Sunday, 30 July 2017

తులసీ దాస్ సూక్తిThere is no difference between knowledge and devotion, Both of them save the soul from the miseries of worldly life.

- Tulasi Das

తులసీ దాస్ జయంతిశ్రావణమాసం శుక్లపక్ష సప్తమి నాడు తులసీ దాస్ జయంతి జరుపుతారు. రామభక్తుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు శ్రీ తులసీ దాస్ గారు. శ్రీ రామాయాణ కావ్యాన్ని తనదైన శైలిలో శ్రీ రామచరిత మానస్ గా రచించారు తులసీ దాస్ గారు. మనమంతా చదివే హనుమాన్ చాలీసాను రచించింది కూడా వీరే. వీరు కలియుగవాల్మీకి అని భవిష్యోత్తరపురాణం చెబుతోంది. వారి జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

వీరికి చిన్న వయసులోనే వివాహం జరిగింది. వివాహానంతరం 15 ఏళ్ళకు రత్నావళి బదరిలోని తన సోదరుల ఇంటికి రక్షాబంధనం కోసం వెళ్ళవలసి వచ్చింది. తులసీదాసు కూడా తొమ్మిది రోజుల పాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, తన భార్య కనిపించక తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యారు. వరదల్లో ఉన్న గంగానదిని ఈది అతికష్టం మీద అతడు అర్ధరాత్రికి తన మామగారి ఇల్లు చేరుకున్నాడు. అటువంటి అసాధారణ సమయంలో భర్తను కలుసుకున్నందుకు దిగ్భ్రాంతి చెందిన రత్నావళి తన భర్తను వరద నీటిని ఏ విధంగా దాటగలిగారని అడిగింది. తనపై అతనికి గల తీవ్ర ప్రేమ గురించి తెలుసుకున్న రత్నావళీ ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. ఆలాగే కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఉంటే, ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు అది సహాయ పడుతుంది." అంది. ఈ మాటలు విన్న తులసీదాసు మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్యప్రేమగా రూపాంతరం చెందింది. అతడు తక్షణమే బదరీనీ, సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు. తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాతా చాలాప్రాంతాలు తిరిగి చివరకు కాశీ చేరుకున్నారు.

కాశీలో వారు నిత్యం రామకథ చెప్పేవారు. ఆ రామకథను వినడానికి హనుమ్నతులవారు వచ్చేవారు. ఆ విషయాన్ని అక్కడికి దగ్గర్లోనే ఉన్న పెద్ద చెట్టుపై నివసించే ఒక బ్రహ్మరాక్షసుడి ద్వారా తెలుసుకున్నారు. నిజానికి తను అనుష్ఠానం చేసుకున్న తర్వాత నీటిని ఆ చెట్టులో పోయడం వలన బ్రహ్మరాక్షసునికి  శాపవిమోచనం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఆయన హనుమంతులవారి గురించి చెప్పి, ఆయన పాదాలను పట్టుకోమని చెప్తాడు..... చివరకు ఎంతో శ్రమతో హనుమంతులవారిని ప్రసన్నం చేసుకుని, సాక్షాత్తు వారి నుంచే శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశం పొంది చిత్రకూటంలో సాధన చేస్తారు. ఒకానొక రోజు రామలక్ష్మణులు తనకు దర్శనమివ్వడానికి వస్తున్నారని హనుమంతుడి ద్వారా తెలుసుకున్న తులసీదాసు దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. అయితే రామలక్ష్మణులు వారి రూపాల్లో కాక, ఒకసారి ఆకలితో ఉన్న కుక్కలుగా, ఒకసారి పిల్లలుగా, ఇలా మొత్తం 3 వేర్వేరు రూపాల్లో వస్తారు. అయితే తులసీదాసు వారిని గుర్తించరు. ఆ తర్వాత హనుమంతులవారి సహాయంతో ఈ విషయం తెలుసుకుంటారు. అంటే ఎంత భక్తుడైనా, భగవనతుని అన్ని రూపాల్లో చూడటం అలవర్చుకోవాలి. కేఅవలం ఒక రూపమే ఆయనదని నిర్ధారించకూడదు. నిత్యం మనవద్దకు దైవం ఎన్నో రూపాల్లో వస్తుంది, సహాయం చేతుంది, కొన్నిసార్లు అర్ధిస్తుంది, సర్వజీవుల్లోను, ప్రకృతిలోను ఆయన్ను దర్శించడం నేర్చుకోవాలి. అదే మనకు ఇక్కడ కనిపిస్తుంది..... చివరకు వారికి రామచంద్రులవారి దర్శనం కలుగుతుంది. తులసీదాసు గారు తమ జీవితంలో భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి దర్శనం కూడా పొందారు.

తులసీదాసు గారు కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాలేదు. వారు దేశభక్తుడైన మహారాణా ప్రతాప్ గారికి గురువు. మహారాణా ప్రతాప్ కు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే, దేశరక్షణ, ధర్మరక్షణ దిశగా వారిని ప్రేరేపించి, లోకానికి గొప్ప వీరుడిని అందించారు. దేశంలో రామరాజ్యం ఏర్పడాలని తహతహలాడారు.

అలంటి మహాత్ముడిని మనం నిత్యం స్మరించాలి. వారి జీవితం నుంచి ప్రేరణ పొందాలి. 

హిందూ ధర్మం - 247 (అమెరికా = పాతాళ లోకం ??)

అయితే మహాభారతంలోని కొన్ని విషయాలను అనుసరించి కూడా అమెరికానే కొన్ని ఇతిహాసాల్లో పాతాళలోకంగా చెప్పారని మనం భావన చేయవచ్చు.

మయసభ నిర్మాణం గురించి మనకు తెలిసిందే. దాన్ని నిర్మించినవాడు మయాసురుడు. అతనే మయా/ మయాన్ నాగరికతకు ఆద్యుడని చెబుతారు. (ఆ వివరాలను మానం చాలా కాలం క్రితం వివరించుకున్నాము కూడా). ఈ మయా నాగరికత మధ్య అమెరికాలో వర్ధిల్లింది. వారికి మనకు లాగే వాస్తు శాస్త్రం ఉంది. నిజానికి మయుడు మనకు వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఒకసారి వి.గణపతి స్థపతి గారు దక్షిణ అమెరికా ఖండం పెరు దేశంలోని ఆండెస్ పర్వతాల్లో ఉన్న మచు పిచ్చు అనే పురాతన నాగరికత అవశేషాలను, ఇంకాస్, మయా నాగరికతలను పరిశీలించడానికి వెళ్ళారు. శిల్పకళ, నగరనిర్మాణం, వాస్తు శాస్త్రం మీద మనదేశంలో మయమతం అనే ప్రామాణిక గ్రంథం లభ్యమవుతుంది, అది మయుడు రాసిన గ్రంథం. అందులో 8/ 8 చతురస్రాలతో 64 ప్రమాణములతో (Units) ఉంటుంది వాస్తుపురుష మండలం. అక్కడ వారు గమనించింది కూడా అదే. అక్కడున్న నిర్మాణాలన్నీ ఆ వాస్తుపురుష మండలాన్ని కలిగి ఉన్నాయి. వారు అక్కడి ఇంకాస్ నాగరికతకు చెందిన పురాతన ఆవాసానికి ఉన్న గోడను పరిశీలించి, దాని మందం ఒక కిష్కు హస్తం ఉంది (అనగా 33 ఇంచులు). దక్షిణ భారతదేశంలో మయుడి వాస్తు శాస్త్రం ఆధార నిర్మాణాల్లో ఉండే ప్రమాణం (Standard) అది..... అక్కడి గైడ్, స్థపతితో ఇవి ఇక్కడ ఎలా నిర్మించారో తెలియదు, రాళ్ళను ఎలా మోసుకొచ్చారో తెలియదు అనగా, వారు పర్శీలించి, ఇదేమి తమకు కొత్త కాదని, భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించే నిర్మాణాలకు భారీ శిలలను ఎలా తరలిస్తారో, అలానే వీటిని తరలించారని, అందుకు ఉదాహరన వాటిపై ఉన్న గుర్తులే నిదర్శనమని చెప్పారు.  

