Friday 24 August 2012

part-1
~ వినాయక చవితి పూజకు మట్టి ప్రతిమనే పెట్టాలా?
~ అవును వినాయక చవితి పూజకు మన చుట్టు ప్రక్కల ఉండె చెరువుల నుండి తీసిన బంక మట్టితొనే ప్రతిమను చేసి పూజించాలి.వినాయక చవితి వ్రతకల్పమే ప్రామాణికం. 

~ అప్పట్లొ రంగులు లేవు కాబట్టి,ప్లాస్టర్ 
ఆఫ్ పారిస్ లేదు కనుక అలా చెప్పి ఉండచ్చు కదా?
~ ఆ కాలంలొ రంగులు లేవు,సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజి) అందుబాటులొ లేదు అనుకుంటే పొరపాటే అవుతుంది.వేదంలొ ఉన్న అంత సాంకేతికత ఇప్పుడు ఇంక కనుగొన్నలేదు కదా.రామయణంలొ మేఘనాధునికి ఉన్న అణ్వాస్త్రాల కర్మాగారం,అదే నూక్లియర్ లాబొరెటరి,రాముడు వాడిన సోలార్ మిస్సైల్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి.భాగవతం(సంస్కృతం)లొ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల గురించి వాళ్ళు ఏమి చెప్పారొ ఇప్పటి డాక్టర్లు కూడా అదే చెప్పారు కదా.మోకాలె విద్యావిధానంలొ చదువుకున్నాం కనుక మనము మన మహర్షులను ఏమి తెలియని వారిగా జమ కట్టేస్తున్నాం.

~ మరి మట్టి ప్రతిమలను ఎందుకు పూజించాలి?
~ వినాయక చవితి వర్షఋతువులొ చివరలొ వస్తుంది.వర్షాలు సమృద్దిగా కురిసే కాలం ఇది.మన పూర్వీకులకు ఎంతొ మేధ శక్తి ఉంది.ఈ ప్రపంచంలొ తొలిసారి వాన నీటిని ఒడిసిపట్టి ఆ నాటిని భవిష్యత్తు అవసరాలకు వాడాలి అని శాసనం చేసింది వాళ్ళే మరి.వారు చెప్పింది ఇదే.ఎండాకాలంలొ చెరువుల్లొ నీరు తగ్గుతుంది.వర్షాకాలం రాకముందే ఆ చెరువుల్లొ ఉన్న బురుదను బయటకు తీయాలి.అలా చేయడం వల్ల వాననీటిని అధికంగా నిలువ చేసుకునే సామర్ధ్యం ఉంటుంది.వర్షాకాలంలొ వర్షాలు కురుసి చెరువు నిండుతుంది.నిండిన చెరువులొ తిరిగి బంకమట్టిగా మారిన ఆ బురుదను వేయడం ద్వారా అది చెరువు అడుగు భాగానికి చేరి ఆ నీటిని ఇంకకుండ చూస్తుంది.ఇది మట్టి వినాయక ప్రతిమను పూజించడం వెనుక ఉన్న సశాస్త్రియ కారణం.ఇంకా చాలా శాస్త్రీయ కారణాలు,ఎన్నొ ఆలొచనలు ఉన్నాయి.వాటిని తరువాత చెప్పుకుందాం.నీటిని ఒడిసిపడుతూ వాననీటిరక్షణ ఉద్యమానికి,అలాగే చెరువులను కాపాడుతూ చెరువుల రక్షణకు,అందరు కలిసి ఆ మట్టిని తీయడం,దాన్ని అందరు కలిసి ఒకే చెరువులొ రోజున కలపడం ద్వారా ప్రజల మధ్య ఐక్యతను,బంధాన్ని పెంపొందిస్తూ,పిల్లలకు సామాజిక భాధ్యతను అలవాటు చేసింది ఆ నాటి హిందూ సమాజం.

అందుకే పర్యావరణహితమైన వినాయక చవితినే జరుపుకుందాం.పర్యావరణాన్ని కాపడుకుందాం.మట్టి ప్రతిమలను మాత్రమే పూజిద్దాం.

పత్రిపూజ ఎందుకు?వినాయక చవితి ద్వారా పిల్లలకు మనం ఏమేమి నేర్పించాలి?అని మన పూర్వీకులు,మన డి ఎన్ ఏ లొ ఇంక సజీవంగా ఉన్న మన మహర్షులు మనకు చెప్పారొ ముందు ముందు చెప్పుకుందాం. 

No comments:

Post a Comment