Tuesday 21 May 2013

మే 22, ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం.

ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశి ఉందంటున్నాయి మన పురాణాలు. ఈ చరాచర ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి, చిన్న చీమ దగ్గరునుండి పెద్ద ఏనుగు వరకు, చిన్న మొక్క దగ్గరినుండి పెద్ద వృక్షం వరకు, క్షీరదాలు, జలచరాలు, వన్యమృగాలు, పాములు, కప్పలు, మొక్కలు, చెట్లు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, వన్యమృగాలు, మానవులు......... ఇలా అందరూ ఏదొ ఒక విధంగా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇదంతా జీవవైవిధ్యం.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ విధంగా మనానవులు మిగితా ప్రాణుల మీద ఆధారపడ్డారు. కానీ ఈరోజూ మానవుడి గుడ్డి చేష్టల వలన జీవవైవిధ్యం అంతరించిపోతోంది. మానవ మనుగడకే ముప్పు ముంచుకోస్తోంది. ఇప్పటికైన మనిషి మారాలి, తన పంధాను మార్చుకోవాలి, ఈ ప్రకృతికి తాను అధికారిని కాదు, ప్రకృతిలో ఒక భాగం అని గుర్తించాలి. అన్ని ప్రాణులను తనతో సమానంగా గుర్తించాలి. అదే గుర్తుచేస్తోంది ప్రపంచం జీవవైవిధ్య దినోత్సవం.

మే 22, ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం.    

No comments:

Post a Comment