Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Showing posts with label ఛత్రపతి శివాజీ. Show all posts
Showing posts with label ఛత్రపతి శివాజీ. Show all posts
Sunday, 4 March 2018
Monday, 19 February 2018
Wednesday, 15 March 2017
నేడు ఫాల్గుణ బహుళ తృతీయ- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి.
ఛత్రపతి శివాజీ నుంచి యువకులు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. శివాజికి దేశభక్తి ఎంతో ఉంది, దైవభక్తి, గురుభక్తి అంతే ఉంది. శివాజీ రాజైనా గర్వం ఇసుమంత కూడా ఉండేది కాదు. ఏ యోగి కనిపించినా అతడిని గౌరవించి, రాజ్యాన్ని వదిలి వారి వెంట వెళుతూండేవాడు. భజనలు, కీర్తనలు ఎక్కడ జరుగుతున్నా శివాజీ అక్కడే ఉండేవాడు. దైవభక్తిని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. రాజ్యమదం అతనికి ఎంత మాత్రం లేదు. శివాజీకి శ్రీ తుకారాంబావాజీ అంటే ఎంతో భక్తి. ఎంత దూరమైన ఆయన భజనలకు వెళుతూ ఉండేవాడు. ఒకరోజు భక్తి పారవశ్యంలో శివాజీ తుకారాం వద్దకు పోయి, నిజమైన భక్తిని ఉపదేశించమని వేడుకున్నాడు. అప్పుడు తుకారం 'నేను నీకు ఉపదేశించేవాడిని కాదు. చక్కని ఉపదేశం కావాలనుకుంటే వెళ్ళి, సమర్థ రామదాసు కాళ్ళపై పడు' అని మధురమైన మాటలతో ఆనతిచ్చాడు. కానీ సమర్థ రామదాసు గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఆయన శిష్యులే తెలియదు. ఇక శివాజీ ఎలా వెతకగలడు. ఆయన కోసం అనేక మఠాలు తిరిగాడు, ఎన్నో అడువులను జల్లెడ పట్టాడు. అయినా రామదాసు జాడ దొరకలేదు. చివరకు, సమర్థ రామదాసు గారి దర్శనం లభించేంత వరకు కనీసం నీరు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేశాడు. అది గురువు యందు భక్తి అంటే. శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు లభిస్తాడు. తానే నడిచి వస్తాడు. అంతటి కరుణామూర్తి సద్గురువు. ఆఖరికి స్వప్నంలో శివాజీ ఎదుట ఒక మహాపురుషుడు వచ్చి నిలబడ్డాడు. ఆయనే సమర్థ రామదాసు.
మరునాడు ఉదయం శివాజీ నిద్రలేచి మంచం దిగకముందు ఒక సన్యాసి (సమర్థ రామదాసు శిస్ష్యుడు), రామదాసుగారి నుంచి శివాజీని కలుసుకోవడం కోసం నిర్దేశించిన జాబు తీసుకువచ్చాడు. ఆ జాబులో ఇలా ఉంది. 