Wednesday, 27 February 2013

శ్రీ రామసేతువు

జై శ్రీ రామ

700 సంవత్సరాల ఇస్లాం దండయాత్రలు, 300 సంవత్సరాల (బ్రిటిష్)క్రైస్తవ ఆక్రమణ, దాడుల తరువాత కూడా ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది ఒక్క హిందూ ధర్మమే. మన సంస్కృతి ఎవరు వేలెత్తి చూపలేరు. గత 200 సంవత్సరాలలో కొనుగొన్నామని చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన తాళ్ళపత్ర గ్రందాల్లో రాయబడి ఉన్నాయి. మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, స్మృతులు, సంహితలు ఉన్నాయి.  రామాయణ, మహభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే 'ఇలాగే జరిగింది ' అని అర్దం. ఇవి ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాయి.

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, విలువలను నాశనం చేయాలని భావించారు. దానికి ఆద్యుడు మోకాలె. ఈయన భారతదేశం మొత్తం పర్యటించి బ్రిటిష్ పార్లమెంట్లో 2-2-1835 న ఒక ప్రసంగం చేశాడు.

Lord Macaulay’s address to the British Parliament in 2 February, 1835:

"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."


ఈ దేశాన్ని ఆక్రమించాలన్నా, భారతదేశాన్ని ఎప్పటికి బానిస దేశం గా మార్చాలన్నా ముందు ఈ దేశస్థులకు తమ ధర్మం, తమ విద్యావిధానం కంటే, ఇంగ్లీష్ మరియు విదేశీ విద్యావిధానం మంచిది, వారి సంస్కృతే గొప్పదనే భావన రావాలి, అందుకు భారతదేశాంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడమే ఆ ప్రసంగ సారాంశం. దాని అమలు పరిచి Geomentry వంటి 18 సబ్జెక్టులతో ఉన్న హిందూ విద్యావిధానాన్ని సర్వనాశనం చేశారు.

దానికి తోడు వారి బైబిలు ఈ సృష్టి వయసు 5000 సంవత్సరాలని చెప్పింది. దాని వాదనను బలపరచడం కోసం, తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం మన దేశ చరిత్రను తారుమారు చేసి కల్పితమైన చరిత్రను మనకు ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు(ఆధారాలు రాబోయే రోజుల్లో తెలియపరుస్తాం). ఇప్పుడు మనం పాఠశాలలో చదివినది, వారు వ్రాసిన చరిత్రే. దానితో పాటు అనేక చారిత్రిక ఆధారాలను నాశనం చేశారు. అప్పుడే వారు హిందువుల పురాణాలు కల్పితాలు, అవన్ని అబద్దాలంటూ, పుక్కిటి పురాణాలు హిందువులవి అంటూ ప్రచారం చేశారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అంతా మన పురాణాల్లో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. అవి తప్పని ప్రచారం జరిగితే కానీ తమూ వ్రాసిన చరిత్రను భారతీయులు నమ్మరన్నది వారి ఆలోచన.

వారి విద్యావిధానంలో చదువుకున్న మనం కూడా మన పురాణ, ఇతిహాసాలు కల్పితాలంటూ, మన సంస్కృతి వ్యర్ధమంటూ, పదేపదే మనల్ని మన నిందించుకుంటూ మోకాలే వారస పుత్రులం అయ్యాం.

విషయంలోకి వస్తే రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు. ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది ఈ 'శ్రీ రామ సేతువు '. దీని కూల్చడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.      

త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది.

రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు.

వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము".

సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు  Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది.

పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు.

వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి.

పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు.

ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ  దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈ వంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.

సేకరణ-

Ram Setu A Construction Engineering Wonder 

రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం,

రామసేతువు నిర్మాణం ఎలా చేశారు?  

వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71)  

సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51
తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః

నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.

హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58
పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ 
ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59

కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి).

"సూత్రాణ్యయే ప్రగృణంతి హ్యాయతం శతయోజనం" అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల  stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం  మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు.  కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు.  రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా  కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి.

ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది.    

ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది?

నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే.  

సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బంది కలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7 equal intervalsలో  రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి.

సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్.

త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు. తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు  గడిచాయి.  రామసేతువు  నిర్మాణం  త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం.

ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి.  Say it with pride : We are Hindus.

కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన  bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును  పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు.

పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి.

రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం.

భారత్-శ్రీలంకల మధ్య ఒక వంతెన ఉన్నదని నాసా ఫోటోలు విడుదల చేసినప్పటికి, అది సహజంగా ఏర్పడిన వంతెన అనే చాలాకాలం వాదించింది. దాని వయసు సూమారు 17,50,000 ఏళ్ళు అని  చెప్పింది. అక్కడ ఉన్న పగడాలు, యాంటి-బయాటిక్ లక్షణాలు కలిగి అంతరిక్షయానం చేసేవారికి ఉపయోగపడే  algae, ఇవన్ని చూశాక అమెరికా భారత్ మీద అసూయతో అనేకవాదనలు చేసింది. అది 17,50,000 సంవత్సరాల నాటిదని చెప్పడం చేత అది శ్రీ రామసేతువు కాదని హిందువలను నమ్మించవచ్చని భావించింది.

