part-11
~ బయట మట్టి విగ్రహాలను అమ్మేవారు,వాటిని అచ్చుగుద్ది ఇచ్చెస్తారు.వారు వాటిని విక్రయవస్తువులుగానే చూస్తారు.వాటిని అచ్చుగుద్ది ఇవ్వడానికి స్వామి మీద మనసు నిలబడనవసరం లేదు.మాట్లాడుతూ కూడా చెయ్యచు కదా."యద్భావం తద్భవతి".మరి మనసులొ గణపతిని ధ్యానించనప్పుడు ఙ్ఞానం ఏలా కలుగుతుంది.
~ మనం చేసిన విగ్రహాలను మనమే పూజించడం వల్ల మనకు అమొఘమైన ఙ్ఞానం లభిస్తుందట.ఏలా?
~ మనం,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను చేశాక దాన్ని వారు కేవలం బొమ్మగా చూడరు.ప్రతిమలొని ప్రతి భాగాన్ని చేస్తూ వారి ఎంతో ఆనందం పొందుతారు.ప్రతిమ పూర్తి అయ్యాక వారు అది నిజంగా వినాయకుడే అని భావన చేస్తారు.భావనమాత్రంగానే తమ ఆత్మశక్తి ద్వారా ఆ ప్రతిమకు ప్రాణం పోస్తారు.
~ ఎటువంటి మంత్రాలు,యంత్రాలు లేకుండా కేవలం భావన చేత ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట వారికి తెలియకుండానే చేసేస్తారు.దానిని మాటిమాటికి చూసుకొని తల్లి బిడ్డను చూసి మురిసిపొయిన విధంగా మురిసిపోతారు.ఆ ప్రతిమ చూస్తుందని,వింటుందని నమ్ముతారు.వారి భావనకు,కల్మషం లేని మనసుకు భగవంతుడు లొంగి నిజంగానే స్వామి దానిలొకి ఆవహింపబడతాడు.వారి నమ్మకానికి కట్టబడతాడు.
~ మనం అదే విగ్రహంలోకి సమంత్రకంగా దైవాన్ని ఆవాహన చేస్తాం.ప్రతిమ అంతరిక్షంలోని తరంగాలను ఆకర్షిస్తుంది.అప్పటికే పిల్లల భావన చేత దానికి అనంతమైన శక్తి వచ్చింది.దానికి పూజల ద్వారా మరింత శక్తి వస్తుంది.పూజానంతరం మనం ఏమి అంటాం?"యదాస్థానం ప్రవేశయామి",యాదస్థానం ఉద్వాసయామి" అంటాం.అంటే ఎక్కడినుండి వచ్చావొ అక్కడికే వెళ్ళవయ్యా అని.అంతరిక్షం నుండి వచ్చిన శక్తి అంతరిక్షంలొకె వెళ్ళిపొతుంది.మంత్రపూర్వకంగా వచ్చిన దైవశక్తి తిరిగి ఆ పరబ్రహ్మలొనే కలిసిపోతుంది.చెరువునుండి తీసిన మట్టి చెరువులొ కలుస్తోంది.అలాగే పిల్లలు తమకు తెలియకుండానే ఆయనకు తమ ఆత్మశక్తి ద్వారా ప్రాణశక్తిని ఇచ్చారు కదా.అది వారి మనసులొ పుట్టింది.కనుక ఆ విగ్రహం యొక్క శక్తి మీ పూజల ద్వారా మరింత శక్తివంతమై తిరిగి పిల్లల లేద మన మనసులొనే కలిసిపోతుంది.
~ ఆ శక్తిని గ్రహించే ఆనాటి భారతీయులు అనేకనేక ఆవిష్కారాలు చేశారు.చరకసంహిత,వేదగణితం,సౌరశక్తి ద్వారా నడిచే యుద్దవిమానలు కాని,రాడర్లకందని వేగంతో వాయుశక్తితో నడిచే యుద్దవిమానలు వంటివి కొన్ని ఉదాహరణలే.
~ ఇంత గొప్పగా,ఊహకందని విధంగా ఆలోచించారు మన మహర్షులు.మనకు బద్దకమొ లేక తెలియకనొ కానీ ఈ విషయాన్ని విస్మరించాం.ఏమి తెలియని ఆఙ్ఞానులుగా తయారయ్యి విదేశాల వారి పరిఙ్ఞానం మీద ఆధారపడి వారి ఆవిష్కరణలను కుప్పలుగా డబ్బు పోసి కొనుక్కునే దుఃస్థితికొచ్చాం.
మన ఊహకందని పరిఙ్ఞానం మనలొనే దాగి ఉంది.అది మట్టి విగ్రహాల ద్వార మాత్రమే బయటపడుతుంది.
~ ఆధునిక భారతదేశంలో ఈ విగ్రహాల తాయరి మీద జరిపిన కొన్ని పరిశొధనలు ఏమి చెప్తున్నాయి?
to be continued........
No comments:
Post a Comment