'యాత్రకు వెళ్ళవలసిన పుణ్యక్షేత్రాలన్నీ నాశనం చేయబడ్డాయి. బ్రహ్మక్షేత్రాలు అపవిత్రం చేయబడ్డాయి. ప్రపంచమంతా అల్లకల్లోలం చేయబడింది. ధర్మం ఎక్కడా కనపడటంలేదు. ధర్మాన్ని కాపాడటం కోసం భగవంతుడు నిన్ను ఏర్పరిచాడు. ఈ దేశంలో అనేక మహారాజులు, మంత్రులు, రాజనీతికోవిదులు, గొప్పపండితులు, ఉన్నా ధర్మాన్ని రక్షించే వాతు ఎవ్వరూ లేరు. మహారాష్ట్ర ధర్మమంతా నీ మీదనే ఆధారపడి ఉంది. నేను నీ రాజ్యంలోనే ఇనాళ్ళు ఉన్నప్పటికి నన్ను నీవు కనగొన లేదు. అందుకు కారణం ఏంటో నేను చెప్పలేను. నీ మంత్రులు బుద్దిమంతులే. నీవు ధర్మమూర్తివి. అందుచేత నీకు మాటిమాటికి హితోపదేశము చేయనక్కఱలేదు. ధర్మము పునరుద్ధరించడం అనే ప్రతిష్ఠ నీకే దక్కాలి. అది నీవు పోగొట్టుకొన కూడదు. అతి సామన్యములైన రాజకీయ విషయములపై నా శ్రద్ధ నిలిచి యున్నది. ఈ ఉపదేశం వలన మనసులో ఆగ్రహించక నన్ను క్షమించు.' ఒక రాజుకు లేఖ రాస్తున్నప్పుడు ఎంత మర్యాదగా రాస్తారో అంత మర్యాదగా శివాజీకి జాబు రాశారు రామదాసు గారు. ఆ తర్వాత శివాజీని తన దగ్గరకు పిలిపించుకుని రహస్యంగా ఉపదేశం చేశారు. శివాజీకి గురువు పట్ల ఎనలేని భక్తి ఉండేది. చలించని విశ్వాసం ఉండేది. అదే ఆయనకు శక్తినిచ్చింది.
ఒకసారి యుద్ధ సమయం సమీపించిన తరుణంలో శివాజీ శ్రీశైలం వచ్చి తపస్సు చేశారు. అమ్మవారిని మెప్పించి ఖడ్గం పొందారు. ఎంతో బలం, బలగం ఉన్నా, శివాజీకి దైవభక్తి, గురుభక్తి అచంచలంగా ఉండేది. అదే ఆయన్ను అంత గొప్పగా నాయకుడిగా నడిపించింది.
Sunday, 19 February 2017
వీర మాత జీజాభాయి
ఒక కుండ మంచి ఆకారంతో, మన్నికతో, నాణ్యతతో రూపు దిద్దుకోవాలంటే అది కుమ్మరి సృజనాత్మకత, నిపుణత మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే ఛత్రపతి శివాజీ మహరాజు కూడా హైందవి స్వరాజ్యం స్తాపించడానికి అడ్డుపడుతున్న శత్రువులను ఎదురుకోవడానికి ఎంతో శిక్షణ పొందారు.
మాత జీజాబాయి మ్హకసా బాయి, మరియు లఖొజి జాదవ్ కు సింధ్ఖెడ్ రాజ్యంలో జన్మించారు. ఆమె పెరిగేకొద్ది, మొఘలాయుల పాలనలో హిందువులు అనుభవించే బాధలు ఆమేకు అవగాహనకు వచ్చేవి. ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకునే వయస్సులో జీజాభాయి కత్తి స్వాము నేర్చుకునేది. జీజాభాయి తల్లి కూడా ఆమెకు సాహసం కు సంబంధించిన కథలు చెప్పి ఎంతో శిక్షణ ఇచ్చేది.
దేశం పరిస్థితి ఎలా ఉండేది అంటే మొఘలాయులకు సేవ చేయుట, వారి కింద అధికారులుగా పని చెయుట, వారి కోసం సొంత ప్రజలనే ఎత్తుకొచ్చి వారికి అప్పగించుట. హిందూ స్త్రీలు ముస్లింలచే అపహరింపబడి అమ్ముడుబోయేవాళ్ళు! అయినా సమాజం నోరుమెదపకుండా చూస్తూ ఊరుకునేది. రైతులు ఖాళి కడుపులతో మొఘలాయుల కోసం రెక్కలు ముక్కలు చేసేవాళ్ళు. ఈ అన్యాయన్ని ఎదిరించడానికి ఒక వ్యక్తి కోసం జీజా భాయి ఎదురుచూస్తోంది.
1605 లో జీజాభాయి సహాజి రాజె భొన్సలే ని పెళ్ళాడింది. తన ప్రార్థనల తో అమ్మ భవానిని "మంచి తేజస్సు, సాధన, స్వరాజ్యాన్ని స్తాపించగల సామర్ధ్యం గల పుత్రుడిని ప్రసాదించమని కోరుకునేది.