అసలు విషయం వేరే ఉన్నది. అదేంటంటే అమెరికా అన్ని మతాలను సమానంగా చూడదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలవాలంటే ముందు అక్కడున్న క్రైస్తవ మిషనరీల పెద్దల యొక్క అనుమతి ఉండాలి. వారు ఎవరికి మద్దతిస్తే వారే గేలుస్తారు. ఇదంతా చాలా రహస్యంగా జరిగే ప్రక్రియ. వారి మద్దతుతో అధ్యక్షుడయ్యకా ఎవరైనా 'ఆ మతం' యొక్క వ్యాప్తికి కృషి చేస్తారు. అందులో భాగంగానే భారత్ ను మరో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారు చేయాలనుకుంటోంది అమెరికా. ఇక్కడ హిందువులు, భౌద్ధులు, సిక్కులు మీద జరిపే మతమార్పిడులను ఎప్పటికప్పుడు రహస్యంగా నివేదికల ద్వారా తెప్పించికుంటుంది అమెరికా. ఒకవేళ ఎక్కడైనా తమ మతపచారాన్ని అడ్డుకుంటే భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తుంది.( ఇదంతా చాలా రహస్యంగా జరిగే నిరంతర ప్రక్రియ. ఇది ఏ కొద్దిమందికి మాత్రమే తెలుసు.) తమ మతప్రచారాన్ని యధేచ్చగా జరిపించుకుంటుంది. తమ మతప్రచారానికి ఒక చిన్న అడ్డంకి ఏర్పడినా, పెద్ద ఉత్పాతం సంభవించినట్టు తెగ హడావుడి చేస్తుంది. భారతీయ సంస్కృతిని, హిందు, జైన, భౌద్ధ సిక్కు మతాలాను సమూలంగా భారత్ నుంచి తుడుచిపెట్టి ఈ దేశ పరిపాలనను తమ స్వహస్తాల్లోకి తీసుకోవాలన్నది అమెరికా ప్రభుత్వం వెనుక ఉండి ఈ నాటకం నడిపిస్తున్న వారి ఆలోచన. అందులో భాగంగానే హిందువుల రామాయణం నిజమని చెప్పే ఆధారమైన రామసేతువును కూల్చేయాలన్నది వారి ఆలోచన. ఇప్పటికే బ్రిటిషర్లు మహభారత కాలనికి సంబంధించిన ఆధారాలను అనేకం నాశనం చేశారు.  రామాయణం ఎప్పుడో జరింగిందో తెలియక, అదంతా ఒక కధగా, ఒక నమ్మకంగా భావిస్తున్నాం. మనకు నిజాలు తెలిసేలోపు ఆధారాలను మాయం చేయాలన్నది అమెరికా ఆలోచన.

కానీ నిజం నిప్పులాంటిది. సత్యమేవ జయతే, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అని మనకు మన గ్రంధాలు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి. పరమాత్మ సత్యం. సత్యాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరు. ఒక జెర్మన్ బృదం రామసేతువు మీద 'కార్బన్ డేటింగ్' చేసి, దాని వయసు 9,00,000 సంవత్సరాలని తేల్చింది. ఇది మన హిందువులు రామావతారం గురించి చెప్పే సమయంతో సరిపోతోంది.

2004లో భారత్ మీద సూనామీ విరుచుకుపడినప్పుడు, ఆ భయంకర అలలు దక్షిన తమిళనాడు, కేరళ మీద పడకుండా ఆపింది రామసేతువు. రామసేతువే కనుక లేకపోయి ఉంటే కొంకణతీర ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరేది. ఇప్పుడు రామసేతువును కూల్చేసి, సేతు సముద్రం ప్రాజెక్టును చేపడితే, భవిష్యత్తులో మరొక సూనామీ వస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి.

రామసేతువు వలన, దాని దగ్గరి ప్రాంతంలో ఒక different వాతవరణం నెలకొని ఉంది. అక్కడున్నAlgae కు ఔషధ గుణాలున్నాయని 2012 జూలై ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించారు. అక్కడున్న Algea  మీద మరిన్ని పరిశోధనలు చేసి, ప్రజల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఒక మందును తయారు చేయవచ్చని వెల్లడించారు.

రామసేతువు వద్ద చాలా అరుదైన marine atmosphere కనిపిస్తుంది. అంతరించబోయే జాబితలో చేర్చబడిన 5 జాతులకు సంబంధించిన జీవరాశికి ఈ రామసేతువే ఆధారం. దీన్ని కూల్చేస్తే అక్కడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోతుంది . సేతు సందురం ప్రాజెక్టు వలన లక్షలమంది జాలర్లు జీవనం కోల్పోతారు.