అర్జునుడు పాతాళలోకానికి చెందిన నాగ కన్య అయిన ఉలూపిని వివాహం చేసుకుంటాడు. ఆమె అమెరికా ఖండానికి చెందిన యువరాణి. ఇది మెక్సికోలోని అక్కడి కథల్లో కనిపిస్తుంది. వారు అర్జునిడిని చిలి పెప్పర్ మ్యాన్ గా చెప్పుకుంటారు. ఈ చిలి పెప్పర్ మ్యాన్ యుద్ధ విజేత మరియు 'తుల' అనే మహారాజు అల్లుడు అని వారు చెబుతారు.

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు (sorcism ) నమ్ముతారు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది) .

కలియుగం మనకు సా.శ.పూ.3102 లో మొదలైంది, అప్పటి నుంచి కలియుగ కాలమానం లెక్కిస్తున్నాము. మయా నాగరికతలో వారి క్యాలెండర్ సా.శ.పూ.3114 లో మొదలైంది. మన పంచాంగానికి, క్యాలెండర్ కు చాలా పోలికలు ఉన్నాయి.  మయా స్త్రీలు భారతీయ స్త్రీల మాదిరిగానే ఎడమముక్కు రంధ్రానికి ముక్కుపుడుక పెట్టుకుంటారు. వారి వద్ద కూడా మనకులాగే జ్యోతిష్యం, దూరశ్రవణం (telepathy) వంటి విద్యలు ఉన్నాయి. మయన్లు కూడా హిందువుల వలే దేవతల ముందు ఆహారం నివేదన చేసి అప్పుడు ఆరగిస్తారు. ఆహారంలో కూడా మనకు వారికి ఎన్నో పోలికలున్నాయి. హిందువుల వలె మెక్సికన్లు కూడా ప్రాథమికంగా శాఖాహారులు.

సూర్య సిద్దాంతాన్ని చదివితే, లాటిన్ అమెరికా ప్రాంతం పాతాళదేశమని అర్దమవుతుంది. అందులో 12 వ అధ్యాయంలో - దేవతలు అసురులు ఈ భూమి మీదే ఉంటారు. దేవతలు ఉత్తరార్ధగోళంలో, అసురులు దక్షిణార్ధగోళంలో నివసిస్తారు. ధృవాల చుట్టూ ఉన్న సముద్రం ఈ భూమిని రెండు పెద్ద ఖండాలుగా విభజించింది. దేవతల ఖండము, అసురల ఖండము (ఇప్పుడు మనం చూస్తే, ఆసియా, యూరోపు, అఫ్రికా భూభాగల మధ్య సముద్రం లేదు, అమెరిక (ఉత్తర, దక్షిణ) ఖండాన్ని మాత్రమే మిగితా ఖండల నుంచి సముద్రం వేరు చేసింది. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో అంటే మేషరాశిలో ఉన్నప్పుడు మొదట దేవతలకు, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు అసురులకు మొదట కనిపిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖ దగ్గరున్నప్పుడు, సురలు, అసురులు పగలురాత్రుళ్ళను సమానంగా అనుభవిస్తారు. సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు పయనించగా, దేవతలు గ్రీష్మ ఋతువును చూస్తారు. అప్పుడు అసురులకు పెద్దగా సూర్యకిరణాల వేడిమి ఉండదు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కనుక. అప్పుడు వారికి చలికాలం ఉంటుంది - ఇది గమనిస్తే పాతాళం దక్షిణ అమెరికా ఖండమని అర్దమవుతుంది. 
అయితే పాతాళంలో ఉండేవారంతా దుష్టులని ఎక్కడా చెప్పబడలేదు. అది మనం ఏర్పర్చుకున్న దురభిప్రాయం మాత్రమే. విభీషణుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైనవారంతా కూడా రాక్షసులే. కానీ మంచివారు. రక్షణ కోసం బ్రహ్మవారిని సృష్టించాడు కనుక రాక్షసులను పేరు వచ్చింది. ఆ తర్వాతా వారు నివసించడానికి కొంత స్థలం కూడా బ్రహ్మదేవుడే ఇచ్చాడు. కానీ రక్షణ మరిచి, కొందరు దురాశతో దేవతలపై యుద్ధం చేయడంతో వారిని పరమాత్ముడు సంహరించాడు. అంతేకానీ ప్రతి రాక్షసుడు చెడ్డవాడు కాదు.

పితృలోకం దక్షిణంలో ఉందని చెప్తారు, మీరు గనక భూమికి ఆగ్నేయమూలకు వెళితే, అక్కడ అనేక నాగశిలలను ప్రతిష్టించి జనులు పూజిస్తుంటారు అంటారు పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారు. నాగదేవతలకు పితృదేవతలకు సంకేతం. నాగుల గురించి మన సంస్కృతి చాలా చెప్పింది. వారిని నదులు, చెరువులకు రక్షకులుగా చెప్పింది. మలయేషియా కథల్లో నాగులను భారీ ఆకారంలో చూపుతారు. జావా, థాయిలాండ్ దేశాల్లో నాగులను దేవతలుగా, భూమికి క్రింద ఉండే లోకల వాసులుగా, సంపదలకు అధిపతులుగా భావిస్తారు. థాయిలాండ్ లో మన ఆదీశేషుని పోలిన ఐదుతలల నాగదేవత కూడా ఉంది. మెక్సికో లో నాగాల్ (Nagal) అనే పదం ఉంది. అది రక్షకులుగా ఉండే కొన్ని నాగదేవతల గురించి చెబుతుంది. కాంబోడియా రాజ్యాన్ని నాగులే స్థాపించాయని అక్కడి జనుల విశ్వాసం. 

ఇలా మన పురాణాల్లో చెప్పిన వివిధ లోకాలు ఈ భూమ్మీదే దర్శించడం ఒక కోణం మాత్రమే. ఇంతకముందు చెప్పిన విషయాలు, ఇక ముందు చెప్పబోయే విషయాలను సమన్వయం చేసుకుంటే, ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. 

To be continued .........
ఇందులో కొంతభాగం Kiran Mva గారి రచన నుంచి సేకరణ

Saturday, 29 July 2017

స్వామి శివానంద సూక్తిVictory over thoughts is really a victory over all limitations, weakness, ignorance and death. The inner war with the mind is more terrible than the outer war with the machine-guns. Conquest of thoughts is more difficult than the conquest of the world by the force of arms. Conquer your thoughts and you would conquer the world.

