Friday, 24 August 2012

శుక్లాంబరధరం విష్ణుం - 1

శుక్లాంబరధరం అంటే?

శుక్లాం అంటే తెలుపు. అంబరం అంటే వస్త్రం. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించేవాడు అని అర్దం.అదేంటి పరమాత్మ తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తాడా? కాదు. తెలుపు అని రంగులకు మూలం. ఒక తెల్లని సుర్య కిరణం ఒక ప్రిజం ద్వారా ప్రసరించినప్పుడు అది ఏడు రంగులుగా ప్రతిబింబిస్తుంది. ఆ సప్త వర్ణాలు నుంచే మిగిలిన రంగులు అని ఏర్పడుతాయి. అందుకే ఆయన అన్నిటికి ఏది మూలమో దాన్నె ధరిస్తాడు అని చెప్పడానికి అలా అన్నారు.     

గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు ............ అంటే అర్ధం తానే అన్నిటికి మూలము,ఆధారము అని చెప్పకనే చెప్తున్నారు .తానే అన్నిటికి మూలం, తాను అన్నిటిని సదా ధరించి ఉంటాడు. రంగుల్లో మూలం తెలుపు కనుక దాన్ని ధరించాడు అంటే ఇక మిగితావి అన్ని ధరించినట్టే కదా.     

తెలుపు శాంతికి సంకేతం. ఎల్లప్పుడు శాంతిని ధరించేవాడు/ కలిగించేవాడని అర్ధం. కలర్ థెరపిలో తెలుపు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతుంది. తనను పూజించినవారికి ఆయా గుణాలు ఇచ్చేవాడని అర్ధం.      

విష్ణుం? విష్ణుం అంటే విష్ణుమూర్తి అని మాత్రమే కాదు, వ్యాపించి ఉన్నవాడు అని అర్దం. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? విశ్వమంతా వ్యాపించిన ఉన్నవాడు. ప్రాణ శక్తిగా సర్వ భూతములయందున్న ఉన్నవాడు. విష్ణువు అంటే నారాయణుడు. నీటి యందు ఉన్నవాడు కాబట్టి నారాయణుడు. మరో అర్ధంలో నీటిని ధరించినవాడు, కనుక ఆయనే శివుడు కూడా.     

To be continued.............

No comments:

Post a Comment