Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Sunday, 18 March 2018
పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?
పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?
ఈ రోజు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చాక, చాలామంది క్యాలెండర్ చూసుకునేది కేవలం సెలవులు ఎప్పుడొస్తాయాని తెలుసుకోవటానికే. ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడి అలాంటిది. కానీ నిజానికి మనం పాటించేది క్యాలెండర్ కాదు, పంచాంగం.
పంచాంగం కేవలం బ్రాహ్మణులకు సంబంధించినది కాదు. అది ముహూర్తాల వరకే ఆగిపోదు. వండ్రంగివారు, మేస్త్రీలు, ముఖ్యంగా రైతులు ఈనాటికి పంచాంగం చూస్తారు. ఎప్పుడు నిర్మాణం మొదలుపెట్టాలి, కర్తరి ఎప్పుడు ఉంది అనేవి వడ్రంగి వారు చూస్తే, ఏ కార్తె ఎప్పుడు వస్తుంది, పంట ఎప్పుడు వేయాలి? ఏ నక్ష్త్రంలో పంట వేయాలి? అది ఊర్ధ్వముఖ నక్షత్రమా? అధోముఖమా? ఇలా ఎన్నో విషయాలను చూసి రైతు పంట వేస్తాడు. విత్తనం వేయడం దగ్గరే పంచాంగంతో పని మొదలవ్వదు. విత్తనాలు ఏ ఋతువులో సేకరించాలి, మేఘాలను, గాలిని, ప్రకృతిని పరిశీలించి రాబోయే కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి మొదలైన ఎన్నో విషయాలు జ్యోతిష్యం చెప్పింది. కృషి పరాశరా మొదలైన గ్రంథాలు వీటి గురించి విపులంగా వివరిస్తాయి. అంతెందుకు ఈనాటికి చాలా ఊళ్ళకు వెళితే, ఏ చదువు రాని వారు కూడా పంచాంగం చూసి, ఏ కార్తెలో ఎంత ఎండ కాస్తుంది, వర్షం ఎప్పుడు పడుతుంది అనేవి చెప్పేస్తారు. వారేమీ బ్రాహ్మణులు కారు. అందులో మాలమాదిగలు కూడా ఉన్నారు. పంచాంగం అందరిది. ముఖ్యంగా కాయకష్టం చేసుకుని, ప్రకృతి పై నేరుగా ఆధారపడి జీవించే శ్రమజీవులది, కృషీవలులది, కర్షకులది.
ప్రకృతి పులకించి, వసంతంలో చెట్లు చిగురించే సమయానికి ఉగాది వస్తుంది. అది ప్రకృతిలో నూతన ఆరంభానికి గుర్తు. అదే మన నూతన సంవత్సరం కూడా. అందుకే ఆ రోజు సాయంత్రం ఊళ్ళో అందరూ గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు, ఆ ఊరి పురోహితుడు, అక్కడి రైతులను, శ్రమజీవులను ఉద్దేశించి పంచాంగ పఠనం చేస్తారు. అక్కడ కూర్చున్నవారు పంచాంగ పఠనం చేస్తారు. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా కాస్తాయి, ఏ పంట బాగుంటుంది, ఆ సంవత్సరానికి నవనాయకులు ఎవరు? మొదలైనవి ఆసక్తిగా వింటారు ప్రజలు. అయితే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ప్రజలు నిత్యం పంచాంగం చూస్తూనే ఉంటారు.
కానీ గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది రైతుల్లో ఈ జ్ఞానం కొరవడుతూ వస్తోంది. అందుకే రైతన్న ఢీలా పడుతున్నాడు.
కాకపోతే ఇదే కాక మరో బాధాకరమైన అంశం ఏమిటంటే రాజకీయనాయకుల ఒత్తిడల వల్ల చాలామంది పంచాంగ కర్తలు అసలు విషయం చెప్పకుండా, ఉన్నవీ లేనివి కలిపి వారి మెప్పు కోసం పంచాంగం చెబుతున్నారు. పంచాంగం పరువు తీస్తున్నారు.
పాతతరం నుంచి కొత్త తరం పంచాంగం చూడటం నేర్చుకోవాలి. తద్వారా ప్రకృతిని ముందే గమనించి, అంచనా వేసి, ఇబ్బందులకు గురికాకుండా దేశానికి మంచి దిగుబడిని అందివ్వవచ్చు.
ఉగాది పచ్చడి - మనం మరిచిన ఆహారశైలి
ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు కలిగి ఉండటం, ఈ ఋతువులో వచ్చిన కొత్త బెల్లం, కొత్త చింతపండుతో దీన్ని చేయడం ప్రత్యేకత. ఈ పచ్చడి మనకు ఎన్నో సందేశాలను ఇస్తుంది. అయితే దాంతో పాటు ఇప్పుడు మనం మరిచిన మరొక విషయం కూడా గుర్తు చేస్తోంది.