- Swami Sivananda

Friday, 28 July 2017

స్వామి సచ్చిదానంద సూక్తిOvercoming Health Issues

You must never give up. You can face any situation and overcome it with hope, courage, faith, and fearlessness. Resolve that: I am the master of the creation and I will be the master of the destruction. I am not afraid of disease. I am not going to be frightened of this anymore, because I created the problem and I can undo the problem. Believe that you can draw healing energy from the divine by clean living. Resolve: I have total faith in a higher will—a higher energy. By my clean habits, I will be able to tune into that and receive all the strength and energy to recharge my system.

- Swami Satchidananda

Thursday, 27 July 2017

అబ్దుల్ కలామ్ సూక్తిAll birds find shelter during a rain. But eagle avoids rain by flying above the clouds. Problems are common, but attitude makes the difference.

 - Adbul Kalam

Tuesday, 25 July 2017

స్వామి దయానంద సూక్తిSubmit-not out of mere faith, but out of wisdom-to the Cosmic Will, infinitely mightier than yours. In this submission, you will shed your load and make yourself an instrument for the expression of the inscrutable ways of the Cosmic Will. And your life shall be lighter than what the word ‘light’ conveys.

- Swami Dayananda

Sunday, 23 July 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తిరమణ మహర్షి మార్గంలో సాధన చేసేవారికి ఇది త్వరగా అర్దమవుతుంది. ఇది సూటియైన మార్గం (Direct Path).

The struggle for deconditioning oneself has occupied as an intensive activity of the soul. This struggle itself is conditioning.

- Satguru Sivananda Murthy Garu

Saturday, 22 July 2017

స్వామి శివానంద సూక్తిControl the thoughts or Sankalpas. Avoid imagination or day-dreaming. The mind will be annihilated. Extinction of Sankalpas alone is Moksha or release. The mind is destroyed when there is no imagination.

- Swami Sivananda

పితృదేవతల కోసం మొక్కలు నాటండిఇదేంటి ఇలా అంటున్నాడు అనుకోకండి. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించినవారికి అవి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. (ఒకసారి గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు ఈ విషయాన్ని చెప్పారు.)

సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. మనం వంశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ వానాకాలం వెళ్ళిపోకముందే కొన్ని మొక్కలు నాటండి. 

Friday, 21 July 2017

సద్గురు శివాయశుభ్రమునీయ స్వామి సూక్తిGiving is an essential for spiritual unfoldment, for until we give and give abundantly, we don't really realize that we are not the giver; we are just a channel for giving.

- Satguru Sivaya Subramunia Swamy

Thursday, 20 July 2017

భగవద్రామానుజుల సూక్తిIt is not enough to control your sensual desires, you must surrender to the Lord.

- Sri Ramanujacharya

షేర్ చేయకపోతే ఏమవుతుంది?ఒకప్పుడు కొందరు దేవుడి పేరు కరపత్రాలు (Pamphlets) పంచి, ఇది చదివిన వారు ఇలాంటివే ఇంకో 10 లేదా 100 కరపత్రాలు పంచిపెట్టాలి అని రాసి పంచిపెట్టేవారు. అది ఒక రకమైన emotional blackmail . ఇప్పుడది ఫేస్‌బుక్‌లో కూడా దాపురించింది. ఈ ఫోటొ చూసిన 3/5/7 సెకెన్లలో షేర్ చేయండి, లేదా ఈ ఫోటో చూసినవారు ఆ దైవం పేరును కామెంట్ బాక్సులో రాయండి, చూసినవెంటనే లైక్ చేయండి, శుభం జరుగుతుంది అంటూ చాలా కనిపిస్తుంటాయి. కొందరైతే ఇవి ఫలానా దైవానికి చెందిన 13 నామాలు, మీరు చదివి ఇంకో 13 మందికి పంపితే మీకు రేపటికల్లా శుభం జరుగుతుంది, లేదంటే దరిద్రం పట్టుకుంటుందని రాసి మెసెజ్స్ పంపుతారు. అది చూసి, కొందరేమో భయంతో షేర్‌లు చేయడం, కామెంట్స్ రాయడం చేస్తారు. పైగా వాట్సాప్‌లో కూడా అవే సందేశాలు. ఇదంతా ఒక emotional blackmail. మనోభావాలతో ఆడుకోవడమే.

ఇంకో రకం కూడా ఉంది. తిరుమల గుడిలో స్వామి వీడియో రహస్యంగా చిత్రించారు. ఇది అందరికీ షేర్ చేసి, స్వామి దర్శన భాగ్యం కలిగించండి అంటూ రాస్తారు. అది నిజమో, అబద్దమో ......... ఒక్క తిరుమలే కాదు. ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు. ఎక్కడో ఏదో గుడికి వెళ్ళడం, అక్కడ సిబ్బంది కళ్ళుగప్పి కెమెరా తీసుకెళ్ళి అక్కడి విశేషాలను రహస్యంగా చిత్రించడం, అది మనమంతా షేర్ చేయడం. ఇందులో తప్పేముంది అనకండి. ప్రతి ఆలయానికి ఆగమం ఉంటుంది. దానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. ఆగమం అనేది ఆయా దేవతలే చెప్పిన విధిపూర్వక నియమావళి. మీరొక ఆలయానికి వెళితే, తప్పకుండా అక్కడి నియమాలను పాటించాలి. కొన్ని ఆలయాల్లో మూలమూర్తులను, ఇతర మూర్తులను చిత్రించే అవకాశం ఉంటుంది. కొన్నిట్లో ఉండదు. మనం అక్కడి నియమాలను తప్పకుండా పాటించాలి. నేనే వీరభక్తుడిని అనుకుని, పదిమందికి చూపితే ఏమవుతుందని ప్రశ్నించడం కాదు. నిజంగా అంత భక్తి ఉంటే, అక్కడి నియమాలకు బద్ధుడవ్వాలి. భక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు, అహం వున్నప్పుడు వస్తాయి.

షేర్ చేసేవారు కూడా కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఒక ఆలయ ఆగామన్ని మీరడం పాపం. అలా చేసి ఎవరైనా, ఏదైనా చేస్తే మనం దాన్ని ఖండించాలే కానీ ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే మనకూ అదే పాపం వస్తుంది. అది కర్మసిద్దాంతం. రెండవది, ఫోటోలు షేర్ చేస్తేనో, కామెంట్‌లు రాస్తేనో శుభం చేయడానికి, చేయకపోతే శపించడానికి దేవుడేమీ శాడిస్టు కాడు, భక్తి మనస్సులో ఉండాలి. నచ్చిన విషయాన్ని షేర్ చేయడంలో తప్పేమీ లేదు, కానీ బలవంతంగా చేయడమెందుకు? పైగా ఇలా చేస్తే మేలు చేస్తానని భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా? ఏ శాస్త్రంలో చెప్పడానికి అలాంటి ఫోటోలు, వీడియో పెట్టినవాడిని అడగండి. చూసిన వెంటనే షేర్ చేయండి అంటాడు, నేను చేయను. అప్పుడేమీ అవుతుంది, ఏమీ కాదు. వాడు పెట్టిన పోస్ట్ మహా అయితే వృధా అవుతుంది. అంతే.

నిజానికి భగవంతుడు పరమకారుణ్యమూర్తి. చూస్తే షేర్ చేయండి లాంటి దిక్కుమాలిన సందేశాలు ప్రోత్సహించి ఆయన్ను మనమే శాడిస్టులా భావిస్తున్నాము. శుభాశుభాలు మీ కర్మను అనుసరించి ఉంటాయి. భగవంతుని యందు అపారమైన భక్తి, విశ్వాసాలుంటే ఆయన అనుగ్రహం చాలా సులభంగా దక్కుతుంది. దైవత్వం గురించి తెలియనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి.

