Friday, 24 August 2012

చతుర్భుజం-1? నాలుగు చేతులు కలిగిన వాడు అని మాత్రమే గాక దానిలోని తత్వాన్ని ఆవిష్కరించబోతున్నం. ముందుగా సృష్టి రహస్యాన్ని చక్కగా చెప్పారు.ఈ పుడమిపై నాలుగు విధాలుగా జీవరాసి జన్మిస్తుంది. 1)ఉద్బీజములు-విత్తనము నుండి ఉద్భవించినవి-చెట్లు మొ|| 2)అండజములు-గుడ్డు నుండి ఉద్భవించినవి- 3)స్వేదజములు-చెమట గుడ్డు నుండి ఉద్భవించినవి-క్రిములు మొ|| 4)పిండజములు-గర్భావాసం ద్వారా ఉద్భవించినవి- ఇవి నాలుగు చేతులుగా,భుజములుగా కలిగినవాడు లేక కలిగినది.ఆమెయే ప్రకృతి. 'ప్రకృతేఃపురుషాత్పరం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే గణపతి ప్రకృతి పురుషలను మించిన వాడు.ఆ ప్రకృతి పురుషలు శివపార్వతులు.అంటే ప్రకృతి పార్వతి మాత. 'ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం'అని లక్ష్మీ అష్తొతరంలొ లక్ష్మీ దేవి ప్రకృతిగా చెప్పబడింది. దత్తచరిత్రలో శ్రీ దత్తత్రేయులవారు తనకు ప్రకృతి గురువు అని చెప్పారు.అంటే ఆమె సరస్వతి. ఒక్క పదం స్మరించినంత మాత్రంగానే మహా దేవి త్రయాన్ని స్మరించిన పుణ్యం కలుగుతుంది. మనకు నాలుగు యుగాలు. 1)కృతయుగం-1728000 సంవత్సరాలు. 2)త్రేతయుగం-1296000 సంవత్సరాలు. 3)ద్వాపరయుగం-864000 సంవత్సరాలు. 4)కలియుగం-4,32,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు మొత్తం 43,20,000 సంవత్సరాల కాలం ఒక మహా యుగం.ఈ నాలుగు యుగాలను తన భుజములుగా కలిగిన కాల పురుషుడే ఇందు వివరింపబడ్డాడు."కాలాయ తస్మై నమః" ఋగ్,యజుర్,సామ,అథర్వణ వేదాలను నాలుగు చేతులుగా కలిగిన వేద పురుషుడు. పంచాయతన పూజ అంటే ఇదు దేవతల ఆరాధన.శివ,శక్తి,సూర్య,గణపతి,విష్నులను పూజించడం.మధ్యలో పై వారిలొ ఒకరిని ఉంచి మిగితా నలుగురిని నాలుగు దిక్కుల ఉంచి పూజించడం జరుగుతుంది.మధ్యలో ఉన్నవాడికి నాలుగు దిక్కుల నలుగురు దేవతలు నాలుగు చేతులవలె,శక్తులవలె,భుజముల వలె కలిగి ఉన్నట్టు భావన చేస్తే ఆ మధ్యలొ ఉన్నవాడికి నాలుగు భుజములని చెప్తూ చతుర్భుజం అని అన్నారు. ఇవి కేవలం కల్పితములు కావు.శాస్త్రం యందలి పరమాత్మ తత్వాన్నే మీకు వివరించడం జరుగుతొంది.

No comments:

Post a Comment