part-5
~ పత్రి పూజ ఒక్క వినాయక చవితికి మాత్రమే చేయాలా?
~ వినాయక చవితి వర్షాకాలంలొ వస్తుంది.ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది.చెట్లు త్వరగా పెరుగుతాయి.అదే సమయంలొ రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి.
ఈ 21 రకాల పత్రి యొక్క ముట్టుకొని వాసన పీల్చడం చేత రొగనిరొధక శక్తి పెరుగుతుంది.ఆ పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించి ఇంట్లొ ఉన్న క్రిములను హరిస్తుంది.అది భగవంతునికి సమర్పించడం అనే ప్రక్రియలొ వాటిని ముట్టుకొవడం,పూజాసమయంలొ వాటిని నుండి వెలువడే వాసనలు మనం పీల్చడం ద్వారా మనకు రోగనిరొధక శక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలొ బురద నీరు చెరువుల్లొకి చేరుతుంది.ఆ నీరు తాగడం చేత అనారొగ్యం కలిగే అవకాశం ఎక్కువ.అందుకే వినాయక ప్రతిమతొ పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే అది నీటిని శుద్ధి చేస్తుంది.ఎందుకంటే అవన్నీ ఔషధ మూలికలు కనుక.ఫలితంగా ప్రజల ఆరొగ్యం చెడిపొకుండా ఉంటుందని.
ఈ కాలంలొ చెట్లు,మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి.పత్రి పూజ పేరున వాటి చిగుళ్ళు విరిచి స్వామికి సమర్పించమన్నారు.గులాబి మొక్క కటింగ్స్ వల్ల బాగా పెరుగుతుంది కదా.అలాగే ఈ మొక్కలు కూడా.వాటి చిగుళ్లను తెంపడం ద్వారా అవి నీటారుగా కాకుండా బాగా విస్తరిస్తాయి.చక్కటి ఆకారం సంతరించుకుంటాయి.బలంగా పెరుగుతాయి.ఈ పూజ పేరున వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకొవడం చేత అనారొగ్యం కలగగానే వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే ఇంతకుముందే మనం వాటి ఎదుగుదలకు సాయం చేశాం.అందువల్ల అవి విరివిగా లభిస్తాయి.అందరికి ఆరొగ్యం కలుగుతుంది.
పత్రి పూజకు ఆకులను,చిగుళ్ళను,పువ్వులను సమర్పించమన్నారు కాని వ్రేళ్ళతొ పాటు మొక్కలను పీకి ఔషధ మూలికలను నాశనం చేయమని చెప్పలేదు.
ప్రకృతితొ మమేకమై జీవంచడమే భారతీయ సంస్కృతి.ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.
next coming part
పిల్లలకు ఈ పత్రి పూజ పేరున ఆయుర్వేదాన్ని,ప్రకృతి,జీవజాలంగురించి ,సామాజిక భాధ్యత నేర్పాలని మహర్షులు ఏమి చెప్పారు?పండగ ద్వారా వారు భావితరాలకు ఏమి నెర్పించారు?
to be continued
No comments:
Post a Comment