Wednesday, 19 July 2017

భీష్ముని సూక్తిWhat the Veda is, is dharma; What dharma is, is the right path.

- Bhishma Pitamaha

మంగళ్ పాండే గురించి చిన్న కథమంగళ్ పాండే- ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. 1857 లో తొలి స్వాంతంత్ర సంగ్రామంలో (అది కేవలం తిరిగుబాటు కాదని రాజీవ్ దీక్షిత్ వివరించారు) కీలకపాత్ర పోషించిన వ్యక్తి. వీరు 19 జూలై 1827 లో నగ్వా గ్రామం, ఎక్కువ బల్లియా జిల్లా, అవధ్ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పేదరికమే వారిని బ్రిటీష్ సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది. అయితే వారి జీవితాన్ని మలుపు తప్పిన ఒక సంఘటన గురించి నేను చిన్నప్పుడు చదివాను. అది -

ఒకనాడు బ్రిటీష్ రైఫిల్స్‌లో మండుగుండు పెట్టి, వాటిని ఉపయోగించడానికి ఆవు మాంసపు కొవ్వు, పంది మాంసపుకొవ్వు ఉపయోగించేవారు. ఆ కొవ్వును సైనికులు నోటితో కొరకాల్సి ఉంటుంది...... ఒకసారి మంగళ్ పాండే ఒక గ్రామం ద్వారా వెళుతుండగా వారికి దాహం వేసింది. దగ్గరలో ఒక స్త్రీ బావిలో నీరు తోడుతుండటం చూసి, అక్కా! నాకు దాహంగా ఉంది, కాస్త నీరు ఇస్తావా అని అడిగారు. దానికి బదులుగా ఆ వనితా, తమ్ముడూ! నువ్వు బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్నావు. గోమాత మాంసపు కొవ్వును నీ నోటితో స్పృశిస్తావు. గోవు ఎంతో పవిత్రమైనది. నీకు నీరిస్తే, నీరు కూడా అపవిత్రమవుతుంది. క్షమించు తమ్ముడూ అని చెప్పిందట. అది మంగళ్ పాండే లో ఆలోచనను రగిలించింది. అదే క్రమంగా బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు కారణమయ్యింది.

1857 లో జరిగిన ఆ పోరాటం కారణంగా 300 పట్టణాలకు భారతీయులు స్వాతంత్రం సాధించగలిగారు. ఆ తిరుగుబాటులో ఆంగ్లేయుల తలలు నరికారు భారతీయ వీరులు. కానీ కొందరు రాజుల కుట్రల కారణంగా ఉచ్చు మరింత బిగిసి ఆంగ్లేయులు ఇంకో 90 ఏళ్ళ పాటు పాలించే అవకాశం దక్కిందని రాజీవ్ దీక్షిత్ తన ఉపన్యాసంలో చెప్పారు.

అటు తర్వాత 8 ఏప్రియల్ 1857 లో మంగళ్ పాండేను బ్రిటీష్ వారు ఊరిదీశారు. 

Tuesday, 18 July 2017

కంచి పరమాచార్య సూక్తి


The world is a manifestation of the Paramatman and so must we be too. We must remove the mirror called the mind and experience the truth within us that we are none other than the Paramatman. This is what called meditation. All the work we do ought to lead finally to worklessness, to the mediation of the Atman. The goal of all the sacraments I speak about is this.

- Kanchi Paramacharya

మనం తక్షణమే చేయాల్సిన రెండు పనులు

ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది, భారతదేశ జనాభా 130 కోట్లకు చేరుకుందని అంచనా. భవిష్యత్తులో ఇంకా పెరగుతుంది. అయితే ఇప్పుడు మనం అతిముఖ్యంగా ఆలోచించాల్సింది అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం కాదు, ముందు తరాలకు సరిపడా వనరులను మనం మిగల్చడం, రెండవది చక్కని పర్యావరణాన్ని అందించడం.

వనరుల కొరత ఏర్పడితే అది తీవ్ర వైషమ్యాలకు కారణమవుతుంది. కొన్ని దేశాల్లో వనరుల కొరత సంఘర్షణకు దారితీసి రెండు దేశాల మధ్య శత్రుత్వానికి, తీవ్రవాదానికి కారణమైందని ఇంతకముందు వందనా శివా గారు చెప్పింది మీరంతా చదివారు. మన దేశంలో ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగునకు చేరాయి. కొన్ని సంవత్సరాలు గడిస్తే, పరిస్థితి తీవ్రమవుతుంది. అది ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విబేధాలకు, వైషమ్యాలకు దారితీసి దేశవిభజనకు దారి తీయవచ్చు, అలా కాకూడదని దైవాన్ని వేడుకుందాం. అయితే మనం చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్రభుత్వాలుగానే కాదు, పౌరులుగా కూడా.

ఒక ఏడాది వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు, 3 సంవత్సరాల అవసరాలకు సరిపోతుందని అంచనా. ఇప్పుడు వర్షం ద్వారా భూమిని చేరే ప్రతి నీటి చుక్కను మనం భూమిలోకి ఇంకించాలి. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగం విజయవంతమైంది, భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు రైతులు, ఇతరులు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రెండవది, నీరు ఎక్కడిక్కడ ఇంకితే, సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

అలాగే #మొక్కలు నాటాలి. భవిష్యత్తు తరాలకు పుష్కలంగా ప్రాణవాయువు ఉండాలి, భూమి చల్లబడాలి, జీవవైవిధ్యం రక్షించబడాలంటే మొక్కలను నాటి, అవి వృక్షాలుగా పెరిగే వరకు సంరక్షించాలి. మొక్కలు నేలకోతకు గురికాకుండా ఆపుతాయి. లోతున ఉన్న భూగర్భ జలాలను పైకి తీసుకువస్తాయి, మేఘాలను ఆహ్వానించి, చక్కని వర్షాలకు కారణమవుతాయి. పచ్చదనం లేకపోతే మెదడు చురకగా పనిచేయదు, కళ్ళ జబ్బులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ముందు మనం మర్చిపోతున్నది, వేసవికాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు మనం పడే వేదన. అది తర్వాతి తరాలకు ఉండకూడదంటే, తప్పకుండా మొక్కలు నాటాలి. మీకో విషయం తెలుసా? మనదేశంలో చింత, సీమచింత, సీతాఫలం, రేగి, నేరేడు, నాటు ఉసిరి వంటి మనం నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో ఉత్పత్తుల పంటసాగులేదు. అవి ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పంటలు. అడవుల నుంచి నేరుగా కోసుకచ్చి మనకు అమ్ముతారు. కానీ మనకా అవగాహన, ఆలోచన ఎక్కడుంది. చింతపండు తింటాము, రేగికాయలు తింటాము, మే, జూన్, జూలై నెలల్లో నేరేడు పళ్ళు తింటాము, కానీ ఆ విత్తనాలు మాత్రం ఖాళీ ప్రదేశాల్లో చల్లము. ఆయా రకాల మొక్కలు పెంచము. ఈ రోజు సరే! మరి భవిష్యత్తు మాటేమిటి? మన జనాభా భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, వినియోగం కూడా ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ ఉతపత్తులను ఎక్కడి నుంచి తీసుకువస్తాము? ఈలోపు ఉన్న ఆ కాస్త వృక్షాలు నరికితే, అడవులను నాశానం చేస్తే, రాబోయే తరాలకు అసలీ జాతులు పుస్తకాల్లో కూడా చదివే అవకాశం దక్కదు. కాబట్టి మనమే ఆలోచించి ముందుకు కదలాలి.

