Monday 13 June 2016

జూన్ 13, స్వామి నిగమానంద సరస్వతీ వర్ధంతి


అవిరళ గంగ, నిర్మల గంగ - గంగా ప్రవాహం ఎక్కాడా ఆటంకం లేకుండా సాగిపోవాలి, గంగ కలుషితం కాకుండా నిర్మలంగా ఉండాలి - అనే నినాదంతో స్వామి నిగమానంద 19 ఫిభ్రవరి 2011 న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 4 నెలలు, 115 రోజుల పాటు పోరాడి జూన్ 13, 2011 న తనువు చాలించారు.

గంగానది భారతీయులకు దేవత, అమ్మ, జీవం, సర్వం. అటువంటి గంగా నది పుట్టిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలోనే అనేకమంది దుర్మార్గులు గంగను కలుషితం చేస్తున్నారు. అడుగడుగున ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఆ రాస్ట్రంలో సరాసరి సగటున గంగ మీద ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ప్రాజెక్టు ఉందని అధ్యయనాల్లో తేలింది. అదే కాక, గంగానదిలో అక్రమ ఇసుక మాఫియా, రాళ్ళ మైనింగ్ పెద్ద ఎత్తున జరిగేవి. ఇవన్నీ గంగ పవిత్రతను దెబ్బ తీయడమే కాదు, అందులోని ఔషధి తత్త్వాన్ని సైతం నశింపజేస్తున్నాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. హిమాలయ పర్వత సాణువులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. గంగలో జరిగే అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని, మాఫియాను నిర్మూలించాలని, గంగను కాపాడలని 1997 లో యువ సన్యాసులు, సాధువులు ఉద్యమం మొదలుపెట్టారు. ఎందరో మేధావులు సైతం మద్దతు పలికారు. ఆ ఉద్యమంలో స్వామి నిగమానంద కూడా పాల్గొన్నారు.

అలా గంగా రక్షణ ఉద్యమాన్ని తీవ్రం చేయడం కోసం స్వామిజి 17 ఫిభ్రవరి 2011 లో నిరాహార దీక్ష ప్రారంభించగా, ఆరోగ్యం క్షీణించిందని 68 వ రోజు, 27 ఏప్రియల్ న ఆసుపత్రిలో చేర్చారు. 30 ఏప్రియల్ నాడు ఎవరో దుండగుడు నర్సు వేషంలో వచ్చి, స్వామికి ఇంఫెక్షన్ కలిగించే ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ విషయం రిపోర్టుల్లో కూడా తేలింది. ఆ ఇచ్చింది కూడా మైనింగ్ మాఫియానే అని ఆరోపణలున్నాయి. అయినా నిగమానంద తన పోరాటాన్ని ఆపలేదు. చివరకు జూన్ 13 న తనువు చాలించారు.

విచిత్రమైన విషయం ఏమిటంటే ఈయన ఇంత పెద్ద దీక్ష చేపడితే, మీడియా ఆయన మరణించేవరకు కనీసం ఒక్క రోజు కూడా ఆ విషయాన్ని చూపించలేదు. విదేశీ డబ్బు తిని పర్యావరణ పరిరక్షణ అంటూ అరించే ఎన్జీవోలు, కుహనా - మేధావులు, కమ్యూనిష్టులు మద్దతు పలకలేదు. అప్పుడు ఆ రాష్ట్రలో బిజేపీ ఆధికారంలో ఉన్నా, నిగమానంద డిమాండ్‌ను పట్టించుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తలేదు. ఆ మైనింగ్ మాఫియాలో అన్ని పార్టీల వారు ఉండడమే ఇందుకు కారణం. అదేకాక ఆ సమయంలోనే అవినీతిపై దీక్ష చేసిన బాబా రాందేవ్‌ను మీడియా బాగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత వీరి దీక్షకు కొనసాగింపుగా స్వామి శివానంద దీక్ష చేపట్టిన తర్వాత 11 రోజులకు, నవంబరులో హరిద్వార్ ప్రాంతంలో మైనింగ్ ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

వీరి ఆఖరి కోరిక ఇంతవరకు నెరవేరలేదు. గంగ మీద ఇప్పటికీ విచ్చలవీడిగా ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు. అవిరళ గంగా - నిర్మల గంగా ఇంకా కలగానే ఉంది. నదులకు సనాతన సంస్కృతిలో ప్రత్యేక స్థానముంది. వాటిని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంత ఉందో, ఆ దిశగా గొంతు విప్పి, సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది.

స్వామి నిగామానందకు శ్రద్ధాంజలి ఘటిస్తూ .................

No comments:

Post a Comment