Sunday, 8 November 2015

హిందూ ధర్మం - 183 (మాక్స్ ముల్లర్ కుట్ర -2)1886 లో మాక్స్ ముల్లర్ తన భార్యకు ఈ విధంగా లేఖ వ్రాసాడు. 'ఈ కార్యాన్ని పూర్తి చేస్తానని నేను భావిస్తున్నాను, నాకేమనిపిస్తోదంటే జరగబోయేది చూడటానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు, కానీ నేను చేసిన వేద అనువాదం, రచన భారతదేశం, మరియు ఆ దేశంలో పుట్టబోయే కోట్లమంది భవిష్యత్తు తెలియజేస్తుంది. వేదమే వారి మతానికి తల్లివేరు, దాన్ని చూపించే నెపంతో నేను చేసిన ప్రయత్నం, ఆ వేదం నుంచి గత 3000 సంవత్సరాలలో ఉద్భవించి అభివృద్ధి చెందిన సర్వాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను'.

26 డిసెంబరు 1868 లో అప్పటి భారత సెకరెటరికి డ్యూక్ (the Duke of Argyle) కి లేఖ రాస్తూ, 'భారతదేశపు పురాతనమతం అంతరించబోతున్నది, ఇప్పుడు క్రైస్తవం అడుగుపెట్టకపోతే, తప్పేవరిది' అంటూ రాసాడు. తక్షణమే దేశంలో మతమార్పిడులకు శ్రీకారం చుట్టమని చెప్తున్నాడు.

అతని కుమారిడికి ఈ విధంగా లేఖ రాసాడు. 'ఈ ప్రపంచంలో ఏ ఒక పవిత్ర గ్రంధమైనా, ఇతర గ్రంధాల కంటే ఉన్నతమైందని అనుకుంటున్నావా? చెప్తే పక్షపాతం ఉన్నదని అనుకోవచ్చు, కానీ అన్నిటిని నేను పరిగణలోకి తీసుకుని చెప్పేదేమిటంటే, ఏదైనా ఉన్నతమైన గ్రంధం ఉన్నదంటే అది బైబిల్ కొత్త నిబంధన మాత్రమే. ఆ తర్వాత ఖురాన్, ఎందుకంటే అందులో ఉన్న నైతికి బోధనలు కొత్త నిబంధన కంటే కొత్తగా ఏమీ ఎక్కువ కాదు. ఆ తర్వాత క్రమంగా పాత నిబంధన, దక్షిణ బౌద్ధ త్రిపిఠక, టాయో రచనలు, కంఫ్యూషియస్ రచనలు, వేదం, అవెస్థ. కొత్త మరియు పాత నిబంధనల్లో చెప్పబడిన నైతికి విలువలు ఇతర మతగ్రంధాల్లో కంటే ఉన్నతమైనవి. అదే బైబిల్ ప్రత్యేకత. అన్యమైన పవిత్ర గ్రంధాలన్నీ పాతకాలపు ప్రజలు సేకరించి పెట్టుకున్న జ్ఞాపకాలు మాత్రమే'.

ఇదీ  మాక్స్ ముల్లర్ కి వేదం పట్ల, సనాతనధర్మం పట్ల ఉన్న అభిప్రాయం. తన భార్యకు రాసిన లేఖలో అతడు స్పష్టంగా హిందూ ధర్మాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకో విషయం ఏమిటంటే అతడికి వేదం కాలాతీతం అని ఒప్పుకోవడానికి అహంకారం, స్వమతాభిమానం అడ్డు వచ్చాయి. అందువల్ల వేదాన్ని కేవలం 3000 ఏళ్ళ క్రితం నాటి రచనగా మాత్రమే చెప్పుకొచ్చాడు. సెకరెటరికి రాసిన లేఖలో మతమార్పిడులు చేయమని చెప్పాడు . కుమారుడికి రాసిన లేఖలో వేదం పట్ల తన అభిప్రాయాన్ని, గౌరవాన్ని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ స్వమతాభిమానం ఉండవచ్చు, కానీ పక్క మతాలను తక్కువ చేయకూడదు. కానీ మాక్స్ ముల్లర్‌కు బైబిల్ తప్ప మిగిలిన గ్రంధాలన్నీ ప్రజలు రాసుకున్న తమ జ్ఞాపకాల  ప్రతిరూపం మాత్రమే. వాటికి ఏ మాత్రం దైవత్వం లేదు. అటువంటి ఆలోచన కలిగిన మాక్స్ ముల్లర్ వేదానికి అనువాదం రాస్తే, ఎలాంటి భావాలు చెప్పి ఉంటాడో, అతడికి వేదసంస్కృతి పట్ల ఎట్లాంటి అభిప్రాయం ఉన్నదో, ఎంతవరకు ఈ ధర్మం అర్దమైందో స్పష్టమవుతుంది.

To be continued ..............................

No comments:

Post a Comment