ఏవైతే మనకు నిత్యావసరమో ఆయా మొక్కలను ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. వాటి పక్కనే ఇంకుడు గుంతలు నాటాలి. ఈ రెండు జరగాలి. ఎందుకంటే మనం వనరులను వాడుకుంటున్నదుకు ప్రతిఫలంగా, లేదా కనీస కృతజ్ఞతగానైనా భూమాతకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి. కృతఘ్నో నాస్తి నిష్కృతిః అని రామాయాణ వాక్కు. కృతఘ్నులకు నిష్కృతి లేదు. దేశసమగ్రతకు భంగం కలగకూడంటే కూడా వనరుల కొరత ఉండకూడదు. అందుకోసమైనా ప్రతి పౌరుడు ఇవి తక్షణమే చేపట్టాలి. ఎందుకంటే Earth is a Temple. Not a dust bin. - ఈ పృధ్వీ దేవాలయం, చెత్తకుండీ కాదు. ఈ భూమి మీదనున్న సమస్తమూ భగవంతుని ప్రతిరూపాలే. ఇది నా మాట కాదు, ఈశావాస్యోపనిషత్తులో ఋషుల వాక్కు. వేదం యొక్క ఆదేశం, ఉపదేశం.

అమెరికా = పాతాళం గురించి మరికొంతఆదివారం మనం చెప్పుకున్న అమెరికా = పాతాళం అనే అంశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మరిచాను. అవి-

1. మనం భూమికి అవతలపై అన్నప్పుడు Anti-podes గురించి చెప్పుకోవడం లేదని గ్రహించాలి. కాలిఫోర్నియాకు దగ్గరలో హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్నాయి. ఆష్ అనేది ఆంగ్లపదం, దానికి అర్దం బూడద, భస్మం. హార్స్ అంటే గుఱ్ఱం. ఐల్యాండ్ అంటే ద్వీపం. సగరపుత్రులు భస్మం అయిన ప్రదేశమే ఆష్ ఐల్యాండ్ అని, గుఱ్ఱాన్ని కట్టేసిన ప్రదేశం హార్స్ ఐల్యాండ్ అని కంచి పరమాచార్య స్వామి వారు 1935 లో ఒక ప్రవచనంలో చెప్పారు. అసలు ఎప్పుడూ అమెరికా వెళ్ళని పరమాచార్య స్వామి వారు, అక్కడున్న ప్రాంతాలు, వాటికి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం గురించి చెప్పడం ఆశ్చర్యం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఆ హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్న ప్రాంతాలకు భూమికి ఇవతలవైపు గంగోత్రి హిమానీనదం ఉంది. భగీరథుడు తన పూర్వీకులైన సగరపుత్రుల బూడదకుప్పల మీద నుంచి గంగను పారించడానికి తపస్సు చేసి ఆకాశగంగను భూమికి తీసుకువస్తాడు. సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే ఈ ప్రాంతాలు ఉండటం, ఇక్కడి కథను సూచించే నామాలు కలిగి ఉండటం, అక్కడి స్థానిక సంస్కృతి నశించినా, ఆంగ్లంలో కూడా అవే పేర్లు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అద్భుతం కూడా.

అలాగే మహాబలినగరం (మలిపునగర్)కు దగ్గరలోనే ఒక విష్ణు ఆలయం నిర్మించారంటే అది ఆ ప్రాంతంలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నది. అక్కడ నిక్షిప్తమైన తరంగాలే ఆ విధమైన నిర్మాణానికి సంకల్పం కలిగించాయేమో!

2. దక్షిణ అమెరికా లో ఒకనాడు పూజించబడిన ఆ భారీ వానరమూర్తి కొన్ని మెట్లు కలిగి ఎత్తున పెద్ద సింహాసనంలో కూర్చుని ఉండేదట. ఆ ఆలయానికి ప్రారంభంలో ఒక వైపు కప్ప, ఇంకో వైపు మకరం (మొసలి) చెక్కి ఉన్నాయి. హనుమంతులవారి స్వేదం స్వీకరించిన ధీర్ఘదేహి అనే దేవలోక కన్య రూపమే ఆ మకరం కావచ్చు. అలాగే ఆ భారీవానరమూర్తి సింహాసనానికి అటు, ఇటు క్రిందవైపున దర్బార్ మాదిరిగా ఉండి, అనేక వానరాలు కొలువై ఉన్నట్లు అక్కడి పరిశోధకులు కనుగొన్నారు. అది ఆంజనేయస్వామి వారి పరివారం కావచ్చు, లేదా మకరధ్వజుడు/ మత్స్యవల్లభుడి విగ్రహం కావచ్చు. సరిగ్గా ఆ భారీ వానరమూర్తికి ఎదురుగా బలులు ఇచ్చే స్థానం ఉంది. హిందూ ఆలయాల్లో కూడా మూలావిరాట్టుగా ఎదురుగా ధ్వజస్థంభం ముందు బలిపీఠం ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన అంశం.

1933 లో Honduras ప్రెసిడెంట్ Tiburcio Carías ఇక్కడ అన్వేషణ కోసం స్పాన్సర్ చేశారు. అక్కడి స్థానిక జాతులవారి జీవితం చెదిరిపోకముందే అక్కడ పరిశోధన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. Museum of the American Indian సంస్థాపకుడు George Gustav Heye తో అక్కడ పరీశీలన చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అన్వేషకుడు R. Stuart Murray దీన్ని ముందుకు నడిపించారు. అయితే ఆయన కొన్ని పురాతన అవశేషాలతో పాటు 'దట్టమైన అడవిచేత కప్పబడి ఉన్న పెద్ద శిథిలాలు' అనే వదంతులను ఆయన వారికి తెలియజేశారు. అక్కడే బహుసా శిథిలైన నగరం ఉండేది, దాన్నే ఇండియన్స్ (స్థానిక జాతులు) City of the Monkey God గా పిలుస్తారు... వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళినవారు ఒక నెలలోపు విషసర్పం యొక్క కాటు చేత మరణిస్తారని వారు నమ్ముతారు' అని నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం 1934 లో జరిగినా, దాన్ని అన్వేషించలేకపోయారు. అలా అక్కడ శిథిలాలను కొనుగొనాలనుకున్న అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఒకటి రెండు రోజుల్లో ఇది దానికి జత చేసి, ఈ పోస్ట్ తీసేస్తాను.

Sunday, 16 July 2017

సద్గురు శివానంద మూర్తి గారు


Desire per se is neither good nor bad. There are desires that bind and there are desires that release you. So, it is desirable to entertain desirable desires!

- Sadguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 246 (అమెరికా = పాతాళ లోకం ??)14 లోకాలను మానసిక స్థితుల ఆధారంగా శరీరంలో ఎలా దర్శించవచ్చో చూశాం, ఇప్పుడు ఈ భూమి మీద ఇతర లోకాలు ఉన్నాయనే విషయం కూడా మన ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే ఒకే అంశాన్ని వేర్వేరు కోణాల్లో అనేక విధాలుగా దర్శించడం సనాతన ధర్మంలో కనిపించే గొప్ప లక్షణం. 

