Showing posts with label రాజీవ్ మల్‌హోత్రా. Show all posts
Showing posts with label రాజీవ్ మల్‌హోత్రా. Show all posts

Sunday, 3 May 2020

రాజీవ్ మల్హోత్రా గారి స్వల్పకాలిక course ద్వారా లాక్‌డౌన్ని సద్వినియోగపరుచుకోండి.


మన మీద యుద్ధం, కానీ శత్రువు కనిపించడు. ఆయుధం మన చేతికే ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆయుధాలతో మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాము. తెలిసీతెలియక ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతున్నామనుకునే వాళ్ళు సైతం, విచ్ఛినం చేసే ప్రయత్నాల్లో భాగవమవుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.... ఇప్పుడు చాలామంది పరిస్థితి అలానే ఉంది.

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా (Rajiv Malhotra) గారు 15 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

మరి మనకు కావల్సింది బౌద్ధిక క్షత్రియులు (intellectual kshatiryas). అందుకోసం ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి ఆలోచన. అందుకే బౌద్ధిక క్షత్రియ (intellectual kshatiryas) అనే స్వల్పకాలిక పాఠ్యక్రమాన్ని (short term course) ని రూపొందించారు. ₹ 500/- రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని అందిస్తున్నారు. చివరలో సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

క్రింది పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవచ్చు.

Know what is happening in your own backyard by signing up for it today.



Thursday, 21 July 2016

ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఈ మధ్య బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పంజా విసిరిన తర్వాత, ఆ దుశ్చర్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో కొందరు ఇస్లాం ప్రవచనకారుడు జాకీర్ నాయిక్ వలన ప్రభావితమయ్యారని, ఉగ్రసాహిత్యాన్ని చెప్తున్న అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం అతనిపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ముస్లింలంతా తీవ్రవాదులుగా మారాలని చెప్పిన జాకీర్ నాయిక్ అన్యమతాలను తన ప్రవచనాల్లో వక్రీకరించి మతమార్పిడులకు బీజం వేస్తున్నాడు. ఇదంతా పత్రికల్లో చదివాము, వార్తల్లో చూశాము. అయితే ఈ సందర్భంలో మీడియా జాకిర్ నాయిక్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని సంబోధించింది. అసలు ఆధ్యాత్మికవేత్త అని ఎవరిని అనాలి?

ముందు మనం గుర్తించవలసింది, మనకు కావల్సింది పరస్పర గౌరవం. మన ధర్మాన్ని ఏ మతం గౌరవిస్తుందో, మనం ఆ మతాన్ని గౌరవించాలి. గౌరవం పొందాలనుకునేవారు ఇతరులను గౌరవించాలి. సహనం అనేది పాతమాట. సహనం పేరుతో ఎదుటివాడి ఎన్ని దురాగతాలు చేసినా భరించాలనే స్థాయికి మనల్ని దిగజార్చారు.

ఆయా మతాలను గౌరవిస్తూనే వారి మనకూ బేధం తెలుసుకుందాం. అప్పుడు ఈ మాట ఎవరికి వాడవచ్చో అర్దమవుతుంది. అధ్యాత్మ / ఆధ్యాత్మ - అనగా తన యందే (On oneself) అని అర్దం. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడైన భగవంతుడిని తన (ఆత్మ) యందే దర్శించడం ఆధ్యాత్మ విద్య. ఆ విధమైన జీవినమే ఆధ్యాత్మికత. సర్వజీవులలో ఆత్మ ఉంటుందని, మనకు కలిగే బాధ, వాటికి కలిగే బాధ ఒకటేనని, అందువల్ల సర్వజీవులను తనవలే భావించినవాడు మాత్రమే ముక్తికి అర్హుడని సనాతనధర్మం చెప్తోంది. సనాతన ధర్మంలో ఆత్మ శుద్ధమైనది, పాపరహితమైనది, పవిత్రమైనది. జీవుడు తాను పాపరహితుడని, తనలో దైవం ఉన్నదని, తాను కూడా దైవాంశేనని తెలుసుకునే క్రమమే ఆధ్యాత్మికత. ఇక్కడ మధ్యవర్తుల పాత్ర ఏమాత్రం ఉండదు, చరిత్రలో జరిగిన ఒక చారిత్రిక సంఘటనను నమ్మాలసిన అవసరంలేదు. గురువు ఉన్నా, అతను మార్గదర్శియే కానీ, విచారించి తెలుసుకోవాల్సింది మాత్రం సాధకుడే.  ఆ సాధన కోసం వచ్చినవే భక్తి, జ్ఞాన, కర్మయోగాలు, ధ్యానం, ప్రాణాయామం మొదలైన పద్ధతులు. ఇందులో పునర్జన్మ - కర్మ సిద్ధాంతం ఎంతో ముఖ్యంగా కనిపిస్తుంది.

