13, ఆగస్టు 2017, ఆదివారం

సద్గురు శివానంద ముర్తి గారి సూక్తిIf you are emerging totally pure, free from even a speck or a dust of ignorance or selfishness anywhere you are enlightened.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 249 (14 లోకాలు- Scientific analysis)మనకు ఈ లోకం ఒక్కటే కనిపిస్తోంది. కానీ అనేక లోకాలు ఉన్నాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల్లో ఋషులు అనేక లోకాలకు ప్రయాణం చేశారని ఉంది. అంటే అది లోకాంతరప్రయాణం. ఇప్పటి శాస్త్రవేత్తలు చేస్తున్న గ్రహాంతర ప్రయాణం మాత్రమే..... మరి మనకు ఆ లోకాలు కనిపించవెందుకు? ఆ లోకవాసులు మనకు ఎందుకు కనిపించరు? ఆ లోకాలు ఉన్న చోటకు రాకెట్‌లు వెళ్ళలేవా? ..... ఆ లోకాలు మామూలు నేత్రాలకు, సాధరణ బుద్ధికి అందే స్థాయిలో లేవని, వాటిని చూడటానికి అతీయింద్రియ దృష్టి కావాలని ధర్మం చెబుతుంది..... కళ్ళకు కనిపించవు కనుక ఇదంతా అసత్యమని, ఏదో కల్పించి చెబుతున్నారని, ఇదంతా సైన్స్‌కు విరుద్ధమని, కళ్ళకు కనిపించేదే నమ్మమని మనదేశంలో ఉన్న కొందరు హేతువాదులు (ఆ ముసుగు వేసుకున్న హైందవద్వేషులు) వాదిస్తారు. కానీ వారికి, హిందువులకు సమాధానం క్వాంటం ఫిజిక్స్‌లో ఉంది.

ధర్మాన్ని అనుసరించి విశ్వం బహు మితీయంగా (Multi dimensional) అయినది. అందులో ప్రతి లోకం, ఒకదానితో ఒకటి మరియు పరమాత్మతోనూ పరస్పరం అల్లుకుని (Interwoven) ఉంటాయి. ఇదే సిద్ధాంతాన్ని క్వాంటం ఫిజిక్స్ ప్రతిపాదిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం కూడా ఈ విశ్వంలో అనేక ప్రపంచాలు, లోకాలు ఉన్నాయి. అవి కళ్ళకు కనిపించనప్పటికీ, వాటికి అస్థిత్వం ఉందని క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నమ్ముతారు. నిజానికి క్వాంటం ఫిజిక్స్ అధ్యాపకులు వేదాంతాన్ని, సనాతన ధర్మాన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. విద్యార్ధులకు క్వాంటం ఫిజిక్స్ పాఠాలు భోదిస్తుంటే, అద్వైతం భోదించినట్లుగానే ఉంటుందని హాన్స్ పీటర్ డర్ గారు చెప్పిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాన్ని అనుసరించి - మొత్తం ఈ విశ్వంలో 10 పరిమాణాలు (Dimensions) ఉన్నాయని అనుకుంటున్నారు, పరిశోధనలు అవి పెరగవచ్చు కూడా. వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో సూపర్ స్ట్రింగ్” సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. యజుర్వేదంలోని రుద్రం 11 పరిమాణాల (11 Dimensions) గురించి చెబుతుంది.

1-Dimension  పొడవు (length)
2-D ఎత్తు (height )
3-D లోతు (depth )

మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం, చూస్తున్న జగత్తు, నక్షత్రాలు, గోళాలు, ఉల్కలు, అంతరిక్షం ...... దృశ్యమానమైన ఈ జగత్తంతా 3D. అయినా మనం 3-D సినిమా చూడాలంటే, ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకోనిదే కుదరదు.

4-D time, ఒక వస్తువు ఎంత సేపు ఒక స్థానం లో ఉండగలిగిందో చెప్పే పరిణామం ఇది. 3 పరిణామాలతో పాటు, కాలంలో ఒక వస్తువుకు స్థానం ఎక్కడో తెలుసుకుంటేనే, బ్రహ్మాండంలో దాని స్థానాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ Space ఉండదు. ఉన్నదంతా కాలమే (Only time).

చనిపోయిన తర్వాతా చాలా వరకు జీవులు 4-D లోకే వెళతారు. అందుకే వారు మనకు కనిపించరు. అంటే మరణం తర్వాత ఆత్మ, ఈ పాంచభౌతికమైన, దేశకాలాల (Time and Space) కు లోబడిన పరిమాణం (Dimension) నుంచి భిన్నమైన పరిమాణంలోకి ప్రయాణిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్నవారు, క్రింది Dimension  లో ఉన్నవారిని చూడగలరు, వారి మాటలు వినగలరు. అందుకే జీవుడు (ఆత్మ) మరణానంతరం ఈ 4-D లోకి ప్రవేశించినా, అది ఎరుగక, తన వారి కోసం ఏడుస్తుంది. వారికి ఏదేదో చెబుతుంది. కానీ వినేవారు ఉండరు. ఆ తర్వాత క్రమంగా ఇది పాపపుణ్యాలను బట్టి నరకానికి లేదా స్వర్గానికి ప్రయాణిస్తుంది. సనాతన హిందూ ధర్మంలో మరణం తర్వాత చేసే అపరకర్మలన్నీ ఈ Dimension లో ఉన్న జీవుడిని ఉద్దేశించి చేసేవే. కానీ ఇంతకముందు చెప్పుకున్నట్లు, విశ్వంలో అన్నీ పరస్పరం అల్లుకుని ఉన్న కారణం చేత, ఇక్కడ (3-D) చదివే వేదమంత్రాల శక్తి వలన ఆ జీవుడికి మార్గం దొరికి అది ఉన్నత లోకాలకు పయనిస్తుంది.

5-D Possible Worlds: మనకన్నా కొంత విభిన్నమైన ప్రపంచం. ఈ 5-D నుంచి చూసినప్పుడు, మనకంటే భిన్నమైన లోకాలను చూసే అవకాశం ఉంటుంది. వాటికి మనలోకానికి మధ్య ఉండే సామ్యాలను, వ్యత్యాసాలను గుర్తించే అవకాశం కలుగుతుంది. అక్కడి కాలం ఇక్కడి కాలానికి భిన్నంగా నడుస్తూ ఉండవచ్చు. అక్కడి కాలగతి (కాలం యొక్క వేగం) దీనికంటే తక్కువ ఉండవచ్చు. వారు మనకంటే ముందు నుంచి జీవిస్తూ ఉండవచ్చని క్వాంటం సిద్ధాంతం చెబుతుంది. అంటే యమలోకం, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన ఊర్ధ్వలోకవాసుల నివాసాలు ఇక్కడే ఉండి ఉండవచ్చు. అందుకే పితృదేవతల కాలానికి, దేవతల కాలానికి, మనుష్యుల కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే మానవ లోకంలో 30 రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల 1 సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం. (వీటి గురించి గతభాగాల్లో చెప్పడం జరిగింది).

