Monday, 7 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 5 వ భాగం



కొందరు ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించండని, మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండని, శాస్త్రప్రకారమే కర్మకాండలు చేయండని చెప్పడం ఒకటి. ఇందులో పెక్కు నియమాలుంటాయి.


ఇక మరొక మార్గం ఉంది. కొందరు, మాకీ కర్మలూ వద్దు, ఇహ పర సుఖాలూ వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టివారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండని చెప్పాడు భగవానుడు. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే ఆవి ఇతణ్ణి బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అపుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచి పెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం, విచారణ మొదలౌతుంది.


ఇట్లా కర్మమార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి. ఒకటి ఇహ పరలోక సౌఖ్యం. రెండవ మార్గంలో చిత్తశుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు. అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది.


ఫలాలను ఆశించేవాడు కూడా వేదమార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి, తనకూ, సంఘానికి మేలు కలుగజేస్తుంది.


ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం. పండిన వాటిని అనుభవిస్తాం. ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినపుడు, ఆ బాధను మరిచి పోవడానికి కూరలను పెంచాడనుకోండి. వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలనాశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభమేమిటి? చిత్తానికి శుద్ధి ఏర్పడడం, కర్మఫలం కాదు. కర్మఫలాలను ఆశించకుండా కర్మానుష్ఠానం చేస్తున్నాడని, నా ఆజ్ఞను పాటిస్తున్నాడని, నడవడికకు భంగం తీసుకొని రావడం లేదని, ఇతనికి చిత్త మాలిన్యం పోగొట్టాలని భగవానుడు భావిస్తాడు. అంటే భగవదనుగ్రహం కావాలన్నమాట.


Sunday, 6 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 4 వ భాగం



కొందరు ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించండని, మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండని, శాస్త్రప్రకారమే కర్మకాండలు చేయండని చెప్పడం ఒకటి. ఇందులో పెక్కు నియమాలుంటాయి.


ఇక మరొక మార్గం ఉంది. కొందరు, మాకీ కర్మలూ వద్దు, ఇహ పర సుఖాలూ వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టివారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండని చెప్పాడు భగవానుడు. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే ఆవి ఇతణ్ణి బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అపుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచి పెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం, విచారణ మొదలౌతుంది.


ఇట్లా కర్మమార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి. ఒకటి ఇహ పరలోక సౌఖ్యం. రెండవ మార్గంలో చిత్తశుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు. అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది.


ఫలాలనాశించేవాడు కూడా వేదమార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి, తనకూ, సంఘానికి మేలు కలుగజేస్తుంది.


ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం. పండిన వాటిని అనుభవిస్తాం. ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినపుడు, ఆ బాధను మరిచి పోవడానికి కూరలను పెంచాడనుకోండి. వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలనాశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభమేమిటి?

Saturday, 5 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 3 వ భాగం





జీవులు కర్మ సంగులగుటకు ప్రకృతియే కారణమని అదియే మాయయని అన్నారు. అయితే మాయ, తనంతట అది పనిచేస్తుందా? దీనిని నియమించువాడు, ఈశ్వరుడే. ప్రకృతియే మాయయని, దానిని తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈశ్వరుడని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది. నా మాయను దాటడానికి ఎవ్వరికీ శక్యం కాదని గీతలో 'మమ మాయా దురత్యయా' అన్నాడు. అందరూ నివృత్తి మార్గంలో ఉండగలరా? ఉంటే ఈ జగన్నాటకం ఎట్లా సాగుతుంది? సనకాదులు, నివృత్తి మార్గంలో ఉండడాన్ని గమనించి బ్రహ్మ, ప్రజాపతులను సృష్టించాడని వారివల్ల ప్రజోత్పత్తి అయిందని భాగవతంలో చదువుకొన్నాం కదా! అందరూ జ్ఞానులైతే ఇక నాటకం ఎట్లా సాగుతుంది?