నిత్యం స్వీకరించే భోజనం షడ్రసోపేతంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. షడ్రసోపేతం అంటే ఏంటో అనుకునేరు. ఆరు రకాల రుచులు కలిగి ఉండాలని అర్ధం అన్నమాట. అవే తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పదనం. ఈ ఆరింటిని షడ్రుచులు అంటారు. మన శరీరంలో కఫ, వాతం, పైత్యం అని మూడు దోషాలుంటాయి. ఆ మూడు సమతుల్యతతో ఉండటమే ఆరోగ్యం. ఆ మూడింటిలో ఏ ఒక్కటి చెడినా, లేదా వాటిలో అసమతుల్యత ఏర్పడినా, ఏదో ఒక రోగం వస్తుంది. మనకు వచ్చే ప్రతి రోగానికి ఈ మూడు దోషాల మధ్య అసమతౌల్యమే కారణం కనుక ఆయుర్వేదంలో ఇచ్చే ఔషధాలు, దేహంలో విజృంభించిన ఆ దోషాన్ని నివారించి, సమతౌల్యం ఏర్పరుస్తాయి. అయితే ఈ రోజు మనం చూసుకుంటే, మన పళ్ళెంలో 6 రకాల రుచులు ఉండనే ఉండవు. మనకు వీటిలో ఏదో ఒక రుచి అంటేనే ఎక్కువ ఇష్టం. నిజానికి చాలామంది ఆరింటిలో, మూడైనా తింటారా అంటే అదీ లేదు. ఒక్కటే రుచితో సరిపెట్టుకుంటారు. కొందరు తినడానికి డబ్బు లేక, అలా చేస్తే, ఇంకొందరు ఏదో ఒక రుచి మీద ఇష్టంతో అలా చేస్తారు. ఎలా చూసినా, కేవలం ఒక రుచిని అధికంగా స్వీకరించడం వలన శరీరంలో త్రిదోషాల మధ్య సమతుల్యం చెడుతుంది. అందుకే ఇప్పుడు మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి.
నిజానికి ఈ షడ్రుచులు కలిగిన ఆహారం తీసుకుంటున్నామంటే పోషకవిలువలు కలిగిన ఆహారం తింటున్నామనే అర్ధం. ఎందుకంటే ఒక్కొక్క రుచి, ఒక్కో రకం ఆహారంలో లభిస్తుంది. అదే సమయంలో ఇంకొక్క విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైననత వరకు దేశీమైన ఆహారాన్నే స్వీకరించాలి. ఉదాహరణకు కారం తగలడానికి మనం మిరపకాయను వాడతాము. ఈ మిరపకాయ ఎక్కడిది అనేది ప్రశ్న. నిజానికి మిరపకాయ మన దేశంలో పుట్టిన పంట కాదు. అది విదేశాల నుంచి ఈ దేశానికి మధ్యకాలంలో ప్రవేశించింది. మన దేశానికి చెందిన కారం రుచి కలిగిన వస్తువు, మిరియాలు. ఇది సహజంగానే భారతదేశానికి చెందిన మొక్క. అంటే దేశీయమైనవి. అందుకే మీకు ఆయుర్వేద వైద్యంలో మిరియాలు వాడటం కనిపిస్తుంది కాని మిరపకాయ ప్రస్తావన ఉండదు. అంతెందుకు ఉగాది పచ్చడిలోనే మిరపకాయ చేరిపోయింది. అలాంటిదే ఆలుగడ్డ. అది ఆంగ్లేయులు మన దేశానికి తీసుకువచ్చారు. ఇలాంటి విదేశీ వస్తువులను పెద్ద పెద్ద ఆలయాల వంటల్లో వాడరు. అందుకు ఉదాహరణ పూరీ క్షేత్రం. అక్కడ చేసే ప్రసాదాల్లో మిరప, ఆలుగడ్డ మొదలైనవి కనిపించవు.
దీనిలో అర్ధం ఒకటే. ఈ ప్రకృతి జడపదార్ధం కాదు. దానిలో చైతన్యం ఉంది. అది సాక్షాత్తు భగవంతుని వ్యక్తీకరణ అని సనాతన ధర్మం విశ్వసిస్తుంది. ఒక్కో ప్రాంతానికి తగినట్టుగా, వాతావరణ పరిస్థితులు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భగవంతుడు ఒక్కో ప్రాంతంలో నివసించే ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపంటను ఇచ్చాడు. అది ఆయ ప్రాంతాల వారి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేకూర్చేదిగాను మరియు త్రిదోషాలను సమతుల్యంలో ఉంచేదిగానూ ఉంటుంది. కనుక ఎక్కడ పండిన వస్తువులను ఆ ప్రాంతం వారు తినడమే ఉత్తమము. ఆ లెక్కన మనం కూడా సాధ్యమైనంతవరకు దేశీ ఆహార పదార్ధాలనే ఉపయోగించాలి.
ఇలా మనం షడ్రసోపేతమైన దేశీ ఆహారాన్ని నిత్యం స్వీకరిస్తే, మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు మొదలైన భయానక జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ ఉగాది మనకు అలాంటి విషయాలను గట్టిగా గుర్తు చేసి, జీవితంలో దాన్ని ఆచరించేందుకు ప్రేరణ కలిగించేది కావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
Friday, 16 March 2018
స్వామి కృష్ణానంద సూక్తి
The world loves you more than you love it, and God loves you more than you love Him. You may move slowly towards the Goal, but it comes often with a great force. When the ocean rushes into the river, it will come with a greater energy and push than the force with which the river enters the ocean.
- Swami Krishnananda
Thursday, 15 March 2018
Wednesday, 14 March 2018
Tuesday, 13 March 2018
Subscribe to:
Posts (Atom)

