Monday 30 November 2015

రాజీవ్ దీక్షిత్ - జయంతి - వర్ధంతి

స్వామి వివేకానంద భారతదేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చారో, అదే విధంగా తన ప్రసంగాల ద్వారా కొత్త తరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతనశక్తిని, ప్రేరణను ఇచ్చి, బానిస విద్యావ్యవస్థ వలన భారతీయులలో ఏర్పడిన ఆత్మనూన్యతను, భావాదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేశారు శ్రీ రాజీవ్ దీక్షిత్. స్వదేశీ చికిత్స పేరుతో వాగ్భటుడు మొదలైన మహర్షులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జనబాహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసిన నయం కానీ అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు రాజీవ్ దీక్షిత్. రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పారు.

ఉన్నతమైన విద్యనభ్యసించినా, దేశం ఎదురుకుంటున్న సవాళ్ళను చూసి, తన జీవితం కంటే దేశభవిష్యత్తు ముఖ్యమని, తన జీవితాన్ని పణంగా పెట్టి, స్వదేశీ ఉద్యమం నడిపారు రాజీవ్ దీక్షిత్. భారతీయులకు తెలియకుండా దాచిపెట్టిన అనేక విషయాలను బట్టబయలు చేశారు. మనలో ఎప్పుడైనా ఆత్మనూన్యత కలిగినా, భారతీయులు ఇతర దేశీయులకంటే తక్కువ అనిపించినా, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలను వింటే, ఇక వారు ఎప్పటికి ఆత్మనూన్యతకు లోనవ్వరు. ఆధునిక భారతావనిలో నిజమైన దేశభక్తుడు రాజీవ్ దీక్షిత్. వారి వలన అనేకమంది భారతీయులు స్ఫూర్తిని పొందారు. వారు జన్మించింది 30 నవంబరు 1967 కాగా, 30 నవంబరు 2010 లో 43 ఏళ్ళ వయసులో పుట్టిన రోజు నాడే మరణించారు. వారి మరణం గుండెపోటు వల్ల సంభవించిందని చెప్తున్నా, వారి మీద విషప్రయోగం జరిగిందని వారి భౌతికకాయాన్ని చూసినవారెవరైనా ఒప్పుకుంటారు. వారి మరణం చుట్టు అనేక వివదాలు ఉన్నాయి. వారి మరణం సహజం కాదని చెప్పే అవకాశం లేకుండా వారి శవాన్ని పోస్ట్ మార్టం చేయకుండానే ఖననం చేశారు. వారు మరణం భరతమాతకు తీరనిలోటు గా మిలిగిపోయింది.

మేమంతా 1857 తిరుగుబాటు తర్వాత విడిపోయిన విప్లవకారులం. పూర్తి స్వదేశీ భారతదేశం ఏర్పడే వరకు మేము మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం, విప్లవం తెస్తాం అనేవారు రాజీవ్ దీక్షిత్.

Pic courtesy: Rajiv Dixit - One Man Army అమరజీవి, స్వదేశీ గురువు

No comments:

Post a Comment