6-D A Plane of All Possible Worlds With the Same Start Conditions; విభిన్నమైన విశ్వాలు (లోకాలు) అన్నీ ఒకే సమతలం (Plane) లో ఒకే సమయానికి ప్రారంభం అవ్వడం (బిగ్ బాంగ్ లాంటిది) ఇక్కడి నుంచి చూడవచ్చు. ఎవరైతే ఈ 5-D మరియు 6-D మీద పట్టు సాధిస్తారో, వారు కాలంలో ముందుకు, లేదా వెనక్కు వెళ్ళగలరు. కాలంలో వెనక్కు ప్రయాణించి గతంలోకి వెళ్ళగరు, అలాగే ముందుకు ప్రయాణించి, భవిష్యత్తును దర్శించగలరు.

దేవలోకం అనగా స్వర్గం మొదలైనవి ఇతర లోకాల స్థానం ఇదే కావచ్చు. అందుకే దేవతలు తమ దివ్యదృష్టితో గతాన్ని, భవిష్యత్తును దర్శించగలరని ధర్మం చెబుతుంది. మానవలోకంలో నివసిస్తూనే, మన మధ్య ఉంటూనే, సాధన ద్వారా సిద్ధి పొందిన యోగులు ఈ పరిణామాన్ని చూడగలరు. అందుకే వారు కూడా పితృదేవతలను, దేవతలను చూడగలరు. వ్యక్తిని చూసి, అతడి గత జన్మ, రాబోవు జన్మలు చెప్పగలరు. అంటే సనాతనధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక సాధన వ్యక్తిని భౌతికమైన 3-D ప్రపంచం నుంచి ఇంకా పై స్థాయికి తీసుకువెళుతునందని స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ...............

12, ఆగస్టు 2017, శనివారం

స్వామి శివానంద సూక్తిWhenever desires crop in your mind, do not try to fulfil them. Reject them through discrimination, right enquiry and dispassion. You will get tranquillity of mind and mental strength by constant practice. The mind is thinned out. The mind is checked directly from wandering. Its outgoing tendencies are curbed. If the desires are eradicated, the thoughts also will die by themselves. The mind is detached from the manifold sense-objects by continually observing their defects and is fixed on Brahman.

- Swami Sivananda

భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? - డా.సుబ్రమణియన్ స్వామి సమాధానం

నిజమైన భారత దేశ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక దేశ భక్తుడి బాధ్యత !

నేను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నపుడు ఒక సౌదీ అరేబియా విద్యార్ధి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? " నేను అన్నాను "నువ్వు అడగదలుచుకున్నది ఏమిటి?"

ఆ విద్యార్ధి ఈ విధంగా చెప్పాడు: "రియాద్ లో మా విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను. ఉదా: ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ (మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది, 21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది. కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది. కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు?"  

నా సమాధానం: మన దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో మనం ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు. అందుకే ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మం మిలిగి ఉంది.

-సుబ్రమణియన్ స్వామి


నిర్విరామంగా మన పూర్వీకులు దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎంతో దారుణమైన, కష్టమైన పరిస్థితులను ఎదురుకుని నిలిచారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఎవరి కోసం? ....... అందుకే మనం ఇవాళ హిందువులుగా జన్మించగలిగాము అంటే అది వారి బిక్షయే..... ఇంత గొప్ప సంస్కృతికి వారసులము కాగలిగాము. వాళ్ళ శ్రమ, త్యాగాలు వృధా కాకూడదు. ఈ ధర్మాన్ని రక్షించి, మన తర్వాతి తరాలకు అందించడం మినహా మరే ఇతర విధంగానూ మనం వారి ఋణం తీర్చుకోలేము. ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ మన తక్షణ కర్తవ్యాలు. అవే మన తాతముత్తాలకు, పితృదేవతలకు ఇచ్చే పెద్ద గౌరవం.

11, ఆగస్టు 2017, శుక్రవారం

యోగ లక్ష్యం- స్వామి సచ్చిదానంద సూక్తిThe Aim of Yoga

If your friends laugh at you and say, ‘With Yoga you are just running away from the world; you are not going to enjoy anything,’ tell them, ‘We are the people who are going to enjoy it best because we are working to bring everything under our control. We don’t want to be controlled by anything. We want to be masters of our tongues and our eyes. We won’t be slaves to our desires.’ This is the aim of Yoga.

- Swami Satchidananda

10, ఆగస్టు 2017, గురువారం

స్వామి రామతీర్థ సూక్తిThe very best method of spreading the vedantic philosophy is to live it.

- Swami Rama Tirtha

11-08-2017, శుక్రవారం, శ్రావణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ11-08-2017, శుక్రవారం, శ్రావణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
దీనికి హేరంబ సంకష్టహర చతుర్థి అని పేరు. కష్టాలను తీర్చేవాడు, ఎవ్వరూ లేరు అనుకున్న వారికి నేను తోడున్నాను అని చెప్పేవాడు హేరంబుడు.

శ్రావణమాసంలో వచ్చే సంకష్టహర చవితి చాలా విశేషమైనదని ముద్గల పురాణం చెబుతోంది. ఈ రోజున గణపతిని గరికతో అర్చించి, ఆయన పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా గణపతి ఆలయాన్ని సందర్శించండి.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

11 ఆగష్టు 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.23 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

8, ఆగస్టు 2017, మంగళవారం

6, ఆగస్టు 2017, ఆదివారం

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి


హిందూ ధర్మం - 248 (14 లోకాలు)

ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్దాలను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.

ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ఏసు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది.  దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 

అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ........

5, ఆగస్టు 2017, శనివారం

స్వామి శివానంద సూక్తిThe subtle impressions, tendencies, desires and passions lying in the depths of the subconscious have a tremendous effect on your conscious life. They should be purified and sublimated. They must be given a spiritual turn. Hear what is auspicious. Behold what is auspicious. Think what is auspicious. Talk what is auspicious. Meditate what is auspicious. Understand what is auspicious. Know what is auspicious.

- Swami Sivananda

2, ఆగస్టు 2017, బుధవారం

రామకృష్ణ పరమహంస సూక్తిOne should keep pictures of holy men in one's room. That constantly quickens divine ideas............It is true that one's spiritual feelings are awakened by looking at the picture of a sādhu. It is like being reminded of the custard-apple by looking at an imitation one.............. Therefore I tell you that you should constantly live in the company of holy men.

- Sri Ramakrishna Paramahamsa

30, జులై 2017, ఆదివారం

తులసీ దాస్ సూక్తిThere is no difference between knowledge and devotion, Both of them save the soul from the miseries of worldly life.

