Tuesday 5 January 2016

మిమ్మల్ని మీరు మార్చుకోండి - చిన్న కధ - సద్గురు జగ్గీ వాసుదేవ్

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.

జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.

"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.

రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.

ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.

శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.

ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.

మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----

Sent by Ashwin Kumar Dulluri

No comments:

Post a Comment