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. మనం భూమికి అవతలవైపు అన్నప్పుడు Anti-podes గురించి చెప్పుకోవడం లేదని గ్రహించాలి. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్నాయి. ఆష్ అనేది ఆంగ్లపదం, దానికి అర్దం బూడద, భస్మం. హార్స్ అంటే గుఱ్ఱం. ఐల్యాండ్ అంటే ద్వీపం. సగరపుత్రులు భస్మం అయిన ప్రదేశమే ఆష్ ఐల్యాండ్ అని, గుఱ్ఱాన్ని కట్టేసిన ప్రదేశం హార్స్ ఐల్యాండ్ అని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు. అసలు ఎప్పుడూ అమెరికా వెళ్ళని పరమాచార్య స్వామి వారు, అక్కడున్న ప్రాంతాలు, వాటికి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం గురించి చెప్పడం ఆశ్చర్యం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఆ హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్న ప్రాంతాలకు భూమికి ఇవతలవైపు గంగోత్రి హిమానీనదం ఉంది. ఈ రెండు ప్రదేశాలు (ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్) కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. భగీరథుడు తన పూర్వీకులైన సగరపుత్రుల బూడదకుప్పల మీద నుంచి గంగను పారించడానికి తపస్సు చేసి ఆకాశగంగను భూమికి తీసుకువస్తాడు. సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే ఈ ప్రాంతాలు ఉండటం, ఇక్కడి కథను సూచించే నామాలు కలిగి ఉండటం, అక్కడి స్థానిక సంస్కృతి నశించినా, ఆంగ్లంలో కూడా అవే పేర్లు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అద్భుతం కూడా.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు. అలాగే మహాబలినగరం (మలిపునగర్)కు దగ్గరలోనే ఒక విష్ణు (వేంకటేశ్వర) ఆలయం నిర్మించారంటే అది ఆ ప్రాంతంలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నది. అక్కడ నిక్షిప్తమైన తరంగాలే ఆ విధమైన నిర్మాణానికి సంకల్పం కలిగించాయేమో! 

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.

ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు. 

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ]  నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు. దక్షిణ అమెరికా లో ఒకనాడు పూజించబడిన ఆ భారీ వానరమూర్తి కొన్ని మెట్లు కలిగి ఎత్తున పెద్ద సింహాసనంలో కూర్చుని ఉండేదట. ఆ ఆలయానికి ప్రారంభంలో ఒక వైపు కప్ప, ఇంకో వైపు మకరం (మొసలి) చెక్కి ఉన్నాయి. హనుమంతులవారి స్వేదం స్వీకరించిన ధీర్ఘదేహి అనే దేవలోక కన్య రూపమే ఆ మకరం కావచ్చు. అలాగే ఆ భారీవానరమూర్తి సింహాసనానికి అటు, ఇటు క్రిందవైపున దర్బార్ మాదిరిగా ఉండి, అనేక వానరాలు కొలువై ఉన్నట్లు అక్కడి పరిశోధకులు కనుగొన్నారు. అది ఆంజనేయస్వామి వారి పరివారం కావచ్చు, లేదా మకరధ్వజుడు/ మత్స్యవల్లభుడి విగ్రహం కావచ్చు. సరిగ్గా ఆ భారీ వానరమూర్తికి ఎదురుగా బలులు ఇచ్చే స్థానం ఉంది. హిందూ ఆలయాల్లో కూడా మూలావిరాట్టుగా ఎదురుగా ధ్వజస్థంభం ముందు బలిపీఠం ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన అంశం.

1933 లో Honduras ప్రెసిడెంట్ Tiburcio Carías ఇక్కడ అన్వేషణ కోసం స్పాన్సర్ చేశారు. అక్కడి స్థానిక జాతులవారి జీవితం చెదిరిపోకముందే అక్కడ పరిశోధన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. Museum of the American Indian సంస్థాపకుడు George Gustav Heye తో అక్కడ పరీశీలన చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అన్వేషకుడు R. Stuart Murray దీన్ని ముందుకు నడిపించారు. అయితే ఆయన కొన్ని పురాతన అవశేషాలతో పాటు 'దట్టమైన అడవిచేత కప్పబడి ఉన్న పెద్ద శిథిలాలు' అనే వదంతులను ఆయన వారికి తెలియజేశారు. అక్కడే బహుసా శిథిలైన నగరం ఉండేది, దాన్నే ఇండియన్స్ (స్థానిక జాతులు) City of the Monkey God గా పిలుస్తారు... వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళినవారు ఒక నెలలోపు విషసర్పం యొక్క కాటు చేత మరణిస్తారని వారు నమ్ముతారు' అని నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం 1934 లో జరిగినా, దాన్ని అన్వేషించలేకపోయారు. అలా అక్కడ శిథిలాలను కొనుగొనాలనుకున్న అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది.

శతృబాధలు, పిశాచ భయాలు, రోగ నివారణ కోరకు నిత్యం పఠించవలసిన పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం ఇది. ఇందులో స్వామి రూపాన్ని గొప్పగా వర్ణించారు.

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం 
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం 
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం


భావం —— వానర ,నారసింహ ,గరుడ ,వరాహం, అశ్వ (హయగ్రీవ) అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన 15 నేత్రాలు (ఒక్కో ముఖానికి 3 కన్నులు), పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, ఢాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు (ఖట్వాంగం), మణులు, పాము, చెట్టు 10 హస్తములతో ధరించిన వాడు, పసుపు వన్నె కలవాడు, గర్వాన్ని హరించే వాడైన హనుమంతునికి నమస్కారం.

To be continued ...........

Source: https://pparihar.com/2015/03/29/hanuman-travelled-to-patala-loka-south-america-through-a-tunnel-worshipped-in-south-america/
https://en.wikipedia.org/wiki/La_Ciudad_Blanca#/media/File:Lost_City_of_the_Monkey_God.png
https://ramanan50.wordpress.com/2014/02/28/americas-the-patala-of-hinduism-mayas-hindus/

Saturday, 15 July 2017

స్వామి శివానంద సూక్తి


Just as fruit is born of the seed, so also deeds are born of thoughts. Good thoughts generate good actions. Evil thoughts produce evil actions. Harbour good thoughts. Repel evil thoughts. If you cultivate good thoughts by Satsanga, study of religious books, prayer, etc., evil thoughts will die by themselves.

- Swami Sivananda

Friday, 14 July 2017

స్వామి సచ్చిదానంద సూక్తిSelf-mastery

Many people fear that discipline means a lack of freedom, a repressed or joyless life. But imagine that you are tied to the saddle of a galloping horse, clinging for your life, hoping somehow the horse might feel sympathy and stop. Is that enjoyment? That is the situation when we do not have discipline over our minds. The person who really enjoys horseback riding is the one who controls the horse, who can stop whenever he or she wants.

- Swami Satchidananda

Thursday, 13 July 2017

స్వామి చిన్మయానంద సూక్తిIs it possible for us to find a Guru by our selves?

To come under the protection of a Mahapurusha, you can order everything... you can't hunt a Guru. None of you can know who is the Guru. The qualities of the Guru are so subtle....Greater the Guru, smaller He looks, humble and simple.... Real Mahatma's, they always secretly live, nobody knows that He is there. How am I to know...?

