చాంఘిక గాధ
పూర్వం కృతయుగంలో పురందర అనే పట్టణంలో చాంఫ్రికుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడి భార్యపేరు భామ, అన్యోన్య దాంపత్యం ఇద్దరిదీ. చాంద్రీకునికి ఇంద్ర పదవినధిష్టించాలని కోరిక, తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అని ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరి భూగోళం అంతా సంచరించి, పర్వతాలూ, అరణ్యాలూ, నదీతీరాలు, సరోవరాలు గాలించారు. ఎక్కడా వారికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. దిగులుగా కూర్చున్నారు.
అప్పుడు అతడి పితృదేవతలు దుర్ధర్షులు అదృశ్యరూపాలలో ఆకాశాన నిలబడి - నాయనా వృధాగా కాలయాపన చేసుకుంటున్నావు. మూఢుడవై తీర్థాలు తిరుగుతున్నావు. వెంటనే బయలుదేరి మాతృతీర్ధం చేరుకో, అక్కడ పితృణముక్తిపొందు. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు పిండప్రదానం చేస్తే అధికర్తకూ, పితృదేవతలకు సద్గతులు కలిగిస్తుంది. అంచేత మిగతా తీర్థాలన్నీ నిరర్థకాలు, వాటి సంగతి మర్చిపో వెంటనే మాతృతీర్ధం చేరుకో - అని సలహా ఇచ్చారు. అందుమీదట చాంఘ్రకుడు వెంటనే బయలుదేరాడు. సహ్యాద్రిమీద దత్తాత్రేయాశ్రమం చేరుకుని యేరుతటాకంలో స్నానం చేసి మాతృతీర్ధంలో పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టి చెంతనే గట్టుమీద ఉన్న కృష్ణామలకం క్రింద పిండప్రదాన శ్రాద్ధ విధులు నిర్వహించాడు. ఆ క్షణంలోనే అతని పితృదేవతలు ముక్తులై అక్షయ పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు.
No comments:
Post a Comment