అయితే నాటకంలో ఇష్టం వచ్చినట్లు నటించవచ్చా? కూడదని, వారికిచ్చిన స్వేచ్ఛ కొద్దిపాటిదని విచ్చలవిడిగా వారుపయోగించకూడదని ఈశ్వరుడు, ఋషుల ద్వారా సందేశమిచ్చాడు. తాత్కాలిక భోగాలననుభవిస్తున్నా వారి మధ్యలో ఒక నియతి, ప్రేమ, అందం, పరస్పర సహకారం ఉండాలని, ధర్మంతో అన్నీ కూడి యుండాలని నిర్దేశించాడు. వేదం ద్వారా ప్రవృత్తి మార్గాన్ని అందించాడు. అందే కర్మానుష్ఠాన పద్ధతి యుంటుంది.


జ్ఞానకాండాన్ని చివరగా ఉపనిషత్తులందించాయి. సంసారం నుండి విముక్తమైతే మోక్షం. పుణ్యకర్మల నిచ్చేది స్వర్గం.


కర్మమార్గం ఇచ్చే రెండు ఫలాలు


నిరంతరం కార్యమగ్నులమై ఉంటాం. తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది. అయినా తృప్తి యుండదు. ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కల్గుతూ ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా. నీటిమీద వ్రాత మాదిరిగా అవి కలకాలం మనల్ని పట్టుకొని యుండవు. మరల కర్మలలో మునుగుతూ ఉంటాం. ధ్యానాదులను చేయలేం. కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి.

Friday, 4 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 2 వ భాగం



పెక్కుమందికి పెక్కు మార్గాలు


ఈశ్వరుడాడించే జగన్నాటకంలో మీరందరూ అరణ్యాలకు పొండి సన్యాసాన్ని స్వీకరించండి, అత్మ విచారణ చేయండంటే నూటికి 99 మంది వినరు కూడా. అట్టి తీవ్రేచ్ఛ ఉండడాన్ని ముముక్షత్వమంటారు. ముముక్షువులే ఈ జ్ఞానమార్గాన్ని అనుసరిస్తారు. ఏ నూటికో, కోటికో ఒక్కనికే పట్టుబడుతుంది. అందరూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇతరుల సాహాయ్యం, సాధనాల సాహాయ్యం అపేక్షించకుండా ఉండలేరు. వారినే గీతలో కర్మసంగులని అన్నారు. ఎందుకట్లా ఉన్నారంటే వారిలో కోరిక, కర్మ ఉండడం వల్లనే. ఆ కోరిక నెరవేరాలంటే ఊరకే కూర్చుంటే నెరవేరుతుందా? ఆత్మ సాక్షాత్కారానికే ఏ పని చేయకుండా స్తిమితంగా ఉండగలగాలి. మిగిలిన వాటిని సాధించడానికి కార్యమగ్నులు కావలసిందే.


అంటే పనులు చేస్తున్నామంటే లోనున్న ఆత్మను మరిచి దానికి దూరంగా ఉండి బాహ్యమైన వాటిల్లో తగుల్కొంటున్నామన్నమాట. దానిని ప్రవృత్తి యనే పదమే వెల్లడించింది.


ఆత్మవైపు మళ్ళడం, నివృత్తి పదం సూచిస్తుంది. అనగా ప్రవృత్తిలో కార్యమగ్నత, నివృత్తిలో కార్య విముఖత. కనుక కోరికలతో నున్నవారిని ఆత్మవిచారణ చేయండని నిర్బంధించలేం.


కార్యమగ్యులైన వారిని చెడ్డ కోరికలు కోరకుండా ఉండడానికి, మోసాలు చేయకుండా ఉండడానికి, వేదాలు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కొన్ని విధులు నేర్పాటు చేసాయి. ధార్మిక మార్గాలను సూచించాయి. ఋషుల మాటల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని సక్రమంగా ఉండేటట్లు భగవానుడే చేసాడు.


యతః ప్రవృత్తం భూతానాం యేన సర్వమిదం తతం


అని గీత చెప్పింది. అనగా ఈశ్వరుని నుండే జీవులకు ప్రవృత్తి మార్గం వచ్చిందని చెప్పింది. ఈశ్వరుడే జీవులలో ఉండి వారిని ప్రవృత్తి మార్గంలో పెడుతున్నాడని శంకరులు భాష్యంలో వివరించారు.