- Tulasi Das

తులసీ దాస్ జయంతిశ్రావణమాసం శుక్లపక్ష సప్తమి నాడు తులసీ దాస్ జయంతి జరుపుతారు. రామభక్తుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు శ్రీ తులసీ దాస్ గారు. శ్రీ రామాయాణ కావ్యాన్ని తనదైన శైలిలో శ్రీ రామచరిత మానస్ గా రచించారు తులసీ దాస్ గారు. మనమంతా చదివే హనుమాన్ చాలీసాను రచించింది కూడా వీరే. వీరు కలియుగవాల్మీకి అని భవిష్యోత్తరపురాణం చెబుతోంది. వారి జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

వీరికి చిన్న వయసులోనే వివాహం జరిగింది. వివాహానంతరం 15 ఏళ్ళకు రత్నావళి బదరిలోని తన సోదరుల ఇంటికి రక్షాబంధనం కోసం వెళ్ళవలసి వచ్చింది. తులసీదాసు కూడా తొమ్మిది రోజుల పాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, తన భార్య కనిపించక తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యారు. వరదల్లో ఉన్న గంగానదిని ఈది అతికష్టం మీద అతడు అర్ధరాత్రికి తన మామగారి ఇల్లు చేరుకున్నాడు. అటువంటి అసాధారణ సమయంలో భర్తను కలుసుకున్నందుకు దిగ్భ్రాంతి చెందిన రత్నావళి తన భర్తను వరద నీటిని ఏ విధంగా దాటగలిగారని అడిగింది. తనపై అతనికి గల తీవ్ర ప్రేమ గురించి తెలుసుకున్న రత్నావళీ ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. ఆలాగే కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఉంటే, ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు అది సహాయ పడుతుంది." అంది. ఈ మాటలు విన్న తులసీదాసు మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్యప్రేమగా రూపాంతరం చెందింది. అతడు తక్షణమే బదరీనీ, సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు. తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాతా చాలాప్రాంతాలు తిరిగి చివరకు కాశీ చేరుకున్నారు.

కాశీలో వారు నిత్యం రామకథ చెప్పేవారు. ఆ రామకథను వినడానికి హనుమ్నతులవారు వచ్చేవారు. ఆ విషయాన్ని అక్కడికి దగ్గర్లోనే ఉన్న పెద్ద చెట్టుపై నివసించే ఒక బ్రహ్మరాక్షసుడి ద్వారా తెలుసుకున్నారు. నిజానికి తను అనుష్ఠానం చేసుకున్న తర్వాత నీటిని ఆ చెట్టులో పోయడం వలన బ్రహ్మరాక్షసునికి  శాపవిమోచనం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఆయన హనుమంతులవారి గురించి చెప్పి, ఆయన పాదాలను పట్టుకోమని చెప్తాడు..... చివరకు ఎంతో శ్రమతో హనుమంతులవారిని ప్రసన్నం చేసుకుని, సాక్షాత్తు వారి నుంచే శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశం పొంది చిత్రకూటంలో సాధన చేస్తారు. ఒకానొక రోజు రామలక్ష్మణులు తనకు దర్శనమివ్వడానికి వస్తున్నారని హనుమంతుడి ద్వారా తెలుసుకున్న తులసీదాసు దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. అయితే రామలక్ష్మణులు వారి రూపాల్లో కాక, ఒకసారి ఆకలితో ఉన్న కుక్కలుగా, ఒకసారి పిల్లలుగా, ఇలా మొత్తం 3 వేర్వేరు రూపాల్లో వస్తారు. అయితే తులసీదాసు వారిని గుర్తించరు. ఆ తర్వాత హనుమంతులవారి సహాయంతో ఈ విషయం తెలుసుకుంటారు. అంటే ఎంత భక్తుడైనా, భగవనతుని అన్ని రూపాల్లో చూడటం అలవర్చుకోవాలి. కేఅవలం ఒక రూపమే ఆయనదని నిర్ధారించకూడదు. నిత్యం మనవద్దకు దైవం ఎన్నో రూపాల్లో వస్తుంది, సహాయం చేతుంది, కొన్నిసార్లు అర్ధిస్తుంది, సర్వజీవుల్లోను, ప్రకృతిలోను ఆయన్ను దర్శించడం నేర్చుకోవాలి. అదే మనకు ఇక్కడ కనిపిస్తుంది..... చివరకు వారికి రామచంద్రులవారి దర్శనం కలుగుతుంది. తులసీదాసు గారు తమ జీవితంలో భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి దర్శనం కూడా పొందారు.

తులసీదాసు గారు కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాలేదు. వారు దేశభక్తుడైన మహారాణా ప్రతాప్ గారికి గురువు. మహారాణా ప్రతాప్ కు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే, దేశరక్షణ, ధర్మరక్షణ దిశగా వారిని ప్రేరేపించి, లోకానికి గొప్ప వీరుడిని అందించారు. దేశంలో రామరాజ్యం ఏర్పడాలని తహతహలాడారు.

అలంటి మహాత్ముడిని మనం నిత్యం స్మరించాలి. వారి జీవితం నుంచి ప్రేరణ పొందాలి. 

హిందూ ధర్మం - 247 (అమెరికా = పాతాళ లోకం ??)

అయితే మహాభారతంలోని కొన్ని విషయాలను అనుసరించి కూడా అమెరికానే కొన్ని ఇతిహాసాల్లో పాతాళలోకంగా చెప్పారని మనం భావన చేయవచ్చు.

మయసభ నిర్మాణం గురించి మనకు తెలిసిందే. దాన్ని నిర్మించినవాడు మయాసురుడు. అతనే మయా/ మయాన్ నాగరికతకు ఆద్యుడని చెబుతారు. (ఆ వివరాలను మానం చాలా కాలం క్రితం వివరించుకున్నాము కూడా). ఈ మయా నాగరికత మధ్య అమెరికాలో వర్ధిల్లింది. వారికి మనకు లాగే వాస్తు శాస్త్రం ఉంది. నిజానికి మయుడు మనకు వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఒకసారి వి.గణపతి స్థపతి గారు దక్షిణ అమెరికా ఖండం పెరు దేశంలోని ఆండెస్ పర్వతాల్లో ఉన్న మచు పిచ్చు అనే పురాతన నాగరికత అవశేషాలను, ఇంకాస్, మయా నాగరికతలను పరిశీలించడానికి వెళ్ళారు. శిల్పకళ, నగరనిర్మాణం, వాస్తు శాస్త్రం మీద మనదేశంలో మయమతం అనే ప్రామాణిక గ్రంథం లభ్యమవుతుంది, అది మయుడు రాసిన గ్రంథం. అందులో 8/ 8 చతురస్రాలతో 64 ప్రమాణములతో (Units) ఉంటుంది వాస్తుపురుష మండలం. అక్కడ వారు గమనించింది కూడా అదే. అక్కడున్న నిర్మాణాలన్నీ ఆ వాస్తుపురుష మండలాన్ని కలిగి ఉన్నాయి. వారు అక్కడి ఇంకాస్ నాగరికతకు చెందిన పురాతన ఆవాసానికి ఉన్న గోడను పరిశీలించి, దాని మందం ఒక కిష్కు హస్తం ఉంది (అనగా 33 ఇంచులు). దక్షిణ భారతదేశంలో మయుడి వాస్తు శాస్త్రం ఆధార నిర్మాణాల్లో ఉండే ప్రమాణం (Standard) అది..... అక్కడి గైడ్, స్థపతితో ఇవి ఇక్కడ ఎలా నిర్మించారో తెలియదు, రాళ్ళను ఎలా మోసుకొచ్చారో తెలియదు అనగా, వారు పర్శీలించి, ఇదేమి తమకు కొత్త కాదని, భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించే నిర్మాణాలకు భారీ శిలలను ఎలా తరలిస్తారో, అలానే వీటిని తరలించారని, అందుకు ఉదాహరన వాటిపై ఉన్న గుర్తులే నిదర్శనమని చెప్పారు.  

