Thursday 4 April 2013

లక్ష్మీగణపతి

|| ఓం గం గణపతయే నమః ||

Ψ 32 గణపతులలో వినాయకుడి 12వ అవతారం లక్ష్మీగణపతి. ఈ అవతారంలో స్వామి సిద్ధి, బుద్ధి లను తన రెండు తొడలపై కూర్చొబెట్టుకుని దర్శనమిస్తారు. సర్వకార్య సిద్ధికి చిహ్నంగా సిద్ధి లక్ష్మీ, జ్ఞానం, బుద్ధి, విద్యలకు సూచిక బుద్ధిలక్ష్మీ.

Ψ 8 హస్తాలు కలిగి ఉంటాడు. ప్రధానమైన ఎడమచేతితో వరదముద్ర పట్టి ఉంటాడు. మిగితా చేతులలో దానిమ్మ పండు, ఖడ్గం, కల్పవృక్షపు తీగ, పాశం, అంకుశం, చిలుక, అమృత కలశం ధరించి దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధి తమ చేతిలో కలివ పువ్వు పట్టుకుని ఉంటారు. తెల్లని వర్ణం కలిగి ఉంటాడు.

Ψ ఈయనను పూజించడం వలన సర్వసంపదలు కలుగుతాయి. లక్ష్మీగణపతిని నిత్యం పూజించే భక్తులకు ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి.

Ψ పునర్వసు నక్షత్రం వారు ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ గణపతిని పూజించాలి.

Ψ తమిళనాడులోనున్న పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈయనను ఆలయం ప్రత్యేకంగా ఉంది.

Ψ శ్రీ లక్ష్మీ గణపతి ధ్యాన శ్లోకం Ψ

బిభ్రాణశ్శుక బీజాపూర కమలం మాణిక్య కుంభాకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోస్సరో నిస్సరః
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

Ψ లక్ష్మీగణపతిని నిత్యం పై శ్లోకం పఠిస్తూ ధ్యానిస్తే లక్ష్మీసంపన్నులవుతారు.

|| ఓం గం గణపతయే నమః ||

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Ψ Lakshmi Ganapathi is the 12th of Lord Ganesha’s 32 forms. In this form Lord Ganesh sits flanked by his consorts Siddhi and Buddhi on both of the thighs. Goddess Siddhi is responsible for achievement and Goddess Buddhi is responsible for wisdom. 

Ψ Lakshmi Ganapati appears with eight hands, the main left hand posture Abhya Mudra bestows blessing to all the devotees. The other hands holds green Parrot, a Pomegranate, a sword, a noose, elephant goad, sprig of Kalpavriksha (Wish fulfilling tree) and water vessel (Kamandala). Both his consorts hold white lotus flowers and as the complexion of the lord s also white in colour.

Ψ Punardham (Punarvasu) Nakshatra is related to Lakshmi Ganapati. Worshipping this form of Ganesha is believed to give wealth and wisdom. Praying to lord everyday will help devotees attain materialistic gains. Lakshmi Ganapati can be worshipped in the famous Pazhani Murugan Temple in Palani Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures.

Ψ Lakshmi Ganapati Mantra Ψ

Bibhranah Shukha Beejapuraka Milanamanikya
Kumbhakshushaan Paasham Kapalataam Cha Khangavilasijjyotih
Sudhaa Nirjharah Shyaamenaatta Saroruhena Sahitam Devidvyam Chantikee
Gowrango Varadaana Hasta Sahitah Lashmi Ganesha Svataata

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Eco vinayaka

source : http://www.hindudevotionalblog.com/2012/02/lakshmi-ganapati-form-of-ganesha.html

No comments:

Post a Comment