Friday, 24 August 2012


శ్రీ కృష్ణపరమాత్మ మనకు ఇచ్చిన సందేశం ఏంటి?

లోకాలన్నిటికి ఆహరం పెట్టే పరంధాముడు గొపబాలకులతొ కలిసి చల్దిముద్దలు తిన్నాడు.స్నేహానికి పరమాత్ముడు కూడా అతీతుడు కాడని నిరూపించాడు.అలాగే అనంతమైన సుఖాలున్న కృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడిని మరవక ఆయనకు
 ధనం ఇస్తే తనతొ సమానమవుతాడని తెలిసీ ఆయనకు అనంతమైన భొగభాగ్యాలు ఇచ్చి స్నేహానికి,స్నేహితునికి గొప్ప అర్దాన్ని చెప్పిన మహానుభావుడు. 

కృష్ణుడు ఎకొ-ఫ్రేండ్లి.
అవును పర్యావరణ హితమైన జీవనాన్ని జీవించి చూపించాడు.మొక్కలు,పోదలు,చెట్లు,జంతువుల,పక్షుల మధ్య తిరుగుతూ వాటికి హాని తలపెట్టకుండా తన పిల్లనగ్రొవి వాయిస్తూ వాటికి ఆహ్లాదాన్ని పంచాడు.నిజమే శాస్త్రియ సంగీతం వినిపించడం చేత ఆవులు,గేదలు ఎక్కువగా పాలు ఇస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.అలాగే చెట్లకు మంచి సంగీతం వినిపించడం చేత అవి ఎక్కువగా దిగుబడి ఇస్తాయని కూడా ఋజువు అయ్యింది.
కాళియమర్దనం కూడా పర్యావరణ హితం కోసమే జరిగింది.కాళియుడు తన విషప్రభావం చేత యమున నీటిని కలుషితం చేసి వాటిని తాగిన వారికి రోగాలు వచ్చేలా ఆ నీటిని పాడు చేసాడు.కృష్ణుడు ఆ కాళియుడిని మర్దించి,వాడి అహం అణిచాడు చిన్ని కృష్ణుడు.అంటే జలకాలుష్యాన్ని అరికట్టాడు కదా.
ఎన్నొ పరిశ్రమలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యవరణకాలుష్యాన్ని చేస్తున్న కూడా మిన్నకుండిపోతున్న ప్రభుత్వాలకు కృష్ణుడు ఆదర్శం అవ్వాలి.పర్యావరణాన్ని కాపాడాలి.

ప్రతి సంవత్సరం నందవ్రజంలొని యాదవులంతా వర్షాలు బాగా కురవాలని ఇంద్రుని కోసం యగ్ఞం చేసేవారు.ఇంద్రుడికి అహంకారం బాగా పెరిగిపొయింది.ఇది గమనించిన కృష్ణుడు అక్కడున్న వల్ల నాన్నతొ ఇలా అంటాడు పోతన భాగవతంలొ.నాన్నగారు గొవర్ధనగిరి మీద మన పశువులు గడ్డి మేస్తున్నయి.అక్కడ ఉన్న చెట్ల కారణంగా మనకు వర్షాలు కురుస్తున్నాయి.మరి ఆ గోవర్ధనగిరి పర్వతానికి పూజలు చేయకుండా ఎక్కడొ ఉన్న ఇంద్రునకు పూజలు చేయడం ఎందుకు? అన్నాడు.చిన్న పిల్లాడు కదా అని ఆయన మాటలను పెడచెవిన పెట్టలేదు.అలాగే చేద్దాం అన్నారు.కాని ఎల చేయాలి అని అడిగినప్పుడు కృష్ణుడు మనం సకల నైవేద్యాలు ఆ పర్వతం మీద వేద్దాం.ఆ పర్వతం తింటుంది అని చెప్పాడు.వారు అలాగే చేసారు.అందరు కలిసి ఆ గిరి చూట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కృష్ణుడే ఆ గొవర్ధనగిరి పురుషుడిగా ఆ నైవెద్యాలను భూజిస్తూ దాని చూట్టూ తను మాములు పిల్లవాడిగా ప్రదక్షిణ చేసాడు.ఇంద్రునకు ఈ విషయం తెలిసి ఆ పిల్లవాడు ఎవ్వడు?ఆ గోకులంవారికి బుద్ధి చెప్పాలని వర్షం 7 రోజుల పాటు ఆగకుండా కురిపించాడు.కృష్ణుడు తనను నమ్మి తన మాటను ఆచరించినందుకు వారిని కాపాడడానికి గోవర్ధనదిరిని తన చిటికినవేలు పై ఎత్తి 7 రోజుల పాటు అలా వారిని కాపాడి ఇంద్రుని అహం అణిచాడు.గోవిందుడని పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఇంత కధ ఎందుకు అంటే ఇందులొని అర్దం తెలుసుకొవడానికి.ఇక్కడ ఇంద్రుడు అంటే మదం ఎక్కిన పాలకుడు.వారు యగ్ఞం చేయడం వల్ల తను వర్షాలు కురుపిస్తున్నాను అన్న సంగతి మర్చిపొయాడు.మన ఓట్లుతొ గెలిచి దేశాన్ని అవినీతికి పాల్పడుతూ ప్రశ్నించినవారిని ఇబ్బందులు పెడుతున్న మన రాజకీయనాయకులకు కూడా అదే అహంకారం.తమను ఎవ్వడూ ఎమి చెయ్యలేడని.వారు ఇంద్రునకు యగ్ఞం ఆపి గోవర్ధన గిరి కి పూజ చేయడం అంటే వేరే ఇతర ప్రత్యమ్నాలను వెత్తుక్కొని వారికి అధికారం ఇవ్వడం అని.7 రోజుల రాళ్ళ వాన అంటే ఒక ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు పాలకపక్షం పేట్టే ఇబ్బందులు.వాటిని భరించి తమను నమ్మినవారి రక్షించడం ఆ ఉద్యమకారుల కర్తవ్యం,అలా నమ్మినవారిని,వెంటనడిచేవారిని కాపడుతూ వారికి తమ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లకుండా తమ డిమాండ్లను నెరవేర్చుకొవడం అని అర్దం.ఇది ఏ ఒక్క రాజకీయపార్టిని ఉద్దేశించి రాసింది కాదు.మన గ్రంధాల్లొ ఉన్న సామాజిక భాద్యతకు చిన్న నిదర్శనం మాత్రమే.
అలాగే పర్వతానికి పూజ అంటే?పర్వతం మీద చెట్లు ఉంటాయి.పర్వతంలొ ఘనులు ఉంటాయి.పర్వాతాలలొనే నదులు పుడతాయి.ఎన్నొ జీవరాశి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటుంది.అటువంటి పర్వతాన్ని పూజించడం అంటే దాని గౌరవించడం.పూజించిన దాని నుండి వచ్చిన ప్రతి వస్తువును నైవెద్యంగా భావించి జాగ్రత్తగా వాడుకొవడమని అర్దం.అందుకే ఈ దేశంలొ కొండలకు,గుట్టలకు,పుట్టలకు,నదులకు పూజలు చేస్తారు.ఇది ఒకరకంగా పర్యవరణహితకరమైన జీవనమే కదా. 

No comments:

Post a Comment