అర్జునుడు పాతాళలోకానికి చెందిన నాగ కన్య అయిన ఉలూపిని వివాహం చేసుకుంటాడు. ఆమె అమెరికా ఖండానికి చెందిన యువరాణి. ఇది మెక్సికోలోని అక్కడి కథల్లో కనిపిస్తుంది. వారు అర్జునిడిని చిలి పెప్పర్ మ్యాన్ గా చెప్పుకుంటారు. ఈ చిలి పెప్పర్ మ్యాన్ యుద్ధ విజేత మరియు 'తుల' అనే మహారాజు అల్లుడు అని వారు చెబుతారు.

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు (sorcism ) నమ్ముతారు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది) .

కలియుగం మనకు సా.శ.పూ.3102 లో మొదలైంది, అప్పటి నుంచి కలియుగ కాలమానం లెక్కిస్తున్నాము. మయా నాగరికతలో వారి క్యాలెండర్ సా.శ.పూ.3114 లో మొదలైంది. మన పంచాంగానికి, క్యాలెండర్ కు చాలా పోలికలు ఉన్నాయి.  మయా స్త్రీలు భారతీయ స్త్రీల మాదిరిగానే ఎడమముక్కు రంధ్రానికి ముక్కుపుడుక పెట్టుకుంటారు. వారి వద్ద కూడా మనకులాగే జ్యోతిష్యం, దూరశ్రవణం (telepathy) వంటి విద్యలు ఉన్నాయి. మయన్లు కూడా హిందువుల వలే దేవతల ముందు ఆహారం నివేదన చేసి అప్పుడు ఆరగిస్తారు. ఆహారంలో కూడా మనకు వారికి ఎన్నో పోలికలున్నాయి. హిందువుల వలె మెక్సికన్లు కూడా ప్రాథమికంగా శాఖాహారులు.

సూర్య సిద్దాంతాన్ని చదివితే, లాటిన్ అమెరికా ప్రాంతం పాతాళదేశమని అర్దమవుతుంది. అందులో 12 వ అధ్యాయంలో - దేవతలు అసురులు ఈ భూమి మీదే ఉంటారు. దేవతలు ఉత్తరార్ధగోళంలో, అసురులు దక్షిణార్ధగోళంలో నివసిస్తారు. ధృవాల చుట్టూ ఉన్న సముద్రం ఈ భూమిని రెండు పెద్ద ఖండాలుగా విభజించింది. దేవతల ఖండము, అసురల ఖండము (ఇప్పుడు మనం చూస్తే, ఆసియా, యూరోపు, అఫ్రికా భూభాగల మధ్య సముద్రం లేదు, అమెరిక (ఉత్తర, దక్షిణ) ఖండాన్ని మాత్రమే మిగితా ఖండల నుంచి సముద్రం వేరు చేసింది. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో అంటే మేషరాశిలో ఉన్నప్పుడు మొదట దేవతలకు, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు అసురులకు మొదట కనిపిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖ దగ్గరున్నప్పుడు, సురలు, అసురులు పగలురాత్రుళ్ళను సమానంగా అనుభవిస్తారు. సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు పయనించగా, దేవతలు గ్రీష్మ ఋతువును చూస్తారు. అప్పుడు అసురులకు పెద్దగా సూర్యకిరణాల వేడిమి ఉండదు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కనుక. అప్పుడు వారికి చలికాలం ఉంటుంది - ఇది గమనిస్తే పాతాళం దక్షిణ అమెరికా ఖండమని అర్దమవుతుంది. 
అయితే పాతాళంలో ఉండేవారంతా దుష్టులని ఎక్కడా చెప్పబడలేదు. అది మనం ఏర్పర్చుకున్న దురభిప్రాయం మాత్రమే. విభీషణుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైనవారంతా కూడా రాక్షసులే. కానీ మంచివారు. రక్షణ కోసం బ్రహ్మవారిని సృష్టించాడు కనుక రాక్షసులను పేరు వచ్చింది. ఆ తర్వాతా వారు నివసించడానికి కొంత స్థలం కూడా బ్రహ్మదేవుడే ఇచ్చాడు. కానీ రక్షణ మరిచి, కొందరు దురాశతో దేవతలపై యుద్ధం చేయడంతో వారిని పరమాత్ముడు సంహరించాడు. అంతేకానీ ప్రతి రాక్షసుడు చెడ్డవాడు కాదు.

పితృలోకం దక్షిణంలో ఉందని చెప్తారు, మీరు గనక భూమికి ఆగ్నేయమూలకు వెళితే, అక్కడ అనేక నాగశిలలను ప్రతిష్టించి జనులు పూజిస్తుంటారు అంటారు పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారు. నాగదేవతలకు పితృదేవతలకు సంకేతం. నాగుల గురించి మన సంస్కృతి చాలా చెప్పింది. వారిని నదులు, చెరువులకు రక్షకులుగా చెప్పింది. మలయేషియా కథల్లో నాగులను భారీ ఆకారంలో చూపుతారు. జావా, థాయిలాండ్ దేశాల్లో నాగులను దేవతలుగా, భూమికి క్రింద ఉండే లోకల వాసులుగా, సంపదలకు అధిపతులుగా భావిస్తారు. థాయిలాండ్ లో మన ఆదీశేషుని పోలిన ఐదుతలల నాగదేవత కూడా ఉంది. మెక్సికో లో నాగాల్ (Nagal) అనే పదం ఉంది. అది రక్షకులుగా ఉండే కొన్ని నాగదేవతల గురించి చెబుతుంది. కాంబోడియా రాజ్యాన్ని నాగులే స్థాపించాయని అక్కడి జనుల విశ్వాసం. 

ఇలా మన పురాణాల్లో చెప్పిన వివిధ లోకాలు ఈ భూమ్మీదే దర్శించడం ఒక కోణం మాత్రమే. ఇంతకముందు చెప్పిన విషయాలు, ఇక ముందు చెప్పబోయే విషయాలను సమన్వయం చేసుకుంటే, ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. 

To be continued .........
ఇందులో కొంతభాగం Kiran Mva గారి రచన నుంచి సేకరణ

29, జులై 2017, శనివారం

స్వామి శివానంద సూక్తిVictory over thoughts is really a victory over all limitations, weakness, ignorance and death. The inner war with the mind is more terrible than the outer war with the machine-guns. Conquest of thoughts is more difficult than the conquest of the world by the force of arms. Conquer your thoughts and you would conquer the world.

- Swami Sivananda

28, జులై 2017, శుక్రవారం

స్వామి సచ్చిదానంద సూక్తిOvercoming Health Issues

You must never give up. You can face any situation and overcome it with hope, courage, faith, and fearlessness. Resolve that: I am the master of the creation and I will be the master of the destruction. I am not afraid of disease. I am not going to be frightened of this anymore, because I created the problem and I can undo the problem. Believe that you can draw healing energy from the divine by clean living. Resolve: I have total faith in a higher will—a higher energy. By my clean habits, I will be able to tune into that and receive all the strength and energy to recharge my system.

- Swami Satchidananda

25, జులై 2017, మంగళవారం

23, జులై 2017, ఆదివారం

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తిరమణ మహర్షి మార్గంలో సాధన చేసేవారికి ఇది త్వరగా అర్దమవుతుంది. ఇది సూటియైన మార్గం (Direct Path).