సహాజి రాజుని పెళ్ళడిన తరువాత, తన భర్త మొగల్ రాజుల దగ్గర, అదిల్ షా, నిజాం షా దగ్గర తక్కువగా చూడబడడం, అవమానింపబడడం సహించలేకపోయేది. తన భర్త ఎంత శక్తివంతుడు అయినప్పటికి తగిన గుర్తిపు, భధ్రత లేవు అని మరియు సమాజానికి తోడ్పడదం లేదని భావించేది. బిడ్డ పుట్టకముందే అతడి లక్ష్యాన్ని నిర్ణయించిన ఎకైక స్త్రీ ఈ చరిత్రలో మాత జీజాభాయి ఒక్కరే !
అమ్మ భవాని జీజాభాయి కోరికను తీర్చింది. ఎందుకంటే జీజాభాయి బాధలను అమ్మ కూడా పంచుకుంది. స్త్రీ అపహరణ, ఆలయాల కూల్చివేత, శత్రు సైనికులైన మొగల్, అదిల్ షా, నిజాం షాహ్ ఆలయాల్లోని విగ్రహాలను పగలగొట్టుట ఇవన్నీ చూడలేక అమ్మ భవాని, జీజాభాయి హైందవి స్వరాజ్యం స్వప్నాన్ని పంచుకున్నారు.
మాత జీజాభాయి శివాజీకి రాముని, కృష్ణుని, భీముని కథలు చెప్పి అన్యాయన్ని ఎలా ఎదిరించాలో, అమాయక ప్రజలను బానిసత్వం నుండి ఎలా విముక్తి చేయాలో బొధించేది. ఈ కథలన్నిటిని విన్న శివాజీ స్వేచ్ఛయే దారిగా అదే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు.
జీజా మాత శీవాజికి రాజనీతి కూడా బోధించేది. శివాజీ ని ధైర్య సాహసాలతో పోరాడేటట్టుగా తయారు చేసింది. తానే సొంతగా శివాజీ వివిధ ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నపుడు పర్యవేక్షించేది. జీజా మాత అందించిన దిశానిర్దేశకత్వంతో, శివాజీ ఎన్నో పరిస్థితుల నుంచి అద్భుతంగా బయటపడగలిగాడు. అఫ్జల్ ఖాన్‌ని వధించుట, ఆగ్రా లో బంధిస్తే తప్పించుకొనుట మొదలగునవి.
జీజా మాత రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించింది. తల్లిగా ప్రేమని పంచిపెట్టింది మరియు తండ్రిగా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రతిభ, తెలివి తేటలను నేర్పించింది.
కేవలం జీజా మాత అందించిన శిక్షణ వలనే, శివాజీ మహరాజ్ కొన్ని శతాబ్ధాల ముస్లిం పాలనను మట్టికల్పించి హైందవి స్వరాజ్యాన్ని స్తాపించాడు.
శివాజీ మహరాజ్ ఛత్రపతిగా పట్టాభిషక్తుడయ్యెవరకు జిజా మాత బ్రతికే ఉన్నారు. తన భర్త తోడు లేకపోయినా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి, హైందవి స్వరాజ్యం స్తాపింపబడడానికి ఎంతో తోడ్పడ్డారు. శివాజీ మహరాజ్ కు పట్టాభిషేకం అయిన 12 రోజుల తరువాత స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు.
*గమనిక: ఈ వ్యాసం "హిందూ జనజాగృతిలో ప్రచురించబడిన ఆంగ్ల వ్యాసంలోంచి అనువదింపబడినది. ఆంగ్ల వ్యాసం చదవదలుచుకుంటే ఈ లంకె లోకి వెల్లండి: http://www.hindujagruti.org/articles/37.html
Source: తెలుగు మీడియా
Subscribe to:
Posts (Atom)