Thursday, 3 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 1 వ భాగం



ప్రవృత్తి నివృత్తి


వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం.


ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది. అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్లే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దుఃఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా?


అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే. లౌకిక సుఖాలననుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు. నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే. ఇట్లా అని నేను చెప్పడం కాదు. వేదమే 'అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్' అని చెప్పిందని బ్రహ్మసూత్రాలలో ఉంది. శబ్దమనగా ఇక్కడ వేదం. ఇదే ఛాందోగ్యోపనిషత్ మరల మరల చెప్పింది. నివృత్తి మార్గం వల్లనే పరమ సుఖమని, వీటి తాత్పర్యం.

Wednesday, 2 March 2022

శ్రీ హనుమద్భాగవతము (176)



మూర్తీభవించిన కృతజ్ఞతలో శ్రీ రఘునాథుడు ఎంత ప్రసన్నుడై ఆంజనేయుని తన వక్షఃస్థలమునకు హత్తుకొని ఇట్లు పల్కెను.


శ్లో॥ మారుతిం ప్రాహ వత్సాద్య త్వత్ప్రసాదాన్మహాక పే॥ 

నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ


(ఆధ్యాత్మ రామాయణం 6-7.30)


వత్సా! మహాకపీశ్వరా ! నేడు నీ కృపావిశేషము వలననే నేను నా సోదరుడైన లక్ష్మణుని నిరామయునిగా గాంచ గల్గుచున్నాను.


వజ్రంగబలి యైన ఆంజనేయుడు ఒనరించిన ఈ మహత్తర కార్యమును శ్రీరాముడు, పునర్జీవితమును పొందిన లక్ష్మణుడు ప్రశంసించుటయేగాక వానర భల్లూక వీరులందఱు వే నోళ్ళ పొగడనారంభించి. కాని అభిమానశూన్యుడైన ఆంజనేయుని హృదయములో ఎట్టి అహంకారము కలుగ లేదు. తానేమియు చేయనివానివలె ఆయన మిన్న కుండెను. అంతయు చేయువాడు మరియొకడు కలడని, ఆయనయే అభిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీరామచంద్రుడని, తాను కేవలము నిమిత్తమాత్రుడనని ఆంజనేయుని భావము. అతడు ఒంటరిగా, అందరినుండి దూరముగా ఉండి మనస్సులో అరుణకమలముల వలె ప్రకాశించు సుకోమలములైన ప్రభువుయొక్క చరణారవింద ధ్యానములో లీనుడయ్యెను.


ఇది శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందమిళిందాయ మా మాససత్వ మహావైభవ సంపన్నుడు శ్రీ మట్టుపల్లి వేంకట మహాలక్ష్మీ జగన్నాథుల తనూభవుడు భక్తజన దాసానుదాసుడు సుజన విధేయుడైన శివ సుబ్బారాయ గుప్తచే ప్రణీతంబైన శ్రీ హనుమద్భాగవతమందు పూర్వ భాగము సమాప్తము. 


శ్రీ హరిః ఓం తత్సత్


Tuesday, 1 March 2022

శ్రీ హనుమద్భాగవతము (175)



శ్రీరామచంద్రుని సంక్షిప్త సమాచారమును అందఱు ఆలకించిరి. లక్ష్మణుని కొఱకై దీనాతిదీనముగా దుఃఖించుచున్న కరుణాభరితమైన శ్రీ రాముని దశ చూడగనే అందఱి నేత్ర ములు అశ్రుభరితములయ్యెను. రాత్రి గడచి పోవుచుండెను. ఆ విషయమును గ్రహించిన భరతుడు ఇట్లు పల్కెను. "వీర హనుమానుడా! నీవు నా బాణముపై కూర్చుండుము. నా బాణము నిన్నీ క్షణమందే ప్రభుని చెంతకు చేర్చగలదు. క్షణమైనను ఇక ఆలస్యము కారాదని పల్కెను. "ఏమి ! ఈ బాణము పర్వత సహితముగా నున్న నా భారమును భరింపగలదా " అని ఆంజనేయుడు తనలో శంకించెను. ఈ మహానుభావుడు వదలిన మొనలేని బాణముచే నేను మూర్ఛిల్లితిని. శ్రీరామచంద్రుని కృపనలన అంతయు సంభవమే అని ఆలోచించి ఆంజనేయుడు అంజలి ఘటించినవాడై భరతునితో 'రామానుజా ! ప్రభువు యొక్క ప్రతాపముతో నీ ఆశీర్వచనముతో ఈ క్షణమే నేను రణరంగమును చేరగల'నని పలికెను. తదనంతరము భరతుని చరణారవిందములకు ప్రణమిల్లి వాయునందనుడు వాయు వేగముతో ఆకాశమునకు ఎగిరెను.