ఈ రోజు ప్రపంచంలో అణువిద్యుత్ ప్లాంట్ల(nulcear plants)కు థోరియం(Thorium) ప్రత్యామ్నాయ ఇధనం(alternative fuel). భారత్ ప్రపంచంలో 25% థోరియం నిలువలు కలిగివుంది. అందులోనూ సగానికి పైగా  థోరియం నిలువలు తమిళనాడు సముద్ర తీరంలో రామసేతువు దగ్గరగా ఉన్నాయి. మన దగ్గరున్న థోరియం నిలువలతో భారత్, మరే ఇతర దేశం మీద ఆధారపడే పరిస్థితి లేదు . రామసేతువు, సముద్రపు కెరటాలను అదుపు చేయడంతో పాటు, వాటిని క్రమబద్దీకరించడం వలన అక్కడ Thorium, Titanium అధికంగా ఇసుకలో  ఉన్నాయి. సేతు సముద్రం ప్రాజెక్టు పేరుతో రామసేతువును కూల్చేయడం వలన అక్కడ ఉన్న mineral deposits కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. థోరియం ను అక్రమరవాణా చేయడం సులభవుతుంది. అంతేకాదూ, రామసేతువు కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కూడా ఇందుకే. గుట్టు చప్పుడు కాకుండా అక్కడున్న మన జాతి సంపదైన  Thoriumను విదేశాలకు తరలించి, అక్రమంగా డబ్బు సంపాదించాలన్నది వారి ఆలోచన. అందుకే ఎంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా, వారు రామసేతువును నాశనం చేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.        

 రామసేతువును కూల్చి నౌకలు వెళ్ళెందుకు వీలుగా ఒక మార్గం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే చాలసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఎద్దురుదెబ్బలే తగిలాయి.

 జనతా పార్టీ అధ్యక్షుడు, సుబ్రమణ్యస్వామి రాసిన ఒక రెపోర్టును Asian Age ప్రచురించింది. 23-1-2007 న Asian Age లో ప్రచురింపబడిన దాని ప్రకారం  Dredging Corporation of India(DCI) హోలాండ్ నుండి ఒక dredger ను import చేసుకుంది. అది రామసేతువు దగ్గర పని ప్రారంభించడానికి వెళ్ళి, సేతువుకు తగలగానే రెండు ముక్కలై, సముద్రంలో మునిగిపోయింది. Dredger ను సాగరగర్భం నుండి బయటకు తీయడానికి వెళ్ళిన DCI crane కూడా విరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనను గురించి ఆరా తీయడానికి వచ్చి, ఆ ప్రదేశానికి వెళ్ళిన రష్యన్ ఇంజనీరుకు ఒక కాలు విరిగింది. గుట్టు చప్పుడు కాకుండా పని కానిద్దాం అనుకున్నారు. ప్రజలను మోసం చేయచ్చు, కాని పరమాత్ముడుని మోసం చేయగలరా? హిమాలయ పర్వతాల్లో, కైలాస మానససరోవరం చుట్టుప్రక్కల ఈ రోజుకి శ్రీ ఆంజనేయ స్వామి వారు తపస్సు చేస్తున్నారు. తన రాముడి సేతువు వద్దక వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా?

 జై హనుమాన్

రామసేతువు 1480 వరకు వాడుకలో ఉండేది. దాని మీది నుండి ప్రజలు ఇరుదేశాల మధ్య వ్యాపారం కొనసాగించారు. కాని ఆ తరువాతి కాలంలో వచ్చిన ఒక భారీ తుఫాను వలన రామసేతువు 3 నుండి 7 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయింది.

రాముడిని పూజించే హిందువులున్న పవిత్ర భారతదేశ ప్రభుత్వం రామసేతువును పగులగొట్టాలని ప్రయత్నిస్తుంటే, రావణాసురుడిని ఆరాధించే శ్రీ లంక, అక్కడి ప్రభుత్వం మాత్రం సముద్రం కలిసిన సేతువు మీద ఒక మార్గం నిర్మించి, రామాయణ కాలం నాటి ఆనవాళ్ళను ప్రపంచానికి ప్రదర్శిస్తూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

Tuesday, 26 February 2013

అడ్డంకులైనా ఎదురుకుని లక్ష్యాన్ని చేధించండి

ఆరంభశూరత్వానికీ, సంకల్పాన్ని సడలించుకోవటానికీ సంబంధించిన నీతికధల్లోని చక్కని ఉదాహరణను స్వామి వివేకానంద ఈ విధంగా గుర్తుచేస్తారు.

" అడవిలో ఉండే ఒక దుప్పి, తన పిల్లదుప్పిని తీసుకుని ఓ చెరువు వద్దకు వెళుతుంది. అందులో తన ప్రతిబింబాన్ని బిడ్డకు చూపిస్తూ, 'చూశావా! నా శరీరం ఎంత బలిష్ఠంగా ఉందో, నా తల బలంగా, కాళ్ళూ ఎంత దృఢంగా ఉన్నాయో గమనిస్తున్నావా? నేనెంత దైర్యవంతురాలనో తెలుసా!' అంటూ ప్రగల్భాలు పలకసాగింది. ఇంతలో దూరాన ఒక కుక్క అరుపు వినిపించింది. అప్పటివరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న దుప్పి, ఒక్కసారిగా కాళ్ళకు పనిచెప్పింది; పరుగు లంఘించుకుంది. చాలా సేపటికి రొప్పుతూ తిరిగి యధాస్థానానికి వచ్చింది. పిల్లదుప్పి అంతా ఆశ్చర్యంగా ఉంది; వెంటనే 'ఎంతో శక్తి ఉందన్నావు! మరి కుక్క అరుపు వినగానే ఎందుకలా పరిగెత్తావు?' అంది. అప్పుడు ఆ పెద్దదుప్పి 'నిజమే! నాకు చాలా శక్తి ఉంది. కానీ ఆ శునకం అరుపు వినపడటంతోనే నా దైర్యం సడలిపోతుందీ అని అసలు విషయం బయటపెట్టింది.