The struggle for deconditioning oneself has occupied as an intensive activity of the soul. This struggle itself is conditioning.

- Satguru Sivananda Murthy Garu

22, జులై 2017, శనివారం

స్వామి శివానంద సూక్తిControl the thoughts or Sankalpas. Avoid imagination or day-dreaming. The mind will be annihilated. Extinction of Sankalpas alone is Moksha or release. The mind is destroyed when there is no imagination.

- Swami Sivananda

పితృదేవతల కోసం మొక్కలు నాటండిఇదేంటి ఇలా అంటున్నాడు అనుకోకండి. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించినవారికి అవి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. (ఒకసారి గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు ఈ విషయాన్ని చెప్పారు.)

సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. మనం వంశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ వానాకాలం వెళ్ళిపోకముందే కొన్ని మొక్కలు నాటండి. 

20, జులై 2017, గురువారం

భగవద్రామానుజుల సూక్తిIt is not enough to control your sensual desires, you must surrender to the Lord.

- Sri Ramanujacharya

షేర్ చేయకపోతే ఏమవుతుంది?ఒకప్పుడు కొందరు దేవుడి పేరు కరపత్రాలు (Pamphlets) పంచి, ఇది చదివిన వారు ఇలాంటివే ఇంకో 10 లేదా 100 కరపత్రాలు పంచిపెట్టాలి అని రాసి పంచిపెట్టేవారు. అది ఒక రకమైన emotional blackmail . ఇప్పుడది ఫేస్‌బుక్‌లో కూడా దాపురించింది. ఈ ఫోటొ చూసిన 3/5/7 సెకెన్లలో షేర్ చేయండి, లేదా ఈ ఫోటో చూసినవారు ఆ దైవం పేరును కామెంట్ బాక్సులో రాయండి, చూసినవెంటనే లైక్ చేయండి, శుభం జరుగుతుంది అంటూ చాలా కనిపిస్తుంటాయి. కొందరైతే ఇవి ఫలానా దైవానికి చెందిన 13 నామాలు, మీరు చదివి ఇంకో 13 మందికి పంపితే మీకు రేపటికల్లా శుభం జరుగుతుంది, లేదంటే దరిద్రం పట్టుకుంటుందని రాసి మెసెజ్స్ పంపుతారు. అది చూసి, కొందరేమో భయంతో షేర్‌లు చేయడం, కామెంట్స్ రాయడం చేస్తారు. పైగా వాట్సాప్‌లో కూడా అవే సందేశాలు. ఇదంతా ఒక emotional blackmail. మనోభావాలతో ఆడుకోవడమే.

ఇంకో రకం కూడా ఉంది. తిరుమల గుడిలో స్వామి వీడియో రహస్యంగా చిత్రించారు. ఇది అందరికీ షేర్ చేసి, స్వామి దర్శన భాగ్యం కలిగించండి అంటూ రాస్తారు. అది నిజమో, అబద్దమో ......... ఒక్క తిరుమలే కాదు. ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు. ఎక్కడో ఏదో గుడికి వెళ్ళడం, అక్కడ సిబ్బంది కళ్ళుగప్పి కెమెరా తీసుకెళ్ళి అక్కడి విశేషాలను రహస్యంగా చిత్రించడం, అది మనమంతా షేర్ చేయడం. ఇందులో తప్పేముంది అనకండి. ప్రతి ఆలయానికి ఆగమం ఉంటుంది. దానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. ఆగమం అనేది ఆయా దేవతలే చెప్పిన విధిపూర్వక నియమావళి. మీరొక ఆలయానికి వెళితే, తప్పకుండా అక్కడి నియమాలను పాటించాలి. కొన్ని ఆలయాల్లో మూలమూర్తులను, ఇతర మూర్తులను చిత్రించే అవకాశం ఉంటుంది. కొన్నిట్లో ఉండదు. మనం అక్కడి నియమాలను తప్పకుండా పాటించాలి. నేనే వీరభక్తుడిని అనుకుని, పదిమందికి చూపితే ఏమవుతుందని ప్రశ్నించడం కాదు. నిజంగా అంత భక్తి ఉంటే, అక్కడి నియమాలకు బద్ధుడవ్వాలి. భక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు, అహం వున్నప్పుడు వస్తాయి.

షేర్ చేసేవారు కూడా కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఒక ఆలయ ఆగామన్ని మీరడం పాపం. అలా చేసి ఎవరైనా, ఏదైనా చేస్తే మనం దాన్ని ఖండించాలే కానీ ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే మనకూ అదే పాపం వస్తుంది. అది కర్మసిద్దాంతం. రెండవది, ఫోటోలు షేర్ చేస్తేనో, కామెంట్‌లు రాస్తేనో శుభం చేయడానికి, చేయకపోతే శపించడానికి దేవుడేమీ శాడిస్టు కాడు, భక్తి మనస్సులో ఉండాలి. నచ్చిన విషయాన్ని షేర్ చేయడంలో తప్పేమీ లేదు, కానీ బలవంతంగా చేయడమెందుకు? పైగా ఇలా చేస్తే మేలు చేస్తానని భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా? ఏ శాస్త్రంలో చెప్పడానికి అలాంటి ఫోటోలు, వీడియో పెట్టినవాడిని అడగండి. చూసిన వెంటనే షేర్ చేయండి అంటాడు, నేను చేయను. అప్పుడేమీ అవుతుంది, ఏమీ కాదు. వాడు పెట్టిన పోస్ట్ మహా అయితే వృధా అవుతుంది. అంతే.

నిజానికి భగవంతుడు పరమకారుణ్యమూర్తి. చూస్తే షేర్ చేయండి లాంటి దిక్కుమాలిన సందేశాలు ప్రోత్సహించి ఆయన్ను మనమే శాడిస్టులా భావిస్తున్నాము. శుభాశుభాలు మీ కర్మను అనుసరించి ఉంటాయి. భగవంతుని యందు అపారమైన భక్తి, విశ్వాసాలుంటే ఆయన అనుగ్రహం చాలా సులభంగా దక్కుతుంది. దైవత్వం గురించి తెలియనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి.

19, జులై 2017, బుధవారం

భీష్ముని సూక్తిWhat the Veda is, is dharma; What dharma is, is the right path.

