చెప్పిన ఆ ఏకదంతుడి రుపాన్ని స్మరించి అనుకరిస్తే నీ కార్యానికి వచ్చిన అడ్డంకులు అన్ని తొలిగి(సర్వవిఘ్నొపశాంతయె) విజయలక్ష్మి వరిస్తుందని ఎంతో పెద్ద అర్ధాన్ని ఇంత చిన్న శ్లొకం లొ దాచిన మన మహర్షులకు నమస్కరిస్తూ...........
ఇంకా వెరెవెరె అర్ధాలు ఈ శ్లొకనికి ఉన్నాయి.వాటిని త్వరలొనే అందించేందుకు ఆ విఘ్ననాయకుడి అనుగ్రహం సదా ఉండుగాక.
ధ్యాయేత్ 
అంటే ధ్యానం చేయడం ద్వారా అని అర్ధం.అసలు ధ్యానం అంటే ఏమిటి?స్వాస మీద ధ్యాస.మనకు అనువుగ ఉన్న ప్రదేశంలొ కూర్చుని,కన్నులు ముసి,మన రెండు కళ్ళ దృష్టీ బృకుటి అంటే మన రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలొ ఉంచి మన మనస్సును స్వాస మీద నిలిపి,ఉచ్చ్స
్వాస,నిస్వాసలను గమనించే ప్రక్రియను ధ్యానం అంటారు.ఈ శ్లొకాన్ని ధ్యానం చేసె ప్రక్రియలొ మన మనస్సును ఆ పరమాత్మ పై నిలిపి,ఈ శ్లొకంలొ చెప్పిన స్వరూపాన్ని ధ్యానం ద్వార అంటే మానసికంగా పరమేస్వరుడ్ని దర్శించాలి.ఆ పదాల అర్ధం తెలుసు కనుక ప్రతి పదాన్ని స్మరిస్తున్నప్పుడు మనకు వాటి అర్ధలు గుర్తుకురావలి.ఇల చేస్తె ఏమి అవుతుంది.ధ్యానంలొ పరమేశ్వరుని దివ్యమంగళ రూపం దర్శనం అవుతుంది.అలా అవ్వాలంటే ముంది మనం మౌనంగా ఉండాలి.మన మౌనంగ ఉంటే మన దేహం మనస్సుతొ మాట్లాడ్డం మొదలుపెడుతుంది. మనస్సును మౌనంగ ఉంచాలి.మనస్సు మౌనంగా ఉంటే అది మన అత్మతొ మట్లాడుతుంది.ఆ ఆత్మను తెల్సుకొని దానిని కూడా మౌనంగా పరమేశ్వరుని యందు ఉండేలా చేయగలిగితే అది ఆ పరమాత్మ లొ ఐక్యం అవుతుందని రహస్యార్ధం.మరి ఇంతా చేస్తూ కూర్చొవడానికి సమయం ఉండదు కదా మరి మనం ఏం చేయాలి?ఆ శ్లొకం లొ చెప్పిన పదాలను గుర్తుచేసుకుంటూ ఈ శ్లొకాన్ని పఠించడం చేత తత్ఫలితం కలుగుతుంది.మరి ఈ శ్లొక పఠనంవల్ల కలిగే ఫలితం ఏంటొ,అది ఎలా కలుగుతుందొ తరువాయి భాగంలొ చెప్పుకుందాం.

ప్రసన్నవదనం? ప్రసన్నమైన ముఖము కలవాడు.నిజానికి ప్రసన్నమైన ముఖం అంటే అందమైన ముఖం అని కాదు.ప్రాచీనులు ఏనాడు మన శరీర అందం గురించి చెప్పలేలెదు.ఎందుకంటె అది తాత్కాలికం.వారు ఎప్పుడు మనొసౌందర్యం గురించి మాత్రమే చెప్పారు.ఎవరు మనస్సు నిత్యం ప్రశాంతంగా,నిర్మలంగా,నిష్కల్మషంగా ఉంటుందొ వారి ముఖం లొ అది ప్రస్పుటమవుతుందని,అలాంటి వారి ముఖం మాత్రమే ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉంటుందని అయుర్వేదం చెప్తొంది. ఎవరు ముఖాన్ని చూసినంత మాత్రమే మనొచంచలం అదుపులొనికి వస్తుందొ,భయం తగ్గి దైర్యం కలుగుతుందొ,అలాగే చూస్తు ఉండిపొవాలని అనిపిస్తుందొ అటువంటి ప్రసన్నమైన ముఖం ఆ పరమాత్ముడిని ఈ శ్లొకం లొ వర్ణించారు. లక్ష్మీ స్థానాలుగా ఏనుగు ముఖం,గో మయం,నిరంతరం పసిపిల్లల తిరిగె ప్రదేశం,గోశాల,పరిశుభ్రమైన ఇల్లు,బొట్టున్న మొహం అంటూ చాలనే చెప్పారు.వాటిని చూడగానే మనస్సు అనందపరవశంతొ పొంగిపొతుందని చెప్పారు. వినాయకుడి ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందని ఆయనకు సుముఖుడని పేరు.నిజమే పసిపిల్లలు కూడా ఆయనకు త్వరగా వశం అవ్వడానికి ఆ ఏనుగు ముఖం కూడా ఒక కారణమే.పైగా వినాయకుడి ముఖం ఎప్పుడు ఆనందం గానే ఉంటుంది కదా.అందుకే గణపతిని ధ్యానం చేయడం చేత మనకు త్వరగా సిద్ది,బుద్ది కలిగి త్వరగా జ్ఞానవంతులుగా మారుతారు. ఎవరి ముఖాన్ని ధ్యాననించడం చేత మనం ప్రశాంతతను పొందుతామొ వారిది ప్రసన్నమైన ముఖం.శ్రీ కృష్నుడిని వర్ణీస్తూ మధురాష్ట్టకంలొ వదనం మధురం,హృదయం మధురం.........మధురాధిపతే అఖిలం మధురం అని అంటారు.అంటే జగద్గురు అయిన శ్రీ కృష్న పరమాత్మ ముఖమే కాదు ఆయన రూపమే అందంగా ఉంటుంది.పైగా అఖిలం మధురం అని అనడంలొ ఒక అర్ధం ఉంది.ఆయన అంతటా వ్యాపించి ఉన్నడు కనుక అంతా మధురమే అని,ఆయనను మనస్సునందు ధ్యానించినందున మన మనస్సు కూడా మధురముగా అయ్యి,ముఖం ప్రసన్నంగా అవుతుంది.నిజానికి మన ముఖం ప్రసన్నంగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆధ్యాత్మికత అద్దం లాంటిది.మాములు అద్దం మన బాహ్య సౌందర్యాన్ని ఎల చూపిస్తుందొ అలాగే ఆధ్యాత్మికత మన నిజస్వరూపాన్ని మనకు చూపి మనలొ ఉన్న తప్పులను సరి చేసి,మనలొ ఉన్న పరంధాముడి ని మెల్కొలిపి మనల్ని సదా ప్రసన్నంగా ఉంచి చివరకు ఆ పరంధాముడిలొనే ఐక్యం చేస్తుంది.ఒక్కసారి మన అంతరంగాన్ని అర్ధం చేసుకొగలిగామ మన ప్రసన్నత బయటకు ఉట్టిపడుతుంది అని చెప్తూ నీ లొని పరమాతముడిని మెలుకొలపమని నిగుఢార్ధం.
చతుర్భుజం-?2 నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. 'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం. అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం. అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు. భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం. అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం. బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.
చతుర్భుజం-?2 నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. 'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం. అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం. అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు. భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం. అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం. బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.