Sunday 19 February 2017

వీర మాత జీజాభాయి


ఒక కుండ మంచి ఆకారంతో, మన్నికతో, నాణ్యతతో రూపు దిద్దుకోవాలంటే అది కుమ్మరి సృజనాత్మకత, నిపుణత మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే ఛత్రపతి శివాజీ మహరాజు కూడా హైందవి స్వరాజ్యం స్తాపించడానికి అడ్డుపడుతున్న శత్రువులను ఎదురుకోవడానికి ఎంతో శిక్షణ పొందారు.

మాత జీజాబాయి మ్హకసా బాయి, మరియు లఖొజి జాదవ్ కు సింధ్ఖెడ్ రాజ్యంలో జన్మించారు. ఆమె పెరిగేకొద్ది, మొఘలాయుల పాలనలో హిందువులు అనుభవించే బాధలు ఆమేకు అవగాహనకు వచ్చేవి. ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకునే వయస్సులో జీజాభాయి కత్తి స్వాము నేర్చుకునేది. జీజాభాయి తల్లి కూడా ఆమెకు సాహసం కు సంబంధించిన కథలు చెప్పి ఎంతో శిక్షణ ఇచ్చేది.

దేశం పరిస్థితి ఎలా ఉండేది అంటే మొఘలాయులకు సేవ చేయుట, వారి కింద అధికారులుగా పని చెయుట, వారి కోసం సొంత ప్రజలనే ఎత్తుకొచ్చి వారికి అప్పగించుట. హిందూ స్త్రీలు ముస్లింలచే అపహరింపబడి అమ్ముడుబోయేవాళ్ళు! అయినా సమాజం నోరుమెదపకుండా చూస్తూ ఊరుకునేది. రైతులు ఖాళి కడుపులతో మొఘలాయుల కోసం రెక్కలు ముక్కలు చేసేవాళ్ళు. ఈ అన్యాయన్ని ఎదిరించడానికి ఒక వ్యక్తి కోసం జీజా భాయి ఎదురుచూస్తోంది.

1605 లో జీజాభాయి సహాజి రాజె భొన్సలే ని పెళ్ళాడింది. తన ప్రార్థనల తో అమ్మ భవానిని "మంచి తేజస్సు, సాధన, స్వరాజ్యాన్ని స్తాపించగల సామర్ధ్యం గల పుత్రుడిని ప్రసాదించమని కోరుకునేది.

సహాజి రాజుని పెళ్ళడిన తరువాత, తన భర్త మొగల్ రాజుల దగ్గర, అదిల్ షా, నిజాం షా దగ్గర తక్కువగా చూడబడడం, అవమానింపబడడం సహించలేకపోయేది. తన భర్త ఎంత శక్తివంతుడు అయినప్పటికి తగిన గుర్తిపు, భధ్రత లేవు అని మరియు సమాజానికి తోడ్పడదం లేదని భావించేది. బిడ్డ పుట్టకముందే అతడి లక్ష్యాన్ని నిర్ణయించిన ఎకైక స్త్రీ ఈ చరిత్రలో మాత జీజాభాయి ఒక్కరే !

అమ్మ భవాని జీజాభాయి కోరికను తీర్చింది. ఎందుకంటే జీజాభాయి బాధలను అమ్మ కూడా పంచుకుంది. స్త్రీ అపహరణ, ఆలయాల కూల్చివేత, శత్రు సైనికులైన మొగల్, అదిల్ షా, నిజాం షాహ్ ఆలయాల్లోని విగ్రహాలను పగలగొట్టుట ఇవన్నీ చూడలేక అమ్మ భవాని, జీజాభాయి హైందవి స్వరాజ్యం స్వప్నాన్ని పంచుకున్నారు.

మాత జీజాభాయి శివాజీకి రాముని, కృష్ణుని, భీముని కథలు చెప్పి అన్యాయన్ని ఎలా ఎదిరించాలో, అమాయక ప్రజలను బానిసత్వం నుండి ఎలా విముక్తి చేయాలో బొధించేది. ఈ కథలన్నిటిని విన్న శివాజీ స్వేచ్ఛయే దారిగా అదే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు.

జీజా మాత శీవాజికి రాజనీతి కూడా బోధించేది. శివాజీ ని ధైర్య సాహసాలతో పోరాడేటట్టుగా తయారు చేసింది. తానే సొంతగా శివాజీ వివిధ ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నపుడు పర్యవేక్షించేది. జీజా మాత అందించిన దిశానిర్దేశకత్వంతో, శివాజీ ఎన్నో పరిస్థితుల నుంచి అద్భుతంగా బయటపడగలిగాడు. అఫ్జల్ ఖాన్‌ని వధించుట, ఆగ్రా లో బంధిస్తే తప్పించుకొనుట మొదలగునవి.

జీజా మాత రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించింది. తల్లిగా ప్రేమని పంచిపెట్టింది మరియు తండ్రిగా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రతిభ, తెలివి తేటలను నేర్పించింది.

కేవలం జీజా మాత అందించిన శిక్షణ వలనే, శివాజీ మహరాజ్ కొన్ని శతాబ్ధాల ముస్లిం పాలనను మట్టికల్పించి హైందవి స్వరాజ్యాన్ని స్తాపించాడు.

శివాజీ మహరాజ్ ఛత్రపతిగా పట్టాభిషక్తుడయ్యెవరకు జిజా మాత బ్రతికే ఉన్నారు. తన భర్త తోడు లేకపోయినా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి, హైందవి స్వరాజ్యం స్తాపింపబడడానికి ఎంతో తోడ్పడ్డారు. శివాజీ మహరాజ్ కు పట్టాభిషేకం అయిన 12 రోజుల తరువాత స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు.

*గమనిక: ఈ వ్యాసం "హిందూ జనజాగృతిలో ప్రచురించబడిన ఆంగ్ల వ్యాసంలోంచి అనువదింపబడినది. ఆంగ్ల వ్యాసం చదవదలుచుకుంటే ఈ లంకె లోకి వెల్లండి: http://www.hindujagruti.org/articles/37.html

Source: తెలుగు మీడియా

No comments:

Post a Comment