ఈ ఉదాహరణ చెబుతూ స్వామి వివేకానంద 'మనమూ అంతే! లక్ష్యాలను సాధించాలని తీర్మానాలు చేసుకుంటాము. కానీ చిన్న ప్రతికూలతలనే కుక్క అరుపులు వినగానే, దుప్పిలాగ భయపడి లక్ష్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు ఎన్ని సంకల్పాలు పెట్టుకుని, ఎన్ని తీర్మానాలు చేసుకుని ఏ లాభం' అని ప్రశ్నిస్తారు.

లక్ష్యం చేరవరకు నిద్రించకండి. ఎన్ని అడ్డంకులైనా ఎదురుకుని లక్ష్యాన్ని చేధించండి.

సేకరణ - శ్రీ రామకృష్ణ ప్రభ 

Monday, 25 February 2013

సంకల్పం చేసుకోండి

|| ॐ || సంకల్పం చేసుకోండి || ॐ ||

ॐ సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. 

ॐ ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది.
అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు.
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!

ॐ ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడా తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.


ॐ "ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.

ॐ దీని సారాంశం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే - భగవంతుడంటాడు -
"ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

Sunday, 24 February 2013

బాంబు దాడి

హైద్రాబదులో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి దిల్ సుఖ్ నగర్. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసేవాళ్ళూ, పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళు, చిన్నా చితక వ్యాపారాలు,  అక్కడే ఒక బస్ స్టాండు, కోచింగ్ సెంటర్లు, తిఫిన్ సెంటర్లు, కాలేజిలతో నిత్యం కళకళాడుతూ ఉండే ప్రాంతం అది. సాయంత్రం అయితే ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఇళ్ళకు చేరే సమయం కూడా అది. 21-2-2013 సాయంత్రం ఎప్పటిలాగే ప్రాశంతంగా అందరూ ఇళ్ళకు చేరుకుటున్న సమయంలో జరిగిన బాంబు దాడి ఎంతో మందికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

బాంబు పేలగానే అందరు షాక్ కు గురయ్యారు. చాలామంది భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇంకా ఎవైనా బాంబులు పేలుతాయేమొ తెలియని పరిస్థితి. కానీ అక్కడున్న యువతరం బెదరలేదు. బాంబు పేలిన దాదాపు 20 నిమిషాలవరకు అక్కడకు పోలిసులు కానీ, అంబులెన్సులు కాని చేరుకోలేదు. యువత అక్కడినుండి పారిపోలేదు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, దైర్యంగా అక్కడ బస్సులలో ఉన్న ప్రయాణీకులను దింపేసి, గాయపడినవారిని త్వరత్వరగా బస్సులలోకి ఎక్కించి ఆసుపత్రులకు పంపించారు. మీడియా వాహానాలు, అంబులెన్సులు అక్కడికి చేరెసరికి అక్కడ దాదాపుగా ఖాళీ చేశారు. అక్కడితో ఆగలేదు, ఫేసుబుక్కు, ట్విట్టరు లో మెసేజిలు పెట్టి రక్తదానానికి క్యూలు కట్టారు యువతరం. ఇది చాలామంచి పరిణామం. ఇది మన యువతరం యొక్క శక్తిని, దైర్యాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.

కానీ ఈ బాంబు దాడి పాపం ఎవరిది? మాటిమాటికి మన దేశం మీద ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే మన రాజకీయవ్యవస్థ ఏం చేస్తోంది? ఇది జరుగుతుందని తెలిసినా, ఇంటలిజెన్సు, పోలిస్ విభాగాలు సమర్ధవంతంగా ఎందుకు ఎదురుకోలేదు? వీటికి కారణం 'ఓటు బ్యాంకు రాజకీయాలు ', అవినీతి, ప్రజలు. ఈరోజు ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు, ఇతర రాజకీయనాయాకులంతా ఆ ప్రాంతాన్ని, ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరమార్శించడానికి క్యూలు కట్టారు. దీనికి ఒక ప్రధాన కారణం 2014 ఎన్నికలు. వీళ్ళకు ప్రజలమీద ప్రేమ లేదు, దేశభక్తి అంతకన్నా లేదు. వీళ్ళకు కావలసినవి ఓట్లు మాత్రమే. వీళ్ళకు జనం ఏమైనా, ఎలా చచ్చినా, ఏ దేశం మీద దాడి జరిగినా పట్టదు. తాము వెళ్ళి పరామర్శిస్తే సానుభూతితో నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయాన్న తాపత్రయం అది. కావలంటే ఈ బాంబు దాడి తరువత మన నేతల మాటలను

ఇక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలి. పోలిస్ అవ్వడానికి అన్ని అర్హతలున్నా లక్షల్లో లంచం ఇవ్వాలి. లక్షలు పోసి ఉద్యోగం కొనుక్కునవాడు, మరిన్ని లక్షలు సంపాదించాలని చూస్తాడే కాని ప్రజల గురించి పట్టించుకోడు. దానికితోడు మన దేశంలో ఎప్పుడైన పోలిస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసిందా? అసలు అప్పుడు అలా జరగనే లేదు. ఇంటలిజెన్స్ వాళ్ళను ప్రభుతవం తమకు ఎన్నొ సీట్లు వస్తాయో తెలుసుకొవడానికి వాడుకుంటుందే కానీ ఈ దేశభధ్రత కోసం ఉపయోగించడం చాలా తక్కువే అని చెప్పాలి.

మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో,ఉగ్రవాదులకు పాఠాలు చెప్తున్నారో రాజకీయనాయకులకు, పోలిసులకు, మీడియాకు, ఇంటలిజెన్స్ విభాగాలకు తెలుసు. తెలవడం ఏముంది? అది బహిరంగ రహస్యమే. ఈ విషయం ప్రజలకూ తెలుసు, కానీ ప్రశ్నించరు. వారి మీద చర్యలు తీసుకోకపోయినా సిగ్గులేకుండా మళ్ళీమళ్ళీ ఈ దిక్కుమాలిన నేతలనే గెలిపిస్తారు.                  

దేశం కోసం పని చేయనివారిని, దేశభక్తి లేనివారిని, ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వారిని, అవినీతిపరులను, అధికారదాహం ఉన్నవారిని పదేపదే గెలిపించి చట్టసభలకు పంపుతుంటే, వారు తమ స్వార్ధం కోసం తపిస్తుంటే ఈ దేశం మీద ముష్కరులు దాడులకు దిగకుండా ఎందుకుంటారు?

ఓటుబ్యాంకు రాజకీయాలను కూల్చేయండి. దేశభక్తి కలిగినవారికి, నిజాయతీపరులకు, ఈ దేశం గురించి ఆలోచించేవారికి మాత్రమే మీ ఓటు వేయండి. అప్పుడే దేశం భద్రంగా ఉంటుంది.

జై హింద్                        

Saturday, 23 February 2013

శ్రీ నిత్యానంద ప్రభు జయంతి


|| ॐ || హరే రామ హరే రామ, రామ రామ హరే హరే || ॐ ||
|| ॐ || హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే || ॐ ||

ॐ మాఘశుద్ధ త్రయోదశి, శ్రీ నిత్యానంద ప్రభు జయంతి. బెంగాల్ ప్రాంతంలోని ఏకచక్ర అనే చిన్న గ్రామంలో జన్మించారు. 1474 సమయంలో, మాఘశుద్ధ త్రయోదశి రోజున జన్మించిన చైతన్య ప్రభుతో కలిసి కృష్ణభక్తిని ప్రజల్లో పెంపొందించారు. శ్రీ రాముడికి లక్షమణుడి వలె, శ్రీ కృష్ణపరమాత్మకు బలరాముని వలె, శ్రీ చైతన్య ప్రభువులకు తోడుగా ఈయన అవతరించారు.

ॐ శ్రీ కృష్ణపరమాత్మ అవతార పరిసమాప్తి జరిగినా, కలియుగంలో జనులను ఉద్దరించడానికి ప్రతి శతాబ్దంలోనూ అనేకమందిని పంపి స్వామి తన భారతదేశాన్ని, తన ధర్మాన్ని నిరంతరం రక్షిస్తూనే ఉన్నారు. శ్రీ మధ్భాగవతం అంటుంది 'కలౌ నామ సంకీర్తనం'- కలియుగంలో కేవలం భగవంతుని నామాలను జపించడం వల్లనే ముక్తి లభిస్తుంది. ప్రజల్లో ఎప్పుడు భక్తిభావన తగ్గిపోతుందో అప్పుడు మహాపురుషులు ఉద్భవించి జనాన్ని భక్తిమార్గంలో నడిపిస్తారు. అలాంటి అవతారపురుషులలో ఒకరే శ్రీ నిత్యానంద ప్రభు స్వామి వారు.

|| ॐ || హరే రామ హరే రామ, రామ రామ హరే హరే || ॐ ||
|| ॐ || హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే || ॐ ||

Friday, 22 February 2013

వరాహ జయంతి


|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||

ॐ 22-2-2013, శుక్రవారం, మాఘ శుద్ధ ద్వాదశి, వరాహ జయంతి

ॐ నవగ్రహాలను, భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, ప్రకృతిలోనూ, ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. ఒకానొక సమయంలో కొంతమంది రాక్షస స్వభావం కలవారు భూభాగం క్రింద ఉన్న సహజవనైన చమురును అధికంగా బయటకు తీయడం వలన భూగోళం తనపట్టు తప్పింది. భూభాగం క్రుంగిపోయింది. దానికితోడు అంతరిక్షంలో తన కక్ష్య నుండి ప్రక్కకు జరిగింది. దీనితో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలందరూ భయబ్రాంతులకు గురై, శ్రీ మహావిష్ణు వద్దకు పరుగు పరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు.  

ॐ వారి ప్రార్ధనలు మన్నించి శ్రీ మహావిష్ణువు, తన భార్యైన భూదేవిని రక్షించడానికి వరహ ఆవతారం స్వీకరించారు. తన కోరల మీద భూమిని నిలిపి, అంతరిక్షంలో తన కక్ష్యలో తిరిగి నిలిపారు. అలాగే క్రుంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చారు. ఈ విధంగా చేయడం వలన స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురించాడు. వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యారు. అది మాఘ శుద్ధ ద్వాదశి నాడు జరిగిందని శ్రీ మద్భాగవతంలో ఉంది. అందుకే ఈ రోజు ఆదివరహా మూర్తిని అర్చించాలి, ఆయనకు కనీసం నమస్కరించాలి.