రణరంగములో రాత్రి అధికముగా గడచుట శ్రీరాముడు అధైర్యమును పొందినవాడై దుఃఖించుచు ఇట్లు పలుకనారంభించెను. నా ప్రియసోదరుడు లక్ష్మణుడు నా కొఱకై తల్లిని, తండ్రిని, భార్యను మాత్రమేగాక సకలరాజ భోగములను, సుఖములను త్యాగం ఒనరించెను. నన్ను సేవించుటకు, సుఖంపజేయుటకు అరణ్యములందు శ్రమించెను. అట్టి త్యాగమూర్తియైన లక్ష్మణుడు లేకుండగా అయోధ్య మరలిపోగలను? వైదేహి లభించినను లక్ష్మణుడు లేనిదే నేనెట్లు జీవింపగలను? ప్రాణప్రియుడైన నా సోదరుడు లేనిచో నిశ్చయముగా నేను ప్రాణములను త్యజించెదను. తదనంతరము నా మువ్వురు తల్లులు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత జీవింపరు. ఈ విధముగా అయోధ్య సర్వనాశము కాగలదు. నేను లేని కారణమున సుగ్రీవుడు, అంగదుడు మొదలగు వానర వీరులందఱు పోరును విరమించి కిష్కింధకు వెడలగలరు. కాని విభీషణునకు నేను ఒసంగినవచనం ఏమి కాగలదు? విభీషణుడు నన్నాశ్రయించెను. నాకు శరణాగతుడయ్యెను. పరమభక్తుడైన విభీషణునకు నేనొసంగినమాట చెల్లింపలేక పోయెదనేమో అని నా హృదయము భీతిల్లుచున్నది.


లీలామానుష విగ్రహుడు, భగవంతుడైన శ్రీ రాఘవేంద్రుని నయనముల నుండి అశ్రువులు ప్రవహింప నారంభించెను. కరుణాభరితమైన ఆయన విలాపమును గాంచి వానర భల్లూక వీరులు అధైర్యము చెంది విలపింప ఆరంభించిరి. వారు దుఃఖించుచు మాటి మాటికి ఆకాశము వంక చూచుచుండిరి. ఆంజనేయస్వామి వచ్చునేమో అని వారి ఆశ. సూర్యోదయసమయం ఆసన్నమగు చుండెను. అందఱు నిరాశాహృదయులైరి. సూర్యునివలె ప్రకాశించుచున్న వానర వీరుడు ఓషధిపర్వతమును హస్తమునందు ధరించి 'జయ శ్రీ రామ' జయ జయారావములను పలుకుచు ఆంజనేయుడు ఆకాశమార్గమున ఆ ప్రదేశమును చేరెను. పర్వతమును ప్రక్క నుంచి మారుతి శ్రీ రామచంద్రుని చరణముల పై పడెను. వానరవీరుల ఆనందమునకు మేర లేదు. వారందఱు ఆంజనేనుయుఇని వివిధ రీతులలో కీర్తింప ఆరభిన్చిరి. ఇంతలో సుషే ణుడు పర్వతమునుండి సంజీవని తెచ్చి లక్ష్మణునకు వాసన చూపించెను. నిద్రనుండి మేల్కాంచుచున్నట్లు లక్ష్మణుడు లేచినవాడై ఇట్లు పల్కెను. “మేఘనాథుడెక్కడ? వానికి మరణం ఆసన్నమైనది.