- Bhishma Pitamaha

మంగళ్ పాండే గురించి చిన్న కథమంగళ్ పాండే- ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. 1857 లో తొలి స్వాంతంత్ర సంగ్రామంలో (అది కేవలం తిరిగుబాటు కాదని రాజీవ్ దీక్షిత్ వివరించారు) కీలకపాత్ర పోషించిన వ్యక్తి. వీరు 19 జూలై 1827 లో నగ్వా గ్రామం, ఎక్కువ బల్లియా జిల్లా, అవధ్ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పేదరికమే వారిని బ్రిటీష్ సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది. అయితే వారి జీవితాన్ని మలుపు తప్పిన ఒక సంఘటన గురించి నేను చిన్నప్పుడు చదివాను. అది -

ఒకనాడు బ్రిటీష్ రైఫిల్స్‌లో మండుగుండు పెట్టి, వాటిని ఉపయోగించడానికి ఆవు మాంసపు కొవ్వు, పంది మాంసపుకొవ్వు ఉపయోగించేవారు. ఆ కొవ్వును సైనికులు నోటితో కొరకాల్సి ఉంటుంది...... ఒకసారి మంగళ్ పాండే ఒక గ్రామం ద్వారా వెళుతుండగా వారికి దాహం వేసింది. దగ్గరలో ఒక స్త్రీ బావిలో నీరు తోడుతుండటం చూసి, అక్కా! నాకు దాహంగా ఉంది, కాస్త నీరు ఇస్తావా అని అడిగారు. దానికి బదులుగా ఆ వనితా, తమ్ముడూ! నువ్వు బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్నావు. గోమాత మాంసపు కొవ్వును నీ నోటితో స్పృశిస్తావు. గోవు ఎంతో పవిత్రమైనది. నీకు నీరిస్తే, నీరు కూడా అపవిత్రమవుతుంది. క్షమించు తమ్ముడూ అని చెప్పిందట. అది మంగళ్ పాండే లో ఆలోచనను రగిలించింది. అదే క్రమంగా బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు కారణమయ్యింది.

1857 లో జరిగిన ఆ పోరాటం కారణంగా 300 పట్టణాలకు భారతీయులు స్వాతంత్రం సాధించగలిగారు. ఆ తిరుగుబాటులో ఆంగ్లేయుల తలలు నరికారు భారతీయ వీరులు. కానీ కొందరు రాజుల కుట్రల కారణంగా ఉచ్చు మరింత బిగిసి ఆంగ్లేయులు ఇంకో 90 ఏళ్ళ పాటు పాలించే అవకాశం దక్కిందని రాజీవ్ దీక్షిత్ తన ఉపన్యాసంలో చెప్పారు.

అటు తర్వాత 8 ఏప్రియల్ 1857 లో మంగళ్ పాండేను బ్రిటీష్ వారు ఊరిదీశారు. 

18, జులై 2017, మంగళవారం

కంచి పరమాచార్య సూక్తి


The world is a manifestation of the Paramatman and so must we be too. We must remove the mirror called the mind and experience the truth within us that we are none other than the Paramatman. This is what called meditation. All the work we do ought to lead finally to worklessness, to the mediation of the Atman. The goal of all the sacraments I speak about is this.

- Kanchi Paramacharya

మనం తక్షణమే చేయాల్సిన రెండు పనులు

ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది, భారతదేశ జనాభా 130 కోట్లకు చేరుకుందని అంచనా. భవిష్యత్తులో ఇంకా పెరగుతుంది. అయితే ఇప్పుడు మనం అతిముఖ్యంగా ఆలోచించాల్సింది అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం కాదు, ముందు తరాలకు సరిపడా వనరులను మనం మిగల్చడం, రెండవది చక్కని పర్యావరణాన్ని అందించడం.

వనరుల కొరత ఏర్పడితే అది తీవ్ర వైషమ్యాలకు కారణమవుతుంది. కొన్ని దేశాల్లో వనరుల కొరత సంఘర్షణకు దారితీసి రెండు దేశాల మధ్య శత్రుత్వానికి, తీవ్రవాదానికి కారణమైందని ఇంతకముందు వందనా శివా గారు చెప్పింది మీరంతా చదివారు. మన దేశంలో ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగునకు చేరాయి. కొన్ని సంవత్సరాలు గడిస్తే, పరిస్థితి తీవ్రమవుతుంది. అది ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విబేధాలకు, వైషమ్యాలకు దారితీసి దేశవిభజనకు దారి తీయవచ్చు, అలా కాకూడదని దైవాన్ని వేడుకుందాం. అయితే మనం చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్రభుత్వాలుగానే కాదు, పౌరులుగా కూడా.

ఒక ఏడాది వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు, 3 సంవత్సరాల అవసరాలకు సరిపోతుందని అంచనా. ఇప్పుడు వర్షం ద్వారా భూమిని చేరే ప్రతి నీటి చుక్కను మనం భూమిలోకి ఇంకించాలి. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగం విజయవంతమైంది, భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు రైతులు, ఇతరులు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రెండవది, నీరు ఎక్కడిక్కడ ఇంకితే, సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

అలాగే #మొక్కలు నాటాలి. భవిష్యత్తు తరాలకు పుష్కలంగా ప్రాణవాయువు ఉండాలి, భూమి చల్లబడాలి, జీవవైవిధ్యం రక్షించబడాలంటే మొక్కలను నాటి, అవి వృక్షాలుగా పెరిగే వరకు సంరక్షించాలి. మొక్కలు నేలకోతకు గురికాకుండా ఆపుతాయి. లోతున ఉన్న భూగర్భ జలాలను పైకి తీసుకువస్తాయి, మేఘాలను ఆహ్వానించి, చక్కని వర్షాలకు కారణమవుతాయి. పచ్చదనం లేకపోతే మెదడు చురకగా పనిచేయదు, కళ్ళ జబ్బులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ముందు మనం మర్చిపోతున్నది, వేసవికాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు మనం పడే వేదన. అది తర్వాతి తరాలకు ఉండకూడదంటే, తప్పకుండా మొక్కలు నాటాలి. మీకో విషయం తెలుసా? మనదేశంలో చింత, సీమచింత, సీతాఫలం, రేగి, నేరేడు, నాటు ఉసిరి వంటి మనం నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో ఉత్పత్తుల పంటసాగులేదు. అవి ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పంటలు. అడవుల నుంచి నేరుగా కోసుకచ్చి మనకు అమ్ముతారు. కానీ మనకా అవగాహన, ఆలోచన ఎక్కడుంది. చింతపండు తింటాము, రేగికాయలు తింటాము, మే, జూన్, జూలై నెలల్లో నేరేడు పళ్ళు తింటాము, కానీ ఆ విత్తనాలు మాత్రం ఖాళీ ప్రదేశాల్లో చల్లము. ఆయా రకాల మొక్కలు పెంచము. ఈ రోజు సరే! మరి భవిష్యత్తు మాటేమిటి? మన జనాభా భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, వినియోగం కూడా ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ ఉతపత్తులను ఎక్కడి నుంచి తీసుకువస్తాము? ఈలోపు ఉన్న ఆ కాస్త వృక్షాలు నరికితే, అడవులను నాశానం చేస్తే, రాబోయే తరాలకు అసలీ జాతులు పుస్తకాల్లో కూడా చదివే అవకాశం దక్కదు. కాబట్టి మనమే ఆలోచించి ముందుకు కదలాలి.

ఏవైతే మనకు నిత్యావసరమో ఆయా మొక్కలను ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. వాటి పక్కనే ఇంకుడు గుంతలు నాటాలి. ఈ రెండు జరగాలి. ఎందుకంటే మనం వనరులను వాడుకుంటున్నదుకు ప్రతిఫలంగా, లేదా కనీస కృతజ్ఞతగానైనా భూమాతకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి. కృతఘ్నో నాస్తి నిష్కృతిః అని రామాయాణ వాక్కు. కృతఘ్నులకు నిష్కృతి లేదు. దేశసమగ్రతకు భంగం కలగకూడంటే కూడా వనరుల కొరత ఉండకూడదు. అందుకోసమైనా ప్రతి పౌరుడు ఇవి తక్షణమే చేపట్టాలి. ఎందుకంటే Earth is a Temple. Not a dust bin. - ఈ పృధ్వీ దేవాలయం, చెత్తకుండీ కాదు. ఈ భూమి మీదనున్న సమస్తమూ భగవంతుని ప్రతిరూపాలే. ఇది నా మాట కాదు, ఈశావాస్యోపనిషత్తులో ఋషుల వాక్కు. వేదం యొక్క ఆదేశం, ఉపదేశం.

