Friday, 24 August 2012

సర్వవిఘ్నొపశాంతయె
అన్ని విఘ్నాలు శాంతిస్తాయి,ఉపసమనం పొందుతాయి అని అర్ధం.ఎవరిని ధ్యానించడం చేత అడ్డంకులు తొలగుతాయొ ఆయనే వినాయకుడు.దేవతలకు,గణాలకు,విఘ్నాలకు అధిపతి గణపతి.
అందులొని తత్వం ఏమిటి?తెల్లని వస్త్రములతొ,అంతటా వ్యాపించినవాడై,చంద్ర వర్ణ
ాంతొ,నాలుగు భుజములతొ,ప్రసన్నమైన ముఖం కలిగిన ఆ దివ్య మంగళ రూపాన్ని వినాయకుడిగా ధ్యానం చేసినంత మాత్రమే అన్ని విఘ్నాలు తొలగి కార్య సిద్ది కలుగుతుందని అర్ధం.ఏలాగ అంటారా?వినాయకుడి తల పెద్దగా ఉంటుంది కదా.పెద్ద తల బాగా అలొచించి పని చెయ్యమని,పెద్ద చాట చెవులు బాగా వినమని,చాట బియ్యంలొని రాళ్ళను ఏరినట్టు,అనవసరమైన విషయాలను వదిలెసి అవసరమైన వాటినె గ్రహించమని,చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టిని కలిగి ఉండమని,చిన్న నోరు తక్కువగా మాట్లాడమని,పెద్ద బొజ్జ చాలా తెలిసిన కడుపులొనే దాచుకొమ్మని,చిన్న ఏలుక మనస్సులాగా పరిగెడుతుందని,దాని అదుపులొ పెట్టుకుంటెనె చేసె పనిలొ విజయం వస్తుందని,పెద్ద శరీరం త్వరగ కదలేదు కద అలాగే మనం ఒక్కసారి ఒక పని మొదలుపెడితే అది పూర్తి అయ్యేవరకు దాన్ని వదలవద్దని ఆ మహాగణాధిపతి రూపం మనకు సందేశం ఇస్తొందని మహర్షుల వాక్యం.ఈ శ్లొకం లొ ఇంకొన్ని జొడించి చెప్పారు.అదేమిటి అంటే నీకు అంత తెలిసి ఉన్నా(విష్నుం),చతురంగ బలాలు(చతుర్భుజం)నీ వెంట ఉన్నా,చంద్రుని వలె చల్లగా,మనస్సును రంజిపజెసె మాటలు మాట్లాడుతూ(శశి వర్ణం),ప్రసనమైన ముఖము,మనస్సు కలిగిఉండి(ప్రసన్న వదనం),శాంతినే ఎల్లప్పుడు కోరూతూ(శుక్లాంబరధరం-తెల్లని రంగు కదా),నీ మనస్సును అదుపులొ ఉంచుకూంటూ(ధ్యానయెత్-ధ్యానం మనస్సును అదుపులొ ఉంచుతుంది కదా),పైన చెప్పిన ఆ ఏకదంతుడి రుపాన్ని స్మరించి అనుకరిస్తే నీ కార్యానికి వచ్చిన అడ్డంకులు అన్ని తొలిగి(సర్వవిఘ్నొపశాంతయె) విజయలక్ష్మి వరిస్తుందని ఎంతో పెద్ద అర్ధాన్ని ఇంత చిన్న శ్లొకం లొ దాచిన మన మహర్షులకు నమస్కరిస్తూ...........
ఇంకా వెరెవెరె అర్ధాలు ఈ శ్లొకనికి ఉన్నాయి.వాటిని త్వరలొనే అందించేందుకు ఆ విఘ్ననాయకుడి అనుగ్రహం సదా ఉండుగాక.

No comments:

Post a Comment