తరువాత తల్లిదండ్రులు కుమారస్వామిని శాంత పరిచారు. ఇదంతా ఒక నాటకం కాదా? కాషాయం కట్టుకున్న వాడు వెంటనే దేవ సైన్యాధిపతి అయ్యాడు. ఏ త్యాగాన్ని చేసి ఇంద్రియాలను జయించాడో, దేనివల్ల జ్ఞానాన్ని శాంతిని పొందాడో, అట్టివాడే అమితమైన శక్తితో సైన్యాధిపతిగా మారాదు. కనుక ఇట్లా సుబ్రహ్మణ్య జననానికి; దేవ సైన్యాధిపత్యానికి; వల్లితో ఒక ఇంటివాణ్ణి చేయడానికి; విరక్తితో మారడానికి, అన్నిటికీ గణపతి ప్రత్యక్షం గానో, పరోక్షంగానో కారకుడయ్యాడు. కనుక ఇతణ్ణి స్మందపూర్వజుడని కీర్తిస్తున్నాము. ఏదో ఫలానా వారికి అన్నగారనే మామూలు అర్ధంలో కాదు. ఇంత కథ ఉంది. షోడశనామాలలో ఈ మాట చేరడానికి ఇంత నేపథ్యం ఉంది.
పూర్వజుడనగా ముందు పుట్టినవాడు. ఆది యందని అర్థం. కాని ఈ మాట ఎక్కడ వచ్చింది? షోడశనామాలలో చివర వచ్చింది. సంపూర్ణమైనది ఆదిలోనూ, అంతంలోనూ యుంటుంది. అదీ చమత్కారం.
కుమారస్వామి - ఫలశ్రుతిలోని లాభాలు
ఒక చక్కని విషయం గుర్తుకు వస్తోంది. విద్యారంభే... జాయతే అనే శ్లోకం ఫలశ్రుతిలో వస్తుంది. అనగా 16 నామాలు ఎవరైతే స్మరిస్తారో వారు ఇట్టి ఫలాలను పొందుతారని కదా! వీటికీ, కుమార స్వామి కథకూ సంబంధం ఉన్నట్లనిపిస్తోంది.
విద్యారంభే: పరేమేశ్వరుని జ్ఞాననేత్రం నుండి కుమారస్వామి పుట్టాడు కనుక మామూలు అక్షరాభ్యాసం ఇతనికి ముందు అక్కర లేదు. అతడే ప్రణవ స్వరూపుడు. ఇతడే తండ్రికి ప్రణవోపదేశం చేసాడు. ఇక తనకి విద్యారంభం సన్న్యాసాన్ని స్వీకరించడం బ్రహ్మవిద్యానుభవం పొందడమే. ఈ సన్న్యాసం తీసుకోవడం దానికి కారణం, విఘ్నేశ్వరుడు పందెంలో జయించడం, ఫలాన్ని పొందడం వల్లనే!
(కంచి మహాస్వామివారు, విఫ్నేశ్వరునకు కుమారగురు అనే పదం ఉందని, ఒక సందర్భంలో కార్తికేయునకు విద్యారంభం చేసినట్లు చెప్పారు. దూర్వా యుగ్మాలను అర్పించేటపుడు 21 నామాలలో ఈ కుమారగురు పదం వస్తుంది - ఆంగ్లానువాదకుడు)
No comments:
Post a Comment