ప్రసన్నవదనం?
ప్రసన్నమైన ముఖము కలవాడు.నిజానికి ప్రసన్నమైన ముఖం అంటే అందమైన ముఖం అని కాదు.ప్రాచీనులు ఏనాడు మన శరీర అందం గురించి చెప్పలేలెదు.ఎందుకంటె అది తాత్కాలికం.వారు ఎప్పుడు మనొసౌందర్యం గురించి మాత్రమే చెప్పారు.ఎవరు మనస్సు నిత్యం ప్రశాంతంగా,నిర్మలంగా,నిష్కల్మషంగా ఉంటుందొ వారి ముఖం లొ అది ప్రస్పుటమవుతుందని,అలాంటి వారి ముఖం మాత్రమే ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉంటుందని అయుర్వేదం చెప్తొంది.
ఎవరు ముఖాన్ని చూసినంత మాత్రమే మనొచంచలం అదుపులొనికి వస్తుందొ,భయం తగ్గి దైర్యం కలుగుతుందొ,అలాగే చూస్తు ఉండిపొవాలని అనిపిస్తుందొ అటువంటి ప్రసన్నమైన ముఖం ఆ పరమాత్ముడిని ఈ శ్లొకం లొ వర్ణించారు.
లక్ష్మీ స్థానాలుగా ఏనుగు ముఖం,గో మయం,నిరంతరం పసిపిల్లల తిరిగె ప్రదేశం,గోశాల,పరిశుభ్రమైన ఇల్లు,బొట్టున్న మొహం అంటూ చాలనే చెప్పారు.వాటిని చూడగానే మనస్సు అనందపరవశంతొ పొంగిపొతుందని చెప్పారు.
వినాయకుడి ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందని ఆయనకు సుముఖుడని పేరు.నిజమే పసిపిల్లలు కూడా ఆయనకు త్వరగా వశం అవ్వడానికి ఆ ఏనుగు ముఖం కూడా ఒక కారణమే.పైగా వినాయకుడి ముఖం ఎప్పుడు ఆనందం గానే ఉంటుంది కదా.అందుకే గణపతిని ధ్యానం చేయడం చేత మనకు త్వరగా సిద్ది,బుద్ది కలిగి త్వరగా జ్ఞానవంతులుగా మారుతారు.
ఎవరి ముఖాన్ని ధ్యాననించడం చేత మనం ప్రశాంతతను పొందుతామొ వారిది ప్రసన్నమైన ముఖం.శ్రీ కృష్నుడిని వర్ణీస్తూ మధురాష్ట్టకంలొ వదనం మధురం,హృదయం మధురం.........మధురాధిపతే అఖిలం మధురం అని అంటారు.అంటే జగద్గురు అయిన శ్రీ కృష్న పరమాత్మ ముఖమే కాదు ఆయన రూపమే అందంగా ఉంటుంది.పైగా అఖిలం మధురం అని అనడంలొ ఒక అర్ధం ఉంది.ఆయన అంతటా వ్యాపించి ఉన్నడు కనుక అంతా మధురమే అని,ఆయనను మనస్సునందు ధ్యానించినందున మన మనస్సు కూడా మధురముగా అయ్యి,ముఖం ప్రసన్నంగా అవుతుంది.నిజానికి మన ముఖం ప్రసన్నంగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆధ్యాత్మికత అద్దం లాంటిది.మాములు అద్దం మన బాహ్య సౌందర్యాన్ని ఎల చూపిస్తుందొ అలాగే ఆధ్యాత్మికత మన నిజస్వరూపాన్ని మనకు చూపి మనలొ ఉన్న తప్పులను సరి చేసి,మనలొ ఉన్న పరంధాముడి ని మెల్కొలిపి మనల్ని సదా ప్రసన్నంగా ఉంచి చివరకు ఆ పరంధాముడిలొనే ఐక్యం చేస్తుంది.ఒక్కసారి మన అంతరంగాన్ని అర్ధం చేసుకొగలిగామ మన ప్రసన్నత బయటకు ఉట్టిపడుతుంది అని చెప్తూ నీ లొని పరమాతముడిని మెలుకొలపమని నిగుఢార్ధం.
1. వినాయకుని వివాహం జరిగినదా జరిగేతే ఎవరు వారు . ఎలాగా వివాహం జరిగినది.
ReplyDelete2. వినాయకునికి జిల్లేడు మల ఎందుకు వేస్తారు . ఇది బ్రహ్మచర్యం వలకు మాత్రమే వేస్తారు కదా ..