ॐ భూమి మీద సహజవనరులు ఉన్నాయి. అనేక నిధినిక్షేపాలు, లోహాలు భూమిలో ఉన్నాయి. వాటిని విపరీతంగా, సంపూర్తిగా వాడకోవడం వలన జరిగేది వినాశనమే. అదే చేశారు ఆ రాక్షసులు. అందుకే భూమాత తన పట్టు తప్పి, ప్రక్కకు జరిగింది. తన భూమిని కాపాడుకోవడానికి శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఎత్తి, వారిని చంపవలసి వచ్చింది. ఇప్పుదు కూడా ప్రపంచంలో అదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రగర్భంలో ఉన్న సహజవాయువును, చమురును అతిదారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు. రాబోయే 10-20 సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలితుందని నివేదికలే మొత్తుకుంటున్నాయి. ఇటువంటి సమయమలో ఈ వరహ మూర్తి కధను మనం గుర్తుపెట్టుకుని మన భూమిని, సహజవనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. లేకుంటే శ్రీ మహావిష్ణు ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది.

|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||    

courtesy : http://www.krishna.com/lord-varaha-krishna-boar-incarnation 

|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||    

Thursday, 21 February 2013

విశ్వకర్మ జయంతి


|| ॐ || జై విశ్వకర్మ || ॐ ||

ॐ 23-2-2013, శనివార,మాఘ శుద్ధ త్రయోదశి.

ॐ మాఘశుద్ధ త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా జరుపుతారు. విశ్వకర్మ వృత్తివిద్యలు, నిర్మాణ, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన విద్యలకు అధిపతి. ఈయన దేవశిల్పి.

ॐ పరమశివుడి ఆజ్ఞ మేరకు బంగారుమయమైన లంకా నగరాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణపరమాత్మకు ద్వారకనగరాన్ని నిర్మించినది కూడా విశ్వకర్మే.

ॐ శ్రీ రామావాతరంలో శ్రీ రాముడు లంక చేరడం కోసం రామసేతును నిర్మించిన నలుడు, నీలుడు విశ్వకర్మ పుత్రులు. వాళ్ళు ఆనాడు కట్టిన రామసేతు లక్షల ఏళ్ళు గడిచిన ఈరోజుకి ఇంకా పదిలంగానే నిలిచి ఉంది.    

ॐ విశ్వకర్మ జయంతి రోజున అందరూ తమ వృత్తిపనుల్లో ఉపయోగపడే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు పెట్టి పూజించాలి.ఈ రోజున పనిముట్లను పూజిస్తాం కనుక వాటిని వాడకూడదు. వృత్తిపనులను చేయకూడదు. బెంగాల్ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చాలా వైభవంగా భజనలతో, నాట్యాలతో నిర్వహిస్తారు.

|| ॐ || జై విశ్వకర్మ || ॐ ||      

Wednesday, 20 February 2013

భీష్మ ఏకాదశి

|| ॐ || ఓం నమో నారాయణాయ  || ॐ ||

ॐ అంపశయ్య శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనము తెలియపరచాలని , అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికి తెలియపరచాలని భావించాడు.

ॐ భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో... వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో

ॐ "కిమేకిం దైవతం లోకే" అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?

ॐ "కింవా ప్యేకం పరాయణం"- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?

 స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన

ॐ కం అర్చయంతః - ఎవరిని అర్చించడం/ పూజించడం వలన

ॐ ప్రాప్యుః మానవః  శుభం -  మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.

ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః - అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?

ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?

అని అడుగుతాడు.


ॐ జగత్ ప్రభుం - ఈ జగత్తుకు ప్రభువైన వాడు

ॐ దేవదేవం - దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు

ॐ అనంతం - అంతం అంటూ లేని వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు

ॐ పురుషోత్తమం - అందరిలోకెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు

 స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః - ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో .............

అంటూ మొదలుపెట్టి "విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః......" అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను(1000 నామాలను)ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.

ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.

ॐ 21-2-2013, గురువారం భీష్మ ఏకాదశి, ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అది నేర్చుకోని వారు " శ్రీ రామ రామ రామ" అని వీలైనన్ని సార్లు జపించండి.

|| ॐ || ఓం నమో నారాయణాయ || ॐ ||   

Tuesday, 19 February 2013

జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?

|| ॐ || ఓం నమో నారాయణాయ || ॐ ||

ॐ My Dear youth, You 'must' read this post.
ॐ జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?

ॐ మనకు తెలుసు చంద్రుడు భూమి చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతాడు. మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే చంద్రుడి యొక్క ప్రతి 12 డిగ్రీలకు గమనాన్ని ఒక తిధిగా లెక్కించాలి. ఇలా 360 డిగ్రీల గమనానికి మొత్తం 30 తిధులు వస్తాయి.

