Friday 4 November 2016

ఘనపదార్ధాన్ని త్రాగండి, ద్రవాహారాన్ని తినండి - స్వామి సచ్చిదానంద

ఎప్పుడు తింటున్నా, తొందరపడకు. నోట్లో కొద్దిగా పెట్టుకుని, బాగా నములు. ఆవును చూసి నేర్చుకో. కళ్ళు మూసుకుని నమలడం మొదలుపెట్టు. ఘనపదార్ధాన్ని ద్రవంగా మార్చు. అందుకే నేను తరచూ అంటూ ఉంటాను 'ఘనపదార్ధాన్ని త్రాగండి, ద్రవాహారాన్ని తినండి' అని. ఆహారం తినేటప్పుడు ఈ మాటను గుర్తించుకో. ద్రవాలు తీసుకుంటున్నప్పుడు నీ నోటిని ఒక గొట్టం చేసి అందులో పోయకు, కొద్దికొద్దిగా చప్పరించు. మొత్తం నాలుక తడిగా కానివ్వు. దాన్ని నోటిలో ఈ వైపు నుంచి ఆ వైపుకు త్రిప్పు. రుచిని బాగా ఆస్వాదించి మ్రింగు. అప్పుడు నువ్వు అతిగా తినవు. నీకు తృప్తి కలుగుతుంది. అతి-తిండిని నియంత్రించడంలో ఇవి కొన్ని సూచనలు.   --- స్వామి సచ్చిదానంద

Drink the Solid, Eat the Liquid

When you eat, do not be in a hurry. Put a little in and chew well. Learn from the cow. Close your eyes and start chewing. Make the solid into a liquid. That is why I very often say, ‘Drink the solid, and eat the liquid.’ Keep this as your watchword for eating. As for drinking liquids, don’t make your mouth a funnel and pour it in, sip little by little. Let the whole tongue get moistened. Move it to this side and that side of the mouth. Taste it well and swallow it. Then you won’t be able over indulge. You’ll get the satisfaction. These are some hints to control over-eating.

-Swami Sacchidananda

No comments:

Post a Comment