Showing posts with label అంగారక చతుర్థి. Show all posts
Showing posts with label అంగారక చతుర్థి. Show all posts

Tuesday, 23 November 2021

కృష్ణ అంగారక చతుర్థి మహత్యం



కృష్ణ అంగారక చతుర్థి మహత్యం


మంగళవారం వచ్చిన చవితి (చతుర్థి) తిథి వెయ్యి సూర్యగ్రహణాల పుణ్యకాలానికి సమానం. కృష్ణ అంగారక చవితి నాడు గణపతి ప్రీత్యర్ధం ఉపవసించిన భక్తునికి వచ్చే పుణ్యం అనంతం మరియు 1000 పడగల ఆదిశేషునకు సైతం ఆ వైభవాన్ని వివరంచుట వీలుకాదు.


మాఘమాస కృష్నపక్షంలో అంగారక చతుర్థి రావడం చాలా అరుదు మరియు అది గణేశోపాసకులకు అత్యంత విశేషం. ఆ తర్వాత భాద్రపద మరియు కార్తిక బహుళ చతుర్థిలకు ఆ విశేషముంది. మిగితా మాసాల్లో వచ్చిన కృష్ణ అంగారక చతుర్థులకంటే ఇవి చాలా ఫలప్రదం.


ఈ ఏడాది మనకు మాఘమాసంలోనూ మరియు కార్తిక మాసంలోనూ కృష్ణ అంగారక చవితులు వచ్చాయి.


గణపతి ముందు 16 దీపాలను వెలిగించి షోడశ గణపతులను ఆవహన చేసే ప్రక్రియ కూడా ఈరోజు చేస్తారు.


కృష్ణ అంగారక చవితి నాడు గణపతిని పూజిస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందవచ్చు. అందునా ఈ రోజు ఉపవాసం చేస్తే ఏడాదిలో వచ్చి ప్రతి సంకటహర చవితికి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పగా, 21 సంకటహర చవితులు ఉపవసించిన ఫలం లభిస్తుందని కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. అంగారక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే కుజుడు కూడా ప్రసన్నుడవుతాడు. కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈనాడు గణపతిని ఆరాధించవారికి లభించి, వారు అభివృద్ధి చెందుతారని గణపతి చెప్పాడట.


గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక |

సంకష్టం హరమేదేవాం గృహణార్ఘ్యం నమోస్తుతే ||


ఓం శ్రీ గణేశాయ నమః 

Monday, 2 April 2018

3 ఏప్రియల్ 2018, మంగళవారం, చైత్ర బహుళ చవితి, అంగారక చతుర్థి.



3 ఏప్రియల్ 2018, మంగళవారం, చైత్ర బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.
చైత్ర మాసంలో వచ్చింది కనుక దీనికి వికట సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html


05 మార్చి 2018, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.09 నిమి||
3 ఏప్రియల్ 2018, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.09 నిమి||

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న రిచ్‌మండ్ లో చంద్రోదయ సమయం రాత్రి 10.54 నిమిషాలు, మిచిగన్ రాష్ట్రం పాంటియాక్ లో రాత్రి 11.28 నిమిషాలకు చంద్రోదయ సమయం.

లండన్ వాసులకు రాత్రి 11.03 నిమిషాలకు.

మలేషియాలో రాత్రి 9.48 నిమిషాలకు.


ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో వాసులకు సంకష్ట హర చవితి 4 ఏప్రిల్ అయ్యింది. వారికి అంగారక చతుర్థి వ్రతం లేదు. అక్కడ సంకష్ట హర చవితి చంద్రోదయ సమయంలో ఏప్రిల్ 4, 2018 రాత్రి 8.29 నిమిషాలకు.

http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం వికటాయ నమః

Monday, 6 November 2017

07-11-2017, మంగళవారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థీ.

07-11-2017, మంగళవారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థీ.

దీనికి గణాధిప సంకష్టహర చతుర్థి అని పేరు. వి

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

07 నవంబరు 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.54 నిమి||

http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం గణాధిపాయ నమః

Monday, 13 February 2017

14-02-2017, మంగళవారం, మాఘ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి..



14-02-2017, మంగళవారం, మాఘ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి..
మాఘ మాసంలో వచ్చింది కనుక దీనికి ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

15 ఫిబ్రవరి 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.20 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Tuesday, 1 September 2015

అంగారక చతుర్థి కధ

ఓం గం గణపతయే నమః

సప్త మోక్ష పురాలలో ఒకటైన అవంతికాపురి (ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది) లో నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు, సమస్త శాస్త్రకోవిదుడు, వేదస్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు. గంగా తీరానికి వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.

ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా, గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన దృష్టిలో పడింది. ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి, అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి చేసింది.

ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి రేతస్సు (వీర్యము) పతనమై భూమిపైన పడింది. (స్వేదం (చెమట) పడిందని అని కొందరు అంటారు. ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.) ఒక కారణజన్ముడు జన్మించాలి కనుక,భూమాత దానిని స్వీకరించింది. తద్వారా ఒక ఆజానుబాహుడు, ఎర్రని దేహకాంతి కలవాడు, విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు.

తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు. తగిన సమయం వచ్చినప్పుడు, తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాలుని పెంచసాగింది. 7 సంవత్సరముల వయసులో ఆ బాలకుడిని తీసుకుని, భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి "మహర్షీ! నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున, ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు. చౌలము, ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి, అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని అప్పగించింది.

సాక్షాత్ భూదేవి తనకు అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు. ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి, గణపతి మహామంత్రమును ఉపదేశించాడు. "నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది, నీ జన్మ ధన్యం చేసుకో!" అని చెప్పాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు. ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థీ (చవితి) దినాన చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో, ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో, ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో, ఎవరి అనుగ్రహం వలన యోగులు, సిద్ధులు సిద్ధిని పొందారో, ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో, అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు దర్శనమిచ్చాడు. సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక, గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వదలచాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.

"గణనాధా! నీ దర్శనమాత్రాన నా జన్మ చరితార్ధమైంది. నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు. నేనూ దేవతాగణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు. చాలు!" అన్నాడు ఆ బాలుడు.

"నీవు నిరపేక్షతో నన్ను ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా. నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను. నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు. అనగా ప్రజలకు "మంగళాలను" (శుభాలను) కలిగించే వాడవు. నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే, ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా అనుగ్రహిస్తున్నాను. భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.

అనంతరం దశభుజ గణపతిని, కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును ప్రార్ధించాడు. చింతితమైన (కోరిన) అభీష్టాలను (కోరికలను) మణివలె ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అంటారు .నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.          

ఇదండీ అంగాకర చతుర్థీ కధ.         

చిత్రంలో ఉన్నది శ్రీ చింతామణి గణపతి స్వామి. భక్తులపాలిట చింతామణియై సర్వాభీష్టాలు తీరుస్తున్నాడు.

ఓం చింతామణి గణపతయే నమః

Originally Published: 1st Jan 2013
Will be Republished on every angaraka chaturthi