ॐ అమావస్య తరువాత వచ్చే పాడ్యమితో మన హిందువులకు నెల(మాసం)మొదలువుతుంది.అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మొత్తం 15 రోజులు. 15 రోజులను ఒక పక్షం అంటారు. అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి తో ముగిసే మొదటి పక్షాన్ని శుద్ధ పక్షం/శుక్ల పక్షం అంటారు. పౌర్ణమి తరువత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలమైన రెండవ పక్షాన్ని బహుళ పక్షం/కృష్ణ పక్షం. 

ॐ శుద్ధ ఏకాదశి అంటే 120 నుంచి 132 డిగ్రీల మధ్య ఉన్న చంద్రగమనం.  300 నుంచి 312 డిగ్రీల చంద్రగమనం బహుళ ఏకాదశి.

ॐ జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని నిర్ణయించబడవే తిధులు. ఇదంతా సైన్సు. అందుకే మన సుప్రీం కోర్టు కూడా జ్యోతిష్యం సైన్సు అని తీర్పునిచ్చింది.

ॐ మన హిందువుల గొప్పతనం ఏమిటంటే ఏ టెలిస్కోపు వాడకుండా, తమ మేధస్సుతోనే ఇదంతా లెక్కగట్టి చెప్తారు.

ॐ హిందువని గర్వించండి. హిందువుగా జీవించండి.          

ॐ 21-2-2013, గురువారం మాఘశుద్ధ ఏకాదశి, దీనికి భీష్మ ఏకాదశి అని పేరు. ఈ రోజున తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి.విష్ణు నామాలను జపించండి.  

Monday, 18 February 2013

భీష్మాచార్యులవారి సనాతన ధర్మ నిబద్ధత

ఈ రోజు భీష్మాష్టమి.
భీష్మాచార్యులవారి సనాతన ధర్మ నిబద్ధత.

శ్రీ భీష్మపితామహుని వేద పరిజ్ఞానము, ఆ సనాతన ధర్మము పట్ల వారి నిబద్ధత తెలుపు ఒక కధ చెప్పుకుందాము. 

తన తండ్రి శంతనుడు పరమపదించిన పిదప భీష్మాచార్యులవారు తండ్రికి శ్రాద్ధ కర్మ నిర్వహిస్తున్నాడు. పిండప్రదానము చేయునపుడు ఆకాశమునుండి శంతనుడు పిండములు స్వీకరణార్ధము చేతులు మాత్రం చాచాడు. భీష్ముడు ఈ విషయము చూచి ఆ చేతులను త్రొసివేసి దర్భలమీదే పిండములను ఉంచుతాడు. అప్పుడు శంతనుని కంఠం "నేనే స్వయముగా వచ్చానుకదా! నా చేతికే ఇవ్వవచ్చును కదా!" అని పలుకుతుంది. అందుకు భీష్ముడు "తండ్రీ! పితృదేవతలకు పిండప్రదానము దర్భలమీదే చెయ్యమని వేదనిర్ణయము. కాబట్టి నా తండ్రి స్వయముగా పితృలోకములో నుండి వచ్చినా నేను వేదనిర్ణయమును తప్పలేను. ఇది ధర్మము." అని పలుకుతాడు. ఆయనకు వేదము పట్ల ఉన్న విశ్వాసమునకు, ధర్మనిబద్ధతకు దేవతలు మరోసారి ఆయనమీద పుష్పములు కురిపించి తమ ఆనందము, ఆమోదము తెలిపారు. (భీష్మప్రతిజ్ఞ చేసినపుడు ఒకసారి ఇలాగే దేవతలు ఆయనమీద పుష్పములు కురిపించారు.)

మనకు ఆదర్శం మన భీష్ముడు

ॐ ఈ రోజు మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి - భీష్మ పితామహుడు పరమపదించిన రోజు.

ॐ మనకు ఆదర్శం మన భీష్ముడు.

ॐ భీష్ముడు మహాభారతంలో కనిపిస్తాడు. ఈయన శంతన మహారాజు, గంగాదేవికి కలిగిన 8 వ సంతానం. ఈయన అసలు పేరు దేవవ్రతుడు. ఈయన తండ్రి శంతన మహరాజు సత్యవతిని ప్రేమిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా, దేవవ్రతుడు ఉన్నాడు కనుక సత్యవతికి కలిగిన సంతానానికి ఎన్నటికి రాజ్యపాలన చేసే అవకాశం రాదని, అందువల్ల దేవవ్రతుడికి కాకుండా, సత్యవతి సంతానానికే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగించాడానికి ఒప్పుకుంటేనే వివాహానికి అంగీకరిస్తానని సత్యవతి తండ్రి దాశరాజు తెగేసి చెప్తాడు. ఇది విన్న శంతన మహారాజు భాధపడతాడు.

ॐ తండ్రి ఆవేదనను అర్ధం చేసుకున్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తాను పట్టిభిషేకాన్ని చేయించుకోనని, శంతన మహారాజు తరువాత సత్యవతికి కలిగిన సంతానం రాజ్యపాలన చేయడానికి అంగీకరిస్తున్నాని ప్రతిజ్ఞ చేస్తాడు.


ॐ దాశరాజు "నువ్వు అడగకపోవచ్చు కాని నీ సంతానం సత్యవతి సంతానంతో సింహాసనం కోసం పోరాటం చెయ్యచ్చు కదా" అంటాడు. అప్పుడు దేవవ్రతుడు తాను జీవితాంతం బ్రహ్మచారిగానే జీవిస్తానని, అత్యంత కఠోరమైన బ్రహ్మచర్యాన్ని మరణించే వరకు విడువనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ విధంగా దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా పేరు పొందాడు.

