part-10
~ వినాయక చవితికి పూజించే విగ్రహాలను మనమే చేసుకోవాలా?
~ నిజానికి భారతదేశంలో పూర్వాకాలంలొ అసలు పేదరికం లేదు.కాబట్టి ఎవరికి మట్టి విగ్రహాలు విక్రయించే అవకాశం లేదు.మట్టిని,విద్యను,ఆహారాన్ని పంచుకోవడమే తప్ప సోమ్ము చేసుకొవడం అనే సంస్కృతి ఆనాటి కాలంలొ లేదు.ఇది చరిత్ర చెప్తూన్న సత్యం.ఆంగ్లేయుడైన మొకాలె బ్రిటన్ పార్లమెంట్ లొ 2-2-1835 రోజున చేసిన ప్రకటన ద్వారా మనకు స్పష్టం అవుతోంది.
"నేను భారతదేశం అన్ని దిశలు మొత్తం పర్యటించినా నాకు ఒక్క బిక్షగాడు గాని,ఒక్క దొంగ కాని కనపడలేదు.ఎంతో సంపద,మహొన్నతమైన సామాజిక విలువలు,అపారమైన శక్తి కలిగిన ప్రజల్ను చుశాక నాకు అనిపిస్తోంది మనము ఈ దేశాన్ని ఆక్రమించడం జరగని పని అని.అలా ఆక్రమించాలి అంటే భారతదేశం యొక్క వెన్నుముక్క అయిన ఆ దేశపు సంప్రదాయాలను,ఆధ్యాత్మిక సంపదను విరగొట్టాలి.అందుకోసం మనం వారి యొక్క అధ్యాత్మిక,పూరతనమైన విద్యవిధానాన్ని,సంస్కృతిని మార్చాలి.ప్రతి భారతీయుడు తమ సంస్కృతికంటే పాశ్చాత్య సంస్కృతి గొప్పది,శాస్తియమైనది అని భావించాలి.అలా వారు వారి ఆత్మగౌరవాన్ని,భారతీయ సంస్కృతిని,విలువలను కోల్పోయీ మనము కోరుకుంటున్న బానిస దేశంగా మారుతారు.అందుకొసమ మనం ఆ దేశంలొ ఇంగ్లీషు విద్యను ప్రవెశపెట్టాలి".ఇది ఆయన చేసిన ప్రకటన.
~ మనమే,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను తయారుచేయడం చేత సృజనాత్మకత (క్రియెటివిటి)పెరుగుతంది.ఇది శాస్త్రీయ కారణం.
~ ఒక బొమ్మను చేయాలి అంటే మనసుతో దాన్ని బాగా గమనించి చేస్తాం కదా.మనము మన చేతిలొ ఏది పట్టుకుంటే మన చెయ్యి ఆ వాసనే వస్తుంది.కర్పూరం పట్టుకుంటే చెయ్యి కర్పూరం వాసన వస్తుంది.అలాగే మనసు కూడా.మన మనసులొ ఉన్న ఆలోచనలే మన మాటలు,చేతల ద్వారా ప్రకటనం అవుతాయి.మరి ఈ విగ్రహం చేస్తున్నప్పుడు మనం మనసు నిండా వినాయకుడిని నింపుకుంటాం.గణపతి ఎక్కడ ఉంటే అక్కడ ఙ్ఞానం ఉంటుంది.అలా మానసిక ధ్యానం ద్వారా మనస్సుకు వినాయకుని స్పర్శ తగిలి అనంతమైన ఙ్ఞానం,ఆనందం కలుగుతుంది.మన ప్రతి మాటలొ అవి ప్రస్పుటమవుతాయి.
~ మరి మీకొ అనుమానం రావచ్చు.ఇప్పుడు బయట ఎంతో మంది విగ్రహాలను చేసి అమ్ముతున్నారు కదా.వారికి అంత ఙ్ఞానం ఎందుకు లేదు అని?
~ అలాగే విగ్రహాలను మనమే స్వయంగా చేసుకొవడం వెనుక ఉన్న అనేకానేక కారణాలు ఏంటి?
వంటి ప్రశ్నలకు సమాధానం రాబొయే పొస్ట్ లొ చెప్పుకుందాం.
to be continued.....
No comments:
Post a Comment