Thursday 30 May 2013

సరస్వతి నదికి పుష్కరాలు

భారతదేశం వేద భూమి, దేవ భూమి. మన దేశంలో ప్రతి నది, చెరువు, కొండ, గుట్ట, పుట్ట అని పవిత్రమే. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో జన్మించడం కష్టమని, జన్మించినా మనిషిగా జన్మించడం మరింత కష్టమని ధార్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది.

గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేసిన్మిన్ సన్నిధిం కురు || అంటూ పూజా సమయంలో కలశంలోకి పుణ్య నదులను అవాహన చేస్తాం.

భారతీయ సంప్రదాయంలో సరస్వతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది.  అటువంటి సరస్వతి నదికి గురు గ్రహం/ బృహస్పతి మిధును రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. మే 31వ తేది, 2013, వైశాఖ బహుళ సప్తమి, ఉదయం 6 గంటల 49 నిమిషాలకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల తర్వాత 11 జూన్‌తో ముగుస్తాయి.  ఈ 12 రోజుల కాలం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో నదిలో దైవశక్తులు ఉంటాయి.ఎందరో దేవతలు, ఋషులు ఈ సమయంలో నదిలో స్నానమాచరిస్తారని ప్రతీతి.

No comments:

Post a Comment