There is no question of you running after a Guru. The Guru comes to us. Never can a disciple go to the Guru... Guru always comes to you... First you open up yourself. Stay where you are, where the Lord has kept you... Never mind, stay where you are.. open up... open up, purify your mind. The right time the Guru comes to you as the bee comes to the flower... In case a Guru takes you in His hands, takes you under His wings, to protect you, guide you, to lead you, That is the Greatest Blessings.

- Swami Chinmayananda

గురువును వెతకడం మనకు సాధ్యమయ్యే పనియేనా?
ఒక మహాపురుషుని రక్షణలోకి వస్తే, నువ్వు దేన్నైనా శాసించగలవు... నువ్వు గురువును వెతకలేవు. గురువు ఎవరనేది మీ ఎవరికి తెలియదు. గురువు యొక్క లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి... గురువు ఎంత గొప్పవాడైతే, ఆయన అంత చిన్నవాడిగా, వినయంగా, సామాన్యంగా కనిపిస్తారు... నిజమైన మహాత్ములు రహస్యంగా జీవిస్తారు, ఆయన ఉన్నాడనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. మరి నాకెలా తెలిసేది?
గురువు వెనుక నువ్వు పరిగెత్తడమనే ప్రశ్నే లేదు. గురువే మన వద్దకు వస్తారు. శిష్యుడు గురువు వద్దకు వెళ్ళడమనేది ఉండదు... గురువే ఎప్పుడూ మనవద్దకు వస్తారు... ముందు నువ్వు తెరుచుకోవాలి. ఎక్కడున్నావో, భగవంతుడు ఎక్కడ ఉంచాడో అక్కడే ఉండు... ఫరవాలేదు, ఉన్నచోటనే ఉండు... వికసించు... వికసించు, మనసును శుద్ధి చేసుకో. తేనెటీగ పువ్వు వద్దకు వచ్చినట్లుగా సరైన సమయంలో గురువు నీ వద్దకు వస్తారు... ఒకవేళ గురువు నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటే, నిన్ను రక్షించేందుకు, మార్గదర్శనం చేసేందుకు, నడిపించేందుకు ఆయన రెక్కల క్రిందకు నిన్ను తీసుకుంటే, అదే గొప్ప ఆశీర్వచనము.

స్వామి చిన్మయానంద 

Wednesday, 12 July 2017

స్వామి చిదానంద సూక్తిLove Divine is the Supreme gift, the greatest force in the world. The grace of God is obtained by true devotion. Devotion is the means to attain Bliss Infinite.

- Swami Chidananda Saraswati 

Tuesday, 11 July 2017

12-07-2017, బుధవారం, ఆషాఢ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ12-07-2017, బుధవారం, ఆషాఢ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
దీనికి గజానన సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

12 జులై 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.17 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

స్వామి కృష్ణానంద సూక్తిIt is easier to receive the grace of God than anything from the marketplace. If you want to get something from the shop, you have to walk some distance. But to reach God, you do not have to travel any distance. Only your heart should well up and want to reach Him. There is no condition and no prescription, no other qualification necessary except that you should want it. And when you want it, it has to come. That’s all. No other qualification is necessary for you.

- Swami Krishnananda 

Monday, 10 July 2017

ఆదిశంకరుల సూక్తిJagadguru Adi Shankaracharya in Sadhana Panchakam

గురుగీత నుంచి ఒక శ్లోకంసురక్షిత భారత్ కోసం చైనాను ముక్కలు చేయాలి

భారతీయులు ఇప్పుడేమీ చేయాలి?

ఢోకలాం లో సరిహద్దు వివాదం, సిక్కిం వద్ద నాథూలా పాస్ నుంచి మానససరోవర యాత్రకు వెళ్ళకుండా మార్గం మూసివేయడం, చైనా తరచూ భారతభూభాగంలోకి చొరబడటం, అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా చెప్పుకోవడం వంటివి చూసినప్పుడు ప్రతి భారతీయుడికి కోపం కలగకుండా ఉండదు. అయినా మళ్ళీ మామూలే. మనం చైనా వస్తువులే కొని మన మీద యుద్ధం చేయడానికి మనమే డబ్బు సమకూర్చుతాము. ఈ మధ్య చైనా చెప్పినవి చూస్తే సిగ్గు, రోషం ఉన్న ప్రతి భారతీయుడు కఠినంగా ఆలోచిస్తాడు. భారత్‌ను అవమానపరుస్తూ చైనా పత్రికలు కొన్ని వ్యాసాలు రాశాయి, అంతటితో ఆగక, భూటన్- చైనా వివాదంలో తలదూర్చితే సిక్కిం ను వివాదాస్పద ప్రాంతంగా గుర్తించి, ఆ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయడానికి అక్కడ వేర్పాటువాదులకు సహాయం చేసి, అండగా ఉంటామని చైనా ప్రకటించింది. నిజానికి భూటాన్‌కు దౌత్యపరమైన అన్ని విషయాలు భారత్ చూసుకోవాలని, మనకు భూటాన్‌కు మధ్య ఒప్పందం ఉంది. అందుకే భూటన్‌కు భారత రక్షణగా నిలుస్తోంది. చాలాకాలం క్రితమే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా ఆక్సాయి చిన్ అనే భూభాగాన్ని తన అధీనంలోకి తీసుకుంది. నిజానికి అది భారత భూభాగం, రక్షణ పరంగా అత్యంత కీలక ప్రాంతం. ఇప్పుడు భూటాన్, సిక్కిం వద్దనున్న ఢోకలాం ప్రాంతం కూడా అలాంటిదే. భూటాన్ కు చెందిన దాన్ని కనుక చైనా ఆక్రమించుకుంటే, భారత సైన్యంలో కదిలికలను నిశితంగా గమనించే అవకాశం చైనాకు కలుగుతుంది, సిక్కిం ను ఆక్రమించుకునే అవకాశం దక్కుతుంది. సిక్కింను చైనా ఆక్రమించుకుంటే ఆ తర్వాత మెల్లిమెల్లిగా వేర్పాటు ఉద్యమాలను ప్రోత్సహించిం మొత్తం ఈశాన్య భారతాన్ని వశం చేసుకోవాలని చైనా పన్నాగం. ఇదేకాక ఇప్పుడు చైనా ఇంకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అవసరమైతే పాకిస్థాన్ కు సహాయం చేస్తామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాకుండా భారత్ ఆధీనంలో ఉన్న #కాశ్మీర్ లో కూడ చైనా సైన్యాన్ని దించుతామని హెచ్చరికలు చేస్తోంది. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే.

