Sunday 26 January 2014

హిందూ ధర్మం - 4

వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు, ఆ ఫలాన వ్యక్తి ఉనికి అబద్ధమని తేలితే, ఆ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల విషయంలో స్పష్టమైంది. చరిత్రకారులు ఆయా మతప్రవక్తల విషయంలో నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ఆయా మతస్థులు ఎంతో వేదనకు, అయోమయ్యానికి గురయ్యారు. అందుకు ఉదాహరణ క్రీస్తు-క్రైస్తవం. కానీ ధర్మం ఇందుకు అతీతమైనది. రాముడు, కృష్ణుడు భూమిపై తిరిగిన మాట వాస్తవం. అయినా ఒకవేళ ఎవరైనా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కల్పిత పాత్రలు అన్నా, హిందూ సంస్కృతి ఏమి కోల్పోదు, బలహీనపడదు. దానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది వారి మీద ఆధారపడి లేదు. ఇది మతం కాదు, వారి ఆలోచనల నుంచి ఉద్భవించలేదు. హిందూ ధర్మానికి మూలం సిద్ధాంతాలు కానీ వ్యక్తులు కారు.

మతం కొన్నిటి గురించి మాత్రమే విశేష్లేస్తుంది. ఎందుకంటే మనసు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో విషయాలు ఎన్ని  ఆలోచిస్తాడు? ఎంత దూరం ఆలోచిస్తాడు? ప్రపంచంలో ఉన్న మతాలను గమనిస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. అన్ని మతాలు కేవలం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

కానీ భారతీయ ధర్మం అనేక విషయాలను కూలంకషంగా వివరించింది. ఆరోగ్యం, ఆధ్యాత్మికం, భౌతికం, విజ్ఞానం, పునర్జన్మ, ఖగోళం, అంతరిక్షం, జ్యోతిష్యం, మెటా-ఫిజిక్స్, పర్యావరణం, వ్యవసాయం, దైవికం, వైశేషికం, సాంఖ్యం ........... ఇలా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, మనిషి కనుగొన్నవాటి గురించి, ఇంకా మానవమేధస్సుకు అందని విషయాలను గురించి, నేటి ఆధునిక సైన్సు కంటే గొప్పగా, సూక్ష్మంగా వివరించింది ఒక్క సనాతన హిందూ ధర్మం మాత్రమే. వ్యక్తి యొక్క జీవితం మన ధర్మం చెప్పిందంట్లో కనీసం 1% శాతం తెలుసుకోవడానికి కూడా సరిపోదు. అటువంటిది ఈ ధర్మాన్ని ఒక వ్యక్తి యొక్క ఆలోచనగా ఎలా చెప్పగలం. ఇది మానవమనసుకు అతీతమైన విషయం. అందువల్ల ఇది హిందూత్వం మతం అనిపించుకోదు.

To be continued ........

No comments:

Post a Comment