Showing posts with label సద్గురు జగ్గీ వాసుదేవ్. Show all posts
Showing posts with label సద్గురు జగ్గీ వాసుదేవ్. Show all posts

Tuesday, 2 February 2016

సద్గురు జగ్గీవాసుదేవ్ చెప్పిన కధ



నన్ను కలవడానికి వచ్చిన ఓ యువకుడు నన్నిలా ప్రశ్నించాడు. 'సద్గురూ! నాకు ఇండియాలోనే ఉండాలన్నది ఆశ. కానీ, ఇక్కడకన్నా పది రెట్లు జీతం ఎక్కువని మా అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాడు. నాలాంటి యువకులకు ఇండియాలో భవిష్యత్తు లేదా?" అని.
ఈ ప్రశ్నే చాలా వేడుకగా ఉంది.

ఎండాకాలంలో శంకరన్ పిళ్ళై మకాము గ్రామానికి మార్చాడు. ఏరు పారేచోటు ఎండి ఇసుక దారిగా మారిపోయింది. అక్కడ ఒక గుడిసె వేసుకుని భార్యబిడ్డలతో కాపురం పెట్టాడు. వానాకాలం వచ్చింది. ఏరు పొంగి పారింది. అన్నిటినీ పెకలించుకు పోతున్న వరదనీరు శంకరన్ పిళ్ళై గుడిసెను కూడా వదల్లేదు. వరద పొంగు తగ్గింది. శంకరన్ పిళ్ళై ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టాడు. మళ్ళీ అక్కడే గుడిసె వేశాడు.

మామూలు జీవితానికి అతనికి దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆ లోపు మళ్ళీ వానాకాలం వచ్చింది . మళ్ళీ వరద.గుడిసె తునాతునకలైపోయింది. అంతా నీటిలో కొట్టుకుపోయింది. శంకరన్ పిళ్ళై ఎంతో ప్రయాసపడి చాలా నెలలకు మళ్ళీ అదేచోటు గుడిసె వేశాడు. మళ్ళీ వరద వచ్చినపుడు గుడిసె పాడైపోయింది.
శంకరన్ పిళ్ళై ఒక జ్యోతిష్యు ణ్ణి కలిసి తన జాతకాన్ని చూపించాడు. "అయ్యా! నా గుడిసె ఎన్నే ళ్ళిలా ఏరులో కొట్టుకపోతుందో చెప్పగలరా?" అని అడిగాడు.
ఏరు పారేదారిలో గుడిసె వెయ్య కూడదనే జ్ఞ్యానం ఉండి ఉంటే, శంకరన్ పిళ్ళై జోస్యుడని వెతకాల్సిన పనేలేదు కదా? శంకరన్ పిళ్ళైలాగే మీరూ నన్ను భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఎం చేయాలని ఆలోచించడానికి, మీ బాధ్యత స్వీకరించడానికి మీరు తయారుగా లేరు. అయితే, 50 ఎళ్ళ తర్వాత దేశం ఏమవుతుంది అని జోస్యం అడుగుతున్నారు. అంతేకదా!

మీలాంటి బాధ్య తారాహిత్యులు వున్నంతవరకు, మీలాంటివారుండే దేశం ఏమవుతుంది? ఎలా ఎదుగుతుంది? చీకటిని తొలగించడానికి దీపం వెలిగించకుండా 'చీకటి ఎప్పుడు పోతుంది? వెలుగు ఎప్పుడు వస్తుంది?' అని ఎవరికైనా చేయి చూపిస్తూ కుర్చోవడాన్ని తెలివిటేతలంటారా? ఏం జరుగుతోందని మిగిలిన గ్రహాల్ని చూసి లెక్క వేయడాన్ని వదిలేసి, మీరు జీవిస్తున్న గ్రహాన్ని కాస్త బాధ్యతాయుతంగా చుడండి.

ఈ భూమిలో వీధుల్ని మార్చినవాళ్ళంతా ఆయా కాలాల్లో ఉన్నవాటినీ, అవసరమైనవాటినీ గమనించి ఎంతో ప్రేమగా తమ బాధ్యతల్ని నెరవేర్చారు. 50 ఏళ్ళు లేదా 500 ఏళ్ళు లేదా 5000 ఎళ్ళ తర్వాత ఎవరైనా దీన్ని చేయకపోతారా అని వాళ్ళు ఎదురు చూడలేదు.