అబ్రహామిక్ మతాల్లోకి వెళ్తే, అక్కడ ఉండేది సోల్ (Soul). సోల్ #ఆత్మ కాదు. ఎందుకంటే సోల్ శుద్ధమైనది, పవిత్రమైనది, దైవాంశ అని ఆ మతగ్రంధాలు ఒప్పుకోవు. ఈ సోల్ మళ్ళీ అన్ని జీవులలో ఉండడు. అది కేవలం మానవులకే పరిమితం. 18 వ శత్బాదం ముందువరకైతే సోల్ అనేది కేవలం రాజులోనే ఉంటుందని, మాములు వ్యక్తులలో, అందునా తక్కువ స్థాయి వారిలో ఉండదని నమ్మేవారు. స్త్రీలలో అసలే ఉండదని కూడా వారి నమ్మకం. అది కేవలం పురుషులకే పరిమితమైనది. సనాతనధర్మం యొక్క స్పర్శ తర్వాత ఆయా దేశాల్లో ఈ వాదం క్రమంగా తగ్గి, ఇప్పుడు కేవలం మనుష్యులకు మాత్రమే సోల్ ఉంటుందని చెప్తున్నారు. సర్వజీవులను తన వలే భావించిన వాడికి సాల్వేషన్ (Salvation) (సాల్వేషన్ మోక్షం ఒకటి కాదు) అని ఇందులో చెప్పబడలేదు. ఈ మతాల్లో సాల్వేషన్ కావాలంటే ఖచ్ఛితంగా కాలంలో ఒకానొక సమయంలో జరిగిన చారిత్రిక సంఘటనను (historical event) నమ్మాలి, ప్రవక్త ద్వారానే వస్తుందని విశ్వసించాలి. వ్యక్తి అంతర్ముఖమై తన సోల్ ను సాక్షాత్కారించుకునే అవకాశం లేదు. కేవలం గాడ్ ని నమ్మడం వల్లనే సాల్వేషన్. భక్తి, జ్ఞాన, కర్మయోగం, ధ్యానం వంటి పద్ధతులు లేవు. అసలు అంతర్ముఖమవ్వడం అనేదే లేదు. సోల్ దైవాంశ అని నమ్మడం ఇస్లాంలో పెద్ద దైవనింద. గాడ్ కి ఏ ఇతర వస్తువుతోనైనా సంబంధం పెడితే, శాశ్వత నరకంలో పడతారు. వారికి సాల్వేషన్‌కు అవకాశం ప్రవక్త జన్మించడం వలననే ఏర్పడింది.

మనలాగా తమ యందు మనోబుద్ధులను, ఇంద్రియాలను నిగ్రహించుకుని, చిత్తాన్ని శుద్ధి చేసుకుని, సాధనతో ముక్తిని పొందే మార్గాలు అవి చెప్పవు. కనుక వాటిని బోధించేవారిని ఆధ్యాత్మికవేత్త అనకూడదు. అత్మస్పర్శ ఉండి, పునర్జన్మ, కర్మ మొదలైన సనాతనధర్మానికి చెందిన సిద్ధాంతాల గురించి చెప్పేవారిని మాత్రమే ఆధ్యాత్మికవేత్తలనడం సరైన పద్ధతి. అదేకాక ఇలా ఆయా మతాల ప్రవచనకారులను ఆధ్యాత్మికవేత్తలనడం ఆ మతగ్రంధాలను అవమానించడమే అవుతుంది. వాళ్ళతో మనల్ని సమానం చేసి, మనల్ని అవమానించినట్లు కూడా అవుతుంది. కాబట్టి వారి వారి గ్రంధాలను అనుసరించి ఏమనాలో అదే అంటే బాగుంటుంది.