అమెరికా = పాతాళం గురించి మరికొంతఆదివారం మనం చెప్పుకున్న అమెరికా = పాతాళం అనే అంశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మరిచాను. అవి-

1. మనం భూమికి అవతలపై అన్నప్పుడు Anti-podes గురించి చెప్పుకోవడం లేదని గ్రహించాలి. కాలిఫోర్నియాకు దగ్గరలో హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్నాయి. ఆష్ అనేది ఆంగ్లపదం, దానికి అర్దం బూడద, భస్మం. హార్స్ అంటే గుఱ్ఱం. ఐల్యాండ్ అంటే ద్వీపం. సగరపుత్రులు భస్మం అయిన ప్రదేశమే ఆష్ ఐల్యాండ్ అని, గుఱ్ఱాన్ని కట్టేసిన ప్రదేశం హార్స్ ఐల్యాండ్ అని కంచి పరమాచార్య స్వామి వారు 1935 లో ఒక ప్రవచనంలో చెప్పారు. అసలు ఎప్పుడూ అమెరికా వెళ్ళని పరమాచార్య స్వామి వారు, అక్కడున్న ప్రాంతాలు, వాటికి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం గురించి చెప్పడం ఆశ్చర్యం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఆ హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్న ప్రాంతాలకు భూమికి ఇవతలవైపు గంగోత్రి హిమానీనదం ఉంది. భగీరథుడు తన పూర్వీకులైన సగరపుత్రుల బూడదకుప్పల మీద నుంచి గంగను పారించడానికి తపస్సు చేసి ఆకాశగంగను భూమికి తీసుకువస్తాడు. సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే ఈ ప్రాంతాలు ఉండటం, ఇక్కడి కథను సూచించే నామాలు కలిగి ఉండటం, అక్కడి స్థానిక సంస్కృతి నశించినా, ఆంగ్లంలో కూడా అవే పేర్లు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అద్భుతం కూడా.

అలాగే మహాబలినగరం (మలిపునగర్)కు దగ్గరలోనే ఒక విష్ణు ఆలయం నిర్మించారంటే అది ఆ ప్రాంతంలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నది. అక్కడ నిక్షిప్తమైన తరంగాలే ఆ విధమైన నిర్మాణానికి సంకల్పం కలిగించాయేమో!

2. దక్షిణ అమెరికా లో ఒకనాడు పూజించబడిన ఆ భారీ వానరమూర్తి కొన్ని మెట్లు కలిగి ఎత్తున పెద్ద సింహాసనంలో కూర్చుని ఉండేదట. ఆ ఆలయానికి ప్రారంభంలో ఒక వైపు కప్ప, ఇంకో వైపు మకరం (మొసలి) చెక్కి ఉన్నాయి. హనుమంతులవారి స్వేదం స్వీకరించిన ధీర్ఘదేహి అనే దేవలోక కన్య రూపమే ఆ మకరం కావచ్చు. అలాగే ఆ భారీవానరమూర్తి సింహాసనానికి అటు, ఇటు క్రిందవైపున దర్బార్ మాదిరిగా ఉండి, అనేక వానరాలు కొలువై ఉన్నట్లు అక్కడి పరిశోధకులు కనుగొన్నారు. అది ఆంజనేయస్వామి వారి పరివారం కావచ్చు, లేదా మకరధ్వజుడు/ మత్స్యవల్లభుడి విగ్రహం కావచ్చు. సరిగ్గా ఆ భారీ వానరమూర్తికి ఎదురుగా బలులు ఇచ్చే స్థానం ఉంది. హిందూ ఆలయాల్లో కూడా మూలావిరాట్టుగా ఎదురుగా ధ్వజస్థంభం ముందు బలిపీఠం ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన అంశం.

1933 లో Honduras ప్రెసిడెంట్ Tiburcio Carías ఇక్కడ అన్వేషణ కోసం స్పాన్సర్ చేశారు. అక్కడి స్థానిక జాతులవారి జీవితం చెదిరిపోకముందే అక్కడ పరిశోధన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. Museum of the American Indian సంస్థాపకుడు George Gustav Heye తో అక్కడ పరీశీలన చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అన్వేషకుడు R. Stuart Murray దీన్ని ముందుకు నడిపించారు. అయితే ఆయన కొన్ని పురాతన అవశేషాలతో పాటు 'దట్టమైన అడవిచేత కప్పబడి ఉన్న పెద్ద శిథిలాలు' అనే వదంతులను ఆయన వారికి తెలియజేశారు. అక్కడే బహుసా శిథిలైన నగరం ఉండేది, దాన్నే ఇండియన్స్ (స్థానిక జాతులు) City of the Monkey God గా పిలుస్తారు... వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళినవారు ఒక నెలలోపు విషసర్పం యొక్క కాటు చేత మరణిస్తారని వారు నమ్ముతారు' అని నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం 1934 లో జరిగినా, దాన్ని అన్వేషించలేకపోయారు. అలా అక్కడ శిథిలాలను కొనుగొనాలనుకున్న అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఒకటి రెండు రోజుల్లో ఇది దానికి జత చేసి, ఈ పోస్ట్ తీసేస్తాను.

17, జులై 2017, సోమవారం

వి.వి.శ్రీధర్ గురూజీ సూక్తిHE....I AM A DISCIPLE OF 'SO AND SO'....
ME....HAS HE ACCEPTED YOU AS A DISCIPLE?....
HE...ITS IMPOSSIBLE TO SEE HIM....
ME...THEN YOU CANT BE HIS DISCIPLE....IF HE IS YOUR MASTER AND HE HAS ACCEPTED YOU AS HIS DISCIPLE, THERE IS ALWAYS A HOT LINE BETWEEN THE MASTER AND DISCIPLE....YES YOU MAY NOT SEE HIM....BUT HIS GRACE WILL MAKE YOU VISUALISE HIM AND BE IN COMMUNICATION WITH HIM.... THIS CLEARLY SHOWS YOU CLAIM TO BE HIS DISCIPLE, BUT HE HAS NOT HONOURED YOU WITH THAT TITLE....JUST BY MERELY BOASTING THAT YOU ARE THE DISCIPLE OF 'SO AND SO' WILL NOT HONOUR YOU THE TITLE OF A 'DISCIPLE' UNLESS YOUR MASTER HAS ACCEPTED YOU SO....

- V V Sridhar Guruji 

16, జులై 2017, ఆదివారం

సద్గురు శివానంద మూర్తి గారు


Desire per se is neither good nor bad. There are desires that bind and there are desires that release you. So, it is desirable to entertain desirable desires!

- Sadguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 246 (అమెరికా = పాతాళ లోకం ??)14 లోకాలను మానసిక స్థితుల ఆధారంగా శరీరంలో ఎలా దర్శించవచ్చో చూశాం, ఇప్పుడు ఈ భూమి మీద ఇతర లోకాలు ఉన్నాయనే విషయం కూడా మన ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే ఒకే అంశాన్ని వేర్వేరు కోణాల్లో అనేక విధాలుగా దర్శించడం సనాతన ధర్మంలో కనిపించే గొప్ప లక్షణం. 

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. మనం భూమికి అవతలవైపు అన్నప్పుడు Anti-podes గురించి చెప్పుకోవడం లేదని గ్రహించాలి. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్నాయి. ఆష్ అనేది ఆంగ్లపదం, దానికి అర్దం బూడద, భస్మం. హార్స్ అంటే గుఱ్ఱం. ఐల్యాండ్ అంటే ద్వీపం. సగరపుత్రులు భస్మం అయిన ప్రదేశమే ఆష్ ఐల్యాండ్ అని, గుఱ్ఱాన్ని కట్టేసిన ప్రదేశం హార్స్ ఐల్యాండ్ అని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు. అసలు ఎప్పుడూ అమెరికా వెళ్ళని పరమాచార్య స్వామి వారు, అక్కడున్న ప్రాంతాలు, వాటికి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం గురించి చెప్పడం ఆశ్చర్యం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఆ హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్న ప్రాంతాలకు భూమికి ఇవతలవైపు గంగోత్రి హిమానీనదం ఉంది. ఈ రెండు ప్రదేశాలు (ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్) కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. భగీరథుడు తన పూర్వీకులైన సగరపుత్రుల బూడదకుప్పల మీద నుంచి గంగను పారించడానికి తపస్సు చేసి ఆకాశగంగను భూమికి తీసుకువస్తాడు. సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే ఈ ప్రాంతాలు ఉండటం, ఇక్కడి కథను సూచించే నామాలు కలిగి ఉండటం, అక్కడి స్థానిక సంస్కృతి నశించినా, ఆంగ్లంలో కూడా అవే పేర్లు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అద్భుతం కూడా.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు. అలాగే మహాబలినగరం (మలిపునగర్)కు దగ్గరలోనే ఒక విష్ణు (వేంకటేశ్వర) ఆలయం నిర్మించారంటే అది ఆ ప్రాంతంలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నది. అక్కడ నిక్షిప్తమైన తరంగాలే ఆ విధమైన నిర్మాణానికి సంకల్పం కలిగించాయేమో! 

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.

ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు. 

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ]  నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు. దక్షిణ అమెరికా లో ఒకనాడు పూజించబడిన ఆ భారీ వానరమూర్తి కొన్ని మెట్లు కలిగి ఎత్తున పెద్ద సింహాసనంలో కూర్చుని ఉండేదట. ఆ ఆలయానికి ప్రారంభంలో ఒక వైపు కప్ప, ఇంకో వైపు మకరం (మొసలి) చెక్కి ఉన్నాయి. హనుమంతులవారి స్వేదం స్వీకరించిన ధీర్ఘదేహి అనే దేవలోక కన్య రూపమే ఆ మకరం కావచ్చు. అలాగే ఆ భారీవానరమూర్తి సింహాసనానికి అటు, ఇటు క్రిందవైపున దర్బార్ మాదిరిగా ఉండి, అనేక వానరాలు కొలువై ఉన్నట్లు అక్కడి పరిశోధకులు కనుగొన్నారు. అది ఆంజనేయస్వామి వారి పరివారం కావచ్చు, లేదా మకరధ్వజుడు/ మత్స్యవల్లభుడి విగ్రహం కావచ్చు. సరిగ్గా ఆ భారీ వానరమూర్తికి ఎదురుగా బలులు ఇచ్చే స్థానం ఉంది. హిందూ ఆలయాల్లో కూడా మూలావిరాట్టుగా ఎదురుగా ధ్వజస్థంభం ముందు బలిపీఠం ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన అంశం.

1933 లో Honduras ప్రెసిడెంట్ Tiburcio Carías ఇక్కడ అన్వేషణ కోసం స్పాన్సర్ చేశారు. అక్కడి స్థానిక జాతులవారి జీవితం చెదిరిపోకముందే అక్కడ పరిశోధన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. Museum of the American Indian సంస్థాపకుడు George Gustav Heye తో అక్కడ పరీశీలన చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అన్వేషకుడు R. Stuart Murray దీన్ని ముందుకు నడిపించారు. అయితే ఆయన కొన్ని పురాతన అవశేషాలతో పాటు 'దట్టమైన అడవిచేత కప్పబడి ఉన్న పెద్ద శిథిలాలు' అనే వదంతులను ఆయన వారికి తెలియజేశారు. అక్కడే బహుసా శిథిలైన నగరం ఉండేది, దాన్నే ఇండియన్స్ (స్థానిక జాతులు) City of the Monkey God గా పిలుస్తారు... వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళినవారు ఒక నెలలోపు విషసర్పం యొక్క కాటు చేత మరణిస్తారని వారు నమ్ముతారు' అని నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం 1934 లో జరిగినా, దాన్ని అన్వేషించలేకపోయారు. అలా అక్కడ శిథిలాలను కొనుగొనాలనుకున్న అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది.

శతృబాధలు, పిశాచ భయాలు, రోగ నివారణ కోరకు నిత్యం పఠించవలసిన పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం ఇది. ఇందులో స్వామి రూపాన్ని గొప్పగా వర్ణించారు.

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం 
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం 
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం


భావం —— వానర ,నారసింహ ,గరుడ ,వరాహం, అశ్వ (హయగ్రీవ) అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన 15 నేత్రాలు (ఒక్కో ముఖానికి 3 కన్నులు), పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, ఢాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు (ఖట్వాంగం), మణులు, పాము, చెట్టు 10 హస్తములతో ధరించిన వాడు, పసుపు వన్నె కలవాడు, గర్వాన్ని హరించే వాడైన హనుమంతునికి నమస్కారం.

To be continued ...........

Source: https://pparihar.com/2015/03/29/hanuman-travelled-to-patala-loka-south-america-through-a-tunnel-worshipped-in-south-america/
https://en.wikipedia.org/wiki/La_Ciudad_Blanca#/media/File:Lost_City_of_the_Monkey_God.png
https://ramanan50.wordpress.com/2014/02/28/americas-the-patala-of-hinduism-mayas-hindus/

15, జులై 2017, శనివారం

స్వామి శివానంద సూక్తి


Just as fruit is born of the seed, so also deeds are born of thoughts. Good thoughts generate good actions. Evil thoughts produce evil actions. Harbour good thoughts. Repel evil thoughts. If you cultivate good thoughts by Satsanga, study of religious books, prayer, etc., evil thoughts will die by themselves.

- Swami Sivananda

14, జులై 2017, శుక్రవారం

స్వామి సచ్చిదానంద సూక్తిSelf-mastery

Many people fear that discipline means a lack of freedom, a repressed or joyless life. But imagine that you are tied to the saddle of a galloping horse, clinging for your life, hoping somehow the horse might feel sympathy and stop. Is that enjoyment? That is the situation when we do not have discipline over our minds. The person who really enjoys horseback riding is the one who controls the horse, who can stop whenever he or she wants.

- Swami Satchidananda