మనకు చైనాకు యుద్ధం వస్తే నష్టం భారీగానే ఉంటుంది. కానీ యుద్ధం రాకుండా ఆపే శక్తి కలిసికట్టుగా పని చేయగలిగితే భారతీయులందరికి ఉంది. చైనాకు 130 కోట్ల వినియోగదారులు కల అతిపెద్ద వ్యాపర మార్కెట్ భారత్. ఆ మార్కెట్ కోల్పోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఎందుకంటే చైనాకు ఎగుమతుల మీద ఆధారపడి బ్రతుకుతున్న దేశం. భారత్ తన సొంత మార్కెట్ మీద ఆధారపడి ఉంది. కనుక చైనాకు మనం హెచ్చరికలు ఇవ్వాలంటే చైనా వస్తువులను బహిష్కరించాలి. చైనా వస్తువులు ఎవరింట్లో లేవండి అనకండి. ఇంతకముందే కొన్న చైనా వస్తువులను కాల్చమని చెప్పడంలేదు, కొత్తగా మనం చైనా వస్తువులు కొనకుండా ఉంటే చాలు. ఒక్క నాలుగు నెలలు చైనా వస్తువులు కొనడం ఆపేయండి. నిజానికి గతేడాది ఎన్.ఎస్.జి.లో భారత సభ్యత్వానికి చైనా మొకాలడ్డిందని భారతీయులు నిరశనగా చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా టపాసులు కూడా కొనలేదు. అది విజయవంతం అయ్యింది. చైనా ఆ విషయంలో ఎంతో ఖంగుతిన్నదని పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. నిజానికి కేవలం చైనా వస్తువులను బహిష్కరిస్తే సరిపోదు. కాని ఇది మాత్రమే శీఘ్ర ప్రతిస్పందన (Instant reaction) ను తెలియజేస్తుంది. మనం Made in China అని ఉంటే కొనట్లేదని, కొన్ని సార్లు Made in PRC అని వేసి అమ్మేస్తున్నారు. కొన్నిసార్లు Made in India  అనే అట్టపెట్టెల్లో పెట్టి అమ్మేస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించి కొనాలి. నిజానికి మనిషికి కావలసిన ఆహారం, బట్టలు మొదలైనవి మనదేశంలో కూడా ఉత్పత్తి అవుతున్నాయి. చైనా వస్తువులు కొనకపోతే మనమే చచ్చిపోమని గుర్తుంచుకోండి.

ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించాలి. యుద్ధానికి సిద్ధమని చెప్పడం ఒక్కటే సరిపోదు, ఒకే చైనా విధానానికి (One china policy) స్వస్తి పలకాలి. టిబెట్ ను 1950లో, ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌ను చైనా ఆక్రమించింది. టిబెట్ బౌద్ధ దేశం, భారత్ అంటే ఎనలేని గౌరవం ఉన్న దేశం. నిజానికి అప్పుడు మనం టిబెట్ కు సాయం చేసి ఉండాల్సింది. ఈనాటికి టిబెట్ కు స్వాతంత్రం ఇవ్వాలని అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, దలైలామా భారత్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. మనం దలైలామాను అధ్యక్షునిగా భారత్ లోనే టిబెట్ ప్రభుత్వాన్ని (Government in Exile) ఏర్పాటు చేసి, తక్షణమే అక్కడ వేర్పాటు ఉద్యమాన్ని ప్రోత్సహించాలి. ప్రతి భారతీయుడు చైనాలో వేర్పాటు ఉద్యమాలకు మద్దతు పలకాలి. టిబెట్ చైనా నుంచి వేరుపడితే మనకు ఎన్నో సమస్యలు తీరిపోతాయి. బ్రహ్మపుత్ర నది మీద ఆనకట్టలు కట్టి ఉత్తరచైనాకు నీటిని తరలిస్తోంది, ఫలితంగా ఈశాన్య భారతంలో వరదలు, లేదంటే కరువు, తరచుగా ఏదో ఒకటి సంభవించి జన నష్టం జరుగుతూనే ఉంటుంది. టిబెట్ సరిహద్దు నుంచి భారత్ పై కవ్వింపులకు దిగుతోంది. టిబెట్ ను మనం విడగొడితే చైనా సగానికి చీలిపోతుంది. అపారమైన సహజ వనరులున్న టిబెట్ భారత మిత్ర దేశంగా అవిర్భవిస్తుంది. అప్పుడు మనకూ- చైనాకు చిన్న సరిహద్దు మాత్రమే మిగులుతుంది. అది కూడా కాశ్మీర్ లో. నీటి కరువు కారణంగా చైనా ఆర్థికంగా చితికిపోతుంది. అలాగే హాన్‌కాంగ్‌లో జరిగే పోరాటానికి మనం మద్దతు పలకాలి. చైనా, టిబెట్, హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఐక్యరాజ్యసమితి వంటి వేదికల మీద గట్టిగా వినిపించి, చైనాను కోలుకోలేని దెబ్బకొట్టాలి. చైనా, టిబెట్ ప్రాంతం మీదుగా నేపాల్‌లో మావోయిష్టులకు, నెక్సలైట్లకు డబ్బు ఇస్తోంది. అది నేపాల్‌లోని చైనా ఏజంట్ల ద్వారా భారత్‌లోకి వస్తుంది. భారత కమ్యూనిష్టులకు కూడా చైనా నుంచి డబ్బు అందుతున్నట్లు సి.ఐ.ఏ. నివేదికల్లో తేలింది. టిబెట్ విడిపోయి ప్రత్యేక దేశమైతే మన దేశంలో వేర్పాటు వాదులకు చైనా ద్వారా డబ్బు అందే మార్గాలు తగ్గిపోతాయి. ఇది ప్రభుత్వం తక్షణమే చేయాలి. ఇప్పటికే టిబెట్ లో చైనా Digestion ను మొదలుపెట్టిందని రాజీవ్ మల్హోత్రా చెప్పారు. మనం ఇంకా ఆలస్యం చేస్తే, అసలు టిబెట్ పూర్తిగా తన సంస్కృతిని కోల్పోతుంది.

అది తప్పు కదా అనకండి, సామ్రాజ్యవాద భావజాలం కలిగిన చైనా వలన భారత్‌కు శాశ్వతంగా ముప్పు ఉంటుంది. మనం దాన్ని తుదిముట్టించాలంటే చైనాను ముక్కలు చేయడం మార్గం. మనమేమీ తప్పు చేయడంలేదు. చైనా మన మీద ప్రయోగిస్తున్న ప్రణాళికనే మనం చైనా మీద ప్రయోగిస్తున్నాం. అప్పుడు మాత్రమే భారతదేశం, భారతీయులు సురక్షితంగా ఉంటారు.

Friday, 7 July 2017

శ్రీ ఆనందమయి మా సూక్తిSo long as you have not found a Guru, adhere to the name or form of Him that appeals to you most, and ceaselessly pray that He may reveal Himself to you as the Sadguru.

- Sri Anandamayi Ma

Thursday, 6 July 2017

స్వామి శాంతానంద పురీ సూక్తిWhenever a sensuous feeling touches our senses, withdraw it like a tortoise withdrawing itself into its shell. However, my own feeling is that if we have a competent and Realized Guru, invoking his Grace gives us the strength to bear.

-Swami Shantananda Puri

Monday, 3 July 2017

మథర్ సూక్తిDo not live to be happy, live to serve the Divine and the joy that you will experience will be beyond all expectations.

- Mother 

Sunday, 2 July 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తిI know that I have Siva's Grace. It is not qualification. Its Grace.

- Satguru Sivananda Murthy Garu

వారాహీ అమ్మవారి వైభవం గురించి కొంత.......ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత.......

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.  

Saturday, 1 July 2017

స్వామి శివానంద సూక్తిKeep the mind fully occupied. Then evil thoughts will not enter. An idle brain is the devil’s workshop. Watch the mind every minute.
Always engage yourself in some work—stitching, cleaning vessels, sweeping, drawing water, reading, meditating, counting the beads, singing divine songs, praying, serving the elders or nursing the sick. Avoid loose talk and gossip. Fill the mind with sublime thoughts, such as those contained in the Gita, the Upanishads, the Yogavasishtha, etc.

- Swami Sivananda