Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Friday, 24 August 2012
చతుర్భుజం-?2
నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది.
'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం.
అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం.
అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు.
భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం.
అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం.
బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment