Friday 31 May 2013

ధార్మిక గ్రంధాల్లో సరస్వతీ నది ప్రస్తావన

~ ధార్మిక గ్రంధాల్లో సరస్వతీ నది ప్రస్తావన :

సరస్వతి నది హిమాలయాల్లో ఉద్భవించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో 4000 సంవత్సరాల క్రితం వరకు ప్రవహించింది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. సరస్వతి నది గురించి ఋగ్‌వేదంలోనూ, రామాయణ, మహాభారతాల్లోనూ, బ్రహ్మవైవర్త పురాణం మొదలైన పురాణాల్లోనూ, బ్రాహ్మణాల్లోనూ ప్రస్తావన ఉంది. ఋగ్‌వేదంలో సరస్వతీ నది గురించి 60 కంటే ఎక్క్వమార్లు చెప్పబడింది.

'అంబితమె నదితం దైవితమె సరస్వతి'-అంబితమె(ఉత్తమమైన తల్లి), నదితమె(నదులన్నిటిలో గొప్ప నది), దైవితమె(దైవాలోకెల్లా గొప్ప దైవం) అంటూ ఋగ్‌వేదం(2.41.16)లో సరస్వతి నది గురించి ప్రస్తావన ఉంది.

అనేక సరస్సులు(చెరువులతో)కలిగినది కనుకు సరస్వతీ అనే పేరు వచ్చిందట. అంటే తన ప్రవాహంలో అనేక చెరువులకు నీరు అందిచేది సరస్వతీ నది. గంగా, యమున, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి అనే సప్త(7) పుణ్యనదులలో ఏడవది సరస్వతీ నది అని, ఎప్పుడు వరదలతో ప్రవహించేదని ఋగ్‌వేదంలో 7.36.6 కనిపిస్తుంది.

పాలు వంటి స్వచ్చమైన నీటి ప్రవాహంతో ప్రవహించేదని, పశుసంతతి వృద్ధికి దోహదపడిందని ఋగ్‌వేదం 7.95.2 ఉన్నది.

కారికేయుడు(కూమార స్వామి) సరస్వతీ నది ఒడ్డునే దేవసేనాధిపతి అయ్యాడు.

పరశురాముడు దుర్మార్గపు క్షత్రియ రాజులను వధించిన తరువాత సరస్వతి నదిలోనే స్నానం చేశాడు.

చంద్ర వంశపు రాజైన పురురవుడు తన భార్య ఊర్వశిని సరస్వతీ నది దగ్గరే కలుసుకున్నాడట.

బలరాముడు సరస్వతీ నది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాహాభారతం చెప్తోంది.

No comments:

Post a Comment