Sunday 4 September 2016

11 రోజులు పూజించాల్సిన గణపతి మూర్తులు - నివేదనలు

వినాయక చవితి నుంచి అనంతచతుర్దశి వరకు మనం గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి రోజు గణపతికి నివేదనలు చేసి భజనలు చేస్తున్నాం. అందులో భాగంగా ఒక్కోరోజు ఒక్కో గణపతి రూపాన్ని ఆరాధించి, ఆ గణపతికి సంబంధించిన నివేదనను సమర్పిస్తే, స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఇవి ఇంట్లోను, బయట మండపాల్లో ప్రతిష్టించే వారందరూ ఆచరించదగ్గవి.

మొదటి రోజు - వరసిద్ధి వినాయకుడు - ఉండ్రాళ్ళు, మోదకాలు, పళ్ళు, మన యాధాశక్తి నైవేధ్యం సమర్పించాలి. ఈయనను ఆరాధించడం వలన సకల కోరికలు సిద్ధిస్తాయి.
రెండవ రోజు - వికట వినాయకుడు - అటుకులు నివేదన - చక్కని విద్యాబుద్ధులను ఇస్తాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేస్తాడు, ధర్మబద్ధం కాని కామాన్ని నశింపజేస్తాడు.
మూడవ రోజు - లంబోదర వినాయకుడు - పేలాలు నివేదన - సౌభాగ్య గణపతి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, క్రోధం నశిస్తుంది.
నాలుగవ రోజు - గజానన గణపతి - చెఱకుగడ నివేదన - లోభం నశిస్తుంది, సనాతన గణపతి అనుగ్రహంతో చక్కని సంతానం కలుగుతుంది.
ఐదవ రోజు - మహోదర వినాయకుడు - కొబ్బరి కురిడీ నివేదన - మోహ నాశనం, ఐశ్వర్య గణపతి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఆరవ రోజు - ఏకదంత గణపతి - నువ్వులు నివేదన - మద నాశనం, శక్తి గణపతి అనుగ్రహంతో బలహీనతలు తొలిగి శక్తివంతులవుతారు.
ఏడవ రోజు - వక్రతుండ గణపతి - అరటి పండ్లు నివేదన - మత్సరం నశిస్తుంది, రాజ్య గణపతి అనుగ్రహిస్తాడు.
ఎనిమిదవ రోజు - విఘ్నరాజ వినాయకుడు - సత్తుపిండి నివేదించాలి - మమకార నాశనం - మహాగణపతి అనుగ్రహంతో సిరిసంపదలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
తొమ్మిదవ రోజు - ధూమ్రవర్ణ గణపతి - నేతి అప్పాలు నివేదన - అహంకార నాశనం, విజయగణపతి అనుగ్రహంతో చేపట్టిన ధర్మబద్ధమైన కార్యాలాన్నీ విజయవంతం అవుతాయి.
పదవ రోజు - సిద్ధి గణపతి - యధాశక్తి నివేదన
పడకొండవ రోజు - గణపతి శోభాయాత్ర, గణపతి ఉద్వాసన.

సేకరణ - పరిపూర్ణానంద స్వామి వారు, భారత్ 2డే విడుదల చేసిన గణపతి దర్శన్ పుస్తకం ఆధారంగా.

No comments:

Post a Comment