Monday 16 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 9వ భాగము



నుగ్రహము మరియు మానవ-ప్రయత్నము

గురువు ఏదో మాయ చేయడం వలన నీకు ఆత్మసాక్షాత్కారం అనేది కలగదు. బుద్ధుడు, రామ తీర్థ మొదలైన వారందరూ సాధన చేశారు. అర్జునుని వైరాగ్యము మరియు అభ్యాసం వృద్ధి పరుచుకోమన్నాడు కృష్ణుడు. "నేను నీకు ముక్తిని ఇస్తాను" అని ఆయన అనలేదు. కాబట్టి గురువు నీకు సమాధి స్థితిని మరియు ముక్తిని ఇస్తాడనే తప్పుడు ఆలోచన విడిచిపెట్టు. ప్రయత్నించు, పవిత్రత పొందు, ధ్యానం చేయి, సాక్షాత్కారం పొందు.

గురుకృప, గురువు అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. దాని యొక్క అర్ధం, శిష్యుడు ఖాళీగా కూర్చోవాలని కాదు. అతడు ఎంతో పురుషార్థము, ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. మొత్తం కర్మ అంతా శిష్యుడే చేయాలి. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, సన్యాసి కమండలంలో ఒక్క చుక్క నీరు త్రాగాలి మరియు దాంతో వెంటనే సమాధి స్థితిలోకి చేరిపోవాలని కోరిక కలిగి ఉన్నారు. పవిత్రతను పొంది, ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేయడానికి వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా లేరు. సమాధి స్థితిని ఇచ్చే ఒక మాయాగుళిక వారికి అవసరం. నీకు అటువంటి బ్రాంతి లేదా భ్రమ ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టు.

గురువు మరియు శాస్త్రాలు నీకు మార్గాన్ని చూపెట్టి నీ సందేహాలను నివృత్తి చేయగలరు. అపరోక్ష జ్ఞానం యొక్క అనుభూతి నీ సొంత అనుభవానికి వదిలేశారు. ఆకలితో ఉన్న వాడు తన కోసం తానే తినాలి. బాగా దురదు పెడుతుంటే, తన శరీరాన్ని తానే గోక్కోవాలి.

గురువు యొక్క ఆశీర్వాదాలు ఏదైనా చేయగలవు. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందాలి? గురువును సంతృప్తి పరచడం ద్వారా. గురువు చెప్పిన ఆధ్యాత్మిక సూచనలను శిష్యుడు సంపూర్ణంగా పాటిస్తే గురువు సంతృప్తి చెందుతాడు. జాగ్రత్తగా అనుసరించు, నీ గురువు యొక్క సూచనలను పాటించు. ఆయన చెప్పిన విధంగా నడుచుకో. అప్పుడు మాత్రమే నీకు ఆయన దీవెనలు పొందగలిగే అర్హత కలుగుతుంది, మరియు అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదాలు/దీవెనలు ఏదైనా చేయగలవు.

ఇక్కడితో ప్రథమాధ్యాయము సమాప్తము   

1 comment:

  1. Tq u, u did great work
    You are blessed by swami ji msg telugu lo translate chythunndhuku..

    ReplyDelete