ఈ విధంగా దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేయగానే, ఆయన తండ్రి శంతన మహారాజు దేవవ్రతుడికి స్వచ్చందమరణం(కోరుకుంటేనే మరణం సంభవిస్తుంది)పొందే వరాన్ని ఇస్తాడు.

ॐ సత్యవతీ శమంతునులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. శంతనుని మరణం తరువాత చిత్రాంగదుడు రాజయ్యాడు కాని,ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడే విచిత్రవీర్యుడిని రాజు చేశాడు. విచిత్ర వీర్యుడికి కాశీ రాజు కూమార్తెలైన అంబిక, అంబాలికలను వివాహం చేశారు. కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొంతకాలానికే ఆనారోగ్యంతో సంతానం కలుగకుండానే మరణించాడు.

ॐ వంశరక్షణకు వేరే మార్గం లేదు కనుక భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరగా తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సింహాసనాన్ని నిరాకరించాడు.

ॐ రోజుకు ఒకమాట మాట్లాడే ఈ రోజుల్లో తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం అందివచ్చిన హస్తినాపురం( నేటి డిల్లీ)సింహాసనాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టిన భీష్మ పితామహుడిని మనమూ, మన రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.

Saturday, 16 February 2013

హిందువులు-సైన్సు


ॐ రధాన్ని గుర్రాలు ముందుకు తీసుకువెళ్ళిన విధంగా సూర్యుని సప్తవర్ణ కిరణాలు ఈ సమస్త ప్రపంచానికి వెలుగునిస్తాయి - ఋగ్ వేదం 1/150/8

ॐ సప్తాశ్వ రధమారూఢం......అంటూ సూర్యాష్టకం లో వస్తుంది. అంటే సూర్యుడు 7 గుర్రాలున్న రధం మీద వస్తాడని కాదు. సూర్య కాంతిలో 7 రంగులు ఉంటాయని అర్దం.

ॐ సూర్యుడు తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడు. భూమి, ఇతర గ్రహాలను సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తికి లోనై సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి - ఋగ్ వేదం 1.164.13 

ॐ ఏ విధంగానైతే ఒక ట్రైనెర్ కొత్తగా సిక్షణ ఇవ్వబడె గుర్రాలను తన చుట్టు తిప్పుకున్నాట్టు, సూర్యుడు భూమి మొదలైన గ్రహాలను తన ఆకర్షణ శక్తి ద్వారా కట్టిఉంచి, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - ఋగ్ వేదం 10.149.1

ఈనాటి సైన్సు ప్రతిపాదించకముందే మన హిందువులు ఇలాంటి అనేక శాస్త్రీయ విషయాలను ప్రపంచానికి అందించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఈ రోజు టి.వి. పెడితే కొన్ని చానెల్స్, కొన్ని సంస్థలు మీ హిందువులవన్ని మూఢనమ్మకాలు. సూర్యుడు భూమి చుట్టు తిరుగుతున్నాడని మీ గ్రంధాలు చెప్తున్నాయంటూ మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. మన గ్రంధాలు సూర్యుడి చుట్టూనే భూమి తిరుగుతోందని చెప్తున్న వాళ్ళ కళ్ళకు ఇవేమి కనిపించవు. పనిపాట లేక, కాలం గడువక, కేవలం అస్తిత్వం కోసం చేసే అటువంటి అటువంటి విషప్రచారాలను నమ్మకండి.

పరమాన్నం

|| ॐ || ఓం సూర్యాయ నమః || ॐ ||
ఫిబ్రవరి 17 ఆదివారం రధసప్తమి

ॐ రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటి మిందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

ॐ రేపే కాదు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరంగా "దేశవాళీ ఆవుపాలతో" చేసిన పరమాన్నం నివేదన చేయడం మంచిది.

|| ॐ || ఓం సూర్యాయ నమః || ॐ ||

Thursday, 14 February 2013

సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.


|| || ఓం సరస్వత్యై నమః || ||

 సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.

 వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. రోజు ఆధునిక సైన్సు కనిపెట్టిందని చెప్తున్నా రెడియోలు, టి.వి.లు, కంప్యూటర్లు, శాటిలైట్లు, విద్యుత్తు ఇవ్వన్ని ఎప్పుడొ చెప్పబడ్డాయి వేదంలో. నిజం చెప్పాలంటే అందరూ తెలుసుకోవలసినది వేదమే.  

 జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది.దాని అర్దం మనకు చదువు రావాలి,జ్ఞానాన్ని పొందాలి అంటే, వచ్చిన దాన్ని అనేక మార్లు రీపెట్ చేయాలి.  అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది.

 “తపస్స్వాధ్యాయ నిరతం" అంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన(ఇంట్రస్ట్)ఎంత అవసరమో,తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది మన ధర్మ శాస్త్రం. అందుకే సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.

ఫిబ్రవరి 15, వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి. రోజు తప్పకుండా అందరూ తల్లిని ఆరాధించండి.

|| || ఓం సరస్వత్యై నమః || ||