రాజీవ్ మల్హోత్రా గారి రచనల ప్రేరణతో

Monday, 6 June 2016

ముందు మీ వాళ్ళని ఉద్ధరించుకోమని మీ దేవుడికి చెప్పండి

(మనకూ, అన్యమతాలకు మధ్య వ్యత్యాసం)

ఈ మధ్య ముస్లింలు, క్రైస్తవులు సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, సృష్టిని పూజిస్తే నరకంలో పడతారని ఖూరాన్, బైబిల్ నుంచి కొన్ని వ్యాఖ్యాలను చూపిస్తున్నారు. వారొక విషయం అర్దం చేసుకోవాలి. అబ్రహామిక్ మతాల్లో (యూదు, క్రైస్తవం, ఇస్లాం) మతాల్లో సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఈ సృష్టికి దూరంగా ఎక్కడో ఆకాశంలో సృష్టికర్త పెద్ద కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనకు ఈ సృష్టితో సంబంధం లేదు. కనుక ఎవ్వరిలోనూ భగవంతుని చూడకూడదు. అందుకే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, దేశాన్ని ప్రేమించడం, జెండాను గౌరవించి, వందనం సమర్పించడం ఆ మతాల దేవుడు నిషేధించాడు. ఆయన సర్వానతర్యామి కాదు. ఆయన నిరాకారుడని చెప్తారు, మగవాడు కూడా. స్త్రీ దేవతలుండరు. ఆ మతస్థులు సృష్టిని పూజిస్తే నరకంలో పడతారు. వాళ్ళ భగవంతుడితో వాళ్ళకి ఎళ్ళవేళలా access ఉండదు. చరిత్రలో ఒక ప్రత్యేక సమయంలో వచ్చిన ఒక ప్రవక్త యొక్క మాటలను నమ్మి, మతాన్ని పాటిస్తే, సృష్టి అంతమైన సమయంలో వారి దేవుడు వాళ్ళకి నరకమో, స్వర్గమో ఇస్తాడు. ఆయన భూతకాలం (past) లో ఒకానొక 'చారిత్రిక' సందర్భంలో కలజేసుకుని పంపిన ప్రవక్త మాటల యందు విశ్వాసం ఉంచితే, భవిష్యత్తు (future) లో వీరికి తగిన ఫలితం వస్తుంది. వర్తమానం (present) తో సంబంధం లేదు. అది వారి మతం.

హిందువుల విషయంలోకి వస్తే 'సర్వం ఖల్విదం బ్రహ్మ', 'ఈశావాస్యం ఇదం సర్వం' వంటి అనేక ఉపనిషత్తుల వ్యాక్యాలు ఉన్నాయి. ఉన్నది బ్రహ్మం తప్ప వేరొకటి కాదు, చరాచరామైన ఈ జగత్తు, దానికి ఆవల, అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని వాటికి అర్దం. ఇలాంటి అనేక వ్యాక్యాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కనిపించే ఈ సృష్టి కేవలం జడపదార్ధం కాదు, ఇందులోనూ ఈశ్వరుడున్నాడు. సృష్టిలోని ప్రతి అణువు యందు భగవంతుడున్నాడు. సృష్టి ఆయనే, సృష్టికి అతీతుడు ఆయనే. ఆయన సర్వాంతర్యామి. ఆయనతో మనకు ఎల్లవేళలా access ఉంది. మాములు access కాదు immediate access. ఆయన చరిత్రలో ఒక సమయంలో కలగజేసుకుని, ఒక వ్యక్తిని పంపి అతడిని నమ్మితేనే స్వర్గం అని చెప్పలేదు. ఇక్కడ ఎవరికి వారుగా తమలో, తమ చుట్టూ, సృష్టి అంతా ఈశ్వరుని దర్శించి, ఆయన యందు ఐక్యమవుతారు. మన ధర్మంలో బ్రహ్మం స్త్రీ కాదు, పురుషుడు కాదు, నంపుంసకుడు కాదు. ఆయన శుద్ధమైన చైతన్యం. కానీ అదే బ్రహ్మం సాకరమైనప్పుడు, ఆయన్ను పురుషుడిగాను, స్త్రీగాను ఆరాధించే సౌలభ్యం కూడా ఉంది. ఆయన నిరాకారుడే కానీ సాకారుడు కూడా. నిర్గుణుడు, సగుణుడు. అరూప రూపి. ఎప్పుడో భూతకాలం (past) లో వచ్చిన వ్యక్తులనే విశ్వసించి, ధర్మాన్ని పాటిస్తే, భవిష్యత్తు (Future) లో ఆయన వచ్చి ముక్తినిస్తాడని ధర్మంలో చెప్పలేదు. జీవుడు వర్తమానం (present) లో ఉంటూనే తనకు తానుగా ఈశ్వరానుగ్రహంతో, శాస్త్రాల్లో చెప్పిన సాధనతో ముక్తిని పొందవచ్చు. దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించమని, తల్లిదండ్రులను, పెద్దలను, ఆచార్యులను గౌరవించమని ఉపనిషత్తులే చెప్తున్నాయి. అలా గౌరవించి, అన్నిటి యందు భగవంతుని చూసే స్థితికి చేరుకోమని మన ధార్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మన ధర్మం.

సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, లేదంటే నరకానికి పోతారు అని చెప్పిన బైబిల్, ఖురాన్ వ్యాక్యాలు ఆ గ్రంధాలను విశ్వసించే క్రైస్తవులకు, మహమ్మదీయులకు వర్తిస్తాయి కానీ వేదాలను, ఉపనిషత్తులను ప్రామణికంగా భావించే హిందువులకు కాదు. అబ్రహామిక్ మతాల వారు ఆయుర్వేదం, యోగా, ధ్యానం, ముద్రలు, ఆసనాలు వేయకూడదు. ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నామని చెప్పుకున్నా, యోగా యొక్క ప్రధాన ఉద్దేశ్యం వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ఈశ్వరుని ఆరాధించడం, ఆయన్ను చేరుకునే మార్గంలో నడవడం. ఇది హైందవేతర మతాల్లో పెద్ద పాపం. ఆయా మతస్థులు ఇవి చేయకూడదు. ప్రవక్తను కాదని, ఆయన చెప్పిన మార్గంలో కాక తమకు తాముగా ఈశ్వరుని చేరే అవకాశం అవి ఇవ్వవు. వీటికి ఆ మతస్థులు దూరంగా ఉండడమే ఆయా మతాల పట్ల వారి గౌరవాన్ని ప్రకటించడం.

హిందువులకు వేద వ్యాక్యాలే ప్రామాణికం. అలా కాదు, మా దేవుడు మీ హిందువులను నరకంలో పడేస్తాడని మీరు అంటే, మా పని తర్వాత, ముందు మీ వాళ్ళని ఉద్ధరించుకోమని మీ దేవుడికి చెప్పండి, ఆయన పని ఆయన్ను చూసుకోమనండి (Let your God mind his own business), మీ దేశాల్లో జనం ఒకే మతస్థులైనా, పరస్పరం విద్వేషాలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టిస్తున్నారు దాన్ని ఆపమని చెప్పండి అని మేము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయినా మీ దేవుడు మమ్మల్ని నరకంలో పడవేయాలని చూస్తే, మా దేవుళ్ళేమీ చూస్తూ ఊరుకోరని గుర్తించుకోండి.

మీకు ఇది కేవలం సృష్టి మాత్రమే, కానీ మా ఉపనిషత్తుల ఆధారంగా ఇది మాకు ఈశ్వరుని అభివ్యక్తీకరణ (For you, this (creation) is mere creation and not anything else, but for us as per Upanishads statements, this creation is manifestation (of divine). మీ గ్రంధాల్లో ఏమున్నా, మేము మిమంలని గౌరవిస్తాము, మీ నమ్మకాలను, ఆరాధనను తక్కువ చేయడంలేదు, మీ నుంచి తిరిగి అదే ఆశిస్తున్నాము.

ఇప్పుడు మతాల మధ్య కావల్సింది పరస్పర గౌరవం (mutual respect). మీరు మమ్మల్ని గౌరవిస్తేనే మేము మిమ్మల్ని గౌరవిస్తాం.

(రాజీవ్ మల్‌హోత్రా  రచనల ఆధారంగా)