- సద్గురు జగ్గీవాసుదేవ్

sent by Ashwin kumar Dulluri

Tuesday, 26 January 2016

సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పిన చిన్న కధ

ఓసారి ఓ రాజుకు చెడ్డకల వచ్చింది. దాని ఫలితం తెలుసుకోవాలనుకుని జోస్యుల్ని  పిలిపించాడు. ఒక జోస్యుడు తాటాకులు తెరిచి "చెడు వార్త.. నీ భార్య, పిల్లలు, భంధువులు అందరూ నీ కళ్ళముందే పోతారు అని నాదిజోస్యం చెప్తోంది" అన్నాడు.
రాజుకు కోపం వచ్చింది. "నా వాళ్ళంతా చనిపోతారని చెప్పిన వీడిని చెరలో వేయండి" అని ఆజ్య్నాపించాడు. తర్వాత వచ్చిన జోస్యుడు కూడా అదే చదివాడు.
అయితే వేరేలా చెప్పాడు. "మంచివార్త, నీ ఆయువు గట్టిది. నీ భంధువులు, భార్య, పిల్లలకన్నా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు" రాజు అతనికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఇద్దరు జోస్యులు ఒకే విషయాన్ని చదివి రెండు రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళు విషయాన్ని చూసిన కోణంలో వాళ్ళ తెలివితేటలు ఇమిడి వున్నాయి.
కనుక, ఏ విషయాన్నైనా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా చూడండి. ప్రతి పరిస్థితిని మీకు సానుకూలం చేసుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించండి. గొడవ వుందా లేదా అన్నది పరిస్థితిలో లేదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాంట్లో వుంది. లభించినదాంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్న విషయంలో మీ తెలివితేటలు దాగుంటాయి. ఇది మీరు గుర్తెరగాల్సిన రహస్యం.
--- సద్గురు జగ్గి వాసుదేవ్

ఓసారి ఓ రాజుకు చెడ్డకల వచ్చింది. దాని ఫలితం తెలుసుకోవాలనుకుని జోస్యుల్ని  పిలిపించాడు. ఒక జోస్యుడు తాటాకులు తెరిచి "చెడు వార్త.. నీ భార్య, పిల్లలు, భంధువులు అందరూ నీ కళ్ళముందే పోతారు అని నాదిజోస్యం చెప్తోంది" అన్నాడు.

రాజుకు కోపం వచ్చింది. "నా వాళ్ళంతా చనిపోతారని చెప్పిన వీడిని చెరలో వేయండి" అని ఆజ్య్నాపించాడు. తర్వాత వచ్చిన జోస్యుడు కూడా అదే చదివాడు.
అయితే వేరేలా చెప్పాడు. "మంచివార్త, నీ ఆయువు గట్టిది. నీ భంధువులు, భార్య, పిల్లలకన్నా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు" రాజు అతనికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఇద్దరు జోస్యులు ఒకే విషయాన్ని చదివి రెండు రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళు విషయాన్ని చూసిన కోణంలో వాళ్ళ తెలివితేటలు ఇమిడి వున్నాయి.

కనుక, ఏ విషయాన్నైనా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా చూడండి. ప్రతి పరిస్థితిని మీకు సానుకూలం చేసుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించండి. గొడవ వుందా లేదా అన్నది పరిస్థితిలో లేదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాంట్లో వుంది. లభించినదాంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్న విషయంలో మీ తెలివితేటలు దాగుంటాయి. ఇది మీరు గుర్తెరగాల్సిన రహస్యం.

--- సద్గురు జగ్గి వాసుదేవ్

Via Ashwin Kumar Dulluri​

Tuesday, 19 January 2016

సద్గురు జగ్గివాసుదేవ్ - కష్టాలు -కధ

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి  అప్పగించారాదూ!” అన్నాడు.

 భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే  ఉంటాయి”  అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
 ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు  రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.

తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో  గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.

 రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు.  లోపల ధాన్యం  లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.

"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"

భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా  పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.

 అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.

జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

- సద్గురు జగ్గివాసుదేవ్

Sent by Ashwin Kumar Dulluri 

Tuesday, 5 January 2016

మిమ్మల్ని మీరు మార్చుకోండి - చిన్న కధ - సద్గురు జగ్గీ వాసుదేవ్

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.

జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.

"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.

రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.

ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.

శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.

ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.

మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----

Sent by Ashwin Kumar Dulluri